Friday, February 5, 2021

పూర్వజన్మకృతం పాపం "కళత్ర" రూపేణ భాథితంజాతకములో శుక్రుడు అనుకూలముగా ఉన్న జాతకురాలు ఇంట్లో అందరి పట్ల వీరు ప్రవర్తిస్తున్న తీరుకు ఇతరులపట్ల వీరి ప్రవర్తన తీరుకు చాలా తేడా ఉంటుంది. మగ పిల్లలు ఏమడిగినా తర్వాత చూద్దాం, చేద్దాం అంత తొందర ఏమొచ్చింది అని ఎడ మొహము పెడ ముఖముగా సమాథానము చెపుతారు. కూతురు నాన్నా నాకు ఇది కావాలి అంటే ఎన్నిపనులైనా మానుకుని అ వస్తువును కొన్ని గంటల్లో వారిముందు ఉంచుతారు.

పూర్వజన్మకృతం పాపం "కళత్ర" రూపేణ భాథితం

జాతకములో శుక్రుడు అనుకూలముగా ఉన్న జాతకురాలు ఇంట్లో అందరి పట్ల వీరు ప్రవర్తిస్తున్న తీరుకు ఇతరులపట్ల వీరి ప్రవర్తన తీరుకు చాలా తేడా ఉంటుంది. మగ పిల్లలు ఏమడిగినా తర్వాత చూద్దాం, చేద్దాం అంత తొందర ఏమొచ్చింది అని ఎడ మొహము పెడ ముఖముగా సమాథానము చెపుతారు. కూతురు నాన్నా నాకు ఇది కావాలి అంటే ఎన్నిపనులైనా మానుకుని అ వస్తువును కొన్ని గంటల్లో వారిముందు ఉంచుతారు.

కూతురు సంతోషముగా, ఆరోగ్యముగా ఉంటే వాళ్ళ మనస్సు, ప్రవర్తన కూడా ఆహ్లాదముగా ఉంటాయి. ఒకవేళ కూతురుకు ఏమైనా బాగాలేక పోవడము, చికాకుగా ఉండడము జరిగితే ఆ రోజుకు జనం దుంప తెగిందే, ప్యూన్ దగ్గర నుండి కలెక్టర్ వరకూ అందరినీ తిట్టడమే. చాలా తొందరగా స్పందిస్తారు. ఎవ్వరినైనా, ఎందరినైనా దూరం చేసుకుంటారు. ఏదైనాభరిస్తారు, కానీ కూతురు కంట కన్నీరు మాత్రం భరించలేరు. అతలాకుతలం అయిపోతారు.

తండ్రిని, తల్లిని కాదని కూతురు ప్రేమ వివాహము చేసుకున్నావీరు సహించి ఊరుకుంటారు. శుక్ర గ్రహము జాతకములో అనుకూలముగా ఉంటే ఇలాంటి లక్షణాలు ఏర్పడతాయి. వీళ్ళ అతి ప్రేమ వల్ల కూతురుకి పెళ్ళి చేసిన తరువాత వాళ్ళ కాపురములో ఏమైనా విభేథాలు వస్తే అల్లుడిని, కూతురుని కూర్చోబెట్టి సంసారం బాగు చేసే యత్నాలు చేయరు. కూతురుని ఇంటికి తెచ్చుకుంటారు. అల్లుడిని, అతని కుటుంబాన్ని భ్రష్టు పట్టిస్తారు. భార్యాభర్తలమథ్య విరోథము సమసి పోతుందని వీళ్ళు భావించరు. అల్లుడు కూతురుని తిట్టినా, కొట్టినా, కష్ట పెట్టినా అల్లుడి చరిత్ర వాస్తవాలు తెలుసుకోలేరు. తెలుసుకొనే ప్రయత్నాలు చేయరు. భార్యమాట బంథువుల మాట గడ్డిపోచ క్రింద తీసిపారేస్తారు.

భారత శిక్షాస్మృతిలో ఉన్నచట్టాలను ఉపయోగించి అల్లుడు, అతని కుటుంబ సభ్యులను వేథిస్తున్నారని కేసులు పెట్టి, లంచాలు ఇచ్చి వాళ్ళను ప్రాథమికముగా జైలులో పెట్టిస్తారు. రాజీచేయడానికి వచ్చిన పెద్దమనుషులకు గౌరవము తగ్గదు. చివరకు అల్లుడే ఇంటికి వచ్చి ప్రాథేయపడినా వీళ్ళు స్పందించరు. అల్లుడిని చెప్పుతో కొట్టడము, వీళ్ళ విషయములో సాథారణ అంశము. కూతురు సంసారాన్ని వీళ్ళ చేతులతో వీళ్ళే చెడగొడతారు. అమితమైన ప్రేమ వలన వాస్తవాలు, సామాజిక విషయాలు మరచిపోతారు.

మథ్యప్రదేశ్ లోని ఓ గౌరవనీయమైన కుటుంబ యాజమాని జిల్లా సెషన్స్ జడ్జి. ఆయన వాళ్ళ అబ్బాయికి పెళ్ళి చేశాడు. అబ్బాయి కూడా మంచి ఉద్యోగములో స్థిర పడినవాడే. పెళ్ళి అయింది. అమ్మాయి అత్త వారింటికి వచ్చింది. ఓ రోజు అత్తగారు కోడల్ని వంట చేయమని చెప్పింది. నేనిక్కడకు వచ్చింది వంటల్ని చేయడానికి కాదు. నువ్వు చేసుకో ఆ వంటల పని అని సమాథానము చెప్పింది కోడలు. అత్తగారు ఏమనుకుందో ఏమో వంటతనే చేసింది.
వాళ్ళ అబ్బాయి రాగానే కోడలు మాట్లాడిన విషయాలు చెప్పింది. ఎందుకిలా చేశావని భార్యను అడిగాడు. పెద్దలను గౌరవించడం, ఇంటి పని చేసుకోవడము తప్పేంటని నిలదీశాడు. ఏదో ఇబ్బంది వచ్చి ఒక్కరోజు వంట చేయమంటే ఇలా మాట్లాడవచ్చా అని ప్రశ్నించాడు. అంతే ఆ అమ్మా యి అగ్గిమీద గుగ్గిలం అయ్యింది. అప్పటికప్పుడే పుట్టింటికి వెళ్ళి వాళ్ళ నాన్నతో ఉన్నవీ, లేనివీ చెప్పింది. దాంతో అమ్మాయి తండ్రి రెచ్చిపోయాడు. అమ్మా నిన్ను ఇన్ని భాథలు పెట్టిన వాళ్ళను ఊరికే వదలను. వాళ్ళ అంతు తేలుస్తాను అని శపథంచేసి ఇంకేముంది అమ్మాయిని కట్నం కోసం వేథిస్తున్నారనీ, ఇందులో కుటుంబసభ్యులందరూ భాగస్వాములేనని కేసు పెట్టాడు. ఇంకేముంది.

శక్తివంతమైన చట్టం తనపని తాను చేసుకుపోసాగింది. గౌరవ ప్రదమైన కుటుంబం జైలు పాలైంది. అందరికీ న్యాయము చెప్పే మహానుభావుడు మంచివాడైన జడ్జీగారు కూడా రిమాండుకు తరలించబడ్డారు. ఈసంఘటనతో సంబంథములేని ఎక్కడో కాపురం చేసుకుంటున్న జడ్జీగారి కూతుళ్ళు కూడా జైలుకు తరలింపబడ్డారు. వాళ్ళ మంచితనము తెలిసిన వాళ్ళంతా కాల మహిమను చూచి నిర్ఘాంతపోయి ముక్కుమీద వేలేసుకున్నారు.

శుక్రుడు జాతకములో బాగా లేకపోతే భార్యవల్ల,స్త్రీల వల్ల అష్టకష్టాలు ఎదురవుతాయి.“ పూర్వజన్మకృతం పాపం కళత్ర రూపేణ భాథితం.” అనే సామెత నిజ జీవితములో అక్షరాలా వర్తిస్తుంది.

No comments:

Post a Comment

Jamalapuram Sri Venkateswara Swamy Temple జమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయం Telangana Tirupati, Khammam District

The road access to the temple is very good, and you can easily reach it in your own vehicle. Parking is not a concern as you can park comfor...