కలియుగ వైకుంఠ నాథుడు తన భక్తులందరినీ నిలువు దోపిడీ చేస్తాడని అంటారు. అసలు నిలువు దోపిడీ అంటే ఏంటో తెలుసా, మన ఒంటిపై ఉండే నగనట్రా తీసుకుంటాడని కాదు. దీనికి వేరే అర్థం ఉంది. మనిషి ఆశాజీవి. మనిషిని అరిషడ్వవర్గాలు తన అధీనంలో ఉంచుకుంటాయి. అలాంటి వారిని ఉద్దరించడానికే స్వామివారు నిలువు దోపిడీ చేస్తారు.
ఈ నిలువు దోపిడీలో ఒంటి మీద నగలు కాదు మనిషిని పట్టిపీడిస్తున్న అరిషడ్వర్గాలను, అనంతమైన కోరికలను, శారీరక, మానసిక అశాంతిని, విబేధాలను, సంఘర్షణలను తొలగించుకుంటే ఒడిదొడుకులు లేని ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతాడు. అందుకు ఆ వేంకటపతి పాపాలను హరించి, మనిషిలోని సమస్త దోషాలను ప్రక్షాళన గావించి, దుర్గుణాలను నిలువు దోపిడీ చేస్తాడు. అడుగు దండాలవాడు మనిషిని శారీరకంగానూ, మానసికంగానూ ప్రక్షాళన చేసి పవిత్రంగా మారుస్తాడు. ఇదే నిలువు దోపిడీలోని అర్థం, పరమార్థం.
తిరుపతికి వెళ్లి స్వామివారికి తలనీలాలు సమర్పించుకుంటారు. తల నీలాలను సమర్పించుకున్న తర్వాత అందంగా లేమనే భావన కొందరిలో కలుగుతుంది. అందం శాశ్వతం కాదు, యవ్వనం క్షణభంగురం, జీవితం ఓ నీటిబుడగలాంటిదనే జీవిత సత్యాన్ని తెలియజేయడానికే ఆ కోనేటి రాయుడు మన తల నీలాలు తీసుకుంటాడు. దీన్ని కూడా నిలువు దోపిడీలోని ఓ అంశంగా పరిగణించాలి
No comments:
Post a Comment