నువ్వుల నూనె తో దీపం పెట్టవచ్చా?
ॐ~🚩🚩
ఈ మధ్య నువ్వుల నూనె తో ఇంట్లో దీపారాధన చేయకూడదన్న వార్త బాగా వ్యాపించింది. ఇది పూర్తిగా తప్పు. నువ్వుల నూనె తో ఎక్కడైనా దీపారాధన చేయవచ్చు. మంచిది కూడా.
శనివారం రోజు శ్రీ ఆంజనేయ స్వామి వారికి, శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి నువ్వుల నూనె తో దీపం పెడితే శని గ్రహ దోషాలు, బాధలు తగ్గుతాయి.
సోమవారం రోజు శివభగవానునకు నువ్వుల నూనె తో దీపారాధన చేస్తే నవగ్రహ దోషాలు తగ్గిపోతాయి.
సర్ప దోషాలు పోవాలంటే మంగళ వారం రోజు సుబ్రహ్మణ్యస్వామి కి, లక్ష్మి నరసింహ స్వామి కి, మానసా దేవి కి నువ్వుల నూనె తో దీపారాధన చేయాలి.
నువ్వుల నూనె లో కొంచెం ఆవు నెయ్యి కలిపి దీపారాధన చేస్తే మరింత ప్రయోజనం ఉంటుంది
శెనగ నూనె తో దీపారాధన చేయకూడదు
No comments:
Post a Comment