Friday, December 27, 2019

*మానవుడు నిత్యమూ అచరించవలసిన ధర్మములు ?*



*మానవుడు నిత్యమూ అచరించవలసిన ధర్మములు ?**

*1. పిల్లలకు పుట్టు వెంట్రుకలు ఎప్పుడు తీయాలి?*

జ. పిల్లలకు ‘9 ‘ వ నెలలో కాని, ’11 ‘వ నెలలో కాని, ‘3 ‘వ సంవత్సరం లో కాని తీయవలెను. 

*2. పిల్లలకు అన్నప్రాసన ఎన్నో నెలలో చేయాలి ?*

జ. ఆడ పిల్లలకు ‘5 ‘ వ నెలలో, మగ పిల్లలకు ‘6 ‘ వ నెలలో అన్న ప్రాసన చేయాలి. 

*6 నెల 6వ రోజున ఇద్దరికీ పనికివస్తుంది.*

*3 .పంచామృతం, పంచగవ్యములు అని దేనిని అంటారు   ?*

జ. ఆవు పాలు,ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, వీటిని  పంచామృతం అని,
ఆవు పాలు,ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పేడ, ఆవు మూత్రము, వీటిని పంచగవ్యములు అంటారు.

*4. ద్వారానికి అంత ప్రాముక్యం ఎందుకు ఇస్తారు?*

జ. ద్వారానికి పైనున్న కమ్మి లక్ష్మి స్వరూపము, అందుకే దానికి మామిడి తోరణం కడతారు.  క్రింద కమ్మి పవిత్రమైనది, కనుక దానికి పసుపు రాస్తారు.  శాస్ర పరంగా చెప్పాలంటే గడప కు పసుపు రాయడం వల్ల క్రిమి కీటకాలు, విష పురుగులు ఇంట్లోకి రాకుండా ఉండటానికి అనుకోవచ్చు.

*5. తీర్థాన్ని  మూడుసార్లు తీసుకుంటారు. ఎందుకు?*

జ. తొలితీర్థము  శరీర శుద్ధికి,శుచికి…రెండవ తీర్ధం ధర్మ,న్యాయ ప్రవర్తనకు …మూడవ తీర్ధం పవిత్రమైన పరమేశ్వరుని పరమ పదము కొరకు.

*6. తీర్థ మంత్రం*

జ. అకాల మ్రుత్యుహరణం సర్వవ్యాది నివారణం  సమస్త పాప శమనం విశ్నుపాదోధకం శుభం .

*7.  స్నానము ఎలా చేయ వలెను?*

జ. నది లో ప్రవహమునకు ఎదురుగ పురుషులు, వాలుగ స్త్రీలు  చేయవలెను.
చన్నీటి స్నానము శిరస్సు తడుపుకొని, వేడి నీటి స్నానము పాదములు తడుపుకొని ప్రారంబించ వలెను.
స్నానము చేయునపుడు దేహమును పై నుండి క్రింద కు రుద్దు కొనిన కామేచ్చ పెరుగును.  అడ్డముగా రుదుకోనిన కామేచ్చ నశించును.
సముద్ర స్నానము చేయునపుడు బయట మట్టి ని లోపలి వేయవలెను. నదులలో,కాలువలు,చెరువులలో చేయునపుడు లోపల మట్టిని ముమ్మారు బయట వేయవలెను.

*8. ఏ ప్రదేశాల్లో జపం చేస్తే ఎంత ఫలితము ఉంటుంది?*

జ. గృహంలో ఎంత చేస్తే అంత ఫలితం ఉంటుంది. నది ప్రాంతంలో చేస్తే రెట్టింపు ఫలితం వస్తుంది. 
గోశాలలో చేస్తే వంద రెట్లు, యాగశాలలో అంతకు మించి ఫలితం వస్తుంది. పుణ్య ప్రదేశాల్లో,
దేవాతా సన్నిదిలోను చేస్తే పదివేల రెట్లు వస్తుంది. శివసన్నిదిలో చేస్తే మహోన్నతమైన ఫలం వస్తుంది. పులి తోలు మీద కుర్చుని జపిస్తే మోక్షం కలుగుతుంది. అలాగే వెదురు తడక మీద కుర్చుని జపం చేస్తే దరిద్రం ఆవహిస్తుంది.
రాతి మీద కుర్చుని జపిస్తే రోగాలు వస్తాయి. నేల మీద కూర్చొని చేస్తే దుఖము, గడ్డి మీద చేస్తే కీర్తి నాశనం అవుతుంది.

*9. పూజగది తూర్పు ముఖంలో ఉండాలని ఎందుకు అంటారు?*

జ. తూర్పునకు అధిపతి ఇంద్రుడు, ఉత్తరానికి అధిపతి  కుబేరుడు. అందుకే పూజగది తూర్పుముఖంగా కాని, ఉత్తరముఖం గా కాని ఉండాలని అంటారు. దక్షిణానికి అధిపతి యముడు. అందుకే దక్షిణ ముఖం గా ఉండకూడదని అంటారు.

*10. ఏ ఏ సమయాల్లో ఏ దేవుణ్ణి పూజించాలి?*

జ. సూర్య భగవానుని 4.30 నుంచి ఆరులోగా పూజించాలి. 

ఈ సమయంలో పూజ శ్రీ రామునికి, శ్రీ వెంకటేశ్వరునికి కూడా ప్రీతీ. 

ఆరు నుంచి ఏడున్నర వరకు మహాశివుడ్ని, దుర్గను పూజించిన మంచి ఫలము కలుగును.

 మధ్యాహ్నము పన్నెండు గంటలప్పుడు శ్రీ ఆంజనేయ స్వామిని  పూజించిన  హనుమ కృపకు మరింత పాత్రులగుదురు. 

రాహువునకు 
సాయంత్రము మూడు గంటలకు పూజించిన మంచి ఫలితము కలుగుతుంది. 

సాయంత్రం ఆరు గంటల సమయాన అనగా సూర్యాస్తమయమున  శివపూజకు దివ్యమైన వేల.

రాత్రి ఆరు నుంచి తొమ్మిది వరకు లక్ష్మీదేవిని పూజించిన ఆమె కరుణ కటాక్షములు ఎక్కువగా ఉంటాయి.

 తెల్లవారు జామున  మూడు గంటలకు  శ్రీమహా విష్ణువును పూజిస్తే వైకుంటవాసుడి దయ అపారంగా ప్రసరిస్తుంది.
( ఇది నిబంధన మాత్రం కాదు. సమయానుకూలంగా కూడా మీ ఇష్ట దైవమును పూజించవచ్చు )

*11. హనుమంతునకు, సువర్చాలకు వివాహం జరిగిందా?*

జ. కొన్ని ఆలయాల్లో ఏకంగా వివాహం కూడా జరిపిస్తున్నారు.  హనుమంతుడు బ్రహ్మచారి. 
సూర్యుని కుమార్తె పేరు సువర్చల.  హనుమ సూర్యుని వద్ద విద్యాబ్యాసం  చేశాడు.  
ఆ సమయంలో సువర్చల హనుమని ఇష్టపడింది. 
విషయం తెలిసిన సూర్యుడు 
విద్యాభ్యాసం అనంతరం హనుమని గురుదక్షిణగా సువర్చలాను  వివాహమాడమన్నాడు. 
హనుమ కలియుగాంతం వరకు ఆగమన్నాడు.
ఆ తర్వాత వివాహం చేసుకుంటానని చెప్పాడు. 
కాబట్టి సువర్చలను హనుమ కలియుగం అంతమైన తర్వాతే వివాహం చేసుకుంటాడు.  
ఇచ్చిన మాట ప్రకారం, 
సూర్యునికిచ్చిన గురుదక్షిణ ప్రకారం.

*12. ఈశాన్యాన దేవుణ్ణి పెట్టె వీలులేఖపోతే?*

జ. మారిన జీవన పరిణామాల  దృష్ట్యా, ఉద్యోగ నిర్వహనలవల్ల ఎక్కడికైనా వెళ్ళవలసి వస్తుంది.

 అలాంటప్పుడు దేవుణ్ణి ఈశాన్యాన  పెట్టుకునే అవకాశం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు దేవుడు పశ్చిమాన్ని చూసేలా ఏర్పాటు చేసుకోవాలి.

*13. పిల్లలు లేని వారు సుబ్రమణ్యస్వామిని ఎందుకు పూజిస్తారు?*

జ. పార్వతి,పరమేశ్వరులను దర్శించడానికిఅనేక మంది తాపసులు కైలసానికి వస్తారు.అందులో దిగంబర ఋషులు ఉండటంతో 
సుబ్రమణ్యస్వామి హేళనగా నవ్వాడు. దానికి పార్వతిదేవి పుత్రుని మందలించి,  
మర్మాంగాలు సృష్టి వృద్ధి కోసం 
సృష్టించినవి.  
జాతికి జన్మస్థానాలు అని తెలియచెప్పింది. 
తల్లి జ్ఞాన భోధతో సుబ్రమణ్యస్వామి  సర్పరూపం దాల్చాడు కొంతకాలం. జీవకణాలు పాముల్లా ఉంటాయని మనకు తెల్సిందే. 

ఆ తర్వాత వాటికి అధిపతి అయాడు. అందువల్లే జీవకణాల అధిపతి అయిన సుబ్రమణ్యస్వామి ని  పూజిస్తే పిల్లలు  పుట్టని దంపతులకు  సంతానం కలుగుతుంది.

*14. మహాభారాతాన్ని వినాయకుడు ఎక్కడ వ్రాశాడు?*

జ.  వ్యాసుడు చెపుతుంటే  వినాయకుడు ఘంటం ఎత్తకుండా వ్రాసింది  మన భారత దేశ చివర గ్రామమైన “మాన ” లో.  హిమాలయాల్లో ఉంది ఈ గ్రామం.  బధ్రినాత్  వెళ్ళినవారు తప్పనిసరిగా ఈ గ్రామాన్ని దర్శిస్తారు. “జయ” కావ్యమనే మహాభారతాన్ని వినాయకుడు వ్యాసును
పలుకు ప్రకారం  రాస్తుంటే  పక్కన ప్రవహిస్తున్న సరస్వతి నది తన పరుగుల,ఉరుకుల శబ్దాలకి  అంతరాయం కలగకూడదని
మౌనం వహించి  ప్రవహిస్తుంది.

No comments:

Post a Comment

Jamalapuram Sri Venkateswara Swamy Temple జమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయం Telangana Tirupati, Khammam District

The road access to the temple is very good, and you can easily reach it in your own vehicle. Parking is not a concern as you can park comfor...