🦅🦅🦅🦅🦅
🌹 శ్రీ గరుత్మంతుడి కధ -15 వ భాగం
💥వైష్ణవము
ధర్మరాజు " పితామహా ! తమరు అంపశయ్య మీద ఉండి కూడా నేను అడిగే ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పారు. నేను ఎన్నో ధర్మసూక్ష్మాలు తమ ముఖతః విన్నాను. కాని అవి ఏవి జననము, మరణము వీటి వలన వచ్చే దుఃఖం తొలగించవు కదా ! ఎన్నో జన్మల నుండి ఎంతో మంది తల్లి తండ్రులకు పుడుతూ మరణిస్తూ ఈ సంసార చక్రంలో నేనిక తిరుగ లేను. పితామహా ! గర్భవాసముకు స్వర్గము నరకము ఉంటాయా చెప్పండి. ఈ చరాచర జగత్తు అసత్యము కనుక నేను ఈ జగత్తును విషతుల్యముగా చూస్తాను. నాకు ఈ రాజ్యము వద్దు సంసారము వద్దు. నాకు మోక్షకారకమైన వైష్ణవధర్మము ఉపదేశించండి. ఈ యుగములో వైష్ణవధర్మము కనిపించడం లేదని వ్యాసుడు చెప్పాడు. కనుక నేను అది మీ నుండి తెలుసుకొనగోరుతున్నాను " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ఏమిటీ వెర్రి. 18 రోజులు యుద్ధము చేసి శత్రువులను జయించి రాజ్యము కైవశము చేసుకుని ఇలా మాట్లాడటము నీకే చెల్లింది. లేకున్న క్షత్రియులకు ఇది తగదు. నీవు మిధిలా నగరాధిపతి జనకుడిలా మాట్లాడుతున్నావు. నిర్యాణము అనునది శాశ్వత సుఖాన్ని ఇస్తుంది. దానిని ఇలా ఉంటుంది అని వర్ణింపజాలము. జీవుడికి అది అతీతము. ప్రకృతులు ఎన్నో ఉన్నా ఆకృతి ఒక్కటే . అదే అన్నింటికీ మూలము. ఆకృతి ఎన్నో జీవాత్మలుగా రూపాంతరము చెందినా అది ఎటువంటి వికారము చెందదు. అది తన స్వస్వరూపము మరువదు. సంసారము అనే మార్గము సుగమంగా కనిపిస్తుంది. మోక్షమార్గము కామము, క్రోధముతో కప్పబడి ఉంటుంది. కనుక కామము, క్రోధములను విడిచి సత్వగుణమును ఆశ్రయించి జీవితము గడపాలి దానినే వైష్ణవమని అంటారు. నీవుఈ ధర్మమును పాటించి సంసార భయమును వీడి మోక్షము సాధించు " అని భీష్ముడు చెప్పాడు.
🌹తత్వములు
ధర్మరాజు " పితామహా ! తత్వములు, అధ్యాత్మములు, అదిదైవతములు, అదిభూతములు అను వాటికి కర్త భర్త హర్త అయి సకల భూతములకు ఆధారభూతమైన పరమాత్మ గురించి వివరించండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! సనకుడు, సనందుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు, ఈ నలుగురు బ్రహ్మమానస పుత్రులు. వీరు కాక బ్రహ్మకు మరీచి, భృగువు, అంగీరసుడు, అత్రి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు అను ఆరుగురు కుమారులు ఉన్నారు. అందు సనత్సుజాతుడు బొటనవ్రేలి ప్రమాణంలో ఉండి అగ్ని మాదిరి మండుతుంటాడు. ఒక ప్రదేశాన నిలువక సదా లోకాలన్నీ చుట్టివస్తాడు. ఒక రోజు సనత్సుజాతునకు నారదుడు మేరుపర్వతము మీద కనిపించాడు. ఆయన చెప్పిన విషయము నేను నీకు చెప్తాను. విష్ణుమూర్తికి పదివేల సంవత్సరములు రాత్రి, పదివేల సంవత్సరాలు పగలు. ఇరవై వేల యుగములు ఒక రోజు. విష్ణువు రూపమును అవ్యక్తము అంటారు. విష్ణువు రాత్రు నిద్రించి పగలు సృష్టి ఆరంభిస్తాడు. సృష్టిచేయ సంకల్పించిన విష్ణువు శుక్లమును అండాకారములో జలములో విడిచిపెడతాడు. తరువాత తన నాభి నుండి బ్రహ్మను సృష్టించాడు. ఆయనను సృష్టికి కర్తగా నియమించాడు. తరువాత బ్రహ్మను అహంకారము ఆవహించింది. తరువాత మనసు, బుద్ధి, ఇంద్రియములు, పంచభూతములైన ఆకాశము, గాలి, అగ్ని, జలము, భూమి అను పంచభూతములను సృష్టించాడు. పంచభూతములకు గుణముగా శబ్ధము, స్పర్శ, రూపము, రసము, గంధము ఆవిర్భవించాయి. తరువాత దేవతలు, మునులు, రాక్షసులు, గంధర్వులు, కిన్నెరలు, నరులు, జంతువులు మొదలైన జీవజాతులు ఆవిర్భవించాయి. వీటన్నింటినీ అహంకారము ఆవహించింది. ఇవి అన్నీ అవ్యక్తమైన సంసారసాగరమున పుడుతూ మరలా చస్తూ మరలా పుడుతూ జనన మరణ చక్రంలో పడి తిరుగుతుంటారు. ఈ సృష్టి స్థితి లయములకు కారకుడైన విష్ణువు జీవరాసులకు శుభాశుభములు కలిగిస్తూ ఈ సంసార చక్రాన్ని తిప్పుతూ వినోదిస్తుంటాడు. పంచభూతములు, పంచ గుణములు, మహాతత్వము, పది ఇంద్రియములు, అహంకారము, మనసు, బుద్ధి అను ౨౪ తత్వములు...
🌹అధ్యాత్మము_అదిభూతము_అధిదైవతములు
చెవి అధ్యాత్మము అయితే శబ్ధము అదిభూతము. దిక్కులు అధిదైవతములు. చర్మము అధ్యాత్మము అయితే స్పర్శ అదిభూతము, గాలి దానికి అదిదైవతము. కళ్ళు అధ్యాత్మము అయితే రూపము అది భూతము సూర్యుడు దానికి అదిదైవతము. నాలుక ఆధ్యాత్మము అయితే రుచి దానికి అదిభూతము నీరు దానికి అదిదైవతము. ముక్కు అధ్యాత్మము అయితే వాసన దానికి అదిభూతము భూమి దానికి అదిదైవతము. వీటిని బుద్ధి ఇంద్రియత్రయము అంటారు. పాదములు, విసర్జకావయవము, జననేంద్రియము, చేతులు, నోరు కర్మేంద్రియములు అనునవి అధ్యాత్మికములు. పైన చెప్పిన అవయవములకు వరుసగా నడక, విసర్జనము, ఆనందము, పని, మాట అధిభూతములు. వాటికి వరుసగా విష్ణువు, సూర్యుడు, బ్రహ్మ, ఇంద్రుడు, అగ్ని అధిదైవతములు. అహంకారము, మనసు, బుద్ధి ఆధ్యాత్మకములు, వీటికి అభిమానము, సంకల్పము, నిశ్చయము అధిభూతములు. వాటికి మేధస్సు, చంద్రుడు, బ్రహ్మ అధిదైవతములు. ఇవన్నీ విష్ణువు నుండి పుట్టి లయమౌతాయి. అవ్యక్తము అంటే మూల ప్రకృతి. అందులో పురుష చైతన్యము చేరితే ఆ ప్రకృతి చైతన్యవంతమౌతుంది. అప్పుడు ఈ ప్రపంచమంతా అంతా వైభవంతో నడుస్తుంది. ఈ సృష్టికంతా ఆధారం విష్ణువు.
పరమశివుడి అనుమతితో బ్రహ్మ జననమరణములు నిర్వహిస్తూ ఉంటాడు " అని సనత్సుజాతుడు నారదుడికి చెప్పాడు " అని చెప్పి భీష్ముడు " ధర్మజా ! ఈ సృష్టికంతకూ మూలము 25వ తత్వము అయిన పరమాత్మ. వేద వేదాంత పురాణ వేద్యుడైన ఆ పురుషుడు ఎల్లప్పుడూ వెలుగుతూ ఉంటాడు. అతడే కాలాంతకుడైన అచ్యుతుడు, అనంతుడు, యోగి జనముల హృదయములలో నివసించే వాడు, విష్ణువు, అద్వయుడు, అసంగుడు. అతడే పరమాత్మ " అని భీష్ముడు పలికాడు..
🦅🦅🦅🦅🦅🦅🦅
卐 ఓం శ్రీ గురుభ్యోనమః 卐
🌟 *మంగళవారం, ఆగష్టు 24, 2021* 🌟
*_శ్రీ ప్లవ నామ సంవత్సరం_*
*దక్షిణాయనం - వర్ష ఋతువు*
*శ్రావణ మాసం - బహుళ పక్షం*
తిధి : *విదియ* సా4.19
తదుపరి తదియ
వారం : *మంగళవారం* (భౌమ్యవాసరే)
నక్షత్రం : *పూర్వాభాద్ర* రా9.08
తదుపరి ఉత్తరాభాద్ర
యోగం : *సుకర్మ* రా9.07
తదుపరి ధృతి
కరణం : *గరజి* సా4.19
తదుపరి *వణిజ* తె4.26
వర్జ్యం : *లేదు*
దుర్ముహూర్తం : *ఉ8.17 - 9.07* &
*రా10.53 - 11.39*
అమృతకాలం: *మ12.58 - 2.36*
రాహుకాలం : *మ3.00 - 4.30*
యమగండం/కేతుకాలం: *ఉ9.00 - 10.30*
సూర్యరాశి: *సింహం* || చంద్రరాశి: *కుంభం*
సూర్యోదయం: *5.47* || సూర్యాస్తమయం: *6.18*
*_To Stay Safe Against COVID-19_*
*Get Vaccinated*
😷 *Wear Mask Properly* 😷
*Keep 6ft. Safe Distance*
*Wash Hands Frequently with Soap/Sanitizer*
*_సర్వేజనా సుఖినోభవంతు_*
*శుభమస్తు* 🙏
_______________________________
*_గోమాతను పూజించండి_*
*_గోమాతను సంరక్షించండి_*
No comments:
Post a Comment