Monday, September 21, 2026

హర హర మహాదేవ్ 🙏🔱 పన్నెండు జ్యోతిర్లింగాల దర్శనం చేసుకోవడం

 
హర హర మహాదేవ్ 🙏🔱  
పన్నెండు జ్యోతిర్లింగాల దర్శనం చేసుకోవడం అనేది సాధారణ విషయం కాదు... అది శివుని అనుగ్రహం, పూర్వజన్మ పుణ్యం, ఈ జన్మలో దక్కిన గొప్ప అదృష్టం. 🕉️  
కొంతమందికి ఎన్ని వేల కోట్లు సంపద ఉన్నా, జీవితంలో ఎన్నో విజయాలు సాధించినా... ఈ పవిత్రమైన పన్నెండు జ్యోతిర్లింగాల దర్శనం అనే మహత్తరమైన భాగ్యం అందరికీ దక్కదు. కానీ మీపై హర హర మహాదేవుని కృప, ఆశీస్సులు ఉండటం వల్ల ఈ పవిత్ర దర్శనాలన్నీ సాకారమయ్యాయి 🙏✨.ఇది కేవలం ఒక ప్రయాణం కాదు... ఇది ఒక ఆధ్యాత్మిక యాత్ర... ఒక జీవితకాలపు అద్భుతమైన జ్ఞాపకం... శివునితో అనుబంధాన్ని మరింత బలపరిచే మహాభాగ్యం 🔱.  
ఇంకా జీవితంలో ఎన్నో పవిత్ర క్షేత్రాలను దర్శించాలి... ఎన్నో మంచి అనుభవాలను పొందాలి... మరింత ఉన్నతంగా ఎదగాలి, సుఖసంతోషాలతో జీవించాలి, ప్రతి అడుగులో మహాదేవుని ఆశీస్సులు తోడుగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.  
ఓం నమః శివాయ 🙏
హర హర మహాదేవ్ 🔱
జై భోలేనాథ్ 🕉️  

Monday, September 14, 2026

💐 హ్యాపీ ఇంజనీర్స్ డే 💐

🌹 జాతీయ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు 🌹

ఈ విశ్వంలో ఇంజనీరింగ్ యొక్క గొప్పతనాన్ని చాటుతూ, తమ మేధస్సు, సాంకేతిక నైపుణ్యం, సృజనాత్మకత మరియు అంకితభావంతో అభివృద్ధికి బాటలు వేసి, ఆధునిక సమాజానికి ఎన్నో అమూల్యమైన ఫలాలను అందిస్తున్న ప్రతి ఒక్క ఇంజనీర్‌కు హృదయపూర్వక ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు. 💐

దేశ ప్రగతిలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.
“ఆలోచనకు రూపం… సాంకేతికతకు దిశ… అభివృద్ధికి ఇంజనీర్!” ⚡🏗️

💐 హ్యాపీ ఇంజనీర్స్ డే 💐

Sunday, September 13, 2026

*_మట్టి వినాయకుడినే పూజించడం ఎందుకు ?_*

*_మట్టి వినాయకుడినే పూజించడం ఎందుకు ?_*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

మట్టి వినాయకుడినే పూజించడం ఎందుకు ? ఈ ప్రశ్న గణపతికి సంబంధించిన పురాణ కధల్లో కనిపిస్తుంది. మట్టిగణపతిని పూజించడానికి పురాణప్రాశస్త్యం కూడా ఉంది. ఏదో వినాయకచవితి వల్లనే మొత్తం కాలుష్యం జరుగుతున్నట్టు మీడియా మరియు కొన్ని సంస్థలు నానా హంగామా చేస్తున్నాయి. అసలు దాని గురించి పురాణం ఏమంటోందో చూద్దాం. 

గణపతి లీలా వైభవాన్ని చెప్తున్న సూతులవారిని శౌనకాదులు ఒక సందేహం అడిగారు. *"ఓ మహర్షి ! ఈ వినాయక చవితి వ్రతమునందు మట్టితో చేసిన గణపతినే పూజించడానికి కారణం ఏమిటి ? పూజానంతరం వినాయక ప్రతిమను నీటిలో నిమజ్జనం చేయడం దేనికి ?"*

*"మునీంద్రులారా ! మంచి ప్రశ్నలు వేశారు. వినండి. పరమేశ్వరుడు విశ్వవ్యాపిత(అంతటా ఉన్నది పరమాత్ముడే) తత్వము కలిగినది భూమి కాబట్టి తొలుత మట్టితో గణపతిని చేసి, గణపతి యొక్క విశ్వవ్యాపకత్వాన్ని (అంతటా , అన్నింట అంతర్లీనంగా ఉన్నది గణపతే) ప్రకటించాడు. విశ్వవ్యాపకత్వము కలిగి ఉన్నది ప్రకృతి స్వరూపమైన మట్టి ఒక్కటే. దాని నుండే సకల జీవులు సృష్టించబడతాయి. దాని నుండి లభించే పోషక పదార్ధాల ద్వారానే సర్వజీవులు పోషింపబడతాయి. చివరకు సర్వజీవులు మట్టిలోనే లయమవుతాయి. ఇదే సృష్టి రహస్యం. ఇదే పరబ్రహ్మతత్వం. ఈ సత్యమును చాటడానికే నాడు పరమశివుడు పరబ్రహ్మ స్థూలరూపమైన భూమి నుండి మట్టిని తీసి దానితో విగ్రహాన్ని చేసి ప్రాణం పోశాడు(లింగపురాణం గణేశ ఖండం ప్రకారం శివుడే వినాయకుడి రుపాన్ని మట్టితో తయారుచేశాడు). మృత్తికయే పరబ్రహ్మ కనుక , మట్టితో వినాయకుడిని చేసి పరబ్రహ్మ స్వరూపంగా పూజించడం ఆనాటి నుంచి ఆచారంగా వస్తున్నది. అంతేకాదు మట్టి ఎక్కడైనా , ఎవరికైనా లభిస్తుంది, దానికి బీదా , ధనిక అనే తారతమ్యం లేదు. సర్వ సమానత్వమునకు ఏకైక తార్కాణం భుమి , మట్టి , వసుధ. బంగారంతో విగ్రహం కొందరే చేయించుకోగలరు. విఘ్నేశ్వరుడు అందరివాడు. అందుకే అందరివాడైన గణపతి విగ్రహాన్ని మట్టితో చేసి పూజించే ఆచారాన్ని పరమశివుడే ప్రారంభించాడు. నేడు సమస్తమానవాళి ఆచరిస్తోంది. సర్వజీవ సమానత్వమునకు ప్రతీక మట్టి వినాయకుడు. అందుకే మట్టి విగ్రహానికి ప్రాధాన్యం , పూజ"* అని చెప్పాడు సూతుడు.

Friday, September 11, 2026

మనం పూజకు ఉపయోగించే "టెంకాయల"కు "జుట్టు"ఎందుకు వుంచుతాము ? దీనికి ఏదైనా ప్రత్యేకమైన కారణం వుందా ?

మనం పూజకు ఉపయోగించే "టెంకాయల"కు "జుట్టు"ఎందుకు వుంచుతాము ? దీనికి ఏదైనా ప్రత్యేకమైన కారణం వుందా ?
కొబ్బరికాయకు జుట్టు ఉండదు.. మనుషులకు జంతువులకు మాత్రమే జుట్టు ఉంటుంది.. కాయలకు, ఫలాలకు పైన గానీ లోపల కానీ ఉండేదానిని పీచు, పీచు పదార్థం అంటారు.

లేత కొబ్బరికాయ లను బొండాలు అంటారు..ఈ బొండాలకు కూడా కొన్ని మామిడికాయల లాగా ముదిరిన కొద్దీ పైన పీచు తయారు అవుతుంది.

కొబ్బరికాయ కు పై భాగంలో మూడు కళ్ళు ఉంటాయి. ఈ కళ్ళు పీచు తో కప్పబడి ఉంటాయి. వీటిని eye of the coconut అంటారు. ఈ కళ్ళు భాగంలో పెంకు కొంచెం మెత్తగా పలుచగా ఉంటుంది. వీటిలో సన్నని రంధ్రాలు pores ఉంటాయి. ఈ కళ్ళు ద్వారా విత్తనాభివృద్ధి జరుగుతుంది. బాగా ముదురు కొబ్బరి కాయలలో seed germination జరిగి ఈ కళ్ళ ద్వారా మొక్క బయటకు వస్తుంది. పీచు తీసిన కాయలు విత్తనాలకు పనికిరావు.
మనం మామూలుగా పూజకు లేదా వంటలకు వాడే కాయలు మరీ ముదురుగా ఉండవు.వీటికి పూర్తిగా పైన ఉండే పీచు తీసివేస్తే కళ్ళు భాగంలో pores నుండి oxidation తోందరగా జరిగి కాయ కుళ్ళి పోతుంది. అందుకే వాడుకునే కొబ్బరికాయలు కొద్ది రోజులు నిల్వ ఉంచటానికి పైన పీచు వదిలేసి transport and storage చేస్తారు. మనం కాయలు కొనుక్కున్నప్పుడు కాయ మొత్తంలో ఉన్న పీచు తీసేసి కళ్ళ మీద పీచు ను ముచిక లాగా వదిలితే వెంటనే oxidation జరిగి కాయ కొన్ని రోజులు కుళ్ళి పోకుండా ఉంటుంది.అందుకే పీచును వదిలి వేస్తారు. ధాంక్స్


Thursday, September 3, 2026

ఉన్న పాలను ఒదులు ఉద్యమాలు పోసి**ఏ తల్లి నిన్ను గన్నదో ఓ సారు... KCR**నేర్వావాసి నేల వాన చినుకులు లేక నీ**దిక్కునే చూసెనో ఓ సారు... KCR ||2||*


*ఉన్న పాలను ఒదులు ఉద్యమాలు పోసి*
*ఏ తల్లి నిన్ను గన్నదో ఓ సారు... KCR*
*నేర్వావాసి నేల వాన చినుకులు లేక నీ*
*దిక్కునే చూసెనో ఓ సారు... KCR ||2||*

*నువ్వే అడుగు పెట్టిన చోట పచ్చని*
*మాగాన పైరులు పోసింది ఆరోజున*
*రోటుసూరు ఆబాలంత కడుపులోనా*
*కొడుకు సచ్చేంత బాధ.. ఈ రోజున*
*యాదిల యాదికొస్తున్నవే సారు... మాకు*
*ఎన్నడిస్తావ్ KCR*

*తప్పు చేసినామే పెద్ద సారు..*
*కన్న తండ్రి లేక మమ్ము చూడు*

HMWSSB appeal to all residents to minimize water usage and restrict consumption strictly to essential needs.12-10-2026

Dear All: Message from HMWSSB* ​​Due to the ongoing El Niño effect and upcoming drought, we appeal to all residents to minimize water usage ...