Monday, February 2, 2026

ఇన్ని చెల్లిష్తున్నా??? ఇంకా నేను ఇన్కమ్ టాక్స్ కట్టాలా???అయినా నేను ఇంకా పన్ను చెల్లించాలా? ఎందుకు.?నేను 30 రోజులు పనిచేశాను. జీతం ఇచ్చారు! జీతం ఇచ్చారు.,

ఇన్ని చెల్లిష్తున్నా??? ఇంకా నేను ఇన్కమ్ టాక్స్ కట్టాలా???
అయినా నేను ఇంకా పన్ను చెల్లించాలా? ఎందుకు.?
నేను 30 రోజులు పనిచేశాను. జీతం ఇచ్చారు! జీతం ఇచ్చారు., 

1. ఆదాయపు పన్ను అన్నారు. ఇచ్చాను.
2. ప్రొఫెషనల్ ట్యాక్స్ అన్నారు,ఇచ్చాను
3. మొబైల్ కొనుగోలు పై పన్ను అన్నారు!ఇచ్చాను!
4. రీఛార్జ్ చేశా పన్ను ఇచ్చా!
5. డేటా పన్ను ఇచ్చా!
6. విద్యుత్తు పన్ను ఇచ్చా!
7. ఇంటి పన్ను ఇచ్చా!
8. టీవీ బిల్లు పై పన్ను!
9. పిల్లల ఫీజుల పై పన్ను!
అన్నీ ఇచ్చాను!
10. కారుకి పన్ను అన్నారు!
ఇచ్చాను!
11. పెట్రోలు పై పన్ను అన్నారు! 
చెల్లించా!
12. సేవ’ అన్నారు!పన్ను ఇచ్చాను!
13. రోడ్డుపై పన్ను అన్నారు!
ఇచ్చాను!
14. ‘టోల్‌ పై’ పన్ను! ఇచ్చాను!
15. ఆపై లైసెన్స్ మేడ్ ‘ట్యాక్స్’ వచ్చింది! ఇచ్చాను!
కిక్కురు మనకుండా అన్నీ ఇచ్చాను!
16. తప్పు చేస్తే పన్ను! చెల్లించా!
17. రెస్టారెంట్‌లో తిన్నా! పన్ను చెల్లించా!
18. పార్కింగ్ పన్ను చెల్లించా!
19. నీరు తీసుకున్నా! పన్ను చెల్లించా!
20. ఇంట్లో కసువు బయట వేసేందుకు పన్ను చెల్లించా!
21. టాయ్లెట్ నుండి వేస్ట్ sewage అన్నారు! దానికి పన్ను చెల్లించా!
22. తినేందుకని కార్డుమీద సామానులు కొనుక్కున్నా! పన్ను చెల్లించా!
23. రేషన్ కొనుగోలు చేశా! పన్ను చెల్లించా!
24. బట్టలు కొనుగోలు చేశా! పన్ను చెల్లించా!
25. పుస్తకాలు తీసుకున్నా! పన్ను ఇచ్చా!
26. మరుగుదొడ్డికి వెళ్లా! పన్ను చెల్లించా!
27. మందులు తీసుకున్నా! పన్ను చెల్లించా!
28. గ్యాస్ ఇచ్చారు! పన్ను చెల్లించా!
వందల కొద్దీ వస్తువులు తీసుకుని పన్ను కట్టి, ఫీజులు, బిల్లులు, వడ్డీలు కట్టి, ఎక్కడో ఫైన్లు, లంచాల పేరుతో డబ్బులు చెల్లించి, పొరపాటున ఏ డ్రామా నో ఆడి, ఇంతా అంతా ‘ఆదా’ చేసి మరీ మీకు పన్ను కట్టా!

కానీ ఆ జీతం నుండి ఎన్నిసార్లు పన్ను చెల్లించాలి? ఎవరయినా జవాబు చెప్తారా?

మేము జీవితాంతం పని చేసి, పన్నులు కట్టిన తర్వాతకూడా!
1. మాకు సామాజిక భద్రత లేదు. 
2. ఉచిత వైద్య సౌకర్యం లేదు,  
3. అధ్వాన్నమైన రోడ్లు, 
4. వీధి దీపాలు వెలగవు,
    5. గాలి కాలుష్యం, 
    6. నీరు కాలుష్యం, 
7. పండ్లు, కూరగాయలు, ఇలా అన్నీ విషపూరితమైనవి,
   8. ఆసుపత్రుల చికిత్సలు అందనంత ఖరీదైనవి, 

9. ముసలి వాడినయేంతవరకు పన్ను కట్టి పన్ను మీదపన్నులు కట్టి చేసిన సర్వీసు లో ఆదా చేసుకుని పింఛను తీసుకుంటే దానిమీద కూడా పన్ను అన్నారు! అది కడ్తున్నా!
10. నా శవాన్ని తగలబెట్టేందుకూ పన్నా?           

ప్రతి సంవత్సరం పెరిగే ద్రవ్యోల్బణం కూడా మమ్మల్ని దెబ్బతీస్తుంది, అకస్మాత్తుగా వచ్చే ఖర్చులు, ప్రమాదవశాత్తు ఊహించని విపత్తులు, వాటిల్లో ప్రతిచోటా కూడా మీకు పన్నులు! మాకు అప్పులు!
కానీ!!!

*ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి*?

*అవినీతిలోకి, ఎన్నికల్లోకి, ఉచితాలకి, ధనవంతుల సబ్సిడీల్లోకి, మాల్యా లాంటివారు దోచుకొని పారిపోవటానికి, ధనికుల ప్రకటించే మోసపూరిత ‘దివాలాలు పూడ్చటానికి, స్విస్ బ్యాంకుల్లోకి, నాయకుల బంగ్లాలు, కార్లు, జీతాలు సౌకర్యాలకి, ఎమ్మెల్యేలను కొనడంలోకి, మాకు కథలు చెప్పి జండూ బామ్ రాయడానికి ఖర్చు పెట్టారు*.

ఇప్పుటికైనా చెప్పండి, దొంగ ఎవరో? మనమంతా కూడా ఈ దేశస్థులమే! అయినాసరే, ఎంతకాలం అయినా ఇలాగే జీవితాన్ని కొనసాగిస్తాము. కదా!

ఇది ఓక సామాన్యుడిగా నా ఆవేదన. 😒.

*ప్రపంచవ్యాప్తంగా GST వసూలు చేస్తున్న 175 దేశాలలో 28% GST స్లాబ్ ఉన్న ఏకైక దేశం మన దేశమే*! 

*ఇంత భయంకరంగా పన్ను వసూలు చేస్తున్నప్పటికీ దేశ చరిత్రలో ఎన్నడూ లేనంత అప్పు దేనికి చేసినట్లు*???

1. హెల్త్ ఇన్సూరెన్స్ మీద 18%
2. లైఫ్ ఇన్సూరెన్స్ మీద 18%
3. మెడిసిన్ మీద 12% 
4. మెడికల్ సర్వీస్ మీద 12%
5. బహిష్టు సమయంలో మహిళలు ఉపయోగించే సానిటరీ ప్యాడ్స్ మీద 12%
6. బట్టల మీద 12%
7. చెప్పులు మీద 12%
8. పాప్కార్న్ మీద 18 %
9. పాతకారుల అమ్మకం మీద 18%
10. ఉద్యోగ రుసుము మీద 18 %
11. పాల మీద 5% 
12. పెరుగు మీద 5%
13. పన్నీర్ మీద 5%
14. బంగారు కొనుగోలు మీద 3%
15. ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రిక్ మీద 28%
16. మోటార్ వెహికల్స్, కార్స్ అండ్ బైక్స్ మీద 28%
17. స్టీల్ మీద 18%
18. ఐరన్ మీద 18%
 19. సిమెంట్ మీద 28%
20. ఫ్లోరింగ్ టైల్స్ మీద 5%
21. వాల్ టైల్స్ మీద 28%

ఇలా వ్రాసుకుంటూ పోతే మొత్తం ఎన్నడూ లేనంతగా పన్నులు వసూలు చేస్తున్నారు! 

అయినప్పటికీ మనదేశంలో పేదరికం, ఆహారపు కొరత, అప్పులు! పట్టి పిడిస్తున్నాయి! 
ఎవరిది లోపం! పాలకులదా! ప్రజలదా!

స్వాతంత్ర్యం రాకముందు మనదేశ సంపదను బ్రిటీష్ వాళ్ళుకొల్లగొట్టారు అని చరిత్రలో రాసారు! 

ఇప్పుడు మనకు స్వాతంత్ర్యం వొచ్చింది! రాజ్యాంగం అమలులో వుంది! 

మనదేశాన్ని కొల్లగొడుతున్న
దేవరు? అనేది పెద్ద ప్రశ్న!

ఇన్ని చెల్లిష్తున్నా??? ఇంకా నేను ఇన్కమ్ టాక్స్ కట్టాలా???

No comments:

Post a Comment