Monday, February 1, 2021

జపించే ప్రతి మంత్రానికీ గురూపదేశం తీసుకోవాలి. ఉపదేశం పొందకుండా ఏ మంత్రమైనా ఫలమివ్వదని శాస్త్రం చెబుతుంది

 ఆవశ్యకత*

జపించే ప్రతి మంత్రానికీ గురూపదేశం తీసుకోవాలి. ఉపదేశం పొందకుండా ఏ మంత్రమైనా ఫలమివ్వదని శాస్త్రం చెబుతుంది.

అసలు మంత్ర సిద్ధి పొందిన ఒక గురువు నుంచి ఉపదేశం తీసుకున్న ఒక్క మంత్రం చాలు జీవితం సఫలం కావడానికి. 

మంత్రాలు ఎక్కువయ్యే కొద్దీ మతి చలిస్తుంది. ఏకాగ్రత లోపిస్తుంది. మనస్సు పరిపరి విధాలపోతుంది. అనేక మంత్రాలు జపించడం వలన క్రమంగా డిప్రెషన్ కు గురి అయి అనారోగ్యం పాలుకూడా కావచ్చు.

ఒక దేవుణ్ణి, ఒక మంత్రాన్ని నమ్ముకొని నిత్యమూ ఏకాగ్రతతో ధ్యానించి పూజిస్తే చాలు. ధర్మాచరణలో జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. ఎక్కువ కోరికలతో, ఎక్కువ మంత్రాలు చదివేసుకుంటూ కనబడిన దేవుళ్ళకల్లా మొక్కుతూ మానవ జీవిత ధ్యేయాన్ని  విస్మరించకూడదు.

సత్కర్మాచరణ, సంతృప్తి మానవుడికి శాశ్వతానందాన్నిస్తాయి.

*శుభంభూయాత్*

No comments:

Post a Comment

Yes, she has gained weight? Defeated without losing a bout.

అవును, ఆమె కొంచెం బరువు పెరిగే వుంటుంది. ఎందుకంటే…. ఆటల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచే నిండైన ఆత్మాభిమానాన్ని, విశ్వ వేదికపైనే కాదు వ...