🚩🚩🚩🚩🚩🚩🚩🚩
*జీవుల్లో మానవజన్మ విశిష్టత ఏమిటి? అతని కర్తవ్యం ఏమిటి?*
*ప్రాణినామ్ నరజన్మ దుర్లభమ్* అని ఎన్నో జంతుజన్మల నెత్తితేగాని, లభించని మానవజన్మ ఉత్తమమైనది. ప్రత్యేకంగా మానవులకే సారా సార, యుక్తా యుక్త విచక్షణా జ్ఞానాన్ని పరమాత్మ ప్రసాదించాడు.
అయితే మానవుడి కర్తవ్య మేమిటి?
*అనంతశాస్త్రం బహుళా చ విద్యా*
*అల్పోహి కాలః బహవశ్చ విఘ్నాః*
*యత్సార భూతం తదుపాసనీ యం*
*హం సోయధా క్షీర మివాంబు రాశిః*
లోకంలో ఎన్నో శాస్త్రాలున్నాయి. ఎన్నెన్నో విద్యలున్నాయి. మానవుని అయుర్దాయం చాల స్వల్పం. ఆ అల్పకాలంలోనే అడుగడుగునా విఘ్నాలు.
కాబట్టి మానవుడు తన వివేకానికి పదును పెట్టి, హంస పాలను, నీళ్ళను వేరుచేసి పాలనే స్వీకరించినట్లు సారహీనమైన దానిని త్రోసివేసి సారవంతమైన దాన్నే గ్రహించాలి.
సముద్రంలోని ముత్తెపు చిప్పల్ని, రత్నాలను కూడా వదిలి, దేవతలు అమృతాన్నే పొందినట్లు మానవులు సార, సారతర విషయాలను కూడా వదిలి సారతమమైన శాస్త్రోపదేశాన్నే శిరసావహించాలి, తరించాలి.తారింపజేయాలి
లోకాః సమస్త సుఖినో బానంతు
No comments:
Post a Comment