హిందూ ధర్మం మరియు ఆచారాల యొక్క గొప్పతనం ఇప్పటికైనా ప్రపంచదేశాలకు మరియు దానిని అవహేళన చేసే వాళ్లకు తెలిసి వస్తుంది. నాకు తెలిసిన కొన్ని ప్రశ్నలు సమాధానాలు...
(హిందూ ధర్మం లో కూడా కొన్ని మూఢ నమ్మకాలు ఉన్నాయి నేను కాదనను)
Q1. మృతదేహాన్ని ఎందుకు కాలుస్తారు?
Ans: మృత దేహం లో కొన్ని వైరస్ లు బ్యాక్టీరియాలు ఉంటాయి. కాల్చేస్తే దాహనం అయిపోతాయి. పూడ్చి వేస్తే ఆ వైరస్ లు మట్టిలో కలిసి మళ్లీ మానవాళి మీద లేదా జంతువుల మీద లేదా మొక్కల మీద దాడి చేయవచ్చు. ఇప్పుడు కరోనా వైరస్ సోకి చనిపోయిన వారిని కూడా ఇలాగే కాల్చేస్తున్నారు...
Q2. కొత్త వ్యక్తులు కానీ ఇంట్లోని వారు కానీ బయటి నుంచి ఇంటికి వచ్చేటప్పుడు కాళ్లు మొహం చేతులు కడుక్కొని ఇంటిలోపలికి వస్తారు ఎందుకు?
Ans: మన శరీరం మీద దుమ్ము ధూళి కొన్ని ప్రాణాంతక వైరస్ లు చేరి ఉంటాయి. అలాగే ఇంటిలోపలికి వస్తే ఇంట్లో వారికి కూడా అవి అంటుకుంటాయి Eg: కరోనా వైరస్
Q3. తుమ్మినప్పుడు కొంచెంసేపు ఆగుతారు ఎందుకు?
Ans: తుమ్మిన వ్యక్తికి ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే.. ఆ వ్యక్తి శరీరంలో నుంచి కొన్ని వైరస్ లు లేదా బ్యాక్టీరియాలు బయటకు వచ్చి గాల్లో ఉంటాయి మనం వాటి గుండా వెళ్తే అవి మన శరీరం లోకి ప్రవేశిస్తాయి.. eg. కరోనా వైరస్ లాంటివి.
Q4. రెండు చేతులు జోడించి నమస్కారం ఎందుకు చేస్తారు?
Ans : ఇదేం పిచ్చి ప్రశ్న తెలుసు కదా!?
Q5. హిందువులు చాలా వరకు శాఖాహారం తింటారు. ఎందుకు?
(ఇప్పుడు చాలామంది మాంసాహారం తింటున్నారు)
Ans: ఎక్కువ వైరస్లు బ్యాక్టీరియాలు జంతువులను ఆవహించి ఉంటాయి. సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయలు ఆకుకూరలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.
Q6. హిందువులు యోగా ధ్యానం చేస్తారు ఎందుకు?
Ans: యోగా చేస్తే, శరీర ధారుఢ్యం ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ధ్యానం చేస్తే కాన్సెంట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి. మెదడు పీస్ ఫుల్ గా తయారవుతుంది.
Q7. భోజనం చేసేటప్పుడు ప్లేట్ చుట్టూ నీళ్లు చల్లుతారు ఎందుకు?
Ans: ప్లేట్ చుట్టూ ఉన్న dust ప్లేట్లోకి రాకుండా ఉంటుంది.
Q8. ఇంతకుముందు బ్రాహ్మణులు వైశ్యులు లాంటి వారు ఎవ్వరినీ ఇంటి లోపలికి రానిచ్చేవారు కాదు దీనినే అంటరానితనం అన్నారు. ఎందుకు?
Ans : శుభ్రత పరిశుభ్రత. మడి.
Q9. ఆవుపేడతో కల్లాపి చల్లి ఇంటిని అలుకుతారు. పసుపు గుమ్మానికి రాస్తారు. ఇంటి ముందు తులసి చెట్టును ఉంచుతారు. ఇంటి పెరటిలో వేప చెట్టును పెంచుతారు. ఎందుకు?
Ans : ఇవన్నీ యాంటీబయాటిక్ గా పనిచేస్తాయి.
Q10. వారానికి ఒకరోజు దేవుని పేరు చెప్పి ఉపవాసం ఉంటారు అంటే ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమి తినరు. ఎందుకు?
Ans: మన శరీరంలో ఆరు రోజులు తిన్న ఆహారం ఏమైనా అరగకుండా ఉంటే ఏడవ రోజు అది పూర్తిగా అరిగిపోతుంది. కడుపు ఖాళీ అవుతుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు డాక్టర్లు కూడా ఇదే చెబుతున్నారు.
Q11. మట్టి పాత్రలు ఆ తర్వాత రాగి పాత్రలు ఉపయోగించేవారు ఎందుకు?
Ans : మట్టిలో ఉన్న కొన్ని ఖనిజాలు సూక్ష్మ రూపంలో మన శరీరంలోకి ప్రవేశించుతాయి. అవి మన శరీరానికి ఎంతో అవసరం. రాగి పాత్రలో నీరు తాగితే డైజషన్ బాగా అవుతుంది. కరోనా వైరస్ కూడా రాగి పాత్ర మీద నాలుగు గంటల కంటే ఎక్కువ సమయం బ్రతకదు అని ఈమధ్యనే సైంటిఫిక్ గా రుజువు అయినది.
Q12. గుమ్మానికి మామిడి ఆకులు వేపాకులు కడతారు ఎందుకు?
Ans: ఇంటి లోపలికి వచ్చే గాలి ఆ ఆకులను తాకి లోపలికి వస్తుంది అది ఆరోగ్యానికి చాలా మంచిది.
Q13. హిందువులు అరటి ఆకులో భోజనం ఎందుకు చేస్తారు?
Ans: అరిటాకును పచ్చిగా ఉన్నపుడే ఉపయోగిస్తారు.పచ్చి ఆకులో ఆహారం తింటే తొందరగా జీర్ణమవుతుంది. అరిటాకులు దొరికితే దాంట్లోనే అన్నం తినడం శ్రేయస్కరం. ఆకుపచ్చని అరటి ఆకులో భోజనం చేయడం వల్ల కఫవాతాలు తగ్గిపోతాయి. శరీరానికి బలం చేకూరుతుంది. బాగా ఆకలివేస్తుంది. ఆరోగ్యం చక్కబడి శరీరానికి మంచి కాంతి వస్తుంది.
Q14. హిందువులు ఇంట్లో దీపం ఎందుకు వెలిగిస్తారు?
Ans : కాంతి జ్ఞానానికి సంకేతం, చీకటి అజ్ఞానానికి సంకేతము. అజ్ఞానాన్ని పారద్రోలి చైతన్యాన్ని ప్రసరింప చేయడమే ఆదర్శముగా దీపాన్ని వెలిగిస్తాము. జ్ఞానము మన అందరిలో నిబిడీక్రుతమయిన సంపద. ఆ సంపదకు ప్రణమిల్లడమే దీపం వెలిగించుటలో ఉన్న ఆంతర్యం. మనకున్న జ్ఞాన సంపద చేత మనము చేయు పనులు మంచివయిననూ, చెడ్డవయిననూ భగవంతునికి తెలియుటకు సాక్షిగా దీపాన్ని వెలిగిస్తాము.
Q15. పెళ్లి అయిన హిందూ మహిళలు కాలి వేలికి రింగ్స్ ఎందుకు ధరిస్తారు?
Ans: హిందూ మతంలో వివాహం అయిన మహిళల కాలికి తప్పనిసరిగా రింగ్స్ ఉంటాయి. ఇది కేవలం అలంకరణ కోసం కాదు. సాధారణంగా కాలి రింగ్ ను రెండవ కాలి వేలి మీద ధరిస్తారు. ఈ కాలి వేలి నరాలు గర్భాశయం మరియు గుండెకు నేరుగా కలుపుతుంది. రెండవ కాలి వేలికి రింగ్ ధరించటం వలన గర్భాశయం బలపడుతూ,ఋతు రక్త ప్రవాహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది.
Q16. నుదుటిపైన కుంకుమను ఎందుకు పెట్టుకుంటారు?
Ans: తిలకధారణ చేయటం అనేది ప్రతి ఇంట్లోనూ జరిగే సాధారణ పద్ధతి. నిజానికి నుదుటిపైన ఈ ప్రాంతంలో అజ్ఞా చక్ర ఉంటుందని చెబుతారు. ఈ విధంగా తిలకంను వర్తింపచేసినపుడు ఈ చక్రం స్వయంచాలకంగా యాక్టివేట్ అవుతుంది.ఇది శరీరం నుండి శక్తి నష్టంను నిరోధిస్తుంది. అలాగే ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది.
Q17. హిందువులు రావి చెట్టును ఎందుకు పూజిస్తారు?
Ans: రావి చెట్టు సాధారణంగా ఒక పనికిరాని చెట్టుగా పరిగణిస్తారు. దీనిలో ఉపయోగకరమైన పండ్లు లేదా శక్తివంతమైన కలప ఏమి ఉండదు. అయితే దీనిని చాలా మంది హిందువులు పూజిస్తారు. కానీ ఆసక్తికరంగా,రావి చెట్టు రాత్రి పూట ఆక్సిజన్ ఉత్పత్తి చేసే చెట్లలో ఒకటి.కాబట్టి, ఈ చెట్టును సురక్షితంగా ఉంచడానికి పవిత్రంగా గుర్తించబడుతుంది.
Q17. హిందూ అమ్మాయిలు పెళ్లప్పుడు గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు?
Ans: చేతులకు గోరింటాకు పెట్టుకొనుట డెకరేషన్ కోసమే కాకుండా అది ఒక శక్తివంతమైన ఔషధ హెర్బ్. సాదారణంగా వివాహ సమయములో వధువు ఒత్తిడితో ఉంటుంది. గోరింటాకు శరీరమును చల్లబరుస్తుంది ఒత్తిడిని తగ్గిస్తుంది. కాబట్టి చేతులకు కాళ్ళకు కూడా పెడతారు.
Q18. హిందువులు నేలపై కూర్చొని ఎందుకు భోజనం చేస్తారు?
Ans: మనం సాధారణంగా నేలపై సుఖాసనం యొక్క భంగిమలో కూర్చుని తింటూ ఉంటాము. ఈ భంగిమ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కాబట్టి,మనం సుఖాసనంలో కూర్చొని భోజనం చేస్తాము. అప్పుడు మనం తినే ఆహారం సులభంగా జీర్ణమవుతుంది.
Q19. హిందువులు సూర్యున్ని ఎందుకు పూజిస్తారు? Ans: ఎందుకంటే ఉదయాన్నే వచ్చే సూర్యు కిరణములు చాలా మంచివి. శరీరంలో డి విటమిన్ తయారవడానికి దోహదపడుతాయి. తొలి ఉదయం నడవటం కూడా మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
Q20. ఆలయంలో గంటను ఎందుకు మ్రోగిస్తారు?
Ans : ఆలయం గంటలను కాడ్మియం,జింక్, సీసం,రాగి,నికెల్,క్రోమియం,మాంగనీస్ వంటి వివిధ లోహాల మిశ్రంమతో తయారుచేస్తారు. ఒక దేవాలయ గంటను సృష్టించడానికి ప్రతి లోహంను ఒక నిష్పత్తిలో కలపటానికి దాని వెనక ఒక శాస్త్రం ఉంది. ఈ లోహాలను ప్రతి ఒక్కటి గంట మ్రోగే మార్గంలో కలుపుతారు. ప్రతి లోహం ఉత్పత్తి చేసే విభిన్న శబ్దం మీ ఎడమ మరియు కుడి మెదడు ఐక్యతను సృష్టిస్తుంది. అందువలన మీరు గంట మోగించినప్పుడు ఏడు సెకన్ల పాటు చురుకైన మరియు దీర్ఘకాల ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది. గంట నుండి వచ్చే ధ్వని యొక్క ప్రతిధ్వని శరీరం యొక్క మీ ఏడు హీలింగ్ కేంద్రాలు లేదా చక్రాలను తాకుతుంది. ఈ విధంగా గంట యొక్క ద్వని,మీ మెదడు కొన్ని సెకన్ల పాటు బ్లాంక్ అయ్యి మళ్లీ మీరు ట్రాన్స్ దశకు చేరుకుంటారు. ట్రాన్స్ లో ఉన్న ఈ స్థితిలో,మీ మెదడు గ్రాహక మరియు అవగాహన శక్తి బాగా పెరుగుతుంది.
హిందూ అనేది ఒక జీవన విధానం ఇది మతం కాదు.
చాలామంది ఈ జీవన విధానం నుంచి పాశ్చాత్య జీవన విధానంలో కి వెళ్తున్నారు. కానీ అతి త్వరలో హిందూ జీవన విధానానికి ఉన్న గొప్పతనం ప్రపంచ దేశాలు గ్రహిస్తాయి. ఇప్పటికే కొన్ని గ్రహించాయి కూడా..
No comments:
Post a Comment