Thursday, April 23, 2020

శ్రీ వెంకటేశ్వర స్వామి గడ్డం కింద కర్పూరం ఎందుకు

శ్రీ వెంకటేశ్వర స్వామి గడ్డం కింద కర్పూరం ఎందుకు )

తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోని మూలవిరాట్‌ గడ్డం కింద నిత్యం పచ్చ కర్పూ రంతో అలంకరిస్తారు. కారణమేమిటి? దీని వెనుక ఒక కథ ఉంది. స్వామి అలంకరణ కోసం పుష్ప నందన వనాన్ని పెంచాలని రామానుజాచార్యులవారు తన శిష్యుడు అనంతాళ్వార్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అనంతాళ్వార్‌ సతీమణి కూడా పాలు పంచుకుంది. ఆ సమయంలో ఆమె గర్భవతి. తవ్విన మట్టిని గంపలో తీసుకెళుతూ అలసి కింద పడిపోతుంది. దీనిని గుర్తించిన శ్రీనివాసుడు బాలుని రూపంలో ఆమెకు సాయపడతాడు. దైవకార్యంలో ఇతరులు ఎవరూ జోక్యం చేసుకోరాదని అనంతాళ్వార్‌ ఆ బాలుడిని కొడతాడు. అతడికి గడ్డంపైన దెబ్బ తగులుతుంది. బాలుడు అదృశ్యమైపోతాడు. తరువాత అనంతాళ్వార్‌ ఆలయానికి వెళ్లి స్వామిని దర్శించు కుంటాడు. స్వామివారి గడ్డం నుంచి రక్తం కారడం చూసి, తాను కొట్టిన బాలుడు శ్రీహరేనని గ్రహించి, రక్తం కారకుండా పచ్చ కర్పూరం పెడతాడు. అందుకే నేటికీ మూలవిరాట్‌ గడ్డం కింద పచ్చకర్పూరం పెట్టే సాంప్రదాయం కొనసాగుతున్నది.

***********************************************

No comments:

Post a Comment

Yes, she has gained weight? Defeated without losing a bout.

అవును, ఆమె కొంచెం బరువు పెరిగే వుంటుంది. ఎందుకంటే…. ఆటల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచే నిండైన ఆత్మాభిమానాన్ని, విశ్వ వేదికపైనే కాదు వ...