Thursday, January 22, 2026

నేడు - చొల్లంగి అమావాస్య,- మౌని అమావాస్య...!!*🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

*నేడు - చొల్లంగి అమావాస్య,- మౌని అమావాస్య...!!*
🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

పుష్య మాసంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్య లేదా చొల్లంగి అమావాస్య అని పిలుస్తారు. మౌని అంటే సంస్కృతంలో నిశ్శబ్దం అని అర్థం. మౌని అమావాస్య నాడు మౌన వ్రతాన్ని పాటించడం వలన విశేష ఫలితాన్ని పొందవచ్చు. 

🌿మౌన వ్రతం పాటించడం వలన ఒకరోజు ఆయుష్షుని పెంచుకోవడానికి అవుతుంది. ఈసారి ఈ చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య ఎప్పుడు వచ్చింది?

మౌని అమావాస్య రోజున బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయడం, దానం చేయడం పవిత్రమైనదిగా భావిస్తారు. ఉదయం 5:25 నుంచి 6:19 వరకు బ్రహ్మ ముహూర్తం ఉంటుంది. 
మౌని అమావాస్య నాడు అమావాస్య స్నానం ఆచరిస్తారు. దీని వలన మంచి ఫలితం ఉంటుంది. 

చొల్లంగి అమావాస్య నాడు విష్ణుమూర్తి వైద్య వీర రాఘవస్వామిగా అవతరించారు. అందుకని ఈరోజు అనారోగ్య సమస్యల నుంచి బయట పడడానికి, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఉపశమనం పొందడానికి పూజ చేయడం మంచిది.

ఈ స్వామివారి విగ్రహం మీ దగ్గర లేనట్లయితే విష్ణుమూర్తిని కూడా ఆరాధించవచ్చు. చొల్లంగి అమావాస్య నాడు నదీ స్నానం చేయడం వలన మంచిది.

ఈ అమావాస్య నాడు లక్ష్మీ సమేత విష్ణుమూర్తిని ఆరాధించడం మంచిది.
లక్ష్మీ సహస్రనామం, విష్ణు సహస్రనామం పారాయణ చేస్తే మంచి జరుగుతుంది. తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకోవచ్చు.

తులసి కోట దగ్గర ముగ్గు వేసి లక్ష్మీ సమేత విష్ణుమూర్తి చిత్రపటాన్ని పెట్టి ఎర్రటి పూలమాలను వేసి ఆరాధించాలి. ఇలా చేయడం వలన విష్ణువు అనుగ్రహాన్ని అమితంగా పొందవచ్చు.

ఈ రోజున అసత్యం పలకరాదు. మౌనంగా ఉండడం మంచిది. కుటుంబ పెద్దలను, స్త్రీలని, పిల్లలను ఈరోజు బాధించకూడదు. ఈరోజు పగటిపూట నిద్రపోకూడదు. రావి చెట్టు చుట్టూ 'నారాయణ నమః' అంటూ 27 సార్లు ప్రదక్షిణలు చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది. 

అలాగే అక్కడ దీపారాధన చేసి విష్ణు అష్టోత్తరం చదువుకోవచ్చు.
నల్ల నువ్వులు, వస్త్రం, ఉసిరికాయని దానం చేస్తే ఈరోజు చాలా మంచిది....

మౌని అమావాస్యనాడు గంగానది అమృతంగా మారుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి. 

ఆ రోజున వారణాసిలోని గంగానదిలో, అలహాబాద్‌ (ప్రయాగ)లోని త్రివేణీ సంగమంలో లక్షలాది ప్రజలు స్నానాలు ఆచరిస్తారు

గంగా స్నానానికి అవకాశం లేనివారు సమీపంలో ఉన్న నదిలో, ఇతర నీటి వనరుల్లో గంగా దేవిని తలచుకొని స్నానం చేసి, ఆపన్నులకు దానాలు చేయడం మంచిదన్నది పెద్దల మాట.

ఆధ్యాత్మిక ఉన్నతి కోరుకునేవారు ఈ రోజున పుణ్య తీర్థములందు స్నానము చేసి, మౌనముగా వారి ఇష్టదేవతలను ఆరాధించాలి.

కాకినాడ సమీపంలోనున్న చొల్లంగి ప్రాంతములో సముద్రమునందు, గోదావరిలో ఒక పాయ అయిన తుంగభాగానది కలియుట వలన ఇది సాగర సంగమ ప్రాంతము. 
ఈ ప్రాంతములో చొల్లంగి అమావాస్యను ఒక వేడుకగా చేస్తారు...స్వస్తి..
🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

No comments:

Post a Comment

INTEGRAL COACH FACTORY, CHENNAI*71 YEARS OF NATION BUILDING*02.10.1955 to 02.10.2026*

*INTEGRAL COACH FACTORY, CHENNAI* 71 YEARS OF NATION BUILDING *02.10.1955 to 02.10.2026* *The Birth of an Institution* Integral Coach Factor...