Thursday, April 16, 2020

ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్ర విశేషాలు.!

ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్ర విశేషాలు.!

శివుడు జ్యోతి రూపంలో లింగాలలో వెలుగుతూ ఉంటారని విశ్వాసం.ద్వాదశ జ్యోతిర్లింగాలు అత్యంత ముఖ్యమైనవి గా చెపుతారు. మధ్యప్రదేశ్ లోని ఖాండ్వా జిల్లాలో నర్మదా నదీ తీరాన ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఉంది. ఉజ్జయిని నుంచి సమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది.

అన్ని నదులు తూర్పు వైపుగా ప్రవహించి సముద్రం లో కలిస్తే నర్మదా నది పడమర గా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఇదే ఈ క్షేత్రం యొక్క విశేషం. అయితే నర్మదా నది ఇక్కడ రెండు పాయలు గా చీలి నర్మదా, కావేరిగా ప్రవహిస్తుంది. ఈ రెండు చీలికల మధ్యన ఉన్న ప్రాంతాన్ని శివపురి గా పిలుస్తారు. ఓంకారేశ్వర లింగానికి తల పైన ఉన్న చీలిక లో నుంచి అభిషేక జాలం నర్మదా నదిలో కలిసి పవిత్ర పరుస్తుందని భావిస్తారు.



నర్మదా నది రెండు కొండల మధ్యలో నుంచి ప్రవహిస్తుంటే పైన ఆకాశ౦ లో నుండి చూస్తే "ఓం" కారం రూపంలో ఈ నది కనిపిస్తుంది. అందుకే ఈ స్వామికి ఓంకారేశ్వరుడిగా పేరు వచ్చింది. ఓంకారేశ్వర ఆలయంలో ఆదిశంకరాచార్యులు ఉపనిషత్తులకు భాష్యం రాసారు. ఇక్కడ గౌరీ సోమనాధ మందిరంలో శివ లింగ దర్శనం చేస్తే పునర్జన్మ ఉంటుంది అని రాబోయే జన్మ రహస్యాలు కూడా తెలుస్తాయని భక్తుల నమ్మకం

No comments:

Post a Comment

Welcome to the Telugu Wedding Celebration..!

Welcome to the Wedding Celebration..! The Groom: A divine manifestation of the Trinity (Trimurti), a wise individual ready to walk the path ...