Saturday, July 31, 2021

మిత్రులకు విన్నప్పము...* *ఈ కష్టం మనకు తెలీదు కనీసం మన శ్రీరాములు, ఘంటసాల గొప్పతనం**మన పిల్లలకు తెలియజెప్పటం మన బాధ్యత*


# పి. షణ్ముగం మాజీ చిత్తూరు టౌన్ బ్యాంక్ చైర్మన్#

♦️ *మనం మద్రాసు ఉమ్మడి రాష్ట్రం లోనే ఉంటున్నాం. ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా పనిచేసి రాజాజీ రాజకీయానికి, తన అహంకారానికి ది పదవీచ్యుతుడయ్యాడు. తెలుగువారంటే ఆరంభ సూరులు మాత్రమే నని పుకారు పుట్టించారు. తమిళుల హేళనలు దౌర్జన్యాలు మితిమీరినా మనల్ని తెలుగువారు అని కాకుండా మద్రాసీయులు అనే పిలిచేవారు . స్వాతంత్ర్యం వచ్చాక కూడా మనకు గుర్తింపులేదు. మద్రాసు మొదలు తంజావూరు వరకు తెలుగువారితో నిండిపోయింది. కానీ తెలుగుకు ప్రాధాన్యత లేదు. 1952 వచ్చినా ఆంధ్రావాళ్లంటే తెలియదు మద్రాసు వాళ్లమే మొత్తం ప్రపంచానికి. ఈ బాధ భరించలేక స్వామి సీతారాం అనే ఆయన గుంటూరులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. రాజాజీ ప్రభుత్వం శిబిరాన్ని అణిచివేసి సీతారామ్ దీక్షను భగ్నం చేసింది. పైగా తెలుగువారు ఆరంభసూరులు అని హేళన చేసింది.*

♦️ *దిగమింగుకోలేని ఈ అవమానానికి శ్రీరాములు స్పందించారు. సర్కార్ ఎక్స్ ప్రెస్ లో గుడివాడలో ఎక్కి మద్రాసులో దిగి బులుసు సాంబమూర్తిగారి ఇంట దీక్ష ప్రారంభించారు. రాజాజీ కోపంతో ఊగిపోయాడు. రాష్ర్టాన్ని ముక్కలు కానివ్వను అని సవాల్ చేశారు  ఎవరైనా కాంగ్రేస్ వారు ఆ వైపుకు వెళ్లారా అంతు చూస్తానన్నారు. దీనితో కాంగ్రెస్ వాడైన పొట్టిశ్రీరాములు ఒంటరివాడైపోయాడు. యెర్నేని సాధు సుబ్రహ్మణ్యం తప్ప ఆయన వెంట ఎవరూ లేరు. అయినా తన దీక్షను పొట్టిశ్రీరాములు వదల్లేదు. 9వ రోజు నెహ్రూకి తెలిసి రాజాజీకీ పోన్ చేసారు. అవన్నీ ఉడత ఊపులేనని తాను అణిచివేస్తానని రాజాజీ నమ్మబలికారు. తెలుగువారు లక్షల మంది ఉన్న మద్రాసు నగరంలో ఆదరణ లభిస్తుందని అనుకుంటే ఒక్కరూ అటువైపు రాలేదు. అదీ తెలుగువారి ఐక్యత. సమస్య కాంగ్రెస్ ది కాదని, తెలుగువారి ఆత్మగౌరవం కోసమని గ్రహించటంలో అంతా రాజాజీ బుట్టలో పడ్డారు. తెలుగునాయకులంతా మొఖం చాటేశారు. 58 రోజులు ఒక మనిషి ఆహారం తీసుకోకుండా దీక్ష చేస్తుంటే ఏ తెలుగువారికీ జాలీ దయ లేదు. టంగుటూరి ప్రకాశం పంతులుగారు రాజాజీకీ వ్యతిరేకం గనుక ఆయన వెళ్ళి మద్దతు ప్రకటించి వెళ్ళారు. కేవలం తన బాధనంతా మిత్రులకు లేఖల్లో వెళ్ళబోసుకున్నారు శ్రీరాములు. వారిలో ముఖ్యులు సాధు సుబ్రహ్మణ్యం గారి అల్లుడు ముసునూరి భాస్కరరావు. కూరాళ్ల భుజంగం తదితరులు. పొట్టిశ్రీరాములు శారీరక స్థితి నిరాహారంతో ఎప్పుడో అదుపుతప్పింది. ఆ బాధ భరించలేక ఆయన గావుకేకలు పెట్టేవారు. పేగులు పుండ్లుపడి పురుగుల నోటి వెంట వచ్చేవి. కళ్ళు చెవులు నుంచి కూడా వచ్చేవి. జీర్ణవ్యవస్థ తిరగబడి మలం కూడా  నోటినుంచి వచ్చేది. వర్ణించటానికి వీలులేనంత దారుణమైన శారీరక దాష్టీకంతో నిండుకుండ వంటి శ్రీరాములు నిర్జీవుడవ్యటానికి 58 రోజులుపట్టింది. ఎంత దారుణమరణవేదన అనుభవించి తెలుగువారి కోసం ఆయన అసువులు బాసారో చెప్పటానికి మాటలే లేవు.ఇక మరణించాక మరీ దారుణం ఎదురైంది. తెలుగువారి హీన దీన హైన్య చాతకానితనం ఎటువంటిదంటే ఆయన శవాన్ని ముట్టుకోవడానికి కూడా నలుగురు తెలుగువాళ్ళు రాలేదు. ఆయన మన తెలుగువారి కోసమే చనిపోయారని తెలిసినా కూడా స్పందించలేదు. చివరికి ఒంటరివాడిగా ఉన్న గుడివాడ సాధు సుబ్రహ్మణ్యం కనీసం మన గుడివాడ వాళ్ళవైనా సహాయం అడిగి శవదహనం చేద్దామని ఆశయాన్ని చంపుకునిి వ్యక్తిగత భిక్షగాడిగా గుడివాడకు చెందిన సినీగాయకుడు ఘంటసాల దగ్గరకు వెళ్ళి విషయం చెప్పి మన గుడివాడ నుండి వచ్చాడు గనుక మనమైనా సాగనంపుదాం అని ఒప్పించి తెచ్చారు. ఘంటసాల వెంట మోపర్రు దాసు అనే కళాకారుడు నేను గుడివాడ వాడినే కదా నేనూ వస్తానని వచ్చారు. శవాన్ని తాటాకులతో కాకులు పొడవకుండా కప్పివచ్చిన సుబ్రహ్మణ్యాన్ని శవం ఎక్కడా అని ఘంటసాల అడిగారు.   ఒక్కొక్క తాటాకూ తీసి శవాన్ని చూస్తున్న ఘంటసాల గుండె కరిగిపోయింది. మరణం ఇంత దారుణంగా ఉంటుందా అని హతాశుడైపోయాడు. ఎవరి కోసం చచ్చిపోయాడు ఆ దీనుడు అని కన్నీరుమున్నీరు అయిపోయారు. వాంతు చేసుకున్నారు. తెలుగుజాతి కోసం తన ప్రాణాలు దానం చేసిన ఆ మహనీయుడి శవాన్ని ఎవరికీ తెలియకుండా తీసుకువెళ్ళటం సబబుకాదు అని తెలుగువాళ్ళ కళ్లు తెరిపించడానికి ఈ శవమే Cదిక్కు కావాలని ఆవేశంతో ఊగిపోయారు. వెంటనే ఒక ఎద్దులబండి మాట్లాడి శవాన్ని అందులోకి ఎక్కించారు. అప్పటికప్పుడే ఆశువుగా ఘంటసాల తన వీరకంఠాన్ని ఎలుగెత్తి తెలుగుజాతి పౌరుషం చచ్చిందని , చీము నెత్తురు లేని తెలుగుజాతి కోసం అసువులశ్రీరాములు నువ్వు అంటూ గొంతెత్తి పాడతూ శవయాత్ర ప్రారంభించారు.*

        ♦️   *గుండెల్ని పిండే ఘంటసాల మాటలు పాటలకు మద్రాసు ప్రెసిడెన్సి కాలేజీ ముందుగా శవం వెళ్తున్న సమయంలో విన్న కాలేజి కుర్రాళ్ళు పౌరుషంతో అమరజీవి జోహార్ అంటూ బండివెంట అరుస్తూ యాత్రలో చేరారు. అమరజీవి మరణవార్త టెలిగ్రాం ద్వారా ఆంధ్రకేసరికి తెలపటంతో ఆయన మెయిల్ కి మద్రాసు వచ్చారు. సరిగ్గా ఆ సమయానికి శవయాత్ర మద్రాసు సెంట్రల్ రైల్వే స్టేషన్ కు చేరింది. శ్రీరాములు దారుణశవ పరిస్తితిని చూడగానే ఆంధ్రకేసరి ఆవేశం కట్టలు తెంచుకుంది. బూతుపురాణంతో తెలుగుజాతి చాతకానితనాన్ని ఆయన చీల్చిచెండాడుతూ పనికిరాని తెలుగుజాతి నాకొడక....రా అంటూ పెట్టిన పెడబొబ్బలకి ఎలా కదిలారో లక్షలాది మంది తెలుగువారు క్షణాల్లో మద్రాసు నగరం మంటల్లో తగలబడింది. షాపులు లూటీ అయ్యాయి. ఆంధ్రదేశమంతా అట్టుడికి పోయింది. 8 మంది పోలీసు కాల్పుల్లో చనిపోయారు. నెహ్రూ రాజాజీని చివాట్లు పెట్టి ప్రజలను శాంత పడమని శ్రీరాములు మరణం వృధాపోదని ఆంధ్రులకి ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని పార్లమెంటులో ప్రకటించటంతో తెలుగుజాతి ఊరడిల్లింది. సాధుసుబ్రహ్మణ్యంగారే శవానికి దహనక్రియలు కర్మకాండ జరిపారు.*

♦️ *మిత్రులకు విన్నప్పము...* 
*ఈ కష్టం మనకు తెలీదు కనీసం మన శ్రీరాములు, ఘంటసాల గొప్పతనం*
*మన పిల్లలకు తెలియజెప్పటం మన బాధ్యత*

*బాధతో మీ*
# చిత్తూరు మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ P. షణ్ముగం#

Sunday, July 18, 2021

*🧘‍♂️భగవాన్ భావధారామృతం🧘‍♀️*🕉️🌞🌏🌙🌟🚩సాధననే పరమ చరమంగా భావించి ఆగిపోవటం వృధా. ఏ సాధనైనా ఆత్మానుభవానికి దారి తీయాలి. ప్రపంచాన్ని ఆజ్ఞాన భూమికలో చూస్తే అది మిథ్య. ఆదే ప్రపంచాన్ని జ్ఞానపరంగా దర్శించగలిగితే, అది సత్యం. అహం నశించటమే ముక్తి. అహం తన కార్యకలాపాలను కొనసాగించటానికి దేహం కావాలి. దేహంతో కూడి ఉన్నంత సేపూ అహం 'బంధన'ను కల్పిస్తుంది. అహం వీడటమే ముక్తి.

*🧘‍♂️భగవాన్ భావధారామృతం🧘‍♀️*
🕉️🌞🌏🌙🌟🚩

సాధననే పరమ చరమంగా భావించి ఆగిపోవటం వృధా. ఏ సాధనైనా ఆత్మానుభవానికి దారి తీయాలి. ప్రపంచాన్ని ఆజ్ఞాన భూమికలో చూస్తే అది మిథ్య. ఆదే ప్రపంచాన్ని జ్ఞానపరంగా దర్శించగలిగితే, అది సత్యం. అహం నశించటమే ముక్తి. అహం తన 
కార్యకలాపాలను కొనసాగించటానికి దేహం కావాలి. దేహంతో కూడి ఉన్నంత సేపూ అహం 'బంధన'ను కల్పిస్తుంది. అహం వీడటమే ముక్తి.


సందర్భవశాత్ భగవాన్ రమణులు, భక్తుల ప్రశ్నలకు జవా బుగా, సందేహాలకు సమాధానంగా, వెలిబుచ్చిన భావాలు అతి గంభీరాలు, అనుభవ కేదారాలు, ఆనంద మందారాలు!
గురువు బయటా వున్నాడు. లోపలా వున్నాడు. బయట బోధ కూడగానూ, లోపల అంతర్వాణిగానూ వున్నాడు. గురువు. ఈశ్వరుడు, ఆత్మ ఒకటే. అవి మూడు స్థితులు. నిజానికా ఆత్మ విచారమూ గురువే, అదీ ఆయన అనుగ్రహించేదే. ఆ అనుగ్రహమే గురువు.


 అసలు "నేను" ను పట్టుకునే దాకా జరిగేదంతా పోరాటమే. పోరాటమంతా అసలుకాని దానితోనే. అంటే ఆత్మానుభవం కోసం చేసే ప్రయత్నమే.
పొందేదాక పోరు తప్పదు. ఈ 
సాధనను సరైన దారిలో నడిపించే గురువు లోపలే వున్నాడు. ఆయన మానవ దేహంలోనే ఉండాలని లేదు. ఏ రూపంలో వున్నా గురుతత్త్వం ప్రధానం.
సర్వ మఠాల బోధ శాంతిని అనుభవించమనే! సమర్పణ, శరణాగతి, వినయం శాంతికి మార్గాలు. మానవుడి స్వభావం శాంతే. ఆనందమే.


మనతో మనం నిరంతరం కూడి ఉండ గలిగితే అదే అసలైన శాంతి. పరాయివస్తువుతో కూడి ఉన్నందున, 
శాంతిని అనుభవించ లేకపోతాం.
నీట నిండా మునిగీ దాహం తీరటం ఎట్లా అని వగసితివి  కదా! మంచుకొండలలో మౌనం పాటించి, పుణ్యతీర్ధాలలో స్నానమాడి. పుణ్యక్షేత్రాలను దర్శించి వీటి వలన శాంతి లభించిందని తృప్తి పడే కన్న నీలో నీవు ఉండగలిగితే పరమ 
శాంతి తథ్యం.


దేహం, మనసు, ఆత్మ. ఈ మూడు కూడితే మనం. అందులో ఆత్మ దేనితోనూ కలవదు. దేహం-మనసు విడిగా మనలేవు. కను కనే దేహం వలన మనస్సు మనసు చేసే పనుల వలన దేహం యాతనకు గురౌతుంటాయి. ఆత్మ మాత్రం అన్ని 
స్థితులలోను, అన్ని వేళలా సిమితంగా ఉంటున్నది.
ప్రాపంచిక ఆలోచనలోనుంచి, కర్మలోbనుంచి మనమెంత దూరంగా ఉండగలిగితే మనం ఆనంద శాంతులను అంతగా అనుభవించగలం. బంధన, అపేక్ష లేకుండా కర్మలు చేయాలి. అపుడే శాంతి అనుభవంలోకి వస్తుంది.


 ఆనందసాధన గాని, శాంతి 
కాముకత కానీ, నిజానికి ఆత్మాన్వేషణే. ఎందుకంటే, ఆత్మే
సచ్చిదానందం కనుక నిరంతరం మార్పు చెందుతుండే దేహానికే జననం, మరణం. మార్పెరుగని ఆత్మకు ఆ రెండూ లేవు. అది నిత్యం, సత్యం, శాశ్వతం. మరణం అంటే మార్చే
కాలాతీతమైన ఆత్మకు, మూడు కాలాలంటూ లేవు. మరణం సమయంలో జీవుడు మనో భూమికలో ఏ ఆలోచనను నిలుపు కుంటాడో, ఆ ఆలోచనలకు అనుగుణంగా మరొక జన్మ ఎత్తుతాడు.
మూల వాసనలు నశించనంతవరకు ముక్తి లేదు. జన్మలు ఉన్నంతవరకు కర్మలు తప్పవు. కర్మలు ఉన్నంతవరకు జున్నులుం టాయి. ఆత్మానుసంధానమే అసలు ముక్తి. జీవించి ఉండగా అది కలిగితే, అది జీవన్ముక్తి.


ఇంతకీ ఆత్మానుసంధానం సాధించటమెలా?
ఆత్మానుసంధానమంతా ఒక అద్భుత అంతరంగ ప్రక్రియ జరుగుతున్నదీ, ఏం జరుగుతున్నదీ. కనబడుతున్నది... ఇదంతా ఒక ఆట. ఆటను చూస్తున్నది దేహం, మనసు. అనుభవిస్తున్నవి ఆ రెండే. కానీ ఆటను అనుభవానికి అతీతంగా, కేవలసాక్షిగా 
ఉంటున్నదే, ఆత్మ, అదే మనం. ఆత్మానుభవం కోసం చేసే ఎడతెగని సాధనే అసలు సేవ. గురువు, భగవంతుడు, ఆత్మ లేనిదెక్కడ? గురువుతో సన్నిహితత్వం అంటూ ఏమీ లేదు.
తామరపువ్వు చుట్టూ కప్పలుంటయ్, ఏ అనుభవం లేకుండా. ఎక్కడి నుంచో తేనెటీగలు వచ్చి తేనెను అనుభవిస్తుంటాయి. ఇదీ అంతే.


దైవం మాట్లాడవలసిన పనిలేదు. పనీ జరగటం ప్రధానం. ప్రయత్నించగలిగితే మౌనం ద్వారా ఎంత పని జరుగుతుందో తెలుస్తుంది. మన ఇంట్లో దీపం వెలగటానికి టార్చర్ అవసరం లేదు. దాని నుంచి ప్రవహించే లేశమాత్రమైన విద్యుత్తు చాలు. ఆ 
విధంగానే, మౌని నుండి వెలువడే మౌన తరంగాలు సర్వసృష్టిని కదిలించగలవు. సాధననే పరమ చరమంగా భావించి ఆగిపోవటం వృధా.


 ఏసాధనైనా ఆత్మానుభవానికి దారి తీయాలి.
ప్రపంచాన్ని అజ్ఞాన భూమికలో చూస్తే అది మిధ్య. అదే ప్రపంచాన్ని జానపరంగా దర్శించగలిగితే, అది సత్యం.
అహం నశించటమే ముక్తి. అహం తన కార్యకలాపాలను కొనసాగించటానికి దేహం కావాలి.


 దేహంతో కూడి ఉన్నంత సేపూ అహం బంధనను కల్పిస్తుంది. అహం వీడటమే ముక్తి.
సాధనలో ఏర్పడే అనేక సిద్ధులు సాధనకే అడ్డంకి. సాధకుడిని ఎటూ పోనీయవు. వాటిని పట్టించుకున్నంత సేపూ ఒక దారుణ ఆకర్షణా క్షేత్రం ఏర్పడుతుంది.


 సిద్ధులను ఉపేక్షించటమే ఉత్తమం. లోకకళ్యాణం కోసం వాటిని వినియోగిస్తే ఏబంధనా లేదు.
దేనినైనా పొందాలనుకునేవాడు పోగొట్టుకోవడానికి సిద్ధం కావాలి.


ప్రపంచ భావన అంటే దేహాత్మ భావనే. అది లేకపోతే మిగిలేది ఆత్మే. హఠయోగం వంటి వాటి ద్వారా రోగాలు పోతాయా అంటే యోగం కంటే ముందు రోగమంటే ఏమిటో తెలుసుకుంటే

Friday, July 16, 2021

మనకున్న జ్ఞానేంద్రియాలు అయిదు, కర్మేంద్రియాలు అయిదు కదా! ఈ పది ఇంద్రియాలతోపాటు భగవంతుడు మనకు ప్రసాదించిన మరో ఇంద్రియం మనసు. అది కంటికి కనబడకుండానే అనేక ఇంద్రజాల మహేంద్రజాలాలను అనుభూతిలోనికి తెస్తుంది.సాక్షాత్తు పరమశివుడినే ద్వంద్వయుద్ధంలో జయించి, పాశుపతాస్త్రాన్ని వరంగా పొందిన అర్జునుడిని సైతం 'కృష్ణా! నా శరీరం వణుకుతున్నది; నాలుక పిడచకడుతోంది... కళ్లు బైర్లు కమ్ముతున్నాయి... గాండీవం చేతినుంచి జారిపోతున్నది' అనేట్లుగా బలహీనుడిని చేసింది అతడి మనసే!

మనసే మంత్రం*

🌺🌸🌼🚩🕉🚩🌼🌸🌺

మనకున్న జ్ఞానేంద్రియాలు అయిదు, కర్మేంద్రియాలు అయిదు కదా! ఈ పది ఇంద్రియాలతోపాటు భగవంతుడు మనకు ప్రసాదించిన మరో ఇంద్రియం మనసు. అది కంటికి కనబడకుండానే అనేక ఇంద్రజాల మహేంద్రజాలాలను అనుభూతిలోనికి తెస్తుంది.
సాక్షాత్తు పరమశివుడినే ద్వంద్వయుద్ధంలో జయించి, పాశుపతాస్త్రాన్ని వరంగా పొందిన అర్జునుడిని సైతం 'కృష్ణా! నా శరీరం వణుకుతున్నది; నాలుక పిడచకడుతోంది... కళ్లు బైర్లు కమ్ముతున్నాయి... గాండీవం చేతినుంచి జారిపోతున్నది' అనేట్లుగా బలహీనుడిని చేసింది అతడి మనసే!

ఉత్తరగోగ్రహణ సమయంలో అర్జునుడి వైపు ఒక్క ఉత్తరకుమారుడు మాత్రమే ఉండగా- కౌరవుల వైపున భీష్మ ద్రోణ కృప అశ్వత్థామ దుర్యోధన దుశ్శాసన కర్ణాది కురువృద్ధులు, గురువృద్ధులు అందరూ ఉన్నారు. ఆనాడు ఆ వీరాధివీరులనందరినీ ఒకే ఒక్క అస్త్రంతో మూర్ఛిల్లజేసేంత గుండెధైర్యాన్ని అర్జునుడికి ఇచ్చిందీ అతడి మనసే!

'సాగితే బండి; సాగకపోతే మొండి' అనేది మనసుకున్న లక్షణం. అది ఉత్సాహంగా ఉన్నదా, మనిషిని నక్షత్రమండలం దాకా పెంచగలదు. పిరికితనం ముసిరిందా, పాతాళలోకందాకా కుంగదీయగలదు. మనిషిని గుడిగోపురంలాగా, గిరిశిఖరంలాగా నిటారుగా నిలబెట్టగలది మనసే! కూకటివేళ్లతో సహా కూలిపోయిన వృక్షంలాగా నేలమీద పడవేయగలదీ మనసే!

పురాణాలను దాటి వర్తమానంలోకి వద్దాం! మనకందరికీ అనుభవంలో ఉన్న విషయమే! మన అబ్బాయి- పది పదకొండు సంవత్సరాలవాడు మనం ఇంట్లో లేని సమయంలో సైకిల్‌ వేసుకొని బజారుకు వెళ్లాడు. ఇంటికి రాగానే మనకు ఆ సంగతి తెలిసింది. అంతే! గుండెలో గుబులు మొదలు... 'బజారులోనా బండ్ల రద్దీ ఎక్కువ. వీడా పసివాడు, బండిని జాగ్రత్తగా నడుపుతాడో లేదో! మనం జాగ్రత్తగా ఉన్నంత మాత్రాన సరిపోదాయె. అవతలి బండివాడు కూడా జాగ్రత్తగా ఉండాలి కదా! వాడు వీడి మీద పడితే! బతుకంతా వైకల్యమే కదా!...' ఈ ఆలోచనలకు అంతు ఉండదు. ఆలోచిస్తున్నంతసేపూ గుండె దడదడ.

గమ్మత్తు ఏమిటంటే ఇప్పటివరకూ మన పిల్లవాడికి జరిగిన ప్రమాదమేమీలేదు. ఆ ప్రమాదాలన్నీ మన మనసులోనే, మన ఊహలలోనే జరిగి మనకు నరకాన్ని చూపిస్తాయి.

ఇంతలో మన మిత్రుడు వస్తాడు. విషయం తెలుసుకొంటాడు. అతడు తెలుసుకొనే దాకా ఎందుకు? మనమే చెబుతాం. అతగాడు అంతా విని నవ్వుతాడు. 'ఒరే! మీవాడు మా ఇంటికే వచ్చాడురా! మా వాడితో ఆడుకొంటున్నాడు' అని చెబుతాడు. ఇప్పుడు చూడండి. మన ఆవేదన అంతా అరక్షణంలో అదృశ్యం.

ఒకరాత్రి వేళ మనం ఆదమరచి గాఢంగా నిద్రపోతున్నాం. పెద్దపాము ఒకటి మన పొట్టమీదుగా జరజరా పాకుతూ వెళ్లిపోయింది. మనకు కించిత్తయినా భయం కలిగిందా? లేదు! మరొకరోజున బల్లిపిల్ల ఒకటి 'టపీమని మన ఒడిలో పడ్డది. చూశాం. ఏమైంది? గుండె అదిరిపోయింది.

పాము మన మీదుగా వెళితే ప్రశాంతంగా నిద్రపట్టడమేమిటి? బల్లిపిల్ల మీదపడితే గుండె అదరటమేమిటి? అంటే- పాము సంగతి మన మనసుకు తెలియదు. బల్లి సంగతి తెలిసింది. ఇదే తేడా!

మన మనస్సు ఇంద్రజాలికుడి సంచీ. అందులో ఉండని వస్తువు ఉండదు. ఉండని విషయమంటూ ఉండదు. భయం, ధైర్యం, దిగులు, ఆనందం, ఆందోళన, ప్రశాంతత, ఆశ, తృప్తి- అదీ ఇదీ ఏమిటి? అన్నీ ఆ సంచీలోనే ఉంటాయి. హాయిగా నిద్రపోతుంటాయి. దేన్ని మేల్కొలిపితే అది మేల్కొని, మనకు దుఃఖాన్నో ఆనందాన్నో కలిగిస్తుంటుంది.

మనమందరమూ ఈ విషయాన్ని తెలుసుకొని మనసులోని అవలక్షణాలనన్నింటినీ జోకొట్టి నిద్రపుచ్చుదాం. ఆనందాన్ని, ధైర్యాన్ని సంతృప్తినే మేల్కొలుపుదాం. బయటకు తీద్దాం. వాటి తాలూకు ఆనందాన్ని అనుభవిద్దాం! ఆ అనుభూతులను ఇతరులకు పంచిపెడదాం. అప్పుడు మన మనసు మనకొక వరమే అవుతుంది.

🌺🌸🌼🚩🕉🚩🌼🌸🌺

Thursday, July 15, 2021

తెలుగు నెలలకి ఆ పేర్లెలా వచ్చాయి?చిత్తా నక్షత్రములో పౌర్ణమి రావటం వల్ల చైత్ర మాసమనీ, విశాఖ నక్షత్రములో పౌర్ణమి రావటం వల్ల వైశాఖ మాసమనీ, జ్యేష్టా నక్షత్రంలో పున్నమి చంద్రుడు రావటం వల్ల జ్యేష్ట మాసమనీ, పూర్వాషాఢ నక్షత్రంలో పౌర్ణమి రావటంతో ఆషాఢమనీ, శ్రవణంలో పౌర్ణమి రావటం వల్ల భాద్రపద మాసమనీ, అలాగే అశ్వనీ, పుష్యమీ నక్షత్లాల్లో పౌర్ణమి రావటం వల్ల కార్తీక, పుష్యమాసములనీ మఖ నక్షత్రంలో పౌర్ణమి రావటం వల్ల మాఘమాసమనీ, పూర్వఫల్గుణి నక్షత్రంలో పౌర్ణమి రావటం వల్ల ఫాల్గుణ మాసమని మన పూర్వీకులైన మహాఋషులు నామధేయములేర్పరిచారు.

తెలుగు నెలలకి ఆ పేర్లెలా వచ్చాయి?
చిత్తా నక్షత్రములో పౌర్ణమి రావటం వల్ల చైత్ర మాసమనీ, విశాఖ నక్షత్రములో పౌర్ణమి రావటం వల్ల వైశాఖ మాసమనీ, జ్యేష్టా నక్షత్రంలో పున్నమి చంద్రుడు రావటం వల్ల జ్యేష్ట మాసమనీ, పూర్వాషాఢ నక్షత్రంలో పౌర్ణమి రావటంతో ఆషాఢమనీ, శ్రవణంలో పౌర్ణమి రావటం వల్ల భాద్రపద మాసమనీ, అలాగే అశ్వనీ, పుష్యమీ నక్షత్లాల్లో పౌర్ణమి రావటం వల్ల కార్తీక, పుష్యమాసములనీ మఖ నక్షత్రంలో పౌర్ణమి రావటం వల్ల మాఘమాసమనీ, పూర్వఫల్గుణి నక్షత్రంలో పౌర్ణమి రావటం వల్ల ఫాల్గుణ మాసమని మన పూర్వీకులైన మహాఋషులు నామధేయములేర్పరిచారు.
వసెక్కువ పోశారంటారు?

సంస్కృతంలో 'వచు'లేదా 'ఉగ్రగంధ' అంటారు. తేమగా ఉన్న ప్రదేశంలో పెరుగుతుంది. పసితనంలో తొందరగా మాటలు రావటానికి వసకొమ్మును అరగదీసి తేనెతో కలిపి పోస్తారు. అలా పోస్తే వాక్కు స్పష్టంగా చక్కగా త్వరగా వస్తుందని అలా పోస్తారు.

సమతూకంగి వసపొయ్యకుండా ఎక్కువ పోస్తే గలగలా మాట్లాడతారు. అలాంటి వాళ్ళని సంబోధించి వీడికి వసెక్కువ పోశారంటారు. ఆయుర్వేదంలో వాపును కూడా ఈ వస చెట్టు వేళ్ళ రసం తగ్గిస్తుందని ఉన్నది.

గృహారంభము ఎప్పుడు ప్రారంభించ కూడదు, ఎప్పుడు ప్రారంభించాలి?

వైశాఖమూ, ఫాల్గుణమూ,పుష్యమూ, శ్రావణమూ, ఈ మాసములందు ముగ్గుపోయాలని బాదరాయణుడు శెలవిచ్చాడు.

అదే నారదుడు ఫాల్గుణ, వైశాఖ, శ్రావణ, కార్తీకములందు గృహ నిర్మాణమునకు శ్రీకారం చుట్ఠమని చెప్పాడు. ఈ మాసములలో గృహారంభము చేస్తే ధన, కనక, పుత్ర, ఆరోగ్యములు వృద్ధి చెందుతాయని చెప్పాడు.


కారణ తంత్రంతో స్థిరమాసమూ, స్థిరరాశీ, స్థిర అంశమూ ఇందు గృహానికి శంఖుస్థాపన చేయుట మంచిదని చెప్పాడు. ప్రధాన గృహ నిర్మాణం పుష్య, ఆషాఢ మాసములలో వద్దని చెప్పాడు. దైవజ్ఞవల్లభుడు, చైత్రమాసంలో గృహిరంభము శోకమనీ, వైశాఖంలో శుభమనీ, జ్యేష్టంలో మహాభయంకర శోకమనీ, ఆషాఢంలో పశువుల క్షీణతనీ, శ్రావణము ధనకారనీ, భాద్రపదము దరిద్రమనీ, ఆశ్వీయుజము గొడవలనీ, కార్తీకము భృత్యనాశనమనీ, మార్గశిరము ధనప్రాప్తి అనీ, పుష్యం లక్ష్మీప్రాప్తి అనీ, మాఘమాసము అగ్ని భయమనీ ఫాల్గుణం సకల ఐశ్వర్యప్రాప్తి అని శెలవిచ్చాడు.

ఔనా కర్పూరం అంత మంచిదా? మరెందుకు అందరికీ తెలియచెయ్యకూడదూ..? అని ఒక మిత్రుడు అడిగారు .ఒక ఎంతో మంచి మనిషిని పది మందికి మంచి జరగాలని కోరుకునే వ్యక్తిత్వం వున్న వారిని మనం ఆ మనిషి కర్పూరం లాంటి మనిషి అని అంటూ వుంటాం. అలా ఎందుకని అంటామో తెలియాలంటే కర్పూరంతో మనకు లభించే ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలి. జాగ్రత్తగా పరిశీలించండి మరి. - గౌతమ్ కశ్యప్

ఔనా కర్పూరం అంత మంచిదా? 
మరెందుకు అందరికీ తెలియచెయ్యకూడదూ..? అని ఒక మిత్రుడు అడిగారు 
.
ఒక ఎంతో మంచి మనిషిని పది మందికి మంచి జరగాలని కోరుకునే వ్యక్తిత్వం వున్న వారిని మనం ఆ మనిషి కర్పూరం లాంటి మనిషి అని అంటూ వుంటాం. అలా ఎందుకని అంటామో తెలియాలంటే  కర్పూరంతో మనకు లభించే ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలి. జాగ్రత్తగా పరిశీలించండి మరి. - గౌతమ్ కశ్యప్ 
.
కర్పూరాలలో 15 రకాలు ఉన్నప్పటికీ హారతి కర్పూరం, పచ్చ కర్పూరం చాలా ముఖ్యమైనవి. 
హారతి కర్పూరాన్ని శుభాకరమైనదిగా అనాదిగా ఎన్నో దేశాల్లో ముఖ్యంగా భారతదేశంలో భావిస్తారు. ఎంతో చక్కని మంచి పరిమాళాన్ని వెదజల్లే ఈ కర్పూరాన్ని దేవాలయాల్లో పూజల్లో వాడతారు. భగవంతుడిక్లి హారతి ఇచ్చేందుకు ఈ పదార్థాన్ని వినియోగిస్తారు. పూజలో ఇదొక అమూల్యమైన పదార్థం. 
కాని మనలో చాలా మందికి తెలియని విషయం ఏవిటంటే, పచ్చ కర్పూరం మన శరీరానికి మంచి ఔషదం. కొన్ని రాష్ట్రాల్లో కర్పూరాన్ని గాగే నీటిలో కూడా వేసొ ఉపయోగిస్తుంటారు. ఇలా చేస్తే నీటిలోని బ్యాక్టీరియా, కలుషిత పదార్థాలన్నీ తొలగిపోయి స్వచ్ఛంగా మారుతాయని వారి నమ్మకం. 
కర్పూరం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని ఆయుర్వేద వైద్యులు చెపుతున్నారు. 
.
కర్పూరం ప్రయోజనాలు

1. స్నానం చేసే నీటిలో కొద్దిగా కర్పూరాన్ని వేసి స్నానం చేస్తే మన శరీరం మీద బాక్టీరియా సహజంగానే శుభ్రమౌతుంది.

2. కప్పు నీటిలో కర్పూరం బిళ్ళలు వేసి మంచం కింద పెడితే దోమలు దరిచేరవు.

3.వానాకాలంలో ఈగలు సమస్య ఎక్కువగా ఉంటుంది. అర బకెట్ నీళ్ళలో ఒక గుప్పెడు వేపాకు, కర్పూరం ఒక పది చెంచాల నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెలో వేసి ఆవిరి వచ్చేవరకు మరిగించి నేల మీద డైనింగ్ టేబుల్స్ మీదా మన రోజూ వండుకునే గాస్ స్టవ్ దగ్గరా వంట చేసుకునే స్థలంలోనూ తుడిస్తే ఈగలు అటువైపు కూడా రావు.

4. టూత్ బ్రష్ మీద దానిపై కర్పూరం వేసుకుని దంతాలు శుబ్రం చేస్తే నోటి దుర్వాసన పోతుంది. దంతాల మధ్య క్రిములు చస్తాయి.

5. చుండ్రు సమస్య ఉన్నవాళ్ళు కొబ్బరి నూనె లో కర్పూరం వేసి గంట తర్వాత దానిని జుట్టుకు రాసుకుంటే చుండ్రు సమస్య ఉండదు.

6.మన ఇంట్లో కర్పూరాన్ని వెలిగిస్తే కాలుష్యాన్ని పోగొట్టి వాతావరణాన్ని స్వచ్చంగా ఉండేలా చేస్తుంది. అంటువ్యాధులు రాకుండా చేస్తుంది.

7.కొన్ని కర్పూరం బిళ్ళలను ఒక గుడ్డ లో చుట్టి రాత్రి పడుకునేముందు మెడలో వేసుకుని ఉదయం తీసివేస్తే మన శరీరంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది

*'అన్నం' గురించి నలుగురు మంచి మనుషులు చెప్పిన నాలుగు గొప్ప మాటలు...*1. " నేను వంటింట్లోకి వేరే పనిమీదవెళ్ళినా కూడా , వంట చేస్తున్న మా అమ్మగారు. " పెట్టేస్తా నాన్నా ఒక్క అయిదు నిముషాలు " అనేవారు నొచ్చుకుంటూ- నేను అన్నం కోసం వచ్చాననుకుని ! ఎంతయినా అమ్మ అంటే అన్నం. అన్నం అంటే అమ్మ ! అంతే ! - జంధ్యాలగారు

💐
*'అన్నం' గురించి నలుగురు మంచి మనుషులు చెప్పిన నాలుగు గొప్ప మాటలు...*
1. " నేను వంటింట్లోకి వేరే పనిమీదవెళ్ళినా కూడా , వంట చేస్తున్న మా అమ్మగారు.  " పెట్టేస్తా నాన్నా ఒక్క అయిదు నిముషాలు " అనేవారు నొచ్చుకుంటూ-   నేను అన్నం కోసం వచ్చాననుకుని !  ఎంతయినా అమ్మ అంటే అన్నం.  అన్నం అంటే అమ్మ ! అంతే !  - జంధ్యాలగారు

2. మంచి భోజనం లేని పెళ్ళికి వెళ్ళటం - సంతాపసభకి వెళ్ళినదానితో సమానం !   -  విశ్వనాధ సత్యనారాయణ గారు 

3. రాళ్లు తిని అరిగించుకోగల వయసులో వున్నప్పుడు తినటానికి మరమరాలు కూడా దొరకలేదు !  వజ్రాలూ , వైడూర్యాలూ  పోగేసుకున్న ఈ వయసులో  మరమరాలు కూడా అరగట్లేదు ! అదే విధి !  - రేలంగి వెంకట్రామయ్య గారు

4. ఆరురోజుల పస్తులవాడి ఆకలి కన్నా,   మూడురోజుల పస్తులవాడి ఆకలి మరీ ప్రమాదం ! ఆహారం దొరికినప్పుడు ముందు వాడ్నే తిననివ్వాలి !  -  ముళ్ళపూడి వెంకటరమణ గారు

5. ఏటా వందబస్తాల బియ్యం మాకు ఇంటికి వచ్చినా మా తండ్రిగారు " అన్నీ మనవికావు నాయనా " అని బీదసాదలకి చేటలతో పంచేసేవారు.  అన్నీ మనవికావు అనటంలో వున్న వేదార్ధం నాకు పెద్దయితేనేగానీ  అర్ధం కాలేదు !  - ఆత్రేయ గారు

6. అమ్మ చేతి  అన్నం తింటున్నాను అని చెప్పగలిగినవాడు ధన్యుడు !   - చాగంటి కోటే శ్వర రావుగారు

7.  ఆకలితో వున్న వాని మాటలకు ఆగ్రహించవద్దు ! - గౌతమ బుద్దుడు 

8. ఆత్మీయులతో కలసి తినే భోజనానికి రుచి ఎక్కువ ! చారుకూడా అమృతంలా రుచిస్తుంది ! - మాతా అమృతానందమయి

9. మీ పిల్లలు ఎంతదూరంలో,  ఎక్కడవున్నా , వేళపట్టున ఇంత అన్నం తినగలుగుతున్నారంటే అది వాళ్ళ గొప్పాకాదూ , మీ గొప్పాకాదు  మీ పూర్వీకుల పుణ్యఫలమే అని  గుర్తించు.   "అన్ని దానము లలో  అన్నదానము మిన్న "

మనసును శుద్ధి చేసుకోవడం ఎలా...🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃భక్తో భక్తి గుణావృతే ముదమృతాపూర్ణే ప్రసన్నే మనః కుంభే సాంబ ! తవాంఘ్రి పల్లవ యుగం _ సంస్థాప్య సంవిత్ఫలం,సత్త్వం మంత్ర ముదీరయన్ నిజ శరీరాగార శుద్ధిం వహన పుణ్యాహం ప్రకటీకరోమి రుచిరం _ కల్యాణ మాపాదయన్ !!----ఆదిశంకరుల శివానందలహరి నుండి...

మనసును శుద్ధి చేసుకోవడం ఎలా...

🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃

భక్తో భక్తి గుణావృతే ముదమృతాపూర్ణే ప్రసన్నే మనః కుంభే సాంబ ! తవాంఘ్రి పల్లవ యుగం _ సంస్థాప్య సంవిత్ఫలం,సత్త్వం మంత్ర ముదీరయన్ నిజ శరీరాగార శుద్ధిం వహన పుణ్యాహం ప్రకటీకరోమి రుచిరం _ కల్యాణ మాపాదయన్ !!

----ఆదిశంకరుల శివానందలహరి నుండి...

విశేషం_ పుణ్యాహవాచనం :

ఇది యొక శుద్ధి కర్మ.  ఇది చేసేటప్పుడు కలశము పెట్టి , దానికి దారముౘుట్టి
కలశములో నీళ్ళు పోసి  మామిడి చిగుళ్ళూ, కొబ్బరికాయనూ దానిపై యుంచి
మంత్రములు ౘదువుతూ, ఆ నీటితో గృహమును శుద్ధి చేసి, మంగళాన్ని
పొందుతారు.

తాత్పర్యము :

ಓ సాంబమూర్తీ ! శివా ! నేను భక్తుడనై నా శరీరము అనే గృహాన్ని 
నిర్దుష్టంగా శుద్ధి చేసుకొని , మనస్సునకు ఇష్టమైన మంగళమును చేయడానికి
పూనుకొని, దానికొఱకై భక్తి అనే నూలుపోగులను ౘుట్టి , సంతోషము అనే
 నీటితో నింపిన నామనస్సు  అనే కలశంలో  నీ పాదములనే చిగుళ్ళనూ, 
జ్ఞానము అనే కొబ్బరి కాయను ఉంచి , కలశస్థాపనము చేసి , సత్త్వగుణ
రూపమైన తారకమంత్రాన్ని ఉచ్ఛరిస్తూ, పుణ్యాహవాచనమును నెరవేరుస్తాను.
( అన్ని వేళలా మీ పాదపద్మములను స్మరిస్తానని భావం ).

వివరణ:

సామాన్యంగా మైలగానీ,పురుడుగానీ వచ్చి , ఇల్లూ ఇంట్లోని వారూ,
అశౌచంగా వుంటే , శుద్ధి రోజున తప్పకుండా గణపతి పూజ తోపాటు 
పుణ్యాహవాచనం చేసి ఆ కలశాలలోని పవిత్ర జలాన్ని  ఇల్లంతా 
ౘల్లాలి. ఇంటిలోని వారి శిరస్సులపైనా ౘల్లాలి. అప్పుడు ఆ ఇల్లూ 
ఇంటి యజమానీ , ఇంటిలోనివారూ నిర్మలులవుతారు. అలాగే భక్తుల
హృదయాలు అరిషడ్వర్గాలతో , అసూయాద్వేషాలతో , అపవిత్ర కార్య
క్రమాలతో మలినములైనపుడు ఏ విధంగా వారు తమ దేహాలను శుద్ధి
చేసుకోవాలో  ఈ శ్లోకంలో శంకరులు చెప్పారు.

శంకరులు ఇలా చెప్పారు.   ಓ ఈశ్వరా ! నా శరీరం పాడుపడిన కొంప.
దానిని శుద్ధి చేసుకోవాలి. తరువాత కల్యాణాన్ని ౘక్కగా సంపాదింౘాలి.
 దానికై  పుణ్యాహం అనే శుద్ధి కర్మను చేసుకోవాలి. పుణ్యాహవాచన
కర్మకు కావలసిన సామగ్రిని నేను ఇలా సంపాదింౘుకుంటాను. ముందుగా
కలశ స్థాపన చెయ్యాలి,  నామనస్సే ఆ కలశం.  నామనస్సనే కలశం ప్రసన్నంగా 
స్వచ్ఛంగా వుంది.  కలశానికి దారాలు ఛుట్టాలి. నేను నాభక్తి అనే దారాలు
 ఆ కలశానికి ౘుడతాను. నా సంతోషమనే నీటితో కలశాన్ని నింపుతాను.
కలశంలో లేత మామిడి చిగుళ్ళు వేయాలి కదా ! నీ పాదపద్మాలే నాకు 
దొరికిన ఆ చిగుళ్ళు. అందుచేత నామనస్సనే కలశంలో  ఈశ్వరా ! 
నీ పాదాలనే చిగుళ్ళను వేస్తాను. ఇంక కలశంపై ఒక ఫలం ఉంౘాలి. 
నేను ఙ్ఞానం అనేే కొబ్బరికాయను కలశంపై ఉంౘుతాను. తరువాత 
మంత్రాలు ౘదవాలి.  నేను సత్త్వగుణ ప్రధానమైన తారకమంత్రాన్ని 
ౘదువుతాను. ఈ పుణ్యాహవాచనం వల్ల నా శరీరమూ, మనస్సూ,
వాక్కూ పవిత్రమవుతాయి. 
ఉజ్జయినీ మహాకాలుని పంచామృత అభిషేకం
మనం కూడా మనశరీర శుద్ధి, ఇలాగే  ఈశ్వర పాద ద్వంద్వాన్ని మన 
చిత్తంలో నిలిపి వాక్కుతో శివనామాన్ని జపింౘాలని  ఈ శ్లోకం ద్వారా
శంకరులు మనకు సూచించారని మనం గ్రహించాలి, ఆచరించాలి.


జై శ్రీమన్నారాయణ🙏

🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂

అశ్వినీ దేవతలు* ➖➖➖✍️*అశ్వినీ దేవతలు సూర్యపుత్రులు. వీరు కవలలు. వీరిసోదరి ఉష. ఆమె ప్రతిరోజూ వీరిని బ్రహ్మ ముహూర్తంలో మేల్కొల్పుతుందట.*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


              *అశ్వినీ దేవతలు*
                ➖➖➖✍️

*అశ్వినీ దేవతలు సూర్యపుత్రులు. వీరు కవలలు. వీరిసోదరి ఉష. ఆమె ప్రతిరోజూ వీరిని బ్రహ్మ ముహూర్తంలో మేల్కొల్పుతుందట.*


*ఆ తరువాత వారు రథాన్ని అధిరోహించి తమ సోదరి ఉషను ముందు కూర్చోబెట్టుకుని తూర్పుదిక్కు నుండి పడమటి దిక్కుకు ప్రయాణిస్తారని పురాణ వర్ణన.*

*వీరు ప్రయాణించే రథం పేరు హిరణ్యవర్తం. అది హిరణ్యయానమనే దోవలో వాయువేగ మనోవేగాలతో ప్రయాణిస్తుంది.*

*ఆ రథం చాలా బృహత్తరమైనది. అది హిరణ్యంతో నిర్మించబడింది. ఆ రథానిని మూడు గుర్రాలు నడుపుతుంటాయి. అద్వరాశ్వాలనే ఆగుర్రాలు తెల్లగా నున్నగా ఎల్లప్పుడూ యవ్వనంతో అత్యంత ఉత్సాహంతో ఉంటాయి.*

*చిత్రమైన ఈ రథానికి చక్రాలూ మూడే. సారథి కూర్చోవడానికి త్రిఫలకాలు, త్రిబంధురాలు అనే పేర్లు కలిగిన మూడు ఆసనాలు ఉంటాయి.* 

*ఆరథంలో ఒకవైపు ధనం మరొకవైపు తేనె, సోమరసం మరొకవైపు ఆయుధాలు ఉంటాయి. రథం పైభాగంలో వేయిపతాకాలు సుందరంగా రెపరెపలాడుతూ ఉంటాయి.*

*అశ్వినీ దేవతల కంఠధ్వని... శంఖనాదంలా మధురంగా ఉంటుంది. ఈ దేవతలను అంతా వేదమంత్రాలతో ఆహ్వానిస్తుంటారు. ఉపాసకుల మంత్రాలలోని సత్యాన్ని మాత్రమే గ్రహించి వారిని అనుగ్రహిస్తుంటారు.* 

*వీరి చేతిలో తేనె, సోమరసం, మంచుతో అద్దిన బెత్తంతో యజ్ఞం చేసే ప్రదేశానికి విచ్చేసి అధిపతులను యజ్ఞ ద్రవ్యాలను బెత్తంతో సుతిమెత్తగా తాకి వారిని అనుగ్రహిస్తుంటారు.*

*వేదాలలో అశ్వినీ దేవతల వర్ణన ఉంది. వేదాలలో వీరి గురించి దాదాపు నూరు సూక్తాల వరకు ఉంది. వీరిని ఆది వైద్యులుగా పురాణాలు వర్ణించాయి.*

*ఈ దేవతలు దయార్ధ హృదయులు, ధర్మపరులు, సత్యసంధులు. వీరి ఆయుధాలలో అత్యంత ప్రభావితమైన మహా ఔషధాలు ఉంటాయి.*

*వీరు ఆరోగ్యసమస్యలు ఉన్నవాళ్ళను అనేక సమయాలలో ఆహ్వానంపై వచ్చి శస్త్రచికిత్సలు సైతం చేసినట్లు పురాణ వర్ణన.* 

*వైద్యశాస్త్రానికి అధిపతులైన ఈ దేవతలు కుడిచేతిలో అభయముద్ర ఎడమచేతిలో ఆయుర్వేద గ్రంథం కుడిపక్కన మృతసంజీవిని విశల్యకరణి లాంటి ఔషధీ లతలు ఎడమవైపు అమృతకలశాన్ని పట్టుకున్న ధన్వంతరీ కలిగి ఉంటారని పురాణాలలో వర్ణించబడింది.*

*ఈ దేవతలు విరాట్పురుషుని నాశికాభాగంలో ఉంటారు.*✍️

🍃🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺🍃

🌺మన సమస్యలకి సుందరకాండ పరిష్కారాలు🌺🙏🌺సుందరకాండ అద్భుతమైన పారాయణం, ఎన్నో సమస్యలకు సుందరకాండ లోని వివిధ సర్గలు పారాయణ చేసి ఎంతో మంది పరిష్కారం పొందారు.. ఈ రోజుల్లో అందరికి వివిధ కారణాల వల్ల నిత్యం కాండం మొత్తం పారాయణ చేయలేరు, అయితే అందులో ఏ సమస్యకు ఏది పరిహారామో వివరంగా ఉంది.

🙏🌺మన సమస్యలకి సుందరకాండ పరిష్కారాలు🌺🙏

🌺సుందరకాండ అద్భుతమైన పారాయణం, 
ఎన్నో సమస్యలకు సుందరకాండ లోని వివిధ సర్గలు పారాయణ చేసి ఎంతో మంది పరిష్కారం పొందారు.. 
ఈ రోజుల్లో అందరికి వివిధ కారణాల వల్ల నిత్యం 
కాండం మొత్తం పారాయణ చేయలేరు, 
అయితే అందులో ఏ సమస్యకు ఏది పరిహారామో వివరంగా ఉంది. 
పారాయణ నియమాలతో ఉంటుంది. 
ఇక్కడ ఇచ్చిన వివరాలు ఒకసారి పరిశీలించండి.🌺

🌺1. ఆపదలు తొలగటానికి , సంపదలు కలగటానికి..
శ్లోకం.ఆపదమపహర్తారం దాతారం సర్వసంపదామ్
 లోకాభిరామం శ్రీరామం, భూయో భూయో నమామ్యహమ్ ||

21 దినములు , 
108 సార్లు , 
శక్తి  కొలది తమలపాకులు, 
అరటిపళ్ళు నివేదన చేయాలి.🌺

🌺2. విద్యాప్రాప్తికి.
ఒకసారి పరిపూర్ణంగా పారాయణ చేయవలెను . 
3 రోజులు ద్రాక్ష , అరటిపళ్ళు నివేదన

🌺3. భూతబాధ  నివారణకు.
3 వ సర్గ వచనము రోజుకు 108 సార్లు 
30 దినములు పారాయణ చేయవలెను . 
1 కొబ్బరికాయ , అరటిపళ్ళు నివేదన.

🌺4. సర్వ కార్య సిద్దికి.
64 వ సర్గ నిష్ఠతో 11 సార్లు 
40 దినములు పారాయణ చేయవలెను .
శక్తి  కొలది అరటిపళ్ళు నివేదన చేయవలెను.

🌺5. శత్రు నాశనముకు.
51 వ సర్గ అతినిష్ఠతో 2 సార్లు 
21 దినములు పారాయణ చేయవలెను. 
శక్తి  కొలది ద్రాక్ష , బెల్లము నివేదన చేయవలెను.

🌺6. వాహనప్రాప్తికి.
8 మరియి 9 వ సర్గలు ఏకాగ్రతతో 3 సార్లు 
27 దినములు పారాయణ చేయవలెను. 
శక్తి  కొలది అరటి ,దానిమ్మ నివేదన చేయవలెను.

🌺7. మనశాంతికి.
11 వ సర్గ నిష్ఠతో 3 సార్లు 
21 దినములు పారాయణ చేయవలెను. 
అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను.

🌺8. స్వగృహం కోరువారికి.
7వ సర్గ ఏకాగ్రతతో 1 సారి  
40 దినములు పారాయణ చేయవలెను.  
అరటిపళ్ళు చక్కెరతో నివేదన చేయవలెను.

🌺9. యోగక్షేమాలకు.
13 వ సర్గ నిష్ఠతో 3 సార్లు 
27 దినములు పారాయణ చేయవలెను. 
శక్తి కొలది అరటి , దానిమ్మ నివేదన చేయవలెను.

🌺10. ఉద్యోగప్రాప్తికి.
63 వ సర్గ నిష్ఠతో 5 సార్లు 
21 దినములు పారాయణ చేయవలెను . 
శక్తి కొలది అరటి ,దానిమ్మ నివేదన చేయవలెను.

🌺11. రోగ నివారణకు.
34వ సర్గ ఏకాగ్రతతో 5 సార్లు ప్రతిదినము ,   
21 దినములు పఠించవలెను. 
శక్తి  కొలది బెల్లపు ముక్క అరటిపళ్ళు నివేదన చేయవలెను.

🌺12. దుఃఖనివృత్తికి.
67 వ సర్గ నిష్ఠతో ప్రయత్నం మానకుండా 3 సార్లు 
21 దినములు పారాయణ చేయవలెను. 
శక్తి కొలది అరటిపళ్ళు,ఖర్జూరము నివేదన చేయవలెను.

13. దుస్వప్న నాశనానికి.💐
27వ సర్గ ఏకాగ్రతతో 1 సారి ప్రతిదినము పఠించవలెను . శక్తి కొలది అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను.

🌺14. దూరముగా ఉన్న ఆప్తులు క్షేమమునకు.
33 నుండి 40 వ సర్గ వరకు 1 సారి , 
21 దినములు నిష్ఠతో పఠించవలెను . 
శక్తి కొలది అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను.

🌺15. ధనప్రాప్తికి.
15వ సర్గ ఏకాగ్రతతో 1 సారి  
40 దినములు పఠించవలెను.
అరటిపళ్ళు, పటిక బెల్లం , మరియు  
రామాయణం లో అయోధ్యకాండలో యాత్రాదానము 
32 వ సర్గ 1 సారి , 
40 దినములు పఠించవలెను. 
శక్తి  కొలది అరటిపళ్ళు, ద్రాక్షనివేదన చేయవలెను . ( అగస్త్య , పరాశర , ఉమా సంహిత ప్రకారం చెప్పబడినది ).

🌺16. దైవాపచారా ప్రాయశ్చిత్తం.
38 వ సర్గ ఏకాగ్రతతో 3 సార్లు 
27 దినములు పఠించవలెను. 
శక్తి కొలది అరటిపళ్ళు వీలైతే పనస నివేదన చేయవలెను.

🌺17. బ్రహ్మజ్ఞానము కలుగుటకు.
19 వ సర్గ అతినిష్ఠతో రోజుకు ఒకసారి 
1 సంవత్సరము పఠించవలెను. 
శక్తి  కొలది అరటిపళ్ళు నివేదన చేయవలెను.

🌺18. ఏలిననాటి శనీ దోష పరిహారమునకు.
సకల రోగ నివృత్తికి - సర్వ పాప నివృత్తికి
మొత్తం సుందరకాండ నిష్ఠతో 9 దినాలలో 1సారి 
68 రోజులు చదువవలెను. 
నివేదన రోజూ కొబ్బరికాయ సత్ఫాలితమునిచ్చును.

🌺19. కన్యా వివాహమునకు.
9 దినములలో ఒకసారి పూర్తిగా 
68 దినాలలో పఠించవలెను. 
సీతారామ కళ్యాణం నిష్ఠతో 7 సార్లు 
ప్రతిరోజు పఠించవలెను.  
అప్పాలు , పాలు , పంచదార నివేదన చేయవలెను.

🌺20. విదేశీ యానమునకు.
1 వ సర్గ ఏకాగ్రతతో రోజుకు 5  సార్లు 
30 దినములు పఠించవలెను. 
శక్తి కొలది అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను.

🌺21. ధననష్ట నివృత్తికి.
55వ సర్గ నిష్ఠతో 3  సార్లు 
30 దినములు పఠించవలెను . 
శక్తి  కొలది అరటిపళ్ళు,పనస నివేదన చేయవలెను.

🌺22. వ్యాజ్యములో విజయమునకు.
42 సర్గ అతి ఏకాగ్రతతో 3 సార్లు , 
21 దినములు పఠించవలెను. 
శక్తి  కొలది అరటిపళ్ళు, ద్రాక్ష , దానిమ్మ నివేదన చేయవలెను.

🌺23. వ్యాపారాభివృద్ధికి.
15వ సర్గ నిష్ఠతో నియమంతో 5 సార్లు 
21 దినములు పఠించవలెను. 
శక్తి  కొలది అరటిపళ్ళు నివేదన చేయవలెను.

🌺24. పుత్ర సంతానానికి.
ప్రతిదినం 7 వ సర్గ నిష్ఠతో 
68 రోజులు పారాయణ చేయవలెను . 
శక్తి  కొలది అరటిపళ్ళు , కొబ్బరికాయ ,నివేదన చేయవలెను. 
శక్తి  కొలది తమలపాకులతో అర్చన చేయవలెను . సుందరకాండ 16 రోజులు పారాయణ చేయవచ్చును.

🌺25. ఋణ విముక్తికి.
28 వ సర్గ చాలా నిష్ఠగా రోజుకి 1 సారి 
41 రోజులు పఠించవలెను. 
శక్తి  కొలది అరటిపళ్ళు నివేదన చేయవలెను.🌺

🌺శ్రీరామ జయరామ జయ జయరామ.🌺

🙏🌺మన సమస్యలకి సుందరకాండ పరిష్కారాలు🌺🙏🌺సుందరకాండ అద్భుతమైన పారాయణం, ఎన్నో సమస్యలకు సుందరకాండ లోని వివిధ సర్గలు పారాయణ చేసి ఎంతో మంది పరిష్కారం పొందారు.. ఈ రోజుల్లో అందరికి వివిధ కారణాల వల్ల నిత్యం కాండం మొత్తం పారాయణ చేయలేరు, అయితే అందులో ఏ సమస్యకు ఏది పరిహారామో వివరంగా ఉంది.

🙏🌺మన సమస్యలకి సుందరకాండ పరిష్కారాలు🌺🙏

🌺సుందరకాండ అద్భుతమైన పారాయణం, 
ఎన్నో సమస్యలకు సుందరకాండ లోని వివిధ సర్గలు పారాయణ చేసి ఎంతో మంది పరిష్కారం పొందారు.. 
ఈ రోజుల్లో అందరికి వివిధ కారణాల వల్ల నిత్యం 
కాండం మొత్తం పారాయణ చేయలేరు, 
అయితే అందులో ఏ సమస్యకు ఏది పరిహారామో వివరంగా ఉంది. 
పారాయణ నియమాలతో ఉంటుంది. 
ఇక్కడ ఇచ్చిన వివరాలు ఒకసారి పరిశీలించండి.🌺

🌺1. ఆపదలు తొలగటానికి , సంపదలు కలగటానికి..
శ్లోకం.ఆపదమపహర్తారం దాతారం సర్వసంపదామ్
 లోకాభిరామం శ్రీరామం, భూయో భూయో నమామ్యహమ్ ||

21 దినములు , 
108 సార్లు , 
శక్తి  కొలది తమలపాకులు, 
అరటిపళ్ళు నివేదన చేయాలి.🌺

🌺2. విద్యాప్రాప్తికి.
ఒకసారి పరిపూర్ణంగా పారాయణ చేయవలెను . 
3 రోజులు ద్రాక్ష , అరటిపళ్ళు నివేదన

🌺3. భూతబాధ  నివారణకు.
3 వ సర్గ వచనము రోజుకు 108 సార్లు 
30 దినములు పారాయణ చేయవలెను . 
1 కొబ్బరికాయ , అరటిపళ్ళు నివేదన.

🌺4. సర్వ కార్య సిద్దికి.
64 వ సర్గ నిష్ఠతో 11 సార్లు 
40 దినములు పారాయణ చేయవలెను .
శక్తి  కొలది అరటిపళ్ళు నివేదన చేయవలెను.

🌺5. శత్రు నాశనముకు.
51 వ సర్గ అతినిష్ఠతో 2 సార్లు 
21 దినములు పారాయణ చేయవలెను. 
శక్తి  కొలది ద్రాక్ష , బెల్లము నివేదన చేయవలెను.

🌺6. వాహనప్రాప్తికి.
8 మరియి 9 వ సర్గలు ఏకాగ్రతతో 3 సార్లు 
27 దినములు పారాయణ చేయవలెను. 
శక్తి  కొలది అరటి ,దానిమ్మ నివేదన చేయవలెను.

🌺7. మనశాంతికి.
11 వ సర్గ నిష్ఠతో 3 సార్లు 
21 దినములు పారాయణ చేయవలెను. 
అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను.

🌺8. స్వగృహం కోరువారికి.
7వ సర్గ ఏకాగ్రతతో 1 సారి  
40 దినములు పారాయణ చేయవలెను.  
అరటిపళ్ళు చక్కెరతో నివేదన చేయవలెను.

🌺9. యోగక్షేమాలకు.
13 వ సర్గ నిష్ఠతో 3 సార్లు 
27 దినములు పారాయణ చేయవలెను. 
శక్తి కొలది అరటి , దానిమ్మ నివేదన చేయవలెను.

🌺10. ఉద్యోగప్రాప్తికి.
63 వ సర్గ నిష్ఠతో 5 సార్లు 
21 దినములు పారాయణ చేయవలెను . 
శక్తి కొలది అరటి ,దానిమ్మ నివేదన చేయవలెను.

🌺11. రోగ నివారణకు.
34వ సర్గ ఏకాగ్రతతో 5 సార్లు ప్రతిదినము ,   
21 దినములు పఠించవలెను. 
శక్తి  కొలది బెల్లపు ముక్క అరటిపళ్ళు నివేదన చేయవలెను.

🌺12. దుఃఖనివృత్తికి.
67 వ సర్గ నిష్ఠతో ప్రయత్నం మానకుండా 3 సార్లు 
21 దినములు పారాయణ చేయవలెను. 
శక్తి కొలది అరటిపళ్ళు,ఖర్జూరము నివేదన చేయవలెను.

13. దుస్వప్న నాశనానికి.💐
27వ సర్గ ఏకాగ్రతతో 1 సారి ప్రతిదినము పఠించవలెను . శక్తి కొలది అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను.

🌺14. దూరముగా ఉన్న ఆప్తులు క్షేమమునకు.
33 నుండి 40 వ సర్గ వరకు 1 సారి , 
21 దినములు నిష్ఠతో పఠించవలెను . 
శక్తి కొలది అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను.

🌺15. ధనప్రాప్తికి.
15వ సర్గ ఏకాగ్రతతో 1 సారి  
40 దినములు పఠించవలెను.
అరటిపళ్ళు, పటిక బెల్లం , మరియు  
రామాయణం లో అయోధ్యకాండలో యాత్రాదానము 
32 వ సర్గ 1 సారి , 
40 దినములు పఠించవలెను. 
శక్తి  కొలది అరటిపళ్ళు, ద్రాక్షనివేదన చేయవలెను . ( అగస్త్య , పరాశర , ఉమా సంహిత ప్రకారం చెప్పబడినది ).

🌺16. దైవాపచారా ప్రాయశ్చిత్తం.
38 వ సర్గ ఏకాగ్రతతో 3 సార్లు 
27 దినములు పఠించవలెను. 
శక్తి కొలది అరటిపళ్ళు వీలైతే పనస నివేదన చేయవలెను.

🌺17. బ్రహ్మజ్ఞానము కలుగుటకు.
19 వ సర్గ అతినిష్ఠతో రోజుకు ఒకసారి 
1 సంవత్సరము పఠించవలెను. 
శక్తి  కొలది అరటిపళ్ళు నివేదన చేయవలెను.

🌺18. ఏలిననాటి శనీ దోష పరిహారమునకు.
సకల రోగ నివృత్తికి - సర్వ పాప నివృత్తికి
మొత్తం సుందరకాండ నిష్ఠతో 9 దినాలలో 1సారి 
68 రోజులు చదువవలెను. 
నివేదన రోజూ కొబ్బరికాయ సత్ఫాలితమునిచ్చును.

🌺19. కన్యా వివాహమునకు.
9 దినములలో ఒకసారి పూర్తిగా 
68 దినాలలో పఠించవలెను. 
సీతారామ కళ్యాణం నిష్ఠతో 7 సార్లు 
ప్రతిరోజు పఠించవలెను.  
అప్పాలు , పాలు , పంచదార నివేదన చేయవలెను.

🌺20. విదేశీ యానమునకు.
1 వ సర్గ ఏకాగ్రతతో రోజుకు 5  సార్లు 
30 దినములు పఠించవలెను. 
శక్తి కొలది అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను.

🌺21. ధననష్ట నివృత్తికి.
55వ సర్గ నిష్ఠతో 3  సార్లు 
30 దినములు పఠించవలెను . 
శక్తి  కొలది అరటిపళ్ళు,పనస నివేదన చేయవలెను.

🌺22. వ్యాజ్యములో విజయమునకు.
42 సర్గ అతి ఏకాగ్రతతో 3 సార్లు , 
21 దినములు పఠించవలెను. 
శక్తి  కొలది అరటిపళ్ళు, ద్రాక్ష , దానిమ్మ నివేదన చేయవలెను.

🌺23. వ్యాపారాభివృద్ధికి.
15వ సర్గ నిష్ఠతో నియమంతో 5 సార్లు 
21 దినములు పఠించవలెను. 
శక్తి  కొలది అరటిపళ్ళు నివేదన చేయవలెను.

🌺24. పుత్ర సంతానానికి.
ప్రతిదినం 7 వ సర్గ నిష్ఠతో 
68 రోజులు పారాయణ చేయవలెను . 
శక్తి  కొలది అరటిపళ్ళు , కొబ్బరికాయ ,నివేదన చేయవలెను. 
శక్తి  కొలది తమలపాకులతో అర్చన చేయవలెను . సుందరకాండ 16 రోజులు పారాయణ చేయవచ్చును.

🌺25. ఋణ విముక్తికి.
28 వ సర్గ చాలా నిష్ఠగా రోజుకి 1 సారి 
41 రోజులు పఠించవలెను. 
శక్తి  కొలది అరటిపళ్ళు నివేదన చేయవలెను.🌺

🌺శ్రీరామ జయరామ జయ జయరామ.🌺

జయ- విజయులు* 🌸🌷🌸🌷🌸🌷🌸🌷🌸వైకుంఠంలో శ్రీమహావిష్ణువు నివసించే ధామం వద్ద కాపలాగా ఉండే ఇద్దరు ద్వారపాలకుల పేర్లు జయుడు, విజయుడు.ఆ ఇద్దరూ పరమ విష్ణుభక్తులు. నిరంతరం శ్రీమహావిష్ణువు సన్నిధిలో ఉంటూ ఆయనను పూజిస్తూ తరిస్తూ ఉండేవారు.

*జయ-  విజయులు* 

🌸🌷🌸🌷🌸🌷🌸🌷🌸

వైకుంఠంలో శ్రీమహావిష్ణువు నివసించే ధామం వద్ద కాపలాగా ఉండే ఇద్దరు ద్వారపాలకుల పేర్లు జయుడు, విజయుడు.

ఆ ఇద్దరూ పరమ విష్ణుభక్తులు. నిరంతరం శ్రీమహావిష్ణువు సన్నిధిలో ఉంటూ ఆయనను పూజిస్తూ తరిస్తూ ఉండేవారు. 

శ్రీమహావిష్ణువు దర్శనం కోసం వచ్చేవారిని ముందుగా ఆ ఇద్దరూ విషయం అడిగి లోపలికి ప్రవేశపెట్టడం అలవాటు. .

 ఒక రోజున సనక, సనందన సనత్కుమార, సనత్సుజాతులు తదితర మహామునులు విష్ణు దర్శనం కోసం వైకుంఠానికి చేరుకున్నారు.వీరు నలుగురు అన్నదమ్ములు. వారు బ్రహ్మ మానసపుత్రులు. ఎంతో గొప్ప మహిమ గలవారు కూడా. యోగశక్తితో సమస్త లోకాలు సంచరించే మహనీయులు ఆ మునులు. పైగా ఎప్పటికీ ఆ మునులకు అయిదు సంవత్సరాల వయస్సువారిలాగే కనిపించే వరం కూడా ఉంది.

శ్రీమహావిష్ణు దర్శనం కోసం ఆరు ద్వారాలు దాటి వైకుంఠంలో ఉన్న ఏడో ద్వారం వద్దకు వచ్చేసరికి అక్కడ ఉన్న జయవిజయులు వారిని లోపలికి పోనీయకుండా అడ్డగించారు. జయవిజయులు ఆ మునుల గొప్పతనాన్ని గ్రహించలేక వారిని పసిపిల్లలుగా భావించి లోపలికి వెళ్లడానికి వీలులేదని తూలనాడారు. శ్రీహరిని దర్శించుకోవడానికి వచ్చిన సనక సనందులకు జయవిజయుల ప్రవర్తన బాగా కోపాన్ని తెప్పించింది. వెంటనే వారు జయవిజయులను పాపాలకు నిలయమైన భూలోకంలో పుట్టమని శపించారు. తమను అడ్డగించినందుకు అదే శిక్ష అని అన్నారు. ఆ మునుల శాప వచనాలు విని జయవిజయులు గడగడలాడారు. తాము చేసిన అపచారాన్ని మన్నించమని, శ్రీమహావిష్ణువును చూడకుండా ఎప్పుడూ ఉండలేమని, శాపవిమోచనం ప్రసాదించమని ప్రార్థించారు. సనక, సనందుల, జయవిజయుల సంభాషణలు లోపల లక్ష్మీదేవితో ఏకాంతంగా ఉన్న శ్రీమహావిష్ణువుకు వినిపించాయి. వెంటనే ఆయన బయటకు వచ్చాడు. శ్రీమహావిష్ణువును మునులు అనేక విధాలుగా స్తుతి చేశారు. విష్ణువు వారిని ఆశీర్వదించి తన సేవకులు చేసినది అపచారమేనని, ఆ అపచారానికి వారు శిక్ష అనుభవించాల్సిందేనని మునులను దేవుడు అనునయించాడు. అప్పుడు ఆ మునులు శ్రీమహావిష్ణువుకు భక్తితో నమస్కరించి వెళ్ళిపోయారు. ఆ తరువాత జయవిజయులు విష్ణువు పాదాలపై పడి తమను మునుల శాపం నుంచి రక్షించమని వేడుకున్నారు. కానీ విష్ణువు వారి శాపాన్ని అనుభవించాల్సిందేనని పలికాడు. ఆ మాటలకు విపరీతమైన దుఃఖం కలిగిన ఆ సేవకులు శ్రీమహావిష్ణువును విడిచి తాము ఉండలేమని, ఏవిధంగానైనా శాపవిమోచనం కలిగించమని మరీ మరీ వేడుకున్నారు. అప్పుడు శ్రీమహావిష్ణువు వారికి అభయాన్నిస్తూ మునుల శాపాన్ని మూడు జన్మల వరకూ అనుభవించమని, ఆ జన్మల్లో తనకు బద్ధవిరోధులైన రాక్షసులుగా వారు జన్మిస్తారని, తన చేతిలో హతమైన తరువాత మళ్ళీ వైకుంఠానికి రావచ్చని, అది ఒక్కటే తనను తొందరగా చేరటానికి మంచి మార్గమని చెప్పాడు. విష్ణువు వచనాలు ముగియగానే జయవిజయులు భూలోకంలో రాక్షసులుగా జన్మించారు.

 కృతయుగంలో హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు అనే సోదరులుగానూ, త్రేతాయుగంలో రావణ, కుంభకర్ణులుగానూ, ద్వాపరయుగంలో శిశుపాల, దంతవక్త్రులుగానూ జన్మించి విష్ణువుతో పోరాడారు. వరాహ రూపం ఎత్తి విష్ణువు హిరణ్యాక్షుడిని, నరసింహావతారం ఎత్తి హిరణ్యకశిపుడిని, రామావతారం ఎత్తి రావణ, కుంభకర్ణులను, కృష్ణావతారంలో శిశుపాల, దంతవక్త్రులను శ్రీ మహావిష్ణువు సంహరించాడు. అనంతరం జయవిజయులు మళ్ళీ వైకుంఠానికి చేరుకున్నారు.

జ‌య‌, విజ‌యుల విగ్రహాల‌ను వైష్ణ‌వ ఆల‌యాల్లో చూడ‌వ‌చ్చు. తిరుమ‌ల శ్రీ‌నివాసుని ఆల‌యంలో గ‌రుడాళ్వ‌ర్ ఎదురుగా వుంటారు.

🌸🌷🌸🌷🌸🌷🌸🌷🌸

సిరి సంపదలు* 🔸🔹🔸🔹🔸🔹🔸 ధనమూలమిదం జగత్’ అని రాజధర్మాలను బోధిస్తూ విశ్వామిత్రుడు రాముడితో పలికినట్టు ధనం చుట్టూనే లోకం భ్రమిస్తోంది. అయినప్పటికీ “ధర్మబద్ధంగా సంపాదించిన ధనమే సంపదయని, సంసార పోషణార్థమే ఆర్జించాలన్న” వేదవాక్కును శిరసావహిస్తూనే ధనార్జన చేయాలి.

*సిరి సంపదలు* 

🔸🔹🔸🔹🔸🔹🔸
 

 ధనమూలమిదం జగత్’ అని  రాజధర్మాలను  బోధిస్తూ  విశ్వామిత్రుడు రాముడితో పలికినట్టు ధనం చుట్టూనే  లోకం భ్రమిస్తోంది. అయినప్పటికీ  “ధర్మబద్ధంగా సంపాదించిన ధనమే సంపదయని, సంసార పోషణార్థమే ఆర్జించాలన్న” వేదవాక్కును శిరసావహిస్తూనే  ధనార్జన చేయాలి.

 “ మాయకు గురిచేసి మోహాల వెంట పరిగెత్తించే సిరిసంపదలను  సద్వినియోగం చేయాలని’ రామాయణం బోధించగా, అందుకు విరుద్ధంగా   భోగలాలసుడై పరస్త్రీని కాంక్షించి నాశనమయ్యాడు రావణుడు. ధర్మానికి ప్రతిరూపమైన  రాముణ్ణి  ఆశ్రయించి స్వర్ణలంకకు రాజయ్యాడు విభీషణుడు.    

 సిరి సంపదలను, శరీర భాగాలను తృణప్రాయంగా భావించి దానమిచ్చిన పురాణ పురుషులున్నారు.  మూడడుగుల నేల కోరిన వామనుడు సామాన్యుడు కాదని తెలిసినప్పటికీ  దానమిచ్చిన బలి చక్రవర్తి కథను భాగవతం, కపట బ్రాహ్మణుడని తెలిసినా కవచ కుండలాలను దానమిచ్చిన కర్ణుడి కథను భారతం వివరించి ఆదర్శ జీవన విధానాన్ని బోధించాయి.

 “ఎంత వగచినా మరణించిన వారిని దక్కించుకోలేనట్టే, ఎంత  రోదించినా  పోయిన సంపదను నిలుపుకోలేమని” భీష్ముడు ధర్మరాజుకి  ఉపదేశించినట్టు  ఆశామోహాలు తొలగించుకుని యోగ జీవితం గడిపిన వారున్నారు. భార్యాబిడ్డలు, రాజభోగాలను త్యజించిన శుద్దోధనుడు వైరాగ్యంతో గౌతమ బుద్ధుడై,  ఆధ్యాత్మిక సంపదను లోకానికి అందించి జన హృదయాల్లో కొలువయ్యాడు.

 సంపద ప్రారంభంలో సుఖాన్ని, మధ్యలో భయాన్ని, చివర్లో పశ్చాత్తాపాన్ని’ కలిగిస్తుందని చాటే సంఘటనలు చరిత్రలో జరిగాయి. వజ్రవైడూర్యాలను  తన అంతిమ యాత్రలో దారి పొడుగునా జల్లమని  విశ్వవిజేత  అలెగ్జాoడర్ ఆదేశించడం, యుద్ధ కాంక్షతో రక్తాన్ని ఏరుల్లా పారించిన అశోకుడు శాంతి సందేశాలు వినిపించడం వారి  మనోపరివర్తనకు,  పశ్చాత్తాపానికి నిదర్శనాలు.

  ధనం పుట్టింది భోగాల కోసం కాదని,  ఇతరులకు సహాయం చేస్తూ  ఆనందించడానికని’ శంకరాచార్యులు బోధించిన సత్యాన్ని గ్రహిస్తే కొందరికి  మాత్రమే పరిమితమైన సంపద అనేకులకు దక్కి  అసమానతలు తొలగుతాయి.

  ​ “దుర్వినియోగమైన ద్రవ్యం ఉపద్రవాలను కొని తెచ్చినట్టే, సద్వినియోగమైన ధనం దివ్యమైన ఉపకరణంగా మారుతుందన్న”గురువుల  బోధనలు సమాజానికి దారి దీపాలు. యోగ్యమైన పద్ధతిలో ధనాన్ని వ్యయం చేయమనే  కర్తవ్యాన్ని గుర్తు చేస్తాయి. 

 “ఇతరుల బాధలను గమనించకుండా స్వార్థబుద్ధితో సంపాదించేవారు దోషులేనని”  భగవద్గీత, “మనిషిలో లాలస, దురాశకు మూలకారణమైన  సంపదలను అవసరానికి మించి కూడబెట్టరాదని”  భర్తృహరి సుభాషితం తెలుపడంతో ఔచిత్యాన్ని గ్రహించి ఆచరించాలి మానవులు.

 సంతోషాన్నిచ్చేది సంపద లేక వైభవం కాదనియు,   ప్రశాంతమైన మనసు, వృత్తి మాత్రమేననియు,  సంపద వివేకికి బానిస, మూర్ఖునికి యజమాని అవుతుందనియు’ పెద్దలు చెప్పిన సత్యాన్ని  గ్రహించి, సంపదలను దానధర్మాలకు, పరోపకారానికి వెచ్చిస్తూ మానవ జన్మకు సార్ధకత కల్పించాలి.


జై శ్రీమన్నారాయణ 🙏

🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸

*ఓం నమః శివాయ*:*🧘‍♂️గాయత్రి మంత్రం అంతరార్ధం - ఓంకారం 🧘‍♀️*🕉🌞🌏🌙🌟🚩🔥ఓంశ్రీమాత్రే నమః🔥అద్వైతచైతన్యజాగృతి🕉🌞🌏🌙🌟🚩*ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యంభర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్!!*

*ఓం నమః శివాయ*:
*🧘‍♂️గాయత్రి మంత్రం అంతరార్ధం - ఓంకారం 🧘‍♀️*
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
🕉🌞🌏🌙🌟🚩

*ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యంభర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్!!*


*‘న గాయత్ర్యాః పరం మంత్రం నమాతు: పరదైవతం’ అన్నది జగత్ప్రసిద్ధమయిన వృద్ధవచనం.*


*గాయత్రిని మించిన మంత్రం లేదు. తల్లిని మించిన దైవం లేదు. శ్రీ ఆదిశంకరాచార్యులు తమ భాష్యములో ఈ మంత్ర ప్రాశస్త్యాన్ని వివరిస్తూ ‘గయాన్ త్రాయతే ఇతి గాయత్రీ’ అని పేర్కొన్నారు. ‘గయలు’ అంటే ప్రాణములు అని అర్ధం. అలాగే ‘త్రాయతే’ అంటే కాపాడడమని భావం. కాబట్టి ప్రాణాలను రక్షించే మంత్రం గాయత్రి మంత్రమని శ్రీ శంకర భాష్యం.*


*ఈ మంత్ర శక్తిని గుర్తించిన వాడు కనుకనే వాల్మీకి మహర్షి తన రామాయణ రచనలో గాయత్రి మంత్రంలోని బీజాక్షరాలను చక్కగా ఉపయోగించుకోవడం జరిగిందన్నది పండిత ప్రకర్షుల ఉవాచ. రామాయణంలోని ప్రతి వేయి శ్లోకాలకు ఆరంభంలోనే ఒక్కొక్క గాయత్రి మంత్రాక్షరాన్ని చేర్చి ఇరవై నాలుగు అక్షరాలతో మొత్తం ఇరవై నాలుగువేల శ్లోకాలతో రామాయణాన్ని పూర్తిచేశారని ప్రతీతి.*


*గాయత్రి మంత్రంలోని ప్రతి అక్షరం ఒక బీజాక్షరం మాత్రమే  కాక మహా మహిమాన్వితమైనది అన్నది మన పూర్వీకుల నమ్మకం. ఈ మంత్రంలోని ప్రతి పదానికి ఒక అర్ధం వుంది. ఒక పరమార్ధం వుంది. దీన్ని జపించడం ద్వారా సమస్త దేవతలను స్తుతించినట్టు కాగలదని పెద్దల భావన.*


*గాయత్రి మంత్రాన్ని శాస్త్రీయ కోణంలో నుంచి పరిశీలించినా అందులో ఎన్నో అంశాలు ఆశ్చర్యం కలిగిస్తాయి.సాంప్రదాయిక అనుసరణలలో ఈ మంత్రంలో దాగున్న శాస్త్రీయ ప్రాధాన్యత కొంత మరుగున పడిపోయిందనే అనుకోవాలి. ఆధునిక ఖగోళ శాస్త్రం చెబుతున్న దాని ప్రకారం మన నక్షత్ర మండలాన్ని పాలపుంత లేక ఆకాశ గంగ అంటారు.*


*ఈ పాలపుంతలో మన భూమండలం కంటే లక్షల రెట్లు పెద్దవయిన లక్షల నక్షత్రాలు వున్నాయి. ఈ నక్షత్రాలన్నీ మనకు నిత్యం కనబడే సూర్యుడి లాంటివే. మళ్ళీ ఇందులో ఒక్కో నక్షత్రానికి మళ్ళీ ఒక్కో సౌరమండలం వుంది. చంద్రుడు భూమిచుట్టూ తిరుగుతుంటే, ఆ చంద్రుడితో పాటు భూమి సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూ వుంటుంది.*


*ఈ విధంగానే నక్షత్ర మండలంలోవున్న లక్షలాది గ్రహాలన్నీ తమ నిర్దేశిత కక్ష్యలో గతితప్పక పరిభ్రమిస్తుంటాయి.మనకు నిత్యం గోచరమయ్యే సూర్యుడు తన సౌర కుటుంబంలోని ఇతర గ్రహాలతో కలసి పాలపుంతల కేంద్ర స్తానాన్ని ఒక్కసారి చుట్టి రావాలంటే ఇరవై రెండు కోట్ల యాభై లక్షల సంవత్సరాల కాలం పడుతుంది.*


*ఈ అనంత విశ్వంలో ఈ పాల పుంతలు పరిభ్రమిస్తున్న వేగం గమనిస్తే కళ్ళు తిరగక మానవు. సెకనుకు ఇరవై వేల మైళ్ల వేగంతో అవి కదులుతున్నాయంటే ఓ పట్టాన నమ్మడం కష్టం. ఈ నేపధ్యాన్ని దృష్టిలో వుంచుకుని గాయత్రీ మంత్రాన్ని శాస్త్రీయ కోణం నుంచి పరిశీలిద్దాం.*


*ఓం భూర్భు వస్వః - భూర్ అంటే భూమి, భువః – అంటే గ్రహాలు (సౌర కుటుంబం) స్వః - అంటే అసంఖ్యాక నక్షత్రాలతో కూడిన పాలపుంత (గెలాక్సీ).*


*ఇక్కడ ఓ చిన్న వివరణ – మనం ఇళ్ళల్లో వాడుకునే సీలింగ్ ఫాన్ రెక్కలు నిమిషానికి తొమ్మిదివందల సార్లు తిరుగుతాయి. ఆ వేగానికే అది చేసే చప్పుడు ఎలా వుంటుందో అందరికీ అనుభవైకవేద్యమే.*


*అలాటిది, ఈ అనంత విశ్వంలో అంతులేని సంఖ్యలో గెలాక్సీలు సెకనుకు ఇరవై వేల మైళ్ల వేగంతో పరిభ్రమిస్తున్నప్పుడు ఉద్భవించే శబ్దం ఏవిధంగా ఉంటుందన్నది ఊహాతీతం.*


 *గాయత్రి మంత్రంలో చెప్పిన - ఓం భూర్భుస్వః – అనే ఈ బీజాక్షరాలు – ఈ చరాచర విశ్వంలోని గ్రహరాసులన్నీ కలసి తమ పరిభ్రమణ సమయంలో సృష్టిస్తున్న మొత్తం ధ్వని ఓంకారాన్ని పోలి ఉన్నదన్న వాస్తవాన్ని తెలియచేస్తున్నాయి.*


*సృష్టికి ప్రతి సృష్టి చేయ సంకల్పించిన విశ్వామిత్ర మహర్షి తపో దీక్షలో వున్నప్పుడు ఈ ధ్వనిని విని తన తోటి మునులకు దానిని గురించి తెలియచేసాడని ఐతిహ్యం. అప్పుడు వారందరూ కలసి ఈ ధ్వనికి ‘ఓం’ అని నామకరణం చేశారు. త్రికాలాల్లో వినవచ్చే శబ్దం కనుక భగవంతుడి పేరు మీద ఆ ధ్వనికి ఓం అని పేరు పెట్టారు.*


*కాబట్టి నిరాకారుడు, నిర్గుణుడు అయిన ఆ పరమేశ్వరుడుకి ఒక నిర్దిష్ట నామం ప్రసాదించడం అన్నది మొదటిసారి జరిగిందని విశ్వాసుల విశ్వాసం. అప్పటిదాకా భగవంతుడికి ఒక రూపం అంటూ ఏమీ లేదని అందరు నమ్ముతూ వచ్చారు. అందుకే ఈ కొత్త వాస్తవాన్ని ఒక పట్టాన నమ్మడానికి ఎవరూ ముందుకు రాలేదు.*


*గీతాకారుడు కూడా అదే చెప్పాడు. “ ఓం ఏకాక్షరం బ్రహ్మ” అంటే ఈ అనంత కోటి బ్రహ్మాండ నాయకుడి ఏకాక్షర నామమే ఓం.*


 *అందుకే, ఋషులు ఈ శబ్దానికి ఉద్గితి అని కూడా పేరు పెట్టారు. అంటే స్వర్గం నుంచి వెలువడే సంగీత ఝరి అన్నమాట. ఋషులు మరో విషయం కూడా కనుక్కున్నారు.*


*అదేమిటంటే అనంత విశ్వంలో సెకనుకు ఇరవై వేలమైళ్ళ వేగంతో పరిభ్రమిస్తున్న గెలాక్సీలన్నీ కలిపి ½ MV2 కైనెటిక్ ఎనర్జీ ని ఉత్పత్తి చేస్తున్నాయి. అంటే తద్వారా చరాచర విశ్వంలోని గ్రహరాసులన్నీ కలిపి వినియోగిస్తున్న ఎనర్జీ ఏదో ఒక మేరకు సమతుల్యం కావడానికి ఇది దోహద పడుతోంది.*

*దీన్నే గాయత్రిలో ప్రణవంగా పేర్కొన్నారు. అంటే గెలాక్సీలన్నీ కలసి ఉత్పత్తి చేసే ఎనర్జీకి స్టోర్ హౌస్ వంటిదన్నమాట. తత్స వితుర్వరేణ్యం తత్ అంటే ఆ (భగవంతుడు) సవితుర్ అంటే సూర్యుడు (నక్షత్రం) వరేణ్యం అంటే వందనానికి, గౌరవానికి అర్హత కలిగివుండడం. ఒక వ్యక్తి రూపం, పేరుతో సహా తెలిసినప్పుడు ఆ వ్యక్తిని చూడగానే పలానా అని అవగతమవుతుంది.*


*రూపం, నామం రెండూ తెలియడం మూలాన నిరాకారుడయిన ఆ దేవదేవుడిని గుర్తించడానికి సరయిన పునాది దొరుకుతుందని విశ్వామిత్ర మహర్షి వాక్రుచ్చాడు. ధ్వని ద్వారా (ఓంకార నాదం) కాంతి ద్వారా (సూర్యుడు, నక్షత్రాలు) మనకు తెలియని, మనకు కనబడని నిరాకారుడయిన భగవంతుడిని అర్ధం చేసుకోవచ్చు అని విశ్వామిత్ర మహర్షి చెప్పాడు.*


*ఇది ఎలా అంటే- ఒక గణిత శాస్త్రజ్ఞుడు x2+Y2=4; if x=2 అనే కఠినమైన లెక్కకు ఇట్టే జవాబు చెప్పగలుగుతాడు.*


*అలాగే, ఒక ఇంజినీరు నది ఒడ్డున నిలబడి తన వద్ద వున్న ఉపకరణాల సాయంతో ఆ నది వెడల్పును అంచనా వేయగలుగుతాడు. వారి వారి రంగాలలో వారికున్న నైపుణ్యాన్ని బట్టి సాధ్యం అది అని ఎవరయినా ఒప్పుకుంటారు. విశ్వామిత్రుడు మనకు చెప్పింది ఇదే.*


*గాయత్రి మంత్రం లోని తరువాత భాగాన్ని ఇలా అర్ధం చేసుకోవచ్చును. భర్గో దేవస్య ధీమహి భర్గో అంటే కాంతి; దేవస్య అంటే దేవత; ధీమహి అంటే ఉపాసించడం.*


*అందుబాటులో వున్న రూపంలో (సూర్య కాంతి) నిరాకారుడయిన భగవంతుడుడిని కనుగొనవలసిందని విశ్వామిత్రుడు మానవాళికి బోధించాడు.*


*ఓంకారాన్ని జపిస్తూ దేవుడిని పూజించాలని కూడా ఆయన చెప్పారు. ఆయన చేసిన బోధ వినడానికి బాగానే వుంది. కానీ ఎల్లప్పుడు చంచలంగా వుండే మనసుకు ఇది సాధ్యపడే పనేనా. అందుకే భగవంతుడిని ధ్యానించే విధానం కూడా గాయత్రి మంత్రంలో వుందని ఆ మహర్షి వారు తెలియచేసాడు.*


*ధియోయోనః ప్రచోదయాత్!! ధియో (మేధావి), యో (ఎవరయితే),నః (మనమంతా), ప్రచోదయాత్ ( సరయిన తోవలో నడిపించే మార్గదర్శి) ఓ భగవంతుడా! సరైన మార్గంలో నడిచే విధముగా మా మేధస్సు మాకు ఉపయోగపడేలా చేయుము.*


*ఈ నేపధ్యంలో గాయత్రి మంత్రాన్ని శాస్త్రీయ దృక్పధంలో చూసినట్టయితే అందులోని భావం ఇలా వుంటుంది. భూమి (భుర్) గ్రహాలు (భువః) గెలాక్సీలు (స్వాః) అపరిమితమైన వేగంతో సంచరిస్తున్నాయి.*


*అవి ఆ క్రమంలో కనీ వినీ ఎరుగని ధ్వనికి కారణమవు తున్నాయి. నిరాకారుడైన భగవంతుడుకి మరో రూపమే ఆ ధ్వని. దాని పేరే ఓం. ఆ (తత్) భగవంతుడే లక్షల కోట్ల సూర్యుల కాంతి (సవితుర్) రూపంలో తిరిగి ప్రభవిస్తున్నాడు. అలాటి దేవదేవుడు మన ఆరాధనకు (వరేణ్యం)అర్హుడు.*


*కాబట్టి, మనమందరం ఆ దేవతా రూపమైన (దేవస్య) కాంతి (భర్గో) ని ధ్యానించాలి. అదే సమయంలో ఓంకారనాదంతో కూడిన భజనలు చేయాలి. (యో) అట్టి భగవానుడు మనం సరైన మార్గంలో (ప్రచోదయాత్) నడవగలిగే విధంగా మన (నః) మేధస్సు (ధియో) ఉపయోగ పడేలా చేయాలి.*


*ఆనో భద్ర క్రతవో యన్తు విశ్వతః!! –ఋగ్వేదము (అన్ని దిక్కుల నుంచి మంచి ఆలోచనలు నాలోకి ప్రవేశించు గాక).*

🕉️🌞🌏🌙🌟🚩

_*కొడుకులు బిడ్డలు బాకీ సంబంధం తో పుడతారు.*_ఒక గురువు చెట్టు క్రింద కూర్చొనీ...భక్తి గురించి దేవుని గురించి...జన్మ రాహిత్యం గురించి చెబు తున్నాడు. అటుగా వెళుతున్న బాటసారి గురువు చెబుతున్నది.వినీ దగ్గరకు వెళ్లి తనకు మంత్రోప దేశం ఇవ్వమని అడిగాడు.

_*కొడుకులు బిడ్డలు బాకీ సంబంధం తో పుడతారు.*_

ఒక గురువు చెట్టు క్రింద కూర్చొనీ...

భక్తి గురించి దేవుని గురించి...

జన్మ రాహిత్యం గురించి చెబు తున్నాడు. 

అటుగా వెళుతున్న బాటసారి గురువు చెబుతున్నది.

వినీ దగ్గరకు వెళ్లి తనకు మంత్రోప దేశం ఇవ్వమని అడిగాడు. 

గురువు అప్పుడు అడిగాడు, 

నీకు భార్య బిడ్డలు ఉన్నారా...అని. 
తన బార్య గర్భవతి అని చెప్పాడు. 

గురువు ఇలా అన్నాడు గురు దక్షిణగా నువ్వు నాకే మిస్తావు?

అని అడిగాడు. గురువు. 

మీరు ఏది అడిగితే అదే ఇస్తాను. అన్నాడు. 

సరే...నీ భార్యను అడిగి రా...
తనకు పుట్టిన బిడ్డలను నాకు ఇవ్వ గలదా? 

అలా చేస్తే నీకు మంత్రోప దేశం చేస్తాను. 
వెళ్లి నీ భార్యను అడిగి రా, 

పిల్ల పుట్టిన వెంటనే రక్తం మడుగులో ఉండ గానే నాకు ఇచ్చేయాలి. 
అన్నాడు గురువు. 

అతను వెంటనే ఇంటికి పరుగెత్తి భార్యకు విషయం చెప్పి మన పిల్లలను గురువుకు ఇవ్వ గలవా ? 

అని అడిగాడు. 

అందుకు ఆమె అలాగే ఇచ్చేద్దాం.
మన పిల్లలు గురువు వద్ద ఉంటే మంచిదే కదా, 
అంటూ ఒప్పు కుంది.

ఆ విషయాన్ని గురువుకు చెప్పాడు. కొద్ది రోజులకీ ఆమె ప్రస వించింది. 
మగ పిల్లవాడు పుట్టాడు. 

ఆ పిల్లవాడిని నెత్తుటి మడుగులో ఉండ గానే తీసుకెళ్లి గురువు చేతిలో పెట్టారు.
భార్య భర్తలు. 

గురువు ఆ పిల్ల వాడిని తీసు కెళ్లి గొయ్యి తీసి అందులో పూడ్చేసాడు. 

తల్లి దండ్రులు బిత్తర పోయి చూస్తు, 
చేసేది. 

ఏమి లేక వెను తిరిగి వెళ్లి పోయారు. 

ఈ విదంగా రెండో పిల్ల వాడిని కూడ గొయ్యి లో పూడ్చి పెట్టేసాడు. 

మూడో సారికీ ఆవిడ ఒప్పు కోలేదు. 

ఇదేం గురువయ్యా ? 

నాకు నచ్చలేదు.
నా కొడుకును ఇవ్వను. 
కాక ఇవ్వను.
అనీ మొండి కేసింది. 

అతను గురువు వద్దకు వెళ్లి విషయం చెప్పాడు. 

గురువు గారే ఆమె దగ్గరకు వెళ్లి ఇలా... అన్నాడు. 

అమ్మ నీ బిడ్డను ఇవ్వ నన్నావు కదా, 

ఇప్పుడు నీ బిడ్డను నే,నేమి చేయను.

కాని ఒక్క సారి బిడ్డను...
నా చేతి కిచ్చి 
నా వెంట రండి.
మీ బిడ్డను నే,నేమి చేయను.

మళ్లి మీ బిడ్డను 
మీకు ఇచ్చేస్తాను.
అని అన్నాడు. 

సరే ననీ బిడ్డను తీసు కొనీ గురువు వెంట బయలు దేరారు వారిరువురు.ను..

గురువు వీళ్లిద్దరినీ ఇంతకు ముందు గొయ్యి తీసి పెట్టిన చోటికి  తీసుకు కెళ్లాడు. 

ఆ రెండు గొయ్యిల మద్యన తెల్లని గుడ్డ పరిచి...
ఈ పిల్ల వాడిని వాటి మద్యలో పడుకో బెట్టి చేతి లోకి నీళ్ళు తీసుకొనీ మంత్రించి...
ఆ ముగ్గురు పిల్లల మీద చల్లాడు. 

తల్లీ దండ్రులను కొంచెం దూరంలో నిలబెట్టి...
ఆ గొయ్యిలో నుండి వస్తున్న శబ్దాలను విన మన్నాడు. 

గొయ్యి లో నుండి మొదటి పిల్లవాడు రెండవ వాడిని అడుగు తున్నాడు. 

ఒరేయ్ వీళ్ళకు కొడుకుగ పుట్టావు. కదా దేని కోసం పుట్టావు. 

వీళ్ళకి నీకు ఏమిటి సంబంధం అని అడిగాడు. 

రెండో వాడు ఇలా చెబుతున్నాడు. 

గత జన్మలో వీడు బాకి పడ్డాడు.
నాకు డబ్బులు ఇవ్వ కుండానే పోయాడు. 

అందుకనీ వీడికి కొడుకునై పుట్టి అంది నంత లాగేసు కుందామని వచ్చాను. 

మరీ నువ్వేందు కొచ్చావు. 
అని అడిగాడు. 

వీడు నాకు కూడా ఇవ్వాలిరా...
నేను కూడా అందుకే వచ్చాను.
వీడికి కొడుకునై పుట్టి దొరికి నంత దోచు కొని వదిలేసి వెళ దామని వచ్చాను .

కానీ వీడు మనల్ని గురువు చేతి లో పడ వేసాడు. 
ఇంకే ముంది? 
వాడు.
మనకు పడిన బాకీలన్నీ గురువు తెగ్గొట్టేసాడు. 

ఇప్పుడు వాడికి మనకి రుణ బంధం తెగిపోయింది.
అని వాళ్ళు మాట్లాడు కుంటున్నారు. 

ఈ ఇద్దరూ కలిసి బ్రతికి ఉన్న మూడో వాడిని అడిగారు. 

ఒరేయ్ నువ్వెందు కొచ్చావురా అని? 

అప్పుడు బ్రతికి ఉన్న మూడోవాడు ఇలా చెప్పాడు, 

గతజన్మలో నాకు కొడుకులు బిడ్డలు ఉండికూడ దిక్కు లేకుండా పడిఉంటే వీడు నన్ను చేరదీసి అన్నం పెట్టీ ఆద రించాడు. 

నేను పోయే వరకు నన్ను పోషించాడు. 

అందుకే...
ఈ జన్మ లో వీనికి కొడుకునై పుట్టి తల్లి తండ్రు లిద్దరినీ వాళ్ళు బ్రతికి నంత కాలం అన్నం పెట్టి వాళ్లను సంతోషంగా ఉంచి ప్రశాంత మైన జీవితాన్ని వాళ్ళకు ఇచ్చి వారి రుణం తీర్చు కుందామని వారికి కొడుకునై పుట్టాను. 

మీరు ఆయన్ని పీడించాలని వచ్చారు. 

గనుక గురువు మిమ్మల్ని గొయ్యి లో పాతిపెట్టాడు. 

నేను అలా కాదు గనుక నేను బ్రతికి ఉన్నాను. 
అని చెప్పాడు. 

ఈ ముగ్గురు మాట్లాడు కున్న మాటలు ఈ తల్లి తండ్రులు విన్నారు. 

గురువు పాదాల మీద పడి క్షమించమని వేడు కున్నారు...

కాబట్టీ ...
గురువు లేని పూజ గుడ్డి పూజ అని అర్దం. 

_ఆత్మ జ్ఞానము తెలిసిన గురువును పట్టు కుంటే రుణాను బంధాలే కాదు,= 
_జన్మ రాహిత్యమే జరుగు తుంది._

_ఈ జన్మ లోనే మోక్షం లభిస్తుంది..._

_మోక్ష మంటే చని పోయిన తర్వాత మోక్షం వస్తుందనీ చాలా మంది అను కుంటారు._

_కాని అది కాదు._

_మోక్షం అంటే బ్రతి కుండగానే ఆత్మ జ్జానాన్ని పొందటం..._

_దైవం ఏ,ఏ,రూపాలలో ఉన్నాడు._ 

_ఎక్కడ ఉన్నాడు._ 

_ఏం చేస్తున్నాడు._

_ఈ సృష్టి ఏమిటి._ 

_ఎలా తయారైంది. నే,నె'వరిని._ 

_ఎక్కడ నుండి వచ్చాను._ 

_మళ్లి ఎక్కడికి వెళతాను._ 

_అసలు మాయ అంటే ఏమిటి???_ 

_ఇలా ఎన్నో సృష్టి రహస్యలు బ్రతి కుండ గానే తెలిసి పోతాయి.


_ఇదే మోక్షం మరు జన్మకి రాకుండా భగవంతుడు._

_తన రూపాన్ని ఇచ్చి తానుగా మార్చు కుంటాడు._

_ఈ ఆత్మ జ్ఞానం కలగ డానికి ధ్యానం అనే ఆత్మ విద్యను మనకి బోధిస్తారు._

ఇది కథ ఐనా:- వాస్తవం ☝ గురువుద్వారానే కర్మ పరిష్కారం కలుగుతుంది👍

సనాతన ధర్మం వర్ధిల్లాలి 🌸🙏🏻🌺🌹
కృష్ణం వందేజగద్గురుం 🌺🙏🏻🌸🙇🏼🌹

Wednesday, July 14, 2021

నాన్న ఎవరు??⚜️**బ్రహ్మదేవుడు చాలా బిజీగా తల రాతలు రాసే పనిలో ఉన్నాడు. ఇంతలో నేను, భూమి మీదకు వెళ్ళను అని మారాం చేయడం మొదలుపెట్టాను.*

*⚜️నాన్న ఎవరు??⚜️*

*బ్రహ్మదేవుడు చాలా బిజీగా తల రాతలు రాసే పనిలో ఉన్నాడు. ఇంతలో నేను, భూమి మీదకు వెళ్ళను అని మారాం చేయడం మొదలుపెట్టాను.*

*“భూమి మీద నాకు ఎవ్వరూ తెలీదు. నేను ఎలా బతకగలను? అని అడిగాను. నువ్వేం భయపడకు. నిన్ను కాచి కాపాడటానికి నా అంశగా ఒక అమ్మను తయారుచేశాను. ఆమె కడుపులో నిన్ను పుట్టిస్తా” అన్నాడు బ్రహ్మదేవుడు.*

*“అయితే సరే, కానీ నాకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా నేను ఏడవటం మొదలుపెడతా. అప్పుడు మీరు నా ఇబ్బందిని తొలగించాలి” అనే షరతు పెట్టాను.*

*దానికి బ్రహ్మా, “సరే నీకు మాటలు రానంత వరకు బ్రహ్మా విష్ణు మహేశ్వరులం ముగ్గురు నీకు సహాయం చేస్తాం” అన్నాడు.*

*“మరి, ఆ తర్వాత చెయ్యరా?” అని అడిగా.*

*“అదేం లేదులే. నీకు మాటలోచ్చాకా నీకో మహా మంత్రం భోదిస్తాం. నీకు ఏ కష్టం వచ్చినా, ఒక్కసారి ఆ మంత్రం పఠిస్తే తప్పకుండా నీకు సహాయం దొరుకుతుంది.” అని చెప్పాడు బ్రహ్మా.*

*మళ్ళీ ఇంకేదో అడగబోయే లోపల ఆ పరబ్రహ్మ, తన బెడ్రూం బాల్కనీ లోంచి నన్ను కిందకి త్రోసేశాడు. ఎలా వచ్చి చేరానో తెలియదు గానీ, ఆసుపత్రి బెడ్ మీద మా అమ్మ పక్కన వచ్చిపడ్డాను.*

*అమ్మ పక్కన హాయిగా నిద్రపోతున్న నన్ను, ఓ పెద్దమనిషి తన చేతిలోకి తీసుకున్నాడు. భయమేసి, అమ్మ వైపు చూసి ఏడుపు ముఖం పెట్టాను. “మీ నాన్నగారు రా!” అంటూ అమ్మ తన కంటి చూపు తో ఆయన్ని పరిచయం చేసింది.*

*బ్రహ్మాదేవుడు నాకు అమ్మ గురించి చెప్పి పంపాడు. తను అన్ని చోట్ల ఉండటం కుదరక అమ్మని సృష్టించాను అని. మరి నాన్న అంటే ఎవరు? భూమి మీద పడిన మొదటి రోజే నా బుర్రలో ఎన్నో ఆలోచనలు మొదలయ్యాయి.ఆ దేవుడినే అడిగి తెలుసుకుందామని ఏడుపు మొదలుపెట్టా.*

*“ఇప్పుడే కదా భూమి మీద పడ్డావు. అప్పుడే నన్ను గుర్తుచేసుకున్నావేమిటి?” అని అడిగాడు. అమ్మ గురించి చెప్పారు గాని, నాన్న గురించి ఏమీ చెప్పలేదెంటని అడిగా.*

*“నీ జన్మకి నాంది, నీ భవితకు పునాది” అని ముక్తసరిగా బదులిచ్చి, “అర్ధమైందా?” అని ప్రశ్నించాడు.*

*“పాలు తాగే పసివాడి ప్రశ్నకి ప్రాస తో బదులిస్తే ఎలా అర్ధం అవుతుంది స్వామి” అని సమాధానం చెప్పాను.*

*ఒక అర్ధం లేని చిరునవ్వు నవ్వి, “నీకూ మీ అమ్మకు కాపుగా నేను నియమించిన అంగరక్షకుడు” అని క్లుప్తంగా చెప్పాడు. అప్పుడు అర్ధమైంది నా బుజ్జి బుర్రకి, నా కష్టం తీర్చేది అమ్మ అని. మాకు ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాన్నదని.*


*ఆ రోజు నుంచి నా చిన్ని కళ్ళు నాన్న కోసం వెతుకుతూనే ఉండేవి. ఎప్పుడో ఉదయన్నే వెళ్ళిపోయి సాయంత్రం వచ్చేవాడు. “ఏం, నేనంటే ప్రేమ లేదా” అని ప్రశ్నించా ఆ దేవుడిని మళ్ళీ. “నీ మీద ప్రేమ ఉంది కాబట్టే, రోజు బయటికి వెళ్ళి కష్టపడి పని చేసి వస్తున్నాడు” అని బదులిచ్చాడు బ్రహ్మా. అర్ధం కాలేదని చెప్పాను. కొన్నేళ్లకు నీకే అర్ధం అవుతుందిలే అన్నాడు.*

*ఈయన అన్నీ తల తిక్క సమాధానాలే చెబుతాడులే అనుకుని, నా దగ్గరికి వచ్చిన మా నాన్న మొహం చూసా. మా నాన్న ముఖం నీరసంగా కనిపించింది. పలకరింపు కోసం ఒక చిరునవ్వు నవ్వా. మా నాన్న ముఖం లోని నీరసం మాయమైంది. నన్ను చూసిన ఆయన ముఖం పున్నమి చంద్రుడిలా మెరిసిపోసాగింది. ఆ దేవ దేవుడు నా నవ్వులో ఇంత మహిమ దాచాడా! అని గర్వపడటం మొదలుపెట్టా.*

 *మళ్ళీ మళ్ళీ నవ్వడం నేర్చుకున్నా. నేను నవ్విన ప్రతి సారి, మా నాన్న ముఖంలో ఆనందం పది రెట్లు ఎక్కువగా కనిపించేది. మా నాన్న నన్ను ముద్దులతో ముంచేయటం మొదలుపెట్టారు. అలా ఆ సాయంత్రాలు మా ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచాయి.*

*కొన్నాళ్ళకి, నా చిట్టి పాదాలకి కొంచెం బలం చేకూరింది. నడక నేర్చుకుందామని ప్రయత్నించా. కానీ ఫలితం లేదు. పదే పదే పడిపోతూనే ఉన్నా. ఇంతలో నాన్న తన చూపుడు వేలును నాకు అందించాడు. నేను నడవలేకపోతున్నానని వెక్కిరిస్తున్నాడనుకున్నా! “నా వేలు పట్టుకుని నిల్చో నాన్నా” అన్నారు.*

*నిలబడగలిగాను కానీ, నా అడుగులు ఇంకా తడబడుతూనే ఉన్నాయి. ఆ మహా శివుణ్ణి, మనసులో  ప్రార్దించడం మొదలుపెట్టా. తన ఢమరుక నాదంతో నా పాదాలని ప్రేరేపించమని ప్రాధేయపడ్డాను. ఆ ఢమరుక నాదపు సడిలో, వడి వడిగా అడుగులు వేయటం నేర్చుకుని మా నాన్నను ఆశ్చర్యపరుద్దామనుకున్నా. ఆ మహా శివుడికి నా మొర వినిపించలేదేమో! నా ప్రార్థనకి జవాబు దొరకలేదు. ఇంతలో మా నాన్న వెల్లకిలా పడుకున్నారు. నన్ను తన రెండు చేతులతో పట్టుకుని తన గుండెల మీద నిలబెట్టుకున్నారు. డమరుక నాదం లేకపోతేనేం!, నా గుండే చప్పుడుని నీ అరికాళ్ళతో అనుభవించి అడుగులు వేయటం నేర్చుకోమని అభయమిచ్చారు. ఏం మాయో తెలీదు. నాన్న గుండె చప్పుడు నా కాళ్ళకి తగలగానే నేనే శివుడిలా మారిపోయా. నడక రాని నేను నాన్న గుండెల మీద యధేచ్చగా నాట్యం చేయటం మొదలుపెట్టా.*

*నడక నేర్చిన నా చిన్ని పాదాలు కొత్త గమ్యాలను వెతకటం ప్రారంభించాయి. నడవటం మొదలుపెట్టాను. కొంత దూరం వెళ్ళాక, అటూ ఇటూ చూశాను. ఎవ్వరూ కనిపించలేదు. భయం వేసింది. ఆ శ్రీ మహా విష్ణువు అన్ని చోట్ల ఉంటాడుగా, మరి నాకు భయమెందుకు. ఆయన్నే పిలుద్దాం అని మనసులో తలుచుకున్నా. ఆయన కనిపించలేదు గాని వినిపించాడు. “ఏమైంది బాలకా” అని అన్నాడు. “భయం వేసింది స్వామి. అందుకే పిలిచా” అన్నా నేను.*

*“భయం ఎందుకు? నీవు నడుస్తుంది మీ నాన్న నీడ లోనేగా” అన్నాడు. ఆశ్చర్యం వేసి వెనక్కి తిరిగి చూసా. అవును నాన్న నా వెనకే ఉన్నారు. నాకు తగినంత స్వేచ్చనిస్తూ, నా ప్రయాణాన్ని గమనిస్తూ, నన్ను ఏ ప్రమాదం తాకకుండా, నాకు రక్షణగా నా వెనకే నడుస్తున్నారు. నా మనసులో భయం తొలగి ముఖంలో చిరునవ్వు మొదలయ్యింది. అప్రయత్నంగానే నా పెదవులు ‘నాన్న’ అని పలకటం మొదలుపెట్టాయి. నాన్న నన్ను ఎత్తుకుని నా ముఖమంతా ముద్దులతో ముంచేశారు. మళ్ళీ మళ్ళీ నాన్న అని పిలవమన్నారు. నేను పిలిచిన కొద్దీ, నాన్న ముఖంలో ఆనందం రెట్టింపు అవుతూనే ఉంది.*


*నాకు ఏ అవసరం వచ్చినా, ఏడ్చి ఆ దేవుడిని పిలిచే బదులు, మా నాన్నని పిలవడమే మేలు అనిపించింది. దేవుడు వచ్చేవాడో, రాడో తెలీదు గాని మా నాన్న మాత్రం నన్ను కంటికి రెప్పలా కాపాడుతూనే ఉన్నాడు. నా అవసరాలన్నీ, నేను చెప్పక ముందే తెలుసుకుని మరీ తీర్చేవాడు. కొన్నాళ్ళకు నాన్న కూడా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. కానీ ఆయన నేర్పిన జీవిత పాఠాలు నాకు తోడుగా ఉండేవి.*

*ఆఖరికి నేను కూడా ఆ దేవుడి దగ్గరికి తిరుగు ప్రయాణం మొదలుపెట్టాను.*

*“నీ జీవిత మజిలీ ఎలా సాగింది?” అని ప్రశ్నించారు బ్రహ్మా విష్ణు మహేశ్వరులు.*

*“మీరు నాకు ఏ మంత్రమూ భోదించకపోయినప్పటికీ, నా జీవన చక్రం బాగానే సాగింది ప్రభు.” అని సమాధానం చెప్పాను గర్వంగా.*

*“అదేంటి అలా అంటావ్! మేము నీ నోట పలికించిన మంత్రాన్ని రోజు నువ్వు పఠిస్తుండటం ఉండటం మేము గమనిస్తూనే ఉన్నాం” అన్నారు మూకుమ్మడిగా.*

*“నాకు ఏం అర్ధం కావట్లేదు స్వామి” అని బదులిచ్చా నేను. బ్రహ్మా విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఒకరిలో ఒకరు ఐక్యం అవుతూ ఒకే రూపంగా మారి ప్రత్యక్ష్యమయ్యారు. ఆశ్చర్యపోయాను. మా నాన్న రూపం నా ముందు ప్రత్యక్ష్యమైంది. అప్పుడు గానీ అర్ధం కాలేదు ఈ మనిషి బుర్రకి, (మట్టి బుర్రకి). “అమ్మ ఆ దేవుడి అంశ అని” “నాన్న సాక్ష్యాత్ దేవుడని”. మిమ్మల్ని గుర్తించలేకపోయాను, నన్ను క్షమించండి స్వామి. అని ఆయన పాదాలమీద సాగిలపడ్డాను.*

*ఆ దేవుడి ముఖంలో అదే చెరగని చిరునవ్వు. నా భుజాల మీద చేయి వేసి పైకి లేపారు. ప్రేమగా హత్తుకున్నారు. నన్ను క్షమించి, నా ఆత్మకు మోక్షం ప్రసాదించండి స్వామి అని అడిగా ఆయన చెవిలో. క్షమిస్తా, కానీ ఒక్క షరతుతో అన్నాడు ఆ దేవ దేవుడు. ఏమిటది స్వామీ! అని అడిగా ఆశ్చర్యంగా. నన్ను ఆఖరుసారిగా ‘నాన్న’ అని సంభోదించగలవా అని అడిగారు ఆ సర్వేశ్వరులు. ఆ మహా మంత్రాన్ని ఇంకోసారి జపించడానికి, నిముషం కూడా ఆలస్యం చేయలేదు నేను. నాన్న అని పిలిచి ఆయనలోనే ఐక్యం అయిపోయా.*

*🙏“అమ్మ దేవుడి అంశ అయితే, నాన్న సాక్ష్యాత్ దేవుడే”🙏*
*ఈ వ్యాసం ప్రతి ఒక్క నాన్నకు అంకితం... 

నా మనస్సును కదిలించింది. నాన్న గొప్పదనాన్ని వచ్చే తరానికి,యువతకు తెలియాలి. నా బాధ్యత గా మీకు షేర్ చేస్తున్నాను. మీరు షేర్ చెయ్యండి. మంచిని  పెంచుదాం.🙏🙏

మానస సరోవరం 👏

Jai Shri Krishna

Excellent information about Bhagwan Shri Krishna: 1) Krishna was born *5252 years ago*  2) Date of *Birth* : *18th July,3228 B.C* 3) Month ...