Wednesday, December 11, 2019

మంత్రం అంటే ఏమిటి?

'అసలు మంత్రం అంటే ఏమిటి?' అన్న సందేహం కొంత మందికి కలుగవచ్చు.

మననాత్ త్రాయతే

ఇతి మంత్ర: అని అన్నారు. అంటే మననం చేయడం వలన రక్షించేది అని అర్ధం, అటువంటి మహా శక్తివంతమైన మంత్రాలను మన ౠషులు, తమ అమోఘ తపశ్శక్తితో, భగవదావేశంలో పలికిన వాక్యాలే మంత్రాలు.
'ఐం', 'శ్రీం', 'హ్రీం', 'క్లీం' అనే బీజాక్షరాలను అయా దేవతల పేర్లతో కలిపి జపించినపుడు శక్తివంతములైన మహా మంత్రాలవుతున్నాయి. మన్ ఇష్టదేవతను ప్రసన్నం చేసుకోవడమే మంత్రంలక్ష్యం. ఈ మంత్రాలు మూడు విధాలు. క్షుద్రంతో ఉచ్చాటన చేసే తామస మంత్రాలు, యుద్ధంలో గెలుపు కోసం చేసే రాజలమంత్రాలు, ఆధ్యాత్మిక సాధనకై జపించే సాత్వికమంత్రాలు, చంధోబద్దంగా ఉన్నవి 'ౠక్కులూ గద్యాత్మకంగా ఉన్న మంత్రాలు 'యజస్సులూ.

ఇక అన్ని మంత్రాలకు ముందు 'ఓం' కారాన్ని చేర్చి జపిస్తాం. ఎందుకంటే 'ఓం' కారం లేని మంత్రం ఫలవంతం కాదు. అలాంటి మంత్రం ప్రాణవయువులేని నిర్జీవశరీరం వంటిది. ఈ ఓంకారం ఆ సర్వేశ్వరుని మంచి ఓక జ్యోతిగా ప్రారంభమై, అందునుంచి ఒక నాదం ధ్వనించింది. ఆ ధ్వనే 'ఓంకారం'. 'ఓం' నుంచి వేదరాశులే ఉద్భవించాయి. ౠగ్వేదంనుండి 'ఆకారం, యజుర్వేదం నుండి 'ఊకారం, సామవేదం నుండి 'మాకారం కలసి 'ఓంకారం' ఏర్పడిందని ౠషివాక్కు.

No comments:

Post a Comment

Jai Shri Krishna

Excellent information about Bhagwan Shri Krishna: 1) Krishna was born *5252 years ago*  2) Date of *Birth* : *18th July,3228 B.C* 3) Month ...