Sunday, April 19, 2026

*🌹జై శ్రీమన్నారాయణ - జై శ్రీహనుమాన్**నమః శుభోదయం* *మనోజ్ఞ*

*🌹జై శ్రీమన్నారాయణ - జై శ్రీహనుమాన్*
*నమః శుభోదయం* *మనోజ్ఞ*

*🌷హుండీలో డబ్బులు వేయడం మానేసి బదులుగా భగవంతుడికి పూలు, పండ్లు, ప్రసాదాలు, దీపాలకి నువ్వుల నూనె, ఆవు నెయ్యి సమర్పించండి.*
నీ ధర్మానికి ఉపయోగపడని దేవాలయ హుండీ లో వేసే నీ దక్షిణ వ్యర్థమే కదా!!

*🪷సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరి |*
*సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే ||*

*🪷అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే |*
*జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి ||*

*🪷అక్షయ తృతీయ, సింహాచల చందనోత్సవము, పరశురామ జయంతి*

*🪷పంచాంగం:*
*శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు*
*ఓం శ్రీ గురుభ్యోనమః*
*సోమవారం, 20 ఏప్రిల్ 2026*
*శ్రీ పరాభవ నామ సంవత్సరం*
*ఉత్తరాయనం - వసంత ఋతువు*
*వైశాఖ మాసం - శుక్ల పక్షం*
*తిథి*: *తదియ* ఉ *11:05* వరకు
*నక్షత్రం*: *కృత్తిక* ఉ *8:00* వరకు
*యోగం*: *సౌభాగ్యం* రా *7:57* వరకు
*కరణం*: *గరజి* ఉ *11:05* వరకు
  తదుపరి *వణిజ* రా *9:53* వరకు
*వర్జ్యం*: రా *10:54 - 12:23*
*దుర్ముహూర్తము*: మ *12:23 - 1:13*
  & మ *2:52 - 3:42*
*అమృతకాలం*: ఉ *7:16* వరకు
 & తె *3:21 - 4:51*
*రాహుకాలం*: ఉ *7:30 - 9:00*
*యమగండ/కేతుకాలం*:
                   ఉ *10:30 - 12:00*
*సూర్యరాశి*: *మేషం*
*చంద్రరాశి*: *వృషభం*
*సూర్యోదయం*: ఉ *5:45*
*సూర్యాస్తమయం*: సా *6:10*
*గోమాతను పూజించండి, సంరక్షించండి.*

*┈❀꧁భార్గవ గురుబోధ꧂❀┈*
*🪷పరశురామ జయంతి:*
*వైశాఖ శుద్ధ తృతీయ రోజు రాత్రి మొదటిజాములో పునర్వసు నక్షత్రంలో ఆరుగ్రహాలు ఉచ్చ స్థితిలో ఉండగా రాహువు మిథునంలోనున్న సమయంలో రేణుకాగర్భం నుండి 'శ్రీ మహవిష్ణువు' పరశురాముడుగా అవతరించినట్లు స్కాంద, భవిష్య పురాణాల్లో చెప్పబడింది. శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాల్లో ఆరవ అవతారమైన పరశురాముడు. జన్మించిన ఈ రోజు శ్రీ మహా విష్ణువును పూజించడంతో పాటూ విష్ణు సహస్రనామ పారయణము, వైష్ణవ ఆలయాలను దర్శించడం విశేషం.*

*🪷సింహాచలం చందనోత్సవం:*
*శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి చందనోత్సవం (నిజరూప దర్శనం) ప్రతి ఏటా అక్షయ తృతీయ నాడు అత్యంత వైభవంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే అక్షయ తృతీయ నాడు శ్రీ నరసింహస్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహించిన రోజేనని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ పర్వదినాన పుష్పమో, ఫలమో భగవంతుడికి సమర్పించినా, దైవనామస్మరణ చేసినా, చివరికి నమస్కారం చేసిన సంపద, పుణ్యఫలం ప్రాప్తిస్తుందని ప్రతీతి.*

*🪷అక్షయ తృతీయ:*
*మత్స్య పురాణం అరవై ఐదవ అధ్యాయం ప్రకారం.. ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామ ప్రథమైన అక్షయ తృతీయ వ్రతం గూర్చి చెప్పాడు. వైశాఖ శుద్ధ తదియ నాడు చేసే ఏ వ్రతమైనా, జపమైనా, హోమమైనా, దానాదులేవైనా లేక పుణ్య కార్యాచరణమేదైనా దాని ఫలితము అక్షయమౌతుంది. అలాగే పుణ్య కార్యాచరణ వల్ల వచ్చే ఫలితం అక్షయమైనట్లే, పాపకార్యాచరణ వల్ల వచ్చే పాపం కూడా అక్షయమే అవుతుంది.*

*ఈనాడు, తృతీయా తిథి బ్రహ్మతో కలిసి ఉంటుంది. అందుచే విశేష పూజనీయమైనది. ఈ నాడు ఉపవాస దీక్ష జరిపి, ఏ పుణ్య కర్మనాచరించినా కూడా తత్సంబంధ ఫలము అక్షయముగానే లభిస్తుంది. ఈ తిథినాడు అక్షయుడైన విష్ణువు పూజింపబడతాడు. అందుకే దీనికి అక్షయ తృతీయ అని పేరు. ఈ రోజు అక్షతోదకముతో స్నానం చేసి, అక్షతలను విష్ణు భగవానుని పాదములపై ఉంచి, అర్చించి, తరువాత ఆ బియ్యమును చక్కగా మరోసారి ఏరి బ్రాహ్మణులకు దానమిచ్చి, మిగిలిన వాటిని దైవోచ్చిష్టంగా, బ్రాహ్మణోచ్చిష్టంగా తలచి వాటిని ప్రసాద బుద్ధితో స్వీకరించి భోజనం చేసిన వారికి ఈ ఫలం తప్పక కలుగుతుంది అని పురాణంలో ఈశ్వర వాక్కు.*

*ఇలా ఒక్క వైశాఖ శుక్ల తదియనాడు పైన చెప్పిన విధంగా నియమంతో అక్షయ తృతీయా వ్రతాన్ని ఆచరించిన తరువాత వచ్చే 12 మాసాలలో శుక్ల తృతీయ నాడు ఉపవసించి విష్ణువును ప్రీతితో అర్చిస్తే రాజసూయ యాగము చేసిన ఫలితము కలిగి అంత్యమున ముక్తిని పొందగలడు.*

*అక్షతలు అంటే ఏ మాత్రము విరగని, పగుళ్ళు లేని, గట్టిగా ఉన్న బియ్యము. అవి వరి ధాన్యము నుండి కావచ్చు, గోధుమ ధాన్యము నుండి కావచ్చు, యవల నుండి కావచ్చు. ఇటువంటి వాటితో సిద్ధం చేసిన ఆహారమును అక్షతాన్నము లేదా అక్షతాహారము అంటారు.*

*శ్రీ నారద పురాణం కూడా, ఈనాడు చేయు దాన ధర్మాలు అత్యధిక ఫలాన్నిస్తాయని చెపుతోంది. ఈ నాడు దానం, ధర్మం చేయటమే అక్షయ ఫలితాన్ని ఇస్తుంటే, ఇక గంగా తీరంలో నాడు చేసే దానాది ఫలముల గురించి నారదమహర్షి ఇలా చెప్పాడు. అక్షయ తృతీయ నాడు గంగా తీరంలో నియమంతో ఘృత, ధేను దానం చేసినవాని ఫలితం ఇంతింత కాదు, సహస్రాదిత్య సంకాశుడై, సర్వకామ సమన్వితుడై, బంగారము, రత్నములతో కూడి చిత్రహంసలతో కూడిన విమానములో తన పితృదేవతలతో కల్పకోటి కల్పములు, కల్పకోటి సహస్రముల కాలము బ్రహ్మ లోకమున విరాజిల్లును. తరువాత గంగా తీరంలో అత్యంత ధనవంతుడైన బ్రాహ్మణునిగా పుడతాడు. అంతమున బ్రహ్మజ్ఞానియై ముక్తిని పొందుతాడు.*

*అలాగే యధావిధిగా గోదానము చేసినవాడు గోరోమ సంఖ్యలు ఎన్ని ఉన్నాయో అన్ని సంవత్సరములు స్వర్గలోకములో విరాజిల్లి, తరువాత భూమి మీద పుట్టి, చక్కని విద్యను, ఐశ్వర్యాన్ని అనుభవించి, అంతమున ముక్తిని పొందుతాడు. గంగా నది ఒడ్డున వేదవిదుడైన బ్రాహ్మణునకు కపిల గోదానము చేసినచో నరకములోనున్న తన పితరులందరూ స్వర్గాన్ని చేరెదరు. అక్కడే భూమిని దానం చేస్తే, ఎంత భూమిని దానం చేసాడో అంతభూమిలోని రేణువుల ప్రమాణాబ్ది వరకు బ్రహ్మ, విష్ణు, శివలోకములలో నివసించి భూమిమీద పుట్టి సప్త ద్వీపాధిపతి అగును. అతడు నిద్రించినచో భేరీ, శంఖాది నినాదములచే మేల్కొలుపబడును. సర్వ ధర్మ పరాయణుడై, సర్వ సౌఖ్యములను పొంది, నరకవాసంలో ఉన్న పితరులనందరినీ స్వర్గమున చేర్చి, స్వర్గమున నున్న పితరులనందరినీ మోక్షమున చేర్చి, స్వయముగా జ్ఞానియై, అవిద్యను జ్ఞాన ఖడ్గముచే ఖండించగల పరమ వైరాగ్యమును పొంది పరబ్రహ్మమును పొందును. ఇటువంటి పుణ్య ఫలములెన్నో చెప్పబడినవి.*

*పురాణ ప్రాముఖ్యత:-*
*త్రేతాయుగం:* త్రేతాయుగం ప్రారంభమైన రోజు.
*మహాభారతం:* అలాగే వేదవ్యాసుడు మహాభారతాన్ని రాయడానికి వినాయకుడిని కోరిన రోజు.
*ద్రౌపది మాన సంరక్షణ:* శ్రీకృష్ణుడు ద్రౌపదిని దుశ్శాసనుడి నుండి రక్షించి, అక్షయపాత్రను ప్రసాదించిన రోజు. అది అపరిమితమైన ఆహారాన్ని అందించి, సమృద్ధికి, ఆశీర్వాదాలకు ప్రతీకగా నిలిచింది.
*కుచేలుని వృత్తాంతం:* శ్రీకృష్ణుడు తన మిత్రుడు కుచేలుడు ఇచ్చిన అటుకులను ఆరగించి, అతనికి అపార సంపదను ప్రసాదించాడు.
*కనకధారా స్తోత్రం:* ఆదిశంకరాచార్యులు పేదరిక నిర్మూలన కోసం లక్ష్మీదేవిని కనకధారా స్తోత్రంతో పూజించింది ఈ రోజే.
*గంగావతరణం:* స్వర్గం నుండి గంగానది భూమిపైకి వచ్చిన రోజు.
*గంగోత్రి, యమునోత్రి:* అక్షయ తృతీయ రోజున గంగోత్రి, యమునోత్రి ఆలయాలు తెరవబడుతుంది.

*┉┅❀꧁హరే కృష్ణ꧂❀┅┉*

No comments:

Post a Comment

Indian Railways has decided to modernize Parcel Offices across the network based on a detailed study conducted by TT&BRU, Northern Railway.

Indian Railways Parcel Offices Indian Railways has decided to modernize Parcel Offices across the network based on a detailed study conducte...