Monday, February 1, 2021

భార్యాభర్తల అనుబంధం గురించి అమృత వాక్యాలు కొన్ని *_ _సృష్టి తీర్చిదిద్దిన అతి గొప్ప కళాఖండం *"కుటుంబం"*._

*భార్యాభర్తల అనుబంధం గురించి అమృత వాక్యాలు
 కొన్ని *_      

_సృష్టి తీర్చిదిద్దిన అతి గొప్ప కళాఖండం *"కుటుంబం"*._

_నీకెంత అదృష్టం కలసి వచ్చినా నువ్వెంత కష్టం చేసే వాడివే అయినా నీ భార్య సహకారం లేనిదే నువ్వే రంగంలోనూ రాణించలేవు._

_తన భర్త ఆదాయం, ఖర్చులను గమనిస్తూ తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య నిజంగా ఓ వరమే._

_అర్థం చేసుకునే భార్య దొరికితే అడుక్కుతినేవాడు కూడా హాయిగా జీవిస్తాడు._

_అహంకారి భార్య దొరికితే అంబానీ కూడా సన్యాసంలో కలవాల్సిందే._

_ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంగా భావిస్తే, ప్రతి భార్య తన భర్తను మొదటి బిడ్డగా పరిగణిస్తే ఇదే మధురమైన బంధం._

_భార్యకు సేవ చేయడం అంటే బానిసగా బ్రతుకుతున్నామని కాదు అర్థం. బంధాన్ని గౌరవిస్తున్నామని అర్థం._

_సంసారం అంటే కలసి ఉండడమే కాదు. కష్టాలే వచ్చినా కన్నీరే ఏరులై పారినా ఒకరిని ఒకరు అర్థం చేసుకోని కడవరకూ తోడూ వీడకుండా ఉండడం._

_ఒక మంచి భర్త భార్య కన్నీరు తూడుస్తాడెమో కానీ అర్థం చేసుకునే భర్త ఆ కన్నీటికి కారణాలు తెలుసుకుని మళ్లీ తన భార్య కళ్లలో కన్నీరు రాకుండా చూసుకుంటాడు._

_భార్యాభర్తల సంబంధం శాశ్వతం. కొంతమంది మధ్యలో వస్తారు. మధ్యలోనే పోతారు. భార్యకి భర్త శాశ్వతం. భర్తకు భార్య శాశ్వతం._

_ఇంటి వ్యవహారాలు చక్కగా నిర్వహించగలిగే ప్రతి గృహిణీ గొప్ప విద్యావంతురాలి కిందే లెక్క !_

_అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు. భార్య లేకుంటే ఆ జన్మకు అర్థం లేదు._

_మోజు తీరగానే మూలనేసేది కాదు మూడుముళ్ల బంధం. ముసలితనంలో కూడా మనసెరిగి ఉండేది *"మాంగల్య బంధం"..*_

_బంధాలు శాశ్వతంగా తెగిపోకుండా ఉండాలి అంటే ఎదుటివారు తప్పు చేస్తే క్షమించాలి. మనం తప్పు చేస్తే క్షమించమని అడగాలి._

_మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిసను చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది. కానీ తెలివైన మహిళ తన భర్తను రాజును చేసి ఆ రాజుకు తను రాణిగా ఉంటుంది._

_కుటుంబంలో ఎన్ని కీచులాటలున్నా సమాజంలో భర్త పరువు నిలబెట్టాల్సిన బాధ్యత భార్యది. భార్యను చులకనగా చూడకుండా గౌరవించవలసిన ధర్మం భర్తది._

_నీ సంతోషం నేను కాకపోయినా నా చిరునవ్వు మాత్రం నువ్వే._
_నీ ఆలోచన నేను కాకపోయినా నా ప్రతి ఙ్ఞాపకం నువ్వే._

_ప్రేమ అనేది చాలా విలువైనది. దాన్ని "వివాహం"అనే అద్దాల బీరువాలో పెట్టుకుంటేనే అది రాణిస్తుంది._

_సృష్టి తీర్చిదిద్దిన అతి గొప్ప కళాఖండం"కుటుంబం"._

_గొడవ పడకుండా ఉండే బంధం కన్నా ఎంత గొడవ పడినా విడిపోకుండా ఉండే బంధం దొరకడం ఒక గొప్ప వరం._

_కలిమి లేములతో.. కలసిన మనసులతో... కలివిడిగా మసలుకో.. కలకాలం సుఖసంతోషాలు పంచుకో..!_

_బంధం అన్నది అందమైన పుస్తకం లాంటిది. పొరపాటు అనేది అందులో ఒక పేజీ మాత్రమే._

_ఆ ఒక్క పొరపాటు జరిగితే సవరించాలి కానీ మొత్తం పుస్తకాన్ని చించి వేయకూడదు._

_భర్తకి భార్య బలం కావాలి. బలహీనత కాకూడదు భార్యకి భర్త భరోసా కావాలి భారం కాకూడదు. భార్యా భర్తల బంధం అన్యోన్యం కావాలి, అయోమయం కాకూడదు._

_మనసులోని ప్రేమని, బాధని కళ్లలో చూసి చెప్పకుండానే గుర్తించగలిగిన వ్యక్తి భాగస్వామిగా దొరికితే అంతకుమించిన అదృష్టం మరొకటి ఉండదు._

_అందాన్ని చూసి పెళ్లి చేసుకోవడం అంటే ఇంటికి వేసిన రంగులు చూసి ఇల్లు కొనుక్కోవడమే._

_పెళ్లి అంటే ఈడూ-జోడూ, తోడూ-నీడా, కష్టం- సుఖం గురించి కాదు. ఇద్దరూ ఐక్యమైపోయి తమని ఉద్ధరించుకొనే ఒక మంచి అవకాశం. ప్రతి అమ్మాయికి చదువుకున్న భర్త రావడం సహజం. కానీ తన మనసు చదివిన భర్త రావడం అదృష్టం._

_*చిరునవ్వులతో కూడిన దంపతులారా అందుకోండి నా శుభాకాంక్షలు..*_ 

🙏

No comments:

Post a Comment

Jamalapuram Sri Venkateswara Swamy Temple జమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయం Telangana Tirupati, Khammam District

The road access to the temple is very good, and you can easily reach it in your own vehicle. Parking is not a concern as you can park comfor...