🦅🦅🦅🦅🦅
🌹 శ్రీ గరుత్మంతుడి కధ -4 వ భాగం
🌹అనూరుని_శాపం
కశ్యప ప్రజాపతి తన భార్యలైన వినత, కద్రువ లకు సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేస్తాడు. కద్రువ కోరిక ప్రకారం వెయ్యి పొడుగాటి శరీరం కలిగిన సంతానం, వినత కోరిక ప్రకారం ఇద్దరు ప్రకాశవంతమైన సంతానాన్ని కశ్యప ప్రజాపతి కోరుకొంటాడు. కద్రువకు వెయ్యి అండాలు, వినతకు రెండు అండాలు పుడతాయి. కద్రువకు అండాలనుండి వాసుకి, ఆదిశేషుడు ఆదిగా గల వెయ్యి పాములు జన్మిస్తాయి. వినత అది చూసి తొందరపడి తన ఆండాన్ని చిదుపుతుంది. అందునుండి కాళ్లు లేకుండా, మొండెము మాత్రమే దేహముగా కలిగిన అనూరుడు జన్మిస్తాడు. అనూరుడు అంటే ఊరువులు (తొడలు) లేనివాడు అని అర్థం. అనూరుడు తల్లితో నువ్వు సవతి మత్సరముతో నన్ను చిదిపావు కాబట్టి నువ్వు నీ సవతికి దాసీగా ఉండు. రెండవ అండాన్ని భద్రంగా ఉంచు. అందునుండి జన్మించినవాడు నీ దాస్యాన్ని విడుదల చేస్తాడు అని చెబుతాడు. సప్తాశ్వాలను పూన్చిన సూర్యుని రథానికి రథసారథిగా అనూరుడు వెళ్లిపోతాడు.
#వినత_కద్రువల_పందెం
వినత, కద్రువలు ఒక రోజున సముద్రపు ఒడ్డుకు వెళ్ళినప్పుడు క్షీర సాగరమథనములో వచ్చిన ఉచ్చైశ్రవము అనే ఇంద్రుడి గుర్రము దూరముగా కనిపించింది. అప్పుడు దూరముగా కనిపిస్తున్న గుర్రమును చూసి, కద్రువ తన సవతితో "చూడు ఆ ఉచ్చైశ్రవము శరీరం అంత తెల్లగా ఉన్నా తోక నల్లగా ఉన్నది" అని అంటుంది. ఉచ్చైశ్రవము తోక తెల్లగా ఉండడం చూసిన వినత, లేదు దాని తోక తెల్లగ ఉన్నదని అంటుంది. దీనితో కద్రువకు మనస్సులో పట్టుదల పెరిగి పందెం వేదాము, తోక తెల్లగా ఉంటే నేను నీకు దాస్యం చేస్తాను, నల్లగా ఉంటే నువ్వు నాకు దాస్యం చేయాలి అంటుంది. వినత పందానికి అంగీకరిస్తుంది. ఆ రోజు పొద్దు పోయిందని తరువాతి రోజు వచ్చి ఆ గుఱ్ఱాన్ని చూడవచ్చని ఇద్దరు అంగీకరించుకొని వారి ఇండ్లకి వెళ్ళిపోతారు.
#సంతానానికి_కద్రువ_శాపం
కద్రువ ఇంటికి వెళ్ళి తన సంతానాన్ని పిలిచి పందెం గురించి చెప్పి ఆ గుఱ్ఱం తోకకు చుట్టుకొని తోక నల్లగా ఉండేటట్లు చేయమని కొడుకులను అడుగుతుంది. కొడుకులు దానికి అంగీకరించక పోయేసరికి కోపముతో మాతృ వాక్యపరిపాలన చెయ్యని మీరందరు పరీక్షిత్తు కొడుకు జనమేజయుడు చేసే సర్పయాగంలో మరణిస్తారు అని శపిస్తుంది. అది విన్న కర్కోటకుడు అమ్మా నేను వెళ్లి ఆ గుఱ్ఱం తోకకు చుట్టుకొని నల్లగా కనిపించేటట్లు చేస్తాను అని అంటాడు.
తరువాతి రోజు వినత, కద్రువలు వెళ్ళి చూడగానే గుఱ్ఱం తోక కర్కోటకుడు చుట్టుకోవడం వల్ల నల్లగా కనిపిస్తుంది. అది చూసి వినత బాధ పడి తాను దాస్యం చేయడానికి అంగీకరిస్తుంది.
🦅🦅🦅🦅🦅🦅🦅
卐 ఓం శ్రీ గురుభ్యోనమః 卐
🌟 *శుక్రవారం, ఆగష్టు 13, 2021* 🌟
*_శ్రీ ప్లవ నామ సంవత్సరం_*
*దక్షిణాయనం - వర్ష ఋతువు*
*శ్రావణ మాసం - శుక్ల పక్షం*
తిధి : *పంచమి* మ2.10
తదుపరి షష్ఠి
వారం : *శుక్రవారం* (భృగువాసరే)
నక్షత్రం : *హస్త* ఉ9.23
తదుపరి చిత్ర
యోగం : *సాధ్యం* సా4.00
తదుపరి శుభం
కరణం : *బాలువ* మ2.10
తదుపరి *కౌలువ* రా1.18
ఆ తదుపరి తైతుల
వర్జ్యం : *సా5.06 - 6.39*
దుర్ముహూర్తం : *ఉ8.32 - 9.22* &
*మ12.42 - 1.32*
అమృతకాలం: *రా2.23 - 3.55*
రాహుకాలం : *ఉ10.30 - 12.00*
యమగండం/కేతుకాలం: *మ3.00 - 4.30*
సూర్యరాశి: *కర్కాటకం* || చంద్రరాశి: *కన్య*
సూర్యోదయం: *5.45* || సూర్యాస్తమయం: *6.26*
👉 *గరుడ పంచమి*
*శ్రీ కల్కి జయంతి*
*_To Stay Safe Against COVID-19_*
*Get Vaccinated*
😷 *Wear Mask Properly* 😷
*Keep 6ft. Safe Distance*
*Wash Hands Frequently with Soap/Sanitizer*
*_సర్వేజనా సుఖినోభవంతు_*
*శుభమస్తు* 🙏
✍️....నేటి చిట్టికథ
సూరదాసు శ్రీకృష్ణ భగవానుని భక్తుడు. ఆయన అంధుడు. ఒకసారి ఆయన యాత్రకై బయలుదేరి దారిలో ఒక నీరులేని బావిలో పడిపోయాడు. ఆయన దేవుణ్ణి ప్రార్థిస్తూ "ఓ భగవంతుడా! నేను అంధుణ్ణి. నేను ఈ బావి నుండి బయట
పడలేకపోతున్నాను. నన్ను కాపాడు స్వామీ! నీవు ఒక్కడవే నన్ను రక్షించగలవు” అని కోరాడు.
ఆయన మొర ఆలకించి శ్రీకృష్ణ భగవానుడు రాధాదేవి సమేతంగా అక్కడికి విచ్చేసి సూరదాసును రక్షించారు.
వారి సంభాషణను గుర్తుపట్టి సూరదాసు వచ్చినవారు శ్రీకృష్ణభగవాన్, రాధాదేవిగా గుర్తించాడు. ఆయన ఇలా ప్రార్థించాడు “భగవాన్! నేను నీ కంఠస్వరాన్ని మాత్రం వినగల్గుచున్నాను. గుడ్డివాణ్ణి కనుక దర్శించలేకపోతున్నాను”
శ్రీ కృష్ణుడు సూరదాసుతో ఒక చమత్కారం చేశాడు. “రాధా! అతని దగ్గరకు వెళ్లకు. అలా వెళితే నీపాదాలు పట్టేస్తాడు” అని కృష్ణుడు రాధను హెచ్చరించాడు.
రాధ తెలివిగా సూరదాసు వెనుకవైపుగా వెళ్ళి వీపును స్పృశించింది.
సూరదాసు ఆమెను గుర్తించి “ఓహో! నీవు నా వెనుకకు వచ్చావా తల్లీ అంటూ ఆమె పాదాలు పట్టేశాడు. రాధాదేవి అతని చేతుల నుండి విడివడి దూరంగా వెళ్లింది. కాని, సూరదాసు చేతిలో ఆమె కాలిఅందెలు ఉండిపోయాయి. రాధాదేవి సూరదాసుతో “శ్రీకృష్ణునికి చాల ఇష్టమైన నాకాలి అందెలు నాకు ఇచ్చేశేయి” అని అన్నది.
అందుకు సూరదాసు “నేను గుడ్డివాణ్ణి కదమ్మా! అందెలు నీవే నని నాకు తెలిసేదెట్లా? నేను చూడ గలిగితే అవి నీ వని నాకు తెలుస్తుంది. అందుకు నాకు చూపు ప్రసాదించమని శ్రీకృష్ణుని కోరు” అని అన్నాడు.
రాధాదేవి విన్నపంతో శ్రీకృష్ణుడు సూరదాసుకు “చూపు” కలిగించాడు.
ఆయన రాధా కృష్ణులను దర్శించగలందులకు మహాదానందం చెందాడు.
శ్రీకృష్ణునికి సూరదాసు పట్ల అనుగ్రహం కలిగింది. “
నీవేదయిన వరం కోరుకో ఇస్తా” అని శ్రీకృష్ణుడన్నాడు.
సూరదాసు వినమ్రతతో “ఓ! మహానుభావా! నీ దివ్యమంగళ స్వరూపం చూచిన పిమ్మట నాకు ప్రపంచంలోని ఇతర వస్తువులేవీ చూడాలని లేదు. నన్ను తక్షణం అంధుణ్ణిగా చేసేయ్” అని ప్రార్థించాడు.
శ్రీకృష్ణపరమాత్మ పట్ల సూరదాసు భక్తి అలాంటిది.
🌷🌷🌷🌷🌷🌷🌷
_______________________________
*_గోమాతను పూజించండి_*
*_గోమాతను సంరక్షించండి_*
No comments:
Post a Comment