Thursday, May 27, 2021

*నుదుటన బొట్టుతో ఎంత ప్రయోజనమో!!*🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

*నుదుటన బొట్టుతో ఎంత ప్రయోజనమో!!*
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

మన హైందవ ధర్మంలో ముఖాన బొట్టుకి విశేషమైన ప్రాధాన్యత ఉంది. పొడుగుదైనా, గుండ్రటిదైనా బొట్టు ఉండాలి. బొట్టులేని ముఖము.. ముగ్గులేని ఇల్లు ఒకటేనని అంటుంటారు. అంటే బొట్టు ఎవరైతే పెట్టుకోరో వారి ముఖము, ఇంటి ముందు ఎవరైతే ముగ్గు వేయరో ఆ ఇల్లు.. రెండూ శ్మశానంతో సమానం

అని పెద్దలు చెబుతూ ఉంటారు. కాబట్టి ఇంటిముందు ముగ్గు లేకపోతే దరిద్రదేవత ఏ విధంగా ఇంట్లో తాండవం చేస్తుందో అదే విధంగా ముఖాన బొట్టు పెట్టుకోకపోతే ఆ ముఖంలో శనిదేవుడు....దరిద్రదేవత తాండవం చేస్తాడు అని పెద్దల అభిప్రాయం. శనీశ్వరుడు, దరిద్రదేవతగా పిలువబడే జ్యేష్టదేవి ఇద్దరూ భార్యా భర్తలే, కాబట్టి ఒకరు ఉంటే రెండోవారు కూడా ఖచ్చితంగా ఉంటారు. అదేవిధంగా లక్ష్మీదేవి ఎక్కడ ఉంటే అక్కడ నారాయణుడు ఉంటాడు. వారిద్దరూ ఐశ్వర్యాన్ని కలిగిస్తారు. కాబట్టి ముఖానికి బొట్టు కచ్చితంగా పెట్టుకోవాలి.

ఎవరైనా మన ముఖాన్ని చూసినప్పుడు వారి కంటి నుండి వచ్చేటటువంటి 'న'-కారాత్మక శక్తి దీనినే ఆంగ్లంలో నెగెటివ్ ఎనర్జీ అంటారు, అది మనపై పడుతుంది. నరుడి కంటి చూపుకి నల్లరాయి కూడా పగిలిపోతుంది అని సామెత. మన ఎదురుగా ఉండే వారు..మన ముఖాన్ని చూస్తే వారి చూపులో ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ మన కనుబొమ్మల రెండింటికీ మధ్య స్థానంలో కేంద్రీకృతమవుతుంది. మన శరీరంలో ఉండే నాడులలో కొన్ని సున్నితమైనటువంటివి రెండు కనుబొమ్మలకు మధ్యభాగంలో ఉంటాయి.

ఎప్పుడైతే 'న'-కారాత్మకశక్తి ఉన్న దృష్టి మనమీద పడిందో.. అటువంటి సున్నితమైన నాడులు ఒత్తిడికి గురవుతూ ఉంటాయి. ఆ నాడులు మెదడుకు అనుసంధానమై ఉంటాయి. కాబట్టి మెదడుపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది మెదడు దెబ్బ తినడం అంటే మెదడు మీద ఒత్తిడి పెరుగుతుంది. తద్వారా మనకు తలనొప్పి వస్తుంది. మనఃశాంతిపోతుంది. చిరాకు వస్తుంది. ఏ విషయంపైనా సరిగా దృష్టి పెట్టలేము. ఎదుటివారి కంటిచూపు నుండి మనమెదడును, మేధాశక్తిని, మనకు ఉన్న పాజిటివ్ ఎనర్జీని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా వారి చూపులకు మన కనుబొమ్మల మధ్య భాగానికి మధ్య ఏదైనా అడ్డంగా పెట్టాలి. అందుకే బొట్టు అనేది పెట్టాలని అది అలంకారంగా కూడా పనికివస్తుందని పూర్వులు పవిత్రమైన కుంకుమ బొట్టును ఆచారంగా సూచించారు. బొట్టు పెట్టుకున్నామంటే ఎదురుగా ఉండేటటువంటి వారి చూపు మన నుదుట మీద పడినా కూడా మన సున్నితమైనటువంటి నాడులకు ప్రమాదం లేకుండా అది అడ్డుకుంటుంది. తద్వారా మన శక్తి మన దగ్గరే ఉంటుంది. మనలోని జ్ఞాపకశక్తి, మేధాశక్తి అన్ని రకాలయినటువంటి విశేషమైనటువంటి శక్తులు మన దగ్గరే ఉంటాయి. ఎటువంటి ఒత్తిడికి లోను కావు. మనల్ని కాపాడుతూ ఉంటాయి. మన అభివృద్ధికి తోడ్పడతాయి. అందుకని బొట్టు ఖచ్చితంగా పెట్టుకోవాలి. సైన్సు ప్రకారం కూడా ఇది నిరూపించడం జరిగింది. అందుకని ఎప్పుడైనా సరే చక్కగా బొట్టు పెట్టుకోవాలి. 

కాగా, ఋణ బాధలు ఉన్న వారు నాగసిందూరాన్ని బొట్టుగా ధరించాలని కొందరు పెద్దలు చెబుతుంటారు. ఆబొట్టు పెట్టుకోవడం వలన ఋణబాధలు అన్నీ కూడా తొలగిపోతాయని నమ్మకం. అదే విధంగా సర్పదోషాలు, నాగదోషాలు ఏమైనా ఉంటే అవి కూడా తొలగిపోవడానికి, ఎక్కువగా మనఃశాంతి లేక ఇంట్లో గొడవలు ఎక్కువగా అవుతుంటే ఆరావళి కుంకుమను బొట్టుగా ధరించాలనేది కొంతమంది సూచించే పరిహారం. 

మన హైందవ ధర్మానికి పట్టుకొమ్మలు మన ఆచారాలే. ఆ ఆచారాలను కనుక మనం అనుసరిస్తే హైందవ ధర్మం రక్షణను మనం పొందగలుగుతాం అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇవన్నీ కూడా పెద్దవారు మనకు ఏర్పాటు చేసిన బంగారు బాటలు.

*సేకరణ*
ఆధ్యాత్మిక భక్తిప్రపంచం

_A Landmark Supreme Court Judgment Every Lift User Should Know._* 30th July 2026

*_A Landmark Supreme Court Judgment Every Lift User Should Know._* Millions of Indians use elevators every day—in apartment complexes, offic...