Wednesday, February 26, 2020

శ్రీమద్భగవద్గీతపదునారవ అధ్యాయముదైవాసురసంపద్విభాగయోగముశ్రీ భగవానువాచఅభయం సత్త్వసంశుద్ధిః జ్ఞానయోగవ్యవస్థితిః |దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవమ్ ||

శ్రీమద్భగవద్గీత

పదునారవ అధ్యాయము

దైవాసురసంపద్విభాగయోగము

శ్రీ భగవానువాచ

అభయం సత్త్వసంశుద్ధిః జ్ఞానయోగవ్యవస్థితిః |
దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవమ్ ||        1

అహింసా సత్యమక్రోధః త్యాగః శాన్తిరపైశునమ్ |
దయా భూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలమ్ ||        2

తేజః క్షమా ధృతిః శౌచమ్ అద్రోహో నాతిమానితా |
భవన్తి సంపదం దైవీమ్ అభిజాతస్య భారత ||            3

శ్రీ భగవానుడు: అర్జునా! భయం లేకపోవడం, చిత్తశుద్ధి, జ్ఞానయోగనిష్ఠ, దానం, ఇంద్రియనిగ్రహం, యజ్ఞం, వేదపఠనం, తపస్సు, సరళస్వభావం, అహింస, సత్యం, కోపంలేకపోవడం, త్యాగబుద్ధి, శాంతి, చాడీలు చెప్పకపోవడం, భూతదయ, విషయసుఖాలు వాంఛించకపోవడం, మృదుత్వం, సిగ్గు, చపలత్వం లేకపోవడం, తేజస్సు, ఓర్పు, ధైర్యం, శుచిత్వం, ద్రోహం చేయకపోవడం, దురభిమానం లేకపోవడం- ఈ ఇరవై ఆరు సుగుణాలూ దేవతల సంపదవల్ల పుట్టినవాడికి కలుగుతాయి.

దంభో దర్పో௨భిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ |
అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీమ్ ||            4

పార్థా! రాక్షస సంపదలో పుట్టినవాడి లక్షణాలు ఇవి: కపటం, గర్వం, దురహంకారం, కోపం, కఠినత్వం, అవివేకం.

దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీ మతా |
మా శుచః సంపదం దైవీమ్ అభిజాతో௨సి పాండవ ||        5

దైవసంపద మూలంగా మోక్షమూ, అసుర సంపదవల్ల సంసారబంధమూ కలుగుతాయి. అర్జునా! నీవు దైవసంపదలోనే జన్మించావు. కనుక విచారించనక్కరలేదు.

ద్వౌ భూతసర్గౌ లోకే௨స్మిన్ దైవ ఆసుర ఏవ చ |
దైవో విస్తరశః ప్రోక్తః ఆసురం పార్థ మే శృణు ||        6

అర్జునా! ఈ లోకంలో ప్రాణుల సృష్టి దైవమనీ, ఆసురమనీ రెండురకాలు. దైవసంపద గురించి వివరంగా ఇదివరకే చెప్పాను. ఇక ఆసుర సంపద గురించి విను.

ప్రవృత్తిం చ నివృత్తిం చ జనా న విదురాసురాః |
న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే ||            7

అసురస్వభావం కలిగినవాళ్ళకు చేయదగ్గదేదో, చేయకూడనిదేదో తెలియదు. వాళ్ళలో శుచిత్వం, సదాచారం, సత్యం కనుపించవు.

అసత్యమప్రతిష్ఠం తే జగదాహురనీశ్వరమ్ |
అపరస్పరసంభూతం కిమన్యత్కామహైతుకమ్ ||            8

ఈ జగత్తు అసత్యమనీ, ఆధారమూ, అధిపతీ లేనిదనీ, కామవశంలో స్త్రీ పురుషుల కలయిక తప్ప సృష్టికి మరోకారణం లేదనీ వాళ్ళు వాదిస్తారు.

ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానో௨ల్పబుద్ధయః |
ప్రభవన్త్యుగ్రకర్మాణః క్షయాయ జగతో௨హితాః ||        9

అలాంటి నాస్తికులు –ఆత్మను కోల్పోయిన అల్పబుద్ధులు –ఘోరకృత్యాలుచేసే లోకకంటకులు, ప్రపంచ వినాశానికి పుడతారు.

కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్వితాః |
మోహాద్గృహీత్వాసద్గ్రాహాన్ ప్రవర్తంతే௨శుచివ్రతాః ||        10

వాళ్ళు అంతూదరీలేని కోరికలతో, ఆడంబరం, గర్వం, దురభిమానమనే దుర్గుణాలతో, అవివేకంవల్ల దుష్టభావాలతో దురాచారులై తిరుగుతారు.

చింతామపరిమేయాం చ ప్రలయాన్తాముపాశ్రితాః |
కామోపభోగపరమాః ఏతావదితి నిశ్చితాః ||                11

ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధపరాయణాః |
ఈహన్తే కామభోగార్థమ్ అన్యాయేనార్థసంచయాన్ ||        12

వాళ్ళు మృతిచెందేవరకూ వుండే మితిలేని చింతలతో కామభోగాలను అనుభవించడమే పరమావధిగా భావించి, అంతకు మించిందేదీ లేదని నమ్ముతారు. ఎన్నో ఆశాపాశాలలో చిక్కుకుని కామక్రోధాలకు వశులై విషయసుఖాలను అనుభవించడంకోసం అక్రమ ధనార్జనకు పూనుకుంటారు.

ఇదమద్య మయా లబ్ధమ్ ఇమం ప్రాప్స్యే మనోరథమ్ |
ఇదమస్తీదమపి మే భవిష్యతి పునర్ధనమ్ ||                13

అసౌ మయా హతః శత్రుః హనిష్యే చాపరానపి |
ఈశ్వరో௨హమహం భోగీ సిద్ధో௨హం బలవాన్ సుఖీ ||        14

ఆఢ్యో௨భిజనవానస్మి కో௨న్యో௨స్తి సదృశో మయా |
యక్ష్యే దాస్యామి మోదిష్యే ఇత్యజ్ఞానవిమోహితాః ||            15

అనేకచిత్తవిభ్రాంతాః మోహజాలసమావృతాః |
ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకే௨శుచౌ ||            16

“ ఈవేళ నా కిది లభించింది. ఇక ఈ కోరిక నెరవేరుతుంది. నా కింత ఆస్తి వున్నది. మరింత సంపాదించబోతున్నాను. ఈ శత్రువును చంపేశాను. మిగిలిన శత్రువులను కూడ సంహరిస్తాను. నేను ప్రభువును, సుఖభోగిని, తలపెట్టినపని సాధించే సమర్థుణ్ణి, బలవంతుణ్ణి సుఖవంతుణ్ణి. నేను డబ్బున్న వాణ్ణి. ఉన్నత వంశంలో ఉద్భవించాను. నాకు సాటి అయిన వాడెవడూ లేడు. నేను యజ్ఞాలు చేస్తాను, దానాలిస్తాను, ఆనందం అనుభవిస్తాను.” అని వాళ్ళు అజ్ఞానంలో అనేకవిధాల కలవరిస్తారు. మోహవశులైన ఆ అసురస్వభావం కలిగినవాళ్ళు నిరంతరం కామభోగాలలోనే చిక్కుకుని చివరకు ఘోరనరకాల పాలవుతారు.

ఆత్మసంభావితాః స్తబ్ధా ధనమానమదాన్వితాః |
యజన్తే నామయజ్ఞైస్తే దంభేనావిధిపూర్వకమ్ ||            17

తమను తామే పొగడుకుంటూ, వినయ విధేయతలు లేకుండా, ధనమద గర్వంతో వాళ్ళు శాస్త్రవిరుద్ధంగా పేరుకు మాత్రం యజ్ఞాలు చేస్తారు.

అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః |
మామాత్మపరదేహేషు ప్రద్విషన్తో௨భ్యసూయకాః ||        18

అహంకారం, బలం, గర్వం, కామం, క్రోధం –వీటిని ఆశ్రయించి అసూయాపరులైన వీళ్ళు తమ శరీరంలోనూ, ఇతరుల శరీరాలలోనూ వుంటున్న నన్ను ద్వేషిస్తారు.

తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ |
క్షిపామ్యజస్రమశుభాన్ ఆసురీష్వేవ యోనిషు ||            19

ద్వేషపూరితులు, పాపచరితులు, క్రూరస్వభావులు అయిన అలాంటి మానవాధములను మళ్ళీ మళ్ళీ సంసారంలోనే పడవేస్తుంటాను.

ఆసురీం యోనిమాపన్నాః మూఢా జన్మని జన్మని |
మామప్రాప్యైవ కౌంతేయ తతో యాంత్యధమాం గతిమ్ ||        20

కౌంతేయా! అసురజన్మ పొందే అలాంటి మూర్ఖులు ఏ జన్మలోనూ నన్ను చేరలేకపోవడమే కాకుండా అంతకంతకీ అధోగతి పాలవుతారు.

త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః |
కామః క్రోధస్తథా లోభః తస్మాదేతత్త్రయం త్యజేత్ ||        21

కామం, క్రోధం, లోభం –ఈ నరక ద్వారాలు మూడూ ఆత్మవినాశానికి కారణాలు. అందువల్ల ఈ మూడింటినీ విడిచిపెట్టాలి.

ఏతైర్విముక్తః కౌంతేయ తమోద్వారైఃత్రిభిర్నరః |
ఆచరత్యాత్మనః శ్రేయః తతో యాతి  పరాం గతిమ్ ||        22

కౌంతేయా! ఈ మూడు దుర్గుణాలనూ విసర్జించినవాడు తనకు తాను మేలు చేసుకుని పరమపదం పొందుతాడు.

యః శాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారతః |
న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిమ్ ||            23

శాస్త్రవిధులను విడిచిపెట్టి తన ఇష్టానుసారం ప్రవర్తించేవాడు తత్వజ్ఞానంకాని, సుఖంకాని, మోక్షంకాని పొందడు.

తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యవ్యవస్థితౌ |
జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తుమిహార్హసి ||            24

అందువల్ల చేయదగ్గదేదో, చేయకూడనిదేదో నిర్ణయించుకోవడంలో నీకు శాస్త్రమే ప్రమాణం. శాస్త్రవిధానాలను తెలుసుకుని తదనుగుణంగా ఈ లోకంలో నీవు కర్మలు చేయాలి.

ఇలా ఉపనిషత్తులు, బ్రహ్మవిద్య, యోగశాస్త్రం, శ్రీకృష్ణార్జున సంవాదం అయిన శ్రీమద్భగవద్గీతలోని "దైవాసురసంపద్విభాగయోగము" అనే పదునారవ అధ్యాయం సమాప్తం.

ఉదయం లేచిన వెంటనే మనం ఎవరిని చూస్తే ఆ రోజు అలాగే సాగుతుందనే నమ్మకం చాలామందిలో ఉంటుంది

ఉదయం లేచిన వెంటనే మనం ఎవరిని చూస్తే ఆ రోజు అలాగే సాగుతుందనే నమ్మకం చాలామందిలో ఉంటుంది. 


అందుకే ప్రతి రోజు శుభప్రదంగా ఉండాలంటే ఉదయాన్నే వేటిని చూస్తే శుభం కలుగుతుందో, వేటిని చూడకుండా ఉండటం మంచిదో తెలుసుకుందాం. 

సుమంగళినీ, గోవునూ, వేదవేత్తనూ, అగ్నిహోత్రాన్ని చూసిన శుభ ఫలము కలుగును. నది, సముద్రం, సరస్తులు చూస్తే దోషాలు పోతాయి. పెరుగూ, నెయ్యి, ఆవాలు, అద్దం చూస్తే అశుభంగా తలుస్తారు. ఇక ఉదయం లేవగానే పదిదోసిళ్ళ నీరు త్రాగితే మంచిది. అలా చేయటం వల్ల నిత్యం యవ్వనంతో ఉంటారు. ఇంట్లో పెద్దవాళ్ళకీ, పిల్లలకి ఉదయాన్నే నీళ్ళు తాగటం అలవాటు చేస్తే వారు జీవితాంతం అజీర్తి, మూత్రపిండాల వ్యాధులతో బాధపడకుండా ఉండగలుగుతారు. రాగి చెంబుతో నీరు తాగితే మలబద్దకం ఉండదని ఆయుర్వేదం చెబుతోంది. -

శ్రీమద్భగవద్గీతపదునైదవ అధ్యాయముపురుషోత్తమప్రాప్తియోగముశ్రీ భగవానువాచఊర్ధ్వమూలమధశ్శాఖమ్ అశ్వత్థం ప్రాహురవ్యయమ్ |ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ ||

శ్రీమద్భగవద్గీత

పదునైదవ అధ్యాయము

పురుషోత్తమప్రాప్తియోగము

శ్రీ భగవానువాచ

ఊర్ధ్వమూలమధశ్శాఖమ్ అశ్వత్థం ప్రాహురవ్యయమ్ |
ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ ||            1

శ్రీ భగవానుడు: వేదాలు ఆకులుగా వేళ్ళు పైకి, కొమ్మలు క్రిందకి వుండే సంసారమనే అశ్వత్థవృక్షం (రావి చెట్టు) నాశం లేనిదని చెబుతారు. ఇది తెలుసుకున్నవాడే వేదార్థం ఎరిగినవాడు.

అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖాః
గుణప్రవృద్ధా విషయప్రవాళాః |
అధశ్చ మూలాన్యనుసంతతాని
కర్మానుబంధీని మనుష్యలోకే ||                    2

ఈ సంసారవృక్షం కొమ్మలు గుణాలవల్ల పెంపొందుతూ విషయసుఖాలే చిగుళ్ళుగా క్రిందకీ మీదకీ విస్తరిస్తాయి. మానవలోకంలో ధర్మాధర్మ కర్మబంధాలవల్ల దానివేళ్ళు దట్టంగా క్రిందకి కూడా వ్యాపిస్తాయి.

న రూపమస్యేహ తథోపలభ్యతే
నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠా |
అశ్వత్థమేనం సువిరూఢమూలమ్
అసంగశస్త్రేణ దృఢేన ఛిత్త్వా ||                        3

తతః పదం తత్పరిమార్గితవ్యం
యస్మిన్‌గతా న నివర్తంతి భూయః |
తమేవ చాద్యం పురుషం ప్రపద్యే
యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ ||                    4

ఈ సంసారవృక్షం స్వరూపంకాని, ఆదిమధ్యాంతాలుకాని ఈ లోకంలో ఎవరికీ తెలియవు. లోతుగా నాటుకున్న వేళ్ళతో విలసిల్లుతున్న ఈ అశ్వత్థ వృక్షాన్ని వైరాగ్యమనే ఖడ్గంతో ఖండించివేశాక, పునర్జన్మ లేకుండా చేసే పరమపదాన్ని వెదకాలి. ఆనాదిగా ఈ సంసారవృక్షం విస్తరించడానికి కారకుడైన ఆదిపురుషుణ్ణి – పరమాత్మను శరణుపొందాలి.

నిర్మానమోహా జితసంగదోషా
అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః |
ద్వంద్వైర్విముక్తాః సుఖదుఃఖసంజ్ఞైః
గచ్ఛంత్యమూఢాః పదమవ్యయం తత్ ||                5

అభిమానం, అవివేకం లేకుండా, అనురాగదోషాన్ని జయించి, ఆత్మజ్ఞానతత్పరులై, కోరికలన్నిటినీ విడిచిపెట్టి, సుఖదుఃఖాది ద్వంద్వాలకు అతీతులైన జ్ఞానులు శాశ్వతమైన ఆ బ్రహ్మపదాన్ని పొందుతారు.

న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః |
యద్గత్వా న నివర్తంతే తద్దామ పరమం మమ ||            6

దాన్ని సూర్యుడుకాని, చంద్రుడుకాని, అగ్నికాని ప్రకాశింపచేయ లేరు. దేనిని పొందితే మళ్ళీ సంసారానికి రానక్కరలేదో అలాంటి పరంధామం నాది.

మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః |
మనఃషష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి ||            7

నాలోని శాశ్వతమైన ఒక అంశమే మానవలోకంలో జీవాత్మగా పరిణమించి ప్రకృతిలోని జ్ఞానేంద్రియాలనూ, మనస్సునూ ఆకర్షిస్తుంది.

శరీరం యదవాప్నోతి యచ్ఛాప్యుత్క్రామతీశ్వరః |
గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధానివాశయాత్ ||            8

వాయువు పువ్వులనుంచి వాసనలను తీసుకుపోయేటట్లుగా జీవుడు శరీరాన్ని ధరించేటప్పుడూ, విడిచిపెట్టేటప్పుడూ ఇంద్రియాలనూ, మనస్సునూ వెంటబెట్టుకు పోతాడు.

శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ |
అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే ||                9

ఈ జీవుడు చెవి, కన్ను, చర్మం, నాలుక, ముక్కు అనే ఐదు జ్ఞానేంద్రియాలనూ, మనస్సునూ ఆశ్రయించి శబ్దాది విషయాలను అనుభవిస్తాడు.

ఉత్క్రామంతం స్థితం వాపి భుఞ్జానం వా గుణాన్వితమ్ |
విమూఢా నానుపశ్యన్తి పశ్యన్తి జ్ఞానచక్షుషః ||        10

మరో శరీరాన్ని పొందుతున్నప్పుడూ, శరీరంలో వున్నప్పుడూ, విషయాలను అనుభవిస్తున్నప్పుడూ, గుణాలతోకూడి వున్నప్పుడూ కూడా ఈ జీవాత్మను మూఢులు చూడలేరు. జ్ఞానదృష్టి కలిగినవాళ్ళు మాత్రమే చూడగలుగుతారు.

యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితమ్ |
యతంతో௨ప్యకృతాత్మనో నైనం పశ్యంత్యచేతసః ||            11

ప్రయత్నం సాగించే యోగులు తమలోని పరమాత్మను దర్శిస్తారు. ఆత్మసంస్కారంలేని అవివేకులు ప్రయత్నించినా ఈ జీవాత్మను తిలకించలేరు.

యదాదిత్యగతం తేజో జగద్భాసయతే௨ఖిలమ్ |
యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకమ్ ||            12

సూర్యుడిలో వుండి జగత్తునంతటినీ ప్రకాశింపచేసే తేజస్సూ, చంద్రుడిలో, అగ్నిలోవుండే తేజస్సూ నాదే అని తెలుసుకో.

గామావిశ్య చ భుతాని ధారయామ్యహమోజసా |
పుష్ణామి చౌషదీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః ||    13

నేను భూమిలో ప్రవేశించి నా ప్రభావంతో సర్వభూతాలనూ ధరిస్తున్నాను. అమృతమయుడైన చంద్రుడిగా సమస్త సస్యాలనూ పోషిస్తున్నాను.

అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః |
ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్ ||        14

“ వైశ్వానరుడు”  అనే జఠరాగ్నిరూపంతో సకలప్రాణుల శరీరాలలోనూ వుండి ప్రాణాపానవాయువులతో కలసి, నాలుగు రకాల ఆహారాలను జీర్ణం చేస్తున్నాను.

సర్వస్య చాహం హృది సన్నివిష్టో
మత్తః స్మృతిర్ జ్ఞానమపోహనం చ |
వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో
వేదాన్తకృద్వేదవిదేవ చాహమ్ ||                    15

సర్వప్రాణుల హృదయాలలో వున్న నా వల్లనే జ్ఞాపకం, జ్ఞానం, మరపు కలుగుతాయి. వేదాలన్నిటివల్ల తెలుసుకోవలసిన వాణ్ణి నేనే. వేదాంతాలకు కర్తనూ, వేదాలను ఎరిగినవాణ్ణీ నేనే.

ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ |
క్షరః సర్వాణి భుతాని కూటస్థో௨క్షర ఉచ్యతే ||            16

ఈ లోకంలో క్షరుడనీ, అక్షరుడనీ ఇద్దరు పురుషులున్నారు. నశించే సమస్తప్రాణుల సముదాయాన్ని క్షరుడనీ మార్పులేని జీవుణ్ణి అక్షరుడనీ అంటారు.

ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః |
యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః ||                17

ఈ వుభయులకంటే ఉత్తముడు నాశనంలేని ఈశ్వరుడిగా మూడు లోకాలలోనూ వ్యాపించి, వాటిని పాలిస్తున్న పరమాత్మ.

యస్మాత్ క్షరమతీతో௨హమక్షరాదపి చోత్తమః |
అతో௨స్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః ||            18

నేను క్షరుడిని మించినవాడినీ, అక్షరుడికంటే ఉత్తముడినీ కావడం వల్ల లోకంలోనూ, వేదాలలోనూ పురుషోత్తముడిగా ప్రసిద్ధి పొందాను.

యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమమ్ |
స సర్వవిద్భజతి మాం సర్వభావేన భారత ||                19

అర్జునా! అజ్ఞానం లేకుండా అలా నన్ను పురుషోత్తముడిగా తెలుసుకునేవాడు సర్వజ్ఞుడై అన్నివిధాల నన్నే ఆరాధిస్తాడు.

ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయానఘ |
ఏతద్‌బుద్ధ్వా బుద్ధిమాన్‌స్యాత్ కృతకృత్యశ్చ భారత ||        20

అర్జునా! అతిరహస్యమైన ఈ శాస్త్రాన్ని నీకు చెప్పాను. దీన్ని బాగా తెలుసుకున్నవాడు బుద్ధిమంతుడూ, కృతార్థుడూ అవుతాడు.

ఇలా ఉపనిషత్తులు, బ్రహ్మవిద్య, యోగశాస్త్రం, శ్రీకృష్ణార్జున సంవాదం అయిన శ్రీమద్భగవద్గీతలోని "పురుషోత్తమప్రాప్తియోగము" అనే పదునైదవ అధ్యాయం సమాప్తం.

Monday, February 24, 2020

శ్రీమద్భగవద్గీతపదునైదవ అధ్యాయముపురుషోత్తమప్రాప్తియోగముశ్రీ భగవానువాచఊర్ధ్వమూలమధశ్శాఖమ్ అశ్వత్థం ప్రాహురవ్యయమ్ |ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ ||

శ్రీమద్భగవద్గీత

పదునైదవ అధ్యాయము

పురుషోత్తమప్రాప్తియోగము

శ్రీ భగవానువాచ

ఊర్ధ్వమూలమధశ్శాఖమ్ అశ్వత్థం ప్రాహురవ్యయమ్ |
ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ ||            1

శ్రీ భగవానుడు: వేదాలు ఆకులుగా వేళ్ళు పైకి, కొమ్మలు క్రిందకి వుండే సంసారమనే అశ్వత్థవృక్షం (రావి చెట్టు) నాశం లేనిదని చెబుతారు. ఇది తెలుసుకున్నవాడే వేదార్థం ఎరిగినవాడు.

అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖాః
గుణప్రవృద్ధా విషయప్రవాళాః |
అధశ్చ మూలాన్యనుసంతతాని
కర్మానుబంధీని మనుష్యలోకే ||                    2

ఈ సంసారవృక్షం కొమ్మలు గుణాలవల్ల పెంపొందుతూ విషయసుఖాలే చిగుళ్ళుగా క్రిందకీ మీదకీ విస్తరిస్తాయి. మానవలోకంలో ధర్మాధర్మ కర్మబంధాలవల్ల దానివేళ్ళు దట్టంగా క్రిందకి కూడా వ్యాపిస్తాయి.

న రూపమస్యేహ తథోపలభ్యతే
నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠా |
అశ్వత్థమేనం సువిరూఢమూలమ్
అసంగశస్త్రేణ దృఢేన ఛిత్త్వా ||                        3

తతః పదం తత్పరిమార్గితవ్యం
యస్మిన్‌గతా న నివర్తంతి భూయః |
తమేవ చాద్యం పురుషం ప్రపద్యే
యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ ||                    4

ఈ సంసారవృక్షం స్వరూపంకాని, ఆదిమధ్యాంతాలుకాని ఈ లోకంలో ఎవరికీ తెలియవు. లోతుగా నాటుకున్న వేళ్ళతో విలసిల్లుతున్న ఈ అశ్వత్థ వృక్షాన్ని వైరాగ్యమనే ఖడ్గంతో ఖండించివేశాక, పునర్జన్మ లేకుండా చేసే పరమపదాన్ని వెదకాలి. ఆనాదిగా ఈ సంసారవృక్షం విస్తరించడానికి కారకుడైన ఆదిపురుషుణ్ణి – పరమాత్మను శరణుపొందాలి.

నిర్మానమోహా జితసంగదోషా
అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః |
ద్వంద్వైర్విముక్తాః సుఖదుఃఖసంజ్ఞైః
గచ్ఛంత్యమూఢాః పదమవ్యయం తత్ ||                5

అభిమానం, అవివేకం లేకుండా, అనురాగదోషాన్ని జయించి, ఆత్మజ్ఞానతత్పరులై, కోరికలన్నిటినీ విడిచిపెట్టి, సుఖదుఃఖాది ద్వంద్వాలకు అతీతులైన జ్ఞానులు శాశ్వతమైన ఆ బ్రహ్మపదాన్ని పొందుతారు.

న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః |
యద్గత్వా న నివర్తంతే తద్దామ పరమం మమ ||            6

దాన్ని సూర్యుడుకాని, చంద్రుడుకాని, అగ్నికాని ప్రకాశింపచేయ లేరు. దేనిని పొందితే మళ్ళీ సంసారానికి రానక్కరలేదో అలాంటి పరంధామం నాది.

మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః |
మనఃషష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి ||            7

నాలోని శాశ్వతమైన ఒక అంశమే మానవలోకంలో జీవాత్మగా పరిణమించి ప్రకృతిలోని జ్ఞానేంద్రియాలనూ, మనస్సునూ ఆకర్షిస్తుంది.

శరీరం యదవాప్నోతి యచ్ఛాప్యుత్క్రామతీశ్వరః |
గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధానివాశయాత్ ||            8

వాయువు పువ్వులనుంచి వాసనలను తీసుకుపోయేటట్లుగా జీవుడు శరీరాన్ని ధరించేటప్పుడూ, విడిచిపెట్టేటప్పుడూ ఇంద్రియాలనూ, మనస్సునూ వెంటబెట్టుకు పోతాడు.

శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ |
అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే ||                9

ఈ జీవుడు చెవి, కన్ను, చర్మం, నాలుక, ముక్కు అనే ఐదు జ్ఞానేంద్రియాలనూ, మనస్సునూ ఆశ్రయించి శబ్దాది విషయాలను అనుభవిస్తాడు.

ఉత్క్రామంతం స్థితం వాపి భుఞ్జానం వా గుణాన్వితమ్ |
విమూఢా నానుపశ్యన్తి పశ్యన్తి జ్ఞానచక్షుషః ||        10

మరో శరీరాన్ని పొందుతున్నప్పుడూ, శరీరంలో వున్నప్పుడూ, విషయాలను అనుభవిస్తున్నప్పుడూ, గుణాలతోకూడి వున్నప్పుడూ కూడా ఈ జీవాత్మను మూఢులు చూడలేరు. జ్ఞానదృష్టి కలిగినవాళ్ళు మాత్రమే చూడగలుగుతారు.

యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితమ్ |
యతంతో௨ప్యకృతాత్మనో నైనం పశ్యంత్యచేతసః ||            11

ప్రయత్నం సాగించే యోగులు తమలోని పరమాత్మను దర్శిస్తారు. ఆత్మసంస్కారంలేని అవివేకులు ప్రయత్నించినా ఈ జీవాత్మను తిలకించలేరు.

యదాదిత్యగతం తేజో జగద్భాసయతే௨ఖిలమ్ |
యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకమ్ ||            12

సూర్యుడిలో వుండి జగత్తునంతటినీ ప్రకాశింపచేసే తేజస్సూ, చంద్రుడిలో, అగ్నిలోవుండే తేజస్సూ నాదే అని తెలుసుకో.

గామావిశ్య చ భుతాని ధారయామ్యహమోజసా |
పుష్ణామి చౌషదీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః ||    13

నేను భూమిలో ప్రవేశించి నా ప్రభావంతో సర్వభూతాలనూ ధరిస్తున్నాను. అమృతమయుడైన చంద్రుడిగా సమస్త సస్యాలనూ పోషిస్తున్నాను.

అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః |
ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్ ||        14

“ వైశ్వానరుడు”  అనే జఠరాగ్నిరూపంతో సకలప్రాణుల శరీరాలలోనూ వుండి ప్రాణాపానవాయువులతో కలసి, నాలుగు రకాల ఆహారాలను జీర్ణం చేస్తున్నాను.

సర్వస్య చాహం హృది సన్నివిష్టో
మత్తః స్మృతిర్ జ్ఞానమపోహనం చ |
వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో
వేదాన్తకృద్వేదవిదేవ చాహమ్ ||                    15

సర్వప్రాణుల హృదయాలలో వున్న నా వల్లనే జ్ఞాపకం, జ్ఞానం, మరపు కలుగుతాయి. వేదాలన్నిటివల్ల తెలుసుకోవలసిన వాణ్ణి నేనే. వేదాంతాలకు కర్తనూ, వేదాలను ఎరిగినవాణ్ణీ నేనే.

ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ |
క్షరః సర్వాణి భుతాని కూటస్థో௨క్షర ఉచ్యతే ||            16

ఈ లోకంలో క్షరుడనీ, అక్షరుడనీ ఇద్దరు పురుషులున్నారు. నశించే సమస్తప్రాణుల సముదాయాన్ని క్షరుడనీ మార్పులేని జీవుణ్ణి అక్షరుడనీ అంటారు.

ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః |
యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః ||                17

ఈ వుభయులకంటే ఉత్తముడు నాశనంలేని ఈశ్వరుడిగా మూడు లోకాలలోనూ వ్యాపించి, వాటిని పాలిస్తున్న పరమాత్మ.

యస్మాత్ క్షరమతీతో௨హమక్షరాదపి చోత్తమః |
అతో௨స్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః ||            18

నేను క్షరుడిని మించినవాడినీ, అక్షరుడికంటే ఉత్తముడినీ కావడం వల్ల లోకంలోనూ, వేదాలలోనూ పురుషోత్తముడిగా ప్రసిద్ధి పొందాను.

యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమమ్ |
స సర్వవిద్భజతి మాం సర్వభావేన భారత ||                19

అర్జునా! అజ్ఞానం లేకుండా అలా నన్ను పురుషోత్తముడిగా తెలుసుకునేవాడు సర్వజ్ఞుడై అన్నివిధాల నన్నే ఆరాధిస్తాడు.

ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయానఘ |
ఏతద్‌బుద్ధ్వా బుద్ధిమాన్‌స్యాత్ కృతకృత్యశ్చ భారత ||        20

అర్జునా! అతిరహస్యమైన ఈ శాస్త్రాన్ని నీకు చెప్పాను. దీన్ని బాగా తెలుసుకున్నవాడు బుద్ధిమంతుడూ, కృతార్థుడూ అవుతాడు.

ఇలా ఉపనిషత్తులు, బ్రహ్మవిద్య, యోగశాస్త్రం, శ్రీకృష్ణార్జున సంవాదం అయిన శ్రీమద్భగవద్గీతలోని "పురుషోత్తమప్రాప్తియోగము" అనే పదునైదవ అధ్యాయం సమాప్తం.

Sunday, February 23, 2020

భస్మ ధారణ:విభుతి పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ విభుతి ధరించిన వారికి పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతు ఉంటాడు.

భస్మ ధారణ:

విభుతి పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ విభుతి ధరించిన వారికి పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతు ఉంటాడు. నరక బాధలు లోనుకాకుండా చూస్తాడు. కాల్చిన పేడను (ఆవు పేడ) ఈ భస్మం లో ఉపయోగిస్తూ ఉంటారు. భస్మ ధారణ చేయకుండా చేసే జపతపాలు ఫలితాలను ఇవ్వవని శాస్త్ర వచనము. మన శరీరములో 32 చోట్ల భస్మ ధారణ చెయ్యాలి అని శాస్త్రము చేప్తోంది, కాని ఈ కాలము లో అలాగ చెయ్యటము వీలుపడని పక్షములో కనీసము శిరస్సు, రెండు చేతులు, గుండే, నాభి అనే ఐదు ప్రదేశాలలో భస్మాన్ని ధరించవచ్చు. త్రిపుండ్రాలుగా (ముడు గీతలు) అడ్డముగా భస్మ ధరణ చెయాలి. ఇలాగ చేస్తే జన్మ జన్మల పాపాలు నసించి పోతాయని పెద్దల వాక్కు.
ఈ భస్మ ధారణ చేయడానికి కొన్ని మంత్రాలు చెప్పబడ్డాయి శాస్త్రాలలో.
బ్రాహ్మణ, క్షత్రీయులు "మానస్తోకే మంత్రము " తో, వైశ్యులు " త్ర్యయంబక " మంత్రము తో , ఇతరులు శివపంచాక్షరి తో భస్మ ధారణ చెయాలి.
ఈ విభుతి మహిమను వివరించే కధ దేవి భాగవతము పదకొండవ స్కందము లో ఉంది.
మహిమాన్వితమైన విభుతిని వివిధ పద్ధతులలో తయారు చేస్తారు. ఆవుపేడను కింద పడనీయకుండా, చేత్తోపట్టుకుని, వేదమంత్రాల మధ్య హోమము చేసి తయారు చేసుకున్న భస్మాన్ని "శాంతికము " అని అంటారు.
షడాక్షరి మంత్రముతో హొమము చేసి తయారు చేసుకునే భస్మాన్ని "పౌష్ఠికం" అని అంటారు. బీజాక్షరాలతో హొమము చేసి తయారు చేసిన భస్మాన్ని "కామదం" అని అంటారు..
భస్మం తయారు చేసుకునే ముందే ఆవుపేడను సేకరించి, చిట్టు, లేక పొట్టును కలుపుతూ ముద్ద చేసి, ఆ ముద్దను పిడకలుగా చేసి అతి శుభ్రమైన ప్రదేశములో ఎండబెట్టాలి.
యాగాలు చేస్తున్నప్పుడు అరణిని మధించడం ద్వార వచిన అగ్నితో గాని, మంత్ర పూర్వకముగా పిడకలను హొమ గుండము లో వేసి హోమము చెయ్యాలి.
అనంతరం శుబ్ర్హమైన పాత్రలో విభుతిని నింపాలి.
హర హర మహా దేవ శంభో శంకర

💐💐ఏ రాశి వారు ఏ దేవునికి తాంబూలం స‌మ‌ర్పించాలి?💐💐

💐💐ఏ రాశి వారు ఏ దేవునికి తాంబూలం స‌మ‌ర్పించాలి?💐💐

ఈతిబాధలతో స‌త‌మ‌త‌మ‌య్యేవారు ఏం చేయాలి? ఏ దేవున్ని ప్రార్థించాలి? ఈతిబాధలు తొలిగిపోవాలంటే ఎలాంటి ప‌రిహారం చేసుకోవాల‌ని అడుగుతుంటారు చాలా మంది. అయితే 12 రాశుల్లో జన్మించిన జాతకులు ఏ దేవుళ్లకు తాంబూలం సమర్పించి ప్రార్థించాలో తెలుసుకోవాలి. 12 రాశుల్లో పుట్టిన జాతకులు రాశి ప్రకారం ఏ దేవునికి తాంబూలం సమర్పించి వేడుకుంటే.. ఈతిబాధలు తొలగిపోతాయనేది తెలుసుకుందాం..

💐మేష రాశి .💐

. తాంబూలంలో మామిడి పండును ఉంచి మంగళవారంలో కుమారస్వామిని ప్రార్థిస్తే ఈతిబాధలు తొల‌గిపోతాయి.

💐వృషభ రాశి💐

తమలపాకులో మిరియాలు ఉంచి మంగళవారం పూట రాహువును స్తుతిస్తే.. కష్టాలుండవు. సుఖసంతోషాలు చేకూరుతాయి.

💐మిథున రాశి💐

తమలపాకులో అరటిపండును ఉంచి బుధవారం ఇష్టదేవతా పూజ చేస్తే.. అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి.

💐కర్కాటక రాశి 💐

తమలపాకులో దానిమ్మను ఉంచి శుక్రవారం పూట కాళిమాతను ప్రార్థిస్తే కష్టాలు తీరిపోతాయి.

💐సింహ రాశి 💐

. తమలపాకులో అరటిపండును ఉంచి గురువారం ఇష్టదేవతా పూజను చేయాలి.

💐కన్యారాశి 💐

తమలపాకులో మిరియాలు ఉంచి గురువారం ఇష్టదేవతా పూజ చేస్తే.. దుఃఖం దూరమవుతుంది.

💐తులా రాశి 💐

తమలపాకులో లవంగంను ఉంచి శుక్రవారం పూట ఇష్టదేవతను స్తుతిస్తే.. అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి.

💐వృశ్చిక రాశి💐

తమలపాకులో ఖర్జూర పండును ఉంచి మంగళవారం పూట ఇష్టదేవతను పూజిస్తే ఈతిబాధలు తొలగిపోతాయి.

💐ధనుస్సు రాశి💐

తమలపాకులో కలకండను ఉంచి గురువారం పూట ఇష్టదేవతను పూజించినట్లైతే సుఖసంతోషాలు చేకూరుతాయి.

💐మకర రాశి 💐

తమలపాకులో బెల్లంను ఉంచి శనివారాల్లో కాళిమాతను పూజిస్తే.. కష్టాలు తీరిపోతాయి.

💐కుంభ రాశి 💐

తమలపాకులో నెయ్యిని ఉంచి శనివారం పూట కాళిమాతను పూజించినట్లైతే.. దుఃఖాలు తొలగిపోతాయి.

💐 మీన రాశి 💐

తమలపాకులో పంచదారను ఉంచి ఆదివారం ఇష్టదేవతను పూజించినట్లైతే సుఖసంతోషాలు చేకూరుతాయి.

శ్రీమద్భగవద్గీతపదునాల్గవ అధ్యాయంగుణత్రయవిభాగయోగంశ్రీ భగవానువాచపరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమమ్ |యద్‌జ్ఞాత్వా మునయస్సర్వే పరాం సిద్ధిమితో గతాః ||

శ్రీమద్భగవద్గీత

పదునాల్గవ అధ్యాయం

గుణత్రయవిభాగయోగం

శ్రీ భగవానువాచ

పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమమ్ |
యద్‌జ్ఞాత్వా మునయస్సర్వే పరాం సిద్ధిమితో గతాః ||        1

శ్రీ భగవానుడు: జ్ఞానాలన్నిటిలోకీ ఉత్తమం, ఉత్కృష్టమైన జ్ఞానాన్ని నీకు మళ్ళీ చెబుతాను విను. ఈ జ్ఞానాన్ని తెలుసుకున్న మునులంతా సంసారవ్యథల నుంచి, బాధలనుంచి తప్పించుకుని మోక్షం పొందారు.

ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః |
సర్గే௨పి నోపజాయంతే ప్రలయే న వ్యథంతి చ ||                2

ఈ జ్ఞానాన్ని ఆశ్రయించి నా స్వరూపం పొందిన వాళ్ళు సృష్టిసమయంలో పుట్టరు; ప్రళయకాలంలో చావరు.

మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్‌గర్భం దధామ్యహమ్ |
సంభవః సర్వభూతానాం తతో భవతి భారత ||            3

అర్జునా! మూలప్రకృతి నాకు గర్బాదానస్థానం. అందులో నేను సృష్టి బీజాన్ని ఉంచుతున్నందువల్ల సమస్త ప్రాణులూ పుడుతున్నాయి.

సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః |
తాసాం బ్రహ్మమహద్యోనిః అహం బీజప్రదః పితా ||        4

కౌంతేయా ! అన్ని జాతులలోనూ ఆవిర్భవిస్తున్న శరీరాలన్నింటికీ మూలప్రకృతే తల్లి. నేను బీజాన్ని ఇచ్చే తండ్రిని.

సత్త్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతిసంభవాః |
నిబద్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయమ్ ||            5

అర్జునా! ప్రకృతి వల్ల పుట్టిన సత్వం, రజస్సు, తమస్సు అనే మూడు గుణాలు శాశ్వతమైన ఆత్మను శరీరంలో బంధిస్తున్నాయి.

తత్ర సత్త్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయమ్ |
సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘ ||            6

అర్జునా! వాటిలో సత్వగుణం నిర్మలమైనది కావడం వల్ల కాంతి, ఆరోగ్యం కలగజేస్తుంది. అది సుఖం మీద, జ్ఞానం మీద ఆసక్తి కలగజేసి ఆత్మను బంధిస్తుంది.

రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగసముద్భవమ్ |
తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినమ్ ||            7

కౌంతేయా ! రాగస్వరూపం కలిగిన రజోగుణం ఆశకు, ఆసక్తికి మూలమని తెలుసుకో. కర్మలమీద ఆసక్తి కలిగించి అది ఆత్మను బంధిస్తుంది.

తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినామ్ |
ప్రమాదాలస్యనిద్రాభిః తన్నిబధ్నాతి భారత ||            8

అర్జునా! అజ్ఞానం వల్ల జనించే తమోగుణం ప్రాణులన్నింటికీ అవివేకం కలగజేస్తుందని తెలుసుకో. అది పరాకు, బద్దకం, నిద్రలలో ఆత్మను శరీరంలో బంధిస్తుంది.

సత్త్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత |
జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత ||            9

అర్జునా! సత్వగుణం సుఖం చేకూరుస్తుంది; రజోగుణం కర్మలలో చేరుస్తుంది. తమోగుణం జ్ఞానాన్ని మరుగుపరచి ప్రమాదం కలగజేస్తుంది.

రజస్తమశ్చాభిభూయ సత్త్వం భవతి భారత |
రజఃసత్త్వం తమశ్చైవ తమః సత్త్వం రజస్తథా ||            10

అర్జునా! రజోగుణాన్నీ, తమోగుణాన్నీ అణచివేసి సత్వగుణం అభివృద్ధి చెందుతుంది. అలాగే సత్వతమోగుణాలను అణచివేసి రజోగుణమూ సత్వరజోగుణాలను అణగద్రొక్కి తమోగుణమూ వర్ధిల్లుతాయి.

సర్వద్వారేషు దేహే௨స్మిన్ ప్రకాశ ఉపజాయతే |
జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్త్వమిత్యుత ||            11

ఈ శరీరంలోని ఇంద్రియాలన్నిటినుంచీ ప్రకాశించే జ్ఞానం ప్రసరించినప్పుడు సత్వగుణం బాగా వృద్ధిపొందిందని తెలుసుకోవాలి.

లోభః ప్రవృత్తిరారంభః కర్మణామశమః స్పృహా |
రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ ||                12

అర్జునా! రజోగుణం అభివృద్ధి చెందుతున్నప్పుడు లోభం, కర్మలపట్ల ఆసక్తి, అశాంతి, ఆశ అనే లక్షణాలు కలుగుతుంటాయి.

అప్రకాశో௨ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ |
తమస్యేతాని జాయంతే వివృద్ధే కురునందన ||                13

కురునందనా! బుద్ధిమాంద్యం, బద్దకం, అలక్ష్యం, అజ్ఞానం- ఈ దుర్లక్షణాలు తమోగుణ విజృంభణకు తార్కాణాలు.

యదా సత్త్వే ప్రవృద్ధే తు ప్రలయం యాతి దేహభృత్ |
తదోత్తమవిదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే ||            14

సత్వగుణం ప్రవృద్ధిచెందిన సమయంలో మరణించినవాడు ఉత్తమజ్ఞానులు పొందే పుణ్యలోకాలు పొందుతాడు.

రజసి ప్రలయం గత్వా కర్మసంగిషు జాయతే |
తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే ||                15

రజోగుణం ప్రబలంగా ఉన్న దశలో మృతిచెందితే కర్మలమీద ఆసక్తి కలవాళ్ళకు జన్మిస్తాడు. అలాగే తమోగుణవృద్ధిలో తనువు చాలించినవాడు పామరులకు, పశుపక్ష్యాదులకు పుడతాడు.

కర్మణః సుకృతస్యాహుః సాత్త్వికం నిర్మలం ఫలమ్ |
రజసస్తు ఫలం దుఃఖమ్ అజ్ఞానం తమసః ఫలమ్ ||        16

సత్వగుణ సంబంధమైన సత్కార్యాల ఫలితంగా నిర్మలసుఖమూ, రాజసకర్మల మూలంగా దుఃఖం, తామస కర్మలవల్ల అజ్ఞానం కలుగుతాయని చెబుతారు.

సత్త్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ |
ప్రమాదమోహౌ తమసో భవతో௨జ్ఞానమేవ చ ||            17

సత్వగుణంవల్ల జ్ఞానం, రజోగుణంవల్ల లోభం, తమోగుణంవల్ల అజాగ్రత్త, మోహం, అజ్ఞానం సంభవిస్తాయి.

ఊర్ధ్వం గచ్ఛంతి సత్త్వస్థాః మధ్యే తిష్ఠంతి రాజసాః |
జఘన్యగుణవృత్తిస్థాః అధో గచ్ఛంతి తామసాః ||            18

సత్వగుణ సంపన్నులకు ఉత్తమలోకాలు సంప్రాప్తిస్తాయి. రజోగుణం ప్రధానంగా వున్నవాళ్ళు మానవలోకాన్నే పొందుతుండగా తమోగుణం కలిగినవాళ్ళు నరకలోకానికి పోతుంటారు.

నాన్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి |
గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సో௨ధిగచ్ఛతి ||            19

కర్మలన్నిటికీ గుణాలను తప్ప మరోదానిని కర్తగా భావించకుండా, గుణాలకు అతీతమైన పరమాత్మ తత్వాన్ని గ్రహించిన వివేకి మోక్షం పొందుతాడు.

గుణానేతానతీత్య త్రీన్ దేహీ దేహసముద్భవాన్ |
జన్మమృత్యుజరాదుఃఖైః విముక్తో௨మృతమశ్నుతే ||            20

శరీరం కారణంగా కలిగిన ఈ మూడు గుణాలను అధిగమించినవాడు పుట్టుక, చావు, ముసలితనం, దుఃఖాలనుంచి విముక్తుడై అమృతపదం పొందుతాడు.

అర్జున ఉవాచ

కైర్లింగైః త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో |
కిమాచారః కథం చైతాన్ త్రీన్ గుణానతివర్తతే ||        21

అర్జునుడు: ప్రభూ! ఈ మూడు గుణాలనూ దాటినవాడి లక్షణాలేమిటి? అతని ప్రవర్తన ఎలా ఉంటుంది? ఈ గుణాలను ఎలా అతను అతిక్రమించగలుగుతాడు?

శ్రీ భగవానువాచ

ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ |
న ద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి ||            22

ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే |
గుణా వర్తంత ఇత్యేవ యో௨వతిష్ఠతి నేఙ్గతే ||            23

సమదుఃఖసుఖః స్వస్థః సమలోష్టాశ్మకాంచనః |
తుల్యప్రియాప్రియో ధీరః తుల్యనిందాత్మసంస్తుతిః ||            24

మానావమానయోస్తుల్యః తుల్యో మిత్రారిపక్షయోః |
సర్వారంభపరిత్యాగీ గుణాతీతః స ఉచ్యతే ||                25

శ్రీ భగవానుడు: అర్జునా! గుణాతీతుడి గుర్తులివి: తనకు సంప్రాప్తించిన సత్వగుణసంబంధమైన సౌఖ్యాన్ని కాని, రజోగుణధర్మమైన కర్మప్రవృత్తిని కాని, తమోగుణ లక్షణమైన మోహాన్ని కాని ద్వేషించడు; అవి లేకుండా పోతే వాటిని ఆకాంక్షించడు. ఏమీ సంబంధం లేని వాడిలాగా వుండి గుణాలవల్ల చలించకుండా, సర్వకార్యాలలోనూ ప్రకృతిగుణాలే ప్రవర్తిస్తున్నాయని గ్రహించి, ఎలాంటి పరిస్థితులలోనూ తన నిశ్చలబుద్ధిని విడిచి పెట్టడు. సుఖదుఃఖాలు, మట్టిబెడ్డ, రాయి, బంగారం, ఇష్టానిష్టాలు, దూషణభూషణలు, మానావమానాలు, శత్రుమిత్రులను సమానదృష్టితో చూస్తూ కామ్యకర్మలన్నిటినీ విడిచిపెట్టి నిరంతరం ఆత్మావలోకనంలో నిమగ్నమై వుండే ధీరుడు.

మాం చ యో௨వ్యభిచారేణ భక్తియోగేన సేవతే |
స గుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే ||        26

అచంచలభక్తితో నన్ను సేవించేవాడు ఈ మూడుగుణాలనూ అధిగమించి ముక్తి పొందడానికి అర్హుడవుతాడు.

బ్రహ్మణో హి ప్రతిష్ఠాహమ్ అమృతస్యావ్యయస్య చ |
శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ ||            27

ఎందువల్లనంటే వినాశరహితం, వికారరహితం, శాశ్వత ధర్మ స్వరూపం, అఖండసుఖరూపమూ అయిన బ్రహ్మానికి నిలయాన్ని నేనే.

ఇలా ఉపనిషత్తులు, బ్రహ్మవిద్య, యోగశాస్త్రం, శ్రీకృష్ణార్జున సంవాదం అయిన శ్రీమద్భగవద్గీతలోని " గుణత్రయవిభాగయోగం" అనే పదునాల్గవ అధ్యాయం సమాప్తం.

శ్రీమద్భగవద్గీతపదమూడవ అధ్యాయంక్షేత్రక్షేత్రజ్ఞవిభాగయోగంఅర్జున ఉవాచప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ |ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ ||

శ్రీమద్భగవద్గీత

పదమూడవ అధ్యాయం

క్షేత్రక్షేత్రజ్ఞవిభాగయోగం

అర్జున ఉవాచ

ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ |
ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ ||            1

అర్జునుడు: కేశవా! ప్రకృతి, పురుషుడు, క్షేత్రం, క్షేత్రజ్ఞుడు, జ్ఞానం, జ్ఞేయం వీటన్నిటి గురించి తెలుసుకోవాలని నా అభిలాష.

శ్రీ భగవానువాచ

ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే |
ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః ||            2

శ్రీభగవానుడు: కౌంతేయా! ఈ శరీరమే క్షేత్రమనీ, దీనిని తెలుసుకుంటున్నవాడే క్షేత్రజ్ఞుడనీ క్షేత్రక్షేత్రజ్ఞుల తత్వం తెలిసినవాళ్ళు చెబుతారు.

క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత |
క్షేత్రక్షేత్రజ్ఞయోః జ్ఞానం యత్తద్ జ్ఞానం మతం మమ ||    3

ఆర్జునా! క్షేత్రాలన్నింటిలోనూ ఉన్న క్షేత్రజ్ఞుణ్ణి నేనే అని తెలుసుకో. క్షేత్రానికి క్షేత్రజ్ఞునికి సంబంధించిన జ్ఞానమే సరైన జ్ఞానమని నా ఉద్దేశం.

తత్‌క్షేత్రం యచ్చ యాదృక్చ యద్వికారి యతశ్చ యత్ |
స చ యో యత్ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు ||                4

ఆ క్షేత్రం ఆకారవికారాలు, పుట్టుపూర్వోత్తరాలగురించీ క్షేత్రజ్ఞుడి స్వరూప స్వభావ ప్రభావాల గురించీ క్లుప్తంగా చెబుతాను విను.

ఋషిభిర్బహుధా గీతం ఛందోభిర్వివిధైః పృథక్ |
బ్రహ్మసూత్రపదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః ||            5

ఋషులు ఎన్నో విధాలుగా ఈ క్షేత్ర క్షేత్రజ్ఞుల తత్త్వాన్ని చాటిచెప్పారు. వేరువేరుగా వేదాలూ, సహేతుకంగా, సందేహరహితంగా సవివరంగా బ్రహ్మసూత్రాలూ ఈ స్వరూపాన్ని నిరూపించాయి.

మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ |
ఇంద్రియాణి దశైకం చ పంచ చేంద్రియగోచరాః ||            6

ఇచ్ఛా ద్వేషః సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతిః |
ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతమ్ ||            7

పంచమహాభూతాలు, అహంకారం, బుద్ధి, మూలప్రకృతి, పది ఇంద్రియాలు, మనస్సు, ఐదు ఇంద్రియ విషయాలు, కోరిక, ద్వేషం, సుఖం, దుఃఖం, దేహేంద్రియాల సమూహం, తెలివి, ధైర్యం-వికారాలతోపాటు వీటి సముదాయాన్ని సంగ్రహంగా క్షేత్రమని చెబుతారు.

అమానిత్వమదంభిత్వమ్ అహింసా క్షాంతిరార్జవమ్ |
ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మవినిగ్రహః ||            8

ఇంద్రియార్థేషు వైరాగ్యమ్ అనహంకార ఏవ చ |
జన్మమృత్యుజరావ్యాధిదుఃఖదోషానుదర్శనమ్ ||            9

అసక్తిరనభిష్వంగః పుత్రదారగృహాదిషు |
నిత్యం చ సమచిత్తత్వమ్ ఇష్టానిష్టోపపత్తిషు ||            10

మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణీ |
వివిక్తదేశసేవిత్వమ్ అరతిర్జనసంసది ||                    11

అధ్యాత్మజ్ఞాననిత్యత్వం తత్త్వజ్ఞానార్థదర్శనమ్ |
ఏతద్‌జ్ఞానమితి ప్రోక్తమ్ అజ్ఞానం యదతో௨న్యథా ||        12

తనని తాను పొగడుకోకపోవడం, కపటం లేకపోవడం, అహింస, సహనం, సరళత్వం, సద్గురుసేవ, శరీరాన్నీ మనసునూ పరిశుద్ధంగా వుంచుకోవడం, స్థిరత్వం, ఆత్మ నిగ్రహం, ఇంద్రియవిషయాలపట్ల విరక్తి కలిగి ఉండటం, అహంకారం లేకపోవడం, పుట్టుక, చావు, ముసలితనం, రోగం అనేవాటివల్ల కలిగే దుఃఖాన్నీ దోషాన్నీ గమనించడం, దేనిమీదా ఆసక్తి లేకపోవడం, ఆలుబిడ్డలు, ఇళ్ళువాకిళ్ళ పట్ల వ్యామోహం లేకపోవడం, శుభాశుభాలలో సమభావం కలిగి ఉండటం, నామీద అనన్యమూ అచంచలమూ అయిన భక్తి కలిగి ఉండటం, ఏకాంత ప్రదేశాన్ని ఆశ్రయించడం, జనసమూహం మీద ఇష్టం లేక పోవడం, ఆత్మ ధ్యానంలో నిరంతరం నిమగ్నమై ఉండటం, తత్త్వజ్ఞానం వల్ల కలిగే ప్రయోజనాన్ని గ్రహించడం- ఇదంతా జ్ఞానమని చెప్పబడింది. దీనికి విరుద్ధమయింది అజ్ఞానం.

జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యద్ జ్ఞాత్వామృతమశ్నుతే |
అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నాసదుచ్యతే ||                13

ఏది తెలుసుకోదగ్గదో, దేనిని తెలుసుకొంటే మానవుడు మోక్షం పొందుతాడో, అనాది అయిన ఆ పరబ్రహ్మాన్ని గురించి చెప్తాను. దానిని సత్తనికాని అసత్తనికాని వివరించడానికి వీలులేదు.

సర్వతః పాణిపాదం తత్ సర్వతో௨క్షిశిరోముఖమ్ |
సర్వతః శ్రుతిమల్లోకే సర్వమావృత్య తిష్ఠతి ||                14

అది అంతటా చేతులూ, కాళ్ళూ, తలలూ, ముఖాలూ, చెవులూ కలిగి సమస్త జగత్తునీ ఆవరించి ఉన్నది.

సర్వేంద్రియగుణాభాసం సర్వేంద్రియవివర్జితమ్ |
అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృ చ ||            15

ఆ బ్రహ్మం అన్ని ఇంద్రియాల గుణాలనూ ప్రకాశింపచేస్తున్నా సర్వేంద్రియాలూ లేనిది; దేనినీ అంటకపోయినా అన్నిటికీ ఆధారం; గుణాలు లేనిదైనా గుణాలను అనుభవిస్తుంది.

బహిరంతశ్చ భూతానామ్ అచరం చరమేవ చ |
సూక్ష్మత్వాత్‌తదవిజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్ ||        16

అది సర్వభుతాల వెలపల, లోపల కూడా ఉన్నది; కదలదు, కదులుతుంది; అతిసూక్ష్మస్వరూపం కావడం వల్ల తెలుసుకోవడానికి శక్యంకాదు; అది ఎంతో దూరంలోనూ బాగా దగ్గరలోనూ ఉన్నది.

అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితమ్ |
భూతభర్తృ చ తజ్జ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ ||            17

ఆ బ్రహ్మం ఆకారమంతా ఒకటే అయీనప్పటికీ సర్వప్రాణులలోనూ ఆకారభేదం కలిగినదానిలాగా కనపడుతుంది. అది భూతాలన్నిటినీ పోషిస్తుంది, భుజిస్తుంది, సృజిస్తుంది.

జ్యోతిషామపి తజ్జ్యోతిః తమసః పరముచ్యతే |
జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితమ్ ||    18

అది జ్యోతులన్నింటినీ ప్రకాశింపజేస్తుంది. అజ్ఞానాంధకారానికి అతీతమూ, జ్ఞానస్వరూపమూ, జ్ఞానంతో తెలుసుకోదగ్గదీ, జ్ఞానంతో పొందదగ్గదీ అయి అందరి హృదయాలలో అధిష్ఠించి వున్నది.

ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః |
మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే ||            19

ఇలా క్షేత్రం, జ్ఞానం, జ్ఞేయం గురించి క్లుప్తంగా చెప్పడం జరిగినది. నా భక్తుడు ఈ తత్త్వాన్ని తెలుసుకుని మోక్షం పొందడానికి అర్హుడవుతున్నాడు.

ప్రకృతిం పురుషం చైవ విద్ధ్యనాదీ ఉభావపి |
వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతిసంభవాన్ ||        20

ప్రకృతి, పురుషుడు- ఈ ఉభయులకీ ఆదిలేదని తెలుసుకో. వికారాలు, గుణాలు ప్రకృతినుంచి పుడుతున్నాయని గ్రహించు.

కార్యకారణకర్తృత్వే హేతుః ప్రకృతిరుచ్యతే |
పురుషః సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే ||            21

శరీరం, ఇంద్రియాల ఉత్పత్తికి ప్రకృతే హేతువనీ, సుఖదుఃఖాలను అనుభవించేది పురుషుడనీ చెబుతారు.

పురుషః ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ |
కారణం గుణసంగో௨స్య సదసద్యోనిజన్మసు ||            22

ప్రకృతిలో వుండే పురుషుడు ప్రకృతివల్ల కలిగే గుణాలను అనుభవిస్తాడు. ఆ గుణాలపట్ల కల ఆసక్తిని బట్టే పురుషుడు ఉచ్చనీచ జన్మలు పొందుతాడు.

ఉపద్రష్టానుమంతా చ భర్తా భోక్తా మహేశ్వరః |
పరమాత్మేతి చాప్యుక్తో దేహే௨స్మిన్ పురుషః పరః ||        23

ఈ శరీరంలో అంటీ అంటనట్లుగా ఉండే పరమపురుషుణ్ణి సాక్షి, అనుమతించేవాడు, భరించేవాడు, అనుభవించేవాడు, మహేశ్వరుడు, పరమాత్మ అని చెబుతారు.

య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైస్సహ |
సర్వథా వర్తమానో௨పి న స భూయో௨భిజాయతే ||                24

ఇలా పురుషుణ్ణి గురించీ, గుణాలతో ఉన్న ప్రకృతిని గురించీ తెలుసుకున్న వాడు ఎలా జీవించినా పునర్జన్మ పొందడు.

ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా |
అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే ||                25

ధ్యానయోగంద్వారా కొంతమంది, జ్ఞానయోగం వల్ల మరికొంతమంది, కర్మయోగంతో ఇంకొంతమంది పరమాత్మను తమలో దర్శిస్తున్నారు.

అన్యే త్వేవమజానంతః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే |
తే௨పి చాతితరంత్యేవ మృత్యుం శ్రుతిపరాయణాః ||            26

అలా తెలుసుకోలేని మరికొంతమంది, గురువుల ఉపదేశం పొంది ఉపాసిస్తారు. వినడంలో శ్రద్ధ కలిగిన వాళ్ళు కూడా సంసార రూపమైన మృత్యువు నుంచి ముక్తి పొందుతారు.

యావత్సంజాయతే కించిత్ సత్త్వం స్థావరజంగమమ్ |
క్షేత్రక్షేత్రజ్ఞసంయోగాత్ తద్విద్ధి భరతర్షభ ||            27

అర్జునా ! ఈ ప్రపంచంలో పుడుతున్న చరాచరాత్మకమైన ప్రతి వస్తువూ ప్రకృతి పురుషుల కలయిక వలల్నే కలుగుతున్నదని తెలుసుకో.

సమం సర్వేషు భూతేషు తిష్ఠంతం పరమేశ్వరమ్ |
వినశ్యత్స్వవినశ్యంతం యః పశ్యతి స పశ్యతి ||            28

శరీరాలు నశిస్తున్నా తాను నశించకుండా సమస్త ప్రాణులలోనూ సమానంగా వుండే పరమాత్మను చూసేవాడే సరైన జ్ఞాని.

సమం పశ్యన్‌హి సర్వత్ర సమవస్థితమీశ్వరమ్ |
న హినస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిమ్ ||            29

పరమాత్మను సర్వత్రా సమానంగా వీక్షించేవాడు తనను తాను హింసించుకోడు. అందువల్ల అతను మోక్షం పొందుతాడు.

ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః |
యః పశ్యతి తథాత్మానమ్ అకర్తారం స పశ్యతి ||            30

ప్రకృతివల్లనే సమస్త కర్మలూ సాగుతున్నాయనీ, తానేమీ చేయడం లేదనీ తెలుసుకున్నవాడే నిజమైన జ్ఞాని.

యదా భూతపృథగ్భావమ్ ఏకస్థమనుపశ్యతి |
తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా ||                31

వేరువేరుగా కనుపించే సర్వభూతాలూ ఒకే ఆత్మలో వున్నాయనీ, అక్కడనుంచే విస్తరిస్తున్నాయనీ గ్రహించినప్పుడు మానవుడు బ్రహ్మపదం పొందుతాడు.

అనాదిత్వాన్నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః |
శరీరస్థో௨పి కౌంతేయ న కరోతి న లిప్యతే ||                32

అర్జునా! శాశ్వతుడైన పరమాత్మ పుట్టుకలేనివాడూ, గుణరహితుడూ కావడంవల్ల దేహంలో వున్నా దేనికీ కర్త కాడు. కనుక కర్మఫలమేదీ అతనిని అంటదు.

యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే |
సర్వత్రావస్థితో దేహే తథాత్మా నోపలిప్యతే ||                33

అంతటా వ్యాపించివున్నా, సూక్ష్మమైన ఆకాశం దేనినీ అంటనట్లు శరీరమంతటా వున్నా ఆత్మ కలుషితం కాదు.

యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః |
క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత ||            34

అర్జునా! సూర్యుడొక్కడే ఈ సమస్త లోకాన్నీ ప్రకాశింపచేస్తున్నట్లే; క్షేత్రజ్ఞుడైన పరమాత్మ క్షేత్రమంతటినీ ప్రకాశింపచేస్తున్నాడు.

క్షేత్రక్షేత్రజ్ఞయోరేవమ్ అంతరం జ్ఞానచక్షుషా |
భూతప్రకృతిమోక్షం చ యే విదుర్యాంతి తే పరమ్ ||            35

ఇలా క్షేత్రక్షేత్రజ్ఞుల భేదాన్ని ప్రకృతి గుణాలనుంచి ప్రాణులు మోక్షం పొందే విధానాన్ని జ్ఞానదృష్టితో తెలుసుకున్నవాళ్ళు పరమపదం పొందుతారు.

ఇలా ఉపనిషత్తులు, బ్రహ్మవిద్య, యోగశాస్త్రం, శ్రీకృష్ణార్జున సంవాదం అయిన శ్రీమద్భగవద్గీతలోని " క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగం" అనే పదమూడవ అధ్యాయం సమాప్తం.

క్షీరసాగర మధన సంఘటన నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

క్షీరసాగర మధన సంఘటన నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

దేవ దానవులు కలిసి అమృతం కోసం పాలసముద్రాన్ని చిలకడం అనే విషయం మన అందరికీ తెలుసు.మొదట ఈ కథను క్లుప్తంగా చూద్దాం.
ఈ మథనానికి మంధర పర్వతాన్ని కవ్వంగా,వాసుకి అనే పామును తాడుగా ఉపయోగించారు.పర్వతం మునిగిపోకుండా మహావిష్ణువు తాబేలు అవతారం దాల్చి తనపైన మోశాడు.దేవతలు పాము తోకభాగాన్ని,రాక్షసులు తల భాగాన్ని పట్టుకొని చిలకడం ప్రారంభించారు.ఇలా చిలుకుతుండగా చంద్రుడు,ఐరావతము,లక్ష్మీదేవి,కల్పవృక్షము,కామధేనువు,మద్యము,హాలాహలము అనే భయంకర విషము లభించాయి.హాలాహలమును శివుడు త్రాగగా,లక్ష్మీదేవిని విష్ణువు స్వీకరించాడు.మిగిలినవాటిని దేవతలు,రాక్షసులు పంచుకొన్నారు.చివరికి అమృతం లభించింది.ఇదీ సంగ్రహంగా విషయం.

మన ప్రయత్నానికి ప్రతీక పాము. మనం ఏదైనా లక్ష్యం సాధించాలి అనుకొన్నప్పుడు మనకు ఎన్నో సమస్యలు ఎదురవుతాయి.మన లక్ష్యసాధనకు ఉపయోగపడే పరిస్థితులూ,వెనక్కు లాగే పరిస్థితులూ రెండూ ఉంటాయి. ఈ రెండు పరిస్థితులే దేవతలకు,రాక్షసులకు ప్రతినిధులు.అనుకూల పరిస్థితులకన్నా ప్రతికూల పరిస్థితులే ప్రభావం చూపిస్తాయి.కార్యసాధన జరిగేటప్పుడు ఆ సాధన వలన ఏవైనా తక్షణ పరిణామాలు ఎదురైతే వాటిద్వారా మన ప్రతికూలపరిస్థితులు తగ్గాలి.పాము విషం కక్కినప్పుడు రాక్షసులు మరణించడం లాగా అన్నమాట.దీనినే రాక్షసులు పాము తలభాగాన ఉండడము,దేవతలు తోకభాగాన ఉండడానికి ప్రతీకలు.ఈ రెండు పరిస్థితులను ఉపయోగించుకుంటూనే మనం మన లక్ష్యసాధనకు ప్రయత్నించాలి.వెనక్కులాగే పరిస్థితులనుండి మనం పాఠాలు నేర్చుకుంటూ,అనుకూల పరిస్థితులను ఉపయోగించుకుంటూ మనం ముందుకు సాగాలి.లక్ష్యము సాధించాలంటే దృఢమైన పట్టుదల కావాలి.ఈ పట్టుదలే పర్వతానికి ప్రతీక.మన పట్టుదల జారిపోకుండా ఉండడం కోసం మనము మన యుక్తాయుక్త జ్ఞానము ఉపయోగించాలి.ఈ జ్ఞానమే మన పట్టుదలను వీడిపోకుండా భారం వహించే తాబేలు.మన కార్యక్షేత్రమే(సమాజము)పాలసముద్రము.ఈ కార్యక్షేత్రములో మనం పనిచేస్తున్నప్పుడు చిన్నచిన్న సంతోషాలు అనుకోకుండా కలుగుతాయి.అలానే చిన్నచిన్న కష్టాలూ,పెద్ద అవరోధాలూ ఎదురవవచ్చు.ఈ సంతోషాలే పాలసముద్రము చిలకగా వచ్చిన చంద్రుడు,ఐరావతము,కల్పవృక్షము,లక్ష్మీదేవి వంటివాటికి ప్రతీకలు కాగా మద్యం లాంటివి చిన్న కష్టాలకు,ప్రలోభాలకు,హాలాహలం వంటి విషము పెద్ద అవరోధాలకు ప్రతినిధులు గా చెప్పుకోవచ్చు.
చిన్నచిన్న సంతోషాల దగ్గరే ఆగిపోకుండా,అలానే కష్టనష్టాలకు,అవరోధాలకు వెరవకుండా ప్రయత్నం కొనసాగించినప్పుడే లక్ష్యసాధన అనే అమృతం మనకు లభిస్తుంది.

ఇక ఆధ్యాత్మికం గా తీసుకుంటే దేవతలు,రాక్షసులు మంచి,చెడు గుణాలకు ప్రతీకలు.కవ్వమైన పామును సాధనతోనూ,పర్వతాన్ని బుద్ధితోనూ,తాబేలును వివేకంతోనూ,పాలసముద్రాన్ని మనసుతోనూ పోల్చవచ్చు.చిలకగా మొదట వచ్చిన వస్తువులు సిద్ధులకు,అతీతశక్తులకు ప్రతీకలు.హాలాహల విషం మన సాధనను తప్పించడానికి వచ్చే పెద్ద అవరోధముల లాంటిది.వీటి దగ్గరే ఆగిపోతే శాంతి లేక మోక్షమనే అమృతం లభించదు.

మహా శివరాత్రి విశిష్టత.

మహా శివరాత్రి విశిష్టత.

భారత దేశపు ముఖ్య పండుగలలో శివరాత్రి ప్రశస్తమైనది. ప్రతీ ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు వస్తుంది. ఇది శివ భక్తులకు అత్యంత పర్వదినం. శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉన్నది.

మహాశివ రాత్రి మహాత్య వృత్తాంతం.
శివ పురాణములోని విద్యేశ్వర సంహితలో చెప్పబడింది.

గంగా యమునా సంగమ స్థానమైన ప్రయాగలో (నేటి అలహాబాదు) ఋషులు సత్రయాగం చేస్తున్నసమయంలో రోమర్షణమహర్షి అని పేరు గాంచిన సూతమహర్షి అక్కడకు వచ్చాడు. ఆలా వచ్చిన సూతమహర్షికి అ ఋషులు నమస్కరించి సర్వోత్తమమైన ఇతిహాస వృత్తాంతాన్ని చెప్పుమనగా అతను తనకు గురువైన వేదవ్యాసుడు తనకు చెప్పిన గాధను వివరించడం ప్రారంభిస్తాడు. ఒకసారి పరాశర కుమారుడైన వ్యాస మహర్షి సరస్వతీ నదీ తీరమున ధ్యానం చేస్తున్నాడు. ఆ సమయంలో సూర్యుని వలె ప్రకాశించే విమానంలో సనత్కుమారుడు వెళ్ళుతున్నాడు.. దానిని గమనించిన వ్యాసుడు బ్రహ్మ కుమారుడైన సనత్కుమారునకు నమస్కరించి ముక్తిని ప్రసాదించే గాధను తెలుపుమంటాడు.

అప్పుడు మందర పర్వతం మీద బ్రహ్మ కుమారుడైన సనత్కుమారుడు తనకు, నందికేశ్వరునికి మధ్య జరిగిన సంవాదాన్ని వ్యాసునికి చెప్పగా, వ్యాసుడు సూతునికి చెప్పిన వృత్తాంతాన్ని సత్రయాగంలో ఋషులకు చెబుతాడు. సనత్కుమారుడు నందికేశ్వరుడిని శివుని సాకారమైన మూర్తిగా , నిరాకారుడైన లింగంగా పూజించడానికి సంబంధించిన వృత్తాంతాన్ని చెప్పమంటాడు. దానికి సమాధానంగా నందికేశ్వరుడు ఈ వృత్తాంతాన్ని చెబుతాడు.

బ్రహ్మ, విష్ణువుల యుద్ధం-

ఒకప్పుడు ప్రళయ కాలం సంప్రాప్తము కాగ మహాత్ములగు బ్రహ్మ, విష్ణువులు ఒకరితో ఒకరు యుద్ధానికి దిగిరి. ఆ సమయంలోనే మహాదేవుడు లింగరూపంగా ఆవిర్భవించెను. దాని వివరాలు ఇలాఉన్నాయి. ఒకప్పుడు బ్రహ్మ అనుకోకుండా వైకుంఠానికి వెళ్ళి, శేషశయ్యపై నిద్రించుచున్న విష్ణువును చూసి, "నీవెవరవు నన్ను చూసి గర్వముతో శయ్యపై పరుండినావు లెమ్ము. ఆరాధనీయుడైన గురువు వచ్చినప్పుడు గర్వించిన మూఢుడికి ప్రాయశ్చిత్తం విధించబడును" అని అన్నాడు. ఆ మాటలు విన్న విష్ణువు బ్రహ్మను ఆహ్వానించి, ఆసనం ఇచ్చి, "నీ చూపులు ప్రసన్నంగా లేవేమి?" అన్నాడు. దానికి సమాధానంగా బ్రహ్మ "నేను కాలముతో సమానమైన వేగముతో వచ్చినాను. పితామహుడను. జగత్తును, నిన్ను కూడా రక్షించువాడను" అంటాడు. అప్పుడు విష్ణువు బ్రహ్మతో "జగత్తు నాలో ఉంది. నీవు చోరుని వలె ఉన్నావు. నీవే నా నాభిలోని పద్మమునుండి జన్మించినావు. కావున నీవు నా పుత్రుడవు. నీవు వ్యర్థముగా మాట్లాడు తున్నావు" అన్నాడు.

ఈ విధంగా బ్రహ్మ విష్ణువు ఒకరితోనొకరు సంవాదములోనికి దిగి, చివరికి యుద్ధసన్నద్దులౌతారు. బ్రహ్మ హంస వాహనం పైన, విష్ణువు గరుడ వాహనం పైన ఉండి యుద్ధాన్ని ఆరంభించారు. ఈ విధంగా వారివురు యుద్ధం చేయుచుండగా దేవతలు వారివారి విమానాలు అధిరోహించి వీక్షిస్తున్నారు. బ్రహ్మ, విష్ణువుల మధ్య యుద్ధం అత్యంత ఉత్కంఠతో జరుగుతూ ఉంటే వారు ఒకరి వక్షస్థలం పై మరొకరు అగ్నిహోత్ర సమానమైన బాణాలు సంధించుకొన సాగిరి. ఇలా సమరం జరుగుచుండగా, విష్ణువు మాహేశ్వరాస్త్రం, బ్రహ్మ పాశుపతాస్త్రం ఒకరిమీదకు ఒకరు సంధించుకొన్నారు. ఆ అస్త్రాలను వారు సంధించిన వెంటనే సమస్త దేవతలకు భీతి కల్గింది. ఏమీ చేయలేక, దేవతలందరు శివునికి నివాసమైన కైలాసానికి బయలు దేరారు. ప్రమథగణాలకు నాయకుడైన శివుని నివాసస్థలమైన కైలాసంలో మణులు పొదగబడిన సభా మధ్యంలో ఉమాసహితుడై తేజస్సుతో విరాజిల్లుతున్న మహాదేవునికి దేవతలు ఆనందభాష్పాలతో సాష్టాంగంగా ప్రణమిల్లారు. అప్పుడు ప్రమథ గణాలచేత శివుడు దేవతలను దగ్గరకు రమ్మని అహ్వానిస్తాడు. అన్ని విషయాలు ఎరిగిన శివుడు దేవతలతో "బ్రహ్మ, విష్ణువుల యుద్ధము నాకు ముందుగానే తెలియును. మీ కలవరము గాంచిన నాకు మరల చెప్పినట్లైనది " అంటాడు. శివుడు సభలో ఉన్న వంద ప్రమథ గణాలను యుద్ధానికి బయలుదేరమని చెప్పి, తాను అనేక వాద్యములతో, అలంకారములతో కూడిన వాహనం పై రంగు రంగుల ధ్వజముతో, వింజామరతో, పుష్పవర్షముతో, సంగీతము నాట్యమాడే గుంపులతో, వాద్య సముహంతో, పార్వతీదేవి తో బయలుదేరుతాడు. యుద్ధానికి వెళ్ళిన వెంటనే వాద్యాల ఘోషను ఆపి, రహస్యంగా యుద్ధాన్ని తిలకిస్తాడు. మాహేశ్వరాస్త్రం, పాశుపతాస్త్రం విధ్వంసాన్ని సృష్టించబోయే సమయంలో శివుడు అగ్ని స్తంభ రూపంలో ఆవిర్భవించి ఆ రెండు అస్త్రాలను తనలో ఐక్యం చేసుకొంటాడు. బ్రహ్మ, విష్ణువులు ఆశ్చర్య చకితులై ఆ స్తంభం ఆది, అంతం కనుగొనడం కోసం వారివారి వాహనాలతో బయలు దేరారు. విష్ణువు అంతము కనుగొనుటకు వరాహరూపుడై, బ్రహ్మ ఆది తెలుకొనుటకు హంసరూపుడై బయలుదేరారు. ఎంతపోయినను అంతము తెలియకపోవడం వల్ల విష్ణుమూర్తి వెనుకకు తిరిగి బయలుదేరిన భాగానికి వచ్చాడు. బ్రహ్మకు పైకి వెళ్ళే సమయంలో మార్గమధ్యంలో కామధేనువు క్రిందకు దిగుతూను, ఒక మొగలి పువ్వు(బ్రహ్మ, విష్ణువుల సమరాన్ని చూస్తూ పరమేశ్వరుడు నవ్వినప్పుడు ఆయన జటాజూటం నుండి జారినదే ఆ మొగలి పువ్వు) క్రింద పడుతూనూ కనిపించాయి. ఆ రెంటిని చూసి బ్రహ్మ 'నేను ఆది చూశాను అని అసత్యము చెప్పండి. ఆపత్కాలమందు అసత్యము చెప్పడము ధర్మ సమ్మతమే" అని చెప్పి కామధేనువు తోను, మొగలి పువ్వుతోను ఒడంబడిక చేసుకున్నాడు. వాటితో ఒడంబడిక చేసుకొన్న తరువాత బ్రహ్మ తిరిగి స్వస్థానానికి వచ్చి,అక్కడ డస్సి ఉన్న విష్ణువు ని చూసి, తాను ఆదిని చూశానని, దానికి సాక్ష్యం కామధేనువు, మొగలి పువ్వు అని చెప్పాడు. అప్పుడు విష్ణువు ఆ మాటను నమ్మి బ్రహ్మకి షోడశోపచారాలతో పూజ చేసాడు. కాని,శివుడు ఆ రెండింటిని వివరము అడుగగా, బ్రహ్మ స్తంభం ఆదిని చూడడం నిజమేనని మొగలి పువ్వు చెప్పింది. కామధేనువు మాత్రం నిజమేనని తల ఊపి, నిజం కాదని తోకను అడ్డంగా ఊపింది. జరిగిన మోసాన్ని తెలుసుకున్న శివుడు కోపోద్రిక్తుడైనాడు. మోసము చేసిన బ్రహ్మను శిక్షించడం కోసం శివుడు అగ్నిలింగ స్వరూపం నుండి సాకారమైన శివుడి గా ప్రత్యక్ష మయ్యాడు. అది చూసిన విష్ణువు, బ్రహ్మ సాకారుడైన శివునకు నమస్కరించారు. శివుడు విష్ణువు సత్యవాక్యానికి సంతసించి ఇకనుండి తనతో సమానమైన పూజా కైంకర్యాలు విష్ణువు అందుకొంటాడని, విష్ణువుకి ప్రత్యేకంగా క్షేత్రాలు ఉంటాయని ఆశీర్వదించాడు.

బ్రహ్మకు శాపము

శివుడు బ్రహ్మ గర్వము అణచడానికి తన కనుబొమ్మల నుండి భైరవుడిని సృష్టించి పదునైన కత్తితో ఈ బ్రహ్మను శిక్షించుము అని చెబుతాడు.ఆ భైరవుడు వెళ్లి బ్రహ్మ పంచముఖాలలో ఏ ముఖము అయితే అసత్యము చెప్పిందో ఆ ముఖాన్ని పదునైన కత్తితో నరికి వేస్తాడు. అప్పుడు మహావిష్ణువు శివుడి వద్దకు వెళ్లి, పూర్వము ఈశ్వర చిహ్నంగా బ్రహ్మకు ఐదు ముఖాలు ఇచ్చి ఉంటివి. ఈ మొదటి దైవము అగు బ్రహ్మను ఇప్పుడు క్షమించుము అన్నాడు. ఆ మాటలు విన్న శివుడు బ్రహ్మని క్షమించి, బ్రహ్మకు స్థానము, పూజ , అభిషేకము మున్నగునవి ఉండవు అని చెప్పాడు. నిన్ను అగ్నిష్టోమము, యజ్ఞములలో గురుస్థానములో నిలబెడుతున్నాను అని విష్ణువుతో చెప్పాడు. అంగం దక్షిణలు ఇచ్చిన బ్రహ్మా నీవు లేని యజ్ఞము వ్యర్థము అగును.

మొగలి పువ్వుకు శాపము

ఆతరువాత కేతకీపుష్పము వైపు చూసి , అసత్యము పల్కిన నీతో పూజలు ఉండకుండా ఉండు గాక అని అనగానే దేవతలు కేతకీపుష్పాన్ని దూరంగా ఉMచారు. దీనితో కలతచెందిన కేతకీపుష్పము పరమేశ్వరుడవైన నిన్ను చూసిన తరువాత కూడా అసత్య దోషము ఉండునా అని మహాదేవుడిని స్తుతించింది. దానితో ప్రీతి చెందిన శివుడు అసత్యము చెప్పిన నిన్ను ధరించడం జరగదు, కాని కేతకీపుష్పాన్ని నా భక్తులు ధరిస్తారు. అదేవిధంగా కేతకీపుష్పము ఛత్ర రూపములో నాపై ఉంటుంది అని చెబుతాడు.

శివరాత్రి పర్వదినం

ఆ తరువాత బ్రహ్మ, విష్ణువు ఆదిగా గల దేవతలు శివుడిని ధూపదీపాలతో అర్చించారు. దీనికి మెచ్చి శివుడు అక్కడి వారితో "మీరీనాడు చేసిన పూజకు సంతసించితిని. ఈ రోజు నుండి నేను అవతరించిన ఈ తిథి శివరాత్రి పర్వదినముగా ప్రసిద్ధి చెందుతుంది.

ఈ రోజున ఉపవాసము చేసి భక్తితో నన్ను లింగ రూపముగా, సాకార రూపముగా ఎవరు అర్చిస్తారో వారికి మహాఫలము కలుగుతుంది" అని చెప్పాడు. తాను ఈ విధంగా అగ్నిలింగరూపముగా ఆవిర్భవించిన ప్రదేశము అరుణాచలముగా ప్రసిద్ధిచెంద గలదని చెబుతాడు.

శివరాత్రి నాడు ఏమి చేయాలి?

"మహాశివరాత్రి" పర్వదినాన ఉదయం ఐదు గంటలకే నిద్రలేచి, శుచిగా తలస్నానం చేసి, పూజా మందిరమును, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గుమ్మానికి తోరణాలు, పూజామందిరాన్ని ముగ్గులు, రకరకాల పుష్పాలతో అలంకరించుకోవాలి. తెలుపు రంగు బట్టలను ధరించి, శివుని పటాలు, లింగాకార ప్రతిమలకు పసుపు కుంకుమలు పెట్టి పూజకు సిద్ధం చేసుకోవాలి. 

మారేడు దళములు, తెల్లపూల మాలతో భోళాశంకరుడి అలంకరించి, పొంగలి, బూరెలు, గారెలు, అరటి, జామకాయలను నైవేద్యంగా సమర్పించి నిష్టతో పూజించాలి. పూజా సమయంలో శివఅష్టోత్తరము, శివపంచాక్షరీ మంత్రములను స్తుతిస్తే అష్టైశ్వర్యాలు, మోక్షమార్గాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు. 

అదేవిధంగా.. నిష్ఠతో ఉపవాసముండి శివసహస్ర నామము, శివ పురాణము, శివారాధన పారాయణం చేసే వారికి మరు జన్మంటూ లేదని శాస్త్రాలు చెబుతున్నాయి. శివరాత్రి సాయంత్రం ఆరు గంటల నుంచి, మరుసటి రోజు ఉదయం ఆరుగంటల వరకు శివపరమాత్మ స్తోత్రములతో ఆయన పూజ చేసిన వారికి కైలాస వాసం ప్రాప్తిస్తుందని పండితులు అంటున్నారు.

శివరాత్రి రోజున శివునికి అభిషేకం ఎలా చేయాలంటే..!?

శ్లో|| పుర్రె చేసిన పుణ్యమేమో! పంచ చేరి నీకు కంచమాయే !
వల్లకాటి భాగ్యమేమో ! తనకు తానే నీకు మంచమాయే ! అన్నట్లు శివునికి అభిషేకం అంటే ఎంతో ఇష్టమని పురోహితులు చెబుతున్నారు. పదార్థాలు ఏవైనప్పటికీ శివుడు ముమ్మాటికీ అభిషేక ప్రియుడంటున్నారు. 

ఈ క్రమంలో మహాశివరాత్రి రోజున ఏ పదార్థాలతో శివునిని అభిషేకిస్తే ఎటువంటి ఫలితం దక్కుతుందో చూద్దాం.. కస్తూరి, జవ్వాది, పునుగు, గులాబీ అత్తరు కలిపిన జల మిశ్రమంతో శివలింగానికి అభిషేకం చేస్తే శివసాయుజ్యం లభిస్తుంది. పలురకాల పువ్వులతో శివాభిషేకం నిర్వహిస్తే రాజభోగం కలుగుతుంది. వెండిధూళి లేదా వెండి రజనుతో శివాభిషేకం చేస్తే విద్యాప్రాప్తి కలుగుతుంది.

నవధాన్యములతో శివాభిషేకం చేసినట్లయితే ధన, భార్యా, పుత్రలాభం, పటికబెల్లపు పలుకులతో శివాభిషేకం చేస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఉప్పుతో అభిషేకించితే సౌభాగ్యం చేకూరుతుంది. విభూదితో చేసే అభిషేకం వలన సర్వకార్యాలు లాభిస్తాయి. బెల్లపు పలుకులతో అభిషేకం చేసినట్లయితే ప్రేమవ్యవహారాల్లో జయము కలుగుతుంది. 

వెదరు చిగుళ్ళతో అభిషేకం చేస్తే వంశవృద్ధి, పాలాభిషేకం వలన కీర్తి, సిరి, సుఖములు కలుగును. మారేడు చెట్టు బెరడు, వేర్ల నుంచి తీసిన భస్మంతో చేస్తే దారిద్రనాశనమవుతుంది. 

ఇక పలురకాల పండ్లతో చేసే అభిషేకం జయాన్నిస్తుంది. ఉసిరికాయలతో చేస్తే మోక్షము, బంగారుపొడితే అభిషేకం చేస్తే మహాముక్తి లభిస్తుంది. అష్టదాతువులతో చేసే అభిషేకం వలన సిద్ధి, మణులతో, వాటి పొడులతో అభిషేకించితే అహంకారం తొలగిపోతుంది. పాదరసముతో అభిషేకించితే అష్టైశ్వర్యములు లభిస్తాయి. ఆవునెయ్యి, ఆరు పెరుగుతో శివునికి అభిషేకం చేస్తే ఆయుర్ వృద్ధి కలుగుతుందని పురోహితులు చెబుతున్నారు.
మహాశివరాత్రి రోజున ఎర్రటి ప్రమిదలతో దీపమెలిగిస్తే..!?

శివాయ గౌరీ వదనాబ్జ భృంగ సూర్యాయ దక్షాధ్వర నాశకాయ శ్రీ నీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శ్రీకారాయ నమశ్శివాయ ||
అంటూ ముక్కంటిని స్తుతిస్తూ మహాశివరాత్రి రోజున ఎర్రటి ప్రమిదలతో దీపమెలిగిస్తే కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. మహేశ్వరుడిని మహాశివరాత్రి రోజున లింగోద్భవమూర్తిగా ఉన్న ముక్కంటిని పూజిస్తే సకలసంపదలు చేకూరుతాయి. 

అందుచేత మహాశివరాత్రి రోజున సూర్యోదయానికి ముందే లేచి, తలస్నానము చేయాలి. అటుపిమ్మట పూజామందిరము, ఇంటిని శుభ్రం చేసుకుని, గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరములో ముగ్గులు, పుష్పాలతో అలంకరించుకోవాలి. ఈ రోజున తెల్లటి దుస్తులు ధరించడం మంచిది. 

పూజకు శివుని ఫోటోగానీ లేదా, లింగాకారముతో గల విగ్రహాన్ని సిద్ధం చేసుకోవాలి. అలాగే మారేడు దళములు, తెల్లపూలమాల, నైవేద్యానికి పొంగలి, బూరెలు, గారెల్, అరటి , జామకాయలు సమర్పించుకోవచ్చు.

పూజకు ముందుశివఅష్టోత్తరము, దారిద్ర్యదహన స్తోత్రము, శివారాధన, శివపురాణము, లింగోద్భవ అధ్యాయము వంటివి పారాయణము చేయడం ద్వారా శుభఫలితాలుంటాయి. ఇంకా శివరాత్రి రోజున శ్రీశైలం, శ్రీకాళహస్తి, ద్రాక్షారామం వంటి ఆలయాలను దర్శించడం ద్వారా ఆర్థికాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. 

ఇంకా శివరాత్రిరోజున ఆలయంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, ఏకాదశ రుద్రాభిషేకం, 108 బిందెలతో రుద్రాభిషేకం, శివకళ్యాణము వంటివి నిర్వహించడం శుభఫలితాలిస్తాయని పురోహితులు చెబుతున్నారు.

మహాశివరాత్రి రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు వరకు పూజ చేసుకోవచ్చు. దీపారాధనకు నువ్వులనూనె, ఐదు వత్తులు ఉపయోగించాలి. పంచహారతి ఇవ్వడం మంచిది. అలాగే ఇంటికి వచ్చిన ముత్తైదువులకు శివభక్తిమాల, శివకళ్యాణము వంటి పుస్తకాలను తాంబూలముతో కలిపి ఇవ్వాలి.

దైవాన్ని కోరిక ఎలా కోరాలి

దైవాన్ని కోరిక ఎలా కోరాలి

1.నువ్వు బతికి ఉన్నంత కాలం ధార్మిక కార్యాలు నీ సంపదతో చేయాలి అని కోరుకోవాలి, అంటే ఎప్పుడూ నువ్వు ఇచ్చే స్థితిలో ఉండాలి అని అర్థం అంటే ఎప్పటికీ నీకు సంపాదన ఉంటుంది.

2. నా ఇంట్లొ దైవానికి నిత్య నైవేద్యం ఉండాలి అని కోరుకోవాలి అంటే నీ ఇంట్లో ధాన్యం ఎప్పుడూ నిలువ ఉంటుంది.

3. నా ఇంట్లో నేను నిత్య పూజ రోజు చేయాలి అని కోరుకోవాలి అంటే నీ ఆరోగ్యం బాగుంటే నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఉంటే నీ ఇంట్లో నిత్య పూజ చేస్తావు..

4. నా ఇంటికి ఎవ్వరు వచ్చినా కడుపునిండా భోజనం చేసి వెళ్ళాలి అని కోరుకోవాలి అంటే నీకు అనుకూల వతి అయిన ధర్మపత్నీ (పతి) భాగస్వామి అవుతుంది.

5. నేను నా చివరి దశ వరకు నీ క్షేత్రానికి దర్శనానికి రావాలి అంటే నీకు సంపూర్ణ మైన ఆరోగ్యాన్ని ఇవ్వమని అడగటం..

6. భాగవతులతో నీ గడప నిండుగా ఉండాలి అని కోరుకోవాలి  అంటే నీకు సమాజంలో తగిన గౌరవం మంచి పేరు రావాలి అని కోరుకోవడం...

7. కుటుంబం అంతా సంతోషం గా క్షేత్ర దర్శనంకి రావాలి అని కోరాలి అంటే నువ్వు ఆరోగ్యంగా, ఆర్ధికంగా, కుటుంబం లో అన్యోన్యంగా ఉంటేనే జరుగుతుంది ఇంక ఏమీ కావాలి జీవితానికి..

8. చివరిగా నేను పండు ముత్తైదువుగా సంతోషంగా  కాలం చేయాలి అని కోరుకోవాలి అంటే భర్తకు సంపూర్ణ ఆయువు ఆరోగ్యం కోరుకోవడం..
మనకు తల్లిదండ్రులు ఆ దైవమే వారిని కాకా ఎవరిని అడుగుతాము కానీ ఆ అడిగే కోరిక ఇలా ఉంటే ఆ దైవం కూడా అనుగ్రహిస్తుంది.

శివతత్వం: భక్తి, ఆత్మశుద్ధి, ధ్యానం, నిరాడంబరత

శివతత్వం: భక్తి, ఆత్మశుద్ధి, ధ్యానం, నిరాడంబరత


నేడు మహాశివరాత్రి...ఏనాడూ భగవన్నామస్మరణ చేయనివారు కూడా ఈ ఒక్కరోజు క్షణం సేపు భక్తితో మనస్పూర్తిగా ‘ఓం నమః శివాయః’ అంటూ పంచాక్షరీ మంత్రం జపిస్తే చాలు ఆత్మశుద్ధి, పాపహరణ జరుగుతుందని పెద్దలు చెపుతారు. సూక్షంలో మోక్షం అంటే ఇదేనేమో? ఏమీ తెలియని భక్త కన్నప్ప తన చిన్నబుర్రకు తోచినట్లు శివయ్యకు భక్తితో పూజలు చేసినందుకు మోక్షం పొందాడు. ఇంత సులువైనది శివపూజ. 

ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏల..చితశుద్ధి లేని శివపూజలేలయా..? అనే పెద్దల మాటను మరిచి చాలా మంది కేవలం పుణ్యం, మోక్షం సంపాదించుకోవాలనే తపనతో పూజాపునస్కారాలు చేస్తుంటారు. పరమేశ్వరుని భక్తి భావంతో పూజలు చేయాలి తప్ప కోర్కెల జాబితాలను మనసులో చదువుకొంటూ కాదు. క్షణం పాటు భగవన్నామస్మరణ చేసినా ఆ భగవంతుని రూపాన్నే మనసులో ప్రతిష్టించుకొని భక్తితో ధ్యానం చేయడం చాలా ముఖ్యం. శివుని తపోముద్ర, నిర్వికారమైన లింగాకారం రెండూ సూచిస్తున్నవి అవే. కనుక ఎంత అట్టహాసంగా శివపూజలు చేశామని కాక ఎంత భక్తితో చేశామనేదే ముఖ్యం. శివతత్వం చెపుతున్న మరోవిషయం నిరాడంబరత. సకలజగత్తును శాసిస్తున్న ఆ మహాశివుడు ఒక యోగిగా మనకు కనబడటంలో పరమార్ధం అదే. సామాన్య మానవులమైన మనం బంధాలు, ఆశలు, కోర్కెలకు అతీతంగా జీవించలేకపోవచ్చు కానీ ఈ శివతత్వం అర్ధం చేసుకొని నిరాడంబరతను అలవరచుకొంటే దానిలో నుంచే ఆత్మానందం..ఆత్మశుద్ధి..చివరికి మోక్షప్రాప్తి కలుగుతాయి. ఓం నమః శివాయః, ఓం నమః శివాయః, ఓం నమః శివాయః.... 

శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం - ఫాల్గుణ మాసం.

శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం - ఫాల్గుణ మాసం. ఫాల్గుణమాసంలో మొదటి పెన్నెండు రోజులు, అంటే శుక్లపక్షపాడ్యమి మొదలు ద్వాదశి వరకూ శ్రీమహావిష్ణువు పూజకు ఉత్కృష్టమైన రోజులు. ప్రతి రోజూ తెల్లవారు ఘామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని, శిరస్నానం చేసి సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇచ్చిన అనంతరం, శ్రీమహావిష్ణువును షోడశోపచారాలు, అష్టోత్తరాలతో పూజించి, పాలను నైవేద్యంగా సమర్పించాలి. ఈ పన్నెండురోజుల్లో ఒకరోజుగానీ లేదంటే ద్వాదశి నాడుగానీ వస్త్రాలు, వివిధదాన్యాలను పండితులకు దానముగా ఇవ్వడం మంచిది. శక్తివున్నవారు ఏదైనా వైష్ణవాలయానికి ఆవును దానమివ్వడం విశేష ఫలితాలనిస్తుంది. పూర్ణిమనాడు పరమశివుడిని, శ్రీకృష్ణపరమాత్మను, మహాలక్ష్మినీ పూజించడంతో పాటూ "లింగపురాణం" ను దానముగా ఇవ్వడం మంచిది. అట్లే ఈనాటి సాయంత్రం శ్రీకృష్ణుడిని ఉయ్యాలలో వేసి ఊపవలెను. దీనిని డోలోత్సవం అని అంటారు. దీనినే కొన్ని ప్రాంతాలలో డోలాపూర్ణిమ అని అంటారు. నరాడోలాగతం దృష్ట్యా గోవిందం పురుషోత్తమం ఫాల్గున్యాం ప్రయతోభూత్వా గోవిందస్య పురంప్రజేత్‌ ఉయ్యాలలో అర్చింపబడిన పురుషోత్తముడైన గోవిందుని ఈ రోజున దర్శించిన భక్తులకు వైకుంఠప్రాప్తి కలుగుతుందని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఈ రోజున రంగుపొడులను, రంగునీళ్ళను చల్లుకోవాలని చెప్పబడింది. ఈ రోజున ఉదయాన్నే నూనెతో తలంటిస్నానం చేసి 'చూత కుసుమ భక్షణం' తప్పక చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ పూజ ప్రకారం, ఇంటిని శుభ్రం చేసి, ఇంటి ప్రాంగణంలో తెల్లనిగుడ్డను ఆసనంగా తూర్పుముఖంగా కూర్చుని, ఒక ముత్తైదువుచే వందన తిలకం, నీరాజనాన్ని పొంది చందనంతో కూడిన మామిడి పువ్వులను తినాలి. చూతమగ్ర్యం వసంతస్య మాకందకుసుమం తద సచందనం పిచామ్యద్య సర్వకామ్యార్థ సిద్దయే అనే శ్లోకంతో మామిడిపూతను స్వీకరించాలి. అనంతరం రంగులను నృత్యగానాదులతో చల్లుకోవాలని చెప్పబడింది. అట్లే, హరిహరసుతుడు అయిన అయ్యప్పస్వామి వారు జన్మించిన దినం కూడా ఈనాడే కనుక వారిని పూజించడం విశేష ఫలితాలనిస్తుంది. ఫాల్గుణమాసంలో పూర్ణిమరోజున హోళీపండుగను నిర్వహిస్తుంటారు. ఈ పూర్ణిమ శక్తితో కూడినది. ఏ సంవత్సరమైనా పూర్ణిమ, ఉత్తరఫల్గుణి కలిసి వస్తే, ఆ రోజున మహాలక్ష్మిని షోడశోపచారాలతో ఆరాధించి, లక్ష్మీ అష్టోత్తర శతనామాలు, కనకధారా స్తోత్రాలను పారాయణం చేయడం మంచిది. హోళిరోజూన లక్ష్మీదేవిని ఆరాధిస్తే సమస్త శుభములు కలుగుతాయని పెద్దలవాక్కు. కొన్ని దక్షిణాది ఆలయాలలో ఫాల్గుణపూర్ణిమను చాలా గొప్పగా చేస్తారు. ఈ ఉత్సవం వెనుక ఒక కథ ఉంది. ఒకసారి పార్వతి తన ప్రభావం చేత శివుని కళ్ళు మూతపడేటట్లు చేసింది. శివుని కళ్ళు మూతపడినందు వల్ల జగమంతా అంధకారబంధురమైంది. శివుడు కోపగించు కోవడంతో, అలిగిన పార్వతీదేవి కాంచీపురానికి వచ్చి, తిరిగి శివుని అభిమానాన్ని పొందేందుకు ఒక మామిడి చెట్టు కింద కూర్చుని తపస్సు చేయడం ప్రారంభించింది. ఒకానొక పాల్గుణపూర్ణిమనాడు మామిడి చెట్టు కింద పార్వతీదేవి ప్రాయశ్చిత్త కర్మకాండను పూర్తిచేసింది. అప్పుడు సంతసించిన శివుడు పార్వతిని అనుగ్రహించాడు. అప్పటినుంచి కాంచీపురంలో ఫాల్గుణ పూర్ణిమ ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవాన్ని చూసేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. ఫాల్గుణ మాసములో ఈ విధమైన పూజలను, దానాలను చేయడం వల్ల అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని శాస్త్రవచనం.

Wednesday, February 19, 2020

✍*గుడికి ఎందుకు వెళ్ళాలి?*🙏🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻💐మనలో చాలామందికి గుడికి వెళ్ళే అలవాటు ఉంటుంది. ఆడ-మగ, పెద్ద-చిన్న అనే తేడా లేకుండా మనలో చాలామంది గుళ్ళు గోపురాలను దర్శించుకుంటారు. అసలు గుడికి ఎందుకు వెళ్ళాలి అని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా?

✍*గుడికి ఎందుకు వెళ్ళాలి?*🙏
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
💐మనలో చాలామందికి గుడికి వెళ్ళే అలవాటు ఉంటుంది. ఆడ-మగ, పెద్ద-చిన్న అనే తేడా లేకుండా మనలో చాలామంది గుళ్ళు గోపురాలను దర్శించుకుంటారు. అసలు గుడికి ఎందుకు వెళ్ళాలి అని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? కాసేపు కాలక్షేపం కోసం లేదా ఏమైనా దిగుళ్ళు ఉంటే మర్చిపోవడం కోసం అనుకుంటే పొరపాటు.
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
💐గుడికి వెళ్ళడం మొక్కుబడి వ్యవహారం కాదు. ఆలయాలను దర్శించుకోవడం వెనుక శాస్త్రీయ ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. అసలు గుడి ఎప్పుడు, ఎందుకు, ఎలా ఏర్పడింది? దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి, ఈ విషయమై వేదాలు ఏం చెప్తున్నాయి మొదలైన అంశాలు తెలుసుకోవడం చాలా అవసరం.
⛳మనదేశంలో చిన్నా పెద్దా వేలాది దేవాలయాలు ఉన్నాయి. అయితే అవన్నీ వైదిక దేవాలయాల పరిగణనలోకి రావు. నియమాలను పాటించి, నిర్దుష్టంగా నిర్మించిన ఆలయాలను మాత్రమే గురువులు పరిగణిస్తారు. అలాంటివే అత్యంత ప్రసిద్ధి చెందాయి. ఇతర దేవాలయాలు కూడా పవిత్ర ప్రదేశాలే అయినప్పటికీ కొన్ని ఆలయాలు మరింత పునీతమయ్యాయి. స్థలమహత్యాన్ని సంతరించుకున్నాయి.
🏹భూమిలో మహత్తరమైన ఆకర్షణ శక్తి తరంగాలు ఎక్కడ ప్రసరిస్తూ ఉంటాయో అక్కడ ఆలయాన్ని నిర్మించాలి. ఇంకా అర్ధమయ్యేట్లు చెప్పాలంటే ఉత్తర దక్షిణ ధ్రువాల మధ్య ఎలా ఆకర్షణ శక్తి ఉంటుందో అలా భూమిలో పాజిటివ్ ఎనర్జీ పాసయ్యేచోట ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. అందుకే అలాంటి గుళ్ళలో అడుగు పెట్టగానే తనువూ, మనసూ ప్రశాంతత పొందుతాయి.
⛳దేవాలయ గర్భగృహంలో ఉత్క్రుష్టమైన ఆకర్షణా తరంగాలు కేంద్రీకృతమైన చోట మూలవిరాట్టును నిలిపిన ప్రదేశంలో వేదమంత్రాలు రాసిన తామ్ర పత్రాన్ని (రాగి రేకు) నిక్షిప్తం చేసి ఉంచుతారు. రాగి లోహానికి భూమిలో ఉండే శక్తి తరంగాలను గ్రహించే తత్వం ఉంది. ఆవిధంగా రాగి గ్రహించిన ఆకర్షణను ఆ పరిసర ప్రాంతాలకు విడుదల చేస్తుంది.
🌷అందువల్ల రోజూ గుడికి వెళ్ళి మూల విరాట్టు ఉన్న గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసే అలవాటు ఉన్నవారికి ఆ తరంగాలు సోకి అవి శరీరంలోకి ప్రవహిస్తాయి. ఎప్పుడో ఒకసారి ఆలయానికి వెళ్ళేవారిలో ఆ శక్తి సోకినా గమనించదగ్గ తేడా తెలీదు. కానీ నిత్యం గుడికి వెళ్ళేవారిలో పాజిటివ్ ఎనర్జీ చేరడం స్పష్టంగా తెలుస్తుంది.
ఇకపోతే గర్భగుడి మూడువైపులా పూర్తిగా మూసి ఉండి, ఒక్కవైపు మాత్రమే తెరిచి ఉంటుంది. అందువల్ల గర్భాలయంలో, ముఖద్వారం దగ్గర పాజిటివ్ ఎనర్జీ కేంద్రీకృతమై మరీ అధికంగా ఉంటుంది. గర్భగుడిలో వెలిగించే దీపం ఉత్పత్తి చేసే శక్తి కూడా చెప్పుకోదగ్గదే.
⛳ఆలయాల్లో గంటలు మోగిస్తారు. వేద మంత్రాలు పఠిస్తారు. భక్తి గీతాలు ఆలపిస్తారు. ఈ మధుర ధ్వనులు శక్తిని సమకూరుస్తాయి.
⛳గుడిలో దేవుడికి సమర్పించే పుష్పాలు, కర్పూర హారతి, అగరొత్తులు, గంధం, పసుపు, కుంకుమల నుంచి వచ్చే పరిమళాలు శరీరంలో రసాయన చర్య జరపడంవల్ల శక్తి విడుదల అవుతుంది.
🙏మూల విరాట్టును ప్రతిష్ఠించిన ప్రదేశం నుండి విడుదలయ్యే మహత్తర శక్తి తరంగాలకు గుడిగంటలు, మంత్ర ఘోష, పూల పరిమళాలు, కర్పూరం, అగరొత్తులు, గంధం, పసుపు, కుంకుమల నుండి వచ్చే అపురూపమైన సుగంధం, తీర్థ ప్రసాదాల్లో ఉండే ఔషధ గుణాలు అన్నీ కలిసి ఎనలేని మేలు జరుగుతుంది.
🌷గుడిలో దేవుడికి కొబ్బరికాయ , అరటిపళ్ళు నైవేద్యం పెడతారు. ఈ కొబ్బరిని, అరటిపళ్ళని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. వీటిని సేవించడం వల్ల శరీరానికి అవసరమైన అనేక ఔషధాలు అందుతాయి.
⛳తీర్థంలో పచ్చ కర్పూరం (Cinnamomum camphora) యాలుకలు (Cardamom) సాంబ్రాణి (సంబరేను చెట్టునుండి వచ్చే ధూపద్రవ్యం లేదా సాంబ్రాణి తైలము - benzoin), తులసి పత్రాలు (holy basil), లవంగాలు (Clove) మొదలైనవి కలుపుతారు. ఆయా పదార్థాలు అన్నీ ఔషధగుణాలు కలిగినవే. అలా గుడికి వెళ్ళినవారు సేవించే తీర్థం ఎంతో మేలు చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఆయురారోగ్యాలను ఇస్తుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేందుకు తోడ్పడుతుంది.
💐ఇప్పుడు చాలామంది పాటించడంలేదు కానీ పూర్వం ఆలయానికి వెళ్ళేప్పుడు పురుషులు చొక్కా (షర్టు) లేకుండా వెళ్ళేవారు. దాంతో ఆలయ ప్రాంగణంలో ఉండే శక్తి తరంగాలు వేగంగా పురుషుల శరీరంలో ప్రవేశిస్తాయి. స్త్రీలు నిండుగా దుస్తులు వేసుకుని అనవసరమైన చూపులు తమపై పడకుండా జాగ్రత్త పడటం మన సంప్రదాయం కనుక అందుకు బదులుగా నగలు ధరించి వెళ్ళేవారు.
🌄లోహానికి శక్తి తరంగాలను త్వరితంగా గ్రహించే శక్తి ఉంటుంది. ఆవిధంగా స్త్రీపురుషులిద్దరికీ ప్రయోజనం కలుగుతుంది.
🎇భక్తులు గుడికి వెళ్ళి దేవుని దర్శించుకుంటున్న సమయంలో గర్భగుడిలో దీపం వెలుగుతుంటుంది.
🙏 కర్పూరహారతి వెలిగిస్తారు. గంటలు మోగుతాయి.తీర్థ ప్రసాదాలు ఇస్తారు. అలా అన్ని పాజిటివ్ ఎనర్జీలూ సమీకృతమై భక్తులకు ఆనందం, ఆరోగ్యం లభిస్తాయి. మనలో దివ్య శక్తి ప్రవేశించి, తేజస్సు అనుభూతికొస్తుంది. కనుక ఆలయానికి వెళ్ళడం కాలక్షేపం కోసం కాదు, ఎన్నో శక్తి తరంగాలు ప్రవేశిస్తాయని శాస్త్రాలు నిరూపిస్తున్నాయి.🙏🙏 🙏🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఈ మెసేజ్ చదివిన తరువాత 
ఈమెసేజ్ ను  మీరు ఒక పదిమందికి పంపండి.
🙏🙏🙏🙏🙏🍁🍁🍁🍁🍁

Monday, February 17, 2020

ఈ గణేశ ద్వాదశనామాలు నిత్యం పారాయణ చేసే విద్యార్థులకు, విద్యాబుద్ధులు బాగా అలవడుతాయిశ్రీ గణేశ ద్వాదశనామ స్తోత్రం

ఈ గణేశ ద్వాదశనామాలు నిత్యం పారాయణ చేసే విద్యార్థులకు, విద్యాబుద్ధులు బాగా అలవడుతాయి

శ్రీ గణేశ ద్వాదశనామ స్తోత్రం

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ |
ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వవిఘ్నోపశాంతయేః ||

అభీప్సితార్థ సిధ్యర్థం పూజితో యః సురాసురైః |
సర్వవిఘ్నహరస్తస్మై గణాధిపతయే నమః ||

గణానామధిపశ్చండో గజవక్త్రస్త్రిలోచనః |
ప్రసన్నో భవ మే నిత్యం వరదాతర్వినాయక ||

సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః |
లంబోదరశ్చ వికటో విఘ్ననాశో వినాయకః ||

ధూమ్రకేతుర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః |
ద్వాదశైతాని నామాని గణేశస్య తు యః పఠేత్ ||

విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ విపులం ధనమ్ |
ఇష్టకామం తు కామార్థీ ధర్మార్థీ మోక్షమక్షయమ్ ||

విధ్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా |
సంగ్రామే సంకటే చైవ విఘ్నస్తస్య న జాయతే ||

ఇతి ముద్గలపురాణోక్తం శ్రీగణేశద్వాదశనామస్తోత్రం సంపూర్ణమ్ ||

(ఈ గణేశ ద్వాదశనామాలు నిత్యం పారాయణ చేసే విద్యార్థులకు, విద్యాబుద్ధులు బాగా అలవడుతాయి)

*శుభోదయం* చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు ,పూలురాలిపోతుoటాయి.

*శుభోదయం* 

చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు ,పూలు
రాలిపోతుoటాయి. అలాగే మనమెంత నీతిగా బ్రతికినా, కష్టాలు,కన్నీళ్ళు వస్తుoటాయి, పోతుoటాయి. ఇక్కడ మనం నేర్చుకోవలసిoది తడబడటం కాదు, నిలబడటం. అప్పుడే మనం మహోన్నత శిఖరాలకు ఎదుగ గలము...
              విజయవంతమైన జీవితానికి
అవసరమైనదంతా మనిషి మనసులో ఉంది!!

కుట్రలు, కుత్రంత్రాలతో విజయాన్ని సాధించామానుకున్నవారంతా మన కళ్ళముందే పతనావస్థకు చేరుకుంటున్నారు. వారి ప్రక్కన దైవం లేకపోవడమే, వారి యొక్క పతనానికి అసలు కారణం. అందుకే మన పెద్దలు చెప్పిన నీతినియమాలను పాటిస్తూ, ఆ సర్వేశ్వరుని అండతో ముందుకు సాగండి. మీ గమనానికి అడ్డు ఉండదు.మీకు జయమగుగాక!

మీకు జయమగుగాక!

సాటివారు నిన్ను సాధింపగాలేరు
దైవమెపుడు నీకు దప్పకున్న
భారతంబులోని పరమార్థమిదె కదా
విశ్వదాభిరామ వినురవేమ!

“దైవం నీపక్షాన ఉన్నప్పుడు నిన్నెవరూ జయించలేరు. భారతంలోని పరమార్థం ఇదే!” అని వేమన చెబుతున్నాడు. అవును, పరంధాముడు పాండవుల పక్షాన ఉన్నందుకే, వారిని జయలక్ష్మి వరించింది. అయితే స్వామి కౌరవులను వదలి పాండవుల పక్షమే ఎందుకు నిలిచాడని అడిగితే, ఆయన ధర్మపక్షపాతి కనుక, న్యాయం ఎటువైపు ఉంటుందో, అటు వైపే దైవం ఉంటుందన్నది సమాధానం.

ఈ విషయాన్నే అద్యతన భారతంలో మనం చూస్తున్నాం. కుట్రలు, కుత్రంత్రాలతో విజయాన్ని సాధించామానుకున్నవారంతా మన కళ్ళముందే పతనావస్థకు చేరుకుంటున్నారు. వారి ప్రక్కన దైవం లేకపోవడమే, వారి యొక్క పతనానికి అసలు కారణం.  అందుకే మన పెద్దలు చెప్పిన నీతినియమాలను పాటిస్తూ, ఆ సర్వేశ్వరుని అండతో ముందుకు సాగండి. మీ గమనానికి అడ్డు ఉండదు.

మీకు జయమగుగాక!

శ్రీమద్భగవద్గీతపన్నెండవ అధ్యాయంభక్తియోగంఅర్జున ఉవాచ

శ్రీమద్భగవద్గీత

పన్నెండవ అధ్యాయం

భక్తియోగం

అర్జున ఉవాచ

ఏవం సతతయుక్తా యే భక్తాస్త్వాం పర్యుపాసతే |
యే చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః ||  1

అర్జునుడు: ఇలా నిరంతరం మనస్సు నీ మీదే నిలిపి నిన్ను భజించే భక్తులు ఉత్తములా ? ఇంద్రియాలకు గోచరించని ఆత్మ స్వరూపాన్ని ఆరాధించే వాళ్ళు ఉత్తములా? 

శ్రీ భగవానువాచ

మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే |
శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః ||   2

శ్రీ భగవానుడు: నా మీదే మనసు నిలిపి నిత్యనిష్ఠతో, పరమ శ్రద్ధతో నన్ను ఉపాసించే వాళ్ళే ఉత్తమయోగులని నా ఉద్దేశం.

యే త్వక్షరమనిర్దేశ్యమ్ అవ్యక్తం పర్యుపాసతే |
సర్వత్రగమచింత్యం చ కూటస్థమచలం ధ్రువమ్ ||   3

సంనియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః |
తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః ||   4

ఇంద్రియాలన్నింటినీ బాగా వశపరచుకుని, సర్వత్రా సమభావం కలిగి, సమస్త భూతాలకూ మేలు చేయడంలోనే సంతోషం పొందుతూ నాశరహితమూ అనిర్వచనీయమూ అవ్యక్తమూ సర్వవ్యాప్తమూ ఊహాతీతమూ నిర్వికారమూ నిశ్చలమూ నిత్యమూ అయిన ఆత్మ స్వరూపాన్ని ఉపాసించేవాళ్ళు నన్నే పొందుతారు. 

క్లేశో௨ధికతరస్తేషామ్ అవ్యక్తాసక్తచేతసామ్ |
అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే ||    5

ఆవ్యక్తమైన ఆత్మ స్వరూపాన్ని ఆదరించేవాళ్ళ శ్రమ ఎంతో ఎక్కువ. ఎందువలనంటే శరీరం మీద అభిమానం కలవాళ్ళకు అవ్యక్త బ్రహ్మం మీద నిష్ఠ కుదరటం కష్టసాధ్యం. 

యే తు సర్వాణి కర్మాణి మయి సన్న్యస్య మత్పరాః |
అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే ||   6

తేషామహం సముద్ధర్తా మృత్యుసంసారసాగరాత్ |
భవామి నచిరాత్ పార్థ మయ్యావేశితచేతసామ్ ||   7

పార్థా ! సమస్త కర్మలూ నాకే సమర్పించి నన్నే పరమగతిగా భావించి ఏకాగ్రతతో నన్ను ధ్యానిస్తూ సేవించే నా భక్తులను, మనసు నా మీదే నిలిపే వాళ్ళను మృత్యుముఖమైన సంసారసాగరం నుంచి అచిరకాలంలోనే నేను ఉద్ధరిస్తాను. 

మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ |
నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః ||   8

నా మీదే మనసును బుద్ధిని నిలుపు. ఆ తరువాత తప్పకుండా నీవు నాలోనే నివసిస్తావు.

అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరమ్ |
అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ ||   9

ధనంజయా ! అలా మనసు నామీద నిశ్చలంగా నీవు నిలపలేక పోతే అభ్యాసయోగంతో నన్ను పొందడానికి ప్రయత్నించు.

అభ్యాసే௨ప్యసమర్థో௨సి మత్కర్మపరమో భవ |
మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి ||   10

అభ్యాసం చేయడంలోనూ అసమర్థుడవైతే నా కోసం కర్మలు ఆచరించు. నాకు ప్రీతి కలిగించే కర్మలు చేయడం వల్ల కూడా నీవు మోక్షం పొందగల్గుతావు.

అథైతదప్యశక్తో௨సి కర్తుం మద్యోగమాశ్రితః |
సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్ ||   11

ఇక అదీ చేయలేకపోతే నన్ను ఆశ్రయించి మనోనిగ్రహంతో నీవు చేసే సమస్త కర్మల ఫలాలూ త్యగం చేయి.

శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాద్ధ్యానం విశిష్యతే |
ధ్యానాత్‌కర్మఫలత్యాగః త్యాగాచ్ఛాంతిరనంతరమ్ ||  12

అవివేకంతో కూడిన అభ్యాసం కంటే జ్ఞానం మేలు; జ్ఞానం కంటే ధ్యానం ఉత్తమం; ధ్యానం కంటే కర్మఫలత్యాగం మంచిది. ఆ త్యాగం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.  

అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ |
నిర్మమో నిరహంకారః సమదుఃఖసుఖః క్షమీ ||  13

సంతుష్టస్సతతం యోగీ యతాత్మా దృఢనిశ్చయః |
మయ్యర్పితమనోబుద్ధిః యో మద్భక్తస్స మే ప్రియః ||  14

సమస్త ప్రాణులపట్ల ద్వేషం లేకుండా స్నేహభావం, దయ కలిగి, అహంకార మమకారాలు విడిచిపెట్టి సుఖదుఃఖాలను సమానంగా చుస్తూ, ఓర్పుతో వ్యవహరిస్తూ, నిత్యం సంతృప్తితో, యోగసాధనతో, ఆత్మనిగ్రహంతో, దృఢసంకల్పంతో మనసు, బుద్ధి నాకు అర్పించిన నా భక్తుడు నాకు ఇష్టుడు. 

యస్మాన్నోద్విజతే లోకో లోకాన్నోద్విజతే చ యః |
హర్షామర్షభయోద్వేగైః ముక్తో యః స చ మే ప్రియః ||  15

తనవల్ల లోకమూ, లోకం వల్ల తను భయపడకుండా సంతోషం, కోపం, భయం, ఆవేశాలకు వశం కాకుండా ఉండేవాడు నాకు ఇష్టుడు. 

అనపేక్షః శుచిర్దక్షః ఉదాసీనో గతవ్యథః |
సర్వారంభపరిత్యాగీ యో మద్భక్తస్స మే ప్రియః ||   16

దేనిమీదా కోరికలు లేనివాడు, పవిత్రుడు, కార్యదక్షుడు, పక్షపాతం లేనివాడు, చీకుచింతా లేనివాడు, ఆడంబర కర్మలన్నింటినీ విడిచిపెట్టినవాడు అయిన నా భక్తుడు నాకు ఇష్టుడు. 

యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి |
శుభాశుభపరిత్యాగీ భక్తిమాన్ యస్స మే ప్రియః ||   17

సంతోషం, ద్వేషం లేకుండా దుఃఖం, కోరికలు, శుభాశుభాలు విడిచిపెట్టిన నా భక్తుడంటే నాకు ఇష్టం. 

సమశ్శత్రౌ చ మిత్రే చ తథా మానావమానయోః |
శీతోష్ణసుఖదుఃఖేషు సమస్సంగవివర్జితః ||   18

తుల్యనిందాస్తుతిర్మౌనీ సంతుష్టో యేన కేనచిత్ |
అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః ||          19

శత్రువులపట్ల, మిత్రులపట్ల అలాగే మానావమానాలు, శీతోష్ణాలు, సుఖదుఃఖాలు, దూషణభూషణలపట్ల సమభావం కలిగినవాడు, దేనిమీదా ఆసక్తి లేనివాడు, మౌనంగా ఉండేవాడు, ఏ కొద్దిపాటి దొరికినా సంతృప్తి చెందేవాడు, స్థిరనివాసం లేనివాడు,దృఢనిశ్చయం కలిగినవాడు అయిన నా భక్తుడు నాకు ఇష్టుడు.

యే తు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే |
శ్రద్దధానా మత్పరమా భక్తాస్తే௨తీవ మే ప్రియాః ||  20

శ్రద్ధతో నన్నే పరమ గతిగా నమ్మి అమృతం లాంటి ఈ ధర్మాన్ని నేను చెప్పినట్లు పాటించే నా భక్తులు నాకు చాలా ఇష్టులు.

ఇలా ఉపనిషత్తులు, బ్రహ్మవిద్య, యోగశాస్త్రం, శ్రీకృష్ణార్జున సంవాదం అయిన శ్రీమద్భగవద్గీతలోని "భక్తియోగం" అనే పన్నెండవ అధ్యాయం సమాప్తం.

భస్మ ధారణ:విభుతి పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ విభుతి ధరించిన వారికి పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతు ఉంటాడు.

భస్మ ధారణ:

విభుతి పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ విభుతి ధరించిన వారికి పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతు ఉంటాడు. నరక బాధలు లోనుకాకుండా చూస్తాడు. కాల్చిన పేడను (ఆవు పేడ) ఈ భస్మం లో ఉపయోగిస్తూ ఉంటారు. భస్మ ధారణ చేయకుండా చేసే జపతపాలు ఫలితాలను ఇవ్వవని శాస్త్ర వచనము. మన శరీరములో 32 చోట్ల భస్మ ధారణ చెయ్యాలి అని శాస్త్రము చేప్తోంది, కాని ఈ కాలము లో అలాగ చెయ్యటము వీలుపడని పక్షములో కనీసము శిరస్సు, రెండు చేతులు, గుండే, నాభి అనే ఐదు ప్రదేశాలలో భస్మాన్ని ధరించవచ్చు. త్రిపుండ్రాలుగా (ముడు గీతలు) అడ్డముగా భస్మ ధరణ చెయాలి. ఇలాగ చేస్తే జన్మ జన్మల పాపాలు నసించి పోతాయని పెద్దల వాక్కు.
ఈ భస్మ ధారణ చేయడానికి కొన్ని మంత్రాలు చెప్పబడ్డాయి శాస్త్రాలలో.
బ్రాహ్మణ, క్షత్రీయులు "మానస్తోకే మంత్రము " తో, వైశ్యులు " త్ర్యయంబక " మంత్రము తో , ఇతరులు శివపంచాక్షరి తో భస్మ ధారణ చెయాలి.
ఈ విభుతి మహిమను వివరించే కధ దేవి భాగవతము పదకొండవ స్కందము లో ఉంది.
మహిమాన్వితమైన విభుతిని వివిధ పద్ధతులలో తయారు చేస్తారు. ఆవుపేడను కింద పడనీయకుండా, చేత్తోపట్టుకుని, వేదమంత్రాల మధ్య హోమము చేసి తయారు చేసుకున్న భస్మాన్ని "శాంతికము " అని అంటారు.
షడాక్షరి మంత్రముతో హొమము చేసి తయారు చేసుకునే భస్మాన్ని "పౌష్ఠికం" అని అంటారు. బీజాక్షరాలతో హొమము చేసి తయారు చేసిన భస్మాన్ని "కామదం" అని అంటారు..
భస్మం తయారు చేసుకునే ముందే ఆవుపేడను సేకరించి, చిట్టు, లేక పొట్టును కలుపుతూ ముద్ద చేసి, ఆ ముద్దను పిడకలుగా చేసి అతి శుభ్రమైన ప్రదేశములో ఎండబెట్టాలి.
యాగాలు చేస్తున్నప్పుడు అరణిని మధించడం ద్వార వచిన అగ్నితో గాని, మంత్ర పూర్వకముగా పిడకలను హొమ గుండము లో వేసి హోమము చెయ్యాలి.
అనంతరం శుబ్ర్హమైన పాత్రలో విభుతిని నింపాలి.
హర హర మహా దేవ శంభో శంకర

Sunday, February 16, 2020

శ్రీమద్భగవద్గీత పదకొండవ అధ్యాయంవిశ్వరూపసందర్శనయోగంఅర్జున ఉవాచ:మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మసంజ్ఞితమ్ |యత్త్వయోక్తం వచస్తేన మోహో௨యం విగతో మమ ||

శ్రీమద్భగవద్గీత 

పదకొండవ అధ్యాయం

విశ్వరూపసందర్శనయోగం

అర్జున ఉవాచ:

మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మసంజ్ఞితమ్ |
యత్త్వయోక్తం వచస్తేన మోహో௨యం విగతో మమ ||   1

అర్జునుడు: నామీద దయతలచి అతి రహస్యమూ, ఆత్మజ్ఞాన సంబంధమూ అయిన విషయాలన్నిటినీ ఉపదేశించావు. దానితో నా అజ్ఞానమంతా అంతరించింది.

భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా |
త్వత్తః కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చావ్యయమ్ ||  2

కృష్ణా! సమస్త భూతాల చావుపుట్టుకల గురించి అఖండమైన నీ మహాత్మ్యం గురించి నీ నుంచి వివరంగా విన్నాను.

ఏవమేతద్యథాత్థ త్వమ్ ఆత్మానం పరమేశ్వర |
ద్రష్టుమిచ్ఛామి తే రూపమ్ ఐశ్వరం పురుషోత్తమ ||   3

పరమేశ్వరా! నిన్ను గురించి నీవు చెప్పిందంతా నిజమే. పురుషోత్తమా! ఈశ్వర సంబంధమైన నీ విశ్వరూపాన్ని సందర్శించాలని నా అభిలాష.

మన్యసే యది తచ్ఛక్యం మయా ద్రష్టుమితి ప్రభో |
యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయమ్ ||   4

ప్రభూ! యోగీశ్వరా! నీ విశ్వరూపాన్ని సందర్శించడం నాకు సాధ్యమని నీవు భావిస్తే నిత్యమైన నీ స్వరూపం నాకు చూపించు.

శ్రీ భగవానువాచ

పశ్య మే పార్థ రూపాణి శతశో௨థ సహస్రశః |
నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ ||    5

శ్రీభగవానుడు: పార్థా! అనేక రంగులతో, అనేక ఆకారాలతో ఎన్నో విధాలుగా వందలకొద్ది, వేలకొద్ది వున్న నా దివ్యరూపాలను చూడు.

పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రానశ్వినౌ మరుతస్తథా |
బహూన్యదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత ||   6

అర్జునా ! ఆదిత్యులను, వసువులను, రుద్రులను, అశ్వనీదేవతలను, మరుత్తులను చూడు. అలాగే ఇదివరకు ఎప్పుడూ కనీవినీ ఎరుగని వింతలను వీక్షించు.

ఇహైకస్థం జగత్కృత్స్నం పశ్యాద్య సచరాచరమ్ |
మమ దేహే గుడాకేశ యచ్చాన్యద్దృష్టుమిచ్ఛసి ||   7

అర్జునా! నా శరీరంలో ఒకే భాగంలో వున్న చరాచరాత్మకమైన సకల ప్రపంచాన్నీ సందర్శించు. నీవింకా చూడదలచినదంతా ఈ దేహంలోనే అవలోకించు.

న తు మాం శక్యసే ద్రష్టుమ్ అనేనైవ స్వచక్షుషా |
దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరమ్ ||  8

నీ కళ్ళతో నన్ను నీవు చూడలేవు. నీకు దివ్యదృష్టినిస్తున్నాను; దానితో నా విశ్వరూపం చూడు.

సంజయ ఉవాచ

ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః |
దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరమ్ ||   9

సంజయుడు: ధృతరాష్ట్ర మహారాజా! మహాయోగీశ్వరుడైన శ్రీకృష్ణభగవానుడు అలా చెప్పి అర్జునుడికి శ్రేష్ఠమైన తన విశ్వరూపం చూపించాడు.

అనేకవక్తృనయనమ్ అనేకాద్భుతదర్శనమ్ |
అనేకదివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధమ్ ||   10

దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనమ్ |
సర్వాశ్చర్యమయం దేవమ్ అనంతం విశ్వతోముఖమ్ ||  11

ఆ రూపం అనేక ముఖాలతో, నేత్రాలతో, అద్భుతదృశ్యాలతో, దివ్యాభరణాలతో, ఎక్కుపెట్టిన పెక్కుదివ్యాయుధాలతో, దివ్యపుష్పమాలలతో, దివ్యవస్త్రాలతో, దివ్యగంధాలతో, మహాశ్చర్యకరం, దేదీప్యమానం, అనంతం, విశ్వతోముఖమూ అయి విరాజిల్లుతున్నది.

దివి సూర్యసహస్రస్య భవేద్యుగపదుత్థితా |
యది భాః సదృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః ||  12

ఏకకాలంలో ఆకాశంలో వేయిమంది సూర్యులు వెలువడితే కలిగే  కాంతి ఆ మహాత్ముడి విశ్వరూపతేజస్సుకు సాటికావచ్చు.

తత్రైకస్థం జగత్కృత్స్నం ప్రవిభక్తమనేకధా |
అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవస్తదా ||    13

అప్పుడు అర్జునుడు దేవదేవుడి దేహంలో ఒకేచోట, ఎన్నోవిధాలుగా విభజించబడివున్న సమస్త ప్రపంచాన్నీ సందర్శించాడు.

తతః స విస్మయావిష్టో హృష్టరోమా ధనంజయః |
ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత ||    14

అనంతరం అర్జునుడు ఆశ్చర్యచకితుడై శరీరం పులకరించగా భగవంతుడికి తలవంచి నమస్కరించి చేతులు జోడించి ఇలా అన్నాడు.

అర్జున ఉవాచ

పశ్యామి దేవాంస్తవ దేవ దేహే
సర్వాంస్తథా భూతవిశేషసంఘాన్ |
బ్రహ్మాణమీశం కమలాసనస్థమ్
ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్ ||    15

అర్జునుడు: దేవా! నీ దేహంలో సమస్త దేవతలనూ, చరాచర జగత్తునూ, కమలాసనంలో వున్న బ్రహ్మనూ, సర్వఋషులనూ దివ్యసర్పాలనూ చూస్తున్నాను.

అనేకబాహూదరవక్తృనేత్రం
పశ్యామి త్వాం సర్వతో௨నంతరూపమ్ |
నాంతం న మధ్యం న పునస్తవాదిం
పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప ||      16

విశ్వేశ్వరా! విశ్వరూపా! ఎన్నో భుజాలు, కడుపులు, ముఖాలు, కళ్ళు కలిగిన నీ అనంతరూపాన్ని అంతటా చూస్తున్నాను. నీ తుదీ, మొదలూ, మధ్యా మాత్రం నాకు కానరావడం లేదు.

కిరీటినం గదినం చక్రిణం చ
తేజోరాశిం సర్వతో దీప్తిమంతమ్ |
పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాత్
దీప్తానలార్కద్యుతిమప్రమేయమ్ ||     17

కిరీటం, గద, చక్రం ధరించి దశదిశలా కాంతిపుంజం లాగ వెలుగొందుతూ, చూడడానికి సాధ్యపడకుండా సూర్యాగ్ని కాంతికి సమానంగా ప్రజ్వలిస్తున్న అంతూ దరీ లేని నిన్ను అంతటా చూస్తున్నాను.

త్వమక్షరం పరమం వేదితవ్యం
త్వమస్య విశ్వస్య పరం నిధానమ్ |
త్వమవ్యయః శాశ్వతధర్మగోప్తా
సనాతనస్త్వం పురుషో మతో మే ||      18

నీవు తెలుసుకోదగ్గ పరబ్రహ్మవనీ, సమస్త జగత్తుకీ ముఖ్యాధారమైన వాడవనీ, నాశనం లేనివాడవనీ, సనాతన ధర్మసంరక్షకుడవనీ, పురాణపురుషుడవనీ నేను భావిస్తున్నాను.

అనాదిమధ్యాంతమనంతవీర్యం
అనంతబాహుం శశిసూర్యనేత్రమ్ |
పశ్యామి త్వాం దీప్తిహుతాశవక్త్రం
స్వతేజసా విశ్వమిదం తపంతమ్ ||     19

ఆదిమధ్యాంతాలు లేనివాడవు, అపరిమితమైన సామర్థ్యం కలవాడవు, ఎన్నో చేతులు కలిగినవాడవు, చంద్రసూర్యులు కన్నులుగా కలవాడవు, ప్రజ్వలిస్తున్న అగ్నిలాంటి ముఖం కలవాడవు, నీ తేజస్సుతో ఈ జగత్తునంతటినీ తపింపచేస్తున్నవాడవు అయిన నీవు నాకు సాక్షాత్కరిస్తున్నావు.

ద్యావాపృథివ్యోరిదమంతరం హి
వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః |
దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం
లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్ ||     20

మహాత్మా! భూమికీ ఆకాశానికీ మధ్యవున్న ఈ ప్రదేశమూ, దశదిశలూ నీతో నిండివున్నాయి. అద్భుతం, అతిభయంకరం అయిన నీ ఈ విశ్వరూపం చూసి మూడులోకాలూ గడగడ వణకుతున్నాయి.

అమీ హి త్వాం   సురసంఘా విశంతి
కేచిద్భీతాః ప్రాఞ్జలయో గృణంతి |
స్వస్తీత్యుక్త్వా మహర్షిసిద్ధసంఘాః
స్తువన్తి త్వాం  స్తుతిభిః పుష్కలాభిః ||    21

ఈ దేవతాసమూహాలు నీలో ప్రవేశిస్తున్నాయి. కొంతమంది భీతితో చేతులు జోడించి నిన్ను స్తుతిస్తున్నారు. మహర్షులు, సిద్ధుల సమూహాలు మంగళవాక్యాలు పలికి సంపూర్ణ స్తోత్రాలతో నిన్ను పొగడుతున్నారు.

రుద్రాదిత్యా వసవో యే చ సాధ్యాః
విశ్వే௨శ్వినౌ మరుతశ్చోష్మపాశ్చ |
గంధర్వయక్షాసురసిద్ధసంఘా
వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే ||     22

రుద్రులు, ఆదిత్యులు, వసువులు, సాధ్యులు, విశ్వేదేవతలు, అశ్వినీ దేవతలు, మరుత్తులు, పితృదేవతలు, గంధర్వయక్షసిద్ధ అసురసంఘాలు–వీళ్ళంతా నిన్ను విస్మయంతో వీక్షిస్తున్నారు.

రూపం మహత్తే బహువక్త్రనేత్రం
మహాబాహో బహుబాహూరుపాదమ్ |
బహూదరం బహుదంష్ట్రాకరాలం
దృష్ట్వా లోకాః ప్రవ్యథితాస్తథాహమ్ ||    23

మహాబాహో ! ఎన్నో ముఖాలు, కళ్ళు, చేతులు, తొడలు, పాదాలు, కడుపులు, కోరలతో భయంకరంగా వున్న నీ రూపం చూసి లోకులంతా ఎంతో భయపడుతున్నారు; అలాగే నేనూ భయపడుతున్నాను.

నభఃస్పృశం దీప్తమనేకవర్ణం
వ్యాప్తాననం దీప్తవిశాలనేత్రమ్ |
దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాంతరాత్మా
ధృతిం న విందామి శమం చ విష్ణో ||     24

ఆకాశాన్ని అంటుతూ, అనేకరంగులతో ప్రకాశిస్తూ, నోళ్ళు విప్పి, ఉజ్జ్వల విశాల నేత్రాలతో వున్న నిన్ను చూసి ఎంతో భయపడిపోయిన నేను ధైర్యం, శాంతి పొందలేకపోతున్నాను.

దంష్ట్రాకరాలాని చ తే ముఖాని
దృష్ట్వైవ కాలానలసన్నిభాని |
దిశో న జానే న లభే చ శర్మ
ప్రసీద దేవేశ జగన్నివాస ||      25

కోరలతో భయంకరంగా ప్రళయకాలంలోని అగ్నిలాగ కానవస్తున్న నీ ముఖాలు నాకు దిక్కుతోచకుండా చేశాయి. దేవేశా! జగన్నివాసా! దిగులు పడివున్న నన్ను అనుగ్రహించు.

అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః
సర్వే సహైవావనిపాలసంఘైః |
భీష్మో ద్రోణః సూతపుత్రస్తథాసౌ
సహాస్మదీయైరపి యోధముఖ్యైః ||     26

వక్త్రాణి తే త్వరమాణా విశంతి
దంష్ట్రాకరాలాని భయానకాని |
కేచిద్విలగ్నా దశనాంతరేషు
సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః ||     27

ఎంతోమంది రాజులతోపాటు ఈ ధృతరాష్ట్రుడి పుత్రులు, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, అలాగే మనపక్షానికి చెందిన ప్రముఖయోధులూ వాడికోరలతో భయంకరాలైన నీ నోళ్ళలోకి వడివడిగా ప్రవేశిస్తున్నారు. వాళ్ళలో కొంతమంది నీ పళ్ళసందులో ఇరుక్కుపోయి పొడి అయిపోతున్న తలలతో కనిపిస్తున్నారు.

యథా నదీనాం బహవో௨0బువేగాః
సముద్రమేవాభిముఖా ద్రవంతి |
తథా తవామీ నరలోకవీరాః
విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి ||      28

అనేక నదీ ప్రవాహాలు సముద్రంవైపు వేగంగా పరుగెత్తుతున్నట్లే ఈ పరలోక వీరులంతా ప్రజ్వలిస్తున్న నీ ముఖంలో ప్రవేశిస్తున్నారు.

యథా ప్రదీప్తం జ్వలనం పతంగాః
విశంతి నాశాయ సమృద్ధవేగాః |
తథైవ నాశాయ విశంతి లోకాః
తవాపి వక్త్రాణి సమృద్ధవేగాః ||     29

చావుకోసం మిడతలు మిక్కిలి వేగంగా మండుతున్న అగ్నిలో ప్రవేశించినట్లే నశించడం కోసం మహావేగంగా నీ నోళ్ళలో ఈ ప్రజలంతా ప్రవేశిస్తున్నారు.

లేలిహ్యసే గ్రసమానః సమంతాత్
లోకాన్ సమగ్రాన్‌వదనైర్జ్వలద్భిః |
తేజోభిరాపూర్య జగత్సమగ్రం
భాసస్తవోగ్రాః ప్రతపంతి విష్ణో ||     30

విష్ణుమూర్తీ! మండుతున్న నీ నోళ్ళతో ఈ సర్వలోకాలనూ మింగుతూ రుచి చూస్తున్నావు. జగత్తునంతటినీ నీ తేజస్సుతో నింపి, తీవ్రమైన కాంతితో దాన్ని తపింపచేస్తున్నావు.

ఆఖ్యాహి మే కో భవానుగ్రరూపో
నమో௨స్తు తే దేవవర ప్రసీద |
విజ్ఞాతుమిచ్ఛామి భవంతమాద్యం
న హి ప్రజానామి తవ ప్రవృత్తిమ్ ||     31

దేవదేవా! ఉగ్రరూపంలోవున్న నీవెవరవో చెప్పు. నీకు నమస్కారం. నన్ను అనుగ్రహించు. ఆదిపురుషుడవైన నిన్ను గురించి తెలుసుకోదలచాను. నీ ప్రవృత్తి నాకు అర్థం కావడం లేదు.

శ్రీ భగవానువాచ

కాలో௨స్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో
లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః |
ఋతే௨పి త్వాం న భవిష్యంతి సర్వే
యే௨వస్థితాః ప్రత్యనీకేషు యోధాః ||    32

శ్రీ భగవానుడు: లోకసంహారానికి విజృంభించిన కాలస్వరూపుణ్ణి నేను. ప్రస్తుతం ఈ ప్రపంచంలో ప్రజలను సంహరించడమే నా సంకల్పం. నీవు యుద్ధం చేయకపోయినా శత్రుసైన్యంలోని వీరులంతా వినాశం పొందడం ఖాయం.

తస్మాత్ త్వముత్తిష్ఠ యశో లభస్వ
జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధమ్ |
మయైవేతే నిహతాః పూర్వమేవ
నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్ ||     33

సవ్యసాచీ! అందువల్ల నీవు యుద్ధానికి సిద్ధమై పేరు ప్రఖ్యాతులు పొందు. శత్రువులను జయించి సమృద్ధమైన రాజ్యాన్ని అనుభవించు. వీళ్ళందరినీ ముందే నేను చంపేశాను. నీవు నిమిత్తమాత్రంగా నిలబడు.

ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ
కర్ణం తథాన్యానపి యోధవీరాన్ |
మయా హతాంస్త్వం జహి మా వ్యథిష్ఠా
యుధ్యస్వ జేతాసి రణే సపత్నాన్ ||     34

ఇదివరకే నేను సంహరించిన ద్రోణుడు, భీష్ముడు, జయద్రథుడు, కర్ణుడు వంటి వీరులందరినీ నీవు వధించు. భయపడకు. యుద్ధం చెయ్యి. శత్రువులను జయిస్తావు.

సంజయ ఉవాచ

ఏతచ్ఛ్రుత్వా వచనం కేశవస్య
కృతాంజలిర్వేపమానః కిరీటీ |
నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం
సగద్గదం భీతభీతః ప్రణమ్య ||     35

సంజయుడు : శ్రీకృష్ణుడి మాటలు విని అర్జునుడు వణుకుతూ చేతులు జోడించి నమస్కరించి, బాగా భయపడిపోయి మళ్ళీ నమస్కారంచేసి గధ్గద స్వరంతో ఇలా అన్నాడు.

అర్జున ఉవాచ

స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా
జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ |
రక్షాంసి భీతాని దిశో ద్రవన్తి
సర్వే నమస్యన్తి చ సిద్ధసంఘాః ||     36

అర్జునుడు: హృషీకేశా! నీ మహిమను పొగడుతూ జగత్తంతా ఆనందం, అనురాగం పొందుతున్నది. రాక్షసులు భయపడి అన్ని వైపులా పారిపోతున్నారు. సిద్ధులసంఘాలన్నీ నీకు నమస్కరిస్తున్నాయి. నీ విషయంలో ఇదంతా సమంజసమే.

కస్మాచ్చ తే న నమేరన్‌మహాత్మన్
గరీయసే బ్రహ్మణో௨ప్యాదికర్త్రే |
అనంత దేవేశ జగన్నివాస
త్వమక్షరం సదసత్తత్పరం యత్ ||      37

మహాత్మా! నీవు అంతంలేని వాడవు; దేవతలకు దేవుడవు; జగత్తుకంతటికీ ఆధారుడవు; శాశ్వతుడవు; సత్తు అసత్తుల స్వరూపుడవే కాకుండా వాటికి అతీతమైన అక్షరుడవు. అందరికంటే గొప్పవాడవు, బ్రహ్మదేవుడికి కూడా ఆదికారణుడవు అయిన నీకు వాళ్ళెందుకు నమస్కరించరు?

త్వమాదిదేవః పురుషః పురాణః
త్వమస్య విశ్వస్య పరం నిధానమ్ |
వేత్తాసి వేద్యం చ పరం చ ధామ
త్వయా తతం విశ్వమనంతరూప ||      38

నీవు ఆదిశేషుడవు; పురాణపురుషుడవు; ఈ సమస్తజగత్తుకే ఆధారుడవు; సర్వమూ తెలిసినవాడవు; తెలుసుకోదగ్గవాడవు, అనంతరూపా! ఈ విశ్వమంతా పరంధాముడవైన నీతో నిండివున్నది.

వాయుర్యమో௨గ్నిర్వరుణ శ్శశాంకః
ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ |
నమో నమస్తే௨స్తు సహస్రకృత్వః
పునశ్చ భూయో௨పి నమో నమస్తే ||      39

వాయువు, యముడు, అగ్ని, వరుణుడు, చంద్రుడు, బ్రహ్మదేవుడు, అతని తండ్రి నీవే. నీకు అనేక వేల నమస్కారాలు. మళ్ళీ మళ్ళీ నమస్కారాలు.

నమః పురస్తాదథ పృష్ఠతస్తే
నమో௨స్తు తే సర్వత ఏవ సర్వ |
అనంతవీర్యామితవిక్రమస్త్వం
సర్వం సమాప్నోషి తతో௨సి సర్వః ||      40

నీకు ముందు, వెనుక అన్ని వైపులా నా నమస్కారాలు. సర్వస్వరూపా! అపరిమిత సామర్థ్యమూ, అమితపరాక్రమమూ కలిగిన నీవు సర్వత్రా వ్యాపించివున్నావు. అందువల్ల సర్వమూ నీవే.

సఖేతి మత్వా ప్రసభం యదుక్తం
హే కృష్ణ! హే యాదవ! హే సఖేతి|
అజానతా మహిమానం తవేదం
మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి ||     41

యచ్చాపహాసార్థమసత్కృతో௨సి
విహారశయ్యాసనభోజనేషు |
ఏకో௨థ వాప్యచ్యుత తత్సమక్షం
తత్ క్షామయే త్వామహమప్రమేయమ్ ||     42

అచ్యుతా ! నీ మహిమ తెలుసుకోలేక స్నేహితుడవనే వుద్దేశంతో పొరపాటునో, చనువువల్లనో కృష్ణా! యాదవా ! సఖా ! అని నిన్ను నిర్లక్ష్యంగా పిలిచినందుకూ, కలిసిమెలసి తిరిగేటప్పుడు, పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, భోజనం చేసేటప్పుడు ఒంటరిగా వున్నప్పుడు, ఇతరులతో వున్నప్పుడు వేళాకోళంగా నిన్ను అవమానించినందుకు అప్రమేయుడవైన నీవు నా తప్పులన్నిటినీ మన్నించవలసిందిగా ప్రార్థిస్తున్నాను.

పితా௨సి లోకస్య చరాచరస్య
త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ |
న త్వత్సమో௨స్త్యభ్యధికః కుతో௨న్యో
లోకత్రయే௨ప్యప్రతిమప్రభావ ||      43

సాటిలేని ప్రభావం కలిగినవాడా ! ఈ చరాచర ప్రపంచమంతటికీ నీవు తండ్రివి; పూజ్యుడవు; గురుడవు; గురువులకు గురుడవు. మూడు లోకాలలో నీతో సమానమైనవాడే లేనప్పుడు నిన్ను మించినవాడెలా వుంటాడు?

తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం
ప్రసాదయే త్వామహమీశమీడ్యమ్ |
పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః
ప్రియః ప్రియాయార్హసి దేవ సోఢుమ్ ||     44

అందువల్ల ప్రభుడవు, పూజ్యుడవు అయిన నీకు సాష్టాంగ నమస్కారం చేసి నన్ను అనుగ్రహించవలసిందిగా వేడుకుంటున్నాను. దేవా! తండ్రి కొడుకునీ, స్నేహితుడు స్నేహితుణ్ణీ, ప్రియుడు ప్రియురాలినీ క్షమించినట్లు నీవు నన్ను మన్నించాలి.

అదృష్టపూర్వం హృషితో௨స్మి దృష్ట్వా
భయేన చ ప్రవ్యథితం మనో మే |
తదేవ మే దర్శయ దేవరూపం
ప్రసీద దేవేశ జగన్నివాస ||      45

దేవా ! ఎప్పుడూ చూడని ఈ విశ్వరూపాన్ని చూసి ఆనందించాను. అయితే నా మనసు భయంతో ఎంతో బాధపడుతున్నది. దేవదేవా! జగన్నివాసా! దయవుంచి నీ పూర్వరూపాన్నే చూపించు, అనుగ్రహించు.

కిరీటినం గదినం చక్రహస్తమ్
ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ |
తేనైవ రూపేణ చతుర్భుజేన
సహస్రబాహో! భవ విశ్వమూర్తే! ||      46

మునుపటిలాగే కిరీటం, గద, చక్రం ధరించిన నిన్ను చూడదలచాను. వేయిచేతులు కలిగిన విశ్వమూర్తీ ! నాలుగు భుజాలతో పూర్వరూపంలోనే నాకు సాక్షాత్కరించు.

శ్రీ భగవానువాచ

మయా ప్రసన్నేన తవార్జునేదం
రూపం పరం దర్శితమాత్మయోగాత్ |
తేజోమయం విశ్వమనంతమాద్యం
యన్మే త్వదన్యేన న దృష్టపూర్వమ్ ||     47

శ్రీ భగవానుడు : అర్జునా ! నీ మీద దయతలచి నా యోగమహిమతో తేజోమయమూ, సర్వోత్తమమూ, సనాతనమూ, అనంతమూ అయిన నా విశ్వరూపం నీకు చూపించాను. నీవు తప్ప ఎవడూ ఎప్పుడూ ఈ రూపాన్ని చూడలేదు.

న వేదయజ్ఞాధ్యయనైర్న దానైః
న చ క్రియాభిర్న తపోభిరుగ్రైః |
ఏవంరూపః శక్య అహం నృలోకే
ద్రష్టుం త్వదన్యేన కురుప్రవీర ||     48

కురువీరా! నీవు తప్ప ఈ లోకంలో ఇంకెవ్వరూ కూడా వేదాలు చదవడం వల్లకాని, యజ్ఞాలు, దానాలు, కర్మలు, ఘోరతపస్సులు చేయడం వల్ల కాని ఈ విశ్వరూపాన్ని సందర్శించడం సాధ్యపడదు.

మా తే వ్యథా మా చ విమూఢభావో
దృష్ట్వా రూపం ఘోరమీదృఙ్మమేదమ్ |
వ్యపేతభీః ప్రీతమనాః పునస్త్వం
తదేవ మే రూపమిదం ప్రపశ్య ||      49

ఘోరమైన నా యీ విశ్వరూపం చూసి భయపడకు; భ్రాంతి చెందకు. నీవు నిర్భయంగా, సంతోషంగా నా పూర్వరూపాన్ని మళ్ళీ చూడు.

సంజయ ఉవాచ

ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్వా
స్వకం రూపం దర్శయామాస భూయః |
ఆశ్వాసయామాస చ భీతమేనం
భూత్వా పునః సౌమ్యవపుర్మహాత్మా ||     50

సంజయుడు: అలా అర్జునుడితో చెప్పి శ్రీ కృష్ణుడు మళ్ళీ తన పూర్వరూపం చూపించాడు. ఆ మహాత్ముడు తన శాంతమైన శరీరం ధరించి భయభీతుడైన అర్జునుణ్ణి ఓదార్చాడు.

అర్జున ఉవాచ

దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన |
ఇదానీమస్మి సంవృత్తస్సచేతాః ప్రకృతిం గతః ||   51

అర్జునుడు: జనార్దనా! ప్రశాంతమైన నీ మానవరూపం చూశాక నా మనసు కుదుటపడింది; నాకు స్వస్థత ఏర్పడింది.

శ్రీ భగవానువాచ

సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మయ |
దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః ||   52

శ్రీ భగవానుడు : నీవు వీక్షించిన నా విశ్వరూపాన్ని ఇతరులు చూడటం అతి దుర్లభం. దేవతలు కూడా ఈ రూపాన్ని దర్శించాలని నిత్యమూ కోరుతుంటారు.

నాహం వేదైర్న తపసా న దానేన న చేజ్యయా |
శక్య ఏవంవిధో ద్రష్టుం దృష్టవానసి మాం యథా ||  53

నీకు ప్రాప్తించిన ఈ విశ్వరూపసందర్శనం వేదాలవల్లకాని, తపస్సులవల్ల కాని, దానాలవల్లకాని, యజ్ఞాలవల్ల కాని లభించదు.

భక్త్యా త్వనన్యయా శక్య అహమేవంవిధో௨ర్జున |
జ్ఞాతుం ద్రష్టుం చ తత్త్వేన ప్రవేష్టుం చ పరంతప ||  54

పరంతపా! విశ్వరూపుడనైన నన్ను నిజంగా తెలుసుకోవడానికి, చూడాడానికి, చేరడానికి సాటిలేని భక్తితోనే సాధ్యపడుతుంది.

మత్కర్మకృన్మత్పరమో మద్భక్తస్సంగవర్జితః |
నిర్వైరస్సర్వభూతేషు యస్స  మామేతి పాండవ ||   55

అర్జునా! నా కోసమే కర్మలు చేస్తూ, నన్నే పరమగతిగా భావించి, నా మీదే భక్తికలిగి, దేనిమీదా ఆసక్తి లేకుండా సమస్త ప్రాణులపట్ల శత్రుభావంలేనివాడు నన్ను పొందుతాడు.

ఇలా ఉపనిషత్తులు, బ్రహ్మవిద్య, యోగశాస్త్రం, శ్రీకృష్ణార్జున సంవాదం అయిన శ్రీమద్భగవద్గీతలోని "విశ్వరూపసందర్శనయోగం" అనే పదకొండవ అధ్యాయం సమాప్తం.

శివారాధన శివ శబ్దానికి ఎన్నో అర్థాలు. కలగబోయే శ్రేయస్సు, అరిష్టనాశం, సుఖాన్ని కలిగించేది, శుభాలను అందించేది, ధన్యతను ప్రసాదించేది, కోరికలను తీర్చేది, పుట్టుకకు కారణమైంది, కుత్సితాలను పోగొట్టేది, అశుభాలను తరిమికొట్టేది, మంచితనంతో కూడి ఉండేది... ఇలా ఎన్నో ఈ పేరులో ఇమిడి ఉన్నాయి. ఇన్ని శివగుణాలు కలవాడు శివుడు. ఆయనను ఆరాధిస్తే ఆరాధకుడికి ఆ గుణాలే అలవడతాయి.

శివారాధన 

శివ శబ్దానికి ఎన్నో అర్థాలు. కలగబోయే శ్రేయస్సు, అరిష్టనాశం, సుఖాన్ని కలిగించేది, శుభాలను అందించేది, ధన్యతను ప్రసాదించేది, కోరికలను తీర్చేది, పుట్టుకకు కారణమైంది, కుత్సితాలను పోగొట్టేది, అశుభాలను తరిమికొట్టేది, మంచితనంతో కూడి ఉండేది... ఇలా ఎన్నో ఈ పేరులో ఇమిడి ఉన్నాయి. ఇన్ని శివగుణాలు కలవాడు శివుడు. ఆయనను ఆరాధిస్తే ఆరాధకుడికి ఆ గుణాలే అలవడతాయి.

రుద్రుడు అంటే రోదనాన్ని పోగొట్టేవాడు. రోదనం అంటే దుఃఖమే. దుఃఖం మనిషికి పుట్టుకతోనే వస్తుంది. అది పుడమి గర్భంలో మనిషి కలిసిపోయేదాకా ఉంటుంది. దుఃఖం లేని మనిషి, అలలులేని సాగరం ఉండనే ఉండవు. సముద్రజలాలను అలలు ఎలా కల్లోలం చేస్తుంటాయో జీవన సాగరంలోనూ దుఃఖాల కెరటాలు మనిషిని పడదోస్తుంటాయి. దుఃఖించే మనిషికి ఓదార్పు కావాలి. చేయూత కావాలి.

ఇలాంటి మానవ స్వభావ నేపథ్యంలో మనిషికిగల ఏకైకగమ్యం శివారాధన. శివుడు ఇలాంటి ఒడుదొడుకులేవీ లేనివాడు. నిశ్చలుడు. అందుకే అతడికి స్థాణువు అనే పేరుంది. స్థాణువు అంటే రాయి కాదు. మానసిక స్థైర్యం. అది పరమేశ్వరుడి సహజగుణం. ఎంతటి ప్రళయంలోనైనా చెక్కుచెదరని స్థిరత్వం. ప్రపంచాన్నే భస్మంచేయగల హాలాహల విషాన్నీ కంఠంలో దిగమింగే ధీరత్వం. అది మనిషికి కావాలి. ఎలాంటి దుర్భర పరిస్థితిలోనైనా నిలబడే ఆత్మశక్తి రావాలి. జీవితమంతా విజయసోపానం కావాలి. అందుకు శివారాధనే శరణ్యం.

మనిషిని అధఃపాతాళానికి పడదోసేది కామం. కామం అంటే వస్తువుమీద కోరిక కావచ్చు. మనిషిమీద కోరిక కావచ్చు. దీనికి ఒక హద్దు ఉంది. దీనికి ఒక నియమం ఉంది. దీనికి ఒక పద్ధతి ఉంది. అది లేకుండా మనిషి విచ్చలవిడిగా చెలరేగితే సమాజం అంగీకరించదు. శివుడికి ఏ కోరికలూ లేవు. వాటికోసం పరుగులు తీయాలనే తలపు లేదు. ఆయన కోరిక అంతా విశ్వశ్రేయస్సే. అందరూ బాగుండాలనే అభిమతమే! శివుడి స్థిరత్వాన్ని భంగం చేయడానికి మన్మథుడు ప్రయత్నించాడు. నిశ్చలచిత్తుడైన పరమేశ్వరుడిపైనే పూలబాణాలు కురిపించబోయాడు. శివుడి మనసును కోరికలతో మలినం చేయాలని భావించాడు. సంయమి అయిన శివుడి ముందు అతడి ఆటలు సాగలేదు. తన నిశ్చలత్వాన్ని నాశనం చేయజూసిన మన్మథుడిపై మూడోకన్ను తెరచి, భస్మం చేశాడు. అతణ్ని అనంగుడిగా (శరీరం లేనివాడిగా) మార్చివేశాడు. మనిషి కూడా శివుడిలా ఉండాలి. ప్రపంచంలో తన చుట్టూ ఎన్నో ప్రలోభాలు ఉసిగొల్పుతున్నా సంయమనాన్ని కోల్పోరాదు. ఎందరు ఎన్ని ఆశలు పెట్టినా మోసపోరాదు. అన్నింటిలోనూ యుక్తాయుక్త విచక్షణ కలిగి ఉండాలి. ఏది చేస్తే మంచి జరుగుతుందో అదే చేయాలి. తాత్కాలిక లాభాలకోసం బంగారు భవిష్యత్తును పణంగా పెట్టరాదు. శివుడిలా వీరుడిలా, ధీరుడిలా నిలవాలి. ఇదే శివారాధనలోని ఆంతర్యం.

భార్యను అర్ధాంగిగా మార్చిన ఘనత శివుడిదే. వివాహం చేసుకున్న తరవాత పార్వతికి తనలో సగభాగం కల్పించిన ఉత్తమగుణం శివుడిదే. అందుకే పార్వతీపరమేశ్వరులు ఆదిదంపతులయ్యారు. అన్యోన్య ప్రేమానురాగాలకు దృష్టాంతాలుగా మారిపోయారు. మనిషి ఇలాంటి ఉన్నతస్థితిని చేరుకోవాలి.

ఈ ప్రపంచంలో అంతా శివభావనామయం. పంచభూతాల్లో శివుడున్నాడు. సూర్యచంద్ర నక్షత్రరాశుల్లో శివుడున్నాడు. శివుడు లేనిదెక్కడ? అణువణువూ శివుడే. అడుగడుగునా శివుడే. సకల బ్రహ్మాండ భాండమే శివమయం అని రుద్రాధ్యాయం చెబుతోంది. మనిషి ఎల్లవేళలా శివభావనలో లీనం కావాలి. తన జీవితాన్ని శివానందపూరితంగా మార్చుకోవాలి!

Jai Shri Krishna

Excellent information about Bhagwan Shri Krishna: 1) Krishna was born *5252 years ago*  2) Date of *Birth* : *18th July,3228 B.C* 3) Month ...