Saturday, June 3, 2023

💐💐💐💐💐💐💐💐💐🌻🌻🌹🌹🌷🌷🪷

*నిజమైన పండితుడు*

పండితుడంటే అన్నీ క్షుణ్ణంగా తెలిసినవాడు. సర్వజ్ఞుడు అనే చాలామంది అనుకుంటారు. ఒక్క భగవంతుడికే సర్వజ్ఞుడు అని పేరు. పండితుడంటే చాలా తేలిక అభిప్రాయం కొంతమందిలో వుంది. అన్నీ తెలిసి వుంటే తప్పులేదట. అన్నీ తెలుసు అనుకుంటేనే తప్పట. 

అన్నీ తెలుసు అని ఎవరనుకుంటారు? ఏమీ తెలియని వారే అన్నీ తెలుసు అనుకుంటారు. *చతు శ్లోకేన పండితః* నాలుగు శ్లోకాలు వస్తే పండితుడని సామెత. అదే తరువాత *శత శ్లోకేన పండితః* అంటున్నారు. నూరు శ్లోకాలు వచ్చేసరికి ఎదుటి వాడికేమీ తెలీదని అనిపిస్తుంది. అందరినీ ప్రశ్నించడం మొదలుపెడతాం. దేనికి? మనకి తెలిసిన విషయం వాడికి తెలీదని నిరూపించడానికి. 

ప్రశ్నల్లో రెండురకాలు. జిజ్ఞాసుప్రశ్న, జిగీషు ప్రశ్న. *జ్ఞాతుం ఇచ్చా జిజ్ఞాసా* తెలుసుకోవాలనే కోరికతో వేసే ప్రశ్న. *జేతుం ఇచ్చా జిగీషా* జయించాలని అడిగే ప్రశ్న. ఎలాగైనా ఎదుటివాడికి తెలీదనిపించాలి అని అడిగే ప్రశ్న. 

"ఏమండీ? నూరుమంది కౌరవుల పేర్లు, వారి భార్యల పేర్లు, వారి చెల్లి దుస్సల భర్త పేరు, ఆమె పిల్లల పేర్లు చెప్పండి?" ఇన్నిపేర్లు ఎవరికీ కంఠతా వచ్చివుండవు కదా! అవతలి వాడికి తెలియదు అనిపిస్తే మనకు తృప్తి! ఇలా కొన్నాళ్ళు నేను పండితుడినే అనిపించినా, బాగా చదువుకొన్న తర్వాత, నేను పండితుణ్నికాదు అని గ్రహిస్తాడు. 

*తెలిసికొంటిని నాకేమి తెలియదంచు* అని తెలిసినవాడే నిజమైన పండితుడు. ఒక శాస్త్రాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి ఇంకా ఇంకా తెలుసుకోవాలనుకునే వాడే నిజమైన పండితుడు.
🚩🚩🚩🌹🚩🌹🌹🙏🏻

వరం* 🌻*******************************⭕ఒకసారి అర్జునుడు, శ్రీ కృష్ణుడు ఒక వృద్ధ విధవరాలి ఇంటికి అతిథులుగా వెళ్లారు.



🌻 *వరం* 🌻
*******************************


⭕ఒకసారి అర్జునుడు, శ్రీ కృష్ణుడు ఒక వృద్ధ విధవరాలి ఇంటికి అతిథులుగా వెళ్లారు.

⭕ఆ వృద్ధ విధవరాలు శ్రీకృష్ణునికి పరమ భక్తురాలు.

⭕ఆమె నిత్యం కన్నయ్యను స్మరిస్తూ తన జీవితాన్ని గడుపుతోంది. ఆమెకు నా అన్నవాళ్లు ఎవరూ లేరు. 

⭕ఆమె ఉండేది ఒక పూరి గుడిసెలో... ఆమె వద్ద ఒక ఆవు ఉండేది. ఆమె ఆ గోమాత ప్రసాదించిన పాలను గ్రామంలో అమ్మి కాస్తో కూస్తో డబ్బు సంపాదించేది. 

⭕ఆమె తన జీవనాధారమైన ఆవును బాగా చూసుకునేది.

⭕తాను ఎంతగానో అభిమానించే కన్నయ్య తన ఇంటికి రావడం చూసి, ఎంతగానో సంతోషపడింది.

⭕కన్నయతో పాటు శ్రేష్ఠ దనుర్థారి అయిన పార్థుడు కూడా తన వెంట రావడం చూసి తన ఆనందానికి అవధులు లేకుండా పోయింది. 

⭕అతిథి దేవునితో సమానం అంటారు..అలాంటిది ఏకంగా దేవుడే అతిథిగా వచ్చాడు. 

⭕ఆ ముసలామె తన ఇంటిలో ఉండే ఆహార పదార్థాలను అన్నిటినీ కృష్ణార్జునులకు నివేదించింది.

⭕శ్రీకృష్ణుడు ఆమె ఆతిథ్యానికి, అలాగే ఆమె నిష్కల్మషమైన భక్తికి మెచ్చాడు. 

⭕అలా కొద్దిసేపు ఆమెతో మాట్లాడి గోవిందుడు, పార్థుడు వెళ్లిపోయారు. 

⭕బయటికి వచ్చిన పిమ్మట అర్జునుడు మాధవునితో ఇలా అన్నాడు..." మాధవా..! మీరు ఆమె భక్తికి మెచ్చారు కదా..మరి ఆమెకు ఒక వరాన్ని ఎందుకు ఇవ్వలేదు ? "....

⭕దీనికి సమాధానంగా గోపాలుడు చిరునవ్వు చిందిస్తూ ఇలా అన్నాడు... " అర్జునా..! నేను ఆమెకు ఎప్పుడో వరాన్ని ప్రసాదించాను.. ఆమె ఎంతగానో ప్రేమించే తన ఆవుకు రేపు మరణాన్ని ప్రసాదించాను.. ఆ గోవు రేపటి సూర్యోదయానికి పూర్వమే తుదిశ్వాస విడుస్తుంది.." 

⭕సంభ్రమాశ్చర్యాలకు లోనైన పార్ధుడు తిరిగి కన్నయ్యతో " మాధవా..ఇది వరమా, లేక శాపమా..? గోవు మరణిస్తే తన కడుపు నిండేదెలా..? అసలు ఆమె ఆవు సహకారం లేకుంటే ఈ ధరిత్రి పై జీవించగలదా...? 

⭕మళ్లీ కృష్ణయ్య నవ్వుతూ ఇలా సమాధానం ఇచ్చారు... " కౌంతేయా..! నీవు నన్ను అర్థం చేసుకోలేదు. ఆమె ఆవు గురించి ఎక్కువగా ఆలోచిస్తోంది. 

⭕ఆవును ఎలా పోషించాలి, ఆవుకు మేత ఎలా సేకరించాలి, ఆవు శుచిగా, శుభ్రంగా ఉండటానికి ఎలా నీటితో స్నానం చేయించాలి....ఇలా పలు విధాలుగా ఎక్కువ సమయం ఆ గోవు గురించే ఆలోచిస్తూ, నన్ను స్మరించడం మర్చిపోతోంది. 

⭕అదే ఆ ఆవు కనుక లేకపోతే, ఆమె రోజంతా నన్ను సేవిస్తూ, స్మరిస్తూ ఉంటుంది కదా..! సరైన సమయం వచ్చినప్పుడు నేను తనని ఈ భూమి నుంచి తీసుకు వెళ్ళిపోతాను.. నా సేవలో తరించి తన జన్మను ధన్యం చేసుకుంటుంది. మరణానంతరం తాను తప్పక నా లోకాన్ని చేరుకుంటుంది..."
     
⭕వాసుదేవుని మాటలు విన్న పార్థుడు ఎంతగానో సంతోషించాడు...
             
⭕చూశారా..మనకు ఎన్నో కష్టాలు వస్తుంటాయి..ఆ కష్టాలు అనేవి భగవంతుడు పెట్టే పరీక్ష వంటిది.. కష్టాలు నశించిన పిమ్మట మనకు తప్పక ఆనందం లభిస్తుంది.

⭕ఎన్ని కష్టాలు వచ్చినా కృష్ణయ్య లీలలోని భాగమేనని సర్దుకుపోవాలి.. ఆ తర్వాత అంతా ఆ పరమాత్ముడే చూసుకుంటాడు....

🌼🌹🌼🌹🌼🌹🌼🌹🌼🌹🌼🌹

పవిత్ర జీవనం*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹

*పవిత్ర జీవనం*
🚩🚩🚩🚩🚩🚩

పవిత్ర జీవనం గడపటం ద్వారా మాత్రమే శాశ్వతమైన దాన్ని పొందగలం. కొందరు మాట్లాడినప్పుడు ఆ మాట సచేతన స్పందనలతో ప్రతిధ్వనిస్తుంది. నూతన జీవితాన్ని ఆరంభించేలా చేస్తుంది. 

అదే మాట వేరొకరు మాట్లాడితే ఉపయోగం లేకపోవచ్చు. మహాత్ముడు అంటే అర్ధం ఏమిటి? అంతఃశుద్ధిని కలిగి ఉన్నవారు. వారిలోని ప్రకాశాన్ని చూడకుండా ఉండలేము వారు ఏం చేసినా అది పవిత్రీకరించబడుతుంది. 

అసలు భగవంతుని గురించిన వివేక ప్రజ్ఞ కలిగి ఉండటమే పవిత్రతలోని ముఖ్య లక్షణాలు. ఒక మనిషి జీవిత సత్యాలను అనుభూతి చెందినపుడు అతడు వృదువుగా, శీఘ్ర గ్రాహిగా మారతాడు. ఆ గాఢానుభూతి ద్వారా దైవప్రేమిగా, సకల మానవాళిని ప్రేమించగలవాడిగా మారతాడు. ఇది జ్ఞానం ద్వారా మాత్రమే వస్తుంది.

ఆ జ్ఞానం సరియైన జీవనం ద్వారానే వస్తుంది.

సమయం వృథా చేయకండి"

🚩జైగురుదత్త 🚩
🌹*"సమయం వృథా చేయకండి"* 🌹🚩

ప్రతి రోజు ప్రాణులు నశించుట మనం చూస్తూనే ఉన్నాము. అయినా ప్రతి ఒక్కరు తాము శాశ్వతమని భావిస్తుంటారు. ప్రపంచంలో అదే అత్యంత ఆశ్చర్యకరమైన విషయం తాను ఎంత కాలం జీవిస్తాడు అని ఎవరు చెప్పలేరు. 

ముందటి రోజు చాలా ఆరోగ్యవంతుడిగా ఉన్న వ్యక్తి మరునాడు మరణించడం మనం చూస్తూనే ఉన్నాం. ఇది వాస్తవం కాబట్టి ఆరోగ్యవంతులుగా ఉన్నప్పుడే చిత్తశుద్ధితో ధర్మాచరణకై కృషి చేయాలి. ఒక విషయాన్ని తరచుగా మనకు మనం జ్ఞాపకం చేసుకోవాలి . 

"ఓ మనసా! నీ ఇంద్రియాలన్నీ సక్రమముగా పనిచేస్తున్నప్పుడే పరమాత్మను సేవించాలి. కర్మేంద్రియాలు శక్తిని కోల్పోయినప్పుడు నీవు ఏమీ చేయలేవు. వృద్ధాప్యం దాపురించిన పిదప నీవు దేవాలయానికి వెళ్లాలన్నా, ఉపవాసములు వుండాలన్నా అనుగ్రహ భాషణాలు వినాలన్నా ఓపిక ఉండదు." 

అందువలన ఓపిక ఉన్న సమయంలోనే పరమాత్మను సేవిస్తూ ధర్మాచరణ కొనసాగించాలి. అలా కాకుండా అనవసరంగా మీన మేషాలను లెక్కపెడుతూ ధర్మాచరణను వృద్ధాప్యంలో చేయవచ్చని భావిస్తే ఏమీ సాధించకుండా జీవితాన్ని ముగిస్తాం. కాబట్టి యౌవన దశలోనే భగవంతుని సేవను ధర్మాచరణను చిత్తశుద్ధితో ప్రారంభించాలి.

*"జై గురుదత్త 🚩🚩🚩🚩

ఉగస్య అది అనేది ఉగాది ఉగా అనగా నక్షత్ర గమనం జన్మ ఆయుష్షు అని అర్దలు వీటికి "అది "అనగా మెదలు 'ఉగాది 'అనగాప్రపంచం జన్మ ఆయుష్షులకు మొదటిరోజు కనుక ఉగాది అయింది ఇంకోకవిధంగా చెప్పాలంటే యుగం అనగా రెండు లేక జంట అని అర్ధం ఉత్తరాయణ దక్షిణాయనమబడే అయన ద్వయ సం 'యుగం '(సంవత్సరం )ఆయుగానికి అది యుగాది అయింది

🌹🌹🌹🌹🌹🌹🌹🌹 భక్తులు మిత్రులకు శోభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు అభినందనలు అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో సంపదలతో వర్ధిల్లాలి అని పరమేశ్వరుని ప్రార్ధిస్తున్నాను ఉగాది గురించి చిన్నమాట 

శోభ కృత్ ఉగాది 
🚩🚩🚩🚩🚩🚩🚩

ఉగస్య అది అనేది ఉగాది ఉగా అనగా నక్షత్ర గమనం జన్మ ఆయుష్షు అని అర్దలు వీటికి "అది "అనగా మెదలు 'ఉగాది 'అనగాప్రపంచం జన్మ ఆయుష్షులకు మొదటిరోజు కనుక ఉగాది అయింది ఇంకోకవిధంగా చెప్పాలంటే యుగం అనగా రెండు లేక జంట అని అర్ధం ఉత్తరాయణ దక్షిణాయనమబడే అయన ద్వయ సం 'యుగం '(సంవత్సరం )ఆయుగానికి అది యుగాది అయింది అదే సంవత్సరాది ఉగాది వసంతాలకు గల అవినాభావ సంబంధం సూర్యునికి సకల ఋతువులకు గల అవినాభావ సంబంధం ప్రాత మధ్యాన్నసాయం త్రికాలకు ఉషాడిదేవతయే మాతృస్వ రూపం భారతీయసంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణాయితీ కంగా చెప్పబడింది
మానవాలిలో నూతనఆశ యాలకు అంకురింపజేసే శుభదినం ఉగాది
శశిర ఋతువు ఆకులు రాలు కాలం శశిరం తరువాత వసంతం వస్తుంది చెట్లు చిగురించి ప్రకృతి శోభయమానంగా ఉంటుంది కోయిలలు కుహు కుహు అని పాడుతాయి ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండగ ఉగాది రోజు కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి ఈరోజున ప్రతకాలమున స్నానం చేసి కొత్త బట్టలు దరించి "ఉగాది పచ్చడి "ఇపండగ ప్రత్యేకమైనది షడ్రు చుల సమ్మెలనం -తీపి (మధురం )పులుపు (ఆమ్లం )ఉప్పు (లావణం )కారం (కటు )చేదు (తిక్త )వగరు (కాషాయం )అనే అరురుచులు కలిసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం
సంవత్సరం పొడుగునా అదురైయే మంచి చెడులను కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది
తెలుగురాస్ట్రాలలో ఉగాది రోజు పంచాంగ శ్రవణం జరుపుట ఆనవాయితా వస్తుంది అసంవత్సరం లోని మంచి చెడులను కాందాయ ఫలాలను ఆదాయ పలాలను స్తులంగా తమ భావి జీవిత క్రమం తెలుసుకొని దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవటానికి ఇష్టం చూపుతారు ఇ విధంగా ఉగాది పండగ జరుపు కుంటారు

జీవుల్లో మానవజన్మ విశిష్టత ఏమిటి? అతని కర్తవ్యం ఏమిటి?*

జైగురుదత్త శ్రీగురుదత్త
🚩🚩🚩🚩🚩🚩🚩🚩
*జీవుల్లో మానవజన్మ విశిష్టత ఏమిటి? అతని కర్తవ్యం ఏమిటి?*

*ప్రాణినామ్ నరజన్మ దుర్లభమ్* అని ఎన్నో జంతుజన్మల నెత్తితేగాని, లభించని మానవజన్మ ఉత్తమమైనది. ప్రత్యేకంగా మానవులకే సారా సార, యుక్తా యుక్త విచక్షణా జ్ఞానాన్ని పరమాత్మ ప్రసాదించాడు. 

అయితే మానవుడి కర్తవ్య మేమిటి?

*అనంతశాస్త్రం బహుళా చ విద్యా*
*అల్పోహి కాలః బహవశ్చ విఘ్నాః*
*యత్సార భూతం తదుపాసనీ యం*
*హం సోయధా క్షీర మివాంబు రాశిః*

లోకంలో ఎన్నో శాస్త్రాలున్నాయి. ఎన్నెన్నో విద్యలున్నాయి. మానవుని అయుర్దాయం చాల స్వల్పం. ఆ అల్పకాలంలోనే అడుగడుగునా విఘ్నాలు. 

కాబట్టి మానవుడు తన వివేకానికి పదును పెట్టి, హంస పాలను, నీళ్ళను వేరుచేసి పాలనే స్వీకరించినట్లు సారహీనమైన దానిని త్రోసివేసి సారవంతమైన దాన్నే గ్రహించాలి. 

సముద్రంలోని ముత్తెపు చిప్పల్ని, రత్నాలను కూడా వదిలి, దేవతలు అమృతాన్నే పొందినట్లు మానవులు సార, సారతర విషయాలను కూడా వదిలి సారతమమైన శాస్త్రోపదేశాన్నే శిరసావహించాలి, తరించాలి.తారింపజేయాలి
లోకాః సమస్త సుఖినో బానంతు

Copy చేసుకుంటారో, save చేసుకుంటారో జాగ్రత్త గా ఇప్పుడు చెప్పబోయే సమాచారాన్ని భద్రపరుస్తు ప్రచారం కూడా చెయ్యగలరు.🚩🚩🚩🚩🚩హిందూ దేవదాయ చట్టం 30/ 1987

🛕🛕🛕🛕🛕
Copy చేసుకుంటారో, save చేసుకుంటారో జాగ్రత్త గా ఇప్పుడు చెప్పబోయే సమాచారాన్ని భద్రపరుస్తు ప్రచారం కూడా చెయ్యగలరు.
🚩🚩🚩🚩🚩
హిందూ దేవదాయ చట్టం 30/ 1987

హిందూమతంపై ప్రత్యక్షంగా,పరోక్షంగా గాని దాడి చేయడం లేదా అసభ్యకరమైన పదజాలంతో మతమును కించపరిచే వారి నుండి భారత రాజ్యాంగంలో చట్టాలు చేయబడిన నియమ నిబంధనలతో అడ్డంకులను నిరోధించడం ఎలా ??

 *హిందూ దేవాదాయ చట్టము 30/1987*

 హిందూ దేవాదాయ చట్టప్రకారం హిందూ దేవాలయాల చుట్టుప్రక్కల, హిందూ నివాసగృహాల మధ్య పరిసర ప్రాంతాలలో రోడ్లపై పోస్టల్ బ్యానర్లు, మైక్ సెట్ ద్వారా ప్రార్థనల వంటి అన్యమత ప్రచారం నిషేధించడమైనది. అతిక్రమించిన వారు జి. ఓ 746,747 ప్రకారం అరెస్టయితే బెయిల్ లభ్యంకాని శిక్షలకు అర్హులవుతారు.

      30/1987 ప్రకారం దేవాలయ ఆవరణలో పాన్,సిగరేటు,ఉమ్మివేయడం వంటి ఆకృత్యాలు చేసినను హిందువులైనప్పటికీ శిక్షకు అర్హులవుతారు .మసీదు, చర్చి వంటి అన్యమత ప్రార్దన మందిరాలు నిర్మించ తలపెట్టినప్పుడు కలెక్టర్ అనుమతి తప్పనిసరిగా పొందాలి.

 ఎక్కడైనా కలెక్టరు లేదా ఆ పరిసర ప్రాంత సబ్ ఇన్స్పెక్టర్ లేదా సర్కిల్ ఇన్స్పెక్టర్ ద్వారా అనుమతి పొందిన పత్రాలు లేకుండా వ్యక్తిగత ప్రసారం లేదా వాహనాల ద్వారా ప్రసారం చేసిన అటువంటి ప్రసారాలను అడ్డుకునే విషయములో గ్రామాధికారులు అధికారము కలిగి ఉంటారు. 

      హిందూ మతాన్ని దూషించడం, అసభ్యకరంగా మాట్లాడడం చేసినయెడల ipc 295 (1), ఒకవేళ హిందూ దేవుళ్లను గురించి మాట్లాడుతూ ఆ సంస్కృతి పరువు తీసిన తీసివేయుటకు వంటి విషయములను ముద్రించడం లేదా ముద్రించి విక్రయించడం చేసినయెడల ipc 501,502(2) క్రింద కేసును నమోదు చేయమని,
దేవుడి పేరు చెప్పి, మతం పేరుచెప్పి భయోత్పాతం కలిగించుట వంటి కార్యకలాపాలు చేపట్టిన ఎడల ipc 503 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేయమని కోరడం,
 మత విశ్వాసాలను విశ్వసించక పోతే దేవుడు శపిస్తాడని లేదా అనేక కార్యకలాపాల్లో మీకు అసౌకర్యం కలుగుతుందని మిమ్మల్ని మభ్య పెట్టడానికి ప్రయత్నిస్తే ipc 508 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేయమని కలెక్టరు లేదా సమీప పోలీస్ స్టేషన్ అధికారులను కోరవచ్చును.

      ఈ విషయంలో అన్యమత ప్రచారం జరుగుతుందని ఫోన్ ద్వారా లేదా వ్యక్తిగతంగా ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసు శాఖ వారు స్పందించని ఎడల ఫిర్యాదుదారులు నేరుగా కలెక్టర్ గారికి లిఖిత పూర్వక ఉత్తరాల ద్వారా సవివరాలతో సబ్ ఇన్స్పెక్టర్ మరియు సర్కిల్ ఇన్స్పెక్టర్ పై 219 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేయమని న్యాయ సంబంధమైన విషయములు చట్ట విరుద్ధంగా వ్యవహరించి అందుకుగాను 217 సెక్షన్ ప్రకారం నేరస్తులను కాపాడే ప్రయత్నం చేసినందుకు గాను కేసు నమోదు చేయమని కోరవచ్చును.

 ఈ సందేశమును ప్రతి ఒక్కరూ షేర్ చేయడం మరియు బయట కాపీరైట్ చేసి ఒక్కొక్కరు కనీసం 50 నుండి 100 వరకు జిరాక్స్ కాపీలు తయారు చేసి పంచ గలరని కోరడమైనది. 

*జైశ్రీరామ్ జై హింద్*

ఈ మెసేజ్ ను. అందరికీ forward చెయ్యండి...హిందువుగా మన కనీస ధర్మం.
🙏🙏🙏🙏🙏

అక్షయతృతీయ రోజు బంగారం కోన మని ఏ శాస్త్రంలో లేదు. వీలైతే బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వండి, బీదవాళ్లకు భోజనం పెట్టండి. ఇంట్లో కులదేవతను పూజ చేసుకోండి.

🚩🚩🚩🚩🌹🌹🌹🙏🏻
*అక్షయతృతీయ రోజు బంగారం కోన మని ఏ శాస్త్రంలో లేదు. వీలైతే బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వండి, బీదవాళ్లకు భోజనం పెట్టండి. ఇంట్లో కులదేవతను పూజ చేసుకోండి. లేదా ఒక సత్ బ్రాహ్మణుకి ధనధానం బంగారం వెండి బట్టలు తగిన దక్షిణ ఇవ్వండి అప్పుడు మీరు ఇచ్చిన దానం అక్షయమ్ అవుతుంది అక్షయఅంటే క్షయమ్ కానిది తగ్గనిది వంద రేట్లు పుణ్యం కలిగించేది అనిఅర్ధం తృతీయ విశేషం ఏమిటో తెలుసుకుందాం.*

*1.పరశురాముడు జన్మించిన రోజు.*
*2. పవిత్ర గంగానది భూమిని తాకిన రోజు.*
*3. త్రేతాయుగం మొదలైన రోజు.*
*4. శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకొన్న రోజు.*
*5. వ్యాస మహర్షి “మహా భారతము”ను, వినాయకుని సహాయముతో, వ్రాయడం మొదలుపెట్టిన రోజు.*
*6. సూర్య భగవానుడు అజ్ఞాతవాసములో వున్న పాండవులకు “అక్షయ పాత్ర” ఇచ్చిన రోజు.*
*7. శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీమహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమింపబడిన రోజు.*
*8. ఆదిశంకరులు “కనకధారాస్తవం” ను చెప్పిన రోజు.*
*9. అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన రోజు.*
*10. ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారినుండి కాపాడిన రోజు.*

ఒకరికి మేలు చేసే పని ఏదైనా గొప్పదే.**ప్రతి మనిషికీ భావ శుద్ధత అత్యంత అవసరం.*

*"మంచిమాటలు"*

*ఒకరికి మేలు చేసే పని ఏదైనా గొప్పదే.*

*ప్రతి మనిషికీ భావ శుద్ధత అత్యంత అవసరం.*

*పుణ్యాత్ములు దుఃఖాన్ని సుఖంగా, నిందల్ని పొగడ్తలుగా పరివర్తన పొందుతారు.*

*ఎవరైతే సమయాన్ని సఫలం చేసుకొంటారో వారే విజయులు.*

*మానవునికి కోరికలు పెరిగేకొద్దీ ప్రశాంతత తగ్గుతుంది.*దుఃఖనికి కారణం అవుతుంది 🚩

కాశి వినాయక దేవాలయాలు*

🚩
🌹🌹🌹🌺🌺🙏🏻🙏🏻
*కాశి వినాయక దేవాలయాలు*

🕉ఓం నమః శివాయ🕉
కాశీలో విరాజిల్లుతున్న 56 వినాయక దేవాలయాలు
గణేశుడు కాశీ క్షేత్రాన్ని, విశ్వనాధ మందిరాన్ని అష్టదిక్కులా, సప్తవలయ రక్షణవ్యవస్ధ ద్వారా రక్షిస్తూ ఉంటాడు. ఈ సప్త వలయ రక్షణలో ముఖ్యమైన ఎనిమిది వినాయక అవతారములు కలవు. ఒక్కొక్క వలయము, వాటిలోని వినాయక దేవాలయములు ఇక్కడ ప్రస్తావించ బడినవి.
ఒకటవ వలయము:  
1. శ్రీ అర్క వినాయకుడు, 
2. శ్రీ దుర్గా వినాయకుడు,
3. శ్రీ భీమచండ వినాయకుడు,
4. శ్రీ డేహ్లివినాయకుడు, 
5. శ్రీ ఉద్దండ వినాయకుడు,
6. శ్రీ పాశపాణి వినాయకుడు, 
7. శ్రీ ఖర్వ వినాయకుడు,
8. శ్రీ శిద్ద వినాయకుడు.
ఈ అష్ట వినాయకులు కాశీ క్షేత్ర వెలుపలి పరిక్రమమములో ఉండి భక్తులకి సిద్ధిని ప్రసాదిస్తూ, నాస్తికులని శిక్షిస్తూ కాశీని కాపాడుతూ ఉంటారు. 
రెండవ వలయము:- 

రెండవ వలయములో కూడా అష్టవినాయకులు కాశీపురవాసుల సమస్త విఘ్నాలను తొలగిస్తూ రక్షణ కల్పిస్తారు.
9. శ్రీ లంబోదర వినాయక,
10. శ్రీ కూట దంత వినాయకుడు
11. శ్రీ శాల కంటక వినాయకుడు
12. శ్రీ కూష్మాండ వినాయకుడు
13. శ్రీ ముండ వినాయకుడు
14. శ్రీ వికట దంత వినాయకుడు
15. శ్రీ రాజ పుత్రా వినాయకుడు
16. శ్రీ ప్రణవ వినాయకుడు
మూడవ వలయము :- 
ఇక మూడవ వలయములోని అష్ట వినాయకులు కాశీ క్షేత్రాన్ని అంతటినీ అత్యంత శ్రద్ధతో పరిరక్షిస్తూ ఉంటారు.
17. శ్రీ వక్రతుండ వినాయకుడు
18. శ్రీ ఏక దంత వినాయకుడు
19. శ్రీ త్రిముఖ వినాయకుడు
20. శ్రీ పంచాశ్వ వినాయకుడు
21. శ్రీ హేరంబ వినాయకుడు
22. శ్రీ విఘ్న రాజ వినాయకుడు
23. శ్రీ వరద వినాయకుడు
24. మోదకప్రియ వినాయకుడు
నాల్గవ వలయము:- 
25. శ్రీ అభయప్రద వినాయకుడు
26. శ్రీ సింహ తుండ వినాయకుడు
27. శ్రీ కూడితాక్ష వినాయకుడు
28. శ్రీ క్షిప్ర ప్రసాద వినాయకుడు
29. శ్రీ చింతామణి వినాయకుడు
30. శ్రీ దంత హస్త వినాయకుడు
31. శ్రీ పిఛిoడల వినాయకుడు
32. శ్రీ ఉద్దండ ముండ వినాయకుడు
ఐదవ వలయము : - 
33. శ్రీ స్ధూల దంత వినాయకుడు
34. శ్రీ కాళీ ప్రియ వినాయకుడు
35. శ్రీ చాతుర్దంత వినాయకుడు
36. శ్రీ ద్విదంత వినాయకుడు
37. శ్రీ జ్యేష్ట వినాయకుడు
38. శ్రీ గజ వినాయకుడు
39. శ్రీ కాళ వినాయకుడు
40. శ్రీ నాగేశ్ వినాయకుడు
ఆరవ వలయము:- ఈ వలయములోని వినాయకుల నామ స్మరణ మాత్రముచే భక్తుడు ముక్తిని పొందును.
41. శ్రీ మణికర్ణి వినాయకుడు
42. శ్రీ ఆశ వినాయకుడు
43. శ్రీ సృష్టి వినాయకుడు
44. శ్రీ యక్ష వినాయకుడు
45. శ్రీ గజ కర్ణ వినాయకుడు
46. శ్రీ చిత్రఘంట వినాయకుడు
47. శ్రీ స్ధూల జంఘ / మిత్ర వినాయకుడు
48. శ్రీ మంగళ వినాయకుడు
ఏడవ వలయము :- ఈ వలయములోని ఐదు వినాయకులు ప్రసిద్ధులు:
49. శ్రీ మొద వినాయకుడు
50. శ్రీ ప్రమోద వినాయకుడు
51. శ్రీ సుముఖ వినాయకుడు
52. శ్రీ దుర్ముఖ వినాయకుడు
53. శ్రీ గణనాధ వినాయకుడు
ఇక 54. శ్రీ జ్ఞాన వినాయకుడు, 55. శ్రీ ద్వార వినాయకుడు కాశీపురి ముఖ్య ద్వారం పై ఉన్నారు. 
56. శ్రీ అవిముక్త వినాయకుడు – ఈ అవిముక్త క్షేత్రములోని భక్తుల అన్ని కష్టాలనూ దూరంచేసి, భాధలనుండి విముక్తము చేస్తాడు.

_జైగురుదత్త శ్రీగురుదత్త *రేపు ఏరువాక పౌర్ణమి*_🌹🌹🌹🌹🌹🌹🌹🌹

_జైగురుదత్త శ్రీగురుదత్త 
*రేపు ఏరువాక పౌర్ణమి*_
🌹🌹🌹🌹🌹🌹🌹🌹



భారతీయ సంస్కృతికి , జీవన విధానానికి మూలస్తంభం లాంటిది వ్యవసాయం. దానికి తొలి పనిముట్టు నాగలి , ముఖ్యవనరు వర్షం. ఆ వర్షం కురిసే కాలం మొదలయ్యేప్పుడు రైతులు కృతజ్ఞతతో జరిపే పండుగ *'కృషిపూర్ణిమ'*. దీనికే *హలపూర్ణిమ,* *ఏరువాక పున్నమి* అనే పేర్లున్నాయి. *'ఏరు'* అంటే నాగలి అని , *'ఏరువాక'* అంటే దుక్కి ప్రారంభం అనీ అర్థాలున్నాయి. వ్యవసాయానికి కావలసిన వర్షాన్ని కురిపిస్తాడని భావించే ఇంద్రుణ్ని పూజించడం , నాగలిని పూజించి వ్యవసాయ పనులు మొదలుపెట్టడం *జ్యేష్ఠ పూర్ణిమ* పర్వదిన ముఖ్యాంశాలు. రైతులు ఈ పండుగ జరపడానికిగల కారణాన్ని పరిశీలిస్తే - నాగలి సారించి పనులు ప్రారంభించడానికి మంచి నక్షత్రం *జ్యేష్ఠ* అని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. ఆ నక్షత్రంతో చంద్రుడు కూడి ఉండే రోజు *జ్యేష్ఠపూర్ణిమ*. చంద్రుడు ఓషధులకు అధిపతి. ఓషధులు *(మంచు , ఎరువు , సూక్ష్మధాతువులు)* పుష్కలంగా ఉంటేనే వ్యవసాయం అధిక ఫలసాయాన్నిస్తుంది. పై కారణాలన్నింటివల్ల *జ్యేష్ఠపూర్ణిమనాడు* ఈ పర్వదినాన్ని జరుపుతారు.

వ్యవసాయానికి ఆలంబన అయిన పశుసంపద , భూమి , పనిముట్లకు ప్రాధాన్యమిచ్చి పూజించడం ఈ పూర్ణిమ ప్రత్యేకత. నాగలిని శుభ్రపరచి , పసుపు , కుంకుమలతో అలంకరించి పూజిస్తారు. దానితోపాటు పశువులను అలంకరించి వాటితో వ్యవసాయ భూమికీ పూజచేస్తారు. పశువుల కొట్టాలు , కళ్ళాలు మొదలైనవాటినీ శుభ్రంచేసి అలంకరిస్తారు. ఆపైన పొంగలిని *(కొన్ని ప్రాంతాల్లో పులగం)* వండి వర్షానికి అధిదేవత అయిన ఇంద్రుణ్ని పూజించి నివేదన చేస్తారు. ఆ తరవాత ఆ పదార్థాలను ఆవులకు , ఎడ్లకు తినిపిస్తారు. నాగలిని పూజించి , పశువులను , బళ్లను మేళతాళాలతో ఊరేగించి భూమిలో తొలి వ్యవసాయ పని ప్రారంభిస్తారు. కొన్నిచోట్ల తొలిదుక్కిలో రైతులు కూడా ఎడ్లతో సమానంగా కాడికి రెండోవైపు నిలిచి భూమిని దున్నుతారు. పశువులగెత్తం *(ఎరువుగా మారిన పశువుల పేడ)* పొలాలకు తరలించే ప్రక్రియా ఈ పూర్ణిమనాడే ప్రారంభిస్తారు.

ఉత్తర భారతదేశంలో దీన్ని *'ఉద్‌వృషభయజ్ఞం'* అని పిలుస్తారు. వృషభం అంటే ఎద్దు. ఉద్ధృతం అంటే లేపడం. అంతవరకు వేసవివల్ల కాస్త విశ్రమించిన పశువులను వ్యవసాయం కోసం సిద్ధపరచడమని అర్థం. 

రుగ్వేదంలోనూ వ్యవసాయ పనుల ప్రారంభ దినాన చేసే గౌరవసూచకమైన ఉత్సవ ప్రసక్తి ఉంది. అధర్వణ వేదంలోనూ *'అనడుత్సవం'* అనే పేరుతో ఒక ఉత్సవం జరపాలని ఉంది. దీనిలో భాగంగా హలకర్మ *(నాగలిపూజ)* , మేదినీ ఉత్సవం *(భూమి పూజ)* , వృషభ సౌభాగ్యం *(పశువుల పూజ)* మొదలైన ప్రక్రియలు చేయాలని చెబుతున్నాయి. ఇవేకాకుండా అనేక పురాణాల్లోనూ *'కృషిపూర్ణిమ'* ప్రసక్తి ఉంది. వరాహమిహిరుడు రచించిన *'బృహత్సంహిత'* లోను , పరాశరుడు రాసిన *'కృషిపరాశరం'* లోనూ ఈ ఉత్సవ ప్రసక్తి ఉంది. కర్ణాటక ప్రాంతంలో *'కారణిపబ్బం'* అని పిలుస్తారీ ఉత్సవాన్ని 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

Jai Shri Krishna

Excellent information about Bhagwan Shri Krishna: 1) Krishna was born *5252 years ago*  2) Date of *Birth* : *18th July,3228 B.C* 3) Month ...