Monday, August 23, 2021

🌹 శ్రీ గరుత్మంతుడి కధ -6 వ భాగం 🌹దానములు_ధర్మములు:దానములు వేరు ,ధర్మములు వేరు దాన మనగా ఇచ్చెడి వస్తువు నందు మమత్వమును విడిచి ఇతరుల కిచ్చునది

🦅🦅🦅🦅🦅

🌹 శ్రీ గరుత్మంతుడి కధ -6 వ భాగం 

🌹దానములు_ధర్మములు:

దానములు వేరు ,ధర్మములు వేరు దాన మనగా ఇచ్చెడి వస్తువు నందు మమత్వమును విడిచి ఇతరుల కిచ్చునది .ధర్మమనగా ప్రజోపయోగార్ధ మై చేయు ఇష్టా పూర్త రూపమైనది. దిగుడు బావులు ,మంచినీటి నూతులు చెరువులు త్రవ్వించుట ,దేవాలయ నిర్మాణము ,ఉద్యానవనములు ,పండ్ల తోటలు నాటించుట మొదలగు కార్యములు ధర్మములోనికి వచ్చును. అగ్నిహొత్రము ,తపస్సు, సత్య వ్రతము,వేదాధ్యయనము ,అతిధి మర్యాద, వైశ్వదేవము ఇట్టి వానిని ఇష్టము లందురు.

సూర్య ,చంద్ర గ్రహణ సమయములలో ఇచ్చు దానము వలన దాత స్వర్గాది పుణ్య లోకములను బొందును. దేశమును, కాలమును, పాత్రతను (యోగ్యతను ) గమనించి ఇచ్చిన దానము కోటి గుణిత మగును. కర్కాటక ,మకర సంక్రమణము లందును అమావశ్య,పూర్ణిమాది పర్వములందును చేసెడి దానము విశేష ఫలము నిచ్చును. దాత తూర్పు ముఖముగా కూర్చుండి సంకల్పము ,గోత్రనామములతో జెప్పి దాన మీయవలెను. పుచ్చుకొనువాడు ఉత్తరాభి ముఖుడై స్వీకరింపవలెను. అట్లు చేసినచో దాతకు ఆయుర్దాయము పెరుగును. గ్రహీతకు పుచ్చుకున్నది అక్షయ మగును. మహాదానములు పది :

శ్లో || కనకా శ్వతి లానాగా దాసీరధ మహీ గృహాః ||
కన్యాచ కపిలా దేను: మహా దానాని వైదశ ||

తా || బంగారము ,గుఱ్ఱము ,తిలలు ,ఏనుగులు,దాసీ జనము ,రధములు ,భూమి, గృహములు ,కన్యక నల్లని ధేనువు వీనిని మహా దానము లనిరి . ఇవి పది.

దేవతలకు గాని ,బ్రాహ్మణులకు గాని , గురువులకు గాని ,తల్లి దండ్రులకు గాని ఇచ్చెదనని వాగ్దానము చేసిన దానిని ఇయ్యక ఎగ గొట్టినచో వంశ నాశనము జరుగును. ప్రతి గ్రహీత నుండి ఏదో లాభము నాశించి దాన మిచ్చినచో అది నిష్ప్రయోజన మగును . ప్రతి
 గ్రహీత నుద్దేశించి దానము చేయుచు ,ఆ దాన ధారను భూమిపై విడిచినచో ఆ దాన ఫలము మహా సాగరము కన్నా అనంతమైనది యగును. గౌతమీ ,గంగా ,గయా ,ప్రయాగాది తీర్ధము లందిట్టి దానములు విశేష ఫలముల ని ఇస్తుంది ....

🦅🦅🦅🦅🦅🦅🦅


卐 ఓం శ్రీ గురుభ్యోనమః 卐
🌟 *ఆదివారం, ఆగష్టు 15, 2021* 🌟
        *_శ్రీ ప్లవ నామ సంవత్సరం_*
      *దక్షిణాయనం - వర్ష ఋతువు* 
          *శ్రావణ మాసం - శుక్ల పక్షం*
తిధి   :  *సప్తమి* ఉ9.51
             తదుపరి అష్టమి  
వారం  : *ఆదివారం* (భానువాసరే)
నక్షత్రం : *స్వాతి* ఉ6.46
              తదుపరి *విశాఖ* తె5.09
యోగం : *శుక్లం* ఉ10.21
               తదుపరి బ్రహ్మం 
కరణం  :  *వణిజ* ఉ9.51
                తదుపరి *విష్ఠి* రా8.39
            ఆ తదుపరి బవ
వర్జ్యం   :  *ఉ11.59 - 1.28* 
దుర్ముహూర్తం : *సా4.42 - 5.32* 
అమృతకాలం:  *రా8.56 - 10.26* 
రాహుకాలం   :  *సా4.30 - 6.00* 
సయమగండం/కేతుకాలం: *మ12.00 - 1.30*
సూర్యరాశి: *కర్కాటకం* || చంద్రరాశి: *తుల*
సూర్యోదయం: *5.45* || సూర్యాస్తమయం: *6.24*
👉 🇮🇳 *భారత స్వాతంత్య్ర దినోత్సవం* 🇮🇳
     *స్వాతంత్య్ర దినోత్సవ  శుభాకాంక్షలు*
        *_To Stay Safe Against COVID-19_*   
                    *Get Vaccinated*   
          😷  *Wear Mask Properly*  😷
              *Keep 6ft. Safe Distance* 
*Wash Hands Frequently with Soap/Sanitizer*
 *_సర్వేజనా సుఖినోభవంతు_* 
             *శుభమస్తు* 🙏
_______________________________  
           *_గోమాతను పూజించండి_*
           *_గోమాతను సంరక్షించండి_*

🥀 *కర్మ సిద్ధాంతం* 🥀

కర్మ సిద్థాంతం చాలా కఠినమైనది.
అది ఎవ్వరికీ అర్థంకాదు.

మహాజ్ఞానులను కూడా మోసం చేస్తుంది "కర్మను" అనుభవించాలి. నిందిస్తే ప్రయోజనం లేదు.

రమణ మహాశయులు కాశీలో ప్రతిదినము గంగా స్నానం కొరకు పోతుండేవాడు ఆయన వెంట కృష్ణా అను భక్తుడు పోయెడివాడు. ఒకనాడు రమణ మహాశయులు గంగానదికి పోతుంటే ఉన్నట్టుండి, తన వెనుకనున్న కృష్ణా తో "కృష్ణా! నేను కట్టుకున్న పంచెను కొంచెం చించు". అని అన్నారు కృష్ణకు అర్ధం కాలేదు. వారిద్దరూ ఒకరి వెనుక ఒకరు నడుస్తూనే ఉన్నారు.
ఇంతలో ఒక ఇటుక వచ్చి రమణ మహాశయుల కాలి వేలు, మీదపడినది.కాలి వేలు చితికింది. రక్తం కారుతుంది. ఆ రక్తాన్ని ఆపేందుకు రమణ మహాశయులు పంచెను చింపమన్నారని అర్థం చేసుకున్నాడు. కృష్ణ అప్పుడు గ్రహించాడు.

వెంటనే రమణ మహాశయుల పంచెను చింపి, కట్టు కట్టాడు.ఆనుకోకుండా జరిగిన ఆ సంఘటను గుర్తించి, రమణ మహాశయులతో "మహారాజ్! ఇటుక వచ్చి మీ కాలివేలు మీద పడుతుందనే విషయము ముందే మీకు తెలుసు కదా! మరెందుకు ఆ ఇటుక దెబ్బనుంచి తప్పుకోలేదు?" అని ప్రశ్నించారుఅప్పుడు రమణ మహాశయులు కృష్ణా తో "ఆలా జరగదు కృష్ణా! పక్కకి తప్పుకొంటే, ఎప్పుడో ఒకప్పుడు వడ్డీతో సహా కర్మను అనుభవించాల్సిందే. 

రుణం ఎంత తొందరగా తీరిపోతే అంత మంచింది కదా! "అని అన్నారు.
కర్మ శేషాన్ని ఎవరయినా అనుభవించాలసిందే.
*హిందూ ధర్మచక్రం*

No comments:

Post a Comment

Yes, she has gained weight? Defeated without losing a bout.

అవును, ఆమె కొంచెం బరువు పెరిగే వుంటుంది. ఎందుకంటే…. ఆటల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచే నిండైన ఆత్మాభిమానాన్ని, విశ్వ వేదికపైనే కాదు వ...