Tuesday, June 23, 2020

🌹*కనువిప్పు*🌹కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. ధుర్యొధనుడు భంగమైన వూరువులతో తన మృతువుకై ఎదురుచూస్తున్నాడు . పాండవులు ధుర్యొధనుణ్ణి ఆ తటాకంవద్దే వదిలిపెట్టి తమ తమ రధాలపై తిరుగు ప్రయాణమయ్యారు. బలరాముడు అక్కడ జరిగిన అధర్మ గధాయుద్దాన్ని ఖండిస్తూ అక్కడినుంచి వెళ్ళిపోయాడు.

🌹*కనువిప్పు*🌹

కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. ధుర్యొధనుడు భంగమైన వూరువులతో తన మృతువుకై ఎదురుచూస్తున్నాడు . పాండవులు ధుర్యొధనుణ్ణి ఆ తటాకంవద్దే వదిలిపెట్టి తమ తమ రధాలపై తిరుగు ప్రయాణమయ్యారు. బలరాముడు అక్కడ జరిగిన అధర్మ గధాయుద్దాన్ని ఖండిస్తూ అక్కడినుంచి వెళ్ళిపోయాడు.

కురుక్షేత్రం మొత్తం రక్తంతో తడిసిపోయినట్లుందక్కడ. కనుచూపుమేరలో అన్నీ శవాలే కనిపిస్తున్నాయి. ఎన్నో అక్షౌహిణీల సైన్యం, అశ్వాలు, రధాలు, గజములు.. అంతా విగతమై పడివున్నాయి. ఆ రోజే మరణించిన శకుని శల్యాదుల శవాలను తీసుకెళ్ళేవారులేక అనాధల్లా పడున్నాయి. అవన్నీ చూస్తుంటే అర్జునుడి మనసు విజయోత్సాహంతో వుప్పొంగుతోంది. అప్రయత్నంగా తన మీసాలమీద చెయ్యివేసి -

"బావా చూసావా.. కౌరవులు ఎలా నశించారో..?" అన్నాడు. శ్రీకృష్ణుడు చిన్నగా నవ్వాడు.

అర్జునుడు తన గాండివాన్ని ఒక్కసారి తడుముకున్నాడు. ఒక్కసారి భీష్మ, ద్రోణ, కర్ణాది శత్రువులంతా ఎలా తన అస్త్రాలకి బలైంది కళ్ళముందు కనపడినది. తను జయించాడు...కర్ణ వధానంతరం ఇక తనని ఎదిరించగలిగిన విలుకాడే ఈ భూమి మీదే లేడు..!!

అన్నిరధాలు రణరంగం మధ్యలో వున్న భీష్ముడి అంపశయ్య దగ్గరకు చేరాయి. ధర్మరాజు ఒక్క వుదుటన రధం కిందకు దూకి - "పితామహా.. పితామహా.. మేము జయించాం... కౌరవులందరూ నిహతులైనారు.." అన్నాడు.

భీష్ముడు దుఖ్ఖం పొంగుతుండగా కళ్ళు మూసుకున్నాడు.

"అయితే నాయనా నూర్గురు సోదరులని చంపినట్టేనా.." అన్నాడు. భీమసేనుడు వెంటనే అందుకున్నాడు -

"అవును పితామహా... సుయోధనుడి వూరువులను ఇప్పుడె భంగపరిచాను... గదా యుద్ధంలో తనకు ఎదురు లేదనుకున్న సుయోధనుడు నా చేతిలో హతుడైనాడు. నా ప్రతిజ్ఞలు నేరవేర్చుకున్నాను.. ఇక రాజ్య లక్ష్మి మా వశమైంది.."

"కురురాజ్యం అయితే ఇప్పుడు పాండవరాజ్యం అయ్యిందన్నమాట"

"అవును పితామహా.. ఇప్పుడు పాండవుల పరాక్రమాలు ప్రపంచానికి విదితమయ్యాయి.." నకులుడన్నాడు.

"నాడు కురురాజ్యసభలో చేసిన ప్రతిజ్ఞలు అన్నలు నెరవేర్చారు పితామహా.." సహదేవుడాన్నాడు.

భీష్ముడు నలుదిక్కులా కలయజూశాడు. "అర్జునా..." పిలిచాడాయన నెమ్మదిగా.

"చెప్పండి పితామహా.."

"నీవేమి చెప్పవేం..??"

"చెప్పేదేముంది పితామహా... నేను గెలిచాను.. మిమ్మల్ని పడగొట్టాను, కర్ణుణ్ణి వధించాను, ద్రోణుణ్ణి కూలగొట్టాను... ఇక రాజులమై అఖండ కురు సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాము.."👍

"మంచిది నాయనా.. అవును వాసుదేవుడేడి..?" ఆ మాట వింటూనే శ్రీకృష్ణుడు ముందుకు వచ్చి శాంతనునికి నమస్కరించాడు.

"పరంధామా.. నాకెందుకయ్యా నమస్కరిస్తావు.. ధర్మ పక్షాన నిలిచావు, ఆయుధంపట్టకుండా యుద్ధాన్ని నడిపావు. ఈ గెలుపంతా నీదే ముకుందా... నీకే మేమంతా నమస్కరించాలి."

ఆ మాటలువింటూనే అర్జునిడికి కోపం వచ్చింది. ఇదేమిటి పితామహుడు ఇలా అంటున్నాడు.

"యుద్ధం చేసిందంతా నేను.. నా ధనుర్విద్యతో ఎంతమంది సైనికులు మట్టిగరిచారు. ఎంతటి మహావీరులు నేలకొరిగారు. శ్రీకృష్ణుణ్ణి పొగిడితే పొగిడాడు నా గురించి ఒక్క మాటైనా అన్నాడా తాత." అనుకున్నాడు.

అంతా భీష్ముడికి నమస్కరించి తమ గుడారాల వద్దకు చేరారు. అందరు తమ తమ రధాలు దిగారు. శ్రీకృష్ణుడు మాత్రం తన పార్ధసారధి స్థానం నుంచి దిగకుండా అర్జునుణ్ణి దిగమని సైగ చేసాడు. అర్జునుడు దిగగానే వాసుదేవుడు ఒకసారి రధం పైన వున్న ధ్వజం వైపు చూసాడు. జండా పై వున్న కపిరాజు హనుమంతుడు ఒక్కసారిగా దూకి రధమ్ముందు నమస్కరిస్తూ నిలబడ్డాడు.

"శ్రీరామచంద్రా... వాసుదేవా.. నాకెంతటి భాగ్యాన్ని ప్రసాదించావయ్యా... పార్ధుడి రధంపై ధ్వజమై నిలిపి నీ నోటివెంటవచ్చే భగవద్గీత విని నీ విశ్వరూప సదర్శనం చేసుకునే అదృష్టాన్ని ఇచ్చావు. నీకు నా భక్తి పూర్వక ప్రణామాలు దేవదేవా.." అంటూ ప్రణమిల్లాడు హనుమంతుడు.

శ్రీకృష్ణుడు చిరునవ్వులు చిందిస్తూనే అర్జునుడి రధంపైనుండి దిగాడు. నెమ్మదిగా కొంతముందుకి వచ్చి రధంవైపు చూసి తన పిల్లనగ్రోవినెత్తి సైగచేసాడు.

అంతే... ఫెళ ఫెళ మంటూ రధం కుప్పకూలిపోయింది... రధ చక్రాలు తునాతునకలైయ్యాయి. రధాశ్వాలు భీకరమైన అరుపు అరుస్తూ నేలకొరిగాయి. అందరూ భయకంపీతులై చూస్తుండగానే రధం అశ్వాలతోసహా భస్మమైపోయింది. ఆ భయానకమైన చప్పుడు విని ధర్మరాజు "అర్జునా అర్జునా" అంటూ పరుగున వచ్చాడు.

అర్జునుడు భయపడుతూ "బావా వాసుదేవా.. " అంటూ కృష్ణుడి వద్దకు చేరాడు. "నీకేమికాలేదు కదా బావా.. ఏమిటిలా జరిగింది.." అన్నాడు ఖంగారుగా.

ఆ మాటలువింటునే కృష్ణుడు చిరునవ్వు నవ్వాడు. పక్కనే వున్న హనుమంతుడు గట్టిగా నవ్వాడు.

"ఆంజనేయా.. నా ఖంగారు నీకు పరిహాసంగా తోస్తున్నదా.." అన్నాడు అర్జునుడు. హనుమంతుడు మరింత గట్టిగా నవ్వి అన్నాడు -

"పార్థా.. నవ్వక ఏమి చెయ్యమంటావు. నిన్ను కాపాడిన పరమాత్ముణ్ణి నీవు పరామర్శిస్తుంటే నాకు నవ్వొచ్చింది."

"నన్ను కాపాడాడా..?"

"అవును అర్జునా... ఈ రధం ఇప్పుడుకూలిపోలేదు... భీష్మ బాణ ధాటికి నీ రధ చక్రాలు కూలాయి... కర్ణ అస్తాలకి నీ అశ్వాలు ఎప్పుడో మరణిచాయి.. నీ గురువు ద్రోణుడు ఆగ్రహజ్వాలల్లో నీ రధం ఎప్పుడో తునాతునకలయ్యింది... బ్రహ్మాస్త్ర ధాటికి నీ రధం యావత్తూ బూడిదయ్యింది..."

"మరి..?"

"నీ
రధంపైన సాక్షాత్తు ఆదివిష్ణువున్నాడు... ఆ పర్మాత్ముడి ఆజ్ఞలేక అన్నీ అలాగే నిలిచివున్నాయి. ఇప్పుడు వాసుదేవుడు అవరోహించడంతో ఆ అస్త్రాలు పనిచేసాయి. నీ రధం ముక్కలైంది. నువ్వు గెలిచాను గెలిచాను అని అనుకుంటున్న మహావీరుల అస్త్రాలు నీ పైన పనిచెయ్యలేదంటే దానికి కారణం తెలుసా.. అవి నిన్ను చేరాలంటే నీ కన్నా ముందు ఆసీనుడైన ఆ పరంధాముణ్ణి దాటి రావాలి కాబట్టి.."

హనుమంతుడు ఈ మాటలనగానే పాండవులకు తమ అజ్ఞానం బోధపడింది. పితామహుడు భీష్ముడు విజయాన్ని శ్రీకృష్ణుడి ఎందు ఎందుకు ఆపాదించాడో అర్థం అయ్యింది. అయిదుగురూ ఒక్కసారిగా శ్రీకృష్ణుడి పాదాలపై పడ్డారు.

"పరమాత్మా.. మా అజ్ఞానాన్ని మన్నించు తండ్రి.." అన్నాడు అర్జునుడు మనస్ఫూర్తిగా.
శ్రీకృష్ణుడు మళ్ళి మనోహరంగా చిరునవ్వు నవ్వాడు.🙏🙏   🌺🌸🌺🌸🌺🙏🙏🙏

Monday, June 15, 2020

🌞 కాలచక్రం 🌞కాలచక్రం :-1. కాలగణనం2. రోజులు3. వారాలు4. పక్షాలు5. నెలలు6. ఋతువులు - కాలాలు7. సంవత్సరాలు8. తిధులు9. నక్షత్రాలు10. రాశులు11. క్యాలండర్

🌞 కాలచక్రం 🌞
కాలచక్రం :-
1. కాలగణనం
2. రోజులు
3. వారాలు
4. పక్షాలు
5. నెలలు
6. ఋతువులు - కాలాలు
7. సంవత్సరాలు
8. తిధులు
9. నక్షత్రాలు
10. రాశులు
11. క్యాలండర్
ప్రాచీన శాస్త్రవేత్తల కాలగణనం :
1 క్రాంతి = 1 సెకెండులోని 34,000లో భాగం
1 త్రుటి = 1 సెకెండులో 300వ వంతు
1 త్రుటి = 1 లవము, లేశము
2 లవములు = 1 క్షణం
30 క్షణములు = 1 విపలం
60 విపలములు = 1 పలం
60 పలములు = 1 చడి (సుమారు 24 నిమిషాలు)
2.5 చడి = 1 హొరా (ఒక గంట)
24 హొరా = 1 దినం
రెప్ప పాటుకాలం = 1 సెకను
60 సెకన్లు = 1 నిమిషం
60 నిమిషాలు = 1 గంట
24 గంటలు = 1 రోజు లేక దినం
7 దినములు = ఒక సప్తాహం, వారం
15 రోజులు = 1 పక్షము
4 సప్తాహాలు = 1 నెల
2 నెలలు = 1 ఋతువు
2 ఋతువులు = 1 కాలం
6 ఋతువులు = ఒక సంవత్సరం
10 సంవత్సరాలు =ఒక దశాబ్దం 
100 సంవత్సారాలు = ఒక శతాబ్దం
10 శతాబ్దాలు = ఒక సహస్రాబ్దం
432 సహస్రాబ్దాలు = 1 యుగం
2 కలియుగాలు = ఒక ద్వాపరయుగం
3 కలి యుగాలు = ఒక త్రేతాయుగం
4 కలి యుగాలు = ఒక కృతయుగం లేదా సత్వయుగం
10 యుగాలు = ఒక మహాయుగం (43 లక్షల 20 వేల సంవత్సరాలు)
1000 మహాయుగాలు = ఒక కల్పం 43 కోట్ల 23 లక్షల వత్సరాలు
2.రోజులు:
సూర్యుడు ఉదయించినది మొదలు అస్తమించే వరకు గల కాలం పగలు.
సూర్యుడు అస్తమించినది మొదలు మరల ఉదయించే వరకు గల కాలం రాత్రి.
ఒక పగలు, ఒక రాత్రి కలసి ఒక రోజు.
ఏడు రోజులు ఒక వారం.
౩.వారాలు :
1. ఆదివారము, Sunday
2. సోమవారము, Monday
3. మంగళవారము, Tuesday
4. బుధవారము, Wednesday
5. గురువారము, Thursday
6. శుక్రవారము, Friday
7. శనివారము, Saturday
4.పక్షాలు :
పదిహేను రోజులు ఒక పక్షం
అమావాస్య వెళ్లిన దగ్గరి నుంచి పౌర్ణమి వచ్చే వరకు శుక్ల పక్షం లేక శుద్ద పక్షం అని
పౌర్ణమి వెళ్లిన దగ్గరి నుంచి అమావాస్య వచ్చే వరకు కృష్ణ పక్షం లేక బహుళ పక్షం అంటారు.
కనుక నెలకు రెండు పక్షాలు ఉంటాయి.
పక్షానికి పదిహేను తిధులు:
1. పాడ్యమి
2. విదియ
3. తదియ
4. చవితి
5. పంచమి
6. షష్ఠి
7. సప్తమి
8. అష్టమి
9. నవమి
10. దశమి
11. ఏకాదశి
12. ద్వాదశి
13. త్రయోదశి
14. చతుర్దశి
15. పూర్ణిమ లేక అమావాస్య
5. నెలలు:
1. చైత్రము
2. వైశాఖము
3. జేష్టము
4. ఆషాఢము
5. శ్రావణము
6. భాద్రపదము
7. ఆశ్వీజము
8. కార్తీకము
9. మార్గశిరము
10. పుష్యము
11. మాఘము
12. ఫాల్గుణము
6.ఋతువులు -- కాలాలు :
సంవత్సరానికి ఆరు ఋతువులు
వసంత ఋతువు ---- చైత్ర,, వైశాఖ మాసాలు 
గ్రీష్మ ఋతువు ------ జ్యేష్ఠ, ఆషాఢ మాసాలు 
వర్ష ఋతువు -------- శ్రావణ, భాద్రపద మాసాలు 
శరత్ ఋతువు -------- ఆశ్వయుజ, కార్తీక మాసాలు 
హేమంత ఋతువు ------- మార్గశిర, పుష్య మాసాలు
శిశిర ఋతువు --------- మాఘం, ఫాల్గుణం మాసాలు
7. కాలములు:
రెండు ఋతువులు ఒక కాలం. అంటే ఒక కాలము నాలుగు మాసాలు ఉంటుంది. కనుక సంవత్సరానికి మూడు కాలాలు. అవి...
1. వేసవి కాలం
2. వర్షా కాలం
3. శీతా కాలం
వేసవి కాలం ------- చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ మాసాలు.
వర్షా కాలం -------- శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ, కార్తీక మాసాలు.
శీతా కాలం -------- మార్గశిర, పుష్య, మాఘం, ఫాల్గుణం మాసాలు.
8 .తెలుగు సంవత్సరాలు:
1. ప్రభవ
2. విభవ
3. శుక్ల
4. ప్రమోదూత
5. ప్రజోత్పత్తి
6.అంగీరస
7. శ్రీముఖ
8. భావ
9. యువ
10. ధాత
11. ఈశ్వర
12. బహుధాన్య
13. ప్రమాది
14. విక్రమ
15. వృష
16. చిత్రభాను
17. స్వభాను
18. తారణ
19. పార్ధివ
20. వ్యయ
21. సర్వజిత్తు
22. సర్వధారి
23. విరోధి
24. వికృతి
25. ఖర
26. నందన
27. విజయ
28. జయ
29. మన్మథ
30. దుర్ముఖి
31. హేవిళంబి
32. విళంబి
33. వికారి
34. శార్వరి
35. ప్లవ
36. శుభకృతు
37. శోభకృతు
38. క్రోధి
39. విశ్వావసు
40. పరాభవ
41. ప్లవంగ
42. కీలక
43. సౌమ్య
44. సాధారణ
45. విరోధికృతు
46. పరీధావి
47. ప్రమాదీచ
48. ఆనంద
49. రాక్షస
50. నల
51. పింగళ
52. కాలయుక్త
53. సిద్ధార్ధి
54. రౌద్రి
55. దుర్మతి
56. దుందుభి
57. రుధిరోద్గారి
58. రక్తాక్షి
59. క్రోధన
60. అక్షయ
9.నక్షత్రాలు :
నక్షత్రాలు ఇరువై ఏడు
1. అశ్విని
2. భరణి
3. కృత్తిక
4. రోహిణి
5. మృగశిర
6. ఆర్ద్ర
7. పునర్వసు
8. పుష్యమి
9. ఆశ్లేష
10. మఖ
11. పుబ్బ
12. ఉత్తర
13. హస్త
14. చిత్త
15. స్వాతి
16. విశాఖ
17. అనూరాధ
18. జ్యేష్ఠ
19. మూల
20. పుర్వాషాఢ
21. ఉత్తరాషాఢ
22. శ్రవణం
23. ధనిష్ఠ
24. శతభిషం
25. పూర్వాభాద్ర
26. ఉత్తరాభాద్ర
27. రేవతి
10 .రాశులు:
రాశులు పన్నెండు
1.మేషం, Aries 
2.వృషభం, Taurus 
౩.మిధునం, Gemini 
4.కర్కాటకం, Cancer 
5.సింహం, Leo 
6.కన్య, Virgo 
7.తుల, Libra 
8.వృశ్చికం, Scorpio 
9.ధనస్సు, Sagattarius 
10.మకరం, Capricorn 
11.కుంభం, Aquarius 
12.మీనం, Pisces
11.క్యాలెండర్ కథ:
మానవ జీవితంలోని ప్రతి ముఖ్య ఘట్టానికీ ఓ కారణముంటుంది. అనేక ఘట్టాల ఆ సమాహారంలో లెక్కలేనన్ని వింతలు, విశేషాలు. కొన్ని వింతలు తాత్కాలికమైనవైతే, మరికొన్ని శాశ్వతమైనవి. శాశ్వతమైన ఆ వింతే .... మనిషి నిద్ర లేచినప్పటినుంచీ, పడుకునేవరకు, పుట్టిన నాటినుంచి, గిట్టే వరకు తోడు-నీడై, మార్గదర్శై, ఘడియ ఘడియకూ ఆధారభూతమైన కేలెండెర్ ఆవిష్కరణ. ఆ కేలెండెర్ ఎలా సృష్టించబడిందీ, ఎవరు, ఎలా, ఏ కాలంలో రూపకల్పన చేశారూ, నేటి కేలెండెర్ రూపానికి అది చేరుకోడానికి ఎన్ని మార్పులు చెందిందీ ఇప్పటికీ ఆశ్చర్యకరంగానే ఉంటుంది. ఎన్నో మార్పులూ, చేర్పులూ, ఎన్నెన్నో వింతలూ, విశేషాలతో ఏర్పడ్డ విశేషమే మనం వాడుతున్న ప్రస్తుత కేలెండెర్. ఆ రూపకల్పన పాతబడని విశేషమే కదా మనకి. కొత్త సంవత్సరం కొత్త కేలెండెర్ని ఎప్పుడుప్పుడు చూద్దామా అని ఎంతో ఉత్సుకతతో ఎదురుచూసే మీకు అసలా కేలెండెర్ ఎలా ఏర్పడిందో తెలుసుకోవాలని అంతే ఉత్సాహంగా ఉంది కదూ? ఐతే వెంటనే ఆ కేలెండెర్ కథలోకి వెళ్ళిపోదాం.
అతి ప్రాచీనకాలం నుంచీ రాత్రీ పగలూ, రాత్రీ పగలూ ఒక దాని వెనుక ఒకటి వస్తూండడం గమనిస్తూ వచ్చాడు మానవుడు. కాలగణనానికి అదొక అనువైన ప్రమాణంగా తోచింది. ఈనాటి సూర్యోదయం నుంచి రేపటి సూర్యోదయం వరకూ ఒక పగలూ, ఒక రాత్రీ కలిపి ఒక రోజుగా భావించి లెక్కలు కట్టడం ప్రారంభించాడు.
ఆ నాటి సగటు మానవ జీవితం 30 సంవత్సరాలే అనుకున్నా, రోజుల్లో లెక్కడితే 11 వేల రోజుల పైనే అనుకున్నా అయ్యేది. ఇన్ని రోజులు ఒకదాని తరువాత ఒకటి లేక్కపెట్టడంలో ఏన్నో తప్పులు వచ్చేవి. రోజు కంటే పెద్ద కాల ప్రమాణం అవసరం పెరిగింది. చందమామ అమావాస్య నుంచి పౌర్ణమి దాకా వృద్ది చెందటం, పౌర్ణమి నుంచి అమావాస్య దాకా క్షీణిస్తూ ఉండటం గమనించిన మానవుడికి ఒక అమావాస్య నుంచి మరుసటి అమావాస్య దాకా ఉన్న కాలం మరొక ప్రమాణంగా ఏర్పడింది.ఇది సుమారు ఇరవై తొమ్మిదిన్నర రోజులు. దీన్ని 'నెల ' అంటారు.మానవ జీవిత ప్రమాణం తెలియడానికి 11 వేల రోజులు లెక్కపెట్టనక్కర లేదు.360 నెలలు లెక్కిస్తే చాలు.
మానవుడు జంతువులను వేటాడుతూనో, పశువుల్ని మేవుకుంటూనో, దేశ ద్రిమ్మరిగా తిరిగే రోజుల్లో మాసానికి విశేష ప్రాముఖ్యం లేకపోయింది. అయితే వ్యవసాయం మొదలుపెట్టిన దగ్గర నుంచీ స్థిర జీవితానికి అలవాటు పడ్డాడు. వ్యవసాయం మీద ఋతువుల ప్రభావం ఎంతో ఉంది, సరైన ఋతువులో గింజలు చల్లాలి. వర్షాలు పడే రోజు చుసుకొని పంటలు వేయ్యాలి. లేకపోతే అంతా నాశనమే! ఈ కారణం చేత ఎండాకాలం ఎప్పుడొస్తుందో, తొలకరి ఎప్పుడు ప్రారంభమవుతుందో, శీతాకాలం ఎప్పుడు ప్రారంభమవుతుందో వివరంగా తెలియాల్సిన అవసరం ఏర్పడింది. ఒక ఋతువు ప్రారంభంలో గింజలు చల్లితే, ఆ సంవత్సరం పంటలు బాగా పండితే, 12 నెలల తర్వాత మళ్లీ అదే ఋతువు ప్రారంభంలో మళ్ళీ గింజలు చల్లవచ్చని రైతు దైర్యంగా ఉంటాడు.
12 చంద్ర మాసాలు 354 రోజులకు సమానం.కాని, ఇవి రుతుచక్రంతో సమానంగా నడవ్వు. ఈ రోజు వసంత ఋతువు ప్రారంభమనుకోండి. 12 చంద్ర మాసాల తర్వాత మళ్ళీ కొత్త సంవత్సరం తిరిగి వసంత ఋతువుతో ప్రారంభమైతే ఏ ఇబ్బంది. ఉండేది కాదు. నెలకొక్కొక్క రాశి చొప్పున సూర్యుడు ఒక సంవత్సరంలో పన్నెండు రాశులూ తిరిగి మళ్లీ తన ప్రస్థానం ప్రారంభిస్తాడు. రుతు చక్రం కూడా సూర్య గమనంతో సరిగ్గా తిరుగుతుంది. చంద్ర గమనంతో కాదు. సూర్యుడు 12 నక్షత్ర రాశుల్నీ సరిగ్గా 365.25 రోజుల్లో చుట్టి వస్తాడు. దీన్ని సౌర సంవత్సరం అంటారు.
ఐదు వేల సంవత్సరాలకు పూర్వం నుంచే ఈజిప్టు దేశస్థులకు చంద్ర కళల మీద కంటే, రుతుచక్రం మీదనే ఆసక్తి ఎక్కువ. ఆ దేశస్థుల జీవనాధారం నైలు నది. నైలు నది వరదలతో వారి ఎడారి భూముల సస్యశ్యామలాలయ్యాయి. ఈవరదలు 365 రోజులకొక సారి వచ్చేవి. వారు సవత్సర కాలాన్ని ఆధారంగా తీసుకొని కేలండరు తయారు చేసుకున్నారు. దీన్ని 12 నెలలుగా విభజించారు. నెలకి 30 రోజుల చొప్పున 360 రోజులు పోగా, మిగిలిన 5 రోజులూ పండుగ రోజులూగా భావించి, ఆ తర్వాత మళ్ళీ కొత్త సంవత్సరం లెక్కకట్టేవారు. సూర్యుడి గతి మీద ఆధారపడ్డ సౌర సంవత్సరం 365.25 రోజులు కావడంతో నైలు నది వరదలు సంవత్సర ప్రారంభం నుంచి నెమ్మది నెమ్మదిగా అలస్యంగా వస్తూ వచ్చాయి.
గ్రీకు విజ్ఞాని యూడోక్సస్ క్రీ.పూ. 380 ప్రాంతంలో సంవత్సరం పొడవులోని ఈ ఆరు గంటల వ్యత్యాసాన్ని కనుగొన్నాడు. ఈజిప్టుని పాలిస్తున్న మాసిదోనియా రాజు టోలెమీ ఈ తేడాని గుర్తులో ఉంచుకొని కేలండరులో మార్పులు తేవాలని ప్రయత్నించాడు.కాని చాందస ఈజిప్షియన్ పురోహితులు ఈ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు.
రోమన్లు సౌర, చాంద్రమాన పద్థతులను కలిపి ఒక కేలండరు ఏర్పాటు చేసుకున్నారు . మొదట్లో వారి సవత్సరానికి పది నెలలే ఉండేవి. మొదటి నాలుగు నెలలూ, వారి దేవుళ్ళ పేరిట; మర్షియస్, ఏప్రిలిస్, మెయస్, జూనియస్ అని పేర్లు పెట్టుకున్నారు. ఆ తర్వాత మాసాలకు సంఖ్యానామాలిచ్చారు. అవి, క్వింటిలిస్ (ఐదవది), సెక్సటిలిస్ (ఆరవది), సెప్టెంబర్ ?(ఏడవది), అక్టోబర్ (ఎనిమిదవది), నవంబర్ (తొమ్మిదవది), డిశంబర్(పదవది). వారి సంవత్సరం మార్చిన ప్రారంభం అయ్యేది. రోమన్ రిపబ్లిక్*కి ఏడాదికొకసారి ఎన్నికలు జరిగేవి. రోమను పురోహితులు తమకు అనుకూలమైనవారు పదవిలో ఉంటే సంవత్సరానికో అధికమాసం తగిలించేవారు. వ్యతిరేకులు పదవిలో ఉంటే మానేసేవారు. ఈ విధంగా వారి కేలండరు అస్తవ్యస్తంగా తయారయ్యేద. క్రీస్తుపూర్వం 46వ సంవత్సరం నాటికి సూర్యుడు గతికీ, వారి కేలండరుకీ 80 రోజుల దాకా వ్యత్యాసం ఏర్పడింది.
అప్పుడే ఈజిప్టునించి తిరిగి వచ్చిన రోమన్ చక్రవర్తి జూలియస్ సీజరు ఈ గందరగోళమంతా చూసి, కేలండరు సంస్కరణకి పూనుకున్నడు. సౌర సంవత్సరం పొడవు 365.25 రోజులుగా గుర్తించాడు. అప్పటి దాకా ఉన్న పది నెలలకీ జనవరి, ఫిబ్రవరి అనే మరో రెండు మాసాలను చేర్చాడు.
మార్చి 1వ తేదీ బదులు, జనవరి 1వ తేదీని సంవత్సరం ప్రారంభం కావాలన్నాడు. నెలకీ 30 రోజుల చొప్పున 12 నెలలకీ 360 రోజులు. పోగా మిగిలిన 5 రోజులూ వీటిలో 5 నెలలకు సర్దాడు.ఈ లెక్కన 5 నెలలకు 31 రోజులు, 7 నెలలకు 30 రోజులూ ఉండాలి. కాని రోమన్లకు ఫిబ్రవరి అచ్చిరాని మాసం. అందుచేత దానిలో ఒక రోజు తీసి మరో నెలకు చేర్చాడు. ఈ విధంగా ఆరు మాసాలు 31 రోజులతోటీ, 5 మాసాలు 30 రోజులతోటీ, ఒక మాసం 29 రోజులతోటీ ఏర్పడ్డాయి. జనవరి 31, ఫిబ్రవరి 29 ,మార్చి 31, ఏప్రిల్ 30, మే 31, జూన్ 30, క్వింటిలిస్ 31, సెక్సిటిలిస్ 30, సెప్టెంబరు 30, అక్టోబరు 31, నవంబర్ 30, డిసెంబర్ 31 రోజులతో,మొత్తం 365 రోజులూ పూర్తి అయ్యాయి. అయితే, సంవత్సరానికి పావు రోజు చొప్పున 4 సంవత్సరాలలో ఒక రోజు మిగిలిపోతుంది. అందుచేత ప్రతి నాలుగో సవత్సరానికీ 365 రోజుల బదులు 366 రోజులు ఉండాలని నిర్ణయించారు. ఆ రోజును ఫిబ్రవరి మాసానికి కలిపి ఫిబ్రవరిలో 29 రోజులకి బదులు 30 రోజులు ఉండాలని నిర్ణయమైంది.
సంవత్సరానికి 365 రోజులుంటే 52 వారాల ఒక రోజు అవుతుంది. ఫిబ్రవరి 10 వ తేదీ ఈ సంవత్సరం ఆదివారమైతే, మరుసటి సంవత్సరం అది సోమవారమూ, ఆ తరువాత సంవత్సరం మంగళవారం అవుతూ వస్తుంది. 366 రోజులుంటే 52 వారాల 2 రోజులు, ఈ సంవత్సరంలో ఫిబ్రవరి 10వ తేదీ ఆదివారమయి, ఇది 366 రోజుల సంవత్సరమయితే పై సంవత్సరం ఫిబ్రవరి 10వ తేదీ మంగళవారమవుతుంది. ఒక రోజు దాటేసి, గెంతేసి, లీప్ చేసి అయిందన్న మాట. అందుచేత అటువంటి సంవత్సరాన్ని 'లీప్ ఇయర్ ' అంటారు. ఈవిధంగా 4 సంవత్సరాలకు ఒక సారి 'లీప్ ఇయర్ ' వస్తుంది.
ఇంత కష్టపడ్డందుకు ప్రతిఫలంగా తన పేరు అచంద్రార్కం నిలిచిపోయేందుకు 'క్వింట్*లిస్ ' మాసాన్ని తన పేరిట జులై మాసంగా మార్చేశాడు జూలియస్ సీజర్. ఈ కేలెండరు అమలులోకి వచ్చే ముందు క్రీ.పూ. 46వ సంవత్సరానికి 445 రోజులు ఏర్పాటు చేసి, ఆ తర్వాత నుంచే కొత్త కేలెండర్ని అమలులోకి తెచ్చేడు. ఈ విధంగా దారి తప్పిపోయిన రోమను కేలండర్ని క్రమబద్ధం చేశాడు జూలియస్ సీజర్. అప్పటి నుంచి ఈ కేలండర్ని ' జూలియస్ కేలండర్ ' అని పలిస్తూ వచ్చాడు.
జూలియస్ సీజరు తరువాత సీజర్ అగస్టస్ పరిపాలనకు వచ్చాడు.' జూలియస్ సీజర్ సంవత్సరంలోని ఒక మాసానికి తన పేరు పెట్టుకోగా లేనిది నేనెందుకు పెట్టుకోకూడదు? 'అనుకున్నాడు. సెక్స్*టిలియస్ మాసానికి తన పేర ' ఆగస్టు ' అని పేరు పెట్టాడు. ' వీధుల పేర్లూ, నగరాల పేర్లూ తమకనుకూలంగా మాచ్చేసే పద్థతి ఈ నాటిదికాదు. రెండు వేల సంవత్సరాల పూర్వం నించీ ఉంది. పేరైతే మార్చాడు ఆగస్టస్ చక్రవర్తి. కాని జులై మాసానికి 31 రోజులుంటే ఆగస్టుకు 30 రోజులే వచ్చాయి. దాంతో తల కొట్టేసినట్లయ్యింది అతనికి. ఇది పని కాదని, ఫిబ్రవరి మాసంలోని 29 రోజులలో ఒక రోజు తీసివేసి ఆగస్టుకు కలిపేసి దానికి 31 రోజులు చేశాడు. రాజు గారు తలుచుకుంటే దెబ్బలకు కాదవా ? ఈ విధంగా ఫిబ్రవరి నెలకు 28 రోజులే మిగిలాయి, అప్పటినుంచి లీపు సంవత్సరంలో మాత్రం 29 రోజులుంటాయి.
నికేయా నగంలో జరిగిన క్రైస్తవ చర్చి కౌన్సిల్ జూలియన్ కేలండర్ని ఆమోదించింది. 
సౌర సంవత్సరం 365 1/4 రోజులయితే ఈ కేలండరు ఏ అవాంతరమూ లేకుండా సాగిపోయేది. కథ కంచికి వెళ్ళేది. కాని సౌర సంవత్సరం పొడవు సరీగా 365 రోజుల 5 గంటల 48 నిముషాల 46 సెకన్లు. లేదా 365,24220 సవత్సరాలు ఈ లెక్కని సౌర సంవత్సరం కంటె జూలియన్ సంవత్సరం సగటున 11 నిముషాల 14 సెకన్లు పెద్దది. ఈ తేడా స్వల్పమే అయినా కొన్ని శతాబ్దాలు గడిచేటప్పటికి పెద్దదౌతుంది. 128 సంవత్సరాలలో సౌర సంవత్సరం కంటే జూలియన్ సంవత్సరం ఒక రోజు పెద్దదవుతుంది.
సూర్యుడు తన ప్రయాణంలో భూమధ్య రేఖని దాటి ఉత్తరాభిముఖంగా కదిలే రోజును వసంత విషువత్ ( స్ప్రింగ్ ఈక్వినాక్స్ ) ఆంటారు. ఆ రోజున రాత్రింబగళ్ళు సరిగ్గా పన్నెండేసి గంటలు. క్రీ.శ. 325 లో అది మార్చి 21న వచ్చింది. 453లో మార్చి 20న, 581లో మార్చి 19కి జరిగిపోతూ వచ్చింది. ఈ వసంత విషువత్తు క్రీ.శ. 1263 నాటికి సౌరసంవత్సరం కంటే జూలియన్ సంవత్సరం 8 రోజులు పెద్దదయింది. ఆ సవత్సరం వసంత విషువత్తు మార్చి పదమూడవ తేదీనే వచ్చింది. క్రైస్తవుల ఈస్టర్ పండుగ ఈ వసంత విషువత్*తో ముడిపడి ఉంది. ఇది ఈ విధంగా జరిగిపోతూ ఉండటంతో ఈస్టర్ పండుగ జరిగిపోతూ వచ్చింది. రోజర్ బేకన్ ఈ సంగతులన్నీ వివరిస్తూ పోపు నాలుగవ అర్బన్*కి 1263లో ఒక ఉత్తరం రాశాడు. కాని, మరో మూడు శాతాబ్దాల దాకా క్రైస్తవ మతాధికారులు ఏ చర్యా తీసుకోలేదు. 1582 నాటికి వసంత విషువత్ మరో రెండు రోజులు ముందుకు జరిగింది. అ ఏడు మార్చి 11 నే వచ్చింది. అప్పుడు పోవు అయిన గ్రిగరీ - పదమూడు, ఇక ఊరుకుంటే లాభం లేదని రంగంలోకి దిగాడు.
మొట్టమొదటగా ఆ సంవత్సరం అక్టోబర్*లో 10 రోజులు తీసేశాడు. అక్టోబరు 5ని అక్టోబరు 15గా మార్చేఏడూ. దానితో జూలియన్ కేలండర్ సౌర సంవత్సరంతో సమానమయింది. 1583లో వసంత విషవత్తు మళ్ళీ మార్చి 21కి వచ్చేసింది. కాని ఇలాగే ఊరుకుంటే అది మళ్ళీ వెనక్కి జారడం ప్రారంభిస్తుంది. ఈ తేడా 128 సంవత్సరాలకు ఒక రోజు అని చెప్పుకున్నాం. అయితే 384 సంవత్సరాలలో 3 రోజులు, లేదా 4 శతాబ్ధాలకు 3 రోజులు అవుతుంది. ప్రతి నాల్గు వందల సంవత్సరాల్లోను 3 లీపు సంవత్సరాలు వదిలివేస్తే సరి. తూర్పు యూరప్ దేశాలు, రష్యాలోని ఆర్ధడాక్స్ చర్చ్ అప్పటికీ దీన్ని అంగీకరించలేదు. 1917 రష్యన్ బోల్ష్విక్ విప్లవం తర్వాత లెనిన్ గ్రెగోరియన్ కేలెండర్ని అమలుపరిచాడు. అక్టోబర్ 25ని నవంబర్ 7గా మార్చాడు. ఇదీ జూలియన్, గ్రెగోరియన్ కేలెండెర్ కథ.

కల్పము (కాలమానం):
కల్పం అంటే బ్రహ్మకు ఒక పగలు. ఇది 432 కోట్ల సంవత్సరాలు. ఒక కల్పంలో 14 మన్వంతరాలుంటాయి. మన్వంతరాన్నే మనుయుగమని కూడా అంటారు. మన్వంతరానికి 31,10,40,000 సంవత్సరాలు. ఒక్కో మన్వంతరంలో భూమిని ఒక్కో మనువు పాలిస్తాడు. ప్రస్తుతం నడుస్తున్నది ఏడవ మన్వంతరం. పాలిస్తున్నది వైవస్వత మనువు. దీన్ని వైవస్వత మన్వంతరం అంటారు. ఒక్కో మన్వంతరంలో 71 మహాయుగాలు, ఒక్కో మహాయుగంలో నాలుగు యుగాలు (కృత, త్రేతా, ద్వాపర మరియు కలి యుగాలు) ఉంటాయి.
దేవతల కాల ప్రమాణము మన(మానవ) కాలప్రమాణమునకు 360 రెట్లు అధికము. అనగా మన ఒక సంవత్సరకాలము దేవతలకు ఒక దివారాత్రము (పగలు + రాత్రి). మన 30 సంవత్సరములు దేవతలకు ఒక నెల. మన 360 సంవత్సరములు వారికి ఒక (దివ్య) సంవత్సరము. ఇట్టి 12,000 దివ్య సంవత్సరములు వారికి ఒక దివ్య యుగము (మహాయుగము). ఇది మనకు ఒక చతుర్యుగకాల సమానము. ఈ విధముగా లెక్క పెడితే మన 43,20,000 సంవత్సరములు ఒక మహాయుగము అగును.
కృత యుగము = 4,800 దివ్య సంవత్సరములు = 17,28,000 మానవ సంవత్సరములు
త్రేతా యుగము = 3,600 దివ్య సంవత్సరములు = 12,96,000 మానవ సంవత్సరములు
ద్వాపర యుగము = 2,400 దివ్య సంవత్సరములు = 8,64,000 మానవ సంవత్సరములు
కలియుగము = 1,200 దివ్య సంవత్సరములు = 4,32,000 మానవ సంవత్సరములు
మొత్తము 12,000 దివ్య సంవత్సరములు = 43,20,000 మానవ సంవత్సరములు - ఒక దివ్య యుగము (చతుర్యుగము, మహాయుగము)
ఇలాంటి వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక పగలు. బ్రహ్మ పగలును కల్పము (సర్గము) అంటారు. మరొక వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక రాత్రి. ఈ రాత్రిని ప్రళయము అంటారు. అటువంటి 360 దివారాత్రములు బ్రహ్మకు ఒక సంవత్సరము. అటువంటి 100 సంవత్సరములు బ్రహ్మ ఆయుఃకాలము.
కల్పముల పేర్లు :
మహాభారతంలో చెప్పిన ప్రకారం ప్రస్తుతం బ్రహ్మకు 51వ సంవత్సరంలో "శ్వేతవరాహ కల్పం" నడుస్తున్నది. మత్స్య పురాణం (290.3-12)లో 30 కల్పాల పేర్లు చెప్పబడ్డాయి. అవి:
శ్వేత కల్పము
నీలలోహిత కల్పము
వామదేవ కల్పము
రత్నాంతర కల్పము
రౌరవ కల్పము
దేవ కల్పము
బృహత్ కల్పము
కందర్ప కల్పము
సద్యః కల్పము
ఈశాన కల్పము
తమో కల్పము
సారస్వత కల్పము
ఉదాన కల్పము
గరుడ కల్పము
కౌర కల్పము
నారసింహ కల్పము
సమాన కల్పము
ఆగ్నేయ కల్పము
సోమ కల్పము
మానవ కల్పము
తత్పుమాన కల్పము
వైకుంఠ కల్పము
లక్ష్మీ కల్పము
సావిత్రీ కల్పము
అఘోర కల్పము
వరాహ కల్పము
వైరాజ కల్పము
గౌరీ కల్పము
మహేశ్వర కల్పము
పితృ కల్పము
వాయు పురాణం 21వ అధ్యాయంలో 28 కల్పాల పేర్లున్నాయి. తరువాతి అధ్యాయంలో మరో ఐదు కల్పాలపేర్లున్నాయి.
మన్వంతరము :
హిందువుల పురాణాల ప్రకారం ఒక మనువు యొక్క పాలనా కాలాన్ని మన్వంతరము అంటారు. ఒక్కొక్క మన్వంతరము 30,84,48,000 సంవత్సరాల పాటు జరుగును. ఒక బ్రహ్మ దినము లో 14 మన్వంతరాలు, 15 మన్వంతర రాత్రులు ఉంటాయి. ప్రస్తుతము మనము ఏడవ మన్వంతరములో ఉన్నామని హిందువులు భావిస్తారు. ప్రతి మన్వంతరము 71 మహాయుగములుగా విభజించబడినది.
భాగవతం అష్టమ స్కంధంలో మన్వంతరాల గురించిన వివరణ ఉన్నది. ప్రస్తుతం వైవస్వత మన్వంతరంలో 27 మహాయుగాలు గతించి 28వ మహాయుగంలో సత్య, త్రేతా, ద్వాపర యుగాల తరువాత కలియుగం నడుస్తున్నది. ప్రతి మన్వంతరంలోను సప్తర్షులు, ఇంద్రుడు, సురలు మారుతుంటారు. భగవంతుని అవతారాలు కూడా మారుతుంటాయి.
మన్వంతరాల పేర్లు :
స్వాయంభువ మన్వంతరము
స్వారోచిష మన్వంతరము
ఉత్తమ మన్వంతరము
తామస మన్వంతరము
రైవత మన్వంతరము
చాక్షుష మన్వంతరము
వైవస్వత (ప్రస్తుత) మన్వంతరము
సూర్యసావర్ణి మన్వంతరము
దక్షసావర్ణి మన్వంతరము
బ్రహ్మసావర్ణి మన్వంతరము
ధర్మసావర్ణి మన్వంతరము
భద్రసావర్ణి మన్వంతరము
దేవసావర్ణి మన్వంతరము
ఇంద్రసావర్ణి మన్వంతరము
వెనుకటి మన్వంతరాలలో జరిగిని కొన్ని ముఖ్య సంఘటనలు :
1. స్వాయంభువ మన్వంతరము:
మనువు - స్వాయంభువు.
భగవంతుని అవతారాలు - కపిలుడు, యజ్ఞుడు - దేవహూతి కడుపున కపిలునిగా జన్మించి ధర్మ జ్ఞానాలను లోకాలకు ఉపదేశించాడు.దీనినే కపిలగీత అని అన్నారు. స్వాయంభువ మనువు చిరకాలం రాజ్యం పాలించి, విరక్తుడై రాజ్యాన్ని త్యజించి, భార్యయైన శతరూపతో బయలుదేరి అరణ్యాలకు వెళ్ళాడు. సునంద నది ఒడ్డున తీవ్రమైన తపస్సు చేశాడు. క్షుధార్తులైన అసురులు, యాతుధానులు ఆ మనువును భక్షించడానికి వచ్చారు. నారాయణుడు ఆకూతి(స్వాయంభువ మనువు కూతురు) గర్భంలో యజ్ఞునిగా జన్మించి దుష్టులను సంహరించి త్రిదివాలను పాలించాడు.వేదశిరుడు అను విప్రుని కుమార్తెకు విభుడు అను పేరుతో అవతరించెను.
మనుపుత్రులు - ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. ఉత్తానపాదుని కొడుకు ధ్రువుడు తపస్సు చేసి, నారాయణుని దర్శనము పొందాడు.
మనుపుత్రికలు -ఆకూతి(రుచి ప్రజాపతి భార్య),ప్రసూతి(దక్ష ప్రజాపతి భార్య),దేవహూతి(కర్ధమ ప్రజాపతి భార్య).
సప్తర్షులు - మరీచి ప్రముఖులు
ఇంద్రుడు - రోచనుడు
సురలు - యామాదులు
ప్రహ్లాదుని జననము, నరసింహ అవతారము మరియు వరహ అవతారము ఈ మన్వన్తరములొ జరిగినది.
2. స్వారోచిష మన్వంతరము:
మనువు - స్వరోచికి వనదేవతయందు కల్గిన కుమారుడు.
మనువు పుత్రులు - చైతుడు,రోచిష్మదుడు,కింపురుషుడు
భగవంతుని అవతారాలు - విభువు - వేద శిరసునికి తుషతయందు విభుడనే పేరుతో అవతరించి, కౌమార బ్రహ్మచారియై, ఎనభై అయిదు మంది మునులచే వ్రతాన్ని ఆచరింపజేశాడు.
సప్తర్షులు - ఊర్జుడు,స్తంభుడు,ప్రాణుడు,దత్తోళి,ఋషభుడు,నీవారుడు, అరివంతుడు
ఇంద్రుడు - విపశ్చింతుడు
సురలు - తుషితాదులు
సురత చక్రవర్తి వృత్తాంతము
౩. ఉత్తమ మన్వంతరము:
మనువు - ప్రియవ్రతుని కొడుకు ఉత్తముడు.
మనువు పుత్రులు - భావనుడు, సృంజయుడు, యజ్ఞహోత్రుడు
భగవంతుని అవతారాలు - సత్య సేనుడు - ధర్మునికి సూనృత యందు సత్యసేనుడనే పేర అవతరించి సత్యవ్రతం అనుష్టించి దుష్టులను సంహరించి సత్యజితునికి సుఖాన్ని కూర్చాడు.
సప్తర్షులు - ప్రమాదాదులు (వశిష్టుని సుతులు)
ఇంద్రుడు - సత్యజితుడు
సురలు - సత్యదేవ శృతభద్రులు
4. తామస మన్వంతరము:
మనువు - ఉత్తముని సోదరుడు తామసుడు.
మనువు పుత్రులు - వృషాఖ్యాతి, నరుడు, కేతువు మొదలైన పదుగురు పుత్రులు
భగవంతుని అవతారాలు - హరి - హరిమేధసునికి హరిణియందు హరి యను పేరిట అవతరించి మకరగ్రస్తుడైన గజేంద్రుని రక్షించాడు. (గజేంద్ర మోక్షము)
సప్తర్షులు - జ్యోతిర్వ్యోమాదులు
ఇంద్రుడు - త్రిశిఖుడు
సురలు - విధృతి తనయులు వైధృతులు (వేదరాశి నశించినపుడు ఆ తేజస్సును తమలో జీర్ణం చేసుకొన్నవారు)
5. రైవత మన్వంతరము:
మనువు - తామసుని సోదరుడు రైవతుడు
మనువు పుత్రులు - అర్జున ప్రతినింద్యాదులు
భగవంతుని అవతారాలు - వైకుంఠుడు - శుభ్రునకు వికుంఠయందు వైకుంఠునిగా అవతరించాడు. రమాదేవి ప్రార్ధనను మన్నించి వైకుంఠాన్ని నిర్మించాడు.
సప్తర్షులు - హిరణ్య, రోమ, వేదశిర, ఊర్ధ్వబాహు ప్రముఖులు
ఇంద్రుడు - విభుడు
సురలు - భూత దయాదులు
6. చాక్షుష మన్వంతరము:
మనువు - చక్షుసుని పుత్రుడు చాక్షుసుడు
మనువు పుత్రులు - పురువు, పురుషుడు, సుద్యుమ్నుడు మొదలైనవారు
భగవంతుని అవతారాలు - అజితుడు, కూర్మావతారం - వైరాజునికి సంభూతియందు అజితుడనే పేర అవతరించాడు. ఇదే మన్వంతరంలో దేవతలు, రాక్షసులు కలిసి అమృతము కొరకై క్షీరసాగర మథనముశివుడు కాలకూట విషము మింగాడు. లక్ష్మీ దేవి అవతరించింది. సాగర మధనం చివర ధన్వంతరి అమృతంతో వచ్చాడు. మోహినీరూపుడై భగవంతుడు అమృతాన్ని దేవతలకు అందజేశాడు. చేశారు. భగవంతుడు కూర్మావతారుడై మందరగిరిని నిలిపాడు.
సప్తర్షులు - హవిష్మ దీరకాదులు
ఇంద్రుడు - మంత్రద్యుమ్నుడు
సురలు - ఆప్యాదులు
7. వైవస్వత (ప్రస్తుత) మన్వంతరము:
ఇది ప్రస్తుతం జరుగుతున్న మన్వంతరము. చాక్షుష మన్వంతరం చివర కల్పాంత ప్రళయకాలంలో భగవానుడు మత్స్యావతారుడై జలరాశినుండి జనులను, ఓషధులను దరిజేర్చాడు. వేదాలను కాపాడాడు.
మనువు - వివస్వంతుని పుత్రుడు వైవస్వతుడు. అతనికి శ్రాద్ధదేవుడు అనే పేరు కూడా ఉంది.
మనువు పుత్రులు - ఇక్ష్వాకుడు, నృగుడు, ధృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు, నాభాగుడు, దిష్టుడు, కరూశుడు, పృషధ్రుడు, వసుమంతుడు.
మనువు పుత్రికలు - ఇల(సుద్యుమ్నుడు).
భగవంతుని అవతారాలు - కశ్యపునకు అదితి యందు వామనుడిగా జన్మించి బలి చక్రవర్తి నుండి మూడడుగుల నేల యాచించి త్రివిక్రముడై ముల్లోకాలను ఆక్రమించాడు.
సప్తర్షులు - కశ్యపుడు, అత్రి, వశిష్టుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, భరద్వాజుడు
ఇంద్రుడు - ఓజస్వి(తేజస్వినుడు)
సురులు - వసువు, రుద్రుడు, ఆదిత్యుడు, విశ్వదేవుడు, నాసత్యుడు, మరుత్తు
ఈ మన్వంతరమున పరశురామ, శ్రీ రామ, బలరామ, శ్రీ కృష్ణ మ
ఇట్లు మి 
#raghuism🌞 కాలచక్రం 🌞

ఈ మన్వంతరమున పరశురామ, శ్రీ రామ, బలరామ, శ్రీ కృష్ణ మ.

Sunday, June 14, 2020

🌿కుమారస్వామిని ఆరాధిస్తే కలిగే లాభాలు!🌼🌿

🌼🌿కుమారస్వామిని ఆరాధిస్తే కలిగే లాభాలు!🌼🌿

దక్షిణభారతదేశంలోని ప్రజలు కుమారస్వామి పట్ల చూపే అభిమానం అంతాఇంతా కాదు. తమిళనాడులో మురుగన్ అంటూ ముద్దుగా పిలుచుకున్నా, తెలుగునాట సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటూ భక్తితో తలుచుకున్నా... ఆ షణ్ముఖునికే చెల్లింది.
 
విజయాలకు – కుమారస్వామి రెల్లుపొదలలో జన్మించాడన్న విషయం తెలిసిందే! రెల్లుగడ్డిని ‘శరం’ అని పిలుస్తారు కాబట్టి ఆయనకు శరవణ అనే పేరు స్థిరపడింది. కానీ ‘శరం’ అన్న పదానికి బాణం అన్న అర్థం కూడా ఉంది. శివుని సేనలకు నాయకునిగా, ప్రతి యుద్ధంలోనూ ఆయనకు విజయాన్ని సాధించిపెట్టే యోధునిగా కుమారస్వామిని పేర్కొంటారు. అందుకే శత్రుభయం ఉన్నవారు, కోర్టులావాదేవీలతో సతమతం అవుతున్నవారు, సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నవారు ఆ స్వామిని కొలిస్తే... ఎలాంటి పీడ నుంచైనా తప్పక విముక్తులవుతారట!

సంతానానికి - ఈ సృష్టిలో పార్వతీపరమేశ్వరులని ఆదిదంపతులకి చిహ్నంగా పేర్కొంటారు. వారి తనయుడు కాబట్టి సుబ్రహ్మణ్యుని ‘కుమార’ స్వామిగా పేర్కొంటూ ఉంటారు. ఆ స్వామి అనుగ్రహం లభిస్తే సంతానం కలుగుతుందనే నమ్మకానికి ఇదే ప్రాతిపదిక!
 
జ్ఞానానికి – సుబ్రహ్మణ్యుడు అంటే జ్ఞానాన్ని ఇష్టపడేవాడు అన్న అర్థం కూడా వస్తుందట! పరమేశ్వరుని దయతో, ఆ బ్రహ్మని సైతం ఓడించగల మేథస్సు కుమారస్వామికి అలవడిందని చెబుతారు. ఇక ఆయన చేతిలో ఉండే శూలం ఉంటుంది కాబట్టి ఆయనను వేలాయుధన్ అని కూడా పిలవడం కద్దు. ఈ శూలం పదునైనా ఆయుధానికే కాదు, సునిశితమైన బుద్ధికి కూడా ప్రతీక. కాబట్టి పిల్లలకు చక్కగా చదువు అబ్బాలన్నా, తెలివితేటలతో మెలగాలన్నా ఆ స్వామిని కొలవమని సూచిస్తుంటారు.

ఆధ్మాత్మిక ఉన్నతికి – శివుని తేజం రేతస్సుగా మారి గంగానదిలో పడిందనీ, అది ఆరుభాగాలుగా మారిందనీ.. కుమారస్వామి జననం గురించి చెబుతుంటారు. ఆ ఆరు భాగాలనూ ఆరుగురు కృత్తికలనే అక్కచెళ్లెళ్లు పెంచారట. అందుకనే కుమారస్వామిని ‘షణ్ముఖుడు’ అని పేర్కొంటారు. అయితే ఈ కథ వెనుక ఒక ఆధ్యాత్మిక తత్వం కూడా ఉందని చెబుతుంటారు. ఆరు అనే సంఖ్య ఆరు దిక్కులకు (తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం, ఊర్థ్వం, పాతాళం) సూచన. పురుష శక్తికి, స్త్రీ శక్తికి చిహ్నంగా నిలిచే రెండు త్రికోణాల కలయికలో కూడా ఆరు కోణాలు కనిపిస్తాయి. ఇలా రెండు త్రికోణాలు కలిసిన షట్కోణం గుర్తుని హిందువులతో పాటుగా క్రైస్తవులు, బౌద్ధులు, యూదులు కూడా పవిత్ర చిహ్నంగా భావిస్తుంటారు. ఆ పవిత్ర సంఖ్యకు, పవిత్ర చిహ్నానికి ప్రతీకగా షణ్ముఖుని భావించవచ్చు!
 
యోగసాధనకు – కుమారస్వామిని సర్పరూపంలో ఆరాధించడం వెనుక కూడా ఒక ఆంతర్యం కనిపిస్తుంది. మనలో నిద్రాణంగా ఉన్న కుండలినిని సర్పంతో పోలుస్తూ ఉంటారు. ఆ కుండలిని జాగృతం అయిన రోజున, మనిషి ఈ విశ్వమే తానన్న సత్యాన్ని గ్రహించగలుగుతాడు. అందకే కుండలిని మేల్కొల్పడం అన్నది మన యోగశాస్త్రపు అంతిమలక్ష్యంగా కనిపిస్తుంది. ఆ లక్ష్యానికి తోడ్పాటుని అందించేలా నిత్యం సర్పం రూపంలో సుబ్రహ్మణ్యేశ్వరుని కొలిచే ఆచారం మొదలై ఉండవచ్చు!
 
జాతక దోషనివారణకు – వివాహం, సంసారం, సంతానం... వంటి యోగాలకు కుజగ్రహం అనుకూలంగా ఉండాలన్నది జ్యోతిషుల మాట! ఆ కుజగ్రహంలో కనుక దోషాలు ఉంటే వివాహజీవితంలో ఒడిదొడుకులు వచ్చే అవకాశం ఉందని చెబుతూ ఉంటారు. సుబ్రమ్మణ్యేశ్వరుని కనుక పూజిస్తే... ఎటువంటి కుజదోషానికైనా పరిష్కారం లభిస్తుందన్నది తరతరాల నమ్మికo. 

ఎవరు ఏ ఫలితం కావాలనుకొంటే ఆ రోజున ఆ పూజ చేసుకోవచ్చన్నది శివపురాణం ఇస్తున్న సూచన

Y: ఆదివారం ఆదిత్యుడిని, ఇతర దేవతలను, వేద పండితులను పూజించాలి. ఆదిత్య పూజ వల్ల నేత్రరోగం, శిరోరోగం, కుష్ఠురోగం తగ్గుతాయి. ఆదిత్యుడిని పూజించి వేద పండితులకు భోజనం పెట్టాలి. ఇలా ఒక రోజు నుంచి ఒక మాసం, ఒక సంవత్సరం లేక మూడు సంవత్సరాల పాటు రోగ తీవ్రతననుసరించి పూజ చేయాలి. దీనివల్ల సూర్యానుగ్రహప్రాప్తి కలుగుతుంది.

సోమవారం: సోమవారం సంపద కోరుకోనేవాడు లక్ష్మీదేవిని ఆరాధించాలి. ఆ రోజున పూజ తర్వాత వేద పండిత దంపతులకు నెయ్యితో భోజనం పెట్టాలి.

మంగళవారం: రోగాలు తగ్గటం కోసం మంగళవారం కాళీదేవతను పూజించాలి. మినుము, కంది, పెసరపప్పులతో చేసిన పదార్థాలతో వేద పండితులకు భోజనం పెట్టాలి.

బుధవారం: బుధవారం పెరుగు అన్నాన్ని విష్ణువుకు నివేదించాలి. ఈ పూజ, నివేదనల వల్ల పూజ చేసిన వారి కుమారులు, మిత్రులు, భార్య తదితరులకు చక్కటి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది.

గురువారం: గురువారం ఆయుష్షును, ఆరోగ్యాన్ని కోరేవారు తమ ఇష్టదైవం ఎవరైతే వారికి పాలతో, నెయ్యితో చేసిన పదార్థాలను నివేదించాలి. వస్త్రాలను కూడా నివేదించి అర్చన చేయడం మేలు.

శుక్రవారం: శుక్రవారం కూడా ఇష్టదైవాన్ని శ్రద్ధతో ఆరాధించి భోగాలను పొందవచ్చు. ఆ రోజున పూజానంతరం వేదపండితుల తృప్తి కోసం షడ్రుచులతో కూడిన భోజనాన్ని పెట్టాలి. స్త్రీల తృప్తి కోసం మంచి మంచి వస్త్రాలను బహూకరించాలి.

శనివారం: శనివారం రుద్రాది దేవతల ఆరాధన మంచిది. అపమృత్యువు నుంచి తప్పించుకోవాలనుకునేవారు ఆనాడు నువ్వులతో హోమం చేసి నువ్వులను దానం ఇచ్చి నువ్వులు కలిపిన అన్నంతో పండితులకు భోజనం పెట్టాలి. ఇలా చేయటం వల్ల పూజ చేసిన వ్యక్తికి మంచి ఆరోగ్యం చేకూరుతుంది.

ఇలా ఏడు రోజులతో ఏ దేవతకు పూజ చేసినా ముందుగా సంతోషపడేవాడు శివుడేనని శివపురాణం వివరిస్తోంది. ఆ వారాలకు సంబంధించిన దేవతల ఆనందమే తన ఆనందంగా శివుడు భావించుకొంటాడు. ఆ పూజాఫలాన్ని ఆ దేవతలుకాక శివుడే స్వయంగా ఆ భక్తులకు ప్రసాదిస్తాడు. సృష్టికి ఆదిలో ముల్లోకాల అభివృద్ధి కోసం పాప పుణ్యాలు రెండిటినీ శివుడు కల్పించాడు. పాపం చేయటం లేదా పుణ్యం చేయటమనేది మానవుల పూర్వజన్మ కర్మఫలాన్ని అనుసరించి ఉంటుంది. చేస్తున్నది పాపమని పెద్దలు లేదా గురువుల నుంచి తెలుసుకొని ఆ పాపకార్యాలను విడిచిపెట్టి పుణ్య సంపాదన కోసం మనిషి ప్రయత్నం చేయాలి. ఈ క్రమంలోనే కర్మఫలాన్ని అనుసరించి వచ్చిన కొన్ని రోగాలను, కష్టాలను తప్పించుకోవడం కోసం పూజలు రూపొందాయి. ఈ విషయాన్ని గ్రహించి ఎవరు ఏ ఫలితం కావాలనుకొంటే ఆ రోజున ఆ పూజ చేసుకోవచ్చన్నది శివపురాణం ఇస్తున్న సూచన

లక్ష్మీ శ్లోకం: లక్ష్మీం క్షీర సముద్ర - తాత్పర్యంలక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీందాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాంశ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాంత్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం

లక్ష్మీ శ్లోకం: లక్ష్మీం క్షీర సముద్ర - తాత్పర్యం

లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం 

ప్రతి పదార్ధం: లక్ష్మీం = విష్ణు పత్నియైన శ్రీ మహాలక్ష్మి; క్షీర సముద్ర రాజ = పాలసముద్రమునకు రాజు; తనయాం = కుమార్తె; శ్రీ రంగ = శ్రీ రంగంలోని శ్రీ రంగనాధుని/నాయకుని; ధామ = గృహము (గుడి); ఈశ్వరి = నాయిక /అధిపతి; దాసీభూత = దాస దాసీ జనులు /సేవకులు; సమస్త = అందరు; దేవ = దేవ సంబంధమైన / దేవతా; వనితాం = స్త్రీలు; లోకైక = లోకములో ఒకే ఒక / ఉన్నతమైన; దీప = జ్యోతి; అంకురం = మొలక; దీపాంకురాం = ప్రకాశము నిచ్చే చిరు జ్యోతి / చిరు దివ్వె; శ్రీమన్ = శ్రీమంతు రాలైన లక్ష్మీ దేవి; మంద = చల్లని/నెమ్మదైన; కటాక్ష = చూపులచే; లబ్ధ = పొందిన; విభవత్ = వైభవము; బ్రహ్మ = సృష్టి కర్తయైన బ్రహ్మ; ఇంద్ర = దేవతల రాజైన ఇంద్రుడు; గంగాధరాం = గంగను ధరించిన వాడు (శివుడు); త్వాం = నిన్ను; త్రై = మూడు; లోక్య = లోకములకు; కుటుంబిణీం = పరివారమైన; సరసిజాం = సరసులోని పద్మము నుండి పుట్టిన (లక్ష్మి); వందే = నీకు నమస్సులు; ముకుంద = విష్ణువు; ప్రియాం = ఇష్టమైన.

తాత్పర్యం: లక్ష్మీ దేవీ! పాల సముద్రపు రాజు కూతురవై, శ్రీరంగధామమునకు అధిపతివై, దాస దాసీ జనులను, సమస్త దేవతా స్త్రీలను, లోకములన్నింటిని ప్రకాశింప జేయు దీప జ్యోతివి నీవు. బ్రహ్మ, ఇంద్రుడు, శివుడు మొదలయిన వారు కూడ శ్రీమంతురాలగు నీ చల్లని చూపులచే వైభవమును పొందిరి. ముల్లోకములు నీ కుటుంబమే. పద్మములో పుట్టిన, విష్ణువుకు ఇష్ట సఖివైన ఓ! లక్ష్మీ దేవీ, నీకు నమస్కారములు.

Friday, June 12, 2020

*సంపద-సుఖం*

*సంపద-సుఖం*

ధర్మరాజు భీష్ముడితో " పితామహా ! లోకంలో ధనికులు, పేదవారు ఉన్నారు కదా ! ఎవరు ఎక్కువగా సుఖపడుతున్నారు ? " అని అడిగాడు. 

భీష్ముడు " ధర్మనందనా! ధనవంతులు, పేదవాళ్ళను త్రాసులో ఉంచి తూచినప్పుడు ముల్లు పేదవారి వైపే మొగ్గుతుంది. సంపన్నులకు పేదవారికి ఉన్న గుణదోషాలు చెప్తాను విను. ధనము, సంపద, ఆస్తులు కలిగిన వాడు ఎప్పుడూ తన సంపదను ఎవరు దోచుకుంటారో అని కలత చెందుతూ ఉంటాడు. ఎప్పుడూ మృత్యు ముఖంలో ఉన్నట్లు అశాంతిగా ఉంటాడు. ధనవంతుడు ఉన్నది చాలక అత్యాశకు పోయి మనసు వికలం చేసుకుంటాడు. ధనాన్ని కాపాడు కోవడానికి నిరంతరం చింతిస్తుంటాడు. ధనకారణంగా ఎప్పుడూ ఆగ్రహానికి గురి ఔతాడు. కనుక ధనవంతులకు సుఖం దొరకడం కఠినమే. ధనంలేని వాడు స్వతంత్రుడు, నిర్భీతికలవాడు, ఆగ్రహం రానివాడు, సకల ప్రదేశములలో సంచరించ గలవాడు. మోసం చేయాలన్న ఆశలేక, అత్యాశలకుపోక ప్రశాంత చిత్తతంతో ఉండగలడు. కనుక పేదవాడే సుఖవంతుడు. ధనం చంచలమైనది కనుక తరిగి పోతూ ఉంటుంది. కనుక అది దుఃఖ కారకం. ధనం శాశ్వతం కాదని తెలుసుకుని దాని మీద వ్యామోహం విడిచిన వాడు సుఖవంతుడు.

*ధనతృష్ణ*

ధర్మరాజు " పితామహా ! ధనతృష్ణతో కొట్టుకులాడే జీవి ఎప్పుడు సుఖాన్ని పొందగలడు' అని అడిగాడు.

భీష్ముడు " ధర్మజా ! ధనము సంపాదించి సంపాదించి విసుగుపుట్టి ధనం సంపాదించడం మానుకున్నప్పుడే మానవుడికి సుఖం కలుగుతుంది. ఈ సందర్భంలో నీకు ఒక కథ చెప్తాను. ఒక ఊరిలో మంకి అనే బ్రాహ్మణుడు ఉండే వాడు. అతడికి ధనాపేక్ష అధికం. అందు వలన అతడు రెండు కోడెదూడలను కొని వాటిని తాళ్ళతో బంధించాడు. ఒక రోజు అవి తాళ్ళతో కలిసి పారిపోయాయి. అవి పడుకుని ఉన్న ఒంటెను దాటబోయే సమయానికి అది పైకిలేచి నిలబడిన కారణంగా కోడెదూడలు వాటిమెడకు కట్టిన తాళ్ళకారణంగా దూడలు చనిపోయి ఒంటె మెడకు రెండు వైపులా వేలాడసాగాయి. అది చూసిన బ్రాహ్మణుడు హడలిపోయి తాను ప్రేమగా పెంచుకున్న దూడలు చనిపోవడం చూసి అక్కడ చేరిన జనులతో " అయ్యలారా ! నేను నా ప్రతిభతో ధనం సంపాదించాలి అనుకున్నాను, కానీ అది సాధ్యం కానిది అని తేలి పోయింది. మానవుని ఉన్నతికి దైవానుగ్రహం ఉండాలి కాని మానవ ప్రయత్నాలు ఎన్ని చేసినా వ్యర్ధమే కదా ! కనుక దైవం మీద భారంవేసి మన ప్రయత్నాలు చేయాలి. కోరిక వదలక ఉన్న సుఖం ఉండదు. కోరికలకు మూలం మనస్సంకల్పం. మనస్సులో సంకల్పం లేకుండా ఉండాలంటే ఇంద్రియ నిగ్రహం కావాలి. కోరికలు లేకున్న ధనంతో పని లేదు. కనుక ధనాపేక్ష లేని వాడు ప్రశాంత మనస్కుడై ఉంటాడు. ధనం సంపాదించే కొలదీ తృష్ణ పెరుగుతుంది, దానిని దాచాలన్న తాపత్రయం కలుగుతుంది. కనుక అంతు లేని కోరికలను వదిలిన శాశ్వత ప్రశాంతత పొందగలడు. నేను ధన సంపాదనాపేక్షతో తెచ్చిన దూడలు చనిపోగానే నా లోని ధనాపేక్ష తగ్గింది. నాలో ధనతృష్ణ తగ్గింది, ఇంద్రియ నిగ్రహం కలిగింది, నాలో సహనం కలిగింది, ఇక నాకు లోభం అంటదని సమాధానపడి శేషజీవితం ప్రశాంతంగా గడిపాడు.

*అంత్యక్రియలు అప్పుడు కుండలో నీరు పోసి రంధ్రాలు పెట్టి పగలగొడతారు ఎందుకో తెలుసా?*

*అంత్యక్రియలు అప్పుడు కుండలో నీరు పోసి రంధ్రాలు పెట్టి పగలగొడతారు ఎందుకో తెలుసా?* 
   
వాస్తవానికి శరీరం ఆత్మ  రెండు వేరు వేరు. కలియుగ ధర్మం ప్రకారం.. మనిషి జీవితకాలం 120 సంవత్సరాలు. కానీ... ఈ మందుల తిండికి ఆయుష్షు 100 సంవత్సరాల లోపు పడిపోయింది. ఇంకా కొందరైతే ఈ కొత్త కొత్త రోగాలకు 60 కే అంతిమయాత్ర అవుతుంది.

       ఆత్మ చెప్పినట్టు శరీరం వినాలంటే... శరీరం ఆరోగ్యంగా ఉండాలి. శరీరంలో ప్రాణం ఉన్నంత సేపు అందులో ఆత్మ ఉంటుంది. శరీరం చనిపోయిందంటే ఆత్మ అందులో ఉండలేదు. ఎందుకంటే ఆత్మ చెప్పినట్టు శరీరం వినే స్థితిలో లేదు.

    బతికి ఉన్నంత కాలం భార్యాపిల్లలు, బంధువులు, స్నేహితులు, తాగుడు, తినుడు, పైసా సంపాదన లో లీనమై పోతుంది. ఎప్పుడైతే మనిషి చనిపోతాడో... శరీరం నుండి ఆత్మ వేరైపోతుంది. శరీరాన్ని దహనం చేసే దాకా... ఆత్మ, మళ్లీ తన శరీరం లోకి చొచ్చి తిరిగి శరీరాన్ని లేపి, మళ్ళి... తన వాళ్లతో కలిసి ఉండాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది.

     పాడె కట్టి శరీరాన్ని ఎత్తుకు పోయేటప్పుడు స్మశానానికి కొద్ది దూరంలో దాన్ని దింపి, చిన్న ముల్లెలో కట్టిన బియ్యాన్ని 
(డెలివరీ అయి బిడ్డ బతికి చనిపోయిన ఆడవాళ్ళకి ఆవాలను కడతారు) విప్పి కింద పోస్తారు. 
ఎందుకంటే.. శరీరాన్ని కాల్చిన తర్వాత కూడా ఇంటి మీద.. తన వాళ్ళ మీద.. ఇష్టంతో ఆత్మ ఇంటికి రావాలంటే శరీరం మీద చల్లిన ప్యాలాలను, ఈ బియ్యాన్ని, పూర్తిగా ఒక్కో గింజను లెక్కించిన తర్వాతనే... ఆత్మకి తన వాళ్లను చూడడానికి అనుమతి దొరుకుతుంది. అది కూడా సూర్యోదయం లోపు మాత్రమే.. అంతలోపు లెక్కించకపోతే, మళ్ళీ... తిరిగి మొదటి నుండి లెక్కించాలి.

    శరీరాన్ని చితి మీద పెట్టి కుండలో నీరు పోసి దానికి రంధ్రాలు చేసి చుట్టూ తిరుగుతారు. ఎందుకంటే... కుండా నీ శరీరం లాంటిది, అందులో  ఉన్న నీరు, నీ ఆత్మ లాంటిది. కుండకు పెట్టిన రంధ్రం నుండి నీరు ఎలాగైతే వెళ్లి పోయిందో... నీ శరీరం నుండి నీ ఆత్మ బయటికి పోయింది. కుండను కింద పడేసి పగలగొడతాం అంటే.. ఇప్పుడు నీ శరీరాన్ని కాల్చేస్తాము. ఇంకా నీకు ఈ శరీరం ఉండదు, నువ్వు వెల్లిపో.. అని ఆత్మకు మనమిచ్చే సంకేతం.

     హిందూ సాంప్రదాయం లో చేసే ప్రతి పనికి ఓ అర్థం దాగి ఉంటుంది. కానీ తెలిసిన వారు, తెలియని వాళ్లకు చెప్పరు. అదే మన ఖర్మ...
ఇలా ఎందుకు చేస్తున్నారు, అంటే... 
ఏమో నాకు తెలియదు మా తాత ఇలాగే చేసాడు నేను ఇలాగే చేస్తున్నాను 
కానీ.. ఎందుకు చేస్తున్నానో తెలియదు.

దయచేసి భారత ఆచార, సాంప్రదాయాల గురించి తక్కువ అంచనా వేయకండి. అందులో నిగూఢ అర్థం దాగి ఉంటుంది.

 *పైన రాసిన స్టోరీ... భగవద్గీత ఆధారంగా రాయబడింది.*

శయన నియమాలుపడుకోవాలంటే పాటించే పదహారు సూత్రాలు:-1. *నిర్మానుష్యంగా, నిర్జన గృహంలో* ఒంటరిగా పడుకోవద్దు. *దేవాలయం* మరియు *స్మశానవాటికలో* కూడా పడుకోకూడదు.( *మనుస్మృతి*)

శయన నియమాలు
పడుకోవాలంటే పాటించే పదహారు సూత్రాలు:-

1. *నిర్మానుష్యంగా, నిర్జన  గృహంలో* ఒంటరిగా పడుకోవద్దు. *దేవాలయం* మరియు *స్మశానవాటికలో* కూడా పడుకోకూడదు.( *మనుస్మృతి*)

2పడుకోని ఉన్న వారిని *అకస్మాత్తుగా* నిద్ర లేపకూడదు.  ( *విష్ణుస్మృతి*)

3. *విద్యార్థి,నౌకరు,మరియు ద్వారపాలకుడు* వీరు అధిక సమయం నిద్రపోతున్నచో,వీరిని మేల్కొలపవచ్చును.( *చాణక్య నీతి*)

4. ఆరోగ్యవంతులు  ఆయురక్ష కోసం *బ్రహ్మా ముహూర్తం* లో నిద్ర లేవాలి.( *దేవీ భాగవతము*).పూర్తిగా చీకటి గదిలో నిద్రించవద్దు.( *పద్మ పురాణము*)

5. *తడి పాదము* లతో నిద్రించవద్దు. పొడి పాదాల తో నిద్రించడం వలన లక్ష్మి (ధనం)ప్రాప్తిస్తుంది.( *అత్రి స్మృతి*)
 విరిగిన పడకపై,ఎంగిలి మొహం తో పడుకోవడం నిషేధం.( *మహాభారతం*)

6. *నగ్నంగా, వివస్త్రలులై* పడుకోకూడదు.( *గౌతమ ధర్మ సూత్రం*)

7. తూర్పు ముఖంగా తల పెట్టి నిద్రించిన *విద్య*,పశ్చిమ వైపు తల పెట్టి నిద్రించిన *ప్రబల చింత*,ఉత్తరము వైపు తల పెట్టి నిద్రించిన *హాని,మృత్యువు*,ఇంకా దక్షిణ ముఖంగా తల పెట్టి నిద్రించిన చో *ధనము,ఆయువు* ప్రాప్తిస్తుంది.( *ఆచార మయూఖ్*)

8. *పగటిపూట* ఎపుడు కూడా నిద్రించవద్దు. కానీ *జ్యేష్ఠ మాసం*లో  1 ముహూర్తం(48నిమిషాలు) నిద్రిస్తారు.(పగటిపూట నిద్ర రోగహేతువు,మరియు ఆయుక్షీణత  కలుగచేస్తుంది)

9. పగటిపూట సూర్యోదయము మరియు సూర్యాస్తమయం వరకు పడుకొనే వారు రోగి మరియు దరిద్రులు అవుతారు.( *బ్రహ్మా వైవర్తపురాణం*)

10.సూర్యాస్తమయానికి ఒక ప్రహారం (సుమారు మూడు3 గంటల) తరువాత నే *పడుకోవాలి*

11.ఎడమవైపు పడుకోవడం వలన  *స్వస్థత* లభిస్తుంది.

12.దక్షిణ దిశలో *పాదములు పెట్టి ఎపుడు నిద్రించకూడదు* *యముడు మరియు దుష్ట గ్రహము* ల  నివాసము వుంటారు.దక్షిణ దిశలో కాళ్ళు పెట్టడం వలన చెవుల్లో గాలి నిండుతుంది. *మెదడుకు రక్త సరఫరా* మందగిస్తుంది. *మతిమరుపు* *మృత్యువు* లేదా
*అసంఖ్యాకమైన రోగాలు* చుట్టుముడుతాయి.

13.గుండెపై చేయి వేసుకుని, *చెత్తు యొక్క బీము* కింద, కాలుపై కాలు వేసుకుని నిద్రించ రాదు.

14.పడక మీద *త్రాగడం- తినడం* చేయకూడదు.

15. పడుకొని *పుస్తక పఠనం* చేయడానికి వీల్లేదు. ( పడుకొని చదవడం వలన *నేత్ర జ్యోతి* మసకబారుతుంది.)

*ఈ పదహారునియమాలను అనుసరించేవారు యశస్వి, నిరోగి,మరియు దీర్ఘాయుష్మంతుడు అవుతారు*

 ఈ సందేశం ప్రతి ఒక్కరికి చేరవేయండి......మీతో పాటు అందరికీ లాభాన్ని చేకూర్చాలి.. 🙏🏻🙏🙏 

అమ్మ అందరిని చల్లగా చూడమ్మా 🙏

Wednesday, June 10, 2020

పాండవులు 12 ఏళ్ళు అరణ్యవాసం , అజ్ఞాత వాసాలు చేయడంలో అంతర్యం ఏంటి? ఈ ప్రశ్న ప్రతిఒక్కరు వేసుకోవలసినది..

దైవాన్ని ఆరాధిస్తున్నా నాకే ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి? ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకుంటే, జీవితంలో దుఃఖించరు.

ఈ ప్రశ్న లోతు అర్ధం అయితే మీరు  జీవితంలో దుఖించరు! దుఖం మీ దరిదాపుల్లోకి రాదు! సమాధానం తెలిస్తే చెప్పండి!. కాని మీరు కూడా ఆలోచించండి!

పాండవులు 12 ఏళ్ళు అరణ్యవాసం , అజ్ఞాత వాసాలు చేయడంలో అంతర్యం ఏంటి? ఈ ప్రశ్న ప్రతిఒక్కరు వేసుకోవలసినది..

1. పాండవులు మాయజూదంలో కౌరవుల చేతిలో ఓడిపోయి రాజ్యాన్ని కోల్పోయి అడవులపాలు అయ్యారని అందరికి తెలిసిందే. అరణ్యవాస చేస్తూ ఉండగా ఒకనాడు శ్రీకృష్ణుడు సత్యభామ సహితంగా పాండవులను కలుసుకోవడానికి వస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడిని ధర్మరాజు "జూదం ఆడేటప్పుడు మమ్మల్ని ఎందుకు కాపాడలేదు" అని ప్రశ్నిస్తాడు. అందుకు సమాధానంగా కృష్ణుడు "నేను ఆ రోజు అక్కడలేను, సాల్వుడు అనే రాజుతో మాయ యుద్ధం చేస్తున్నాను(6 నెలల పాటు ఆ యుద్ధం జరిగింది!) నాకు కానీ ఆ విషయం తెలిసుంటే అలా జరగనిచ్చేవాడిని కాను" అన్నాడు. (ఆ సర్వంతర్యామికిజూదం సంగతి తెలియదంటారా)?.

అసలు ఈ పాండవులు , శ్రీకృష్ణుడు వచ్చిందే భూమి మీద దుష్ట శిక్షణ, శిష్టరక్షణ కోసం. కానీ పాండవులు మానవులు కావడం చేత శక్తులు కానీ, కురుక్షేత్ర సంగ్రామంలో విజయం సాధించడానికి సరైన ఆయుధాలు కానీ, ఏమీలేవు. ఉన్నది ఒక్కటే 'ధర్మం'.. అరణ్యవాసం అజ్ఞాత వాసంలో వీళ్ళని నిలబెట్టింది ధర్మమే. కాని అలాగే కొనసాగితే ధర్మం పేరుతో బ్రష్టులు అయిపోతారు. ధర్మాన్ని అన్ని కోణాల్లో ప్రయోగించాలి. ఆలా చేయాలంటే బలం, బలగం, ఆయుధ సంపత్తి, అస్త్ర శాస్త్రాలు, దైవబలం మెండుగా ఉండాలి. కాని ఆడిన మాట కోసం అడవుల పాలైన పాండవులు రాబోయే కురుక్షేత్ర మహా సంగ్రామంలో గెలవడం ఇప్పుడు ఉన్న పరిస్థితులలో అసాధ్యం. అందుకే శ్రీకృష్ణుడు తన మాయని ప్రదర్శించాడు. తాత్కాలిక కృష్ణమాయ కల్పించాడు. వస్త్రాపహరణం సమయంలో ద్రౌపతిశ్రీకృష్ణ స్మరణ చేయగానే వచ్చి వస్త్రాలు ఇచ్చాడు. మరి అక్కడే ఉన్న ధర్మరాజు  అదంతా చూసికూడా శ్రీకృష్ణుడిని తలచుకోలేకపోయాడు!(ఇదే మాయ అంటే).

అటుపక్క భీష్ముడు లాంటి యోధుడు (21సార్లు క్షత్రియులు మీదకి దండెత్తి క్షత్రియ వంశాన్ని నిర్మూలం చేసిన దీరోధత్తుడు, పరశురాముడిని ఓడించిన మహావీరుడు), పరశురాముడి వద్ద శిష్యరికం చేసి కౌరవుల పాండవులకు శిక్షణ ఇచ్చిన వీరాధి వీరుడు ఎలాంటి అస్త్ర శాస్త్రాలనైనా అలవోకగా ఎదుర్కోగల ద్రోణుడు ఒకప్రక్క.  పుట్టుకతోనే కవచంతో పుట్టిన కర్ణుడు(ఈ కవచాన్ని బెదించాలంటే మానవమాత్రుడి వల్ల కాదు! దైవబలం పుష్కలంగా ఉండాలి). కపటి శకుని, పుత్రప్రేమతో తపించిపోయే దృతరాష్ట్రుడు, అన్నకోసం దేనికైనా తెగించే దుశ్శాసనుడు వీళ్ళు ఒక పక్క.

ఇంతటి వీరులైన వీరందరిని ఓడించాలి. వీరికి సామంతులు మహాబలవంతులు. వీరిని ఓడించి ధర్మాన్ని నిలబెట్టాలంటే వీళ్ళకి ఇప్పుడు ఉన్న శక్తి చాలదు. కనుక వీరిని పుటం పెట్టిన బంగారంలా, సానబెట్టిన వజ్రంలా తయారుచేసి శత్రువుల మీదకి సాధించాలి. అప్పుడే విజయం వరిస్తుంది. అందుకే మనకి పైకి శ్రీకృష్ణుడు తోడు ఉన్నా పాండవులు అడవుల పాలయ్యారు. కౌరవులు సుఖపడ్డారు అనుకునేలా కనబడుతుంది. లోక రక్షణ కోసం తాత్కాలిక కష్టాలు అనుభవించినా భవిష్యత్తు బావుంటుంది కనుక దుష్టశిక్షణ జరుగుతుంది కనుక పాండవులు అడవులలో తిరుగాడవలసి వచ్చింది.

2. జూదంలో ఒడి అడవులపాలు అయ్యారు.  అసలు ఇక్కడ జరిగింది వేరు. వీళ్ళని అడవులకి పంపించాము ఇక తిరుగులేదు అని దుష్టచతుష్టయం అనుకుంది. భోగాల్లో మునిగి తేలారు. ఆయుధ సంపత్తి పెంచుకోవడం కానీ, అస్త్రశస్త్రాలు సాధిచడం కానీ ఏమి చేయకపోగా ఋషులు వచ్చినప్పుడు దుర్యోధనుడు అహంకారంతో అగౌరవపరచి శాపాలు పెంచుకున్నాడు. అడవుల్లో పాండవులని శ్రీకృష్ణుడు ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు. పాండవుల క్షేమం కోసం  ఎప్పటికప్పుడు మునులని, ఋషులని, ఎవరిని చూస్తే జన్మ చరితార్ధం అవుతుందో అలాంటి మార్కండేయ మహర్షిని పంపించి జ్ఞానాన్ని ప్రసాదించి, ఎన్నో శక్తులని అందిపుచ్చుకునేల చేశాడు. అంతేకాకుండా శ్రీకృష్ణుడి ప్రేరేపణతో శివుడి కోసం తపస్సు చేస్తున్న అర్జునుడికి సాక్షాత్తు శివుడే కిరాత రూపంలో వచ్చి అర్జునుడితో తలపడ్డాడు.

అర్జునుడు వేస్తున్న బాణాలు వేసినట్లు వేసినట్లు మాయమవుతున్నాయి. చివరికి అమ్ములపొద కూడా మాయమయింది. అయినా కూడా వచ్చింది ఎవరో గ్రహించకుండా విల్లుతో మీదికి దూకాడు. విల్లు మాయమయింది.. శివుడు నవ్వుకొని ఒక్క పిడికిటి పోటు పొడవడంతో మూర్చిల్లి కిందపడ్డాడు. తెప్పరిల్లిన తరువాత చూస్తే ఇంకేముంది! కిరాతుల రూపంలో ఉన్న శివపార్వతులు అసలు రూపంలో దర్శనం ఇచ్చారు. పాశుపతాస్త్రం అందించారు. ఆవిధంగా అర్జునుడు పాశుపతాస్త్రం సంపాదించాడు. శివా! ఎందుకు నన్ను ఇలా ఆట పట్టించావ్? అని అడిగితె! పూజలు, మంత్రాలు ప్రతినిత్యం వింటూనే ఉన్నాను.  ఈ బడితెపూజ అయితే కొత్తగా ఉంటుందని అని సమాదానం ఇచ్చాడు శివుడు. అర్జునుడు శివుడుని తాకి కలబడటం వల్ల శరీరం వజ్రకవచంలా తయారయ్యింది(ఇదొక వరం). దానికితోడు పాశుపతాస్త్రం వచ్చింది.

తదనంతరం ఇంద్రుడు వచ్చి స్వర్గలోకానికి తీసుకెళతాడు. అక్కడ అనుకోని సంఘటన వలన ఊర్వశి చేత స్వర్గలోకంలో పేడి (నపుంసకుడు) అవుతావు అని శాపం పొందుతాడు. ఇది అంతా గమనించిన ఇంద్రుడు అర్జునుడి సత్యనిష్ఠ కి సంతసించి ఊర్వశి ఇచ్చిన శాపాన్ని ఇంద్రుడు వరంగా తిప్పాడు. దీనికి తోడు ఇంద్రుడు అర్జునుడికి నాట్యం శిక్షణ ఇస్తాడు. ఈశాపం అజ్ఞాత వాసంలో వరంగా మారింది. నృత్యం వలన విరాట కొలువులో విరాటుడి కుమార్తె ఉత్తరకి నాట్యశిక్షణ కోసం ఉపయోగపడింది. ధర్మరాజు జ్ఞానాన్ని, తప్పస్సుని పెంచుకుంటే, అర్జునుడు ఆయుధ సంపత్తిని పెంచుకున్నాడు. భీముడు గురించి చెప్పెపనిలేదు. భీముడు హిమగిరులలో విహరిస్తుండగా పుష్పం కోసం బయలుదేరి ఇలా అరణ్య అజ్ఞాత వాసాలు ముగించి ఆయుధ సంపత్తిని, ఎనలేని కీర్తి గడించారు.

ఇప్పడు అసలు విషయంలోకి వద్దాం!
    ప్రతి మనిషి జీవితంలో గడ్డుకాలం ఉంటుంది. ఏపని చేసినా కలిసిరావడంలేదు అని వాపోతారు. దేవుడుని నిందిస్తారు. నేను ఎం పాపం చేశాను! ఎందుకు నాకు ఈ శిక్ష అని లోకంలో కష్టాలన్నీ వీళ్ళకే వచ్చినట్లు బాధపడుతూ ఉంటారు. ఆ సమయంలో మునుపు పనికిమాలిన పనులు గుర్తుండవు. గుర్తురావు. పైగా కష్టాలలో ఉండడం చేత ఎక్కడ సాయం అడుగుతారో అని పలకరించడానికి కూడా ఎవరు రారు. అప్పుడు మనం చేసే ఆలోచన ఎలా ఉంటుందంటే నాకు ఎవరులేరు. నాబ్రతుకు ఇంతే! ఇంకేమి సాధించలేను మరణమే శరణ్యం అనే ఆలోచనల్లోకి వెళ్ళిపోతారు. ఇది ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సమయంలో వస్తూనే ఉంటుంది.

దీన్నే మనం అరణ్యవాసం అనుకోవాలి. ఆ సమయంలో ఎవరులేరని భాధపడకూడదు. ఎందుకంటే ఎవరు లేకపోతేనే తపస్సు చేయడానికి మంచి అవకాశం. ఎందుకంటే ఇంతకుముందు అన్ని ఉన్నాయి. అందరూ ఉన్నారు. అప్పుడు ఈ ఆలోచన రాలేదు. ఇప్పుడు కష్టంలో ఉన్నారు. ఇప్పుడు ఎవరూ రారు. రారు అని నింద వేసి ఏడుస్తూ కూర్చుంటే ఇంకా మీరు సాధించేది ఏమిటి? ఒకవేళ వస్తే సాధన చేస్తారా? చేయరు.  (ఒకటి ఆలోచించండి! పాండవులు అరణ్యవసం చేయకపోతే కురుక్షేత్రం జరిగెదికాదు. ఎల్లప్పుడూ రాజ్యం కోసం ఎత్తులు, పై ఎత్తులు వేస్తూ, యజ్ఞాలు యాగాలు అంటూ వీటితోనే కాలం గడిచేది. దుష్టశిక్షణ జరిగేది కాదు. మహాభారతం మనకి దొరికేది కాదు.. వాళ్ళుకూడా చరిత్రలో కలిసిపొయెవారె!).. అలాగే మనం కూడా కష్టం అనే గడ్డు కాలాన్ని గ్రంధ పఠనం అనే తపస్సు చేసి జ్ఞానాన్ని పెంచుకోవాలి. అలాగే ఏదైనా విద్యలని అభ్యసించాలి. సరైన గురువు కోసం అన్వేషించాలి! అప్పుడు తెలుస్తుంది జీవితం ఎలా సరిదిద్దుకోవాలో. కష్టం వచ్చినప్పుడు ఎలా నిలబడాలో!

ఒకరకంగా చెప్పాలంటే సుఖపడుతున్నాం అంటే పుణ్యం కరిగిపోతున్నట్టు. కష్టపడుతున్నాం అంటే పాపం కరిగిపోతున్నట్టు. ఇప్పడు ఆలోచించుకోండి! సుఖాలలో ఉన్నప్పుడు కూడా కష్టపడుతూ పుణ్యాన్ని డిపాజిట్ చేసుకుంటారా! కష్టాలలో కూడా సుఖాల కోసం వెంపర్లాడుతూ కష్టాలు కొనితెచ్చుకుంటారా! సుఖపడుతున్నప్పుడు దానధర్మాలు చేయాలి. యజ్ఞయాగాదులు (రోజుకు ఒక పేజి అయినా గ్రంధ పటనం చేస్తుంటే అదే కలియుగంలో  యజ్ఞం) చేయాలి. అప్పుడు కష్టాలు మీదగ్గరికి రావు సరికదా. మీకు ప్రమాదం కలిగించాలి అనుకున్నవారు మీ చుట్టూ ఉన్నా అనతికాలంలోనే వెళ్ళిపోతారు. ఆధ్యాత్మిక మార్గం వైపు మీరు ఒక అడుగు వేశారు కనుక ఆదైవం ఎప్పుడు మీ పక్కనే ఉంటాడు. భగవంతుడు మీప్రక్కనే ఉన్నట్లు మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పుడు కష్టం వచ్చిందంటే దానికి ఎదో కారణం ఉంటుంది. శ్రీకృష్ణుడు తోడు ఉండికూడా పాండవులు అరణ్యవాసం చేసినట్లు.. కనుక ఎప్పుడూ దేనికి బెదిరిపోవద్దు. కృంగిపోవద్దు.

Monday, June 8, 2020

వంటగదిలో ప్రమిదదీపం నువ్వుల నూనెతో వెలిగిస్తే ?ప్రయోజనం

వంటగదిలో ప్రమిదదీపం నువ్వుల నూనెతో వెలిగిస్తే ?ప్రయోజనం 

దీపం పరంజ్యోతి స్వరూపం. మనం నివసించే గృహంలో రోజూ ఉదయం, సాయంత్రం రెండు పూటలా దీపాన్ని వెలిగించడం ద్వారా ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఇంకా దుష్టశక్తులు తొలగిపోతాయి. అలాగే దీపం మహాలక్ష్మీ దేవి స్వరూపం కావడంతో ఆమె అనుగ్రహం లభిస్తుంది. రోజూ గృహంలో దీపాన్ని వెలిగించడం ద్వారా ఆయురారోగ్యాలు చేకూరుతాయి. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ధనాదాయం వుంటుంది. అలాంటి దీపాల్లో కొన్ని విశిష్టమైన వాటిని గురించి తెలుసుకుందాం..

బియ్యాన్ని శుభ్రపరిచి పొడికొట్టుకుని.. ఇంటిముందు బియ్యం పిండితో ముగ్గులు వేయడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఇంకా ఆ రంగ వల్లికలపై పంచముఖ దీపాన్ని వుంచి రోజూ వెలిగించడం ద్వారా లక్ష్మీ కటాక్షం చేకూరుతుంది

పూజగదిలో రెండు పంచముఖ దీపాలను వెలిగించడం మంగళప్రదం. అంతేగాకుండా వంటగదిలో రోజూ ఓ ప్రమిదలో నువ్వుల నూనెను పోసి దీపం వెలిగించడం ద్వారా అన్న దోషాలు ఏర్పడవు. తద్వారా దారిద్ర్యం దరి చేరదు. ఇకపోతే ఇంటి బయట తోటలుంటే.. అక్కడ నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే శత్రుభయం వుండదు. ఆయుర్దాయం పెరుగుతుంది. ఇంటికి వెలుపల ప్రధాన ద్వారాల వద్ద నాలుగు దీపాలను రోజూ వెలిగించడం ద్వారా ఇంట వుండే దుష్ట శక్తులు వుండవని  పండితులు చెప్తున్నారు

సింహాచలం

సింహాచలం

విశాఖకు ఉత్తరంగా సుమారు 20కి.మీ, దూరంలో సముద్రమట్టానికి 243 మీటర్ల ఎత్తులో సమున్నతంగా ఒక కొండమీద వెలసిన  లక్ష్మీనరసింహస్వామి శ్రీమహావిష్ణువు యొక్క అవతారమైన వరాహ నృసింహస్వామి క్షేత్రం. ఈ ప్రాంతంవారికి ఈ స్వామి అంటే ఎంతో గురి. విశాఖజిల్లాలోని వారంతా ఈ స్వామిని భక్తితో, ఆప్యాయంగా సింహాద్రి అప్పన్నగా పిలుచుకుంటూ ఈ స్వామిపేరే ఎక్కడచూచినా పెట్టుకుంటూ వుంటారు. ఇక్కడి సుప్రసిద్దుల నుండి పూరిపాకల్లో వుండేవారు సైతం ఈ స్వామి వారి పేరులేకుండా వుండరు. కొండమీద గంగ, గోదావరి, కూర్మ, మాధవ, ఆకాశధారలను హనుమద్ధ్వారము వరకూ చూడవచ్చు. సింహాద్రి అప్పన్న దేవాలయం 11వ శతాబ్ధపుకాలం నాటిది అంటున్నా ఆలయం ఇంకా పురాతనకాలానికి చెందినదిగా భావించబడుతుంది. హిరణ్య కశిపుని వధానంతరం భక్తశ్రేష్టుడైన ప్రహ్లాదునిచేత ప్రతిష్టితమైనదిగా చెప్పుకుంటారు. స్వామి ఉగ్రత్వమును శాంతింప జేయటానికి విగ్రహానికి ప్రతి నిత్యమూ చందనపు పూత పూస్తుంటారుట. 

స్వామికి వైశాఖ శుద్ధ తదియనాడు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. సంవత్సరమంతా చందనంతో మెత్తి వేయబడి వున్న స్వామి నిజరూప దర్శనం ఆనాడే జరుగుతుంది. దీన్నే గంధవలుపు ఉత్సవం అని కూడా అంటారు. స్వామిని ఈ రోజున దర్శించటానికి లక్షలాది యాత్రికులు వస్తారు. కొన్ని వ్యాధులు సైతం నయంకాగలవని ఒక గట్టి నమ్మకం. ఆ రోజున స్వామివారి దివ్యానుభూతి భక్తులకు వెచ్చగా స్పృశ్యమవుతుందట. చాళుక్యరీతి శిల్ప వైభవం ఆలయమంతా కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉంటుంది. శ్రీ కృష్ణదేవరాయలు సైతం ఈ క్షేత్రాన్ని దర్శించి పునీతుడై, సంతుష్టాతరంగంతో కొన్ని గ్రామాలు స్వామివారి భోగముల నిమిత్తం భక్తితో సమర్పించారట, మరెన్నో సువర్ణాభరణాలు భక్తిమేర చేయించారట. చైత్రమాసంలో రధోత్సవాదులు జరుగుతాయి. విశాఖ నుండి నేరుగా కొండమీదికి బస్సులున్నాయి. వుండటానికి కొండమీద చందన రెస్టు హౌస్, A.P.T.T.D.C. వారి తాలూకు, దేవస్ధానం కాటేజీలు, జిల్లా పరిషత్తువారి గెస్టుహొం మొదలైనవి ఉన్నాయి. ప్రకృతి రమణీయంగా కన్నులు పండుగగా కనబడుతూంది. స్వామి దర్శనార్ధం ప్రతిరోజూ భక్తులు యాత్రికులు కోకొల్లలు వస్తూనే వుంటారు. ఎప్పుడూ జనసందోహంతోటి కిటకిటలాడుతూంటుంది.

తోలు వస్తువులు వాడుతున్నారా?

జంతువుల నుంచి తోలు సేకరించి, తోలు వస్తువులను తయారు చేయడంలో అంతకంటే ఎక్కువ బాధ ఉంటుంది. దాని గురించి నేను గత నెలలోనే ఒక పోస్ట్ రాసాను. మనలో ఎంతమంది తోలు వస్తువులను ఇక మేము కొనుగోలు చేయము అని తీర్మానించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? 

తోలు వస్తువులు వాడుతున్నారా?

ఇప్పుడు మనమంతా కరోనా వైరస్ వ్యాపిస్తుందన్న భయంతో తోలు (లెధర్) వాడకాన్ని తగ్గించాము, లేదా ఆపివేశాము. అసలు ముందు లెధర్ ఎలా తయారవుతుందో తెలుసుకుని, అప్పుడు మన సంస్కృతిలో దాని స్థానం ఏంటో చూద్దాము.

లెధర్ పరిశ్రమలో తోలు కోసం పంది, పాము, మేక, గేదె, మొసలి, ఆవు, కంగారు మొదలైన అనేక జంతువులు వధించబడతాయి. కానీ తోలు కోసం అత్యధికంగా వధించబడేది ఆవు. ఇది అందరూ అంగీకరించే సత్యము. ఒక్క అమెరికాలోనే ఏటా తోలు కోసం 13.9 కోట్ల అవులు, దూడలు, మేకలు, గొఱ్ఱెలు వధించబడతాయి.

గోవు నుంచి తోలు తీసే ప్రక్రియ మీకు తెలుసా?

గోవులను నీటిలో శుభ్రం చేసే నీటి పంపుల వద్దకు తెస్తారు. శుభ్రం చేసే సమయంలో నీరు 200 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉంటుంది. బయట 40 డిగ్రీలు ఉంటేనే తట్టుకోలేకపోతున్నాము. మరి దానికి 5 రెట్లు వేడి. ఇంతటి ఉష్ణోగ్రతలో ఉన్న నీటిని గోవులపై ధారగా పోస్తారు. ఈ విధంగా చేసినందువల్ల వీటి చర్మం నునుపెక్కి వొలచటానికి సులభమౌతుంది. కానీ, ఈ సమయంలో అవి (గోవులు) ఎంతో భయంతో బిక్కచచ్చిపోయి ఉండే హృదయ విదారకమైనస్థితి. గోవుగా ఎందుకు పుట్టామా అన్నట్టు, ఇంకా ప్రాణం ఎందుకు పోలేదని రోధిస్తున్న వైనం... భూమి మీద జాలి, దయ, కరుణ అన్నవి మృగ్యమైపోయిన వైనం...రాక్షసత్వానికి పరాకాష్ట.

ఆ తర్వాత గొలుసులతో ఉన్న కొక్కాలకు ఒక్కొక్క గోవును తలక్రిందులుగా ఒక్కొక్క కాలుని ఆ కొక్కాలకు తగిలించి వేలాడదీస్తారు. రక్తం ఏకధాటిగా ఏరులై పారుతున్నా గోవు పూర్తిగా చనిపోదు. గోవులను పూర్తిగా చంపిన తర్వాత వాటి చర్మము ఉబ్బి గట్టిపడుతుంది. అటువంటి చర్మము మార్కెట్టులో తక్కువ ధర పలుకుతుంది. కాని ప్రాణమున్నప్పుడే వొలిచిన గోవుల చర్మము చాలా పలుచనగా ఉండటమే కాదు, వాటి విలువ కూడా అంతర్జాతీయ మార్కెట్టులో అత్యంత ఎక్కువ ధర పలుకుతుంది. ఒకప్రక్క గోవుల మెడలు సగం తెగి రక్తం కారుతుంటే, మరొకప్రక్క గోవుల కడుపులో రంధ్రం చేసి, అందులోకి అతివేగంగా గాలిని జొప్పిస్తారు. అప్పటికి గాని గోవు లోపలి భాగాలు ఉబ్బి, చర్మం వొలవటం అనే పక్రియ సులభతరం కాదు. చర్మం పూర్తిగా వొలిచిన తర్వాత బ్రతికి ఉన్న ఆ గోవులను నాలుగు భాగాలుగా (తల, కాళ్లు, మధ్యభాగము, తోక) ముక్కలు చేస్తారు. అప్పుడు వాటి మాంసాన్ని ప్రాసెస్ చేస్తారు.

పాములను చంపి తోలు తీసే ప్రక్రియ - బ్రతికి ఉన్న పామును చెట్టుకు మేకుతో కొట్టి, శరీరం మీద చర్మాన్ని నిలువునా వొలిచేస్తారు.

గర్భం ధరించిన ఆవులు, ఆడగొఱ్ఱెల కడుపులో ఉండే దూడల చర్మం 'విలాసం' (luxury leather item) గా చెప్పబడుతోంది. అందుకే అనేక ఆవులు మరియు గొఱ్ఱెలకు కృతిమ గర్భధారణ చేయించి, కావాలని గర్భవిచ్ఛితి (అబార్షన్) చేస్తారు.

తోలు కోసం ప్రత్యేకమైన ప్రదేశాల్లో మొసళ్ళను పెంచుతారు. వాటి జీవితకాలం ఎక్కువే అయినా, 2-4 ఏళ్ళు రాగానే వాటిని వధశాలకు పంపిస్తారు. అవి బ్రతికి ఉండగానే వాటిని సుత్తి, గొడ్డలి వంటి వాటితో కొట్టి కొట్టి చంపుతారు. చాలా సందర్భాల్లో సజీవంగానే వాటి తోలు ఒలుస్తారు. ఆ తర్వాత అవి చాలా సమయం వేదన అనుభవించి మరణిస్తాయి.

ప్రపంచంలో ఈరోజు అధిక హింసను ప్రేరేపించే పరిశ్రమల్లో డైరి ఒకటి. ఎప్పుడైతే ఆవు వట్టిపోతుందో (పాలు ఇవ్వడం ఆపివేస్తుందో) అప్పుడు దాన్ని వధశాలకు తరలిస్తారు. చాలా సందర్భాల్లో డైరీ పరిశ్రమలో ఆవుకు ఆడదూడ పుడితే దాన్ని రక్షిస్తారు. అదే కోడె దూడ పుడితే, దాన్ని మరుక్షణమే వధశాలకు పంపుతారు. అప్పుడే పుట్టిన లేగదూడల మాంసానికి, వాటి తోలుకు ఉన్న డిమాండే దీనికి కారణం. కొన్ని సందర్భాల్లో వీటి మాంసాన్ని చాక్లెట్స్‌లో కలుపుతారట. మనం ఇప్పుడు వ్యవసాయంలో ఎద్దుకు బదులు కాలుష్యం విడుదల చేసే ట్రాక్టర్ వాడుతున్నాము. కనుక ఎడ్ల అవసరం తగ్గింది, ఇక ఎడ్లను ఎవరు పెంచుతారు? ఎడ్ల వధకు ఇది కూడా ఒక కారణం.

ఇలా మనకు తోలు ఉత్పత్తులు రావాలంటే దాని వెనుక ఎంతో హింస ఉంటుంది. అలాంటి హింసతో కూడిన వస్తువులను ఆలయంలోకి తీసుకెళ్ళవచ్చా? అది మృతదేహం కాదా ? మన గోవును పూజిస్తాము, నాగదేవతను పూజిస్తాము, కాలభైరవుడిని పూజిస్తాము. మీరు వాడే తోలు వస్తువుల్లో గోవు, పాము, కుక్క తోలు ఉండదని మీకు ఖచ్ఛితంగా చెప్పగలరా ? లేదు కదా ! తోలు వస్తువులను వాడటమంటే జంతువధను సమర్ధించడం కాదా ? గోహత్యా పాతకం సంగతేంటి?

ఒకప్పుడు మనవాళ్ళు తోలు చెప్పులను వాడేవారు వేరే ప్రత్యామ్నాయం లేక. అప్పటికీ శుభాశుభకార్యాల్లో ఎక్కడా చెప్పులు వేసుకోరు. చెప్పులు వేసుకుని వెళ్ళవద్దనే చెప్పారు. కానీ ఈరోజు మనం వాడే సెల్ఫ్‌ఫోన్ కవర్, బెల్ట్, పర్సు, హ్యాండ్ బ్యాగ్ మొదలుకుని ఇంట్లో ఉపయోగించే సోఫాల వరకు విలాసం, పరపతి పేరుతో తోలు వస్తువులు వాడుతున్నాము. దేవతలు ఆవాహన చేసిన ఆలయాలు, యజ్ఞయాగాదుల వంటివి జరిగే పవిత్ర ప్రదేశాలకు అలాంటివి ధరించి, తీసుకుని వెళ్ళడం ఎంతవరకు సమంజసం? తోలు ఉత్పత్తులను ప్రోత్సహించడమంటే హింసను సమర్ధించడమే. ఇప్పుడు తోలు ఉత్పత్తులకు ప్రత్యామ్నాయాలు వచ్చాయి. వాటిని వాడవచ్చు కదా. ఆలోచించండి.

🙏🌺ఇంట్లో ఎల్లప్పుడూ అక్షంతలు ఉండాలా🙏🌺

🙏🌺ఇంట్లో ఎల్లప్పుడూ అక్షంతలు ఉండాలా🌺🙏

🌺సాధారణంగా చాలామంది అక్షంతలు ఇంట్లో అంతగా ఉపయోగించరు. ఎప్పుడైనా శుభకార్యాలు చేసుకునేటప్పుడు లేదా పెళ్లి సమయాల్లో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎల్లప్పుడూ అక్షంతలు ఉండాలని పండితులు చెప్తున్నారు. ఎందుకంటే.. అక్షంతలు శుభాన్ని సూచిస్తాయి కనుక వాటిని ఇంట్లో ఉంచుకుంటే.. అష్టైశ్వర్యాలు, సకల సౌభాగ్యాలు చేకూరుతాయని నమ్మకం..🌺

🌺1. పూజలో ఉపయోగించిన అక్షంతలని ఒకచోట దాచుకుని ప్రయాణాలకి వెళ్లే వేళ ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్లెటప్పుడు తలపై వేసుకుని బయల్దేరాలి. ఇలా చేస్తే మీరు తలపెట్టిన లేదా చేయాలనుకున్న కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తిచేస్తారు. ఇంకా చెప్పాలంటే.. ఎవరైనా మనకి పాదాభివందనం చేస్తే.. వాళ్లని ఆశీర్వదించడానికి కూడా వాడొచ్చు.🌺

🌺2. పూజామందిరంలో దైవాన్నే ఉంచి పూజించాలి తప్ప మన బంధువుల, తల్లిదండ్రులు.. ఇలా ఎవరి చిత్రాలను ఉంచి పూజించ కూడదని పురాణాలు చెబుతున్నాయి. పూజ గదిలో దైవాన్ని తప్ప వేరే ఎవ్వరని ఆరాధించరాదని చెప్తున్నారు. కనుక దైవారాధనకు మాత్రం ఓ ప్రశాంతమైన గదిని ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడే మీరు చేయాలనుకున్న పూజ కార్యలు సక్రమంగా జరుగుతాయి.🌺

🌺3. తనంత తానుగా వెలసిన మూలవిరాట్టు పుంగవులచే ప్రతిష్టమైన, మూలవిరాట్టుండి, ప్రవహించే నది ఒడ్డున ఏ దేవాలయంలో కనిపిస్తుందో దానిని క్షేత్రమని అంటారు. అలా కానిది దేవాలయం. ఇక శిఖరం, ధ్వజస్తంభం అనేవి లేనిది మందిరం.🌺

కొబ్బరికాయను కొట్టడంలో కొన్ని నియమాలు

కొబ్బరికాయను కొట్టడంలో కొన్ని నియమాలు...
పూజ చేసాక, దేవుడికి కొబ్బరికాయ కొట్టడం అనేది మనకు ఉన్న పద్దతి / ఆచారం. పూజ పూర్తి అయ్యాక, టెంకాయ కొట్టేసాం, నైవేద్యం పెట్టెసాం తంతు పూర్తి అయింది అని అనుకుంటారు (అనుకుంటాము). అంతా బాగనే ఉంది గాని, టెంకాయ కొట్టడంలో కూడా ఒక పద్దతి ఉంది. అందేంటొ కాస్త తెలుసుకుందాం.
టెంకాయ కొట్టడం శాంతి కారకం. అరిష్టనాశకం. శాస్త్ర ప్రకారం కొబ్బరికాయ కొట్టడంలో కొన్ని నియమాలు ఉన్నాయి. అవి....

1. భగవన్నివేదనకు కొబ్బరికాయను కొట్టబోయే ముందు దానిని స్వచ్చమైన నీటితో కడిగి, ఆ తరువాత టెంకాయ పీచు ఉన్న ప్రదేశాన్ని చేతబట్టుకుని, దేవుడిని స్మరించుకోవాలి. రాతిపై కొట్టేటప్పుడు, ఆ రాయి ఆగ్నేయ దిశలో ఉండటం మంచిది.

2. కాయ కొట్టేటప్పుడు 9అంగుళాల ఎత్తునుండి కొట్టడం మంచిది

3. సరిగ్గా రెండు భాగాలుగా పగలాలి అని అంటారు. కొంచెం అటు, ఇటు ఐనా పర్లేదు. కొన్నిసార్లు టెంకాయ లోపల నల్లగా ఉంటుంది. అదేదో అశుభం అని దిగులుపడఖర్లేదు. దానివల్ల ఎలాంటి అశుభాలు జరగవు. ఆ సమయంలో “శివాయనమః” అని 108 సార్లు జపిస్తే పరిహారం అవుతుంది

4. టెంకాయ కొట్టి దానిని విడదీయకుండా చేతబుచ్చుకుని అభిషేకం చేస్తారు చాలామంది. ఆ పద్దతి తప్పు. అలా చేస్తే ఆ కాయ నైవేద్యానికి పనికిరాదు

5. కొబ్బరికాయను కొట్టి ఆ నీటిని ఒక పాత్రలోనికి తీసుకుని, కాయను వేరు చేసి వేరే ఉంచాలి. పాత్రలోని కొబ్బరినీటిని మాత్రమే అభిషేకించాలి. వేరుగా ఉంచిన కొబ్బరికాయ రెండు ముక్కల్ని నైవేద్యంగా సమర్పించాలి.

..తెలంగాణ లోని విశిష్టత....

....తెలంగాణ లోని విశిష్టత....

⑴ సరస్వతి ఆలయాలు ఉన్నవి రెండే ప్రాంతాలలో.. 
కాశ్మీర్.. బాసరా (తెలంగాణ).. 
⑵ బ్రహ్మదేవుడి ఆలయాలు ఉన్నవి రెండే ప్రాంతాలలో... 
పుష్కర్ (రాజస్థాన్).. ధర్మపురి (తెలంగాణ).. 
⑶ త్రివేణి సంగమాలు ఉన్నవి రెండే ప్రాంతాలలో.. 
అలహాబాద్ (ఉత్తర్ ప్రదేశ్).. కాలేశ్వరం (తెలంగాణ)
⑷ ఉత్తర వాహినిగా ప్రవహించే నదుల ప్రాంతం రెండే కలవు.. 
నర్మదా నది.. ఓంకారేశ్వర్ (మధ్యప్రదేశ్)
గోదావరి నది.. చెన్నూర్ (తెలంగాణ)

ధర్మపురి.. 
_యముడు శివునికై తపస్సు చేసింది ఇక్కడే.. 
(మార్కండేయుని విషయంలో చేసిన పాపం కారణంగా)
బ్రహ్మదేవుడు (సృష్టి)
నరసింహుడు, (స్థితి)
శివుడు, (లయం)
యముడు, (కాలం)
అరుదైన దైవ సంయోగ దేవాలయం ఇది

కాళేశ్వరం.. 
ఒకే పానవట్టం పై రెండు శివలింగాల అపురూప ఆలయం ఇది.. 
గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల అమృత సంగమ క్షేత్రం ఇది.. 
సరస్వతి నది చివరి సారి దర్శనం ఇచ్చింది ఇక్కడే.. 

వేములవాడ... 
అహల్య విషయంలో పాపం చేసిన దేవేంద్రుడు (దేవరాజు) శాప పరిహారానికి శివుడికై తపస్సు చేసింది ఇక్కడే. ఇక్కడి శివుడి నామదేయం రాజరాజేశ్వరుడు (రాజులకే రాజు ఆయన)

మెదక్.. 
సప్తరుషులు తపస్సు చేసింది ఇక్కడే, మంజీర నది ఏడు పాయలుగా విడిపోయిన అద్భుత దృశ్యం ఇక్కడ ఉంది.. 

యాదగిరి.. 
అహోబిలం నుండి ఉగ్రరూపంతో వస్తున్న ఉగ్రనరసింహుడు శాంతించి లక్ష్మిదేవితో కలిసి వెలిసిన దేవాలయం.. 

కొండగట్టు.. 
శ్రీరాముడు నడయాడిన ప్రాంతం గనక అమితానందంతో ఆంజనేయుడు సంజీవని పర్వతంలో ఓ భాగాన్ని వదిలిన ప్రాంతం.. 

బాసర.. (వ్యాసపురి)
వేదవ్యాస మహర్షి సరస్వతి మాతకై తపస్సు చేసి మహాభాగవతం రచించిన ప్రాంతం.. 

భద్రాచలం.. 
శ్రీరాముడు మహావిష్ణువు రూపంలో ఉన్న ఏకైక ఆలయం. 

చెన్నూర్.. 
గోదావరి నది ఉత్తర వాహినిగా ప్రవహించే ఏకైక ప్రాంతం. 

మంతని.. 
మంత్రనగరి అసలు పేరు, త్రేతాయుగంలో వైదిక మంత్ర తంత్ర సాధన, పరిశోదనకై అగస్త్య మహాముని ఏర్పటు చేసిన తొలి ఆశ్రమం ఇక్కడే. 

బోదన్.. 
బోధనపురి అసలు పేరు. మంతనిలో అభ్యసించి అర్హత సాదించిన గురువులు శిష్యులకు బోధించడానికి ఏర్పాటు చేసిన తొలి గురుకుల పాఠశాల ఇక్కడే.

*కాల సర్ప దోషం ఇవి మొత్తం పన్నెండు రకాలు* :

*కాల సర్ప దోషం ఇవి మొత్తం పన్నెండు రకాలు* : 

అవి :
 అనంత కాల సర్ప యోగము ,
 కులిక లేక గుళిక కాల సర్ప యోగము,
 వాసుకి  కాల సర్ప యోగము,
 శంఖ పాల  కాల సర్ప యోగము,
పద్మ కాల  సర్ప యోగము,
మహా  పద్మ కాల  సర్ప యోగము,
తక్షక లేక షట్  కాల  సర్ప యోగము,
కర్కోటక  కాల  సర్ప యోగము,
శంఖ చూడ లేక శంఖ నంద లేక షన్ చాచుడ్ కాల  సర్ప యోగము,
ఘటక లేక పాతక   కాల  సర్ప యోగము,
విషక్త లేక విషదావ   కాల  సర్ప యోగము,
శేష  నాగ   కాల  సర్ప యోగము,

     *కాలసర్ప యోగ ఫలితాలు*

జ్ఞాన ద్రుష్టి లేక  పోవుట లేక మెదడు ఎదుగాక పోవుటఆం వల్ల అనుమానాలు లేక అపార్ధములు చేసుకొనుట ,
జన్మించిన సంతానమునకు బుద్ధి మాంద్యం కలుగట 
 గర్భం లో  శిశువు మరణించుట ,
 భార్తయాల మధ్య  లేక పోవుట లేక వైవాహిక జీవతం లో అసం తృప్తి, 
మరణించన శిశువును ప్రసవించుట,
విచ్త్రమైన  కలుగుట,
గర్భం నిలవక పోవుట, 
అంగ వైకల్యంతూ సంతానం కలుగుట,
వ్రుహ్నముఖ వ్యాధులు  ఏర్పడుట ట్రీట్మెంట్ విఫలమై మరణించుట ,
ఏర్పడుట ,
వీర్య కణాలు నశించుట  ,
కుటుంబం  లో ప్రేమాభి మానాలు తగ్గుట, 
వంశి వృది లేక ఫోవుట ,
మొండి పట్టుదలశత్రువు వలన మృతి చెందుట, 
మానసికశాంతి లేక పోవుట ప్రమాదాలు అవమానాలు, 
అపనిందల వలన మృతి  చందడం ఋణ గ్రస్తులు  అవడం

*సంపూర్ణ సుబ్రహ్మణ్య ఆరాధన  మరియు శాన్తి హోమం  మీ గోత్ర నామ నక్షత్రములుతో  చేయించుకోవడం  ద్వారా దోషములు  నుండి ఉపశమనం పొందవచ్చు . సంప్రదించండి కార్యక్రమం  చేయించుకోవడానికి *9573124595*

Wednesday, June 3, 2020

*జాతకం విషయం* లో ఎక్కువమంది సందేహం తమకు *కుజదోషం ఉన్నదా* ? *కాల సర్పదోషం* ఉన్నదా ?

*జాతకం విషయం*  లో ఎక్కువమంది  సందేహం  తమకు  *కుజదోషం  ఉన్నదా* ?  *కాల  సర్పదోషం*  ఉన్నదా ?  

అటువంటివారికోసం  స్వయంగా  మీకు మీరు  దోషములు  ఉన్నవి  లేవా తెలుసుకొనుటకు  అనుగుణంగా   *WebsiteLInks*  ఇస్తున్నాము 

*Website Caluclater*   లో  మీ పుట్టిన  తేదీ ,సమయం వివరములు తో Check చేసుకోగలరు.

  *కుజదోషం Cheking Weblink*

https://www.prokerala.com/astrology/mangal-dosha/manglik.php 
 
 *కాల  సర్పదోషంCheking Weblink* 

https://www.prokerala.com/astrology/kaalsarp-yog.php 

ఒకవేళ దోషం ఏమైనా ఉంటే  తప్పకుండా  సంపూర్ణ శ్రీ సుబ్రహ్మణ్య ఆరాధన చేయించుకోవడం  ద్వారా  ఉపశమనం  పొందవచ్చు 

   సంపూర్ణ శ్రీ సుబ్రహ్మణ్య ఆరాధన  వేదమయీ సంస్థ   ద్వారా  చేయించుకొనుటకు  
కార్యక్రమం  నందు Register  కావుటకు *Weblink*

 https://pages.razorpay.com/SubrahmanyaAaradhana

*శని బాధలు తగ్గడానికి మార్గం*

*శని బాధలు  తగ్గడానికి  మార్గం* :-  

ప్రతి శనివారం ఈ మంత్రాన్ని పఠించాలి 

*శని శాంతి మంత్ర స్తుతి* :- ప్రతి శనివారం ఈ మంత్రాన్ని పఠిస్తే శని బాధ కలగదు. ఈ మంత్రం వెనుక ఉన్న పురాణ గాథ ఇలా ఉన్నది. 

నల మహారాజు రాజ్యభ్రష్టుడై బాధపడుతున్నప్పుడు అతనికి శనిదేవుడు కలలో కనిపించి ఈ మంత్రం ఉపదేశించాడు. ఈ మంత్రాన్ని పఠించిన నలమహారాజుకు తిరిగి పూర్వ వైభవం కలిగింది.

 *నవగ్రహాల్లో శని దోషం ఎక్కువ అపకారం కలిగిస్తుంది* 

శని దోషం నుండి బయటపడేందుకు కింద ఉదహరించిన

 ''క్రోడం నీలాంజన ప్రఖ్యం..'' అనే శ్లోకాన్ని 11 సార్లు జపించి, తర్వాత కింది శ్లోకాన్ని 11 సార్లు జపించాలి. 

ఈ రెండు శ్లోకాలను స్మరించడంతో బాటు, నవగ్రహాలకు తైలాభిషేకం చేయాలి. ఇలా చేయడంవల్ల శని దోష బాధితులకు వెంటనే సత్ఫలితం కనిపిస్తుంది. 

ముఖ్యంగా దాన ధర్మాలు పేదవారికి, ఏమి లేని నిర్భాగ్యులకు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

క్రోడం నీలాంజన ప్రఖ్యం నీలవర్ణ సమస్రజమ్
ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరమ్\
నమో అర్కపుత్రాయ శనైశ్చరాయ నీహార
వర్ణాంజనమేచకాయ శ్రుత్వా రహస్యం భవకామదశ్చ\
ఫలప్రదో మే భవ సూర్యపుత్రం నమోస్తు ప్రేతరాజాయ\
కృష్ణదేహాయ వై నమః శనైశ్చరాయ కౄరాయ
శుద్ధబుద్ధి ప్రదాయనే\
య ఏభిర్నామభి: స్తౌతి తస్య తుష్టా భవామ్యహమ్\
మదీయం తు భయం తస్య స్వప్నేపి న భవిష్యతి||

 *శ్లో\\:-2*

 *శన్యారిష్టే తు సంప్రాప్తే
శనిపూజాంచ కారయేత్
శనిధ్యానం ప్రవక్ష్యామి
ప్రాణి పీడోపశాంతయే*

42వ దినము, యుద్ధకాండ

42వ దినము, యుద్ధకాండ
దేవతలందరితో పాటుగా అక్కడికి వచ్చిన శివుడు అన్నాడు " నాయన రామ! నీ తమ్ముడైన భరతుడు అయోధ్యలో దీనంగా ఉన్నాడు, ఆయనని ఓదార్చు. నీ తల్లి అయిన కౌసల్యని ఊరడించు. కైకేయి, సుమిత్రలకి నమస్కరించు. లక్ష్మణుడిని ఊరడించు. ఇక్ష్వాకు వంశీయులు ఇంతకాలం నుంచి పరంపరాగతంగా పరిపాలిస్తున్న రాజ్యాన్ని నువ్వు పరిపాలించి, నీవారిని సంతోషపెట్టు. ఏ వంశంలో నువ్వు జన్మించావో ఆ వంశాన్ని పెంచు. యాగాలు చెయ్యి, బ్రాహ్మణులకు భూరి దానాలు చేసి పరమ సంతృప్తిని పొందు. తదనంతరం స్వర్గానికి చేరుకుందువుగాని. అదిగో, ఆ విమానంలో మీ తండ్రిగారైన దశరథ మహారాజు ఉన్నారు, వెళ్ళి చూడు " అన్నాడు.

తండ్రిని చూడగానే లక్ష్మణుడితో కలిసి రాముడు నమస్కారం చేశాడు. అప్పుడు దశరథుడు రాముడిని ఒకసారి ఆనందంతో గట్టిగా కౌగలించుకొని తన తొడ మీద కూర్చోబెట్టుకుని " రామ! నేను స్వర్గలోకంలో విహరించానురా, ఇంద్రలోకంలో తిరిగానురా, కాని నువ్వు లేకపోతె అది కూడా నాకు పెద్ద సుఖంగా అనిపించలేదురా. ఆనాడు నీకు పట్టాభిషేకాన్ని చేద్దాము అనుకోవడం, నేను ఎంతో ఆనందాన్ని పొందడం, రాత్రి కైక దెగ్గరికి వెళ్ళడం, కైక వరాలు కోరడం, నీ పట్టాభిషేకం భగ్నం అవ్వడం, ఆనాడు నేను ఏడ్చి ఏడ్చి నా శరీరాన్ని వదిలిపెట్టడం నాకు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి. నేను ఇప్పుడు తెలుసుకున్నదేంటంటే, ఆ పట్టాభిషేకం భగ్నం అవ్వడానికి కారణం దేవతలు. రావణ సంహారం జెరగాలి కనుక దేవతలు ఆనాడు నీ పట్టాభిషేకాన్ని భగ్నం చేశారు " అన్నాడు.

అప్పుడు రాముడు " ఆనాడు మీరు భావనా వ్యగ్రతని పొంది, నా పట్టాభిషేకం భగ్నం అవ్వడానికి కైకమ్మ కారణం అనుకొని ' ఇప్పుడే నేను నిన్ను విడిచిపెట్టేస్తున్నాను, నువ్వు నా భార్యవి కావు, నీ కుమారుడు భరతుడు నాకు కొడుకు కాదు ' అన్నారు. ఆ మాటని మీరు ఉపసంహారం చెయ్యండి, నేను సంతోషిస్తాను " అన్నాడు.

అప్పుడు దశరథుడు " నువ్వు కోరుకున్నటు తప్పకుండా జెరుగుతుంది " అన్నాడు. తరువాత ఆయన లక్ష్మణుడితో " నాయన లక్ష్మణా! నువ్వురా ప్రాజ్ఞుడవి అంటె. చక్కగా అన్నయ్య సేవ చేశావు, ఇలాగె సర్వకాలములయందు అన్నయ్యని, వదినని సేవిస్తూ నీ జన్మ చరితార్ధం చేసుకో " అన్నాడు.

అప్పుడు దశరథుడు రామలక్ష్మణుల వెనకాల తనకి నమస్కారం చేస్తూ నిలబడ్డ సీతమ్మని దెగ్గరికి పిలిచి " అమ్మా సీతమ్మ! నీ మనస్సుకి కష్టం కలిగిందా. ' సీత! నీతో నాకు ప్రయోజనం లేదు, నిన్ను విడిచిపెట్టేస్తున్నాను, నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళు ' అని మావాడు అన్నాడు కదా, అలా అన్నాడని నువ్వు బాధపడ్డావ. ఇవ్వాళ నేను ఊర్ధలోకవాసినమ్మా, తప్పు మాట చెబితే కిందకి పడిపోతాను, నీకొక నిజం చెప్పనా, రాముడికి నీమీద ఎప్పుడూ అటువంటి అభిప్రాయం లేదు. ఆ మాట ఎందుకన్నాడో తెలుసా, నిన్ను వేరొకరు ఎప్పుడూ వేలెత్తి చూపించకూడదని మావాడి తాపత్రయం.

కూతురా! నువ్వు ఇవ్వాళ చేసిన పతి సేవ వల్ల జెరిగిన గొప్పతనం ఏమిటో తెలుసా, ఇతఃపూర్వం పతివ్రతలై భర్తని సేవించిన వాళ్ళందరి చరిత్రలను పక్కన పెట్టి, పతివ్రత అంటె సీతమ్మ అని నిన్ను చూపిస్తున్నారు. నీలాంటి కోడలు నా వంశానికి రావడం నా అదృష్టం. నీకు నేను ఇంక చెప్పడానికి ఏమిలేదమ్మ, నీకు అన్నీ తెలుసు, కాని మామగారిగా ఒక్క మాట చెబుతాను. అమ్మా! భర్త మాత్రమే దైవము అని తెలుసుకో " అన్నాడు.

తరువాత దశరథుడు విమానంలో ఊర్ధలోకాలకి వెళ్ళిపోయాడు.

అప్పుడు దేవేంద్రుడు " రామ! ఒకసారి మేము వచ్చి దర్శనం ఇస్తే, ఆ దర్శనం వృధా కాకూడదు. అందుకని ఏదన్నా ఒక వరం కోరుకో " అన్నాడు.

రాముడన్నాడు " నాకోసమని తమ యొక్క కొడుకులని, భార్యలని విడిచిపెట్టి ఎన్నో కోట్ల వానరములు, భల్లూకములు, కొండముచ్చులు యుద్ధానికి వచ్చాయి. అలా వచ్చిన వాటిలో కొన్ని మిగిలాయి, మిగిలిన వాటిలో కొన్నిటికి చేతులు తెగిపోయాయి, కొన్నిటికి కాళ్ళు తెగిపోయాయి, కొన్ని ఇంకా యుద్ధభూమిలో రక్తం ఓడుతూ పడున్నాయి, కొన్ని యమ సదనమునకు వెళ్ళిపోయాయి. మీరు నిజంగా నాయందు ప్రీతి చెందినవారైతే, యమ సదనమునకు వెళ్ళిన వానరములన్నీ బతకాలి, యుద్ధభూమిలో కాళ్ళు తెగిపోయి, చేతులు తెగిపోయి పడిపోయిన కోతులు, కొండముచ్చులు, భల్లూకాలు మళ్ళి జవసత్వములతో పైకి లేవాలి. అవన్నీ యుద్ధానికి వచ్చేటప్పుడు ఎంత బలంతో ఉన్నాయో ఇప్పుడు మళ్ళి అంతే బలంతో ఉండాలి. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళినా అక్కడ చెట్లకి ఫలాలు ఫలించాలి, పువ్వులు పుయ్యాలి, అక్కడ సమృద్ధిగా తేనె ఉండాలి, వాళ్ళు తాగడానికి ఎప్పుడూ మంచి నీరు ప్రవహిస్తూ ఉండాలి " అన్నాడు.

ఇంద్రుడు " తప్పకుండా నీకు ఈ వరాన్ని కటాక్షిస్తున్నాను " అన్నాడు.

వెంటనే యుద్ధ భూమిలో పడి ఉన్నవారు లేచి వచ్చారు, యమ సదనానికి వెళ్ళినవారు తిరిగి వచ్చేశారు. వానరులందరూ పరమ సంతోషాన్ని పొందారు.

ఆరోజు రాత్రి అక్కడ విశ్రమించారు, మరునాడు ఉదయం రాముడు విభీషణుడిని పిలిచి " నేను తొందరగా అయోధ్య చేరుకోవాలని అనుకుంటున్నాను. ఇక్కడినుంచి కాలి నడకన వెళితే చాలా సమయం పడుతుంది కనుక తొందరగా వెళ్ళడానికి ఏదన్నా ప్రయాణ సాధనం ఏర్పాటు అవుతుందా " అన్నాడు.

విభీషణుడు " మన దెగ్గర పుష్పక విమానం ఉంది, ఉత్తర క్షణంలో మీరు అయోధ్యకి చేరిపోతారు. ఇన్ని కష్టాలు పడ్డారు కదా, సీతమ్మ లభించింది కదా, సీతమ్మ అభ్యంగన స్నానం ఆచరించి, పట్టు పుట్టం కట్టుకుని, నగలు అలంకరించుకుంది కదా, మీరు కూడా తలస్నానం చేసి, పట్టు పుట్టాలు కట్టుకుని, ఆభరణములను దాల్చి, నా దెగ్గర బహుమతులు అందుకొని మీరు బయలుదేరితే నేను ప్రీతి పొందుతాను " అన్నాడు.

అప్పుడు రాముడు " నా తమ్ముడైన భరతుడు అక్కడ జటలు పెంచుకొని, మట్టి పట్టిన వస్త్రం కట్టుకొని, నా పాదుకలని సింహాసనం మీద పెట్టి, నన్ను చూడాలని శోకిస్తు రాజ్యం చేస్తున్నాడు. ఆ భరతుడు స్నానం చెయ్యకముందు నేను స్నానం చెయ్యనా. భరతుడు పట్టుపుట్టం కట్టుకోకముందు నేను కట్టుకోన. భరతుడు ఆభరణాలు పెట్టుకోకముందు నేను పెట్టుకోన. నాకు తొందరగా భరతుడిని చూడాలని ఉంది " అన్నాడు.

విభీషణుడు వెంటనే పుష్పక విమానాన్ని ఏర్పాటు చేశాడు, రాముడు ఆ విమానాన్ని అధిరోహించాక " మీరందరూ నాకోసం చాలా కష్టపడ్డారు, ఇక మీరు విశ్రాంతి తీసుకోండి. నేను బయలుదేరతాను......." అని చెబుతుండగా, అక్కడున్న వాళ్ళందరూ అన్నారు " మిమ్మల్ని విడిచిపెట్టి మేము ఉండలేము, మేము మీతో అయోధ్యకి వచ్చేస్తాము. మేము అక్కడ ఎక్కువ రోజులుండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టము, మిమ్మల్ని కన్న కౌసల్యని ఒకసారి చూడాలని ఉంది, మీరు పట్టాభిషిక్తులై సింహాసనం మీద కూర్చుంటె చూడాలని ఉంది రామ " అన్నారు.

విశాల హృదయుడైన రాముడు సరె అనేసరికి అక్కడున్న వాళ్ళందరూ ఆ పుష్పక విమానంలోకి గబగబా ఎక్కేశారు. తరువాత ఆ విమానం ఆకాశంలోకి ఎగిరిపోయింది. అప్పుడు రాముడు సీతమ్మకి ఆ పుష్పక విమానం నుండి కిందకి చూపిస్తూ " సీత చూశావ, ఇదే నేను రావణుడిని పడగొట్టిన ప్రదేశం. అదిగో అది కుంభకర్ణుడు పడిపోయిన ప్రదేశం, అది నరాంతకుడు పడిపోయిన ప్రదేశం, ఇది హనుమ విరూపాక్షుడిని పడగొట్టిన ప్రదేశం. ఆ సముద్రంలో ఉన్న సేతువుని మేము వానరములతో కలిసి నిర్మించాము. ఇక్కడే మేమందరమూ కూర్చుని ఈ సముద్రాన్ని ఎలా దాటడం అని అనుకున్నాము. ఇదే కిష్కింద, ఇక్కడి నుంచే వానరులు అన్ని దిక్కులకి నీ జాడ కనిపెట్టడానికి బయలుదేరారు " అని చెప్తుంటే సుగ్రీవుడు గబగబా వచ్చి " రామ! మనం కిష్కింద మీద నుంచే వెళుతున్నాము కదా, నా భార్యలు తార, రుమ చూస్తుంటారు, వాళ్ళని కూడా ఎక్కించుకుందాము " అన్నాడు.

అప్పుడా పుష్పకాన్ని కిందకి దింపారు. సుగ్రీవుడు వెంటనే వెళ్ళి తార, రుమలకి విషయాన్ని చెప్పి రమ్మన్నాడు. అప్పుడు తార మిగిలిన ఆడవారి దెగ్గరికి వెళ్ళి " రండి, రండి, సుగ్రీవుడు జయాన్ని సాధించి రామ పట్టాభిషేకానికి వెళుతున్నారు. మంచి మంచి బట్టలు, ఆభరణాలు వేసుకుని అందరూ వచ్చెయ్యండి " అనింది. అప్పుడు వాళ్ళు మానవ కాంతలగా కామరూపాలని పొంది, పట్టుపుట్టాలు, ఆభరణములు వేసుకుని, పుష్పక విమానానికి ప్రదక్షిణం చేసేసి, లోపలికి ఎక్కి " సీతమ్మ ఎక్కడ? సీతమ్మ ఎక్కడ? " అని అడిగారు.  

" ఆవిడే సీతమ్మ " అని చూపిస్తే అందరూ వెళ్ళి ఆమెకి నమస్కరించారు. అప్పుడు సీతమ్మ వాళ్ళందరినీ సంతోషంగా కౌగలించుకొని, పలకరించింది.

మళ్ళి రాముడన్నాడు " సీత! అదే ఋష్యమూక పర్వతం, అక్కడే నేను సుగ్రీవుడు కలుసుకున్నాము. అది శబరి యొక్క ఆశ్రమం. అక్కడున్న చిక్కటి వనంలోనే కబంధుడిని చంపాను. చూశావ సీత, అది మనం ఉన్న పంచవటి ఆశ్రమం, ఇక్కడే రావణుడు నిన్ను అపహరించాడు " అని రాముడు చెబుతుంటే సీతమ్మ గబుక్కున రాముడి చెయ్యి పట్టుకుంది.

కొంతముందుకి వెళ్ళాక " అదే అగస్త్య మహర్షి ఆశ్రమం, ఇక్కడే అగస్త్యడు నాకు రావణ సంహారం కోసం అస్త్రాన్ని ఇచ్చాడు. అక్కడ కనపడుతున్నది సుతీక్షణుడి ఆశ్రమం. అక్కడ కనపడుతున్నది చిత్రకూట పర్వతం, ఇక్కడే మనం తిరుగుతూ ఉండేవాళ్ళము " అన్నాడు.

అలా ఆ పుష్పకం కొంత ముందుకి వెళ్ళాక వాళ్ళకి భారద్వాజ మహర్షి యొక్క ఆశ్రమం కనపడింది. అప్పుడు ఆ పుష్పకాన్ని అక్కడ దింపి, భారద్వాజుడికి నమస్కరించారు. అప్పుడు భారద్వాజుడు " రామ! నేను నా తపఃశక్తితో అన్ని కాలములయందు నీ గురించి తెలుసుకుంటున్నాను. నువ్వు రావణ సంహారం చెయ్యడం కూడా నాకు తెలుసు. ఇవ్వాళ ఒక్క రాత్రి నా దెగ్గర ఉండి, విశ్రాంతి తీసుకొని, నా ఆతిధ్యం తీసుకొని బయలుదేరు " అన్నాడు.

అప్పుడు రాముడు హనుమంతుడిని పిలిచి " హనుమ! నువ్వు ఇక్కడినుంచి బయలుదేరి వెళ్ళి, గంగానది ఒడ్డున శృంగిభేరపురంలో గుహుడు ఉంటాడు, అతను నాకు మిక్కిలి స్నేహితుడు. ఆ గుహుడికి నా క్షేమ సమాచారం చెప్పి, పట్టాభిషేకానికి రమ్మని చెప్పు. తరువాత అక్కడినుంచి బయలుదేరి అయోధ్యలో అందరూ కుశలంగా ఉన్నారా అని కనుక్కొని నందిగ్రామానికి వెళ్ళి, నేను తిరిగొస్తున్నాను అని భరతుడికి చెప్పి, ఆయన ముఖకవళికలు గమనించు. భరతుడి ముఖంలో ఏదన్నా కొంచెం బెంగ నీకు కనపడితే వెంటనే వెనక్కి వచ్చెయ్యి. ఇంక నేను అయోధ్యకి రాను, భరతుడు అయోధ్యని పాలిస్తాడు. ఈ విషయాన్ని నువ్వు జాగ్రత్తగ కనిపెట్టి తిరిగిరా " అన్నాడు.

వెంటనే హనుమంతుడు అక్కడినుంచి బయలుదేరి గుహుడిని కలుసుకొని, ఆయనని పలకరించి, రాముడు చెప్పిన విషయాన్ని చెప్పాడు. తరువాత అక్కడినుంచి బయలుదేరి వెళ్ళి భరతుడిని కలుసుకొని, రాముడు పడిన కష్టాలు, సీతాపహరణం, రావణ వధ మొదలైన విషయాలని వర్ణించి చెప్పాడు. హనుమంతుడి మాటలు విన్న భరతుడు చాలా సంతోషించాడు.

మరునాడు ఉదయం రాముడు బయలుదేరబోయేముందు భారద్వాజుడు అన్నాడు " నీ ధర్మానుష్టానికి నాకు ప్రీతి కలిగింది రామ. నీకొక వరం ఇస్తాను, ఏదన్నా కోరుకో " అన్నాడు.

అప్పుడు రాముడు " వానరములు ఎక్కడ ఉంటాయో అక్కడ ఫలసంవృద్ధి ఉండాలని నేను కోరాను. ఇప్పుడు ఇక్కడినుంచి 3 యోజనముల దూరం వరకూ అయోధ్యకి ప్రయాణిస్తాము. ఆ మార్గంలో కూడా చెట్లన్నీ ఫల పుష్పభరితములై, తేనెపట్లతో తేనెలు కారుతూ ఉండాలి " అని అడిగాడు.

తరువాత భారద్వాజుడి దెగ్గర సెలవు తీసుకొని పెద్ద కోలాహలంతో నందిగ్రామానికి రాముడు చేరుకున్నాడు.

అప్పుడు భరతుడు తన సైనికులతో " రాముడు వచ్చేస్తున్నాడు, అయోధ్యలో ఉన్న తల్లులని తీసుకురండి, రథాలని తీసుకురండి, పెద్దవాళ్ళని తీసుకురండి, అందరినీ అయోధ్యకి రమ్మనండి. అంతటా పసుపు నీరు, గంధపు నీరు జల్లించండి. దివ్యమైన ధూపములు వెయ్యండి. అందరమూ కలిసి రాముడిని నందిగ్రామం నుంచి అయోధ్యకి పట్టాభిషేకానికి తీసుకువెళదాము " అని భరతుడు ఆజ్ఞాపించాడు.

రాముడు వచ్చేస్తున్నాడన్న విషయం తెలుసుకున్న అయోధ్య వాసులు పరుగు పరుగున నందిగ్రామానికి వచ్చారు.

రాముడు పుష్పక విమానం నుంచి కిందకి దిగగానే భరతుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి అన్నగారి పాదాలకి పాదుకలు తొడిగాడు. ఇది చూసి సుగ్రీవ విభీషణులు కన్నుల నీళ్ళు కారాయి. వెంటనే భరతుడు సుగ్రీవుడిని కౌగలించుకొని " ఇంతకముందు మేము నలుగురము, ఇవ్వాల్టి నుంచి మనం అయిదుగురము అన్నదమ్ములము సుగ్రీవ " అన్నాడు. తరువాత అక్కడున్న గంధమాదుడిని, మైందుడిని మొదలైనవారిని భరతుడికి పరిచయం చేశారు. అప్పుడు భరతుడు ఆ వానరాలని ' మీరు మా అన్నయ్యకి సహాయం చేశారు, మీరు ఎంత మంచివారు ' అని అందరినీ కౌగలించుకున్నాడు.

పుష్పకం నుంచి కిందకి దిగిన వానరకాంతలు వాళ్ళ ప్రేమలని, వాళ్ళ అలంకారాలని చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడు అక్కడికి వచ్చిన కౌసల్య, కైకేయ, సుమిత్రలు అన్నారు " ఈ వానర కాంతలందరికి మేమే తలస్నానాలు చేయిస్తాము " అని, వాళ్ళందరికీ తలస్నానం చేయించారు.

తరువాత రాముడు ఆ పుష్పక విమానాన్ని " కుబేరుడి దెగ్గరికి వెళ్ళిపో " అని ఆజ్ఞాపించాడు. అప్పుడా ఆ పుష్పకం కుబేరుడి దెగ్గరికి వెళ్ళిపోయింది.

అప్పుడు భరతుడు శిరస్సున అంజలి ఘటించి రాముడితో " మా అమ్మ అయిన కైకేయి ఆనాడు రెండు వరాలు అడిగింది. ఇక్ష్వాకు వంశంలో పెద్దవాడిగా పుట్టి, రాజ్యం పొందడానికి సమస్త అర్హతలు కలిగి ఉన్న నువ్వు, తండ్రిని సత్యమునందు నిలబెట్టడం కోసం రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావు. నీ పాదుకలని న్యాసంగా ఇచ్చి నన్ను రాజ్యం చెయ్యమన్నావు. నువ్వు నాకు రాజ్యాన్ని ఎలా ఇచ్చావో, అలా ఆ రాజ్యాన్ని తీసుకొచ్చి నీ పాదాల దెగ్గర పెట్టేస్తున్నాను. నీకు ఉన్నదానిని నాకు ఇచ్చి, నేను దానిని అనుభవిస్తుంటే చూసి నువ్వు మురిసిపోయావు, అందుకని ఇవ్వాళ నేను దానిని నీకు ఇచ్చేస్తున్నాను " అన్నాడు.

భరతుడి మాటలకి సంతోషించిన రాముడు తిరిగి రాజ్యాన్ని స్వీకరించడానికి అంగీకరించాడు.

శత్రుఘ్నుడు అక్కడికి వచ్చి " అన్నయ్య! క్షుర కర్మ చేసేవారిని తీసుకొచ్చాను, నీ జుట్టు జటలు పట్టేసింది కదా అందుకని క్షుర కర్మ చేయించుకో " అన్నాడు.

అప్పుడు రాముడు " నేను తండ్రిమాట నిలబెట్టడం కోసమని నా అంత నేనుగా అరణ్యవాసానికి వెళ్ళాను. కాని, తండ్రి ఆజ్ఞాపించకపోయినా, నాయందున్న ప్రేమ చేత స్వచ్ఛందంగా తనంత తాను దీక్ష స్వీకరించి, నా పాదుకలని తీసుకెళ్ళి సింహాసనంలో పెట్టి, 14 సంవత్సరములు రాజ్యమునందు మమకారము లేకుండా పరిపాలించిన భరతుడు ముందు దీక్ష విరమించి స్నానం చేస్తే తప్ప నేను దీక్షని విరమించను " అన్నాడు.

భరతుడు, శత్రుఘ్నుడు, సుగ్రీవుడు, విభీషణుడు క్షుర కర్మ చేయించుకుని మంగళస్నానం చేశాక రాముడు క్షుర కర్మ చేయించుకుని మంగళ స్నానం చేశాడు. తరువాత రాముడు అందమైన పట్టుపుట్టములను ధరించి, మంచి అంగరాగములను పూసుకొని, దివ్యాభరణములను ధరించి బయటకి వచ్చాడు.

తన కొడుకు ఇన్నాళ్ళకి తిరిగొచ్చాడని పొంగిపోయిన కౌసల్యా దేవి సీతమ్మకి అభ్యంగన స్నానం చేయించి, మంచి పట్టుపుట్టం కట్టి చక్కగా అలంకరించింది. కౌసల్య, సుమిత్ర, కైకేయల చేత అలంకరింపబడ్డ వానర కాంతలు 9000 ఏనుగుల్ని ఎక్కారు. దశరథుడు ఎక్కే శత్రుంజయం అనే ఏనుగుని తీసుకొచ్చి దానిమీద సుగ్రీవుడిని ఎక్కించారు. వానరులందరూ కూడా సంతోషంగా అయోధ్యకి బయలుదేరారు. సూర్యమండల సన్నిభమైన రథాన్ని రాముడు ఎక్కాడు, ఆ రథం యొక్క పగ్గములను భరతుడు పట్టుకొని నడిపించాడు. లక్ష్మణుడు నూరు తీగలు కలిగిన తెల్లటి గొడుగుని పట్టాడు. ఒకపక్క శత్రుఘ్నుడు మరొకపక్క విభీషణుడు వింద్యామర వేస్తున్నారు. అలా రథంలో అయోధ్యకి వెళుతున్న రాముడు కనపడ్డ వాళ్ళందరినీ పలకరించుకుంటూ వెళ్ళాడు.

ప్రతి ఇంటిమీద పతాకాలు ఎగురవేశారు, అన్ని ఇళ్ళముందు రంగవల్లులు వేశారు, సంతోషపడిపోతూ, నాట్యం చేస్తూ అందరూ వెళుతున్నారు. ఆ వెళ్ళేటప్పుడు ముందుగా మంగళ వాయిద్యాలు నడిచాయి, ఆ వెనకాల వేద పండితులు నడిచారు, తరువాత పెద్దలు, వాళ్ళ వెనకాల కన్నె పిల్లలు, కొంతమంది స్త్రీలు పిండివంటలు పట్టుకుని నడిచారు. మార్గమధ్యంలో గంధపు నీరు జల్లుకుంటూ వెళ్ళారు. ఆ తరువాత సువాసినులు అయిన స్త్రీలు చేతులలో పువ్వులు, పసుపు, కుంకుమ పట్టుకుని వెళ్ళారు. వశిష్ఠుడు, జాబాలి, కాశ్యపుడు, గౌతముడు మొదలైన ఋషులందరూ వచ్చారు. అలా అందరూ కలిసి అయోధ్యకి చేరుకున్నారు. ఆ రాత్రికి అయోధ్యలో గడిపాక మరునాడు రాముడి పట్టాభిషేకానికి 4 సముద్ర జలాలు, 500 నదుల జలాలని వానరాలు తీసుకొచ్చాయి. ఇంద్రుడు నూరు బంగారు పూసలు కలిగిన మాలని రాముడికి బహూకరించాడు.

వానరాలు తీసుకోచ్చిన ఆ జాలలని రాముడి మీద పోసి ఆయనకి పట్టాభిషేకం చేశారు. కిరీటాన్ని తీసుకొచ్చి రాముడి శిరస్సున అలంకారం చేశారు. ఆ సమయంలో రాముడు కొన్ని కోట్ల బంగారు నాణాలు, లక్షల ఆవులు, వేల ఎద్దులు దానం చేశాడు.

అప్పుడు రాముడు లక్ష్మణుడితో " లక్ష్మణా! యువరాజ పట్టాభిషేకం చేసుకో " అన్నాడు.

అప్పుడు లక్ష్మణుడు " అన్నయ్య! నాకన్నా పెద్దవాడు భరతుడు ఉన్నాడు. నాకు రాజ్యం వద్దు, భరతుడికి ఇవ్వు " అన్నాడు.

తరువాత యువరాజ పట్టాభిషేకం భరతుడికి జెరిగింది.

సుగ్రీవుడు, విభీషణుడు, అంగదుడు మొదలైన వానర వీరులందరికీ బహుమతులు ఇచ్చారు. హనుమంతుడికి తెల్లటి వస్త్రముల ద్వయం, హారాలు ఇచ్చారు.

ఆ సమయంలో, సీతమ్మ తన మెడలో ఉన్న ఒక హారాన్ని తీసి చేతిలో పట్టుకుంది. అప్పుడు రాముడు సీత వంక చూసి " ఈ హారాన్ని ఎవరికి ఇస్తావో తెలుసా. పౌరుషము, బుద్ధి, విక్రమము, తేజస్సు, వీర్యము, పట్టుదల, పాండిత్యము ఎవడిలో ఉన్నాయో, అటువంటివాడికి ఈ హారాన్ని కానుకగా ఇవ్వు, అన్నిటినీమించి వాడు నీ అయిదోతనానికి కారణం అయ్యి ఉండాలి " అన్నాడు.

అప్పుడు సీతమ్మ ఆ హారాన్ని హనుమంతుడికి ఇచ్చింది. అప్పుడాయన ఆ హారాన్ని కన్నులకు అద్దుకొని మెడలో వేసుకున్నాడు.

ఎప్పుడైతే ధర్మాత్ముడైన రాముడు సింహాసనం మీద కూర్చున్నాడో, అప్పుడు ఎవరినోట విన్నా' రాముడు, రాముడు ' తప్ప, వేరొక మాట వినపడలేదు. రాముడు రాజ్యం చేస్తుండగా దొంగల భయం లేదు, శత్రువుల భయం లేదు, నెలకి మూడు వానలు పడుతుండేవి, భూమి సస్యశ్యామలంగా పంటలని ఇచ్చింది, చెట్లన్నీ ఫలపుష్పములతో నిండిపోయి ఉండేవి, చాతుర్వర్ణ ప్రజలు తమ తమ ధర్మములయందు అనురక్తులై ఉన్నారు, చిన్నవాళ్ళు మరణిస్తే పెద్దవాళ్ళు ప్రేతకార్యం చెయ్యడం రామ రాజ్యంలో లేదు. ఆ రాముడి పరిపాలనలో అందరూ సంతోషంగా ఉండేవారు.

రామాయణం యొక్క ఫలశ్రుతి -

ఎక్కడెక్కడ రామాయణం చెబుతున్నప్పుడు బుద్దిమంతులై, పరమ భక్తితో రామాయణాన్ని ఎవరైతే వింటున్నారో అటువంటివారికి శ్రీ మహావిష్ణువు యొక్క కృప చేత తీరని కోరికలు ఉండవు. ఉద్యోగం చేస్తున్నవారు, వ్యాపారం చేస్తున్నవారు ఆయా రంగములలో రాణిస్తారు. సంతానం లేని రజస్వలలైన స్త్రీలు ఈ రామాయణాన్ని వింటె, వాళ్ళకి గొప్ప పుత్రులు పుడతారు, తమ బిడ్డలు వృద్ధిలోకి వస్తుంటే చూసుకొని ఆ తల్లులు ఆనందం పొందుతారు. వివాహము కానివారికి వివాహము జెరుగుతుంది, కుటుంబం వృద్ధిలోకి వస్తుంది, వంశము నిలబడుతుంది, మంచి పనులకి డబ్బు వినియోగం అవుతుంది, దూరంగా ఉన్న బంధువులు తొందరలో వచ్చి కలుసుకుంటారు, ఇంటికి మంగళతోరణం కట్టబడుతుంది, ఎన్నాళ్ళనుంచో జెరగని శుభకార్యాలు జెరుగుతాయి, పితృదేవతలు సంతోషిస్తారు.

 --------------------------------------------------------------------------------------------------------

అందరూ రామాయణాన్ని చదివి ఆనందించండి. 

రామాయణం పూర్తయ్యింది

Jai Shri Krishna

Excellent information about Bhagwan Shri Krishna: 1) Krishna was born *5252 years ago*  2) Date of *Birth* : *18th July,3228 B.C* 3) Month ...