🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘
_*👌*ఆస్తి పాస్తులు, డబ్బు డాబాలు, బంగారం భూములు పంచిన వాడు మాత్రమేనా తండ్రంటే?**_👌
_**ఈమధ్య మా పెదనాన్న కొడుకు తన కూతురు పెళ్లి చేస్తూ ఆ పెళ్లికి బంధువులను పిలవడానికి పెళ్లి పిలుపులకు నన్ను తోడుగా రమ్మన్నాడు. ఇద్దరమూ కలిసి పెళ్లి పిలుపులకోసం ఒక ఊరిలో మా దూరపు బంధువుల ఇంటికి వెళ్ళాము. అతడు ఒక పెద్ద ఆఫీసర్ గా పనిచేస్తూ సుమారు మూడు లక్షల రూపాయలు పైనే "నెల జీతం" సంపాదిస్తున్న పెద్ద హోదా కలిగిన అధికారి. ఇక ఆయన భార్య కూడా నెలకు దాదాపు రెండు లక్షల రూపాయల జీతం వచ్చే ఉద్యోగం చేస్తున్న అధికారిని. ఆయన ఇద్దరి కొడుకులు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ వారు కూడా నెలకు లక్షలకు లక్షలు సంపాదిస్తున్నారు.*_
_**కుశల ప్రశ్నలు, క్షేమ సమాచారాలు, పెళ్ళి పిలుపులు అయిన తరువాత నా కళ్ళు మరో వ్యక్తి కొరకు వెదుక్కుంటున్నాయి. అది ఆ అధికారి తండ్రి కొరకు, ఆయన ఎప్పుడు ప్రొద్దుటూరు వచ్చినా తప్పని సరిగా మా ఇంటికి వచ్చి మా నాన్నగారిని కలిసి అన్నగారు బావున్నారా అంటూ ఎంతో ఆప్యాయంగా, ప్రేమతో పలుకరించేవారు. దాదాపు పది సంవత్సరాలుగా ఆయన కనిపించట్లేదు.*_
_**ఇక ఉండబట్టలేక అడిగేశాను, మీ ఫాదర్ కనిపించట్లేదు అని. ఆ మాటవిన్న వెంటనే అతడి ముఖం కర్కశంగా తయారైంది. ఆ దౌర్భాగ్యుడి గురించి నన్ను అడగకండి, ఆస్తి పంపకాలలో నాకు ద్రోహం చేసిన ద్రోహి అంటూ ఆవేశంగా అనేక రకాల తిట్లు తిడుతూ తన గదిలోకి వెళ్లి పోయాడు. పరిస్థితిని గమనించిన మేము మెల్లగా అక్కడినుండి బయలుదేరి బయటకు వస్తున్న మాకు ఆ ఇంటి పనిమనిషి ఎదురైంది.*_
_**ఉండబట్టలేక ఆమెతో ఆ పెద్దాయన గురించి వివరాలు అడుగగా ఆయన గత పది సంవత్సరాలుగా ఊరి బయట ఉన్న అనాధ శరణాలయంలో ఉన్నట్లు తెలిసింది. ఆయన వయసు సుమారు 83 సం ఉండవచ్చు, ప్రస్తుతం ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో అనుకుంటూ, నేరుగా అక్కడికెళ్లి ఆయనను కలిశాను. నన్ను చూడగానే ఆయన మొహంలో వెలుగు సూర్యకాంతి వలే ప్రకాశించింది. వెయ్యేనుగుల బలాన్ని పొందినట్లుగా ఎంతో ఉత్సాహంతో నడుచుకొంటూ వచ్చి అమాంతం నా పైన ఒరిగిపోయి నన్ను కౌగలించుకొని కన్నీరు కారుస్తూ నాయనా ! మా అన్నగారిని కలిసినట్లుగా ఉందంటూ ఆనందంతో ఉప్పొంగి పోయాడు.*_
_**బాబాయ్ గారు ఎలా ఉన్నారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగినందుకు ఆయన కళ్ళు చమర్చగా "అందరూ ఉండికూడా గత పది సంవత్సరాలుగా అనాధగా బ్రతుకుతూ తను అనుభవిస్తున్న నరకయాతనల గురించి ఆయన మాటల్లో వింటుంటే పగవాడికి కూడా ఇలాంటి దుస్థితి రాకూడదు అనుకుంటూ ", నా పూర్తి వివరాలను ఆయనకు వ్రాయించి ఇచ్చి బయలు దేరబోతున్న నన్ను మరొకసారి ముద్దాడి నాయనా మీ అమ్మ నాన్నలు అదృష్ట వంతులు ఒక్క పైసా కూడా నీకు పంచలేకపోయినా, నీకు ఉద్యోగం, వ్యాపారం లేకపోయినా వారు నిర్వర్థించవలసిన కార్యక్రమాలను నీ బాధ్యతగా నిర్వహించి వారికి ఏ కష్టమూ కలుగకుండా నీవు వారిని పువ్వుల్లో పెట్టుకుని చూసుకొంటున్నావు. నీవు నిజంగా ధన్యజీవివి నాయనా అంటూ ఆశీర్వదించాడు. అక్కడ నుండి తిరిగి వచ్చిన నాకు ఆ కుటుంబ సభ్యులలో మార్పు తేవాలన్న బలమైన సంకల్పం ఏర్పడింది.*_
_**వెంటనే ఒక కథను టైప్ చేసి ఆ కుటుంబ సభ్యుల అందరి వాట్సాప్ నెంబర్లకు పంపించాను. పది రోజుల తర్వాత బాబాయ్ గారి దగ్గర నుండి ఫోన్ వచ్చింది. ఆయన ఆనందానికి అవధులు లేవు. నాయనా నీవు వచ్చి పోయిన వారం రోజుల తరువాత ఏ దేవుడి వరమోఏమో గాని నాకొడుకు కోడలు మనవళ్ళు వచ్చి నన్నేంతో గౌరవంగా ఇంటికి తీసుకొచ్చారు. వచ్చిన వెంటనే నా మనవడికి నీ ఫోన్ నెంబర్ ఇచ్చి ఫోన్ చేస్తున్నాను అంటూ చెబుతున్న ఆయన మాటల్లోనే ఎక్కడ లేని ఆనందాన్ని చూశా... మనసులోనే నాకు జ్ణానాన్ని ప్రసాదించిన ఆ మహా గురువులకు మనసా వాచా కర్మణా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను.*_
_**ఆ కుటుంబ సభ్యులలో అంతలా మార్పు తెచ్చిన ఆ కథను మీ ముందుంచుతున్నాను.. అమరావతిలో రాజధాని వచ్చిన తర్వాత వెంకటేష్ అనే అతడు తక్కువ సమయంలో విజయవాడలో రియలెస్టేట్ వ్యాపారంలో కోట్లు సంపాదించిన వారిలో ఇతనొకడు. ఒకసారి గుంటూరుకు దగ్గర లోని ఒక పల్లెలో ఒక పొలం తక్కువధరకు వస్తోందని తెలిసి ఆ ఊరికి కారులో వెళ్ళి, అది చూసుకొని తిరిగి ఇంటికి వస్తున్నాడు వెంకటేష్. కారు అకస్మాత్తుగా ఆగిపోయింది. వెంకటేష్ ఎంతగా ప్రయత్నించినా అది స్టార్ట్ కాలేదు.*_
_**మండుటెండలో ఆదారిలో ఎవరైనా వస్తారేమో అని కొద్దిసేపు వేచి చూశాడు. కానీ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది, ఎవరూ రాకపోవడంతో విధిలేక కారు లాక్ చేసి నడుచుకొంటూ కొంతదూరం వెళ్ళాక నాలుగు రోడ్ల కూడలిలో ఒక సోడా బంకు కనిపించింది. వెంకటేష్ కు దాహం వేస్తున్నది. ఆ సోడ బంకు వ్యక్తితో తాగడానికి ఒక చల్లని సోడా ఇవ్వమని అడిగాడు. అతను వెంకటేష్ కు తాగేందుకు సోడా ఇచ్చి అతని వివరాలను అడిగాడు.*_
_**వెంకటేష్ తానేందుకు అక్కడకు వచ్చాడో తిరిగి ఎక్కడికి వెళ్లాలో అడ్రస్ చెప్పగానే మీ నాన్నగారి పేరు ధర్మారావు గారు కదా అని అడిగాడు. అవుననగానే అతను ఎంతో అభిమానంగా “నువ్వు ఆ మహానుభావుడి కొడుకువా ఇలా నీడలోకి వచ్చి కూర్చోండయ్యా” అని అన్నాడు. “మీరు ఇక్కడే ఉండండి, నేను ఊర్లోకి వెళ్ళి కారు రిపేరు చేయడానికి మెకానిక్ ను పిలుచుకొని వస్తాను “అని సైకిల్ తీసుకొని వెంటనే ఊర్లోకి వెళ్ళి, పది నిమిషాలకు ఒక మెకానిక్ ను వెంటబెట్టుకొని అక్కడికి వచ్చాడు.*_
_**సైకిల్ తొక్కడం వల్ల పట్టిన చెమటలు తుడుచుకుంటున్న ఆ వ్యక్తి వైపు వెంకటేష్ ఆశ్చర్యంగా చూస్తూ, అవును “మా నాన్న గారు మీకెలా తెలుసు? నా పని కోసం నీ వ్యాపారాన్ని కూడా వదిలి ఎందుకు వెళ్ళారు? ” అని అడిగాడు. దానికి అతను, “కొన్నేళ్ళ క్రితం నా కూలింగ్ మిషన్ రిపేరి కొరకు మీ ఏరియాకు దగ్గరగా ఉన్న ఆటోనగర్ లో మెకానిక్ దగ్గరకు వచ్చి రిపేరు అయిన కూలింగ్ మిషన్ ని రాత్రి పూట సుమారు పదకొండు గంటల పైనే ఆటోలో తీసుకొస్తున్న సమయంలో మీ ఇంటి ముందే ఆటో టయర్ పగిలిపోవడం వల్ల వచ్చిన శబ్దానికి మీ నాన్న గారు బయటకు వచ్చి స్టేప్నీ టయర్ లో కూడా గాలి లేక అవస్థలు పడుతున్న మిమ్మల్ని గమనించి అప్పటికే పడుతున్న వర్షం తీవ్రకావడంతో మమ్మల్ని ఇంటి వసారాలోకి పిలిచి కూర్చోమన్నాడు.*_
_**నేను ఉదయం నుండి కూలింగ్ మిషన్ సామాను కొరకు తిరిగి తిరిగి అలసిపోయి ఉన్నాను. మధ్యాహ్నం కూడా భోంచేయలేదు "సమయం లేక కాదు డబ్బు లేక ". ఆకలి కావడంతో, నాకు కళ్ళు తిరిగినట్లుగా అనిపించి అక్కడే ఒక చోట కూలబడ్డాను. నన్ను చూసిన మీ నాన్నగారు వెంటనే మీ ఇంట్లోనే నాకు కడుపు నిండా అన్నం పెట్టించాడు. ఆ రాత్రి పడుకోవడానికి నాకు వసతి కల్పించారు. ఆయన దేవుడయ్యా, నా జీవితాంతం ఆయనని నేనెప్పటికీ మరువలేనయ్యా“ అని అన్నాడు.*_
_**ఇది విన్న వెంకటేష్ కి కొద్దిసేపు నోట మాటలు రాలేదు. ఎప్పుడో మా నాన్నగారు ఒక్కసారి అన్నం పెట్టి పడుకోవడానికి చోటు కల్పించిన విషయాన్ని ఇంకా ఇప్పటికీ గుర్తు పెట్టుకొని మా నాన్న గారి పైన ఇతను ఇంతగా ఆప్యాయతను చూపుతున్నాడే మరి అలాంటి తండ్రిని తనేం చేశాడో అనేది తలుచుకొని ఉద్వేగానికీ లోనయ్యాడు. ఇంటికి వచ్చినా తన తండ్రి పైన "అతని కృతజ్ఞతా భావాన్ని తలుచుకుంటూ, ఆ రోజు రాత్రంతా వెంకటేష్ కు అదే ఆలోచనతో నిద్ర పట్టలేదు. ఇంతలో తన ఏసీ రూమ్ లో తనతో పాటు తన పక్కనే పడుకొన్న తన పెంపుడు కుక్క మూలుగు విని ఆతురతతో దాన్ని నిమిరిన అతడిలో ఆలోచన రేగింది ఈ కుక్క కోసం తాను కల్పిస్తున్న సౌకర్యాలలో, దానికోసం పెడుతున్న ఖర్చులో కేవలం పదిశాతం కంటే ఎక్కువ ఖర్చు కూడా కాదు కదా తన తండ్రికి తాను పెట్టే ఖర్చు అని అనిపించింది..*_
_**ఏ సంబంధమూ లేని “ఎవరో బయట వ్యక్తి మా నాన్నగారు ఒక్క పూట అన్నం పెట్టి విశ్రాంతి తీసుకోవడానికి ఒక్క రాత్రి చోటు ఇచ్చిన ఆ పనిని గుర్తుంచుకొని దానికి కృతజ్ఞతగా నన్ను అంతలా ఆత్మీయంగా చూసుకున్నాడే, ఒక వీధి కుక్కకు ఒకపూట అన్నం పెడితే తరువాత కనిపించిన ప్రతి సారి విశ్వాసంతో తోకాడిస్తూ మన కాళ్ళచుట్టూ తిరుగుతూ విశ్వాసం చూపిస్తుందే. మరి నా చిన్నప్పటి నుండి మానాన్న గారు నా ఆకలి తీర్చడం కోసం నాకు ఎన్ని సార్లు అన్నం పెట్టాడో, నా సుఖం కోసం ఎన్నోరకాల సౌకర్యాలను నాకు కల్పించడం కోసం ఎన్నెన్ని కష్టాలూ పడి నన్నీ స్థితిలోకి తీసుకువచ్చాడో అలాంటి నా కన్నతండ్రిపైన నేను ఎలాంటి విశ్వాసం చూపించాను, కనీసం ఒక వీధి కుక్క చూపించే విశ్వాసం, కృతజ్ఞత కూడా చూపించకుండా నిర్దాక్షిణ్యంగా ఆయనను అనాధ ఆశ్రమంలో వదిలి ఎంతటి తప్పు చేసాను” అని వెంకటేష్ తీవ్రంగా మదనపడ్డాడు. పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. వెంటనే ఆశ్రమానికి వెళ్ళి తన తండ్రిని ఇంటికి తీసుకువచ్చి, చేసిన తప్పుకు క్షమించమని పాదాల మీద పడి వేడుకున్నాడు.*_
_**మిత్రులారా ! ఇవేవీ అభూత కల్పనలు కాదు. నా జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనలు. ఈ కథే మా బంధువులకు కనువిప్పు కలిగించింది. మరి మీకు తెలిసిన వారికి ఈ కథను పంపండి. ఏ ఒక్కరు మారినా మీ జన్మధన్యమే కదా.. చివరగా నేను చెప్పేదేమిటంటే "తల్లిదండ్రులు నాకేమి పంచిచ్చారని కాకుండా, ఇంత గొప్ప జన్మనిచ్చిన వారిని నీవెలా చూసుకొంటున్నావనేదే ముఖ్యమైన అంశం " అని తెలుసుకోండి. దయచేసి ఎవ్వరూ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకండి.. అలాగే "తల్లిదండ్రులను చక్కగా చూసుకొంటున్న వారికి నేను నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ, ఈ కథనాన్ని వారికి అంకితమిస్తున్నాను "...*_
_**సర్వే జనా సుఖినోభవంతు.**_
No comments:
Post a Comment