వంటగదిలో ప్రమిదదీపం నువ్వుల నూనెతో వెలిగిస్తే ?ప్రయోజనం
దీపం పరంజ్యోతి స్వరూపం. మనం నివసించే గృహంలో రోజూ ఉదయం, సాయంత్రం రెండు పూటలా దీపాన్ని వెలిగించడం ద్వారా ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఇంకా దుష్టశక్తులు తొలగిపోతాయి. అలాగే దీపం మహాలక్ష్మీ దేవి స్వరూపం కావడంతో ఆమె అనుగ్రహం లభిస్తుంది. రోజూ గృహంలో దీపాన్ని వెలిగించడం ద్వారా ఆయురారోగ్యాలు చేకూరుతాయి. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ధనాదాయం వుంటుంది. అలాంటి దీపాల్లో కొన్ని విశిష్టమైన వాటిని గురించి తెలుసుకుందాం..
బియ్యాన్ని శుభ్రపరిచి పొడికొట్టుకుని.. ఇంటిముందు బియ్యం పిండితో ముగ్గులు వేయడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఇంకా ఆ రంగ వల్లికలపై పంచముఖ దీపాన్ని వుంచి రోజూ వెలిగించడం ద్వారా లక్ష్మీ కటాక్షం చేకూరుతుంది
పూజగదిలో రెండు పంచముఖ దీపాలను వెలిగించడం మంగళప్రదం. అంతేగాకుండా వంటగదిలో రోజూ ఓ ప్రమిదలో నువ్వుల నూనెను పోసి దీపం వెలిగించడం ద్వారా అన్న దోషాలు ఏర్పడవు. తద్వారా దారిద్ర్యం దరి చేరదు. ఇకపోతే ఇంటి బయట తోటలుంటే.. అక్కడ నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే శత్రుభయం వుండదు. ఆయుర్దాయం పెరుగుతుంది. ఇంటికి వెలుపల ప్రధాన ద్వారాల వద్ద నాలుగు దీపాలను రోజూ వెలిగించడం ద్వారా ఇంట వుండే దుష్ట శక్తులు వుండవని పండితులు చెప్తున్నారు
No comments:
Post a Comment