*పవిత్ర జీవనం*
🚩🚩🚩🚩🚩🚩
పవిత్ర జీవనం గడపటం ద్వారా మాత్రమే శాశ్వతమైన దాన్ని పొందగలం. కొందరు మాట్లాడినప్పుడు ఆ మాట సచేతన స్పందనలతో ప్రతిధ్వనిస్తుంది. నూతన జీవితాన్ని ఆరంభించేలా చేస్తుంది.
అదే మాట వేరొకరు మాట్లాడితే ఉపయోగం లేకపోవచ్చు. మహాత్ముడు అంటే అర్ధం ఏమిటి? అంతఃశుద్ధిని కలిగి ఉన్నవారు. వారిలోని ప్రకాశాన్ని చూడకుండా ఉండలేము వారు ఏం చేసినా అది పవిత్రీకరించబడుతుంది.
అసలు భగవంతుని గురించిన వివేక ప్రజ్ఞ కలిగి ఉండటమే పవిత్రతలోని ముఖ్య లక్షణాలు. ఒక మనిషి జీవిత సత్యాలను అనుభూతి చెందినపుడు అతడు వృదువుగా, శీఘ్ర గ్రాహిగా మారతాడు. ఆ గాఢానుభూతి ద్వారా దైవప్రేమిగా, సకల మానవాళిని ప్రేమించగలవాడిగా మారతాడు. ఇది జ్ఞానం ద్వారా మాత్రమే వస్తుంది.
ఆ జ్ఞానం సరియైన జీవనం ద్వారానే వస్తుంది.
No comments:
Post a Comment