Monday, May 25, 2020

అన్న0 పరబ్రహ్మ స్వరూపం నిర్లక్ష్యం చేయడం వల్ల భవిష్యత్ లో అన్నం దొరకదు మనం వృధాచేసే అన్నము పెడవానికి పెట్టి వాళ్ళ ఆకలి తీర్చండి🙏

🙏ఒక్క పల్లెటూరు లో ఒక్క హోటల్ ఉంది...
అక్కడకి ఒక్క సినిమా వాళ్ళు tv ఒక్క 40మంది
వచ్చారు అందరు వచ్చి రాగానే ఆ హోటల్ లో
జనం అంత చుట్టూ చూస్తున్నారు సినిమా
వాళ్ళని.
సినిమా వాళ్ళు ఎంతో గర్వం గా ఫీల్ అయపోతూన్నారు... అందరు హోటల్ లో
కూర్చుని ఉన్నారు ఇంతలో అక్కడికి డెరెక్టర్
గారు వచ్చారు...
అందరూ భోజనం చేస్తున్నారు. ఇంతలో డెరెక్టర్
గారు అక్కడ వాళ్ళందరిని చూస్తున్న ఒక్క తాతని
చూసాడు... చూడగానే ఎందుకో ఆ తాత అలా
చూస్తున్నాడు అని తెలుసుకుందాం అని తాత
ఇటురా అని పిలిచాడు...

ఏం తాతా భోజనం చేసావా అని అడిగాడు... తాత
చేసా బాబయ్య అని చెప్పాడు...

మరి ఎందుకు తాత ఇందాకటి నుంచి అక్కడ
కూర్చుని మా అందరిని చూస్తున్నావ్ సినిమా అంటే
నీకు ఇష్టమా అని అడిగాడు...??

అదేం లేదు బాబయ్య అని కొంచెం దీనంగా
మొహం పెట్టి చెప్పాడు...

మరి ఏంటి ఏమైనా
డబ్బు లు కావాలా ఏమన్నా ఉంటే
చెప్పు నేను సహాయం చేస్తా అని అడిగాడు...

అదేం లేదు బాబయ్య.. నేను ఒక్కటి అడగాలి
అనుకుంటున అడగనా బాబయ్య...??

సరే తాత అడుగు ఏంటో అని అన్నాడు...

మీరు ఇంత కష్టపడి సినిమా తీస్తారు కదా ఆ సినిమా
ఎవరేనా విడుదల అవ్వక ముందే పైరసీ చేస్తే
ఏం చేస్తారు బాబ్బయ్య...??

ఏముంది అలా చేసిన వాడిని జైల్లో పెడతాం.. ఇంకా లక్షలో జరిమానా వేస్తారు ఇవన్నీ నీకు ఎందుకు తాత అని అడిగాడు...??

అప్పుడు ఆ తాత మరి
ఎందుకు బాబు మీరు ఇంత కష్టపడి
సినిమాలు తీస్తున్నారు అని అడిగాడు...??

అప్పుడు డైరెక్టర్ ప్రజల కళ్ళల్లో
ఆనందం చూడటానికి అని చెప్పాడు గర్వంగా ...
అపుడు తాత అడిగాడు మీరు ఇంత మంది ఇక్కడ
భోజనం చేసారు కదా దాంట్లో అక్కడ చూడు చాల
మంది సగం అన్నంలో
చేతులు కడిగేసారు.అందుకే నేను అలా
చూస్తున్నా మిమల్ని అని అన్నాడు...

దానికి నీకు అంత బాధ ఎందుకు తాతా ఆ డబ్బులు నువ్వు ఎం కట్టట్లేదుగా.. అవి మా నిర్మాత కడతాడు అని వేలాకోలంగా అన్నాడు...

అపుడు ఆ తాత అన్నాడు... మీ సినిమా ఎవరో దోపిడీ చేస్తే మీరు వాళ్ళని జైల్లో పెట్టిస్తారు జరిమానా
కట్టిస్తారు... కానీ మేము పండించే పంట
దళారులు దోపిడీ చేస్తున్నా రాబందులు
మమల్ని పీక్కు తింటున్నా మేము ఎంతో జాగ్రత్తగా పంటని అమ్మలా చూసుకుని
పండిస్తాం బాబు ఎందుకో తెలుసా అన్నాడు...??

డైరెక్టర్కి ఏం చెప్పాలో తెలియక ఎందుకు అని
అడిగాడు...??

తాత చెప్పాడు కోట్లు ఉన్న కోటీస్వరుడు అయినా,
దిక్కు లేని వాడికి అయినా ఆకలి వేస్తుంది కోట్లు ఉన్న వాడు కొనుక్కు తింటాడు,దిక్కు లేని వాడు అడుక్కు తింటాడు... కానీ ప్రతి ఒక్కరు తిండి తినాలి.. ఆకలి తో ఉన్న వాడు ఎదో ఒక్కసారి అయినా మమల్ని గుర్తు చేసుకోకపోయినా
వాడి కడుపు లోని పేగులు గుర్తు చేసుకుంటయీ అని చెప్పాడు...

అందుకే బాబు ఇందాక మీరు సగం అన్నం లో
చేతులు కడుగుతూ ఉంటే నాకు బాధ కలిగి
చూసానే కానీ మీరు నాకు సహాయం చేస్తారు అని కాదు...
ఈ దేశం లో ప్రతి రోజు ఆత్మహత్య చేసుకుని చనిపోయే రైతు ఉన్నాడు కానీ నిర్మాత లేడు...
మీరు మా చావుల్ని ఎలాగో అపలేరు కనీసం
భోజనం చేస్తున్నపుడు అయినా ఎంత కావాలో అంత తిని మిగతాది వృధా చేయకండి బాబు...

ఈ విషయం మీకు ఎందుకు చెపుతున్నా అంటే
మద్యపానం ఆరోగ్యానికి హానికరం...
ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని
సినిమాలో వేస్తారు.. అలాగే ఎక్కడో ఒక్క చోట
అన్నం వృదా చేయటం వల్ల ఒక్క మనిషి కి
అన్నం లేకుండా పోతుంది అని చెప్తారు అని
బాబు అంతే అని చెప్పి వెళ్ళిపోయాడు🙏

రోజు అన్నం లేక ఎంత మంది చనిపోతున్నారో
ఇక్కడ ఎంత మంది కి తెలుసు...??? మనకి
భోజనం సమయానికి వస్తుంది కాబట్టి మనకి
తెలియట్లేదు.. అదే రాకపోతే ఆ బాధ ఏంటో
తెలుస్తుంది... తినే వాడికి ఏం తెలుసు వండే వాడి బాధ,పండించే వాడి
ఆవేదన..........!!!
ఆ0తె కాదు ఎప్పుడు అన్న0 పరబ్రహ్మ స్వరూపం నిర్లక్ష్యం చేయడం వల్ల భవిష్యత్ లో అన్నం దొరకదు మనం వృధాచేసే అన్నము పెడవానికి పెట్టి వాళ్ళ ఆకలి తీర్చండి🙏🙏🙏🙏🙏🙏

🙏ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే మిమ్మల్నీ కాపాడుతుంది🙏

No comments:

Post a Comment

Jamalapuram Sri Venkateswara Swamy Temple జమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయం Telangana Tirupati, Khammam District

The road access to the temple is very good, and you can easily reach it in your own vehicle. Parking is not a concern as you can park comfor...