తిరుమలలో 60 సంవత్సరాలు దాటిన వయో వృద్ధులకు 30 నిమిషాల్లో ఉచిత దర్శనం చేయించనున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. దీని కోసం రెండు సమయాలు కేటాయించినట్లు వెల్లడించారు.
1) ఉదయం 10 గంటలకు
2)సాయంత్రం 3 గంటలకు
#ఫోటోతో ఉన్న వయస్సు నిర్ధారణ పత్రాలు తమ వెంట ఉంచుకుని భక్తులు ఎస్-1 కౌంటర్ వద్ద చూపించాల్సి ఉంటుంది.
ఆలయానికి కుడివైపు బ్రిడ్జి కింద గోడ పక్కనే మెట్లు ఎక్కాల్సిన పనిలేదు. కూర్చోవడానికి మంచి సీట్లు ఏర్పాటు చేసి ఉంటాయి. సాంబారన్నం, పెరుగన్నం, వేడి పాలు ఉచితంగా ఇస్తారు.
రూ.20కి రెండు లడ్డు టోకెన్లు ఇస్తారు. భక్తులు ఇంకా లడ్డూలు కావాలనుకుంటే రూ.25కు ఒక లడ్డూ ఎన్నైనా టోకెన్లు ఇస్తారు.
కౌంటర్ నుంచి గుడికి - గుడి నుంచి కౌంటర్ వరకు బ్యాటరీ కారులో ఉచితంగా చేరవేస్తారు.
వీరి దర్శనం కోసం అన్ని క్యూలైన్లు నిలిపివేయబడుతాయి. ఎటువంటి వత్తిళ్లు, తోపులాటలు లేకుండా 30 నిమిషాల్లో శ్రీవారి దర్శనం పూర్తవుతుంది....YV SUBBA REDDY TTD CHAIRMAN.....
No comments:
Post a Comment