🌹*"సమయం వృథా చేయకండి"* 🌹🚩
ప్రతి రోజు ప్రాణులు నశించుట మనం చూస్తూనే ఉన్నాము. అయినా ప్రతి ఒక్కరు తాము శాశ్వతమని భావిస్తుంటారు. ప్రపంచంలో అదే అత్యంత ఆశ్చర్యకరమైన విషయం తాను ఎంత కాలం జీవిస్తాడు అని ఎవరు చెప్పలేరు.
ముందటి రోజు చాలా ఆరోగ్యవంతుడిగా ఉన్న వ్యక్తి మరునాడు మరణించడం మనం చూస్తూనే ఉన్నాం. ఇది వాస్తవం కాబట్టి ఆరోగ్యవంతులుగా ఉన్నప్పుడే చిత్తశుద్ధితో ధర్మాచరణకై కృషి చేయాలి. ఒక విషయాన్ని తరచుగా మనకు మనం జ్ఞాపకం చేసుకోవాలి .
"ఓ మనసా! నీ ఇంద్రియాలన్నీ సక్రమముగా పనిచేస్తున్నప్పుడే పరమాత్మను సేవించాలి. కర్మేంద్రియాలు శక్తిని కోల్పోయినప్పుడు నీవు ఏమీ చేయలేవు. వృద్ధాప్యం దాపురించిన పిదప నీవు దేవాలయానికి వెళ్లాలన్నా, ఉపవాసములు వుండాలన్నా అనుగ్రహ భాషణాలు వినాలన్నా ఓపిక ఉండదు."
అందువలన ఓపిక ఉన్న సమయంలోనే పరమాత్మను సేవిస్తూ ధర్మాచరణ కొనసాగించాలి. అలా కాకుండా అనవసరంగా మీన మేషాలను లెక్కపెడుతూ ధర్మాచరణను వృద్ధాప్యంలో చేయవచ్చని భావిస్తే ఏమీ సాధించకుండా జీవితాన్ని ముగిస్తాం. కాబట్టి యౌవన దశలోనే భగవంతుని సేవను ధర్మాచరణను చిత్తశుద్ధితో ప్రారంభించాలి.
*"జై గురుదత్త 🚩🚩🚩🚩
No comments:
Post a Comment