" కుక్క కాటుకు చెప్పు దెబ్బ ." అనే సామెత వచ్చింది .
కాని వాస్తవంగా ఆ సామెత
" కుక్క కాటుకు చేప దిబ్బ ". ట
ఎలా అంటే నీటిలో నివసించే చేప గట్టున ఉండే ఒక గరిక పై తన గుడ్లను పెట్టి కేవలం తన కంటి చూపుతోనే పొదిగి ఆ గుడ్లను పిల్లలను చేస్తుందట.
చేప అలా గుడ్లలను పెట్టే ఆ గరికను చేప దిబ్బ అని పిలుస్తారుట.
అలా చేప ఒడ్డున గుడ్లను పెట్టే ఆ గరికను కుక్క కాటు నివారణకు వైద్యానికి మందుగా తయారు చేయడానికి మన పూర్వికులు వాడేవారుట.
అందువలన " కుక్క కాటుకు చేప దిబ్బ " అనే సామెత వచ్చిందిట.
అంతే కాని " కుక్క కాటు కు చెప్పు దెబ్బ " అనే సామెత నిజం కాదట.
వాస్తవానికి కుక్క కనుక కరిస్తే బొడ్డు చుట్టూ ఇంజక్షన్స్ చేయించుకోవాలే తప్ప చెప్పుతో దెబ్బలు కొట్టించుకుంటే దవడలు వాచిపోతాయే తప్ప కుక్క కాటుకు చెప్పు దెబ్బ వైద్యంకాదు.
-- భక్తి T. V. వారి కోటి దీపోవత్సవములో ద్వి సహస్రావధాని శ్రీ గరికపాటి నరసింహారావు గారి ప్రవచనము నుండి.
No comments:
Post a Comment