Saturday, May 23, 2020

మంగళ చండికా స్తోత్రం, ప్రయోజనాలు

మంగళ చండికా స్తోత్రం, ప్రయోజనాలు

కుజుడికి మంగళుడు అనే పేరు కూడా వుంది. ఏ కుజగ్రహ దోషం వలన అంతా నానా అవస్థలు పడుతున్నారో ... ఏ కుజుడి అనుగ్రహం కోసం అంతా నానాప్రయత్నాలు చేస్తున్నారో ఆ కుజుడు పూజించే అమ్మవారే 'మంగళచండీ దేవి'.
మంగళవారం రోజున మంగళుడు పూజించిన కారణంగా ఆ తల్లి మంగళ చండీగా ప్రసిద్ధి చెందింది. మంగళుడి ఇష్టదైవాన్ని ఆరాధించడం వలన ఆయన కూడా తొందరగా అనుగ్రహిస్తాడు. ఇక మంగళుడే కాదు ... సాక్షాత్తు పరమశివుడు కూడా ఆమెను ఆరాధించాడు. మంగళవారం రోజున ఉపవాస దీక్ష చేపట్టి, మంగళ చండీని పూజించవలసి వుంటుంది. ఈ విధంగా చేయడం వలన ఆ తల్లి అనుగ్రహం వెంటనే లభిస్తుంది. సమస్త దోషాలు తొలగిపోయి, శుభాలు చేకూరతాయి. కాబట్టి కుజదోషం వున్నవారు అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించడం వలన, సత్వరమే సత్ఫలితాలను సాధించి సంతోషంగా ఉంటారని చెప్పవచ్చు. కుటుంబ క్షేమానికి మంగళచండీ స్తోత్రం త్రిపురాసుర సంహారానికి ముందు తొలుత మంగళచండీని పూజించినవాడు శివుడు. ఆపై అంగారక గ్రహం, ముచ్చటైన మూడవ మంగళ పూజను మహేంద్రుడూ, నాలుగో పూజను దేవతలూ చేశారు. ఈ పూజ చేసిన వారికి శత్రుభీతిపోవటంతోపాటు కుటుం బమంతా మంగళకరంగా ఉంటుంది. బ్రహ్మదేవుడు స్వయంగా శివునికి ఉపదేశించిన పూజ విధానం శ్రీ దేవి భాగవతంలో ఉంది.

మంగళ చండి స్తోత్రంను మంగళవారం పఠిస్తే కుజగ్రహ దోషాలు తొలగిపోయి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. మంగళవారం కుజహోరలో దేవికి నేతితో దీపమెలిగించి ఈ మంత్రాన్ని పఠిస్తే వ్యాపారాభివృద్ధి, ఆర్థిక వృద్ధి చేకూరుతాయని పండితులు అంటున్నారు. శత్రు పీడలు, ఋణభాదలు, వాహన ప్రమాదాల నుండి రక్షణ,కోర్టు సమస్యలు, సంసారంలో గొడవలు, అనారోగ్య సమస్యలు, కోపం, అగ్ని ప్రమాదాల బారి నుండి రక్షణ మొదలగు కుజ గ్రహ దోషాలకు మంగళ చండీ స్తోత్ర పారాయణం ప్రతి మంగళవారం పఠించటం మంచిది.

శ్రీ మంగళ చండికా స్తోత్రం
ధ్యానం : 
దేవి శోడష వర్మియామ్ సుస్త్ర యవ్వనామ్ 
బింబోక భీమ్ సుదతీమ్ సుద్దామ్ శరత్ పద్మ నిభాననామ్ శ్వేత సంపక వర్ణామ్ సునీ లోత్భల లోసనామ్ 
జగతాత్రీమ్ సదాత్రీమ్ చ సర్వేభ్యః సర్వ సంపదామ్. సంసార సాగరే కావే జ్యోతి రూపాం సదాభజే దేవాస్య చ ద్యాన మిత్యవమ్ స్థవానమ్ సృయతామునే.
 
శ్రీ మహాదేవ ఉవాచ:- 
రక్ష రక్ష జగన్మాత దేవి మంగళ చండికే 
హారిక విపతాం రాసేః హర్ష మంగళ కారికే.
 హర్ష మంగళ దాక్షిణ్య హర్ష మంగళ దాయికే
 శుభమంగళై దాక్షిణ్య శుభమంగళ చండికే. 
మంగళం మంగళార్ హోచ సర్వ మంగళ మంగళే 
సతాం మంగళతె దేవీం సర్వేషామ్ మంగళాలయే 
పూజ్య మంగళవారే మంగళాభీష్టదేవతే పూజ్యే
 మంగళ వషస్స మనోవంశస్య సంతతామ్ మంగళాతిష్ఠాత్రు దేవీ మంగళానామ్ చ మంగళే సంసార మంగళాధారే మోక్ష మంగళ దాయిని
సారేచ మంగళా తారే పారేచ సర్వ కర్మనామ్
ప్రతి మంగళవారేచ పుణ్యే మంగళ సుఖప్రాప్తే.
     🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
-

No comments:

Post a Comment

Jamalapuram Sri Venkateswara Swamy Temple జమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయం Telangana Tirupati, Khammam District

The road access to the temple is very good, and you can easily reach it in your own vehicle. Parking is not a concern as you can park comfor...