శని శాంతి మంత్ర స్తుతి..!!🙏
ప్రతి శనివారం ఈ మంత్రాన్ని పఠిస్తే శని బాధ కలగదు.
ఈ మంత్రం వెనుక ఉన్న పురాణ గాథ ఇలా ఉన్నది.
నల మహారాజు రాజ్యభ్రష్టుడై బాధపడుతున్నప్పుడు అతనికి శనిదేవుడు కలలో కనిపించి
ఈ మంత్రం ఉపదేశించాడు.
ఈ మంత్రాన్ని పఠించిన నలమహారాజుకు తిరిగి
పూర్వ వైభవం కలిగింది.
క్రోడం నీలాంజన ప్రఖ్యం నీలవర్ణసమస్రజమ్
ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరమ్
నమో అర్కపుత్రాయ శనైశ్చరాయ నీహార
వర్ణాంజనమేచకాయ శ్రుత్వా రహస్యం భవకామదశ్చ
ఫలప్రదో మే భవ సూర్యపుత్రం నమోస్తు ప్రేతరాజాయ
కృష్ణదేహాయ వై నమః శనైశ్చరాయ కౄరాయ
శుద్ధబుద్ధి ప్రదాయనే
య ఏభిర్నామభి: స్తౌతి తస్య తుష్టా భవామ్యహమ్
మదీయం తు భయం తస్య స్వప్నేపి న భవిష్యతి
నవగ్రహాల్లో శని దోషం ఎక్కువ అపకారం కలిగిస్తుంది.
శని దోషం నుండి బయటపడేందుకు పైన ఉదహరించిన ''క్రోడం నీలాంజన ప్రఖ్యం..'' అనే శ్లోకాన్ని
11 సార్లు జపించి, తర్వాత కింది శ్లోకాన్ని
11 సార్లు జపించాలి.
శన్యారిష్టే తు సంప్రాప్తే
శనిపూజాంచ కారయేత్
శనిధ్యానం ప్రవక్ష్యామి
ప్రాణి పీడోపశాంతయే
ఈ రెండు శ్లోకాలను స్మరించడంతో బాటు,
నవగ్రహాలకు తైలాభిషేకం చేయాలి.
ఇలా చేయడంవల్ల శని దోష బాధితులకు వెంటనే సత్ఫలితం కనిపిస్తుంది.
స్వస్తి..!
No comments:
Post a Comment