Monday, August 23, 2021

శ్రీ గరుత్మంతుడి కధ -1 వ భాగం 💥పరిచయంగరుత్మంతుడు హిందూ పురాణాలలో ఒక గరుడ పక్షి (గ్రద్ద). శ్రీమహావిష్ణువు వాహనంగా గరుత్మంతుడు ప్రసిద్ధి. ఇతడు మహాబలశాలి. కాని వినయశీలి. ఆర్త్రత్రాణపరాయణుడైన శ్రీమహావిష్ణువు ఎక్కడికి వెళ్లాలనుకున్నా గరుత్మంతుదు సిద్ధంగాఉంటాడు. వెంటనే విష్ణువు గరుడారూఢుడై వెళ్లి ఆపన్నులను రక్షిస్తూ ఉంటాడు..

🦅🦅🦅🦅🦅

🌹 శ్రీ గరుత్మంతుడి కధ -1 వ భాగం 

💥పరిచయం

గరుత్మంతుడు హిందూ పురాణాలలో ఒక గరుడ పక్షి (గ్రద్ద). శ్రీమహావిష్ణువు వాహనంగా గరుత్మంతుడు ప్రసిద్ధి. ఇతడు మహాబలశాలి. కాని వినయశీలి. ఆర్త్రత్రాణపరాయణుడైన శ్రీమహావిష్ణువు ఎక్కడికి వెళ్లాలనుకున్నా గరుత్మంతుదు సిద్ధంగాఉంటాడు. వెంటనే విష్ణువు గరుడారూఢుడై వెళ్లి ఆపన్నులను రక్షిస్తూ ఉంటాడు..

🦅గరుత్మంతుని_జననం:

(గరుడారూఢుడైన విష్ణువు, వ్యావహారిక 6-7 శతాబ్దికి చెందిన ఇసుక రాయి శిల్పం. లలాట తోరణం పై చెక్కినది. వేంగి చాళుక్యుల నాటిది. పెదవేగి గ్రామం త్రవ్వకాలలో బయల్పడింది. శివాలయంలో ఉంచబడింది.)

కొన్ని రోజులకు గరుత్మంతుడు పుడతాడు. గరుడుడిని చూసి కద్రువ, "వినతా! నువ్వు దాసీ వి కాబట్టి నీ కుమారుడు కూడా నా దాసుడే అని గరుడుడిని కూడా దాసీవాడు గా చేసుకొంటుంది. గరుత్మంతుడు తన సవతి తమ్ముళ్లను తన వీపు మీద ఎక్కించుకొని తిప్పుతూ ఉండేవాడు. ఒకరోజు ఇలా త్రిప్పుతుండగా గరుత్మంతుడు సూర్యమండలం వైపు వెళ్లి పోతాడు. ఆ సూర్యమండలం వేడికి ఆ సర్పాలు మాడి పోతుంటే కద్రువ ఇంద్రుడిని ప్రార్థించి వర్షం కురిపిస్తుంది. ఆ తరువాత గరుత్మంతుడిని దూషిస్తుంది.

దానితో దుఃఖితుడై గరుత్మంతుడు తనది, తన తల్లిది దాసీత్వం పోవాలి అంటే చేయవలసిన కార్యాన్ని అడుగుతాడు. అప్పుడు కద్రువ కుమారులు, ఆలోచించి అమృతం పొందాలనే కోరికతో తమకు అమృతం తెచ్చి ఇస్తే గరుత్మంతుడి మరియు వినత ల దాసీత్వం పోతుందని చెబుతారు...

సేకరణ

🦅🌹🦅🌹🦅🌹🦅


卐 ఓం శ్రీ గురుభ్యోనమః 卐
🌟 *మంగళవారం, ఆగష్టు 10, 2021* 🌟
        *_శ్రీ ప్లవ నామ సంవత్సరం_*
      *దక్షిణాయనం - వర్ష ఋతువు* 
          *శ్రావణ మాసం - శుక్ల పక్షం*
తిధి   :  *విదియ* సా6.13
             తదుపరి తదియ    
వారం  : *మంగళవారం* (భౌమ్యవాసరే)
నక్షత్రం : *మఖ* ఉ10.58
              తదుపరి పుబ్బ 
యోగం : *పరిఘము* రా10.29
               తదుపరి శివం 
కరణం  :  *బాలువ* ఉ6.38
                తదుపరి *కౌలువ* సా6.13
              ఆ తదుపరి తైతుల 
వర్జ్యం   :  *సా6.54 - 8.30* 
దుర్ముహూర్తం : *ఉ8.17 - 9.07* &
                       *రా10.57 - 11.42*
అమృతకాలం:  *ఉ8.32 - 10.39* &
                        *తె4.27నుండి*
రాహుకాలం   :  *మ3.00 - 4.30* 
యమగండం/కేతుకాలం: *ఉ9.00 - 10.30*
సూర్యరాశి: *కర్కాటకం* || చంద్రరాశి: *సింహం*
సూర్యోదయం: *5.44* || సూర్యాస్తమయం: *6.28*
      👉 *మంగళగౌరీ వ్రతము*

        *_To Stay Safe Against COVID-19_*   
                    *Get Vaccinated*   
          😷  *Wear Mask Properly*  😷
              *Keep 6ft. Safe Distance* 
*Wash Hands Frequently with Soap/Sanitizer*

 *_సర్వేజనా సుఖినోభవంతు_* 
             *శుభమస్తు* 🙏
_______________________________  
           *_గోమాతను పూజించండి_*
           *_గోమాతను సంరక్షించండి_*


🌷🌷 శ్రావణమాసం పరమ పవిత్రం🌷🌷

శ్రావణమాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది. నెల రోజుల పాటు ఉదయం, సాయంత్రం భగవన్నామస్మరణతో మారు మోగుతాయి. శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుందంటున్నారు పండితులు. 

 ఈ నెలలో ఎన్నో మంచి రోజులు, విశిష్ట పండుగలు రానున్నాయి.

సనాతన ధర్మంలో  చంద్రమానం ప్రకారం మనకున్న పన్నెండు మాసాల్లో ఐదవది ఎంతో పవిత్రత కలిగినటువంటింది శ్రావణమాసం. ఈ నెలలో పౌర్ణమినాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణమాసం అని పేరు వచ్చింది.

వర్షరుతువు ప్రారంభమవుతుంది. త్రిమూర్తుల్లో స్థితికారుడు దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు అయిన మహావిష్ణువుకు ఆయన దేవేరి శ్రీమహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణమాసంగా చెప్పుకుంటారు. వివిధరకాల పూజలు, వ్రతాలు ఆచరించడం వల్ల విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసంగా పెద్దలు చెబుతారు. మహావిష్ణువు జన్మనక్షత్రం శ్రావణ నక్షత్రం కావడం, అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణమాసం మహావిష్ణువు పూజకు ఎంతో ఉత్కృష్టమైనది. ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని వేద పురాణాలు చెబుతున్నాయి.

శివారాధనకు ఎంతో విశిష్టత..

శ్రావణమాసం దక్షిణాయనంలో వచ్చే విశిష్టమైన మాసాల్లో శ్రావణమాసం ఒకటి. ఈ మాసం శివపూజకు విశిష్టమైనది. ముఖ్యంగా భగవదారాధనలో శివ, కేశవ భేదం లేకుండా పూజించడానికి విశేషమైనది. ఈ నెలలో చేసే ఏ చిన్న దైవ కార్యమైనా కొన్ని వేల రెట్లు శుభ ఫలితాన్నిస్తుందని ప్రతీతి. సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళలో స్వామివారికి రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు చేస్తే పాపాలు కడతేరుతాయని శాస్త్ర వచనం.

సోమవారాల్లో శివుడి ప్రీత్యా ర్థాం ఈ వ్రతాన్ని (ఉపవాసదీక్షను) చేయాలి. ఈ వ్రతంలో ఉపవాసం ఉండగలిగినవారు పూర్తిగా, అలా సాధ్యంకానీ పక్షంలో రాత్రి పూజ ముగిసిన అనంతరం ఆహారాన్ని భుజించవచ్చు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయి.

వీటికి తోడు శ్రావణ శుక్ల పక్షంలో గల పదిహేను రోజులు ఎంతో విశేషమైన రోజులనీ ఒక్కోరోజు ఒక్కో దేవుడికి పూజలు చేయాలని వేద శాస్త్రలు చెబుతున్నాయి. ఈ మాసంలో భక్తితో ఆచరించే ప్రతి పూజకు తగిన ప్రతిఫలం ఉంటుందంటున్నారు పండితులు.

మంగళ గౌరీ వ్రతం..

శ్రావణ మాసంలో అన్ని మంగళవారల్లో చేసే వ్రతమే మంగళగౌరీ వ్రతం. దీన్ని శ్రావణ మంగళవార వ్రతం అనీ, మంగళగౌరీ నోము అని వివిధ రకాలుగా పిలుస్తుంటారు. ఈ వ్రతాన్ని గురించి నారధుడు సావిత్రికి, శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలిపినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్లి అయిన వారు ఆచరించాలి. వివాహమైన తర్వాత వచ్చే శ్రావణంలో ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించాలి. శ్రావణమాసంలో వచ్చే అన్ని మంగళవారాల్లో ఈ వ్రతం క్రమం తప్పకుండా చేయాలి. ఐదు సంవత్సరాల పాటు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించి ఉద్వాపన చేయాలి. దీంతో వారు నిండు సుమంగళిగా ఉండడమే కాకుండా వారి కుటుంబంలో సుఖశాంతులు, అష్ట ఐశ్వర్యాలు ఉంటాయి.

వరలక్ష్మీ వ్రతం..

శ్రావణమాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతం చేయాలి. ఒకవేళ అప్పుడు వీలుకాకుంటే శ్రావణ మాసంలో మరొక శుక్రవారమైనా ఈ వ్రతం ఆచరించవచ్చు. పూజ మండపంలో నిండు కలశాన్ని ఏర్పాటు చేసుకుని దానికి వరలక్ష్మీ దేవి ముఖప్రతిమను అలంకరించి పూజ చేయాలి.  ఈ వ్రతం స్వయంగా శివుడు పార్వతీదేవికి సూచించి సౌభాగ్యం, మంగళ్య బలాన్ని వివరించినట్లు ప్రసిద్ధి..

శ్రవణ మాసంలోని విశిష్టతలు..

శక్ద్వాదశి, దామోదర ద్వాదశి అని ఈ మాసంలో రెండు శుభ దినాలున్నాయి. శుక్ల పక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మహావిష్ణునువును పూజించినట్లయితే మోక్షం లభిస్తుంది.

శ్రావణపౌర్ణమి, రాఖీ పౌర్ణమిగా జరుపుకునే ఈ రోజు సోదర, సోదరీ సంబంధానికి సూచికగా రక్షబంధనం జరుపుకుంటున్నాం. అంతే కాకుండా ఈ రోజున నూతన యజ్ఞోపవిత్రధారణ, వేదభ్యాసాన్ని ప్రారంభం చేస్తారు.

కృష్ణపాడ్యమి, హయగ్రీవ జయంతి, కృష్ణపక్ష విదియ, రాఘవేంద్ర స్వామి ఆరాధన వంటి ముఖ్య రోజులు వచ్చేవి శ్రావణమాసంలోనే. కృష్ణాష్టమి, పొలాల అమావాస్య, గోవులను పూజించడం వంటివి సైతం ఈ నెలలో రావడం ప్రత్యేకత. 

ఎన్నో విశిష్టతలను సొంతం చేసుకున్న ఈ నెలలో చేయాల్సిన విధులు, పూజలు, వ్రతాలు, నియమాలు, తూచ తప్పకుండా ఆచరిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయి.

జై శ్రీమన్నారాయణ🙏

🌷🌷🌷🌷🌷🌷🌷

No comments:

Post a Comment

Jamalapuram Sri Venkateswara Swamy Temple జమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయం Telangana Tirupati, Khammam District

The road access to the temple is very good, and you can easily reach it in your own vehicle. Parking is not a concern as you can park comfor...