Saturday, February 15, 2020

*తల్లితండ్రులు చేసిన పాపం పిల్లలకు ఇలా సంక్రమిస్తుంది...👨👨👧👧 తల్లితండ్రులు చేసిన పాపం పిల్లలకు వస్తుంది. దాన్నే జాతకంలో పితృశాపం అని, స్త్రీ శాపం అని అంటారు.

శుభోదయం..

*తల్లితండ్రులు చేసిన పాపం పిల్లలకు ఇలా సంక్రమిస్తుంది...

👨👨👧👧 తల్లితండ్రులు చేసిన పాపం పిల్లలకు వస్తుంది. దాన్నే జాతకంలో పితృశాపం అని, స్త్రీ శాపం అని అంటారు.

నన్నడిగి కన్నావా? కన్నప్పుడు భరించాలి..అని అంటూ పిల్లలు అరవడం చూస్తుంటాము. నిజానికి అడిగి కనడం కాదు, వారిని నీవే ఎంచుకున్నావు. జీవుడు తను చేసిన కర్మ వల్లనే రాబోయే జన్మలో తన తల్లితండ్రులను, కుటుంబాన్ని ఎంచుకుంటాడు. ఆ కుటు౦బంలో ఎవరైనా స్త్రీలకు అన్యాయం చేస్తే స్త్రీ శాపం తగులుతుంది. 

అది రాబోయే తరాలకు సంక్రమిస్తుంది. సర్పాలను చంపినప్పుడు సర్పశాపం... పితృ దేవతలకు శ్రాద్దం నిర్వహించనందువలన పిత్రుశాపం సంక్రమిస్తాయి. వీటి కారణంగా జీవితంలో ఎదుగుదల ఉండదు, ఉద్యోగాలు రావు, వచ్చినా అభివృద్ధి ఉండదు. సంతానం కలగదు. వ్యాపారాలలో నష్టం మొదలయినవి వస్తాయి. ఇవన్నీ మన పూర్వీకులు చేసిన కారణంగా తరువాతి తరం అనుభవిస్తుంది.

ఆడ అయినా, మగ అయినా సరే వయసులో దురలవాట్లకు బానిసైతే, ఆ పాపం తరువాతి తరం వ్యాధుల రూపంలో అనుభవిస్తుంది. అవిటిగా పుట్టడం, పుట్టుకతోనే భయంకరమైన వ్యాధులు సోకడం. ఒకవేళ ఆరోగ్యంగా పుట్టారని అనుకున్నా, కాల క్రమేనా అవయవాలు పాడవవడం జరుగుతుంది. దానినే "వంశపార్యపరం" అంటారు.
అందుకే మనం వయసులో "ధర్మoగా" ఉంటే, మనకు పుట్టే వారు కూడా అదే ధర్మాన్ని పంచుకుని పుడతారు. జీవితంలో వృద్ధి చెందుతారు.

|| గురుధ్యానం ప్రపద్యామి పుత్ర పీడోపశాంతయే ||

అని శాస్త్ర వాక్కు..గురు/బృహస్పతి ధ్యానం వలన సంతానం వలన కలిగే బాధ తొలగుతుంది. ఒక వ్యక్తి ఒక కుటుంబంలో పుట్టినపుడు, అతడు తన కర్మతో పాటు ఆ కుటుంబానికి చెందిన కర్మను కూడా స్వీకరిస్తాడు. అతడిపై ఆ ప్రభావం ఉంటుంది.

కొని ఉదాహరణలు:

ఈ లోకంలో ఉండే అన్ని జీవులలో "దత్తుడు" ఉన్నాడు. అంటే గురు అవతారం "దత్తాత్రేయుడు". తెలిసో తెలియకో ఇతరులను విమర్సి౦చడం అంటే దత్తుడిని అవమానించడం, విమర్శించడమే. అది కూడా కొంత పాపాన్ని సమకూర్చిపెడుతుంది. అది కూడా గురుశాపానికి కారణమవుతుంది.

పచ్చని చెట్లపై గురు ప్రభావం ఉంటుంది. పచ్చని మొక్కలు/చెట్లను నరికితే, అది జాతకంలో గురు దోషంగా కనిపిస్తుంది. కళ్ళముందే పిల్లలు మరణించడం, స్త్రీ సంతానం ఉంటే వారు వైధవ్యం పొందడం వంటివి జరుగుతాయి. అదే పండ్లు, కాయలు, పుష్పాలతో ఉన్న చెట్లను నరికితే, సంతానం కూడా కలగని సందర్బాలు౦టాయి. అంటే ఆ పిల్ల పుట్టింట్లో కుర్చుని ఏడుస్తుంది. ఆమెను చూసి తల్లితండ్రులు ఏడుస్తారు. దానికి కారణం ఆ బిడ్డ తల్లితండ్రులు చేసిన పాపం. అందుకే పిల్లలు కలవారు పచ్చని చెట్లు కొడుతుంటే, "పిల్లలున్న వాడివి, పచ్చని చెట్లు కొడుతున్నావ్, ఎంత తప్పు చేస్తున్నావో" అని మన పెద్దలు అంటూ ఉంటారు.

భూములు లాక్కుంటారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు, బడా వ్యాపారవేత్తలు తమ అక్రమసంపాదన సక్రమంగా చూపించడం కోసం పేద రైతులను మోసం చేసో, మరొక విధంగానో భూములు ఆక్రమిస్తూంటారు. వ్యవసాయం మీద పన్ను లేదు కనుక ఆ భూమిలో పండిన దానిపై వచ్చిన ఆదాయంగా తమ అక్రమసంపాదను చూపి సక్రమం చేసుకుంటారు. 

ఒక కుటుంబంలోని వారికి ఒక భూమి వంశపారంపర్యంగా సంక్రమించినప్పుడు, దానికి పితృదేవతల అనుగ్రహం ఉంటుంది. భూమిని బలవంతంగా లాక్కుంటే, ఆ పితృదేవతలు ఏడుస్తారు. అది శాపంగా మారి లాక్కున్న వారి కడుపు కొడుతుంది. వారి పిల్లల అకాల మరణం చెందుతారు, లేదా జీవచ్చవాలుగా మిగిలిపోతారు. దీనికి కారణం ఆ తల్లితండ్రులు చేసిన పాపం. అసలు మనం ఒక భూమిని కొనాలన్నా, దానికి ముందు వెనుక బాగా ఆలోచించాలి. యోగులైతే ఒక భూమిని కొనే ముందు పితృదేవతలను సంప్రదిస్తారు. మీరు ఉచితంగా ఇస్తానన్నా వారు తీసుకోరు. ఎందుకంటే తమ వారసులు అనుభవించకుండా భూములు అమ్ముకోవడం పితృదేవతలకు ఇష్టం ఉండదు. విచిత్రం ఏమిటంటే మన దేశంలో ప్రభుత్వాలే భూములను లాక్కుంటాయి.

ఏ వ్యక్తి అయినా సంపాదించేది తన కోసం, తన పిల్లల కోసం. వారు బాగుండడం చూసి ఆనందించాలని అనుకుంటాడు. ఆ క్రమంలో అతడు అవినీతికి పాల్పడితే, ఇతరులకు ద్రోహం చేస్తే, వారి ఏడుపు వీరికి శాపంగా మారుతుంది. ఆ అవినీతి పరులు బాధపడేది వారి పిల్లలకు హాని కలిగినప్పుడే. అందుకే వారి పిల్లలు అకాలమరణాల పాలవుతారు.

ఇలా ఎన్నో రకాలుగా తల్లితండ్రులు చేసిన పాపం పిల్లలకు సంక్రమిస్తుంది. కాబట్టి, తస్మాత్ జాగ్రత్త...!!

No comments:

Post a Comment

Jai Shri Krishna

Excellent information about Bhagwan Shri Krishna: 1) Krishna was born *5252 years ago*  2) Date of *Birth* : *18th July,3228 B.C* 3) Month ...