Monday, February 1, 2021

ఏ నామం అయినా పలికితే ఆ నామం యొక్క దేవుడు మాత్రమే పలుకుతాడు

**************
ఏ నామం అయినా పలికితే ఆ నామం యొక్క దేవుడు మాత్రమే పలుకుతాడు

👉అదే శ్రీ రామ అనే నామం లో రాముడు ఒక్క డే పలుకుతాడు అనుకోడం పొరపాటు. * శ్రీ రామ అనే నామం జపిస్తే ఆరుగురు దేవతలు పలుకుతారు అట.* అదెలాగో చద్దాం.

1️⃣ రామ అంటే *రాముడు* పలుకుతాడు తెలిసిందే

2️⃣ రామ అనే నామం ఉన్న చోట అందరికన్నా ముందర వచ్చి ఆ నామాన్ని విని ఆనందించేది నిస్సందేహంగా ఆ *హనుమంతుడే*

3️⃣ *శ్రీ* అంటే *లక్ష్మి*

4️⃣ *రా* అంటే *విష్ణువు* (ఓం నమో నారాయణాయ అనే నామం లో నుంచి రా  అనే జీవ అక్షరం తీసుకున్నారు)

5️⃣ *మ* అంటే *శివుడు* (ఓం నమః శివాయ అనే నామం లో నుంచి మ అనే జీవ అక్షరం తీసుకున్నారు)

6️⃣ శివుడు హనుమంతుడి రూపం లో భూలోకానికి రామ సేవ కోసం వస్తున్నప్పుడు పార్వతీ దేవి నాకు ఆ అదృష్టం కావాలి అంటే అపుడు శివుడు ఇలా అన్నాడు ఈ అవతారం లో హనుమంతుడు బ్రహమచర్యాని పటిస్తాడు కనుక నిన్ను తీసుకెళ్లడం కుదరని పని. అపుడు పార్వతీ దేవి అయితే నేను మీ తోక రూపం లో వస్తాను అని హనుమంతుడి తోక లో ప్రవేశించింది అట. మరి రామ అన్నపుడు హనుమ వస్తే *పార్వతీ* కూడా వచ్చింది కదా.

*రాముడు, హనుమంతుడు, లక్ష్మి, విష్ణువు, శివుడు, పార్వతీ*

ఒక్క నామం పలికితే ఆరుగురు దేవతలు వచ్చి ఆశీర్వదిస్తారు.

అలాంటి నామ పారాయణం చేయడం మరువ కండి.🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

No comments:

Post a Comment

హర హర మహాదేవ్ 🙏🔱 పన్నెండు జ్యోతిర్లింగాల దర్శనం చేసుకోవడం

  హర హర మహాదేవ్ 🙏🔱   పన్నెండు జ్యోతిర్లింగాల దర్శనం చేసుకోవడం అనేది సాధారణ విషయం కాదు... అది శివుని అనుగ్రహం, పూర్వజన్మ పుణ్యం, ఈ జన్మలో ద...