*ఆచార్య సద్భావన*
ఆత్మప్రకాశమార్గంలో ప్రయాణిస్తే తప్ప మన జీవితం సురక్షితం కాదు.
ప్రపంచంలోని వజ్రాలు, కెంపులు అన్నింటికన్నా పవిత్రమైన ఆలోచన విలువైనది. ఎందుకో తెలుసా, అది మన అంతర్గత జీవితాన్ని కాంతివంతం చేసి దాని విలువైన ప్రశాంతిని మనపై వర్షిస్తుంది గనుక.
మన దృష్టినంతా బాహ్యప్రపంచంపై కేంద్రీకరిస్తే కలత చెందడం, గందరగోళ పరిస్థితుల్లో చిక్కుకోవడం మినహా మరేమీ జరగదు. దీని ఫలితంగా మనస్సుని మన వశంలో ఉంచుకోవడం కూడా సాధ్యపడదు. అందువల్లనే దృష్టిని అంతర్ముఖం గావించాలి.
ప్రతీ వ్యక్తీ ప్రతీ రోజూ కొంత సమయం కేటాయించుకుని అంతరంగశోధన చేయాలి, అప్పుడు ఏ విధమైన అలజడులు మిగలవు.
సాధారణంగా అందరూ తమ ఆలోచనలకు, భావాలకూ పరిష్కారం బాహ్యప్రపంచపు తళుకుబెళుకులలో లభిస్తాయనే భ్రాంతిలో వెతుకులాడతారు.
అయితే దాని వలన శారీరకంగా, మానసికంగా క్రుంగుబాటు తప్ప మరేమీ లభించదు.
==============================
No comments:
Post a Comment