Wednesday, March 22, 2023

Ugadi Festival

Telugus all over the world celebrate their new year in the month of March or April every year and is known as Ugadi. 
Telugu Year is the calendar year for the Telugu speaking people of India mostly in the states of Andhra Pradesh and Telangana of India and in other parts of the world. As of 2023 about 100 million people all over the world. 
Each Telugu calendar year has a specific name. Here is  list of 60 Telugu Year Names in Telugu from Year 1867 to 2106.


The Telugu calendar (Panchangam) includes 60 year names. Every 60 years one name cycle completes and the names repeat in the next cycle. For example, the Telugu year name for 1867 is “Prabhava” (ప్రభవ), repeated in 1927, 1887, 2047.
List of 60 Telugu Years in Telugu
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు తమ కొత్త సంవత్సరాన్ని ప్రతి సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్‌లో జరుపుకుంటారు మరియు దీనిని ఉగాది అని పిలుస్తారు.
భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాలలో మరియు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో ఎక్కువగా భారతదేశంలోని తెలుగు మాట్లాడే ప్రజలకు తెలుగు సంవత్సరం క్యాలెండర్ సంవత్సరం. 2023 నాటికి ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్ల మంది ఉన్నారు.
ప్రతి తెలుగు క్యాలెండర్ సంవత్సరానికి ఒక నిర్దిష్ట పేరు ఉంటుంది. 1867 నుండి 2106 వరకు తెలుగులో 60 తెలుగు సంవత్సరపు పేర్ల జాబితా ఇక్కడ ఉంది.

Tuesday, March 7, 2023

*నిజమైన పండితుడు*

*నిజమైన పండితుడు*

పండితుడంటే అన్నీ క్షుణ్ణంగా తెలిసినవాడు. సర్వజ్ఞుడు అనే చాలామంది అనుకుంటారు. ఒక్క భగవంతుడికే సర్వజ్ఞుడు అని పేరు. పండితుడంటే చాలా తేలిక అభిప్రాయం కొంతమందిలో వుంది. అన్నీ తెలిసి వుంటే తప్పులేదట. అన్నీ తెలుసు అనుకుంటేనే తప్పట. 

అన్నీ తెలుసు అని ఎవరనుకుంటారు? ఏమీ తెలియని వారే అన్నీ తెలుసు అనుకుంటారు. *చతు శ్లోకేన పండితః* నాలుగు శ్లోకాలు వస్తే పండితుడని సామెత. అదే తరువాత *శత శ్లోకేన పండితః* అంటున్నారు. నూరు శ్లోకాలు వచ్చేసరికి ఎదుటి వాడికేమీ తెలీదని అనిపిస్తుంది. అందరినీ ప్రశ్నించడం మొదలుపెడతాం. దేనికి? మనకి తెలిసిన విషయం వాడికి తెలీదని నిరూపించడానికి. 

ప్రశ్నల్లో రెండురకాలు. జిజ్ఞాసుప్రశ్న, జిగీషు ప్రశ్న. *జ్ఞాతుం ఇచ్చా జిజ్ఞాసా* తెలుసుకోవాలనే కోరికతో వేసే ప్రశ్న. *జేతుం ఇచ్చా జిగీషా* జయించాలని అడిగే ప్రశ్న. ఎలాగైనా ఎదుటివాడికి తెలీదనిపించాలి అని అడిగే ప్రశ్న. 

"ఏమండీ? నూరుమంది కౌరవుల పేర్లు, వారి భార్యల పేర్లు, వారి చెల్లి దుస్సల భర్త పేరు, ఆమె పిల్లల పేర్లు చెప్పండి?" ఇన్నిపేర్లు ఎవరికీ కంఠతా వచ్చివుండవు కదా! అవతలి వాడికి తెలియదు అనిపిస్తే మనకు తృప్తి! ఇలా కొన్నాళ్ళు నేను పండితుడినే అనిపించినా, బాగా చదువుకొన్న తర్వాత, నేను పండితుణ్నికాదు అని గ్రహిస్తాడు. 

*తెలిసికొంటిని నాకేమి తెలియదంచు* అని తెలిసినవాడే నిజమైన పండితుడు. ఒక శాస్త్రాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి ఇంకా ఇంకా తెలుసుకోవాలనుకునే వాడే నిజమైన పండితుడు.
🚩🚩🚩🌹🚩🌹🌹🙏🏻

🌻 *వరం* 🌻******************


🌻 *వరం* 🌻
*******************************


⭕ఒకసారి అర్జునుడు, శ్రీ కృష్ణుడు ఒక వృద్ధ విధవరాలి ఇంటికి అతిథులుగా వెళ్లారు.

⭕ఆ వృద్ధ విధవరాలు శ్రీకృష్ణునికి పరమ భక్తురాలు.

⭕ఆమె నిత్యం కన్నయ్యను స్మరిస్తూ తన జీవితాన్ని గడుపుతోంది. ఆమెకు నా అన్నవాళ్లు ఎవరూ లేరు. 

⭕ఆమె ఉండేది ఒక పూరి గుడిసెలో... ఆమె వద్ద ఒక ఆవు ఉండేది. ఆమె ఆ గోమాత ప్రసాదించిన పాలను గ్రామంలో అమ్మి కాస్తో కూస్తో డబ్బు సంపాదించేది. 

⭕ఆమె తన జీవనాధారమైన ఆవును బాగా చూసుకునేది.

⭕తాను ఎంతగానో అభిమానించే కన్నయ్య తన ఇంటికి రావడం చూసి, ఎంతగానో సంతోషపడింది.

⭕కన్నయతో పాటు  శ్రేష్ఠ దనుర్థారి అయిన పార్థుడు కూడా తన వెంట రావడం చూసి తన ఆనందానికి అవధులు లేకుండా పోయింది. 

⭕అతిథి దేవునితో సమానం అంటారు..అలాంటిది ఏకంగా దేవుడే అతిథిగా వచ్చాడు. 

⭕ఆ ముసలామె తన ఇంటిలో ఉండే ఆహార పదార్థాలను అన్నిటినీ కృష్ణార్జునులకు నివేదించింది.

⭕శ్రీకృష్ణుడు ఆమె ఆతిథ్యానికి, అలాగే ఆమె నిష్కల్మషమైన భక్తికి మెచ్చాడు. 

⭕అలా కొద్దిసేపు ఆమెతో మాట్లాడి గోవిందుడు, పార్థుడు వెళ్లిపోయారు. 

⭕బయటికి వచ్చిన పిమ్మట అర్జునుడు మాధవునితో ఇలా అన్నాడు..." మాధవా..! మీరు ఆమె భక్తికి మెచ్చారు కదా..మరి ఆమెకు ఒక వరాన్ని ఎందుకు ఇవ్వలేదు ? "....

⭕దీనికి సమాధానంగా గోపాలుడు చిరునవ్వు చిందిస్తూ ఇలా అన్నాడు... " అర్జునా..! నేను ఆమెకు ఎప్పుడో వరాన్ని ప్రసాదించాను.. ఆమె ఎంతగానో ప్రేమించే తన ఆవుకు రేపు మరణాన్ని ప్రసాదించాను.. ఆ గోవు రేపటి సూర్యోదయానికి పూర్వమే తుదిశ్వాస విడుస్తుంది.." 

⭕సంభ్రమాశ్చర్యాలకు లోనైన పార్ధుడు తిరిగి కన్నయ్యతో " మాధవా..ఇది వరమా, లేక శాపమా..?  గోవు మరణిస్తే తన కడుపు నిండేదెలా..? అసలు ఆమె ఆవు సహకారం లేకుంటే ఈ ధరిత్రి పై జీవించగలదా...? 

⭕మళ్లీ కృష్ణయ్య నవ్వుతూ ఇలా సమాధానం ఇచ్చారు... " కౌంతేయా..! నీవు నన్ను అర్థం చేసుకోలేదు. ఆమె ఆవు గురించి ఎక్కువగా ఆలోచిస్తోంది. 

⭕ఆవును ఎలా పోషించాలి, ఆవుకు మేత ఎలా సేకరించాలి, ఆవు శుచిగా, శుభ్రంగా ఉండటానికి ఎలా నీటితో స్నానం చేయించాలి....ఇలా పలు విధాలుగా ఎక్కువ సమయం ఆ గోవు గురించే ఆలోచిస్తూ, నన్ను స్మరించడం మర్చిపోతోంది. 

⭕అదే ఆ ఆవు కనుక లేకపోతే, ఆమె రోజంతా నన్ను సేవిస్తూ, స్మరిస్తూ ఉంటుంది కదా..! సరైన సమయం వచ్చినప్పుడు నేను తనని ఈ భూమి నుంచి తీసుకు వెళ్ళిపోతాను.. నా సేవలో తరించి తన జన్మను ధన్యం చేసుకుంటుంది. మరణానంతరం తాను తప్పక నా లోకాన్ని చేరుకుంటుంది..."
     
⭕వాసుదేవుని మాటలు విన్న పార్థుడు ఎంతగానో సంతోషించాడు...
             
⭕చూశారా..మనకు ఎన్నో కష్టాలు వస్తుంటాయి..ఆ కష్టాలు అనేవి భగవంతుడు పెట్టే పరీక్ష వంటిది.. కష్టాలు నశించిన పిమ్మట మనకు తప్పక ఆనందం లభిస్తుంది.

⭕ఎన్ని కష్టాలు వచ్చినా కృష్ణయ్య లీలలోని భాగమేనని సర్దుకుపోవాలి.. ఆ తర్వాత అంతా ఆ పరమాత్ముడే చూసుకుంటాడు....

🌼🌹🌼🌹🌼🌹🌼🌹🌼🌹🌼🌹

Jai Shri Krishna

Excellent information about Bhagwan Shri Krishna: 1) Krishna was born *5252 years ago*  2) Date of *Birth* : *18th July,3228 B.C* 3) Month ...