జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గుర్తించబడిన గ్రహాలు రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర శని. మనకి సాయంత్ర సమయంలో పూర్తిగా నక్షత్రాలు చంద్రుడు రాకముందు చిన్నగా వెలుగుతో అరుణ రంగులో కనపడే గ్రాహం కుజుడు. తెల్లగా ఎక్కువ వెలుగులో రెండు పెద్ద నక్షత్రాలు గురు శుక్రులు. నీలం రంగులో అతిచిన్నగా ఉండే గ్రాహం శని. అలాగే ఉదయం రవి రాత్రి చంద్ర గ్రహం అన్నింటిని మనం గమనిస్తాం. ఇక బుధుడు రవికి అత్యంత దగ్గరగా ఉండడం వలన ఆగ్రహం మనకి సాధారణంగా కనపడటం కష్టం. ఇక రవి బుధ శుక్రులు దగ్గరగా ఉంటాయి సౌరకుటుంబంలో అలాగే, రాశి చక్రంలో కూడా దగ్గరగా గమిస్తాయి.
ఇక రాహు కేతువులు పురాణగాధల ప్రకారం ఛాయా గ్రహాలుగా, కాలం అనబడే సర్పానికి ఇరువైపులా రాశిచక్రంలో అపసవ్య మార్గంలో సంవత్సరమున్నార ఒకే రకమైన డిగ్రీల తో గమిస్తూ ఉంటాయి.
రవి చంద్రులు బింబ గ్రహాలు. మిగతా గ్రహాలు నక్షత్ర గ్రహాలు. అంటాము. కేవలం కనపడని ఛాయా గ్రహాలుగా రాహుకేతువులు ఉంటాయి. అయితే గ్రహాలని గూర్చి స్వల్పంగా తెలుసుకుందాం.
రవి: అధిదేవత అగ్ని. ప్రత్యధి దేవత రుద్రుడు. ఈయన పితృ మరియు ఆత్మ కారకుడు.
చంద్ర: అధిదేవత జలం. ప్రత్యధి దేవత గౌరీ.
ఈయన మాతృ, జల మరియు మనః కారకుడు.
కుజ: అధిదేవత స్కందుడు. ప్రత్యధి దేవత క్షేత్రపాలక. ఈయన యుద్ధ, భూ, ఋణ కారకుడు.
బుధ: అధిదేవత విష్ణు. ప్రత్యధి దేవత నారాయణ.
ఈయన విద్య, వాక్ కారకుడు.
గురు(బృహస్పతి): అధిదేవత బ్రహ్మ. ప్రత్యధిదేవత ఇంద్రుడు. ఈయన జ్ఞాన, ధన కారకుడు.
శుక్ర: అధిదేవత ఇంద్రాణి. ప్రత్యధిదేవత ఇంద్ర.
కామ కారకుడు.
శని: అధిదేవత యముడు. ప్రత్యధిదేవత ప్రజాపతి. ఈయన ఆయుః కారకుడు.
రాహు:అధిదేవత దుర్గ. ప్రత్యధిదేవత సర్పం. భ్రమ కారకుడు
కేతు: అధిదేవత చిత్రగుప్త. ప్రత్యధిదేవత బ్రహ్మ. ఈయన మోక్ష కారకుడు.
No comments:
Post a Comment