Thursday, July 15, 2021

మనసును శుద్ధి చేసుకోవడం ఎలా...🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃భక్తో భక్తి గుణావృతే ముదమృతాపూర్ణే ప్రసన్నే మనః కుంభే సాంబ ! తవాంఘ్రి పల్లవ యుగం _ సంస్థాప్య సంవిత్ఫలం,సత్త్వం మంత్ర ముదీరయన్ నిజ శరీరాగార శుద్ధిం వహన పుణ్యాహం ప్రకటీకరోమి రుచిరం _ కల్యాణ మాపాదయన్ !!----ఆదిశంకరుల శివానందలహరి నుండి...

మనసును శుద్ధి చేసుకోవడం ఎలా...

🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃

భక్తో భక్తి గుణావృతే ముదమృతాపూర్ణే ప్రసన్నే మనః కుంభే సాంబ ! తవాంఘ్రి పల్లవ యుగం _ సంస్థాప్య సంవిత్ఫలం,సత్త్వం మంత్ర ముదీరయన్ నిజ శరీరాగార శుద్ధిం వహన పుణ్యాహం ప్రకటీకరోమి రుచిరం _ కల్యాణ మాపాదయన్ !!

----ఆదిశంకరుల శివానందలహరి నుండి...

విశేషం_ పుణ్యాహవాచనం :

ఇది యొక శుద్ధి కర్మ.  ఇది చేసేటప్పుడు కలశము పెట్టి , దానికి దారముౘుట్టి
కలశములో నీళ్ళు పోసి  మామిడి చిగుళ్ళూ, కొబ్బరికాయనూ దానిపై యుంచి
మంత్రములు ౘదువుతూ, ఆ నీటితో గృహమును శుద్ధి చేసి, మంగళాన్ని
పొందుతారు.

తాత్పర్యము :

ಓ సాంబమూర్తీ ! శివా ! నేను భక్తుడనై నా శరీరము అనే గృహాన్ని 
నిర్దుష్టంగా శుద్ధి చేసుకొని , మనస్సునకు ఇష్టమైన మంగళమును చేయడానికి
పూనుకొని, దానికొఱకై భక్తి అనే నూలుపోగులను ౘుట్టి , సంతోషము అనే
 నీటితో నింపిన నామనస్సు  అనే కలశంలో  నీ పాదములనే చిగుళ్ళనూ, 
జ్ఞానము అనే కొబ్బరి కాయను ఉంచి , కలశస్థాపనము చేసి , సత్త్వగుణ
రూపమైన తారకమంత్రాన్ని ఉచ్ఛరిస్తూ, పుణ్యాహవాచనమును నెరవేరుస్తాను.
( అన్ని వేళలా మీ పాదపద్మములను స్మరిస్తానని భావం ).

వివరణ:

సామాన్యంగా మైలగానీ,పురుడుగానీ వచ్చి , ఇల్లూ ఇంట్లోని వారూ,
అశౌచంగా వుంటే , శుద్ధి రోజున తప్పకుండా గణపతి పూజ తోపాటు 
పుణ్యాహవాచనం చేసి ఆ కలశాలలోని పవిత్ర జలాన్ని  ఇల్లంతా 
ౘల్లాలి. ఇంటిలోని వారి శిరస్సులపైనా ౘల్లాలి. అప్పుడు ఆ ఇల్లూ 
ఇంటి యజమానీ , ఇంటిలోనివారూ నిర్మలులవుతారు. అలాగే భక్తుల
హృదయాలు అరిషడ్వర్గాలతో , అసూయాద్వేషాలతో , అపవిత్ర కార్య
క్రమాలతో మలినములైనపుడు ఏ విధంగా వారు తమ దేహాలను శుద్ధి
చేసుకోవాలో  ఈ శ్లోకంలో శంకరులు చెప్పారు.

శంకరులు ఇలా చెప్పారు.   ಓ ఈశ్వరా ! నా శరీరం పాడుపడిన కొంప.
దానిని శుద్ధి చేసుకోవాలి. తరువాత కల్యాణాన్ని ౘక్కగా సంపాదింౘాలి.
 దానికై  పుణ్యాహం అనే శుద్ధి కర్మను చేసుకోవాలి. పుణ్యాహవాచన
కర్మకు కావలసిన సామగ్రిని నేను ఇలా సంపాదింౘుకుంటాను. ముందుగా
కలశ స్థాపన చెయ్యాలి,  నామనస్సే ఆ కలశం.  నామనస్సనే కలశం ప్రసన్నంగా 
స్వచ్ఛంగా వుంది.  కలశానికి దారాలు ఛుట్టాలి. నేను నాభక్తి అనే దారాలు
 ఆ కలశానికి ౘుడతాను. నా సంతోషమనే నీటితో కలశాన్ని నింపుతాను.
కలశంలో లేత మామిడి చిగుళ్ళు వేయాలి కదా ! నీ పాదపద్మాలే నాకు 
దొరికిన ఆ చిగుళ్ళు. అందుచేత నామనస్సనే కలశంలో  ఈశ్వరా ! 
నీ పాదాలనే చిగుళ్ళను వేస్తాను. ఇంక కలశంపై ఒక ఫలం ఉంౘాలి. 
నేను ఙ్ఞానం అనేే కొబ్బరికాయను కలశంపై ఉంౘుతాను. తరువాత 
మంత్రాలు ౘదవాలి.  నేను సత్త్వగుణ ప్రధానమైన తారకమంత్రాన్ని 
ౘదువుతాను. ఈ పుణ్యాహవాచనం వల్ల నా శరీరమూ, మనస్సూ,
వాక్కూ పవిత్రమవుతాయి. 
ఉజ్జయినీ మహాకాలుని పంచామృత అభిషేకం
మనం కూడా మనశరీర శుద్ధి, ఇలాగే  ఈశ్వర పాద ద్వంద్వాన్ని మన 
చిత్తంలో నిలిపి వాక్కుతో శివనామాన్ని జపింౘాలని  ఈ శ్లోకం ద్వారా
శంకరులు మనకు సూచించారని మనం గ్రహించాలి, ఆచరించాలి.


జై శ్రీమన్నారాయణ🙏

🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂

No comments:

Post a Comment

Jamalapuram Sri Venkateswara Swamy Temple జమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయం Telangana Tirupati, Khammam District

The road access to the temple is very good, and you can easily reach it in your own vehicle. Parking is not a concern as you can park comfor...