🦅🦅🦅🦅🦅
🌹 శ్రీ గరుత్మంతుడి కధ -11 వ భాగం
💥గరుత్మంతుడు_హన్మంతుడు
శ్రీ మహావిష్ణువు తన జెండాపై గరుత్మంతుని చిహ్నంగా వుంచుకున్నాడు. ఆయన వాహనం కూడా గరుత్మంతుడే. ఎందుకంటే గరుత్మంతుడు మహా బలశాలి. తల్లి ఇచ్చిన మాటకోసం, తనయుడు చేసిన త్యాగానికి ప్రతీకగా గరుత్మంతుడు నిలబడ్డాడు. తనకు చేసిన సహాయానికి నీకేమి కావాలో కోరుకోమంటే, నీ సేవే నాకు కావాలన్నాడు గరుత్మంతుడు. అందుకే విష్ణుమూర్తి తనతో ఎల్లప్పుడూ వుండే వాహనంగా, జెండాపై గుర్తుగా వుంచుకుంటానని గరుత్మంతునికి మాట ఇచ్చాడు.
హనుమంతుడు అర్జునుడి అహంకారాన్ని అణచివేయాలని, అతనికి పాఠం చెప్పాలని ప్రయత్నిస్తున్నప్పుడు, అర్జునుడు గ్రహించి, తనను క్షమించమని అడిగి తనకు కౌరవులతో పోరాడి గెలిచేలా సహకరించమని కోరతాడు. హనుమంతుడు అర్జునుడిని మెచ్చి, తనకు తోడుగా వుంటానని మాట ఇస్తాడు. అప్పటి నుంచి తన పతాకంపై కపిరాజును చిహ్నంగా పెట్టుకుంటాడు అర్జునుడు. అదే అతని విజయానికి సంకేతం.
అలా పతాకాల గుర్తుగా గరుడుడు, ఆంజనేయులు కీర్తి పొందారు. ఆ విధంగా ప్రసిద్ధులైనవారి ఇద్దరిని గురించి రాసాను.
గరుత్మంతుని, హనుమంతుని ధ్యానిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం, నీతి, నిర్భయం, ధైర్యం కలుగుతాయి. మృత్యు భయం ఏమాత్రం ఉండదు. సర్వత్రా విజయం కలుగుతుంది. హనుమంతుని, గరుత్మంతుని కథలను వింటే చాలు.
సమస్త జనులకు గరుత్మంతుడు, హనుమంతుల కరుణాకటాక్షాలు కలగాలని అశిస్తూ . . .
🦅🦅🦅🦅🦅🦅🦅
No comments:
Post a Comment