Saturday, June 3, 2023

అక్షయతృతీయ రోజు బంగారం కోన మని ఏ శాస్త్రంలో లేదు. వీలైతే బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వండి, బీదవాళ్లకు భోజనం పెట్టండి. ఇంట్లో కులదేవతను పూజ చేసుకోండి.

🚩🚩🚩🚩🌹🌹🌹🙏🏻
*అక్షయతృతీయ రోజు బంగారం కోన మని ఏ శాస్త్రంలో లేదు. వీలైతే బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వండి, బీదవాళ్లకు భోజనం పెట్టండి. ఇంట్లో కులదేవతను పూజ చేసుకోండి. లేదా ఒక సత్ బ్రాహ్మణుకి ధనధానం బంగారం వెండి బట్టలు తగిన దక్షిణ ఇవ్వండి అప్పుడు మీరు ఇచ్చిన దానం అక్షయమ్ అవుతుంది అక్షయఅంటే క్షయమ్ కానిది తగ్గనిది వంద రేట్లు పుణ్యం కలిగించేది అనిఅర్ధం తృతీయ విశేషం ఏమిటో తెలుసుకుందాం.*

*1.పరశురాముడు జన్మించిన రోజు.*
*2. పవిత్ర గంగానది భూమిని తాకిన రోజు.*
*3. త్రేతాయుగం మొదలైన రోజు.*
*4. శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకొన్న రోజు.*
*5. వ్యాస మహర్షి “మహా భారతము”ను, వినాయకుని సహాయముతో, వ్రాయడం మొదలుపెట్టిన రోజు.*
*6. సూర్య భగవానుడు అజ్ఞాతవాసములో వున్న పాండవులకు “అక్షయ పాత్ర” ఇచ్చిన రోజు.*
*7. శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీమహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమింపబడిన రోజు.*
*8. ఆదిశంకరులు “కనకధారాస్తవం” ను చెప్పిన రోజు.*
*9. అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన రోజు.*
*10. ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారినుండి కాపాడిన రోజు.*

No comments:

Post a Comment

Yes, she has gained weight? Defeated without losing a bout.

అవును, ఆమె కొంచెం బరువు పెరిగే వుంటుంది. ఎందుకంటే…. ఆటల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచే నిండైన ఆత్మాభిమానాన్ని, విశ్వ వేదికపైనే కాదు వ...