Friday, December 27, 2019

అమిత శక్తివంతుడు... శ్వేతార్క గణపతి... ఇంట్లో ఉంటే ?

అమిత శక్తివంతుడు... శ్వేతార్క గణపతి... ఇంట్లో  ఉంటే ?

శ్వేతార్కంలో 'శ్వేతం' అంటే తెలుపు వర్ణం, 'అర్క' అంటే సూర్యుడు. శ్వేతార్క గణపతి అంటే తెల్ల జిల్లేడు గణపతి. శ్వేతార్క మూలంలో వినాయకుడు నివశిస్తాడని ప్రతీతి. దీన్ని మనం పొందగలిగి, గృహంలో ప్రతిష్టించుకోగలిగితే శుభప్రదం. శ్వేతార్క గణపతిని సాక్షాత్తూ గణపతి
 సాక్షాత్తూ గణపతిగా భావించి ఎవరు పూజలు చేస్తారో వారికి జ్ఞాన సంపద సురక్ష సుఖశాంతులు లభిస్తాయి. 

ఈ తెల్ల జిల్లేడును దొరికించుకుంటే మహాశివుడు, విఘ్నాధిపతుల దయ మనమీద ప్రసరిస్తుందట. 
 
తెల్ల జిల్లేడు వేర్ల మీద గణపతి నివశిస్తాడు. ఈ వేర్లు కొన్నిసార్లు ఆకృతిలో సైతం గణేశుని పోలి ఉంటాయి. అందుకే చాలామంది తెల్ల జిల్లేడును పరమ పవిత్రంగా భావించి, తులసి మొక్కలా ఇంట్లో నాటుతారు. ఈ మొక్క గనుక ఉంటే ధన ధాన్యాలు పుష్కలంగా లభిస్తాయట. ఆలోచనల్లో పరిపక్వత వస్తుందని, ఎవరైనా హాని తలపెట్టినా అలాంటివి దుష్ప్రభావం చూపకుండా, వారి ప్రయోగాలే నశిస్తాయని ప్రతీతి. 
 
ఇళ్ళలో జిల్లేడు మొక్కలు ఉండకూడదు అనేది ఒక అపోహ మాత్రమే. నిజానికి శ్వేతార్కం లేదా తెల్ల జిల్లేడు మొక్క ఇంట్లో ఉంటే ఇక వారికి దారిద్ర్యం అంటే ఏమిటో తెలీదట. జిల్లేడు మొక్కలు అధికంగా ఉన్న ఊళ్ళో పంటలు బాగా పండుతాయంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే జిల్లేడు సిరిసంపదలకు చిహ్నం అని నమ్ముతారు. తెల్ల జిల్లేడు వేర్లు గనుక గణపతి రూపాన్ని సంతరించుకుంటే, అది స్వయంభూ శ్వేతార్క గణపతి అన్నమాట.
 
జాతకచక్రంలో సూర్యగ్రహ దోషాలు ఉన్నవారు, జాతకచక్రంలో సూర్యుడు నీచ స్థితిలో ఉన్నవారు ఇంటికి నరదృష్టి ఉన్నవారు, వీధిపోటు ఉన్నవారు, సర్వకార్యసిద్ధి కొరకు శ్వేతార్క గణపతిని గృహంలో పూజించాలి.

శ్వేతార్క గణపతి కావలిసిన  వారు  సంప్రదించండి -8688431063

మహిషాసుర మర్ధని స్తోత్రం అనేది స్త్రీలకు ఎంతో మేలు చేస్తుందని, బయటకు వెళ్ళెముందు స్త్రీలు ఈ స్తోత్రాన్ని పఠించి వెళితే, వారికి దైవికమైన రక్షణ ఉంటుందని పలుమార్లు చెప్పారు.

కార్యాలయాల్లో వేధింపులు, బయట ఆకతాయిల వేధింపులు, అదీగాక ఎప్పుడు ఏమి జరుగుతుందో, ఎవరి ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలియని పరిస్థితి. స్త్రీలు ఎదుర్కుంటున్న ఈ సమస్య గురించి గోపురం కార్యక్రమంలో ఒకసారి శ్రీమతి సంధ్యాలక్ష్మీ గారు ప్రస్తావించారు. సమాజంలో మార్పు కలగలాని చెబుతూనే, మనవైపు నుంచి కూడా ఆత్మరక్షణ కొరకు భగవత్ ప్రార్ధన చేయాలని చెప్పారు. అందులో ముఖ్యంగా మహిషాసుర మర్ధని స్తోత్రం అనేది స్త్రీలకు ఎంతో మేలు చేస్తుందని, బయటకు వెళ్ళెముందు స్త్రీలు ఈ స్తోత్రాన్ని పఠించి వెళితే, వారికి దైవికమైన రక్షణ ఉంటుందని పలుమార్లు చెప్పారు. దీని మీద అనవసరమైన కామెంట్‌లు చేయకండి. నమ్మకమున్న వారు చదవచ్చు. 

ఇదిగోండి ఆ మహిషాసుర మర్ధిని స్తోత్రం 

అయిగిరినందిని నందితమేదిని విశ్వ-వినోదిని నందనుతే
గిరివర వింధ్య-శిరోఽధి-నివాసిని విష్ణు-విలాసిని జిష్ణునుతే |
భగవతి హే శితికంఠ-కుటుంబిణి భూరికుటుంబిణి భూరికృతే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 1 ||

సురవర-హర్షిణి దుర్ధర-ధర్షిణి దుర్ముఖ-మర్షిణి హర్షరతే
త్రిభువన-పోషిణి శంకర-తోషిణి కల్మష-మోషిణి ఘోషరతే |
దనుజ-నిరోషిణి దితిసుత-రోషిణి దుర్మద-శోషిణి సింధుసుతే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 2 ||

అయి జగదంబ మదంబ కదంబవన-ప్రియవాసిని హాసరతే
శిఖరి-శిరోమణి తుఙ-హిమాలయ-శృంగనిజాలయ-మధ్యగతే |
మధుమధురే మధు-కైతభ-గంజిని కైతభ-భంజిని రాసరతే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 3 ||

అయి శతఖండ-విఖండిత-రుండ-వితుండిత-శుండ-గజాధిపతే
రిపు-గజ-గండ-విదారణ-చండపరాక్రమ-శౌండ-మృగాధిపతే |
నిజ-భుజదండ-నిపాటిత-చండ-నిపాటిత-ముండ-భటాధిపతే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 4 ||

అయి రణదుర్మద-శత్రు-వధోదిత-దుర్ధర-నిర్జర-శక్తి-భృతే
చతుర-విచార-ధురీణ-మహాశయ-దూత-కృత-ప్రమథాధిపతే |
దురిత-దురీహ-దురాశయ-దుర్మతి-దానవ-దూత-కృతాంతమతే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 5 ||

అయి నిజ హుంకృతిమాత్ర-నిరాకృత-ధూమ్రవిలోచన-ధూమ్రశతే
సమర-విశోషిత-శోణితబీజ-సముద్భవశోణిత-బీజ-లతే |
శివ-శివ-శుంభనిశుంభ-మహాహవ-తర్పిత-భూతపిశాచ-పతే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 6 ||

ధనురనుసంగరణ-క్షణ-సంగ-పరిస్ఫురదంగ-నటత్కటకే
కనక-పిశంగ-పృషత్క-నిషంగ-రసద్భట-శృంగ-హతావటుకే |
కృత-చతురంగ-బలక్షితి-రంగ-ఘటద్-బహురంగ-రటద్-బటుకే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 7 ||

అయి శరణాగత-వైరివధూ-వరవీరవరాభయ-దాయికరే
త్రిభువనమస్తక-శూల-విరోధి-శిరోధి-కృతాఽమల-శూలకరే |
దుమి-దుమి-తామర-దుందుభి-నాద-మహో-ముఖరీకృత-దిఙ్నికరే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 8 ||

సురలలనా-తతథేయి-తథేయి-తథాభినయోదర-నృత్య-రతే
హాసవిలాస-హులాస-మయిప్రణ-తార్తజనేమిత-ప్రేమభరే |
ధిమికిట-ధిక్కట-ధిక్కట-ధిమిధ్వని-ఘోరమృదంగ-నినాదరతే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 9 ||

జయ-జయ-జప్య-జయే-జయ-శబ్ద-పరస్తుతి-తత్పర-విశ్వనుతే
ఝణఝణ-ఝింఝిమి-ఝింకృత-నూపుర-శింజిత-మోహితభూతపతే |
నటిత-నటార్ధ-నటీనట-నాయక-నాటకనాటిత-నాట్యరతే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 10 ||

అయి సుమనః సుమనః సుమనః సుమనః సుమనోహర కాంతియుతే
శ్రితరజనీరజ-నీరజ-నీరజనీ-రజనీకర-వక్త్రవృతే |
సునయనవిభ్రమ-రభ్ర-మర-భ్రమర-భ్రమ-రభ్రమరాధిపతే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 11 ||

మహిత-మహాహవ-మల్లమతల్లిక-మల్లిత-రల్లక-మల్ల-రతే
విరచితవల్లిక-పల్లిక-మల్లిక-ఝిల్లిక-భిల్లిక-వర్గవృతే |
సిత-కృతఫుల్ల-సముల్లసితాఽరుణ-తల్లజ-పల్లవ-సల్లలితే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 12 ||

అవిరళ-గండగళన్-మద-మేదుర-మత్త-మతంగజరాజ-పతే
త్రిభువన-భూషణభూత-కళానిధిరూప-పయోనిధిరాజసుతే |
అయి సుదతీజన-లాలస-మానస-మోహన-మన్మధరాజ-సుతే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 13 ||

కమలదళామల-కోమల-కాంతి-కలాకలితాఽమల-భాలతలే
సకల-విలాసకళా-నిలయక్రమ-కేళికలత్-కలహంసకులే |
అలికుల-సంకుల-కువలయమండల-మౌళిమిలద్-వకులాలికులే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 14 ||

కర-మురళీ-రవ-వీజిత-కూజిత-లజ్జిత-కోకిల-మంజురుతే
మిలిత-మిలింద-మనోహర-గుంజిత-రంజిత-శైలనికుంజ-గతే |
నిజగణభూత-మహాశబరీగణ-రంగణ-సంభృత-కేళితతే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 15 ||

కటితట-పీత-దుకూల-విచిత్ర-మయూఖ-తిరస్కృత-చంద్రరుచే
ప్రణతసురాసుర-మౌళిమణిస్ఫురద్-అంశులసన్-నఖసాంద్రరుచే |
జిత-కనకాచలమౌళి-మదోర్జిత-నిర్జరకుంజర-కుంభ-కుచే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 16 ||

విజిత-సహస్రకరైక-సహస్రకరైక-సహస్రకరైకనుతే
కృత-సురతారక-సంగర-తారక సంగర-తారకసూను-సుతే |
సురథ-సమాధి-సమాన-సమాధి-సమాధిసమాధి-సుజాత-రతే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 17 ||

పదకమలం కరుణానిలయే వరివస్యతి యోఽనుదినం న శివే
అయి కమలే కమలానిలయే కమలానిలయః స కథం న భవేత్ |
తవ పదమేవ పరంపద-మిత్యనుశీలయతో మమ కిం న శివే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 18 ||

కనకలసత్కల-సింధుజలైరనుషింజతి తె గుణరంగభువం
భజతి స కిం ను శచీకుచకుంభత-తటీపరి-రంభ-సుఖానుభవం |
తవ చరణం శరణం కరవాణి నతామరవాణి నివాశి శివం
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 19 ||

తవ విమలేఽందుకలం వదనేందుమలం సకలం నను కూలయతే
కిము పురుహూత-పురీందుముఖీ-సుముఖీభిరసౌ-విముఖీ-క్రియతే |
మమ తు మతం శివనామ-ధనే భవతీ-కృపయా కిముత క్రియతే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 20 ||

అయి మయి దీనదయాళుతయా కరుణాపరయా భవితవ్యముమే
అయి జగతో జననీ కృపయాసి యథాసి తథానుమితాసి రమే |
యదుచితమత్ర భవత్యురరీ కురుతా-దురుతాపమపా-కురుతే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 21 ||

*మానవుడు నిత్యమూ అచరించవలసిన ధర్మములు ?*



*మానవుడు నిత్యమూ అచరించవలసిన ధర్మములు ?**

*1. పిల్లలకు పుట్టు వెంట్రుకలు ఎప్పుడు తీయాలి?*

జ. పిల్లలకు ‘9 ‘ వ నెలలో కాని, ’11 ‘వ నెలలో కాని, ‘3 ‘వ సంవత్సరం లో కాని తీయవలెను. 

*2. పిల్లలకు అన్నప్రాసన ఎన్నో నెలలో చేయాలి ?*

జ. ఆడ పిల్లలకు ‘5 ‘ వ నెలలో, మగ పిల్లలకు ‘6 ‘ వ నెలలో అన్న ప్రాసన చేయాలి. 

*6 నెల 6వ రోజున ఇద్దరికీ పనికివస్తుంది.*

*3 .పంచామృతం, పంచగవ్యములు అని దేనిని అంటారు   ?*

జ. ఆవు పాలు,ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, వీటిని  పంచామృతం అని,
ఆవు పాలు,ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పేడ, ఆవు మూత్రము, వీటిని పంచగవ్యములు అంటారు.

*4. ద్వారానికి అంత ప్రాముక్యం ఎందుకు ఇస్తారు?*

జ. ద్వారానికి పైనున్న కమ్మి లక్ష్మి స్వరూపము, అందుకే దానికి మామిడి తోరణం కడతారు.  క్రింద కమ్మి పవిత్రమైనది, కనుక దానికి పసుపు రాస్తారు.  శాస్ర పరంగా చెప్పాలంటే గడప కు పసుపు రాయడం వల్ల క్రిమి కీటకాలు, విష పురుగులు ఇంట్లోకి రాకుండా ఉండటానికి అనుకోవచ్చు.

*5. తీర్థాన్ని  మూడుసార్లు తీసుకుంటారు. ఎందుకు?*

జ. తొలితీర్థము  శరీర శుద్ధికి,శుచికి…రెండవ తీర్ధం ధర్మ,న్యాయ ప్రవర్తనకు …మూడవ తీర్ధం పవిత్రమైన పరమేశ్వరుని పరమ పదము కొరకు.

*6. తీర్థ మంత్రం*

జ. అకాల మ్రుత్యుహరణం సర్వవ్యాది నివారణం  సమస్త పాప శమనం విశ్నుపాదోధకం శుభం .

*7.  స్నానము ఎలా చేయ వలెను?*

జ. నది లో ప్రవహమునకు ఎదురుగ పురుషులు, వాలుగ స్త్రీలు  చేయవలెను.
చన్నీటి స్నానము శిరస్సు తడుపుకొని, వేడి నీటి స్నానము పాదములు తడుపుకొని ప్రారంబించ వలెను.
స్నానము చేయునపుడు దేహమును పై నుండి క్రింద కు రుద్దు కొనిన కామేచ్చ పెరుగును.  అడ్డముగా రుదుకోనిన కామేచ్చ నశించును.
సముద్ర స్నానము చేయునపుడు బయట మట్టి ని లోపలి వేయవలెను. నదులలో,కాలువలు,చెరువులలో చేయునపుడు లోపల మట్టిని ముమ్మారు బయట వేయవలెను.

*8. ఏ ప్రదేశాల్లో జపం చేస్తే ఎంత ఫలితము ఉంటుంది?*

జ. గృహంలో ఎంత చేస్తే అంత ఫలితం ఉంటుంది. నది ప్రాంతంలో చేస్తే రెట్టింపు ఫలితం వస్తుంది. 
గోశాలలో చేస్తే వంద రెట్లు, యాగశాలలో అంతకు మించి ఫలితం వస్తుంది. పుణ్య ప్రదేశాల్లో,
దేవాతా సన్నిదిలోను చేస్తే పదివేల రెట్లు వస్తుంది. శివసన్నిదిలో చేస్తే మహోన్నతమైన ఫలం వస్తుంది. పులి తోలు మీద కుర్చుని జపిస్తే మోక్షం కలుగుతుంది. అలాగే వెదురు తడక మీద కుర్చుని జపం చేస్తే దరిద్రం ఆవహిస్తుంది.
రాతి మీద కుర్చుని జపిస్తే రోగాలు వస్తాయి. నేల మీద కూర్చొని చేస్తే దుఖము, గడ్డి మీద చేస్తే కీర్తి నాశనం అవుతుంది.

*9. పూజగది తూర్పు ముఖంలో ఉండాలని ఎందుకు అంటారు?*

జ. తూర్పునకు అధిపతి ఇంద్రుడు, ఉత్తరానికి అధిపతి  కుబేరుడు. అందుకే పూజగది తూర్పుముఖంగా కాని, ఉత్తరముఖం గా కాని ఉండాలని అంటారు. దక్షిణానికి అధిపతి యముడు. అందుకే దక్షిణ ముఖం గా ఉండకూడదని అంటారు.

*10. ఏ ఏ సమయాల్లో ఏ దేవుణ్ణి పూజించాలి?*

జ. సూర్య భగవానుని 4.30 నుంచి ఆరులోగా పూజించాలి. 

ఈ సమయంలో పూజ శ్రీ రామునికి, శ్రీ వెంకటేశ్వరునికి కూడా ప్రీతీ. 

ఆరు నుంచి ఏడున్నర వరకు మహాశివుడ్ని, దుర్గను పూజించిన మంచి ఫలము కలుగును.

 మధ్యాహ్నము పన్నెండు గంటలప్పుడు శ్రీ ఆంజనేయ స్వామిని  పూజించిన  హనుమ కృపకు మరింత పాత్రులగుదురు. 

రాహువునకు 
సాయంత్రము మూడు గంటలకు పూజించిన మంచి ఫలితము కలుగుతుంది. 

సాయంత్రం ఆరు గంటల సమయాన అనగా సూర్యాస్తమయమున  శివపూజకు దివ్యమైన వేల.

రాత్రి ఆరు నుంచి తొమ్మిది వరకు లక్ష్మీదేవిని పూజించిన ఆమె కరుణ కటాక్షములు ఎక్కువగా ఉంటాయి.

 తెల్లవారు జామున  మూడు గంటలకు  శ్రీమహా విష్ణువును పూజిస్తే వైకుంటవాసుడి దయ అపారంగా ప్రసరిస్తుంది.
( ఇది నిబంధన మాత్రం కాదు. సమయానుకూలంగా కూడా మీ ఇష్ట దైవమును పూజించవచ్చు )

*11. హనుమంతునకు, సువర్చాలకు వివాహం జరిగిందా?*

జ. కొన్ని ఆలయాల్లో ఏకంగా వివాహం కూడా జరిపిస్తున్నారు.  హనుమంతుడు బ్రహ్మచారి. 
సూర్యుని కుమార్తె పేరు సువర్చల.  హనుమ సూర్యుని వద్ద విద్యాబ్యాసం  చేశాడు.  
ఆ సమయంలో సువర్చల హనుమని ఇష్టపడింది. 
విషయం తెలిసిన సూర్యుడు 
విద్యాభ్యాసం అనంతరం హనుమని గురుదక్షిణగా సువర్చలాను  వివాహమాడమన్నాడు. 
హనుమ కలియుగాంతం వరకు ఆగమన్నాడు.
ఆ తర్వాత వివాహం చేసుకుంటానని చెప్పాడు. 
కాబట్టి సువర్చలను హనుమ కలియుగం అంతమైన తర్వాతే వివాహం చేసుకుంటాడు.  
ఇచ్చిన మాట ప్రకారం, 
సూర్యునికిచ్చిన గురుదక్షిణ ప్రకారం.

*12. ఈశాన్యాన దేవుణ్ణి పెట్టె వీలులేఖపోతే?*

జ. మారిన జీవన పరిణామాల  దృష్ట్యా, ఉద్యోగ నిర్వహనలవల్ల ఎక్కడికైనా వెళ్ళవలసి వస్తుంది.

 అలాంటప్పుడు దేవుణ్ణి ఈశాన్యాన  పెట్టుకునే అవకాశం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు దేవుడు పశ్చిమాన్ని చూసేలా ఏర్పాటు చేసుకోవాలి.

*13. పిల్లలు లేని వారు సుబ్రమణ్యస్వామిని ఎందుకు పూజిస్తారు?*

జ. పార్వతి,పరమేశ్వరులను దర్శించడానికిఅనేక మంది తాపసులు కైలసానికి వస్తారు.అందులో దిగంబర ఋషులు ఉండటంతో 
సుబ్రమణ్యస్వామి హేళనగా నవ్వాడు. దానికి పార్వతిదేవి పుత్రుని మందలించి,  
మర్మాంగాలు సృష్టి వృద్ధి కోసం 
సృష్టించినవి.  
జాతికి జన్మస్థానాలు అని తెలియచెప్పింది. 
తల్లి జ్ఞాన భోధతో సుబ్రమణ్యస్వామి  సర్పరూపం దాల్చాడు కొంతకాలం. జీవకణాలు పాముల్లా ఉంటాయని మనకు తెల్సిందే. 

ఆ తర్వాత వాటికి అధిపతి అయాడు. అందువల్లే జీవకణాల అధిపతి అయిన సుబ్రమణ్యస్వామి ని  పూజిస్తే పిల్లలు  పుట్టని దంపతులకు  సంతానం కలుగుతుంది.

*14. మహాభారాతాన్ని వినాయకుడు ఎక్కడ వ్రాశాడు?*

జ.  వ్యాసుడు చెపుతుంటే  వినాయకుడు ఘంటం ఎత్తకుండా వ్రాసింది  మన భారత దేశ చివర గ్రామమైన “మాన ” లో.  హిమాలయాల్లో ఉంది ఈ గ్రామం.  బధ్రినాత్  వెళ్ళినవారు తప్పనిసరిగా ఈ గ్రామాన్ని దర్శిస్తారు. “జయ” కావ్యమనే మహాభారతాన్ని వినాయకుడు వ్యాసును
పలుకు ప్రకారం  రాస్తుంటే  పక్కన ప్రవహిస్తున్న సరస్వతి నది తన పరుగుల,ఉరుకుల శబ్దాలకి  అంతరాయం కలగకూడదని
మౌనం వహించి  ప్రవహిస్తుంది.

బిల్వ వృక్షాన్ని ఇంట్లో పెంచితే....ఫలితాలు

బిల్వ వృక్షాన్ని ఇంట్లో పెంచితే....ఫలితాలు

ముక్కంటి శివునికి బిల్వ పత్రాలతో పూజించడం ద్వారా ఏర్పడే ఫలితాలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. బిల్వ పత్రాల్లో రకాలు వున్నాయి. వాటిలో మహా బిల్వం, తీగల బిల్వం, కర్పూర బిల్వం, సిద్ధ బిల్వం అనేవి వున్నాయి. ముక్యంగా మూడు ఆకులతో కూడిన బిల్వ పత్రాలే పూజకు శ్రేష్టమైనవి. ఈ బిల్వ పత్రాలతో శివపరమాత్మను పూజించడం ద్వారా పాపాలను తొలగించుకోవచ్చు.

అష్టైశ్వర్యాలను పొందవచ్చు. ఈ బిల్వ పత్రాలను పూజకు సిద్ధం చేసుకోవాలంటే.. సూర్యోదయానికి ముందే సిద్ధం చేసుకోవాలి. రోజూ శివునికి బిల్వార్చన చేయడం ద్వారా అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. ముఖ్యంగా శివరాత్రి పూట బిల్వాష్టకం పారాయణం చేయడం మంచిది. బిల్వ పత్రాలతో పూజించిన శివుడిని పూజించినట్లైతే ఏడు జన్మల పాపం తొలగిపోతుందని విశ్వాసం.

కానీ బిల్వ పత్రాలను సోమవారం, అమావాస్య, పౌర్ణమి, చతుర్థి, అష్టమి, నవమి తిథుల్లో చెట్టు నుంచి తీయడం కూడదు. దానికి బదులు ముందు రోజే బిల్వ పత్రాలను తీసి వుంచుకోవడం మంచిది. ఇలా ముందే చెట్టు నుంచి తీసిన బిల్వాన్ని ఆరు నెలల వరకైనా వుంచి పూజించవచ్చునని పండితులు చెప్తున్నారు. పూజకు ఉపయోగించిన బిల్వ పత్రాలనే మళ్లీ అర్చనకు ఉపయోగించవచ్చు.

ఇందులో ఎలాంటి దోషం లేదు. బిల్వార్చన కోటి జన్మలకు పుణ్యాన్ని ఇస్తుంది. ఇంకా ఇంట్లోనే బిల్వ వృక్షాన్ని పెంచడం సత్ఫలితాలను ఇస్తుంది. ఈ బిల్వ వృక్షాన్ని పెంచడం ద్వారా అశ్వమేధయాగం చేసినంత ఫలితం దక్కుతుందని పండితులు చెప్తున్నారు.

Wednesday, December 25, 2019

నిత్య పూజ - నైవేద్యంప్రతి కుటుంబమూ భగవంతుని ఆరాధన తప్పక చెయ్యాలి. వీలు ఉన్నవారు సరియైన విధివిధానాలను అనుసరించి పెద్ద పెద్ద ఆరాధనలు చేస్తారు. మిగిలిన వారు కనీసంలో కనీసం రోజూ పది నిముషాలైనా ఈశ్వర పూజ చెయ్యాలి. కార్యాలయాలకు, ఉద్యోగాలకు వెళ్ళేవారు కనీసం ఈ లఘు పూజనైనా చేసి తీరాలి. ప్రతి గృహంలో తప్పక ఘంటానాదం వినబడాలి.శివుడు, అంబిక, విష్ణు, వినాయక, సూర్యుడు ప్రతిమలను తప్పక ఆరాధించాలి. దీనినే ‘పంచాయతన పూజ’ అంటారు. సాంప్రదాయం ప్రకారం వీటిని కరచరణాదులతో అర్చించరు. ఈ ఐదుగురిని ప్రతిబింబించే ప్రకృతి ప్రసాదితములను వాడాలి. నర్మదా నది తీరంలోని ఓంకార కుండంనుండి శివస్వరూపమైన బాణ లింగం, సువర్ణముఖరి నది నుండి సంగ్రహించబడిన అంబిక రూపం, నేపాళంలోని గండకి నది నుండి విష్ణు స్వరూపమైన సాలిగ్రామం, తంజావూరు దగ్గరలోని వల్లంలొ లభించే సూర్య స్ఫటికం, గంగా నది ఉపనది అయిన సోనా నదివద్ద లభించే శోనభద్ర శిల వినాయక స్వరూపంగా మనదేశ ఐక్యతను చూపించే ఈ అయిదు రాళ్ళను పూజించాలి.వీటికి కళ్ళు, ముక్కు, చెవులు మొదలగునవి ఉండవు. మూలలు లేకపోవడం వల్ల నీటితో శుభ్రపరచడానికి చాలా తేలిక. త్వరగా తేమ ఆరిపోతుంది. పెద్ద పూజగది కూడా అవసరం లేదు, ఒక చిన్న పెట్టె చాలు. ఈ పంచాయతన పూజను పునరుద్ధరించినవారు శంకర భగవత్పాదులు. షణ్మత స్థాపనాచార్యులై ఈ ఐదింటితో పాటు సుబ్రహ్మణ్య ఆరాధనను కూడా కలిపారు. ఈ ఐదు రాళ్ళతో పాటు చిన్న వేలాయుధాన్ని జతపరచాలి.పూజ చెయ్యడానికి పెద్ద శ్రమ కూడా లేదు. నీకు ధృతి ఉంటే ఎక్కడైనా ఎప్పుడైనా పూజ చేసుకోవచ్చు. ఇంటిలో పూజ చేసుకునేటప్పుడు దేవతామూర్తులకి వండిన అన్నాన్ని మహా నైవేద్యంగా సమర్పించాలి. పరమాత్మ ఈ విశ్వమునంతటిని మనకోసం సృష్టించాడు. మన ఇంద్రియములచేత ఆ సృష్టిలోని వాటిచేత సుఖమును పొందుతున్నాము. అటువంటి వాటిని మనం తీసుకునే ముందు వాటిని భగవంతునికి అర్పించి తీసుకోవాలి. మనం ఏదేని నైవేద్యం సమర్పించేటప్పుడు దాన్ని ఆయనకే ఇచ్చివేస్తున్నమా? కేవలం భగవంతుని ముందు ఉంచి మరలా మనం పుచ్చుకుంటున్నాం.కొంతమంది హేళనగా అడుగుతారు, ఇవన్నీ భగవంతుడు తింటాడా అని? నివేదన అంటే నిజంగా భగవంతునికి తినిపించడమా? ఆయనకు తినవలసిన అవసరం లేదు. పూజవల్ల మన మనస్సు శుద్ధమవుతుంది. కాబట్టి దాని వల్ల లాభం మనకే భగవంతునికి కాదు. “నివేదయామి” అంటే “నేను నీకు తెలియబరుస్తున్నాను” అని అర్థం, “నీకు ఆహారం పెడుతున్నాను” అని కాదు. మనం భగవంతునితో అదే చెప్పుకోవాలి, “ఈశ్వరా! మీ దయ వల్ల మాకు ఈ ఆహారాన్ని ప్రసాదించావు” అని. అలా భగవంతునికి నివేదించిన దాన్ని ఆయనను స్మరిస్తూ మనం తినాలి.ఆయన అనుగ్రహం లేకపోతే అసలు బియ్యం ఎలా పండుతుంది. మేధావులు పరిశోధనలు చేసి పెద్ద పెద్ద విషయాలు వ్రాయవచ్చు. కాని అవేవి ఒక గింజ ధాన్యాన్ని కూడా పండించలేవు. కృత్రిమ బియ్యం తయారుచేయాలన్నా భగవంతుడు సృష్టించిన వాటిని ఉపయోగించే తయారుచెయ్యాలి. మనిషి తయారుచేసే ప్రతి వస్తువు చివరకు భగవంతుని సృష్టి కిందకే వస్తుంది. మరి దాన్ని భగవంతునికి నివేదించకుండా మొదట మనం స్వికరిస్తే అది పెద్ద దొంగతనమే అవుతుంది.--- “దయివతిన్ కురల్“ పరమాచార్య స్వామి వారి ఉపన్యాసముల సంగ్రహముఅపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

నిత్య పూజ - నైవేద్యం

ప్రతి కుటుంబమూ భగవంతుని ఆరాధన తప్పక చెయ్యాలి. వీలు ఉన్నవారు సరియైన విధివిధానాలను అనుసరించి పెద్ద పెద్ద ఆరాధనలు చేస్తారు. మిగిలిన వారు కనీసంలో కనీసం రోజూ పది నిముషాలైనా ఈశ్వర పూజ చెయ్యాలి. కార్యాలయాలకు, ఉద్యోగాలకు వెళ్ళేవారు కనీసం ఈ లఘు పూజనైనా చేసి తీరాలి. ప్రతి గృహంలో తప్పక ఘంటానాదం వినబడాలి.

శివుడు, అంబిక, విష్ణు, వినాయక, సూర్యుడు ప్రతిమలను తప్పక ఆరాధించాలి. దీనినే ‘పంచాయతన పూజ’ అంటారు. సాంప్రదాయం ప్రకారం వీటిని కరచరణాదులతో అర్చించరు. ఈ ఐదుగురిని ప్రతిబింబించే ప్రకృతి ప్రసాదితములను వాడాలి. నర్మదా నది తీరంలోని ఓంకార కుండంనుండి శివస్వరూపమైన బాణ లింగం, సువర్ణముఖరి నది నుండి సంగ్రహించబడిన అంబిక రూపం, నేపాళంలోని గండకి నది నుండి విష్ణు స్వరూపమైన సాలిగ్రామం, తంజావూరు దగ్గరలోని వల్లంలొ లభించే సూర్య స్ఫటికం, గంగా నది ఉపనది అయిన సోనా నదివద్ద లభించే శోనభద్ర శిల వినాయక స్వరూపంగా మనదేశ ఐక్యతను చూపించే ఈ అయిదు రాళ్ళను పూజించాలి.

వీటికి కళ్ళు, ముక్కు, చెవులు మొదలగునవి ఉండవు. మూలలు లేకపోవడం వల్ల నీటితో శుభ్రపరచడానికి చాలా తేలిక. త్వరగా తేమ ఆరిపోతుంది. పెద్ద పూజగది కూడా అవసరం లేదు, ఒక చిన్న పెట్టె చాలు. ఈ పంచాయతన పూజను పునరుద్ధరించినవారు శంకర భగవత్పాదులు. షణ్మత స్థాపనాచార్యులై ఈ ఐదింటితో పాటు సుబ్రహ్మణ్య ఆరాధనను కూడా కలిపారు. ఈ ఐదు రాళ్ళతో పాటు చిన్న వేలాయుధాన్ని జతపరచాలి.

పూజ చెయ్యడానికి పెద్ద శ్రమ కూడా లేదు. నీకు ధృతి ఉంటే ఎక్కడైనా ఎప్పుడైనా పూజ చేసుకోవచ్చు. ఇంటిలో పూజ చేసుకునేటప్పుడు దేవతామూర్తులకి వండిన అన్నాన్ని మహా నైవేద్యంగా సమర్పించాలి. పరమాత్మ ఈ విశ్వమునంతటిని మనకోసం సృష్టించాడు. మన ఇంద్రియములచేత ఆ సృష్టిలోని వాటిచేత సుఖమును పొందుతున్నాము. అటువంటి వాటిని మనం తీసుకునే ముందు వాటిని భగవంతునికి అర్పించి తీసుకోవాలి. మనం ఏదేని నైవేద్యం సమర్పించేటప్పుడు దాన్ని ఆయనకే ఇచ్చివేస్తున్నమా? కేవలం భగవంతుని ముందు ఉంచి మరలా మనం పుచ్చుకుంటున్నాం.

కొంతమంది హేళనగా అడుగుతారు, ఇవన్నీ భగవంతుడు తింటాడా అని? నివేదన అంటే నిజంగా భగవంతునికి తినిపించడమా? ఆయనకు తినవలసిన అవసరం లేదు. పూజవల్ల మన మనస్సు శుద్ధమవుతుంది. కాబట్టి దాని వల్ల లాభం మనకే భగవంతునికి కాదు. “నివేదయామి” అంటే “నేను నీకు తెలియబరుస్తున్నాను” అని అర్థం, “నీకు ఆహారం పెడుతున్నాను” అని కాదు. మనం భగవంతునితో అదే చెప్పుకోవాలి, “ఈశ్వరా! మీ దయ వల్ల మాకు ఈ ఆహారాన్ని ప్రసాదించావు” అని. అలా భగవంతునికి నివేదించిన దాన్ని ఆయనను స్మరిస్తూ మనం తినాలి.

ఆయన అనుగ్రహం లేకపోతే అసలు బియ్యం ఎలా పండుతుంది. మేధావులు పరిశోధనలు చేసి పెద్ద పెద్ద విషయాలు వ్రాయవచ్చు. కాని అవేవి ఒక గింజ ధాన్యాన్ని కూడా పండించలేవు. కృత్రిమ బియ్యం తయారుచేయాలన్నా భగవంతుడు సృష్టించిన వాటిని ఉపయోగించే తయారుచెయ్యాలి. మనిషి తయారుచేసే ప్రతి వస్తువు చివరకు భగవంతుని సృష్టి కిందకే వస్తుంది. మరి దాన్ని భగవంతునికి నివేదించకుండా మొదట మనం స్వికరిస్తే అది పెద్ద దొంగతనమే అవుతుంది.

--- “దయివతిన్ కురల్“ పరమాచార్య స్వామి వారి ఉపన్యాసముల సంగ్రహము

అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

అంతా రామమయంమన బతుకంతా రామమయంమన జీవితాలలో రాముడు ఎలా కలిసిపోయాడో చూడండి.......ఒక దేశానికి , జాతికి సొంతమయిన గ్రంథాలు ఉంటాయి . మనకు అలాంటిది రామాయణం .

అంతా రామమయం

మన బతుకంతా రామమయం

మన జీవితాలలో రాముడు ఎలా కలిసిపోయాడో చూడండి.......

ఒక దేశానికి , జాతికి సొంతమయిన గ్రంథాలు ఉంటాయి . 

మనకు అలాంటిది రామాయణం . 

💐💐💐💐💐💐💐💐💐💐💐

ఇంగ్లీషు వాడు వచ్చాక రాముడు ఒక పాత్ర అయ్యాడు కానీ అంతవరకూ రాముడు మనవెంట నడిచిన దేవుడు . 

మనం విలువల్లో , వ్యక్తిత్వంలో పడిపోకుండా నిటారుగా నిలబెట్టిన ఆదర్శ పురుషుడు . 

మనకు మనం పరీక్ష పెట్టుకుని ఎలా ఉన్నామో చూసుకోవాల్సిన అద్దం రాముడు . 

ధర్మం పోత పోస్తే రాముడు . 

ఆదర్శాలు రూపుకడితే రాముడు . 

అందం పోగుపోస్తే రాముడు . 

ఆనందం నడిస్తే రాముడు . 

వేదోపనిషత్తులకు అర్థం రాముడు . 

మంత్రమూర్తి రాముడు . 

పరబ్రహ్మం రాముడు . 

లోకం కోసం దేవుడే దిగివచ్చి మనిషిగా పుట్టినవాడు రాముడు . 

ఎప్పటి త్రేతా యుగ రాముడు ? 

ఎన్ని యుగాలు దొర్లిపోయాయి ? 

అయినా మన మాటల్లో , చేతల్లో , ఆలోచనల్లో అడుగడుగడుగునా రాముడే!

చిన్నప్పుడు మనకు స్నానం చేయించగానే అమ్మ నీళ్లను సంప్రోక్షించి చెప్పినమాట - 

శ్రీరామరక్ష సర్వజగద్రక్ష . 

■■■■■■■■■■

బొజ్జలో ఇంత పాలుపోసి ఉయ్యాలలో పడుకోబెట్టిన వెంటనే పాడిన పాట -

 రమాలాలి - మేఘశ్యామా లాలి . 

■■■■■■■■■■■■■■■

మన ఇంటి గుమ్మం పైన వెలిగే మంత్రాక్షరాలు - శ్రీరామ రక్ష - సర్వ జగద్రక్ష . 

■■■■■■■■■■■■

మంచో చెడో ఏదో ఒకటి జరగగానే అనాల్సిన మాట - అయ్యో రామా . 

■■■■■■■■

వినకూడని మాట వింటే అనాల్సిన మాట -

 రామ రామ . 

■■■■■■

భరించలేని కష్టానికి పర్యాయపదం -

 రాముడి కష్టం . 

◆◆◆◆◆◆◆

తండ్రి మాట జవదాటనివాడిని పొగడాలంటే - రాముడు . 

●●●●

కష్టం గట్టెక్కే తారక మంత్రం -

 శ్రీరామ .

■■■■

విష్ణుసహస్రం చెప్పే తీరిక లేకపోతే అనాల్సిన మాట - శ్రీరామ శ్రీరామ శ్రీరామ .

■■■■■■■■■■■■

అన్నం దొరక్కపోతే అనాల్సిన మాట - 

అన్నమో రామచంద్రా ! 

■■■■■■■■■■

వయసుడిగిన వేళ అనాల్సిన మాట - 

కృష్ణా రామా ! 

◆◆◆◆◆◆

తిరుగులేని మాటకు - రామబాణం . 

సకల సుఖశాంతులకు - రామరాజ్యం . 

ఆదర్శమయిన పాలనకు - రాముడి పాలన . 

ఆజానుబాహుడి పోలికకు - రాముడు . 

అన్నిప్రాణులను సమంగాచూసేవాడు-రాముడు .

రాముడు ఎప్పుడు మంచి బాలుడే . 💐

చివరకు ఇంగ్లీషు వ్యాకరణంలో కూడా - 

రామా కిల్డ్ రావణ ; 

💐💐💐💐💐💐💐

రావణ వాజ్ కిల్డ్ బై రామా . 

💐💐💐💐💐💐💐💐

ఆదర్శ దాంపత్యానికి - సీతారాములు . 

గొప్ప కొడుకు - రాముడు . 

అన్నదమ్ముల అనుబంధానికి -రామలక్ష్మణులు . 

గొప్ప విద్యార్ధి - రాముడు

(వసిష్ఠ , విశ్వామిత్రులు చెప్పారు ) . 

మంచి మిత్రుడు - రాముడు

(గుహుడు చెప్పాడు ). 

మంచి స్వామి రాముడు

 (హనుమ చెప్పారు ). 

సంగీత సారం రాముడు

 (రామదాసు , త్యాగయ్య చెప్పారు ). 

నాలుకమీదుగా తాగాల్సిన నామం రాముడు

 ( పిబరే రామ రసం - 

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

సదాశివ బ్రహ్మేంద్ర యోగి చెప్పారు ).

 

కళ్ళున్నందుకు చూడాల్సిన రూపం - రాముడు.

నోరున్నందుకు పలకాల్సిన నామం - రాముడు

చెవులున్నందుకు వినాల్సిన కథ - రాముడు . 

చేతులున్నందుకు మొక్కాల్సిన దేవుడు - రాముడు . 

జన్మ తరించడానికి - రాముడు , రాముడు , రాముడు . 

--------------------

రామాయణం పలుకుబళ్లు

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

మనం గమనించంగానీ , భారతీయ భాషలన్నిటిలో రామాయణం ప్రతిధ్వనిస్తూ , ప్రతిఫలిస్తూ , ప్రతిబింబిస్తూ ఉంటుంది . 

●తెలుగులో కూడా అంతే .● 

ఎంత వివరంగా చెప్పినా అర్థం కాకపోతే - 

రాత్రంతా రామాయణం విని పొద్దున్నే 

సీతకు రాముడేమవుతాడని 

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

అడిగినట్లే ఉంటుంది ...?

చెప్పడానికి వీలుకాకపోతే - 

అబ్బో అదొక రామాయణం . 

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

జవదాటడానికి వీల్లేని ఆదేశం అయితే - 

సుగ్రీవాజ్ఞ , లక్ష్మణ రేఖ . 

◆◆◆◆◆◆◆◆◆◆◆

ఎంతమంది ఎక్కినా ఇంకా చోటు మిగిలితే - 

అదొక పుష్పకవిమానం . 

◆◆◆◆●●◆◆●●●

కబళించే చేతులు , చేష్ఠలు 

కబంధ హస్తాలు . 

◆◆◆◆◆◆◆◆

వికారంగా ఉంటే - 

శూర్పణఖ . 

◆◆◆◆◆

చూసిరమ్మంటే కాల్చి రావడం (హనుమ ). 

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

పెద్ద పెద్ద అడుగులు వేస్తే - 

అంగదుడి అంగలు . 

◆◆◆◆◆◆◆◆◆

మెలకువలేని నిద్ర - 

కుంభకర్ణ నిద్ర . 

◆◆◆◆◆◆◆

పెద్ద ఇల్లు - 

లంకంత ఇల్లు . 

◆◆◆◆◆◆◆

ఎంగిలిచేసి పెడితే -

 శబరి . 

◆◆◆

ఆడవారి గురించి అసలు ఆలోచనలే లేకపోతే - ఋష్యశృంగుడు .

◆◆◆◆◆◆◆◆

అల్లరి మూకలకు నిలయం - 

కిష్కింధ కాండ . 

◆◆◆◆◆◆◆

విషమ పరీక్షలన్నీ మనకు రోజూ - 

అగ్ని పరీక్షలే . 

◆◆◆◆◆◆

పితూరీలు చెప్పేవారందరూ - 

మంథరలే . 

◆◆◆◆◆

యుద్ధమంటే - రామరావణ యుద్ధమే . 

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

ఎప్పటికీ రగులుతూ ఉండేవన్నీ - 

రావణ కాష్ఠాలే .)

◆◆◆◆◆◆◆◆

కొడితే బుర్ర రామకీర్తన పాడుతుంది ◆◆◆◆◆◆

(ఇది విచిత్రమయిన ప్రయోగం ). 

సీతారాములు తిరగని ఊళ్ళు తెలుగునేల మీద ఉండనే ఉండవు .

బహుశా ఒక ఊళ్లో తిండి తిని ఉంటారు . ఒక ఊళ్లో పడుకుని ఉంటారు . ఒక ఊళ్లో బట్టలు ఉతుక్కుని ఉంటారు . ఒక ఊళ్లో నీళ్లు తాగి ఉంటారు . 

ఒంటిమిట్టది ఒక కథ . ◆◆◆◆◆

భద్రాద్రిది ఒక కథ . ◆◆◆◆◆◆◆

అసలు రామాయణమే మన కథ . 

అది రాస్తే రామాయణం - 

చెబితే మహా భారతం .

అందుకే కీ.శే. సర్వేపల్లిరాధాకృష్ణన్ గారు అన్నారు.

హిందుయిజమ్ ఒక మతం కాదు, 

అది ఒక జీవన విధానం!

అందుకే ఇప్పటి South Asian దేశాలు ఇస్లాం, బౌద్ధమతాలను ఆచరించినా వారి దైనందిక జీవన విధానాలో రామాయణం ఎంతగా పెనవేసుకు పోయిందో ఇప్పటికీ మనం చూడొచ్చు. రామాయణకథలు మనకంటే చక్కగా muslim majority దేశమైన ఇండోనేషియాలో ప్రదర్శిస్తారంటే రామాయణ విశిష్టత వేరుగా చెప్పనక్కర్లేదు.

జై శ్రీ రామ్....

శ్లో

|| శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే |

సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||

ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమేకాదు, భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది.
శ్రీరామ జయరామ జయజయ రామ.
🙏🙏🙏🌹🙏🙏🙏🌹🙏🙏🙇🏻

దామోదరుడు

దామోదరుడు
--------------------

తిరుప్పావై ఐదవ పాశురంలో కృష్ణుడు దామోదరుడు గా,  దామము ఉదరమునందు కలవాడుగా   కీర్తించబడ్డాడు.

త్రాటితో కృష్ణుని అతడు కూర్చొన్న రోలుకు బంధించి వైచినచో రోలును కదల్పలేడుకదా అనుకొని అక్కడవున్న ఒక తాడుని తీసి రోలు కు కట్టుటకు ప్రయత్నించింది యశోద. ఆ తాడు రోలుకు సరిపోదయ్యెను. ఇంకొక తాడు మరియొక తాడు ఎన్నితెచ్చినా  రోలుకు కట్టుటకు సాధ్యపడలేదు. యశోద రెండు మూడు తాళ్లు ముడివేసి కూడా కట్టడానికి  ప్రయత్నించింది.  అయినా బంధించ  పోయింది.

పరబ్రహ్మను కట్ట   తరమా! విశ్వమంతా నిండియున్నవానిని బంధింప శక్యమా! భక్తుల వశంలో ఉండే బాలగోపాలుడు చివరకు  తనను కట్టుటకు తానే  అనువు కల్పించు కొన్నాడు. ఎవ్వరు చేయలేని, చివరికి లక్ష్మీదేవికూడా చేయలేని పనిని యశోద సాధించింది. 

ఆ గోపాల బాలుడు లక్ష్మీదేవి కౌగిటిలో చిక్కలేదు, సనక సనందనాదుల హృదయములలోను ఒదగలేదు, ఉపనిషత్తులచేతనూ  బంధింపబడలేదు, అటువంటివాడు లీలగా, అవలీలగా  తల్లి చేతిలో చిక్కి రోటికి కట్టివేయబడ్డాడు. ఎంత విచిత్రము!  యశోదమ్మ దేమి భాగ్యము! 

నిత్యమూ శ్రీహరిని ధ్యానించు పరమశివుడు గాని, శ్రీహరి వక్షస్థలమును నివాసస్థానముగా పొందిన లక్ష్మీదేవి గాని, పుత్రుడని చెప్పుకొనే బ్రహ్మదేవుడు గాని శ్రీహరి నుండి  యశోద పొందిన అనుగ్రహమును పొందలేకపోయారు. 

భక్తికి కట్టుబడిన వాసుదేవుడు, జ్ఞానులకుగాని  మహర్షులకుగాని,  దానపరులకుగాని,  చివరకు యోగీశ్వరులకు  కూడా పట్టుబడడు కదా!       
                        🙏

🌹🙏రామ భజన మహిమ🙏🌹

🌹🙏రామ భజన మహిమ🙏🌹

♦️ఎక్కడ రామ భజన జరుగుతుందో అక్కడ హనుమంతుడు ఉంటారు, గ్రహ దోషాలు, చెడు ప్రయోగాలు జరిగింది అని భయపడుతున్న వాళ్ళు, జిన్స్, గాలి,పిశాచ బాధలు ఉన్నాయి అని భయపడుతూ, ఏ పూజలు చేయాలి ఎవరి దగ్గరకు వెళ్ళాలి అని మానసికంగా కృంగిపోతూ చాలా కుటుంబాలు మనో వేదన అనుభవిస్తున్నారు..అవి నిజంగా ఉన్నాయా లేక అపోహ అనేది పక్కన పెడితే అటువంటి ఆలోచనతో చాలా మానసిక క్షోభ అనుభవిస్తున్నారు

♥️ఏ రోజు ఏమీ చేయమని tv లో భక్తి ప్రసారంలో చెప్తే అవి చేస్తున్నారు, ఏ స్వామి జి ఏది చెప్తే అది చేస్తున్నారు, మీలాంటి అమాయకుల వల్ల దొంగబాబాలు, తాయత్తులు అమ్మే వాళ్ళు, యంత్రాలు అమ్ముకునే వాళ్ళు చాలా మందే హాయిగా బతుకు తున్నారు కానీ మీ సమస్య మటుకు తీరడం లేదు..

♦️ఇంట్లో రామ భజన నిరంతరంగా అంటే ప్రతి రోజు రామ భజన ఇంట్లో చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళను పిలుచుకోండి, సంజీవిని తెస్తున్న హనుమంతుడు ఫోటో కానీ, రామ లక్ష్మణులను భుజాన మోస్తున్న హనుమంతుడి ఫోటో కానీ పెట్టుకోండి.. అలాగే సీతారామ పట్టాభిషేకం ఫోటో పెట్టుకోండి ఇది ప్రతి ఇంటా ఉండవలసిన ఫోటో, అంత పానకం. వడపప్పు నైవేద్యం పెట్టండి మంగళవారం గారెలు నైవేద్యం పెట్టండి... భక్తి పారవశ్యంతో  రామ భజన చేసి చివరిలో హనుమాన్ చాలీసా చదివి హారతి ఇవ్వండి... ఏ పిశాచాలు మీ ఇంట్లో ఉంటాయి చూద్దాము, గ్రహాలు అన్నీ హనుమకు అధీనం లో ఉంటుంది.. ఎందుకంటే ఆయన భక్తికి మరో రూపమ్ రుద్ర స్వరూపం.. శనిదోషాలు, రాహుగ్రహ దోషాలను పోగొట్టే సులభమైన మార్గం హనుమంతుడి గుడి ప్రదర్శన...ఆరాధన..

🔥ఇంట్లో గొడవలు తగ్గుతుంది, మన శాంతిగా ఉంటారు, దుష్ట గ్రహాలు అనగా మీకు చేడుచేసే వారు కూడా మీ ఇంట్లోకి రాలేరు ఇంటికి ఉన్న కనుదిష్టి పోతుంది..ఇంటి వాతావరణంలో లో మంచి మార్పు మీకే తెలుస్తుంది.. సంతోషంగా ఉంటారు.. రామ భజన గురించి మీకు ఇంతకన్నా నేను చెప్పాలా.."ఓ రామ నీ నామం ఎంతో రుచిరా" అంటూ అలవాటు పడితే అందులోని ఆనందం అనంతం , ఎంతో మందికి సుందరకాండ పారాయణం, శ్రవణం ఎంతో మేలు చేసింది..అలా పారాయణం చేయలేక పోయిన రామ భజన, ఇంట్లో పెట్టండి సంతోషంగా ఉండండి మీ వల్ల మీ పిల్లలు చిన్న తనం నుండి భక్తిని అలవాటు చేసుకుంటారు పాప బీతి ఉంటే తప్పులు చేయరు అపద్దం చెప్పరు.

🌹శివుడి స్మరించే తారక మంత్రం రామ నామం ఈ మంత్రం నిరంతరం జపించండి.

🕉️"శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే |"🕉️

 ♥️రామ భజన♥️

రామ రామ రఘునందన రామరామ శ్రీరామ రామ భరతాగ్రజ రామరామ
శ్రీరామ రామ రణకర్కశ రామ రామ శ్రీరామ రామ శరణం భవ రామ రామ ॥

లోకాభిరామం రణరంగధీరం రాజీవనేత్రం రఘువంశనాథమ్ 
కారుణ్యరూపం కరుణాకరం తం శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే ॥

♦️మనోజవం మారుతతుల్య వేగమ్ జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టమ్
వాతాత్మజం వానరయూథ ముఖ్యమ్ శ్రీరామదూతం శరణం ప్రపద్యే. ॥

(ఎన్నో లక్షల రాక్షస సంహారం చేసిన రాముడు సదా మంచిని రక్షించు గాక, శ్రీ రామ నీకు జయము నీ నామము మాకు శుభము).

🌹🙏 జై శ్రీరాం🙏🌹

*ఆచార్య సద్భావన*

*ఆచార్య సద్భావన*

ఆత్మప్రకాశమార్గంలో ప్రయాణిస్తే తప్ప మన జీవితం సురక్షితం కాదు.

ప్రపంచంలోని వజ్రాలు, కెంపులు అన్నింటికన్నా పవిత్రమైన ఆలోచన విలువైనది. ఎందుకో తెలుసా, అది మన అంతర్గత జీవితాన్ని కాంతివంతం చేసి దాని విలువైన ప్రశాంతిని మనపై వర్షిస్తుంది గనుక.

మన దృష్టినంతా బాహ్యప్రపంచంపై కేంద్రీకరిస్తే కలత చెందడం, గందరగోళ పరిస్థితుల్లో చిక్కుకోవడం మినహా మరేమీ జరగదు. దీని ఫలితంగా మనస్సుని మన వశంలో ఉంచుకోవడం కూడా సాధ్యపడదు. అందువల్లనే దృష్టిని అంతర్ముఖం గావించాలి.

ప్రతీ వ్యక్తీ ప్రతీ రోజూ కొంత సమయం కేటాయించుకుని అంతరంగశోధన చేయాలి, అప్పుడు ఏ విధమైన అలజడులు మిగలవు.

సాధారణంగా అందరూ తమ ఆలోచనలకు, భావాలకూ పరిష్కారం బాహ్యప్రపంచపు తళుకుబెళుకులలో లభిస్తాయనే భ్రాంతిలో వెతుకులాడతారు. 

అయితే దాని వలన శారీరకంగా, మానసికంగా క్రుంగుబాటు తప్ప మరేమీ లభించదు.

==============================

తిరుమల కొండపై రూమ్ దొరకడం లేదా.. ఇదిగోండి ఇలా చేస్తే రూమ్ గ్యారంటీ!!

తిరుమల కొండపై రూమ్ దొరకడం లేదా.. ఇదిగోండి ఇలా చేస్తే రూమ్ గ్యారంటీ!!

తిరుమల శ్రీవారి దర్శనం ఒకెత్తు.. 
అక్కడ వసతి దొర‌క‌డ౦ మరో ఎత్తు.. 
కేశఖండనం, నామకరణం, పెళ్లి తదితర ఫంక్షన్లకు వెళ్తే.. ఏం చేయాలో తెలియదు, 
ఎక్కడ తల దాచుకునే౦దుకు వసతి దొరుకుతుందో తెలియదు.. 

టీటీడీ వారు కేటాయించే సత్రాల్లో గదుల కేటాయింపు మరో అర్థంకాని బ్రహ్మపదార్థం.. 
1)రాజకీయంగా పలుకుబడి కలిగిన వారికి,
2)ఆర్థికంగా బలవంతులకు,
3)సెలబ్రిటీలకు, 4)అధికారులు, 5)పోలీసులు,6) ప్రెస్.. 
  ఇలా ఎందరికో ప్రాధాన్యమిచ్చిన తర్వాత చివరాఖరుకు మిగిలితే సామాన్యులకు శ్రీవారి కరుణా కటాక్షాలు లభిస్తాయి. దీంతో వసతి దొరక్క అనేక మంది భక్తులు ఆ ఆవరణలోనే గాలికి పడుకుని ఉండే సీన్లు అనేక౦ చూస్తు౦టాము.
 మీకు తెలుసో... తెలీదో.. .
అక్కడ పలు మఠాలకు చెందిన... కులాలకు చెందిన సత్రాలున్నాయి…
వాటిలో త‌ప్ప‌కు౦డా గ‌దులు దొరుకుతాయి. అవి ఆద‌ర౦గా ఆదరిస్తాయి. మీరు తలదాచు కునే౦దుకు చోటు చూపిస్తాయి…

 అయితే…? మీరు వారిని స౦ప్ర‌ది౦చ‌డ౦ ఎలా అనుకు౦టున్నారా?
వారిని కంటాక్ట్ చేయడం ఎలా..?అనుకు౦టున్నారా?
ఇదుగో 
  ఇవే మఠాలు, సత్రాలు,తాలూకా ఫోన్ నంబర్లు….
కాకపోతే కాస్త ముందే సంప్రదించండి…రిజర్వ్ చేసుకొండి… 
ఆ స్వామి కొలువైన ప్రాంగణంలో మీ కార్యక్రమాలు నిర్విఘ్నంగా నెరవేర్చుకొండి…

ఇవిగో నంబర్లు, పేర్లు….
 తిరుమలలో వసతి దొరికే ప్రాంతాలు,వాటి ఫోన్ నంబర్లు:

1)Mool Mutt Ph:0877-2277499.

2)Pushpa Mantapam Ph:0877-2277301.

3)Sri Vallabhacharya Jee Mutt Ph:0877-2277317.

4)Uttaradhi Mutt (Tirupati) Ph-0877-2225187.

5)Shree Tirumala Kashi Mutt Ph-0877-2277316.

6)Sree Raghavendra Swamy Mutt Ph-0877-2277302.

7)Sri Vaykhanasa Divya Siddanta
8)Vivardhini Sabha Ph:0877-2277282.

9)Sri Kanchi Kamakoti Mutt Ph:0877-2277370.

10)Sri Pushpagiri Mutt Ph-0877-2277419.

11)Sri Uuttaradi Mutt Ph-0877-2277397.

12)Udupi Mutt Ph-0877-2277305.

13)Sri Rangam Srimad Andavan Ashramam Ph:0877-2277826.

14)Sri Parakala Swamy Mutt Ph:0877-2270597,2277383.

15)Sri Tirupati Srimannarayana Ramanuja
Jeeyar Mutt Ph:0877-2277301.

16)Sri Sringari Saradha Mutt Ph:0877-2277269,2279435.

17)Sri Ahobita Mutt Ph:0877-2279440.

18)Sri Tirumala Kashi Mutt phone : 222 77316

19)Udipi Mutt Ph:0877 222 77305

20)Sri Sri Sri Tridandi Ramanujajeeyar Mutt Ph:0877 222 77301)

21)Sri Kanchi Kamakoti Peetam Mutt/ Sarva Mangala Kalyana Mandapam Ph:0877 222 77370)

22)Sri Vallabhacharya Mutt phone : 222 77317

23)Mantralaya Raghavendra Swami Mutt/ Brindavanam Ph:0877 222 77302

24)Arya Vysya Samajam S.V.R.A.V.T.S Ph:0877 222 77436

25)Srirangam Srimad Andavan Ashram Ph:0877 222 77826

26)Sri Vaikhanasa Ashram Ph:0877 222 77282

27)Sri Ahobila Mutt Ph:0877-2279440

28)Sri Sringeri Shankara Mutt/ Sarada Kalyana Mandapam Ph:0877 222 77269

29)Motilal Bansilal Dharmasala Ph:0877 222 77445

30)Hotel Nilarama Choultry Ph:0877 222 77784

31)Sri Srinivasa Choultry Ph:0877 222 77883

32)Sri Hathiramji Mutt Ph:0877 222 77240

33)Karnataka Guest House Ph:0877 222 77238

34)Dakshina India Arya Vyaya Gubba Muniratnam Charities Ph:0877 222 77245

35)Sri Sringeri Sankara Nilayam Ph:0877 222 79435

36)Sri Swamy Hathiramji muttam Ph:0877-2220015

అందరికీ ఎంతో ఉపయోగ పడే సమాచారం . పదిమందికి Share చెయ్యండి…

*జీవాత్మ, పరమాత్మ*

*జీవాత్మ, పరమాత్మ*

మనకు తెలిసిన మనదేహం గురించి ప్రారంభిద్దాం. 

దేహం ఒక బల్బులాంటిది. ఆ బల్బులో ఫిలమెంటే జీవాత్మ. ఆ ఫిలమెంట్ లోకి ప్రవహించే విద్యుత్తులాంటిదే పరమాత్మ. ప్రతిబల్బులోను ఫిలమెంటు వేరు వేరుగా ఉంటుంది. అయితే విద్యుత్తు మాత్రం ఒకటే. బల్బులోని ఫిలమెంటు ప్రకాశిస్తుంది. 

అలాగే వివిధ దేహాలు ఉంటేనే ఆత్మలుంటాయి. ఫిలమెంట్ రాలిపోయి బల్బు పగిలిపోయినా విద్యుత్తు ప్రసరించదు. 

అయితే విద్యుత్తు అంతటా ఉంటుంది. పరమాత్మ లోపల, బయటా అంతటా ఉంటాడు. జీవుల కర్మానుభవానికి వారికి తగిన దేహాలనిచ్చి, ఆత్మలలో తానూ అనుప్రవేశం చేసి, కర్మసాక్షిగా ఉంటాడు. 

ఫ్యాను, హీటరు, బల్బు, మోటారు, గ్రైండర్, టీ.వి. రేడియోలాంటివే వివిధ దేహాలు. 

అలాగే అవతారాల్లో అర్చామూర్తుల (ప్రతిష్ఠించిన విగ్రహాలు) లో కూడా పరమాత్మ ఉంటాడు. 

ఆ అర్చామూర్తిని అర్చించి, ధ్యానించి సర్వప్రాణులకు సేవ చేయడం ద్వారా పరమాత్మ కైంకర్యంలో మనం తరించి ముక్తిని పొందవచ్చని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. 
******************************

ఐన్ స్టీన్ కి భారతదేశం అన్నా, భారతీయ సంస్కృతి, సాహిత్యం అన్నా ఎంతో ఇష్టం, గౌరవం. మనదేశం నుండి వెళ్ళిన శాస్త్రవేత్తని చూడగానే ఐన్ స్టీన్ సంస్కృతంలో పలకరించారు.

ఇదేమి ఖర్మ...??....::ఐన్ స్టీన్ :::

భారతదేశానికి చెందిన శాస్త్రవేత్త 1948-49 లో డా. బి.ఎన్ గుప్తా విదేశాలలో చదివారు . అతను విద్యార్థి గా ఉన్న రోజులలో . ఐన్ స్టీన్ ని కలవడానికి వెళ్ళారు. ఐన్ స్టీన్ కి భారతదేశం అన్నా, భారతీయ సంస్కృతి, సాహిత్యం అన్నా ఎంతో ఇష్టం, గౌరవం. మనదేశం నుండి వెళ్ళిన శాస్త్రవేత్తని చూడగానే ఐన్ స్టీన్ సంస్కృతంలో పలకరించారు.

ఐన్ స్టీన్ మాట్లాడిన భాష మన శాస్త్రవేత్తకు ఏమీ అర్ధం కాక బిక్కమొహం వేసారు. అప్పుడు ఐన్ స్టీన్ నేను సంస్కృత బాషలో చెప్తున్నాను "లోపలకు రండి" అని అన్నారు. "మీకు సంస్కృతం రాదా, పోనిలే లోపలి రండి!" అని మన శాస్త్రవేత్తను లోపలకు తీసుకువెళ్ళి కూర్చోబెట్టేరు.

 "హిందూతత్త్వచింతనకు మూలమైన భారతదేశం నుండి మీరు వచ్చేరు. మీదేశంలోని అద్భుతమైన సాహిత్యమంతా సంస్కృతంలో వుంది. అటువంటిది మీకు ఆ భాష తెలియకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నా గ్రంధాలయంలో భగవద్గీత మొదలుకొని భారతదేశానికి చెందిన ఎన్నో గొప్ప గొప్ప పుస్తకాలు ఉన్నాయి" అన్నారు ఐన్ స్టీన్.
    
     ఆ గదిలో ఐన్ స్టీన్ వ్యక్తిగత గ్రంధాలయం ఉంది. విశేషం ఏమిటంటే అక్కడ సైన్స్ కు సంబంధించిన పుస్తకాలు కొన్నే ఉన్నాయి. ఎక్కడ చూసినా భగవద్గీత పుస్తకాలే ఉన్నాయి.  వివిధ వ్యాఖ్యానాలతో మన భారత శాస్త్రవేత్త తెల్లమొహం పెట్టుకొని వాటినే చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు ఐన్ స్టీన్ మన శాస్త్రవేత్తకు భగవద్గీతను చూపించి, "ఇది తెలుసా మీకు?" అని అడిగారు. దానికి మన శాస్త్రవేత్త "విన్నానండీ" అని సమాదానమిచాడు.

     "ఓహ్, విన్నారా .." అంటూ ఐన్ స్టీన్ ఇలా చెప్పారు: “ఈ రోజు ఐన్ స్టీన్ ని ఐన్ స్టీన్ గా నిలబెట్టింది ఈ భగవద్గీతయే గాని ఆ సైన్స్ కాదు. నాలో ఈ విజ్ఞానశాస్త్రం పట్ల నాలో పరిశోధన దృష్టిని, ఈ విశ్లేషణ శక్తిని, విషయ విచారణ చేయగలిగే అంతరిక దృష్టి కోణాన్ని కలిగించినది ఈ భగవద్గీత ఒక్కటే (I have made the Gita as the main source of my inspiration and guidance for the purpose of scientific investigations and formulation of my theories). అందుకే నేను సైన్సుకి చాల గొప్ప విలువనిస్తాను కానీ ఆ సైన్సుకే ఆధారం ఈ భగవద్గీత అని తెలియని ఆ వ్యక్తికి విలువ ఇవ్వను" ప్రసిద్ధ శాస్త్రవేత్త ఐన్ స్టీన్ ఏమన్నారంటే!

మనం భారతీయులకు ఎంతో ఋణపడి ఉన్నాం. భారతీయులే ప్రపంచానికి గణితంలో సులభంగా లెక్కించే దశాంశపద్ధతిని కనుగొన్నారు.అదే లేకపోతే ఎన్నో వైజ్ఞానిక పరిశోధనలు సాధింపబడేవి కాదు.అన్నారట. 
   
భగవద్గీతను మార్గదర్శకంగా తీసుకున్న విదేశీయులెందరో అదేం విచిత్రమోగానీ గీత ప్రభవించిన మనదేశంలో మాత్రం అది ఒక మతగ్రంథమే. దాని గొప్ప దనాన్ని గుర్తుపట్టడం లేదు.
   🇮🇳🌹🌹🇮🇳🙏🏻                                    
దయచేసి ఈ విలువైన విషయం ప్రతి భారతీయుడికి అందేటట్లుగా ప్రచారం చేయడం మన కర్తవ్యం🙏

Tuesday, December 24, 2019

🙏దయచేసి ఇలాంటి నీతి ని మనం పాటిస్తూ,అలాగే ఇలాంటి కథలు కూడా తప్పకుండ ముందుతరాలకు పంచండి🙏

పూర్వం ఇద్దరు రాజులు యుద్ధానికి దిగారు. ఓడిన రాజు తన రాజ్యాన్ని వీడి, అడవుల్లోకి పారిపోయాడు. అక్కడే ఆధ్యాత్మిక చింతనతో కాలం గడుపుతున్నాడు. గెలిచిన రాజు ఆ ఉత్సాహంతో యజ్ఞం చేసి దానధర్మాలు చేయాలని తలపెట్టాడు. అనుకోకుండా, అక్కడ యాగధేనువు మరణించింది. అది అశుభ సూచన. యజ్ఞాన్ని ఎలా పూర్తిచేయాలో తెలియక ఆ రాజు తికమక పడ్డాడు. నగర పురోహితుల్ని సంప్రతిస్తే- ఆ ధర్మసూక్ష్మం తెలిసినవాడు ఓడిపోయిన రాజేనని తేలింది. ధర్మసంకటం నుంచి గట్టెక్కించగలవాడు ఆయనేనని నిశ్చయమైంది.గెలిచిన రాజు ఏమాత్రం సందేహించకుండా ఓడిన రాజు వద్దకు వెళ్లి, యజ్ఞాన్ని పరిపూర్తి చేయాలని అర్థించాడు. ఆయనా ఏ శషభిషలకూ తావు లేకుండా ధర్మనిర్ణయం కోసం ముందుకొచ్చాడు. శత్రువుకు సహకరించాడు.ఆ ఇద్దరు రాజులూ ఆర్షధర్మ నిర్వహణ విషయంలో అహంకారాల్ని త్యజించారు. వారి కథే- శ్రీకృష్ణదేవరాయల ‘ఆముక్తమాల్యద’లోని ‘ఖాండిక్య కేశిధ్వజోపాఖ్యానం’ సారాంశం. సమాజం అనే ధర్మసౌధం పటిష్ఠంగా నిలిచేందుకు భారతీయ ప్రాచీన సాహిత్యం ఎంతగా తోడ్పడిందో, ఈ ఉదాహరణ చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఈ కథలో ఓడిన రాజు ఖాండిక్యుడు; గెలిచినవాడు కేశిధ్వజుడు. కథ చివర గొప్ప మలుపు ఒకటుంది.తన యజ్ఞ సంపూర్తికి సహకరించిన ఖాండిక్యుడికి గురుదక్షిణగా ఏది కావాలన్నా ఇస్తానని కేశిధ్వజుడు ప్రకటిస్తాడు. అది సంప్రదాయం. ఓడిన రాజుకు ఓర్మి ఎంత ప్రధానమో- గెలిచిన రాజుకు సంయమనం, ధర్మ సంప్రదాయ పరిరక్షణ అంతే అవసరం. ఈ అవకాశాన్ని చేజిక్కించుకున్న ఖాండిక్యుడు తాను కోల్పోయిన రాజ్యం తిరిగి గురుదక్షిణగా కావాలన్నా ఇచ్చేయడానికి కేశిధ్వజుడు సిద్ధపడతాడు. ఇక్కడే ఓ చిత్రం చోటుచేసుకుంటుంది. రాజ్యసంపద అయాచితంగా వచ్చిపడుతున్నా ఖాండిక్యుడు కాదంటాడు! తనకు బ్రహ్మజ్ఞానాన్ని బోధించాలని, అదే కేశిధ్వజుడి నుంచి తాను కోరుకునే గురుదక్షిణ అని ప్రకటిస్తాడు.ఖాండిక్యుడి నిర్ణయం కేశిధ్వజుణ్ని విస్మయానికి గురిచేస్తుంది. ఆయన ఆలోచన ఏమిటో తెలుసుకోవాలని అనిపిస్తుంది. అప్పుడు ఖాండిక్యుడు అంటాడు- ‘రాజ్యభోగాలు కేవలం భౌతిక సంపదలు. వాటిని కష్టంతో, శారీరక శ్రమతో సాధించుకోవాలి. అంతేగాని, అవి అయాచితంగా లభించాలని కోరుకోకూడదు. కష్టపడి సాధిస్తేనే, వాటి విలువ తెలుస్తుంది. నా కంటే బలవంతుడి చేతిలో ఓడిపోయాను. అందులో సిగ్గు పడాల్సింది ఏముంటుంది? తిరిగి పుంజుకొని ధర్మమార్గంలో, క్షాత్రంతో నా రాజ్యాన్ని నేను తిరిగి చేజిక్కించుకోవాలి. అది ఒప్పుతుంది గాని, దొడ్డిదారిన పొందితే పాపమవుతుంది’ అని బదులిస్తాడు ఖాండిక్యుడు!ఇలాంటి కథల్ని పిల్లలకు పాఠ్యాంశాలుగా నిర్ణయిస్తే, వారి బాల్యాన్ని అవి ధార్మిక పథంలోకి నడిపిస్తాయి. వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తాయి. ఉచితాల కోసం తాపత్రయపడకుండా ఆపుతాయి. ఉచితానుచిత జ్ఞానాన్ని వారికి అలవరుస్తాయి.ఆముక్తమాల్యదలోని ఖాండిక్య కేశిధ్వజోపాఖ్యానం- ఆ కావ్యానికి గుండెకాయ వంటిదని ప్రశస్తి రావడానికి ముఖ్య కారణాలేమిటి? ఆ కథలోని ధార్మిక నేపథ్యం, ప్రబోధ గుణం. గెలుపు ఓటముల విషయంలో, కర్తవ్య నిర్వహణలో, అయాచిత అవకాశాల తిరస్కరణలో ప్రతిఫలించిన ధర్మస్వరూపమే- భారతీయతకు వన్నెలద్దుతూ వచ్చింది.లోకంలో ఇలాంటి కథలు ఒళ్లు మరిపించడమే కాదు, కళ్లు తెరుచుకొనేలా చేస్తాయి. దీనికి మన ప్రాచీన సాహిత్యమే గొప్ప ఆదరువు.🙏దయచేసి ఇలాంటి నీతి ని మనం పాటిస్తూ,అలాగే ఇలాంటి కథలు కూడా తప్పకుండ ముందుతరాలకు పంచండి🙏

Saturday, December 21, 2019

మైల / సూతకం పురోహితులకు ఉండదా ?

మైల / సూతకం  పురోహితులకు  ఉండదా ?

 మైల, సూతకం అనే విషయాలు ధర్మసింధు అనే గ్రంథంలో వివరించబడ్డాయి. 
  బ్రాహ్మణులు  ద్విజులు అంటే  (రెండు జన్మలు కలవారు) కారణమేమనిన  ఉపనయనమునకు పూర్వము ఒక జన్మ తదుపరి నుంచి మరోజన్మగా  శాస్త్రం లో  చెప్పబడినది. కావున ఉపనయన సంస్కారమునకు పూర్వము పై వారెల్లరూ శూద్ర సమానమే!

 ఉపనయనము (ఒడుగు) అయిన తదుపరి వారికి కొన్ని అచార వ్యవహారములు పాటించవలెను. కావున పురోహితులకు ఈ విషయాలలో కొంత సడలింపు ఉంది.  దశ దిన  కర్మ  అయిన తదుపరి  వారు దైవ సన్నిధిలో  వారి  కార్యక్రమాలు  చేసుకొనవచ్చును .

ఆగమ శాస్త్ర   సంబంధమయిన విషయాలు,  మరికొన్ని  అంశాలు  ఇక్కడ   పోస్ట్  లో చర్చించ దలుచుకోలేదు .

కాలభైరవాష్టకమ్Kalabhairava Ashtakamశివాయ నమః ||

కాలభైరవాష్టకమ్
Kalabhairava Ashtakam
శివాయ నమః || 

కాలభైరవ అష్టకమ్

దేవరాజసేవ్యమానపావనాఙ్ఘ్రిపఙ్కజం 
వ్యాలయజ్ఞసూత్రమిన్దుశేఖరం కృపాకరమ్  
నారదాదియోగివృన్దవన్దితం దిగంబరం 
కాశికాపురాధినాథ కాలభైరవం భజే|| ౧|| 

భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం 
నీలకణ్ఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్ | 
కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం 
కాశికా పురాధినాథ కాలభైరవం భజే||౨|| 

శూలటఙ్కపాశదణ్డపాణిమాదికారణం 
శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్ | 
భీమవిక్రమం ప్రభుం విచిత్రతాణ్డవప్రియం 
కాశికా పురాధినాథ కాలభైరవం భజే ||౩|| 

భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం 
భక్తవత్సలం స్థితం సమస్తలోకవిగ్రహమ్ | 
వినిక్వణన్మనోజ్ఞహేమకిఙ్కిణీలసత్కటిం 
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||౪|| 

ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం 
కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్ | 
స్వర్ణవర్ణశేషపాశశోభితాఙ్గమణ్డలం 
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౫|| 

రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం 
నిత్యమద్వితీయమిష్టదైవతం నిరఞ్జనమ్ | 
మృత్యుదర్పనాశనం కరాళదంష్ట్రమోక్షణం 
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||౬|| 

అట్టహాసభిన్నపద్మజాణ్డకోశసన్తతిం 
దృష్టిపాతనష్టపాపజాలముగ్రశాసనమ్ | 
అష్టసిద్ధిదాయకం కపాలమాలికన్ధరం 
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||౭|| 

భూతసఙ్ఘనాయకం విశాలకీర్తిదాయకం 
కాశివాసలోకపుణ్యపాపశోధకం విభుమ్ | 
నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం 
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||౮|| 

కాలభైరవాష్టకం పఠన్తి యే మనోహరం 
జ్ఞానముక్తిసాధనం విచిత్రపుణ్యవర్ధనమ్ | 
శోకమోహదైన్యలోభకోపతాపనాశనం 
తే ప్రయాన్తి కాలభైరవాఙ్ఘ్రిసన్నిధిం ధ్రువమ్ ||౯|| 

ఇతి శ్రీమచ్ఛఙ్కరాచార్యవిరచితం కాలభైరవాష్టకం సంపూర్ణమ్

తెనాలి రామలింగడి తెలివి అలాంటిది.తెనాలి రామలింగుని కథలు..

తెనాలి రామలింగడి తెలివి అలాంటిది.
తెనాలి రామలింగుని కథలు.. ఎక్కువగా నవ్వు తెప్పించే విధంగా ఉంటాయని తెలుసు కదా! వీటిలో ఓ చిట్టికథ మీ కోసం... ఒకసారి చైనా చక్రవర్తి శ్రీ కృష్ణ దేవరాయలకు కొన్ని నారింజ పండ్లను పంపాడు. అవి ప్రత్యేకమైన నారింజ పండ్లనీ వాటిని తిన్నవాళ్లు మృత్యుంజయులవుతారని వాటిని తీసుకొచ్చిన చైనా రాజ ప్రతినిధి దేవరాయులకు విన్నవించాడు.

పళ్లెంలో నిగనిగలాడుతున్న ఆ నారింజ పండ్లను దేవరాయలతో పాటు సభలోని వాళ్లందరూ కుతూహలంతో చూస్తూ ఉండగా రామలింగడు లేచి టక్కున ఆ నారింజ పండును వొలిచి నోట్లో వేసుకుని భలే రుచిగా ఉంది అన్నాడు. అది చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు. ఈ చర్యకు శ్రీ కృష్ణ దేవరాయలకు చెప్పనలవి కాని కోపమొచ్చింది. 

అవి చైనా చక్రవర్తి నా కోసం పంపిన పండ్లు. నా అనుమతి లేకుండా తీసుకున్నావ్... నీకు మరణశిక్ష తప్పదు అన్నారు. ఆ మాటలు విన్న తెనాలి రామలింగడు పకపకా నవ్వాడు. ఈ నవ్వు చూసిన రాయలకు మరీ కోపం ఎక్కువై ఎందుకు నవ్వుతున్నావని? అడిగారు. నవ్వక ఏం చేయమంటారు? ప్రభూ.. ఏ పండ్లు తింటే మృత్యుంజయులవుతారని చెప్పారో ఆ పండ్లను నోట్లో వేసుకోగానే నాకు మరణదండన విధించారు. 

మరి ఆ పండ్లకు మహిమ ఉన్నట్టా లేనట్టా? అన్నాడు రామలింగడు నవ్వుతూ, ఈ మాటలతో రాయలకు నవ్వుమొలకెత్తడంతో ఆయనతో పాటు సభలో ఉన్న వారందరూ నవ్వారు. మృత్యువును జయం చేసే మహిమ ఆ పండ్లకు లేవని అర్థం చేసుకున్నాక , అద్భుతమైన తీపితో కూడిన ఆ పండ్లను రాయల అనుమతి మేరకు సభలోని వారందరూ ఆరగించారు. రామలింగడి తెలివి ఎలాంటిదో చూశారు. కదా...

నీతి: క్లిష్టమైన పరిస్థితుల్ని కూడా మేథాశక్తితో జయించాలి. 

వేంకటశ్వరుడు అంటే?

వేంకటశ్వరుడు అంటే?
వేం - పాపము
కట - తీసేయడం
శ్వరుడు - తొలగించేటటు వంటివాడు .

కలియుగంలో ఎవరికీ భగవంతునికి పాదాల యందు మనస్సు నిలబడదు. కలి యొక్క ప్రభావం వల్ల భౌతిక సుఖాల వైపు ఎక్కువ మోజు ఉంటుంది. మనస్సుని నిగ్రహించడం అంత సులభం కాదు. చాలా పాపాలు చేస్తూ ఉంటాం. ఈ పాపాలు చేసేటటు వంటి వారిని ఉద్ధరించడానికి పరమాత్మ "శ్రీ వేంకటేశ్వరుడు" గా ఆవిర్భవించారు. ఆ పాపాల్ని తీసేయగలిగే శక్తి ఆ పరమాత్మకే ఉంది.

ఇక తిరుమల కొండకి వస్తే, సాక్షాత్తు వేదములే ఆ కొండకి రాళ్ళు అయ్యాయి. ఒక్కొక్క యుగం లో ఒక్కో అవతారం ఎత్తి ఆయన ధర్మాన్ని రక్షించాడు.

కృత యుగం - నరసింహావతారం,
త్రేతా యుగం - శ్రీరాముడుగా,
ద్వాపరి యుగం లో - శ్రీ కృష్ణుడుగా,
& కలియుగం లో శ్రీ వేంకటేశ్వరుడుగా అవతరించాడు.

మిగిలిన అవతారారలో చేసినట్లుగా కలియుగం లో స్వామి దుష్ట సంహారం ఏమి చెయ్యలేదు. కత్తి పట్టి ఎవ్వరిని సంహరించలేదు. ఆయన చాలా కాలం వరకు నోరు విప్పి మాట్లాడేవారు. తొండమాన్ చక్రవర్తి మీద కోపం వచ్చి మాట్లాడ్డం మానేశారు.

కాబట్టి ఆ వేంకటాచల క్షేత్రం పరమపావనమైనటువంటి క్షేత్రం. తిరుమల కొండ సామాన్యమైన కొండేమీ కాదు. ఆ కొండకి, శ్రీ వేంకటేశ్వరునికి ఒక గొప్ప సంబంధం ఉంది. తిరుముల కొండకి ఒక్కో యుగం ఒక్కో పేరు ఉండేది.
కృత యుగం లో - వృషా చలం,
త్రేతా యుగం లో - అంజనా చలం
తరువాత కలియుగం లో - వేంకటా చలం అని పేరు వచ్చింది. యుగాలు మారిపోయినా ఆ కొండ అలాగే ఉంది. ఈ కొండ శ్రీ మహావిష్ణువు యొక్క క్రీడాద్రి.. తిరుమల చాల పవిత్రమైనటు వంటి స్థలం.

Thursday, December 19, 2019

బ్రహ్మరాతను_సైతం_బ్రహ్మాండమైన_రాతగా_మార్చి_చూపిన_వసంతుడు

🌷బ్రహ్మరాతను_సైతం_బ్రహ్మాండమైన_రాతగా_మార్చి_చూపిన_వసంతుడు🌷
🌴🌴🌴🌹🌴🌴🌴
బోధ చేస్తూ ఒక మునిదంపతులు ఉండేవారు. ఆ ముని చాలా ప్రతిభావంతుడు. సకలశాస్త్రాలు, విద్యలు తెలిసినవాడు. ఆ ముని భార్య సాక్షాత్తూ అన్నపూర్ణయే. ఆమె శిష్యులను తన కన్నబిడ్డల్లా చూసుకునేది. ఆకలితో ఎవరు వచ్చినా లేదనకుండా వారి ఆకలిని తీర్చేది. అలా, ఒకనాడు ఆ ముని దంపతుల వద్దకు వసంతుడు అనే ఒక అనాథ వచ్చి శిష్యుడిగా చేరాడు. అతడు బాగా చురుకైనవాడు, తెలివైనవాడు కావడంతో, అతనికి గురువుగారు నేర్పించే విద్యలన్నీ ఇట్టే అబ్బేవి. 
వసంతుడు కొన్నాళ్ళకే తన గురువుకు తెలిసిన విద్యలన్నీ పూర్తిగా నేర్చేసుకున్నాడు. ఇక అతనికి నేర్పడానికి తనవద్ద ఉన్న జ్ఞానం సరిపోకపోవడంతో, తనకు గురువులైన వారి వద్దకు పంపించి మరీ విద్యాభ్యాసం చేయించాడు. ఆ గురువర్యుడు. అయితే కొన్నాళ్ళకే అతనికి నేర్పడానికి తమవద్ద ఉన్న విద్యలన్నీ పూర్తయ్యాయని ఆ పెద్ద గురువులైన వాళ్ళు కూడా చెప్పారు. 
ఇదిలావుండగా నిండు చూలాలైన గురుపత్ని ప్రసవించే సమయం రావడంతో, వసంతుడు ఆశ్రమంలో అన్ని పనులు తానే చూసుకుంటూ, తల్లితో సమానురాలైన గురుపత్నిని కాలు క్రింద పెట్టకుండా చూసుకుంటున్నాడు. ఆమెకు పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. ఆశ్రమంలోపల ప్రసవం జరుగుతుండగా వసంతుడు గుమ్మం బయటకు వచ్చి కూర్చున్నాడు. 
కాసేపట్లో లోపలి నుండి చంటిబిడ్డల ఏడుపులు వినవచ్చాయి. గురుపత్ని కవలపిల్లలకు జన్మనిచ్చింది. ఒక మగపిల్లవాడు, ఒక ఆడపిల్ల. ఇంతలో దివి నుండి భువికి దిగివచ్చిన ఒక దివ్యపురుషుడు వడివడిగా ఆశ్రమంలోకి వెడుతూ, గుమ్మం ముందు కూర్చున్న వసంతుడికి కనిపించాడు. మామూలు మనుషులకైతే అతను కనిపించి వుండేవాడు కాదు. కాని వసంతుడు దేవరహస్యాలు కూడా నేర్చుకున్నాడు కాబట్టి ఆ వచ్చిన అతనెవరో ఇట్టే కనిపెట్టేశాడు వసంతుడు. అతడు ''బ్రహ్మ''. అప్పుడే పుట్టిన పిల్లలకు నొసటి రాత రాయడానికి వచ్చాడని అర్థం చేసుకున్న వసంతుడు ఓపిగ్గా బయట కాచుకుని కూర్చున్నాడు వసంతుడు. బ్రహ్మ బయటకు రాగానే ఆయనకు ప్రణామం చేసి ''స్వామి'' మా గురువుగారి పిల్లల నుదుట ఏమి రాశారో దయచేసి సెలవివ్వగలరు అని వినమ్రపూరితంగా అడిగాడు. 
బ్రహ్మ తనను చూడగలిగిన ఈ పిల్లవాడు సామాన్యుడు కాడు అని తెలుసుకొని, వసంతుడు అడిగిన విధానానికి ముచ్చటపడి, ఇతరులకు తెలియజెయ్యరాని రహస్యాన్ని అతనికి చెప్పడానికి నిర్ణయించుకున్నాడు. అప్పుడు ఇలా చెప్పాడు - నాయనా! ఈ అబ్బాయి నిరక్షర కుక్షి అవుతాడు. ఇతని జీవితకాలమంతా ఇతని వద్ద ఒక మూట బియ్యము, ఒక ఆవు, ఒక పూరిపాక తప్ప మరిక ఏమీ ఉండవు. ఇతడు రోజంతా కష్టపడినా తన రెక్కల కష్టంతో కనాకష్టంగా పెళ్లాన్ని, పిల్లల్ని పోషిస్తాడు అంతే అన్నాడు. 
ఇక ఆ అమ్మాయి మాత్రం వేశ్య అవుతుంది. డబ్బుల కోసం రోజుకో పురుషుడితో సంభోగించే వారకాంత అవుతుంది అని చెప్పి అక్కడినుండి వెళ్ళిపోయాడు బ్రహ్మ. అది వినిన వసంతుడు నిశ్చేష్టుడయ్యాడు. సాక్షాత్తూ దైవసమానులైన తన గురుదంపతులకి పుట్టిన పిల్లలకు ఇలాంటి రాత రాసాడేమిటా విధాత అని విచారంగా ఆలోచనలో మునిగిపోయాడు. వెంటనే తన గురువుగారిని బ్రహ్మ రాత మార్చగలమా అని అడిగాడు వసంతుడు. దానికి, ఆయన అది సాధ్యం కాదు నాయనా. అది ఎవ్వరికీ సాధ్యం కాదు అని చెప్పాడు. పిల్లలు పెద్దవాళ్ళయ్యే కొద్దీ వాళ్ళ రాత నిజమవడం వసంతుడికి కనిపించసాగింది. 
ఆ ఇద్దరికీ చదువులు వంటపట్టడం లేదు. ఎందరికో విద్యాబుద్ధులు నేర్పిన గురువుగారి పిల్లలు ఇలా అయ్యారేమిటా? అనే దిగులుతో, వసంతుడికి దేనిమీద ఏకాగ్రత కుదరడంలేదు. దానికితోడు ఆ పిల్లలిద్దరు వసంతుడి వెంటపడి అన్నయ్య, అన్నయ్య అని తిరుగుతూ వుంటే, అతడికి దుఃఖం మరింత ఎక్కువ కాసాగింది. ఒకరోజు గురువుగారితో చెప్పి, ఆయన అనుమతి పొంది దేశం చుట్టి రావడానికి బయలుదేరి వెళ్ళాడు. ఎన్నో చోట్లకు వెళ్ళి ఎందరో పండితులను కలిసాడు. 
వారందరిని వసంతుడు ప్రశ్నించాడు. బ్రహ్మ రాసిన రాతను మార్చగలమా? దానికి వసంతుడికి అందరు చెప్పిన సమాధానం బ్రహ్మరాత మార్చడం అసాధ్యం. అది ఎవరితరమూ కాదు అని. అలా అక్కడా ఇక్కడా తిరుగుతూ, తన అన్వేషణను కొనసాగిస్తూ ఇరవై సంవత్సరాలకు పైగా గడిపాడు. అప్పటికి గురువుగారి పిల్లలకు పాతికేళ్ళు వచ్చాయి. వసంతుడికి వాళ్ళు ఎలా ఉన్నారో చూడాలనిపించసాగింది. 
ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. అప్పుడు అక్కడి పరిస్థితి గురువుగారి కుమారుడి పేరు శంకరుడు అని, ఆ ఊరిలోనే కూలిపని చేస్తున్నాడని, గురువుగారి కుమార్తె పేరు వసంతసేన అని దగ్గరలోని ఒక పట్టణంలో వ్యభిచార వృత్తిలో ఉందని తెలుసుకున్నాడు. తనకు పుట్టిన పిల్లల దుస్థితి చూసి దిగులుతో మంచం పట్టి, గురు దంపతులు మరణించారని కూడా వసంతుడు తెలుసుకున్నాడు. 
వసంతుడు బాగా ఆలోచించాడు. ముందు శంకరుడిని వెతుక్కుంటూ వెళ్ళాడు. వసంతుడిని చూడగానే అన్నయ్యా! అంటూ బావురుమన్నాడు శంకరుడు. చిన్న పూరిపాక, చిరిగిపోయిన దుస్తుల్లో భార్య, ఒక కొడుకు, ఇంట్లో ఎటు చూసినా విలయతాండవం చేస్తున్న కటిక దారిద్య్రం ఇదీ శంకరుడి దుస్థితి. తమ్ముడూ, నువ్వు బాధపడకు. ఇప్పటినుండి నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు వసంతుడు. దానికి శంకరుడు, ''సరే అన్నయ్యా! ఇకనుండి నువ్వు ఎలా చెపితే అలానే

చేస్తాను'' అన్నాడు శంకరుడు. 
ముందు ఆ ఆవుని తోలుకుని పట్టణానికి వెళదాం పద అన్నాడు వసంతుడు. ఏమి మాట్లాడకుండా ఆవును తోలుకుని వసంతుడిని అనుసరించాడు శంకరుడు. ఇద్దరూ నేరుగా పట్టణంలోని సంత దగ్గరకు వెళ్ళారు. అక్కడ ఒక దళారి దగ్గరకు వెళ్ళి ఈ ఆవుని ఎంతకు కొంటావు అని అడిగాడు వసంతుడు. తరువాత అతను చెప్పిన ధరకు అమ్మేసాడు వసంతుడు. శంకరుడికి ఏమీ అర్థం కాకపోయినా, వసంతుడికి ఎదురు చెప్పలేదు. ఆవును అమ్మగా వచ్చిన డబ్బుతో వంటకు అవసరం అయిన సరుకులను, శంకరుడి భార్యకు, పిల్లలకు కొత్త బట్టలు కొన్నారు. తిరిగి గ్రామానికి బయలుదేరారు. ఇంటికి రాగానే ఆ సరుకులతో వంట చేయించాడు వసంతుడు. శంకరుడి భార్య, పిల్లలు ఆవురావురుమని తిని ఆకలి తీర్చుకున్నారు. 
తర్వాత వసంతుడు శంకరుడితో తమ్ముడూ అన్నదానం చేద్దాం. ఆకలితో ఎవరు వచ్చినా లేదనకుండా వడ్డించు అని చెప్పాడు. శంకరుడు మారు మాట్లాడకుండా అలాగే చేశాడు. కాని శంకరుడు ఆ రోజు రాత్రి వసంతుడితో, అన్నయ్యా! ఇంతవరకు ఆ ఆవు వుంది కదా అన్న ధైర్యం నాకు ఉండేది, ఇప్పుడు ఉన్న ఆ ఒక్క ఆధారం కూడా పోయింది. దాన్ని అమ్మగా వచ్చిన ధనం కూడా అన్నదానానికి ఖర్చయిపోయింది. తెల్లవారితే ఎలా గడపాలో అని భయంగా వుంది అని అన్నాడు. దానికి వసంతుడు తమ్ముడూ, నువ్వు ఏమీ ఆలోచించకుండా సుఖంగా నిద్రపో. ప్రొద్దునకంతా సర్దుకుంటాయి అని ధైర్యం చెప్పాడు. 
ప్రొద్దున్నే లేచి తలుపు తెరచి బయటికి వచ్చి చూసిన శంకరుడి ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది. శంకరుడి ఇంటిముందు ఒక ఆవు నిలబడి వుంది. శంకరుడి ఆస్తి ఎప్పుడూ ఒక్క ఆవే అని తను రాసిన రాత పొల్లుపోకుండా ఉండడానికి రాత్రికి రాత్రి బ్రహ్మయే స్వయంగా ఒక ఆవుని తీసుకొని వచ్చి అక్కడ కట్టేసాడు. 
ఆ రోజు కూడా ఆవును తీసుకెళ్ళి సంతలో అమ్మి, వచ్చిన ఆ డబ్బుతో అన్నదానం చేయించాడు వసంతుడు. తమ్ముడూ, ఇక ఇలాగే ప్రతిరోజూ క్రమం తప్పకుండా చేస్తూ ఉండు అని చెప్పి వసంతుడు అక్కడి నుండి వసంతసేనను వెతుక్కుంటూ బయలుదేరాడు. అన్ని దానాల్లోకెల్లా గొప్పదైన అన్నదానాన్ని క్రమం తప్పకుండా చేస్తున్నందున శంకరుడు తన జీవితంలో అనంతమైన పుణ్యాన్ని మూట కట్టుకున్నాడు. 
వసంతుడు వాళ్ళని, వీళ్ళని అడుగుతూ వెళ్ళి వసంతసేనను కలుసుకున్నాడు. వసంతసేన ఒక అవ్వతో కలసి ఒక ఇంట్లో ఉంటోంది. ఆమె వసంతుడిని చూడగానే భోరుమని ఏడ్చేసింది. అన్నయ్యా! నేను మహాపాపిని. ఈ పాపపంకిలంలో కూరుకుపోయాను. మీలాంటి ఉన్నతుడిని చూడటానికి కూడా నాకు అర్హత లేదు అని బావురు మంది. ఊరుకో చెల్లీ! ఊరుకోమ్మా! ఈ పాపపు పంకిలం నుండి నువ్వు బయటపడే మార్గం చెబుతాను. ఇక ఇవాల్టి నుండి నేను చెప్పినట్లు చెయ్యి అని ఆమెను ఓదార్చాడు వసంతుడు. దానికి సరే అని ఒప్పుకుంది వసంతసేన. 
ఆ రాత్రికి విటులు ఎవ్వరు వచ్చినా లక్ష వరహాలు చెల్లిస్తేనే లోపలికి ప్రవేశం అని చెప్పమని అక్కడ వసంతసేనతో ఉన్న అవ్వకు చెప్పాడు వసంతుడు. ఆమె ఆశ్చర్యపడుతూ అయ్యా! ఇది జరిగే వ్యవహారం కాదు అని ఏదో చెప్పబోయింది. వసంతుడు ఆమెను మధ్యలోనే వారించి నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్లుగా. ఆ రాత్రి ఇద్దరు, ముగ్గురు విటులు వచ్చి లక్ష వరహాలు అనగానే వెనుదిరిగి వెళ్ళిపోయారు. అది వాళ్ళు ఊహించలేని మొత్తం. 
కాని అర్ధరాత్రి సమీపిస్తూ ఉంది అనగా ఒక మహాపురుషుడు మాత్రం లక్ష వరహాలతో వచ్చి ఆ రాత్రి వసంతసేనతో గడిపి వెళ్ళాడు. ఆ మరుసటిరోజు రాత్రి కూడా అలాగే జరిగింది. తన రాత తప్పకూడదని, లక్ష వరహాలు ఇచ్చి వసంతసేనతో సంభోగించింది సాక్షాత్తూ ఆ బ్రహ్మే నని వసంతుడికి తెలుసు. అలా బ్రహ్మ సంభోగం వలన అప్పటివరకు ఆమె మూటగట్టుకున్న పాపాలన్నీ పటాపంచలయ్యాయి. ఆమె జన్మ చరితార్థమైంది. అలా వసంతుడు వాళ్ళిద్దరి చేత పుణ్యకర్మలు చేయించి, గురుదంపతుల రుణం తీర్చుకున్నాడు. 
ఈ ప్రపంచంలో ప్రతి జీవి నుదుట తలరాత రాసేది బ్రహ్మే అయినా దానిని చక్కగా తీర్చిదిద్దుకునే శక్తిని, అవకాశాన్ని మాత్రం ప్రతి జీవికి ఇచ్చాడు అని గ్రహించాడు, దానిని నిరూపించాడు. అలా బ్రహ్మ రాతను సైతం బ్రహ్మాండమైన రాతగా మార్చి చూపాడు వసంతుడు.                        🌹🌹🌹🌹                       (ఇక నుండి మనవిధిని మనమే నిర్ధారించుకుందాం.)

*భారత దేశం లోనే తొలిసారిగా* *"ప్లాస్మాటిక్ వేద" వారి**బయో ప్లాస్మిక్ మెడికేషన్ లెవెల్ .1* *కోర్సు* *ఉచిత శిక్షణ*

*భారత దేశం లోనే తొలిసారిగా* *"ప్లాస్మాటిక్ వేద" వారి*
*బయో ప్లాస్మిక్ మెడికేషన్ లెవెల్ .1* 
*కోర్సు*  
*ఉచిత శిక్షణ* 
*మన భారతీయ ఋషుల జ్ఞానం ని సైంటిఫిక్ గా మార్చి సిద్ధులు రహస్య లను సైన్స్ గా మార్చిన ప్లాస్మా ఋషి శ్రీ.యెస్.సురేంద్ర నాథ్ గురూజీ బోధన లో తేదీ.03.11.2019 నాడు జరుగును* 
*Time:* 09.30 am to 5.30 pm
*పై శిక్షణ ద్వారా*
*1. 200 రకాల పైగా అనారోగ్యాలు ఎటువంటి మందులు లెకుండా, ఏ వస్తువులు అవసరం లేకుండా, మీకు మీరు తగ్గించుకోవచ్చు, మీ కుటుంబ సభ్యులకు/ఇతరులకు తగ్గించవచ్చు.*
*2. మీ పిల్లలు  చదువులో/ప్రవర్తన లో అత్యుత్తమ ఉన్నతి సాదించుటకు ప్రపంచ స్థాయి టెక్నిక్ సూపర్ బ్రెయిన్ activation యోగా. ( ఇది మీరు నేర్చుకొని మీ పిల్లలకు నేర్పవచ్చు.)*
*3.ప్రాణ యవ్వన్. ఈ కోర్సు ద్వారా నడక కంటే సులభమైన తైచి వ్యాయామాలు ద్వారా దేహాన్ని దృఢంగా చేయుట మరియు వయస్సు తగ్గుట నేర్చుకోవచ్చు.*
*4. పుణ్యం పెంచే ధ్యానము. ఇది నేర్చుకోవడం ద్వారా  ప్రారబ్ద ఆగామి జన్మల ను ఆధ్యాత్మిక/ఆర్థిక/సామాజిక పరంగా అభివృద్ధి చేసుకొనడం నేర్చుకొంటారు.*
*5. కర్మ రహస్యాలు సైంటిఫిక్ గా తెలుసుకుని కర్మని ఎలా ఎదుర్కొని జీవితాన్ని ఎలా సుఖమయం చేసుకోవాలో నేర్చుకుంటరు.*
*6. సూక్ష్మ శక్తులను ప్రాక్టీకల్ గా నేర్చుకొని అవి మన జీవితంలో అన్నిరకాల అవసరాలకు ఎలా ఉపయోగించాలి అనేది తెలుసుకుంటారు.*
*7. ఇంకా చావు పుట్టుక మరియు ఎన్నో రకాల ఆధ్యాత్మిక రహస్యాలు ప్రాక్టీకల్ గా మీ కోసం*
*కోట్లాది రూపాయల లు ఖర్చు పెట్టినా, హిమాలయాలు మొత్తం తిరిగినా దొరకని జ్ఞానం, గురువు మీకు  పై శిక్షణ ద్వారా లభించబోతుంది.* 
దయచేసి *DONT MISS ఇట్*
పూర్తి వివరాలు కు.
*ప్లాస్మాటిక్ వేద*
హైదరాబాద్ బ్రాంచ్,
శ్రీ. వంశీ కృష్ణ,
95427 02549
79898 69475.
*ముఖ్య గమనిక: మీ యొక్క ఎటువంటి అనారోగ్య మైనా క్లాస్ లో తగ్గించుట ఉచితం గా గురువు  గారు  నేర్పేదరు.*
*వేదిక:*
 🏢పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం *
 పబ్లిక్ గార్డెన్ సమీపంలో,
 opp.Huz హౌస్,
 * నాంపల్లి *
 * హైదరాబాద్-500004 *.

🎙 * ఈ బంగారు అవకాశాన్ని చేజార్చకోకండి.ఇతరులను హాజరు చేయించండి  మరియు ప్రేరేపించండి, ఈ  సహజ సిద్ద  శక్తివంతమైన చికిత్స మీ జీవితాన్ని మారుస్తుంది *.
🙏🙏🙏🙏🙏🙏🙏

బ్రాహ్మణత్వము గురించి భీష్ముణ్ణి ధర్మరాజు ఇలా అడిగాడు.

బ్రాహ్మణత్వము గురించి భీష్ముణ్ణి 
ధర్మరాజు ఇలా అడిగాడు. గురించి భీష్ముణ్ణి 
ధర్మరాజు ఇలా అడిగాడు.
"పితామహా ! బ్రాహ్మణులు కాక ఇతరులు తాము చేసే గుణకర్మల వలన బ్రాహ్మణత్వము పొందవచ్చునా ! " అని తన సందేహం వెలిబుచ్చాడు. 

భీష్ముడు " ధర్మనందనా ! బ్రాహ్మణత్వము పొందడం చాలా దుర్లభం. ఎన్నో జన్మలు ఎత్తిన తరువాత కాని బ్రాహ్మణజన్మ లభించదు. ఈ విషయము గురించి నీకు ఒక ఇతిహాసము చెప్తాను విను. పూర్వము మతంగుడు అనే విప్రకుమారుడు ఉండే వాడు. అతడు తండ్రి ఆదేశానుసారము ఒక యజ్ఞానికి వెడుతున్నాడు. దారిలో అతడు ఒక గాడిదపిల్లను కర్రతో గట్టిగా కొట్టాడు. ఆ గాడిద పిల్ల ఏడుస్తూ తనతల్లి వద్దకు వెళ్ళి జరిగిన సంగతి చెప్పింది. ఆ గాడిద తన కూతురుతో " అమ్మా ! ఇతడు చంఢాలుడు, క్రూరుడు అందుకే నిన్ను అలా కొట్టాడు " అని చెప్పింది. గాడిద మాటలను అర్ధము చేసుకున్న విప్రకుమారుడు "ఆ గాడిద ఊరికే అలా అన లేదు. గాడిద మాటలలో ఏదో అంతరార్ధము ఉంది. లేకుంటే అలా ఎందుకు అంటుంది? " అనుకున్నాడు. విప్రకుమారుడు ఆ గాడిద వద్దకు వెళ్ళి తన జన్మరహస్యము చెప్పమని అడిగాడు. గాడిద " విప్రకుమారా ! నీ తల్లి కామంతో ఒక క్షురకుని వలన నిన్ను కన్నది. కనుక నీవు బ్రాహ్మణుడివి కాదు " అని చెప్పింది. ఆపై అతడికి యజ్ఞముకు వెళ్ళడానికి మనస్కరించక ఇంటికి తిరిగి వెళ్ళి తండ్రితో " తండ్రీ ! నేను బ్రాహ్మణ స్త్రీకి క్షురకుడికి పుట్టాను కనుక నేను బ్రాహ్మణుడను కాను. ఆ గార్ధభము ఏదో శాపవశాన ఇలా జన్మ ఎత్తి ఉంటుంది. లేకున్న ఈ నా జన్మరహస్యము ఎలా తెలుస్తుంది?. తండ్రీ ! నేను తపస్సు చేసి బ్రాహ్మణత్వము సంపాదిస్తాను " అని చెప్పి మతంగుడు తపస్సు చేయడానికి అడవులకు వెళ్ళాడు.

మతంగుడు కొన్ని సంవత్సరాలు తపస్సు చేసి ఇంద్రుడిని ప్రసన్నము చేసుకున్నాడు. "ఇంద్రుడు" ఇంద్రుడు ప్రత్యక్షమై " కుమారా ! నీవు తపస్సు ఎందుకు చేస్తున్నావు ? నీ కోరిక ఏమిటి " అని అడిగాడు. మతంగుడు " దేవా ! నాకు బ్రాహ్మణత్వము ప్రసాదించండి " అని అడిగాడు. ఇంద్రుడు " కుమారా ! బ్రాహ్మణత్వము మహత్తరమైనది. ఇతరులకు అది లభ్యము కాదు కనుక మరేదైనా వరము కోరుకో " అని అన్నాడు. మతంగుడు " అయ్యా ! నా కోరిక తీర్చడం మీకు కుదరదు కనుక మీరు వెళ్ళండి. నా తపస్సు కొనసాగిస్తాను " అన్నాడు. ఇంద్రుడు వెళ్ళగానే మతంగుడు తన తపస్సు కొనసాగించి ఒంటి కాలి మీద మరొక నూరేళ్ళు తపస్సు చేసి ఇంద్రుడిని ప్రత్యక్షం చేసుకున్నాడు. ఇంద్రుడు " కుమారా ! నీ పట్టు విడువక ఉన్నావు! శూద్రుడు ఇలాంటి తపస్సు చేస్తే చస్తాడు జాగ్రత్త అని బెదిరించి అసలు బ్రాహ్మణత్వము ఎలా సిద్ధిస్తుందో నీకు తెలుసా ! ఇంతకంటేపది రెట్లు తపస్సు చేస్తే కాని ఒక చంఢాలుడు శూద్రుడు కాలేడు. దాని కంటే నూరు రెట్లు తపస్సు చేస్తే కాని శూద్రుడు వైశ్యుడు కాలేడు. దాని కంటే వేయిరెట్లు తపస్సు చేసిన కాని వైశ్యుడు క్షత్రియుడు కాలేడు. దాని కంటే పది వేల రెట్లు తపస్సు చేసిన కాని క్షత్రియుడు దుర్మార్గుడైన బ్రాహ్మణుడు కాలేడు. దానికంటే లక్షరెట్లు తపస్సు చేస్తే కాని దుర్మార్గు డైన బ్రాహ్మణుడు ఇంద్రియములను, మనస్సును జయించి, సత్యము అహింసలను పాటించి, మాత్సర్యము విడిచి పెట్టి సద్బ్రాహ్మణుడు కాలేడు. అటువంటి సద్బ్రాహ్మణత్వము ఒక వంద సంవత్సారాల తపస్సుకు వస్తుందా ! చెప్పు " అన్నాడు. ఒక వేళ బ్రాహ్మణ జన్మ పొందినా దానిని నిలబెట్టు కొనుట కష్టము. ఒక్కొక్క జీవుడు అనేక జన్మల తర్వాత కాని బ్రాహ్మణజన్మ ఎత్త లేడు. అలా ఎత్తినా అతడు దానిని నిలబెట్టుకోలేడు. ధనవాంఛ, కామవాంఛ, విషయాసక్తితో సదాచారములను వదిలి దుర్మార్గుడు ఔతాడు. తిరిగి బ్రాహ్మణజన్మ రావడానికి ఎన్నో ఏళ్ళు పడుతుంది. అటువంటి బ్రాహ్మణజన్మ కొరకు నీవు తాపత్రయపడి నీ వినాశనము ఎందుకు కొని తెచ్చుకుంటావు. నీ కిష్టమైన మరొక వరము కోరుకో ఇస్తాను తపస్సు చాలించు " అన్నాడు. మారుమాటాడని మాతంగుడి మొండి తనము చూసి విసుగు చెంది ఇంద్రుడు వెళ్ళి పోయాడు. మాతంగుడు తిరిగి తన తపస్సు కొనసాగించాడు. కాలి బొటనవేలి మీద నిలబడి శరీరం అస్థిపంజరము అయ్యేవరకు తపస్సు చేసాడు. అతడి శరీరము శిధిలమై పడిపోతుడగా ఇంద్రుడు పట్టుకున్నాడు. ఏమిటి నాయనా ఇది? పెద్ద పులిలా నిన్ను మింగగలిగిన బ్రాహ్మణత్వము నీకెందుకు? చక్కగా వేరు వరములు అడిగి సుఖపడు " అన్నాడు. మాతంగుడు అంగీకరించగానే ఇంద్రుడు " నీవు చంఢదేవుడు అనే పేరుతో అందమైన స్త్రీల పూజలందుకుని వారి వలన నీ కోరికలు ఈడేర్చుకుంటావు " అని వరాలు ప్రసాదించాడు. కానీ బ్రాహ్మణ జన్మను ప్రసాదించలేదు.
(భారతంలోని అనుశాసనిక పర్వంలోని కథ).

అటువంటి ఉత్కృష్టమైన, పరమ పవిత్రమైన బ్రాహ్మణ జన్మను కాపాడుకోవలసిన అవసరం మన బ్రాహ్మణులదే.
జై బ్రాహ్మణ్...జై జై బ్రాహ్మణ్.

_*👌*ఆస్తి పాస్తులు, డబ్బు డాబాలు, బంగారం భూములు పంచిన వాడు మాత్రమేనా తండ్రంటే?**_👌

🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘

      _*👌*ఆస్తి పాస్తులు, డబ్బు డాబాలు, బంగారం భూములు పంచిన వాడు మాత్రమేనా తండ్రంటే?**_👌

         _**ఈమధ్య మా పెదనాన్న కొడుకు తన కూతురు పెళ్లి చేస్తూ ఆ పెళ్లికి బంధువులను పిలవడానికి పెళ్లి పిలుపులకు నన్ను తోడుగా రమ్మన్నాడు. ఇద్దరమూ కలిసి పెళ్లి పిలుపులకోసం ఒక ఊరిలో మా దూరపు బంధువుల ఇంటికి వెళ్ళాము. అతడు ఒక పెద్ద ఆఫీసర్ గా పనిచేస్తూ సుమారు మూడు లక్షల రూపాయలు పైనే "నెల జీతం" సంపాదిస్తున్న పెద్ద హోదా కలిగిన అధికారి. ఇక ఆయన భార్య కూడా నెలకు దాదాపు రెండు లక్షల రూపాయల జీతం వచ్చే ఉద్యోగం చేస్తున్న అధికారిని. ఆయన ఇద్దరి కొడుకులు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ వారు కూడా నెలకు లక్షలకు లక్షలు సంపాదిస్తున్నారు.*_

       _**కుశల ప్రశ్నలు, క్షేమ సమాచారాలు, పెళ్ళి పిలుపులు అయిన తరువాత నా కళ్ళు మరో వ్యక్తి కొరకు వెదుక్కుంటున్నాయి. అది ఆ అధికారి తండ్రి కొరకు, ఆయన ఎప్పుడు ప్రొద్దుటూరు వచ్చినా తప్పని సరిగా మా ఇంటికి వచ్చి మా నాన్నగారిని కలిసి అన్నగారు బావున్నారా అంటూ ఎంతో ఆప్యాయంగా, ప్రేమతో పలుకరించేవారు. దాదాపు పది సంవత్సరాలుగా ఆయన కనిపించట్లేదు.*_

     _**ఇక ఉండబట్టలేక అడిగేశాను, మీ ఫాదర్ కనిపించట్లేదు అని. ఆ మాటవిన్న వెంటనే అతడి ముఖం కర్కశంగా తయారైంది. ఆ దౌర్భాగ్యుడి గురించి నన్ను అడగకండి, ఆస్తి పంపకాలలో నాకు ద్రోహం చేసిన ద్రోహి అంటూ ఆవేశంగా అనేక రకాల తిట్లు తిడుతూ తన గదిలోకి వెళ్లి పోయాడు. పరిస్థితిని గమనించిన మేము మెల్లగా అక్కడినుండి బయలుదేరి బయటకు వస్తున్న మాకు ఆ ఇంటి పనిమనిషి ఎదురైంది.*_

       _**ఉండబట్టలేక ఆమెతో ఆ పెద్దాయన గురించి వివరాలు అడుగగా ఆయన గత పది సంవత్సరాలుగా ఊరి బయట ఉన్న అనాధ శరణాలయంలో ఉన్నట్లు తెలిసింది. ఆయన వయసు సుమారు 83 సం ఉండవచ్చు, ప్రస్తుతం ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో అనుకుంటూ, నేరుగా అక్కడికెళ్లి ఆయనను కలిశాను. నన్ను చూడగానే ఆయన మొహంలో వెలుగు సూర్యకాంతి వలే ప్రకాశించింది. వెయ్యేనుగుల బలాన్ని పొందినట్లుగా ఎంతో ఉత్సాహంతో నడుచుకొంటూ వచ్చి అమాంతం నా పైన ఒరిగిపోయి నన్ను కౌగలించుకొని కన్నీరు కారుస్తూ నాయనా ! మా అన్నగారిని కలిసినట్లుగా ఉందంటూ ఆనందంతో ఉప్పొంగి పోయాడు.*_

      _**బాబాయ్ గారు ఎలా ఉన్నారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగినందుకు ఆయన కళ్ళు చమర్చగా "అందరూ ఉండికూడా గత పది సంవత్సరాలుగా అనాధగా బ్రతుకుతూ తను అనుభవిస్తున్న నరకయాతనల గురించి ఆయన మాటల్లో వింటుంటే పగవాడికి కూడా ఇలాంటి దుస్థితి రాకూడదు అనుకుంటూ ", నా పూర్తి వివరాలను ఆయనకు వ్రాయించి ఇచ్చి బయలు దేరబోతున్న నన్ను మరొకసారి ముద్దాడి నాయనా మీ అమ్మ నాన్నలు అదృష్ట వంతులు ఒక్క పైసా కూడా నీకు పంచలేకపోయినా, నీకు ఉద్యోగం, వ్యాపారం లేకపోయినా వారు నిర్వర్థించవలసిన కార్యక్రమాలను నీ బాధ్యతగా నిర్వహించి వారికి ఏ కష్టమూ కలుగకుండా నీవు వారిని పువ్వుల్లో పెట్టుకుని చూసుకొంటున్నావు. నీవు నిజంగా ధన్యజీవివి నాయనా అంటూ ఆశీర్వదించాడు. అక్కడ నుండి తిరిగి వచ్చిన నాకు ఆ కుటుంబ సభ్యులలో మార్పు తేవాలన్న బలమైన సంకల్పం ఏర్పడింది.*_

       _**వెంటనే ఒక కథను టైప్ చేసి ఆ కుటుంబ సభ్యుల అందరి వాట్సాప్ నెంబర్లకు పంపించాను. పది రోజుల తర్వాత బాబాయ్ గారి దగ్గర నుండి ఫోన్ వచ్చింది. ఆయన ఆనందానికి అవధులు లేవు. నాయనా నీవు వచ్చి పోయిన వారం రోజుల తరువాత ఏ దేవుడి వరమోఏమో గాని నాకొడుకు కోడలు మనవళ్ళు వచ్చి నన్నేంతో గౌరవంగా ఇంటికి తీసుకొచ్చారు. వచ్చిన వెంటనే నా మనవడికి నీ ఫోన్ నెంబర్ ఇచ్చి ఫోన్ చేస్తున్నాను అంటూ చెబుతున్న ఆయన మాటల్లోనే ఎక్కడ లేని ఆనందాన్ని చూశా... మనసులోనే నాకు జ్ణానాన్ని ప్రసాదించిన ఆ మహా గురువులకు మనసా వాచా కర్మణా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను.*_
 
       _**ఆ కుటుంబ సభ్యులలో అంతలా మార్పు తెచ్చిన ఆ కథను మీ ముందుంచుతున్నాను.. అమరావతిలో రాజధాని వచ్చిన తర్వాత వెంకటేష్ అనే అతడు తక్కువ సమయంలో విజయవాడలో రియలెస్టేట్ వ్యాపారంలో కోట్లు సంపాదించిన వారిలో ఇతనొకడు. ఒకసారి గుంటూరుకు దగ్గర లోని ఒక పల్లెలో ఒక పొలం తక్కువధరకు వస్తోందని తెలిసి ఆ ఊరికి కారులో వెళ్ళి, అది చూసుకొని తిరిగి ఇంటికి వస్తున్నాడు వెంకటేష్. కారు అకస్మాత్తుగా ఆగిపోయింది. వెంకటేష్ ఎంతగా ప్రయత్నించినా అది స్టార్ట్ కాలేదు.*_

       _**మండుటెండలో ఆదారిలో ఎవరైనా వస్తారేమో అని కొద్దిసేపు వేచి చూశాడు. కానీ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది, ఎవరూ రాకపోవడంతో విధిలేక కారు లాక్ చేసి నడుచుకొంటూ కొంతదూరం వెళ్ళాక నాలుగు రోడ్ల కూడలిలో ఒక సోడా బంకు కనిపించింది. వెంకటేష్ కు దాహం వేస్తున్నది. ఆ సోడ బంకు వ్యక్తితో తాగడానికి ఒక చల్లని సోడా ఇవ్వమని అడిగాడు. అతను వెంకటేష్ కు తాగేందుకు సోడా ఇచ్చి అతని వివరాలను అడిగాడు.*_

       _**వెంకటేష్ తానేందుకు అక్కడకు వచ్చాడో తిరిగి ఎక్కడికి వెళ్లాలో అడ్రస్ చెప్పగానే మీ నాన్నగారి పేరు ధర్మారావు గారు కదా అని అడిగాడు. అవుననగానే అతను ఎంతో అభిమానంగా “నువ్వు ఆ మహానుభావుడి కొడుకువా ఇలా నీడలోకి వచ్చి కూర్చోండయ్యా” అని అన్నాడు. “మీరు ఇక్కడే ఉండండి, నేను ఊర్లోకి వెళ్ళి కారు రిపేరు చేయడానికి మెకానిక్ ను పిలుచుకొని వస్తాను “అని సైకిల్ తీసుకొని వెంటనే ఊర్లోకి వెళ్ళి, పది నిమిషాలకు ఒక మెకానిక్ ను వెంటబెట్టుకొని అక్కడికి వచ్చాడు.*_

        _**సైకిల్ తొక్కడం వల్ల పట్టిన చెమటలు తుడుచుకుంటున్న ఆ వ్యక్తి వైపు వెంకటేష్ ఆశ్చర్యంగా చూస్తూ, అవును “మా నాన్న గారు మీకెలా తెలుసు? నా పని కోసం నీ వ్యాపారాన్ని కూడా వదిలి ఎందుకు వెళ్ళారు? ” అని అడిగాడు. దానికి అతను, “కొన్నేళ్ళ క్రితం నా కూలింగ్ మిషన్ రిపేరి కొరకు మీ ఏరియాకు దగ్గరగా ఉన్న ఆటోనగర్ లో మెకానిక్ దగ్గరకు వచ్చి రిపేరు అయిన కూలింగ్ మిషన్ ని రాత్రి పూట సుమారు పదకొండు గంటల పైనే ఆటోలో తీసుకొస్తున్న సమయంలో మీ ఇంటి ముందే ఆటో టయర్ పగిలిపోవడం వల్ల వచ్చిన శబ్దానికి మీ నాన్న గారు బయటకు వచ్చి స్టేప్నీ టయర్ లో కూడా గాలి లేక అవస్థలు పడుతున్న మిమ్మల్ని గమనించి అప్పటికే పడుతున్న వర్షం తీవ్రకావడంతో మమ్మల్ని ఇంటి వసారాలోకి పిలిచి కూర్చోమన్నాడు.*_

       _**నేను ఉదయం నుండి కూలింగ్ మిషన్ సామాను కొరకు తిరిగి తిరిగి అలసిపోయి ఉన్నాను. మధ్యాహ్నం కూడా భోంచేయలేదు "సమయం లేక కాదు డబ్బు లేక ". ఆకలి కావడంతో, నాకు కళ్ళు తిరిగినట్లుగా అనిపించి అక్కడే ఒక చోట కూలబడ్డాను. నన్ను చూసిన మీ నాన్నగారు వెంటనే మీ ఇంట్లోనే నాకు కడుపు నిండా అన్నం పెట్టించాడు. ఆ రాత్రి పడుకోవడానికి నాకు వసతి కల్పించారు. ఆయన దేవుడయ్యా, నా జీవితాంతం ఆయనని నేనెప్పటికీ మరువలేనయ్యా“ అని అన్నాడు.*_

       _**ఇది విన్న వెంకటేష్ కి కొద్దిసేపు నోట మాటలు రాలేదు. ఎప్పుడో మా నాన్నగారు ఒక్కసారి అన్నం పెట్టి పడుకోవడానికి చోటు కల్పించిన విషయాన్ని ఇంకా ఇప్పటికీ గుర్తు పెట్టుకొని మా నాన్న గారి పైన ఇతను ఇంతగా ఆప్యాయతను చూపుతున్నాడే మరి అలాంటి తండ్రిని తనేం చేశాడో అనేది తలుచుకొని ఉద్వేగానికీ లోనయ్యాడు. ఇంటికి వచ్చినా తన తండ్రి పైన "అతని కృతజ్ఞతా భావాన్ని తలుచుకుంటూ, ఆ రోజు రాత్రంతా వెంకటేష్ కు అదే ఆలోచనతో నిద్ర పట్టలేదు. ఇంతలో తన ఏసీ రూమ్ లో తనతో పాటు తన పక్కనే పడుకొన్న తన పెంపుడు కుక్క మూలుగు విని ఆతురతతో దాన్ని నిమిరిన అతడిలో ఆలోచన రేగింది ఈ కుక్క కోసం తాను కల్పిస్తున్న సౌకర్యాలలో, దానికోసం పెడుతున్న ఖర్చులో కేవలం పదిశాతం కంటే ఎక్కువ ఖర్చు కూడా కాదు కదా తన తండ్రికి తాను పెట్టే ఖర్చు అని అనిపించింది..*_

         _**ఏ సంబంధమూ లేని “ఎవరో బయట వ్యక్తి మా నాన్నగారు ఒక్క పూట అన్నం పెట్టి విశ్రాంతి తీసుకోవడానికి ఒక్క రాత్రి చోటు ఇచ్చిన ఆ పనిని గుర్తుంచుకొని దానికి కృతజ్ఞతగా నన్ను అంతలా ఆత్మీయంగా చూసుకున్నాడే, ఒక వీధి కుక్కకు ఒకపూట అన్నం పెడితే తరువాత కనిపించిన ప్రతి సారి విశ్వాసంతో తోకాడిస్తూ మన కాళ్ళచుట్టూ తిరుగుతూ విశ్వాసం చూపిస్తుందే. మరి నా చిన్నప్పటి నుండి మానాన్న గారు నా ఆకలి తీర్చడం కోసం నాకు ఎన్ని సార్లు అన్నం పెట్టాడో, నా సుఖం కోసం ఎన్నోరకాల సౌకర్యాలను నాకు కల్పించడం కోసం ఎన్నెన్ని కష్టాలూ పడి నన్నీ స్థితిలోకి తీసుకువచ్చాడో అలాంటి నా కన్నతండ్రిపైన నేను ఎలాంటి విశ్వాసం చూపించాను, కనీసం ఒక వీధి కుక్క చూపించే విశ్వాసం, కృతజ్ఞత కూడా చూపించకుండా నిర్దాక్షిణ్యంగా ఆయనను అనాధ ఆశ్రమంలో వదిలి ఎంతటి తప్పు చేసాను” అని వెంకటేష్ తీవ్రంగా మదనపడ్డాడు. పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. వెంటనే ఆశ్రమానికి వెళ్ళి తన తండ్రిని ఇంటికి తీసుకువచ్చి, చేసిన తప్పుకు క్షమించమని పాదాల మీద పడి వేడుకున్నాడు.*_

        _**మిత్రులారా ! ఇవేవీ అభూత కల్పనలు కాదు. నా జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనలు. ఈ కథే మా బంధువులకు కనువిప్పు కలిగించింది. మరి  మీకు తెలిసిన వారికి ఈ కథను పంపండి. ఏ ఒక్కరు మారినా మీ జన్మధన్యమే కదా.. చివరగా నేను చెప్పేదేమిటంటే "తల్లిదండ్రులు నాకేమి పంచిచ్చారని కాకుండా, ఇంత గొప్ప జన్మనిచ్చిన వారిని నీవెలా చూసుకొంటున్నావనేదే ముఖ్యమైన అంశం " అని తెలుసుకోండి. దయచేసి ఎవ్వరూ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకండి.. అలాగే "తల్లిదండ్రులను చక్కగా చూసుకొంటున్న వారికి నేను నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ, ఈ కథనాన్ని వారికి అంకితమిస్తున్నాను "...*_

     _**సర్వే జనా సుఖినోభవంతు.**_

“శ్రీ వేద ధర్మకృత అష్టోత్తర శత నామావళి”ఓం శ్రీ దత్తాయ నమః

శ్రీ శ్రీ శ్రీ బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గురుదేవో పరబ్రహ్మణే నమో నమః
శ్రీ మహా గణపతయే నమో నమః

“శ్రీ దత్త జయంతి” సందర్భంగా:

“శ్రీ వేద ధర్మకృత అష్టోత్తర శత నామావళి”
ఓం శ్రీ దత్తాయ నమః
ఓం దేవదత్తాయ నమః
ఓం బ్రహ్మదత్తాయ నమః
ఓం విష్ణు దత్తాయ నమః
ఓం శివ దత్తాయ నమః
 ఓం అత్రి దత్తాయ నమః
ఓం ఆత్రేయాయ నమః
ఓం అత్రివరదాయ నమః
ఓం అనసూనాయ నమః
ఓం అనసూనాయసూనవే నమః
ఓం అవధూతాయ నమః
ఓం ధర్మాయ నమః
ఓం ధర్మపరాయాణాయ నమః
ఓం ధర్మపతయే నమః
ఓం సిద్దాయ నమః
ఓం సిద్ధిదాయ నమః
ఓం సిద్హిపతయే నమః
ఓంసిద్దిసేవితాయ నమః
ఓం గురవే నమః
ఓం గురుగమ్యాయ నమః
ఓం గురోర్గురుతరాయ నమః
ఓం గరిష్టాయ నమః
ఓం వరిష్టాయ నమః
ఓం మహాత్మనే నమః
ఓం యోగాయ నమః
ఓం యోగగమ్యాయ నమః
ఓం యోగాదేశకరాయ నమః
ఓం యోగపతయే నమః
ఓం యోగీశాయ నమః
ఓం యోగాధీశాయ నమః
ఓం యోగాపరాయణాయ నమః
ఓం యోగిధ్యేయంఘ్రిపంకజాయ నమః
ఓం దిగంబరాయ నమః
ఓం దివ్యాంబరాయ నమః
ఓం పీతాంబరాయ నమః  
ఓం శ్వేతాంబరాయ నమః
ఓం చిత్రాంబరాయ నమః
ఓం బాలాయ నమః
బాలవీర్యాయ నమః
ఓం కుమారాయ నమః
ఓం కిశోరాయ నమః
ఓం కందర్పమోహనాయ నమః
ఓం అర్దాంగాలింగితాంగనాయ నమః
ఓం సురాగాయ నమః
ఓం విరాగాయ నమః
ఓం వీతరాగాయ నమః
ఓం అమృతవర్షిణే నమః
ఓం ఉగ్రాయ నమః
ఓం అనుగ్రరూపాయ నమః
ఓం స్థవిరాయ నమః
ఓం స్థవీయసే నమః
ఓం శాంతాయ నమః
ఓం అఘోరాయ నమః
ఓం మూఢాయ నమః
ఓం ఊర్ధ్వరేతసే నమః
ఓం ఏకవక్త్రాయ నమః
ఓం అనేకవక్త్రాయ నమః
ఓం ద్వినేత్రాయ నమః
ఓం త్రినేత్రాయ నమః
ఓం ద్విభుజాయ నమః
ఓం షడ్భుజాయ నమః
ఓం అక్షమాలినే నమః
ఓం కమండలుధారిణే నమః
ఓం శూలినే నమః
ఓం డమరుధారిణే నమః
ఓం శంఖినే నమః
ఓం గదినే నమః
ఓం మునయే నమః
ఓం మౌలినే నమః
ఓం విరూపాయ నమః
ఓం సురూపాయ నమః
ఓం స్వరూపాయ నమః
ఓం సహస్రశిరసే నమః
ఓం సహస్రాక్షాయ నమః
ఓం సహస్రపాదాయ నమః
ఓం సహస్రాపద్మార్చితాయ నమః
పద్మహస్తాయ నమః
ఓం పద్మపాదాయ నమః
ఓం పద్మనాభాయ నమః
ఓం పద్మమాలినే నమః
ఓం పద్మగార్భారుణాక్షాయ నమః
ఓం పద్మకింజలక వర్చసే నమః
ఓం జ్ఞానినే నమః
ఓం జ్ఞానగమ్యాయ నమః
ఓం జ్ఞానవిజ్ఞానమూర్తయే నమః
ఓం ధ్యానినే నమః
ఓం ధ్యాననిష్టాయ నమః
ఓం ధ్యానస్తిమితమూర్తయే నమః
ఓం ధూలిధూసరితాంగాయ నమః
ఓం చందనలిప్తమూర్తయే నమః 
ఓం భస్మోద్దూలితదేహాయ నమః
ఓం దివ్యగంధానులేపినే నమః
ఓం ప్రసన్నాయ నమః
ఓం ప్రమత్తాయ నమః
ఓం ప్రక్రుష్టార్ధప్రదాయ నమః
ఓం అష్టైశ్వర్యప్రదానాయ నమః
ఓం వరదాయ నమః  
ఓం వరీయసే నమః
ఓం బ్రహ్మణే నమః
ఓం బ్రహ్మరూపాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం విశ్వరూపిణే నమః
ఓం శంకరాయ నమః
ఓం ఆత్మనే నమః
ఓం అంతరాత్మనే నమః
ఓం పరమాత్మనే నమః
ఓం కాశీవాసరసికే నమః
ఓం దత్తాత్రేయాయ నమో నమః
వేదధర్మోవాచ:
“ఓంకారాదినమోంతానం! నామ్నామష్తోత్తరo శతమ్!
శ్రద్ధయా య: పఠేన్నిత్యం! త్రిసంధ్యం నియత: సుదీ:!!

సర్వపాపవిముక్తాత్మా! జాయతే విమలాంతర:!
భుక్త్యా యధేప్సితానోభగాన్, ప్రేత్య బ్రహ్మాణి లీయతే!!

ఇత్యేతత్కధితంవత్స! ప్రసంగేన తనానఘ!
దేవనామ్నాం ప్రసంఖ్యానం! దివ్యద్రుష్ట్యా విలోకితమ్!!

క్వచిత్త్యాగీ క్వచిత్భోగీ! యోగీ సంగీ సదా~మద:!
నగ్న: పిశాచవేషీ చ! తుష్ట: పుష్ట: కృశ: క్వచిత్!!

క్వచిత్దండీ క్వచిత్ముండీ! శిఖీ సూత్రీ జాతీ సూత్రీ జటీ క్వచిత్ 
విద్వానున్మతవద్దేవో ! బిక్షువచ్చాటతే క్వచిత్!!


నిత్యం గంగాభసి స్నానం! బిక్షాచ కమలాలయే!
మాతులింగాపురే నిద్రాస్మృత: సన్నిధికృత్సదా!!

భక్తరక్షాక్షణో ఎవ:! స్మృత: సేవా స్వవేశ్మని!
స్వభోజ్యస్వార్పణం దానం! ఫలమింద్రాది దుర్లభమ్!!

య ఏతైర్నామభిర్దివ్యై: కవచం ధారయేత్కృతీ!
రాజవేశ్మని కాంతారే! దుర్గాదిషు మహాభయే!!


శత్రుచోరభయాకీర్ణే! శ్మశానే ప్రేతదూషితే!
న భయం విద్యతే తస్య! దృష్ట్యా తం విద్రువేద్భయమ్!!

ఇక్కడ నుంచి మన శరీరములోని ఒక్కొక్క భాగమును తాకుతూ నామజపము చేసిన ఆచ్చటచ్చట ఉన్న రోగములు పోవును.
శిరో లలాటం నేత్రేచ!భ్రూమధ్యం చ భ్రువౌ తధా!
...............................................
దశావృత్యాచ సర్వేషాం! నిత్యో జప ఉదీరిత:!
కవచోక్త ప్రకారేణ! న్యాస! కార్య! సదాబుధై:!!

జపారంభమునకు ముందు  “ధ్యాన శ్లోకము”
“పీతాంబరాలంకృత పృష్ఠభాగం! భస్మావగుంఠామలరుక్మదేహమ్!
విధ్యుత్సదాపింగజటాభిరామం! శ్రిదత్తయోగీశమహంనతో~స్మి!!
(పట్టువస్త్రములు కట్టుకొన్నట్టియు, విభూతితో పూయబడిన బంగారపు శరీరము కల్గినట్టియు, మెరుపు తీగలవలె పచ్చనైన జడలతో మనోహరమైనట్టియు  “శ్రీ దత్త యోగీశ్వరుడు” కి ఎల్లప్పుడూ నేను సుభక్తితో ప్రణమిల్లుతాను)
ఇలా ధ్యానం చేస్తే 
“ధ్యానం చేదం సమాఖ్యాతం! దత్తారాధనకర్మణి!
ఏవమారాధిత: క్షిప్రం! సిద్దిదో వరదో భవేత్!!

సమాయానుభావము/విస్తారభీతి  వలన “ఫలశ్రుతి” కి అర్ధము వ్రాయలేదు.
పూజ్యగురుదేవుల దివ్య పాదారువిందములకు సుభక్తితోప్రణమిల్లుతూ—శివప్రతాప్ 
(సశేషం)

యజ్ఞోపవీత మహిమ

యజ్ఞోపవీత మహిమ 

వైదిక సంస్కారాలతో పరిచయం ఉన్న ప్రతివారికీ సుపరిచితమైంది ‘యజ్ఞోపవీతం’. 

దీనినే తెలుగులో ‘జ్యంద్యం’ అంటాం. 

ఇది చాలామంది మెడలో వేలాడుతూ ఉంటుంది కానీ, ఇది అలా ఎందుకు వేలాడుతుందో చాలామందికి తెలియదు. 

ఇలా మెడలో ఈ యజ్ఞోపవీతాలను వేసుకున్న వారు నిష్టతోనూ, కొందరు ఆచారం మీద మక్కువతోనూ, కొందరు ఇతరుల ముందు ప్రదర్శన కోసం, మరికొందరు అవసరార్థం ఉపయోగించేవారుగా కనపడతారు. 

యజ్ఞోపవీతాన్ని ‘బ్రహ్మసూత్రం’ అని కూడా అంటారు. 

దీన్ని ఎందుకోసం ధరించాలో ధర్మశాస్త్రాలు ఈ విధంగా చెబుతున్నాయి.

’సూచనాత్ బ్రహ్మతత్త్వస్య 

   వేదతత్త్వస్య సూచనాత్

తత్సూత్రముపవీతత్వాత్ 

బ్రహ్మసూత్రమితి స్మృతమ్’!!

బ్రహ్మతత్త్వాన్ని సూచించడానికి, వేదతత్త్వాన్ని సూచించడానికి బ్రహ్మసూత్రాన్ని (యజ్ఞోపవీతాన్ని) ధరించాలి. అదే ఉపవీతం. అంటే రక్షణ వస్త్రం.  

యజ్ఞోపవీతాన్ని, శిఖనూ తప్పనిసరిగా ధరించాలని స్మృతులు పేర్కొంటున్నాయి. యజ్ఞోపవీతం పరమ పవిత్రమైనది. 
అది ప్రజాపతి అయిన బ్రహ్మతో కలిసి పుట్టిందని

 ‘యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్...’

 అనే మంత్రం చెబుతోంది.  

యజ్ఞోపవీతాన్ని నవతంతువులతో (తొమ్మిది దారపుపోగులతో) నిర్మించాలి. 

ఒక్కొక్క తంతువునకు ఒక్కొక్క దేవత ఉంటాడని స్మృతుల కథనం - 

‘ఓంకారో హోగ్నిశ్చ నాగశ్చ సోమః పితృప్రజాపతీ 
వాయుః సూర్యశ్చ సర్వశ్చ తన్తుదేవా అమీ నవ 
ఓంకారః ప్రథమే తంతౌ ద్వితీయేహోగ్నిస్థథైవ చ
తృతీయ నాగదైవత్యం చతుర్థే సోమదేవతా 
పంచమే పితృదైవత్యం షష్ఠేచైవ ప్రజాపతిః
సప్తమే మారుతశ్చైవ అష్టమే సూర్య ఏవ చ 
సర్వేదేవాస్తు నవమే ఇత్యేతాస్తంతు దేవతాః’!!

మొదటి తంతువులో ఓంకారం,
 రెండవ తంతువులో అగ్నిదేవుడు, 
మూడవ తంతులో నాగదేవత, 
నాలుగవ తంతువులో సోమదేవుత, 
ఐదవ తంతువులో పితృదేవతలు, 
ఆరవ తంతువులో బ్రహ్మదేవుడు, 
ఏడవ తంతువులో వాయుదేవుడు, 
ఎనిమిదవ తంతువులో సూర్యుడు, 
తొమ్మిదవ తంతువులో మిగిలిన దేవతలందరూ ఉంటారని ఈ శ్లోకాల్లోని పరమార్థం. 

‘యజ్ఞోపవీతం’ కేవలం తంతు సముదాయం మాత్రమే కాదని అదొ తొంభైయారు విషయాలకు ప్రతీక అని సామవేదఛాందోగ్య పరిశిష్టం చెబుతోంది. 

’తిథివారం చ నక్షత్రం తత్త్వవేదగుణాన్వితమ్
కాలత్రయం చ మాసాశ్చ బ్రహ్మసూత్రం హి షణ్ణవమ్’

ఈ శ్లోకంలో తాత్పర్యం ఇది. 

తిథులు 15, వారాలు 7, నక్షత్రాలు 27, తత్త్వాలు 25, వేదాలు 4, గుణాలు 3, కాలాలు 3, మాసాలు 12 మొత్తం 96. 
అంటే యజ్ఞోపవీతాన్ని ధరించిన వారికి తిథులలోనూ, వారాలలోనూ, నక్షత్రాలలోనూ, తత్త్వాలలోనూ, వేదాలలోనూ, గుణాలలోనూ, కాలాలలోనూ, మాసాలలోను పవిత్రత ఏర్పడి అవన్నీ ధరించిన వారికి శుభఫలాలను కలిగిస్తాయని అర్థం.

 ‘యజ్ఞోపవీతం’ తొంభైయారు కొలతలతో కూడి ఉండాలని ‘వశిష్ఠస్మృతి’ చెబుతోంది. 

’చతుర్వేదేషు గాయత్రీ చతిర్వింశతికాక్షరీ
తస్మాచ్చతుర్గుణం కృత్వా బ్రహ్మతంతుముదీరయేత్’

నాలుగు వేదాల్లోనూ గాయత్రీ మంత్రం 24 అక్షరాలుగానే ఉపదేశించబడింది. 

అందువల్ల ఆ మంత్రంలోని అక్షరాల సంఖ్యకు నాలుగింతలుగా అంటే (24X4=96) తొంభైయారు తంతువులుగా యజ్ఞోపవీతాన్ని నిర్మించుకుని ధరించాలని ఉపదేశం. 

గాయత్రీ మంత్రాన్ని స్వీకరించే సమయంలో ధరించేది యజ్ఞోపవీతం. కనుక, గాయత్రీ మంత్రాక్షరాలకు నాలుగింతల సంఖ్యతో కూడిన తంతువులు ఉండాలని తాత్పర్యం. 

యజ్ఞోపవీతాన్ని ఏ పరిమాణంలో తయారు చేసుకోవాలో సాముద్రిక శాస్త్రం చక్కగా ప్రబోధిస్తోంది. 

’పృష్ఠదేశే చ నాభ్యాం చ ధృతం యద్విందతే కటిమ్
తద్ధార్యముపవీతం స్యాత్ నాతిలంబం నచోచ్చ్రితమ్
ఆయుర్హ రత్యతిహ్రస్వం అతిదీర్ఘం తపోహరమ్
యశో హరత్యతి స్థూలం అతి సూక్ష్మం ధనాపహమ్’!!

అంటే యజ్ఞోపవీతం నడుము వరకు మాత్రమే వేలాడుతుండాలి. 
దానికంటే పైన గానీ, క్రిందుగాగానీ ఉండడం మంచిది కాదు. మరీ చిన్నగా ఉంటే ఆయుష్యం తగ్గిపోతుంది. మరీ పొడవుగా ఉంటే చేసిన తపస్సు నశిస్తుంది. లావుగా ఉంటే కీర్తి అంతరిస్తుంది. మరీ సన్నగా ఉంటే ధనం నష్టమౌతుంది.

బ్రహ్మచారి ఒక యజ్ఞోపవీతాన్నీ, గృహస్థుడు రెండు యజ్ఞోపవీతాలను ధరించాలి. వీళ్ళిద్దరూ ఉత్తరీయానికి ప్రత్యామ్నాయంగా అదనంగా మరో యజ్ఞోపవీతాన్ని ధరించాలి. ఆరు నెలలు కాగానే యజ్ఞోపవీతం జీర్ణమైపోతుంది. కనుక ప్రతి ఆరు నెలలకు ఒకసారి యజ్ఞోపవీతాన్ని ధరించి, పాతబడిన దానిని తొలగించాలి.

యజ్ఞోపవీతాన్ని ధరించే సమయంలోనూ, తొలగించే సమయంలో నిర్ధిష్ట మంత్రాలను తప్పక పఠించాలి. మంత్ర పఠనం కాకుండా యజ్ఞోపవీతధారణ, విసర్జనలు పనికిరావు. అశౌచాలవల్ల (ఆప్తుల జనన, మరణ సమయాలలో) ఇతర అమంగళాలు కలిగిన సంధర్భాలలో విధిగా యజ్ఞోపవీతాలను మార్చుకోవాలి. 

యజ్ఞోపవీతాన్ని పరిహాసం కోసం వాడడం, ఇతర వస్తువులను కట్టి అపవిత్రం చెయ్యడం ఎంతమాత్రం పనికిరాదు. అలాచేస్తే సమస్తపాపాలు చుట్టుకుంటాయి. 

ఒక్క మాటలో చెప్పాలంటే యజ్ఞోపవీతంలోని మన శరీరంలోని ప్రాణనాడులే! వాటిని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో, యజ్ఞోపవీత తంతువులను కూడా అంతే జాగ్రత్తతో సంరక్షించుకోవాలి. యజ్ఞోపవీతం మనిషి శ్రేయస్సుకోసం ఉపయోగపడాలే కానీ ప్రదర్శనకోసం కాదు. ప్రదర్శన కోసం వేసుకోనక్కరలేదు. 

ధర్మాలను ఆచరిస్తూ ధరించాలి. 

ఇదే యజ్ఞోపవీత మహిమ!

ఓం తత్సత్......
సర్వేజనా సుఖినోభవంతూ.......

ॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐ

*దారి తప్పిన ధర్మనిరతి*

*దారి తప్పిన ధర్మనిరతి*

మనిషి తన సహజమైన ప్రవృత్తిని విడిచి, కేవలం ఉదరపోషణార్ధనకే పరిమితమై, ఉన్నత జీవనానికి ప్రయత్నించడకపోవడం వలన సంభవిస్తున్న దుష్పరిణామాలివి.

భగవంతుడి స్థానంలో భౌతికవాదం వచ్చి చేరడం వల్ల, నైతిక నియమాలు ఒక్కటొక్కటిగా సమాజం నుంచి కనుమరుగవుతూ ఉన్నాయి.

ముఖ్యంగా నిత్యజీవితంలో అవకాశవాదులుగా మారిపోయి, పరిస్థితుల పేరుతో మనకు మనమే విలువల్ని సడలించుకుంటూ, సవరించుకుంటూ దిగజారిపోతూ ఉన్నాం.

ఇలా స్వార్థం వల్ల లోభం పెరిగింది. లోభం వల్ల మోసం పెచ్చుమీరింది. ఇలా ద్రోహం, క్రోధం, క్రౌర్యం ఒక్కటొక్కటిగా మన మనస్సుల్లో వ్యాపిస్తున్నాయి.

అయితే స్వార్థాన్ని బీజదశలోనే నివారించుకోవాలన్న వివేకం మనలో కొరవడుతోంది. తత్ఫలితంగానే అది మనోక్షేత్రంలో విషయవాసనల విషవృక్షంగా వేళ్ళునుకుంటోంది. చివరకు అది మన జీవితాన్ని మనకు తెలియకుండానే నరకకూపంగా మార్చేస్తుంది.

అందుకే శ్రీకృష్ణభగవానుడు *భగవద్గీత* లో....
*కామక్రోధలోభాలు నరకానికి మూడు ద్వారాలు. అవి ఆత్మవినాశ కారకాలు. వివేకవంతులు ఈ మూడింటినీ త్యజించవలెను* అని హితవు పలికాడు.

అయితే మన జీవనయానానికి ధర్మాన్నీ, న్యాయాన్నీ జత చేసినప్పుడు క్రోధం, లోభం వాటంతట అవే వీడిపోతాయి.

ఈ రోజు మనం పడుతున్న సంఘర్షణలన్నిటికీ ప్రధాన కారణం అన్నింటినీ అధర్మమార్గంలో స్వంతం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉండడమే. 

అయితే ధర్మం దారి తప్పితే అనేక దుష్పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది.

******************************

*అధోదృష్టితో అధఃపతనం*

*అధోదృష్టితో అధఃపతనం*

విపరీతమైన స్వార్థం, లోభం మానవ మనస్తత్వాలనే కలుషితం చేస్తున్నాయి. పుట్టింది ఈ పొట్ట నింపుకోవటానికే అన్న పోకడతో మనం భౌతిక ప్రపంచానికే పరిమితమౌతున్నాం. అత్యాశ ఆధ్యాత్మిక పరిణతికి అవరోధం.

కాలం ఎంత విపరీతంగా మారిపోయింది? అందరి దృష్టీ నిమ్న వస్తువుల మీదే లగ్నమై ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రతి ఒక్కరూ ఉదరపోషణార్ధమే చింతన చేస్తున్నారు. ప్రతి వ్యక్తి మనస్సూ కామినీ కాంచనాలలో లీనమై ఉంది. ఏదో ఒకరిద్దరు మాత్రమే ఊర్ధ్వదృష్టి కలిగి, మనస్సును భగవంతుని మీద నిలిపినవారుగా కనిపిస్తున్నారు.

మరోవైపు మనకు పరంపరగా వస్తున్న శాస్త్ర మార్గాలనూ, మార్గదర్శక సూత్రాలనూ తృణీకరించడం వల్ల, మనస్సును అంతర్ముఖం గావించే సాధనలను విస్మరించడం వల్ల మనుషులు ఇంతగా బాహ్యప్రపంచం వైపు పరుగులు తీస్తున్నారు. పైగా అహంకారంతో, మిడిమిడి జ్ఞానంతో సనాతన ధర్మాన్నీ, ధార్మికవేత్తలనూ పరిహాసమాడుతూ, తమ వినాశనాన్ని తామే కొనితెచ్చుకుంటున్నారు.

ఈ విపరీత వర్తమాన సమాజం ఎప్పటికప్పుడు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మూల్యం చెల్లిస్తూనే ఉంది. ఈ అనుభవాలతోనైనా మనం మేల్కొని పొరపాట్లను సవరించుకోకపోతే, భవిష్యత్ తరాలకు మార్గదర్శకులుగా నిలవలేక, అపఖ్యాతి పాలు కావాల్సి ఉంటుంది.

******************************

మధురా "బృందావనం" లో కొన్నేళ్ల క్రితం నిజంగా జరిగిన సంఘటన, ఇది! ఇప్పటికీ ఆ ఆనవాళ్లు' ఇంకా ఉన్నాయి, పోయి చూడటానికి,!!

మధురా  "బృందావనం" లో కొన్నేళ్ల క్రితం నిజంగా జరిగిన సంఘటన, ఇది! ఇప్పటికీ  ఆ ఆనవాళ్లు' ఇంకా ఉన్నాయి, పోయి చూడటానికి,!!

,,,ఒక పండితుడు ,తన పూరి గుడిసె లాంటి ఇంటి ముందు అరుగు పై  కూర్చుండి,,నిత్యం భక్తులకు పురాణం వినిపిస్తూ ఉండేవాడు,! క్రమం తప్పకుండా భక్తితో. భక్తుల నుండి ఏమీ ఆశించకుండా వినిపిస్తూ ఉంటే, ఆ ప్రాంతం వారు, చాలామంది వచ్చి శ్రద్ధగా వింటూ తన్మయం చెందే వాళ్ళు!!

 అప్పుడప్పుడూ ,ఆయన  తాను చెబుతున్న పురాణం మద్యలో అపి, లోనికి వెళ్ళి వస్తూ , ""మా పిల్లవాడికి స్నానం చేయించా నని ,, భోజనం పెట్టానని, పడుకో బెట్టాను ,,అనీ దుస్తులు ధరింప జేశానని ""చెప్పే వాడు,,

ఇలా రోజూ జరుగుతూ వుండేది,!

కానీ గుడిసె లో పిల్లవాడి అలి కిడి, అల్లరి, మాట ఎది ఎవరికీ  వినపడే ది కాదు,,

ఇలా ఏళ్లు గడిచాయి,,

ఒకరోజు ఆయన దేహం చాలించాడు, గ్రామస్తులు చాలా బాధ పడ్డారు,,, ""అయ్యో !!ఎంత మంచి వాడు,,,! ఎంతో భక్తిశ్రద్ధలతో ఎవరిని ఏమీ అడగకుండా అద్భుతంగా భగవద్ కథలు వినిపించి మనలను తరింప జేశాడే ,! మరల ఎవరు ఇంత గొప్పగా చెబుతారు, అంటూ విచారపడుతూ ,అందరూ  అనుకోని ,,ఆయన అంత్యక్రియలు జరిపే సన్నాహాలు. చేయడం ప్రారంభించారు ,!!

""మా అబ్బాయి ""అని చెప్పాడు కదా ,,అంటూ ఆ పిల్లాడి కోసం లోనికి వెళ్లి చూస్తే ఎవరూ కనపడలేదు వారికి!!

ఒక రోజు  ఎదురు చూశారు!, పిల్లాడి జాడ లేదు, !చివరకు వాళ్ళే అతడి కళేబరాన్ని యమునా నది ఒడ్డుకు తీసుకెళ్ళి మంచి గంధపు కట్టెలతో చితి ని ఏర్పాటు చేశారు!!

ఇక నిప్పు పెట్టడానికి వాళ్ళలో ప్రతీ వాడు,"" నేను పెడతాను ,, అంటే,,నేను పెడతాను"" అంటూ పోటీలు పడ్డారు,,,!

ఎందుకంటే, మహా పుణ్యాత్ముడు ,,ఆయన కు చేసే ఈ పని వల్ల కర్మ చేసేవారికి ఎంతో పుణ్యం వస్తుంది కదా ,,!

ఇలా వాళ్ళు పేచీ పడుతూ ఉంటే, దూరం నుండి ఒక పిలుపు  వినవచ్చింది,వారికి,!

""ఆగండి !!ఆగండి !!""అంటూ

అందరూ చూస్తుండగా, దూరంగా, ఒక పదహారేళ్ళ బాలుడు పరుగు పరుగున అటే వస్తూ కనిపించాడు ,,

""నేను మిమ్మల్ని ఒకటి కోరుకుంటున్నాను ,! చనిపోయిన ఈ పెద్దాయన నా తండ్రి. , !!నన్ను ఒక పని మీద పొరుగూరు పంపించాడు,!! అది చూసుకొని రావడం లో నాకు కొంత ఆలస్యం జరిగింది, !!నన్ను క్షమించి ,దయచేసి నా తండ్రికి అగ్ని సంస్కారం చేసే భాగ్యాన్ని అనుగ్రహించండి !!""అని విచార వదనం తో అంటుంటే వారికి చాలా ఆనందం కలిగింది,,

""చూశారా! రక్త సంబంధము బలం ఎలా ఉంటుం దొ ,?? ఆయనకు తన కన్న కొడుకు చేత ఈ పని చేయించుకునే అదృష్టం ఉండగా,ఇతరులకూ ఆ అవకాశం ఉంటుందా??" అనుకు ని"" సరే ""అన్నారు!

ఆ పిల్లవాడు చక్కగా వేద మంత్రాలు పఠిస్తూ,, అంత్యేష్టి కార్యక్రమం  అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నాడు,!! చక్కని పాండిత్యం  అందమైన,ఉచ్చారణ ,! పనస లు చదువుతూ ఉంటే, పురో హితులు కూడా  ఆశ్చర్య పోతున్నారు,,!

 ఏమా వర్చస్సు?! ఏమా శాస్త్ర పరిజ్ఞానం ,?? ఇంతవరకూ ఎవరూ, కనీ వినీ ఎరుగని శాస్త్ర విది ప్రకారం చేస్తూ చివరకు  చుట్టూ ప్రదక్షణ నమస్కారం చేస్తూ   దుఖిస్తూు ,చితికి నిప్పు అంటించాడు,!,

""నాయనా !!ఇక నీవు వెనుదిరిగి చూడకుండా దూరం వెళ్లు!!"" అన్నారు ఊరి పెద్దవాళ్ళు,!

 ఆ పిల్లవాడు అలాగే అన్నట్టుగా తల ఊపి,  నేరుగా వెళ్తుండడం, ఒక దాదాపుగా  20 గజాల దూరం వెళ్ళాక, కనిపించకుండా అంతర్ధానం కావడం ""వారు  అందరూ కళ్ళారా చూశారు,,

తెలిసి పోయింది, ఆ వచ్చినవాడు ""కృష్ణయ్య ""

ఇన్నాళ్లూ విన్న భాగవత కథ ల పుణ్యమా అని, శ్రీకృష్ణుని ఒక బాలుని రూపంలో ప్రత్యక్షంగా దర్శించే మహా భాగ్యం లభించింది కదా అంటూ   , ఆ బాలుడు నడచిన నేలపై గల ధూళిని ప్రసాదం గా , మహదై శ్వర్యముగా స్వీకరించారు,, వారంతా,!

ఇప్పటికీ ఆ ప్రదేశాన్ని పరమ పావనం గా పవిత్రంగా భావిస్తూ పూజిస్తూ ఉన్నారు బృందావన. వాసులు!, శ్రీకృష్ణుడు అదృశ్య రూపంలో కొలువై నెలవై , భక్తుల పాలిట కల్పతరువు గా అచట ఉంటున్నాడ నుటకు నిదర్శనం ఈ వాస్తవ గాథ,,!!

""మా అబ్బాయి కి నిద్ర, అహారం, స్నానం ఏర్పాట్లు చేసి వస్తా ""నని చెబుతూ  శ్రీకృష్ణ భగవానుని తన కుమారునిగా భావిస్తూ  అదే ధ్యాసతో,అంతిమ శ్వాసను విడిచిన ఆ మహానుభావుని కి ,,కృష్ణుడు, కొడుకు రూపంలో వచ్చి, స్వయంగా  కన్న తండ్రి కి కొడుకు చేస్తున్నట్టుగా , శాస్త్ర రీతిలో  పద్ధతిగా  చేశాడు,, అలా పరందాముడే స్వయంగా, అంతిమ క్రియలు చేయడం  వాళ్ళు గమనించారు,,

భక్తుడు , ఈ భవ బంధాల ను కోరుకోకుండా , నేరుగా భగవంతునితో సంబంధబాంధవ్యాలు పెట్టుకొ ని , పంచుకుంటూ, పెంచుకుంటూ  ముక్తిని పొందాడు,,!

ఈ రోజుల్లో ,,కడుపున పుట్టిన కొడుకులు కూడా  దూరంగా ఉంటూ ,,తండ్రి ఆర్తితో పిలిచే పిలుపు కు అందక పోవచ్చు!!, లేదా ఖాతరు చేయకుండా పోవచ్చు,,!!

, కానీ పరమాత్ముడు మాత్రం ""తనను నమ్మిన భక్తుడిని ,సదా సంరక్షిస్తూ, అతడి యోగక్షేమాలు  స్వయంగా చూస్తుంటాడు!!

ఇలా భగవంతునికి భక్తునికి ఉండే సంబంధం మాటలకు, ఊహకు, చేతలకు , అందదు!!

""భావాగ్రాహి జనార్దనా !" అంటే భక్తుని అంతరంగం లో కదిలే భావాలను జనార్ధ ను డు సదా గ్రహిస్తూ, ఉంటాడు..!!

 ఆ ప్రేమానుబంధం అనిర్వచనీయం,!, అద్భుతం కూడా, !!అలాంటి  బ్రహ్మానంద భక్తి సామ్రాజ్యము ఆ బృందావనం,;! 

ఆ అందాల ఆనందాల అనుబంధాల బృందావన వనసీమలో, ఒక రేణువు గా మారి, తే ఎంత బాగా ఉండేది  !

నిత్యం అచట సంచరించే

సాక్షాత్తూ రాధాకృష్ణుల మృదువైన పాదములు సుతి మెత్తగా  సోకుతూ ఉండగా,  కలిగే పరమానం దాన్ని,,అఖండ ఐశ్వర్య విభూతి వైభ వాన్ని  అందించమని నల్లనయ్య ను  కోరుకుందాం!!    

జై శ్రీ రాధే!

జై జై శ్రీ రాధే!

రాధాకృష్ణుల కు జై! బృందావన విహారీ కి జై!

స్వస్తి!

హరే కృష్ణ హరే కృష్ణా!.

నిత్య పూజ - నైవేద్యం

నిత్య పూజ - నైవేద్యం

ప్రతి కుటుంబమూ భగవంతుని ఆరాధన తప్పక చెయ్యాలి. వీలు ఉన్నవారు సరియైన విధివిధానాలను అనుసరించి పెద్ద పెద్ద ఆరాధనలు చేస్తారు. మిగిలిన వారు కనీసంలో కనీసం రోజూ పది నిముషాలైనా ఈశ్వర పూజ చెయ్యాలి. కార్యాలయాలకు, ఉద్యోగాలకు వెళ్ళేవారు కనీసం ఈ లఘు పూజనైనా చేసి తీరాలి. ప్రతి గృహంలో తప్పక ఘంటానాదం వినబడాలి.

శివుడు, అంబిక, విష్ణు, వినాయక, సూర్యుడు ప్రతిమలను తప్పక ఆరాధించాలి. దీనినే ‘పంచాయతన పూజ’ అంటారు. సాంప్రదాయం ప్రకారం వీటిని కరచరణాదులతో అర్చించరు. ఈ ఐదుగురిని ప్రతిబింబించే ప్రకృతి ప్రసాదితములను వాడాలి. నర్మదా నది తీరంలోని ఓంకార కుండంనుండి శివస్వరూపమైన బాణ లింగం, సువర్ణముఖరి నది నుండి సంగ్రహించబడిన అంబిక రూపం, నేపాళంలోని గండకి నది నుండి విష్ణు స్వరూపమైన సాలిగ్రామం, తంజావూరు దగ్గరలోని వల్లంలొ లభించే సూర్య స్ఫటికం, గంగా నది ఉపనది అయిన సోనా నదివద్ద లభించే శోనభద్ర శిల వినాయక స్వరూపంగా మనదేశ ఐక్యతను చూపించే ఈ అయిదు రాళ్ళను పూజించాలి.

వీటికి కళ్ళు, ముక్కు, చెవులు మొదలగునవి ఉండవు. మూలలు లేకపోవడం వల్ల నీటితో శుభ్రపరచడానికి చాలా తేలిక. త్వరగా తేమ ఆరిపోతుంది. పెద్ద పూజగది కూడా అవసరం లేదు, ఒక చిన్న పెట్టె చాలు. ఈ పంచాయతన పూజను పునరుద్ధరించినవారు శంకర భగవత్పాదులు. షణ్మత స్థాపనాచార్యులై ఈ ఐదింటితో పాటు సుబ్రహ్మణ్య ఆరాధనను కూడా కలిపారు. ఈ ఐదు రాళ్ళతో పాటు చిన్న వేలాయుధాన్ని జతపరచాలి.

పూజ చెయ్యడానికి పెద్ద శ్రమ కూడా లేదు. నీకు ధృతి ఉంటే ఎక్కడైనా ఎప్పుడైనా పూజ చేసుకోవచ్చు. ఇంటిలో పూజ చేసుకునేటప్పుడు దేవతామూర్తులకి వండిన అన్నాన్ని మహా నైవేద్యంగా సమర్పించాలి. పరమాత్మ ఈ విశ్వమునంతటిని మనకోసం సృష్టించాడు. మన ఇంద్రియములచేత ఆ సృష్టిలోని వాటిచేత సుఖమును పొందుతున్నాము. అటువంటి వాటిని మనం తీసుకునే ముందు వాటిని భగవంతునికి అర్పించి తీసుకోవాలి. మనం ఏదేని నైవేద్యం సమర్పించేటప్పుడు దాన్ని ఆయనకే ఇచ్చివేస్తున్నమా? కేవలం భగవంతుని ముందు ఉంచి మరలా మనం పుచ్చుకుంటున్నాం.

కొంతమంది హేళనగా అడుగుతారు, ఇవన్నీ భగవంతుడు తింటాడా అని? నివేదన అంటే నిజంగా భగవంతునికి తినిపించడమా? ఆయనకు తినవలసిన అవసరం లేదు. పూజవల్ల మన మనస్సు శుద్ధమవుతుంది. కాబట్టి దాని వల్ల లాభం మనకే భగవంతునికి కాదు. “నివేదయామి” అంటే “నేను నీకు తెలియబరుస్తున్నాను” అని అర్థం, “నీకు ఆహారం పెడుతున్నాను” అని కాదు. మనం భగవంతునితో అదే చెప్పుకోవాలి, “ఈశ్వరా! మీ దయ వల్ల మాకు ఈ ఆహారాన్ని ప్రసాదించావు” అని. అలా భగవంతునికి నివేదించిన దాన్ని ఆయనను స్మరిస్తూ మనం తినాలి.

ఆయన అనుగ్రహం లేకపోతే అసలు బియ్యం ఎలా పండుతుంది. మేధావులు పరిశోధనలు చేసి పెద్ద పెద్ద విషయాలు వ్రాయవచ్చు. కాని అవేవి ఒక గింజ ధాన్యాన్ని కూడా పండించలేవు. కృత్రిమ బియ్యం తయారుచేయాలన్నా భగవంతుడు సృష్టించిన వాటిని ఉపయోగించే తయారుచెయ్యాలి. మనిషి తయారుచేసే ప్రతి వస్తువు చివరకు భగవంతుని సృష్టి కిందకే వస్తుంది. మరి దాన్ని భగవంతునికి నివేదించకుండా మొదట మనం స్వికరిస్తే అది పెద్ద దొంగతనమే అవుతుంది.

--- “దయివతిన్ కురల్“ పరమాచార్య స్వామి వారి ఉపన్యాసముల సంగ్రహము

అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

తథాస్తు దేవతలు*

*తథాస్తు దేవతలు*

సంధ్యా సమయంలో స్వవిషయాలను పలుమార్లు అంటే ఆ దృశ్యాన్ని చూసిన దేవతలు తథాస్తు అంటూ ఉంటారు.

ఎంత ఉన్నా తరచూ డబ్బు లేదులేదు అని పలుమార్లు అంటే నిజంగా లేకుండానే పోతుంది. ఆరోగ్యంగా ఉండి అనారోగ్యంతో ఉన్నామని తరచూ అంటూ ఉంటే నిజంగానే అనారోగ్యం ప్రాప్తిస్తుంది.

కాబట్టి స్థితిగతుల గురించి అసత్యాలు, అవాస్తవాలు పలకడం మంచిది కాదు. 

అనారోగ్యానికి గురైనప్పుడు ఫలానా వైద్యుడి హస్తవాసి బాగుంటుందని అతడి దగ్గరకు వెళ్ళండని సలహా ఇస్తారు. వాస్తవానికి వైద్యులందరూ ఒకే శాస్త్రాన్ని చదువుకుంటారు. ఇక్కడ హస్తవాసి గురించి కూడా మాట్లాడతారు. హస్తవాసి బాగుంటుందనే వైద్యుడు తన వద్దకు వచ్చే రోగులకు స్వస్థత చేకూరాలని పదే పదే కోరుకోవడంతో తథాస్తు దేవతలు ఆశీర్వదిస్తారు. దాని ప్రకారమే అతడిని సంప్రదించే వారికి వ్యాధులు తగ్గుముఖం పట్టడం, దీని వల్ల మంచి పేరు రావడం చోటు చేసుకుంటాయి.

చెడు విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. ఒకరికి చెడు జరగాలని కోరుకోవడం లేదా మనకు చెడు జరుగుతుందేమోనని భయపడటం అనేవి కూడా తథాస్తు దేవతల ప్రభావంతో ఫలిస్తాయి. మరికొన్ని దుష్పలితాలు చోటు చేసుకోవడంతో ఇక్కట్లు పెరుగుతాయి.

అందుకే ఎప్పుడూ సంశయాత్మకంగా, భయంగా మాట్లాడకూడదు. చెడు జరుగుతుందేమోనని పదే పదే భయపడకూడదు. మాట్లాడకూడదు.

కాబట్టి మనం మంచి కోరుకుంటే అందరికీ మంచి జరుగుతుంది. చెడు కోరుకుంటే మనకు కూడా చెడు జరుగుతుంది.
*తథాస్తు దేవతలు*

వేదాలలో *అనుమతి* అనే ఒక దేవత ఉంది. యజ్ఞయాగాది సత్కర్మలు ఆచరించేటప్పుడు, ఈ దేవతను స్మరిస్తే వారికి కార్యసిద్ధి లభించే లాగా సహకరిస్తుందని యజ్ఞ ప్రకరణలో పేర్కొన్నారు. ఆ అనుమతి దేవతలనే సామాన్య భాషలో *తథాస్తు దేవతలు* అంటారు. 

సత్కర్మలు జరిగే పవిత్ర ప్రదేశాలే వారి నివాస స్థానం. అశ్వినీ దేవతలే తథాస్తు దేవతలు. వీరు విశ్వకర్మ అంశ అయిన సూర్యుని కుమారులు. అశ్వరూపంలో సూర్యుడు, ఛాయాదేవి సంభోగించటం మూలంగా వీరు జన్మించారు. మహాభారతంలో పాండురాజు భార్య మాద్రికి మంత్ర ప్రభావంతో నకుల, సహదేవులుగా జన్మించారు. అంతేకాదు ఆయుర్వేదాన్ని దక్ష ప్రజాపతి నుంచి అభ్యసించి ఇంద్రునికి నేర్పించారు. వీరి సోదరి ఉష. ఆమె ప్రతిరోజూ వీరిని బ్రహ్మ ముహూర్తంలో మేల్కొల్పుతుంది. ఆ తర్వాత వారు తమ సోదరి ఉషను ముందు కూర్చోబెట్టుకుని రథాన్ని అధిరోహించి తూర్పు నుంచి పడమరకు ప్రయాణిస్తారని పురాణోక్తి. 

ఏం మాట్లాడినా *తథాస్తు దేవతలుంటారు జాగ్రత్త* అని మనల్ని పెద్దలు హెచ్చరిస్తుంటారు. ముఖ్యంగా సంధ్యా సమయంలో ఈ దేవతలు సంచరిస్తారని అంటారు. పదే పదే చెడు మాటలు వ్యక్తం చేస్తే అదే జరిగిపోతుందట. తథాస్తు అనేది స్వవిషయంలోనే వర్తిస్తుంది. ధర్మానికి విరుద్ధంగా ఉచ్ఛరించకూడని మాటలను పదేపదే అంటే దేవతలు వెంటనే తథాస్తు అనేస్తారు. 

వీరినే *తథాస్తు దేవతలు* అంటారు.


==============================

==============================

మాసికాల రహస్యం ఇదే !మాసికాలు ఎందుకుపెట్టాలి ? అన్ని మాసికాలు పెట్టాలా ? కొన్నిమానేయవచ్చా ?_

మాసికాల రహస్యం ఇదే !

మాసికాలు ఎందుకుపెట్టాలి ? అన్ని మాసికాలు పెట్టాలా ? కొన్నిమానేయవచ్చా ?_

మహాభారతంలో చాలామందికి తెలియని ఒక విచిత్రఘట్టం ఉంది. అది వ్యాసప్రసాదితమై ఈ విధంగా ఉంది. కురుక్షేత్రంలో జరిగిన భీకరసంగ్రామంలో 18 అక్షౌహిణుల సైన్యం 18 రోజుల్లో నాశనం అయింది. కలుగులోని ఎలుకలా దాక్కున్న దుర్యోధనుడిని బయటకు లాగి చంపేశారు. అనంతరం మృతులకు పూర్వక్రియలు, ఔర్థ్వక్రియలు చేయడానికి అంతా గంగా నది చెంతకు చేరుకున్నారు. ఆ సమయంలో అంతఃపుర కాంతలు అందరితో ధృతరాష్ట్రుడు కూడా వచ్చాడు. వచ్చిన వారి ఏడుపులతో ఆ ప్రాంతం హృదయవిదారకంగా తయారైంది. అప్పుడు అది చూసిన వ్యాసుడు వారికి ఒక వరం ఇచ్చాడు. చనిపోయిన వారిలో ఎవరిని చూడాలనుకుంటే వారిని చూసే వరం అక్కడకు వచ్చిన వారికి ఇచ్చాడు. దాంతో అంతా తాము చూడాలనుకుంటున్న వారిని స్మరించారు. వారు కోరుకున్న వారంతా అక్కడకు ప్రత్యక్షం అయ్యారు. సంతోషంగా తమ ఇష్టులతో వారు గడిపిన కాసేపు అయిన తరువాత చనిపోయిన వారు వెళ్ళిపోయే సమయం వచ్చింది. అప్పుడు వ్యాసుడు ‘‘చనిపోయిన వారితో ఎవరైనా వెళ్ళదలిస్తే వారు కూడా వెళ్ళవచ్చు‘‘ అని మరో వరం ఇచ్చాడు. కొంతమంది తమ ప్రియాతి ప్రియమైన వారి ప్రేతాత్మతో కలసి  వెళ్ళిపోయారు.

ఇది చాలా అరుదైన వరం. చనిపోయిన వారిని చూడవచ్చా ? అంటే చర్మచక్షువులతో చూడలేము. కేవలం జ్ఞానచక్షువులు, వ్యాసాది మహర్షులిచ్చే దివ్యచక్షువులతో చూడగలము అని ఈ ఘట్టం ద్వారా తెలుసుకోవచ్చు. అయితే నేడు పితృయజ్ఞాలను అవహేళన చేసే వారు ఎక్కువయ్యారు. వేదవేదాంతాలలో ఉన్న మహాసాధనా రహస్యాలు చెపుతుంటే చొప్పదండు ప్రశ్నలు వేసేవారు కొందరైతే, మరికొందరు తమ సున్నతమైన వేదబోధ గమనించకుండా కుతర్కాలు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఈ పితృయజ్ఞాలలోనే ఉంది. అతి తేలిగ్గా సకల పుణ్యాలు, సకల సంపదలూ ఇచ్చే ఈ పుణ్యకార్యాలు ఆచరించకుండా పిశాచగ్రస్తులు అడ్డుపడుతుంటారు. కనుకనే ఈ మంచి మాటలు వారి చెవులకు సోకవు. కేవలం పితృదేవతల అనుగ్రహం ప్రాప్తం ఉన్నవారిని మాత్రమే ఇవి చేరుకుంటాయి.

చాలా మందికి కొన్ని మంచి సందేహాలు కూడా  వచ్చాయి. *చనిపోయిన తరువాత జీవుడు ఏమవుతాడు ? మనం పెట్టే పిండాలు వారికి ఎలా చేరుతాయి ? దేవతగా ప్రేత ఎలా మారుతుంది ? పిండాల వల్ల ప్రయోజనం ఏమిటి ?* అనేవి అందులోని ముఖ్యప్రశ్నలు.

వీటికి సమాధానం ఒక ఉపనిషత్తు చెబుతోంది. ఆ ఉపనిషత్తు పేరు పిండోపనిషత్తు. ఇది అథర్వణ వేదశాఖకు చెందినది. ఈ వేదం ఎక్కువగా కర్మయోగానికి చెందినది. ఇందులో నిత్యనైమిత్తికకామ్య యజ్ఞాలు ఎలా చేయాలో ఎక్కువగా ఉంటుంది. దీనికి చెందిన ఈ ఉపనిషత్తులో ఈ రహస్యాలు చెప్పారు.

బ్రహ్మదేవుని దేవతలు, మహర్షులు ఈ విధంగా ప్రశ్నించారు. మృతులకు సమర్పించిన పిండాలను వారు ఏవిధంగా స్వీకరిస్తారు ? అనే ప్రశ్నలు వేశారు. దానికి సమాధానంగా బ్రహ్మ దేహం దేహి గురించి వివరాలు చెప్పాడు.

మరణించిన తరువాత పాంచభౌతికమైన శరీరం నుంచీ పంచభూతాలూ విడిపోతాయి. ఈ శరీరం భూమి, నిప్పు, నీరు, గాలి, ఆకాశం అనే మహాభూతాలతో ఏర్పడింది. ఎప్పుడైతే ఇందులోని దేహి శరీరం నుంచి వెళ్ళిపోతాడో, పంచభూతాలు కూడా ఎలా వచ్చినవి అలానే వెళ్ళిపోతాయి. ఇది ఆధునిక వైద్యశాస్త్రజ్ఞలు కూడా అంగీకరించినదే. ముందుగా గాలి వెళ్ళిపోతుంది (ఊపిరి తీసుకోవడం). దాని వలన పంచప్రాణాలు పోతాయి. గాలి తరువాత అగ్ని పోతుంది. శరీరం చల్లబడుతుంది. వైశ్వానరాగ్ని వెళ్ళిపోతుంది. తరువాత శరీరంలో ఉన్న నీరు తోలుతిత్తిలోని తొమ్మిది రంధ్రాల నుంచీ కారిపోతుంది. ఎప్పుడైతే గాలి, నీరు, నిప్పు శరీరం నుంచీ తప్పుకున్నాయో భూతత్త్వం అయిన ధాతువులు ఎముకలు వెంట్రుకలు గోళ్ళు వంటి రూపంలో మిగులుతాయి. ఇవి భూమిలో కలిసిపోతాయి. శరీరాకాశం మహాకాశంలో కలిసిపోతుంది. క్లుప్తంగా జరిగేది ఇదే. ఇది పంచభూతాలు వెళ్ళిపోయే విధానం.

నిజానికి మనకు కనిపించే స్థూలమైన బాహ్య శరీరంతో పాటుగా ప్రతీ ఒక్కరికీ కారణ శరీరం, యాతనా శరీరం అని ఉంటాయి. కారణ శరీరం మరో జన్మకు మనం చేసుకున్న పాపపుణ్యాల సంచులు మోసే శరీరం. తన సంచుల్లో ఉన్న పాపపుణ్యాల ప్రకారం  మరో శరీరం వెతుక్కుంటూ వెళిపోతుంది. అదే నూతన శరీరం పొందుతుంది. యాతనా శరీరం నరకానికో లేక స్వర్గానికో వెళిపోతుంది. ఇలా వివిధ శరీరాలు ఎవరి దోవన అవి వెళిపోతే మృతుని ప్రేత మిగిలి ఉంటుంది.

ప్రేత ముందు పదిరోజులూ తన ఇల్లూ, తన పరివారం, తన ఆస్తులు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో వేసే నిత్యపిండం కాకి రూపంలో వచ్చి తీసుకుంటుంది. దీని తరువాత పదోరోజున సపిండులు, సగోత్రీకులు, బంధువులు, స్నేహితులు వచ్చి వదిలే ఉదకాలు దాని దాహాన్ని తీరుస్తాయి. వీటికి తృప్తి పడి అది పదిరోజుల తరువాత తన వారిని, నా అనుకునే వారిని వదిలి వెళిపోతుంది. అయితే ఇది ప్రేత రూపంలోనే ఉంటుంది. పూర్వక్రియలు అయిన దహన సంస్కారాది 12 రోజుల క్రియలు పూర్తి అయి, మధ్యమ క్రియలు అయిన మాసికాలు జరిగి, పూర్వక్రియలకు అర్హమైన సపిండీకరణం జరిగే వరకూ ఈ ప్రేత రూపంలోనే ఉంటుంది. సపిండికరణం తరువాత తన ముం దున్న వర్గత్రయంలో తన తండ్రి తాత ముత్తాతల్లో ముత్తాతను ముందు జరిపి ఆయన ఖాళీలో తాతను, తాత స్థానంలో తండ్రిని, తండ్రి స్థానంలో తాను చేరుకుంటుంది. పితృదేవతాస్థానం పొందుతుంది.

దీనికి కావలసిన క్రొత్త శరీరం మాసికాల ద్వారా చేసే ఏకోద్దిష్టశ్రాద్ధాల రూపంలో అందుతుంది. నిన్నటి బాహ్యశరీరాన్ని విడిచి కారణశరీరం, యాతనా శరీరం కోల్పోయి ప్రేతగా ఏ శరీరం లేకుండా ఉన్న మృతుడు మాసికాలలో కేవలం తనకు మాత్రమే ఉద్దేశించి వదిలే పిండాల ద్వారా క్రొత్త శరీరం సంతరించుకుంటాడు.

వీటిలో మొదటి పిండం  ద్వారా క్రొత్త శరీరానికి బీజం పడుతుంది. దీన్నే కలనం అన్నాడు.

దీని తరువాత మాంసం చర్మం రెండో పిండం ద్వారా ఏర్పడతాయి.

మూడో పిండం వలన బుద్ధి కలుగుతుంది. (మెదడు). 

నాలుగో పిండం వలన ఎముకలు, ఎముకల్లోని గుజ్జు ఏర్పడతాయి.

ఐదో పిండం వలన శిరస్సు, ముఖం, వేళ్ళు ఏర్పడతాయి.

ఆరో పిండం వలన హృదయం, మెడ, నోటిలోని భాగాలు  ఏర్పడతాయి.

ఆయుప్రమాణం ఏడో పిండం ద్వారా కలుగుతుంది.

ఎనిమిదో పిండం ద్వారా మాటకు చెందిన వ్యవస్థలు కలుగుతాయి.

తొమ్మిదో పిండం ద్వారా అన్ని అవయవాలకు పరిపుష్టి చేకూరి దృఢపడతాయి.

పదో పిండం వలన క్రొత్త జీవితానికి అవసరమైన శారీరక పరిపూర్ణత చేకూరుతుంది.

ఈ విధంగా మాసికాలలోని పిండదానం వలన పిండశరీరం నుంచీ సంపూర్తి శరీరం పిండాల వలన కలుగుతుంది. ప్రపంచంలో భోగాలు అనుభవించడానికి శరీరం ఇచ్చిన తల్లి తండ్రులకు మాసికాలు నిర్వహించి వారికి శరీరం ఏర్పడడానికి అవసరమైన పిండాలు సమర్పించి వారి ఋణం తీర్చుకోవాలి.

నిజానికి మొత్తం 16 పిండాలు ఈ సంవత్సర కాలంలో ఇస్తారు. వీటిలో 10 పిండాల గురించి  మృతుడు క్రొత్త శరీరాలు పొందడానికి దోహదం చేసే ఆహారంగా ఉపయోగిస్తాయని పిండోపనిషత్తు చెప్పింది, మిగిలిన పిండాల గురించి గరుడపురాణంతో పాటు అనేక పురాణాలు చెబుతున్నాయి.

అంతేకాక మృతుని శరీరం నుంచీ పంచభూతాలు ఏవిధంగా దూరం అవుతాయో అదే విధంగా తిరిగి వారికి భౌతిక శరీరం ఏర్పడడానికి పంచభూతాలూ కలుస్తాయి. ముందుగా జీవికి ఆస్తిక్యం ఇవ్వడానికి కారణం అయిన ఆకాశం అతనికి స్థలం ఇస్తుంది. ఆ తరువాత అగ్ని, జలం, వాయువు, భూమి తత్త్త్వాలు అతనికి శరీరం కల్పిస్తాయని ఉపనిషత్తు చెబుతోంది.

కనుక మృతులకు మాసికాలు అన్నీ పెట్టవలసిందే. మాసికాలకు ప్రత్యామ్నాయం లేదు. ఏది వదిలితే అది ఎన్నో పిండమైతే ఆ దశలో ఏర్పడాల్సినవి ఏర్పడక మృతునికి వైలక్యం కలుగుతుంది. మనకు కోట్లు ఖరీదు చేసినా దొరకని భోగశరీరాన్ని ఇచ్చిన తండ్రికి ఇంత పిండం పెట్టకపోవడం వలన అతనికి వైకల్యం కలిగించినవారమవుతాము. మహాఘోరమయ్యే తప్పు చేయకూడదు.

మాసికాలు మానివేస్తే ఇటువంటి వైకల్యం కలుగుతుంది. సపిండీకరణం చేయకపోతే పితృదేవతా రూపం రాదు. తండ్రికి ప్రేతత్త్వం విడుదల చేయకపోతే తరువాత తరాలు అన్నీ ప్రేతత్త్త్వంలోనే ఉండిపోతాయి. కనుక మధ్యమ క్రియలైన మాసికాదులు చేయడం చనిపోయిన వారికి మాత్రమే కాదు, కర్తకు కూడా లాభం చేకూర్చేది. తనకు దుర్గతి రాకుండా మంచి మార్గం వేసుకోవడం వంటిది.ఇవి మన పురాణాలు, ఉపనిషత్తులు చెబుతున్న పితృయజ్ఞరహస్యాలు.

ఇవన్నీ సమాన్యంగా తప్పనిసరిగా చేయవలసినవి. ఇవే మరింత ప్రేమగా చేయాలనుకుంటే పుణ్యక్షేత్రాలైన కురుక్షేత్రం, ప్రయాగ, కాశీ, గయా వంటి వాటిలో చేయాలి. ఇలా చేస్తే వారికి విశేషమైన శరీరాలు కలిగించిన వారమవుతాము. దాని వల్ల మనకే ప్రయోజం ఉంటుంది. వారికి కలిగే ఉత్తమ శరీరాల వల్ల పరమానందం పొంది మరింతగా సకల సంపదలు మనకు ఇస్తారు.

పిండాలు ప్రేతాలకు వెళతాయా ? అని వితండవాదం చేసే వారికి సమాధానమే ఈ పిండోపనిషత్తు.

నిజానికి ఉపనిషత్తులు అన్నీ రహస్యాల సమూహాలు. అవి పైకి ఒక అర్ధంలో కనిపించే సామాన్యపదాలుగా కనిపించినా వాటి వెనుక కేవలం మహాసాధకులకు మాత్రమే తెలిసే అనేక రహస్యాలు ఉంటాయి. అవి కేవలం సాధకులు, పరిశ్రమ చేసిన విజ్ఞులు మాత్రమే అందుకోగలుగుతారు. వీటిని వారు అందరికీ చెప్పరు. కేవలం ఫలానా పిండదానాలు ఫలానా చోట చేయండి అనిమాత్రమే చెబుతారు. గయలో ఎందుకు చేయాలి ? ప్రయాగలో ఎందుకు చేయాలి అంటే వాటికి అనేక రకాలైన కారణాలు కూడా చెబుతారు. పుణ్యక్షేత్రాలుగా చెబుతున్న ప్రాంతాలు అన్నీ పరమాత్మ శరీరాంగాలు. ఒకటి శిరస్సు, మరొకటి హృదయం, కాళ్ళు, చేతులు.... వంటివి.

_ఇలా ఆ ప్రాంతాలలో చేయలేని వారు కనీసం తాను ఉన్న చోటునైనా చేయాలి. వెళ్ళగలిగిన వారు ప్రయాగ కుంభమేళాల వంటి వాటికి వెళ్ళి చేయడం వలన దివ్యమైన ఫలితాలు పితృదేవతానందం వలన కలుగుతాయి.  వెళ్ళలేని వారు మానసికంగా అయినా వాటిని కీర్తించడం వలన పుణ్యం పొందుతారు.ఇవే మాసికాలు పిండప్రధానాల రహస్యాలు.

దివ్యాత్మస్వరూపులారా!_

ఇప్పటి వరకూ స్వధానామసాధన, స్వధాస్తోత్రపఠనం చేసిన సాధకులకు ఇదిసాధనలో రెండో సోపానం. సాక్షాత్తూ బ్రహ్మదేవుడు చెప్పగా వ్యాసభగవానుడు ప్రసాదించిన దివ్యమైన పితృస్తోత్రం అందిస్తున్నాము. దీన్ని చదువుకున్న వారి సర్వపాపాలూ పితృదేవతైన తండ్రి తొలగిస్తాడు. ఇది మూడు కాలాలలో లేదా రెండు కాలాలలో లేదా కనీసం రోజుకు ఒక సారి అయినా చదువుకుంటే సకల దరిద్రాలూ తొలగిపోతాయి. సకల కష్టాలూ తొలగిపోతాయి. సర్వకార్యాలలో జయం సిద్ధిస్తుంది. సకల దేవతలూ సంతోషించి సకల కోరికలూ తీరుస్తారు._ 

దీన్ని స్వధా స్తోత్రం అనంతరం చదువుకోవాలి. తండ్రి బ్రతికే ఉన్నవారు ఇంకా అదృష్టవంతులు. ఈ స్తోత్రాన్ని తండ్రి సన్నిధిలో చదువుకొని ఆయన పాదాలకు నమస్కరించుకుంటే దివ్యమైన ఫలితాలు కలుగుతాయి. చేసిన పాపాలు నాశనం అవుతాయి !_

Yes, she has gained weight? Defeated without losing a bout.

అవును, ఆమె కొంచెం బరువు పెరిగే వుంటుంది. ఎందుకంటే…. ఆటల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచే నిండైన ఆత్మాభిమానాన్ని, విశ్వ వేదికపైనే కాదు వ...