Thursday, February 9, 2023

గురువు ప్రేమ**1) విహంగ న్యాయం*

*గురువు ప్రేమ*

*1) విహంగ న్యాయం* 
పక్షి గుడ్లను పెట్టి పొదిగి, తన రెక్కల స్పర్శ చేత గుడ్లను పిల్లలుగా చేస్తుంది. అలాగే 'సద్గురువు తన 'స్పర్శ' చేత శిష్యునికి ఆత్మజ్ఞానాన్ని అందిస్తాడు. (స్పర్శ ప్రేమమయంగా ఉండవచ్చు లేదా కొట్టవచ్చు కూడా)

*2) భ్రమర కీటక న్యాయం* 
భ్రమరం ఒక కీటకాన్ని తెచ్చి దాని చుట్టూ తిరుగుతూ 'ఝుంకార' శబ్దం చేస్తుంది. అప్పుడు ఆ కీటకం ఝుంకారంవల్ల భ్రమరంగా మారిపోతుంది. అలాగే సద్గురువు శిష్యునకు 'వాక్కు' ద్వారా బోధచేస్తూ తన వలే తయారు చేస్తాడు. (వాక్కు మధురంగా ఉండవచ్చు లేదా కఠినంగా ఉండవచ్చు)

*3) మీన న్యాయం*  
చేప గుడ్లను పెట్టి వెనకకు తిరిగి వాటిని తీక్షణంగా చూస్తుంది. తల్లి చేప దృష్టి సోకగానే గుడ్లు పిల్లలుగా మారుతాయి. ఇదేవిధంగా సద్గురువు కరుణామృత 'దృష్టి' ప్రసరించడంవల్ల శిష్యుడు జ్ఞాన పరిపుష్టి పొందుతాడు.

*4) తాబేటి తలపు న్యాయం* 
తాబేలు ఒకచోట గుడ్లు పెట్టి ఆహారానికి వెళుతుంది. ఆ గుడ్లు పిల్లలు కావాలని 'సంకల్పిస్తుంది'. ఆ సంకల్పబలంతో ఆ గుడ్లు పిల్లలుగా తయారవుతాయి. అలాగే శిష్యుడు ఎక్కడ ఉన్నా అతను 'పరబ్రహ్మ జ్ఞానాన్ని పొందాలి, పరమార్థ జ్ఞానాన్ని చేరాలి' అని సద్గురువు సంకల్పిస్తారు.
   జైగురు దత్త శ్రీ గురుదత్త 🚩

No comments:

Post a Comment

In 1991, India's economy was bankrupt. Prime Minister P.V. Narasimha Rao called Finance Minister Dr. Manmohan Singh

In  1991, India's economy was bankrupt. Prime Minister P.V. Narasimha Rao called Finance Minister Dr. Manmohan Singh and asked how much ...