#నవవిధ భక్తి మార్గం అంటే.. ?
"భక్తిశ్చే నవలక్షణా" అంటూ ప్రహ్లాదుడు ఇలా చెప్పాడు. "శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాద సేవనమ్, అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనమ్" వీటినే నవవిధ భక్తి మార్గాలంటారు.
* మొదటిది శ్రవణం అంటే శ్రద్ధగా వినడం. భగవంతుని గుణములను, నామాలను, కథలను ఎప్పుడూ వింటూ ఉండాలి.
* రెండోది కీర్తనం. ఆయన లీలలను నామాలను గానం, ప్రవచనం చేస్తూ ఉండాలి.
* మూడోది స్మరణం. ఇందులో భగవంతుని ఎప్పుడూ స్మరిస్తూ ఉండాలి.
* నాలుగోది పాదసేవనం. నిరంతరం ఆయన పాదాలను దర్శిస్తూ ఉండాలి.
* అయిదవది అర్చనం అంటే పూజించడం.
* ఆరోది వందనమంటే నమస్కారం.
* ఏడోది దాస్యం. స్వామికి దాసునిగా, భృత్యునిగా ఉండాలి.
* ఎనిమిదవది సఖ్యం చేయడం స్నేహం చేయడం.
* తొమ్మిదవది ఆత్మనివేదనం. తాను తనది అంతా ఉన్నది ఆయన కోసమే అని తెలుసుకుని భగవంతునికి సమర్పించాలి.
ఏ విద్యకైనా పరమప్రయోజనం ఇదే అంటాడు ప్రహ్లాదుడు. కలియుగంలో అర్చామూర్తికే ఒకటి తర్వాత ఒకటిగా ఈ నవవిధ సేవలు అర్పించి, తరించాలి.
ఆంజనేయుడు "దాసోహం కోసలేంద్రస్య" అంటూ అధికంగా దాస్య భక్తినే ప్రదర్శిస్తాడు.
No comments:
Post a Comment