పేరులో అక్షరం మారితే జాతకం మారుతుందా?
న్యూమరాలోజి మాట ఎలాగా ఉన్న టీవీ చానెళ్లలో కనిపిస్తుఉన్న ప్రకటనలు పట్ల అప్రమత్తం గా ఉండండి.
వైద్యుడు తేడా ఉన్నంత మాత్రాన వైద్య శాస్త్రం తప్పు కాదు కదా . అలాగే జ్యోతిషం తప్పు కాదు చూసే వ్యక్తులు మద్య ఉంటుంది సరే ఇప్పుడు జ్యోతిషం గురించి పక్కకు పెడతాను టీవీ చానెళ్లలో వచ్చే న్యూమరాలోజి కోసం చెపుతాను
"మీ పేరులో ఒక దుష్టాక్షరం ఉంది. అందుకే మీరు ఏది తలపెట్టినా జరగడంలేదు. మీ పేరులో ఒక్క అక్షరాన్ని మార్చుకుంటే చాలు మీరు ఏది ముట్టుకున్నా బంగారమవుతుంది"ఇలా చెప్పే జ్యోతిష్కులు చాలామంది టీవీ చానెళ్లలో కనిపిస్తున్నారు అసలు
పేరులో ఒక అక్షరం మార్చుకున్నంత మాత్రాన జీవితం బాగుపడిపోతుందా, కష్టనష్టాలనుంచి అవలీలగా బయటపడగలుగుతామా అని క్షణకాలం ఆగి ఆలోచించాలి. తన పేరే ఉన్నవారు అంతా తమలానే ఇబ్బందుల్లో ఉన్నారా అని ఆలోచించాలి, వారిలో ఎంతమంది మంచి స్థితిలో ఉన్నారో చూడాలి. వ్యాపార కాంక్షతో ఉన్న సంస్థలు ప్రజల బలహీనత ను ఆసరాగా చేసుకొని చెప్పే మోసపూరిత మాటలు గమనించండి.
జ్యోతిషం శాస్త్రమా కాదా అన్న చర్చలోకీ లోతుగా వెళ్ళనవసరం లేదు.జ్యోతిషం చెప్పు వ్యక్తి వాక్సుద్ధి ని బట్టి కొద్ది వ్యత్యాసం ఏ ఇద్దరు జ్యోతిష్కులు మద్య నా మాట కలవడం కుదరదు . శాస్త్రం కరెక్టే అయిన చెప్పేవాడు సరయినవాడు ఉండాలి .
No comments:
Post a Comment