Tuesday, February 14, 2023

శ్రీరామచంద్రుడు- ఇంద్రానికి ఇంద్రజిత్తు బలి :

శ్రీరామచంద్రుడు

ఇంద్రానికి ఇంద్రజిత్తు బలి :

ఇంతలో లక్ష్మణుడు ఇంద్రజిత్తును యుద్ధానికి ఆహ్వానించాడు. దానికి ఇంద్రజిత్తు 'నీవు కాదోయి నాతో యుద్ధం చేసేది. చిన్నవాడివి. వెళ్లి మీ అన్నను పంప' మన్నాడు. వింటినారిని సారిస్తూ లక్ష్మణుడు “ఇటువంటి పొగరుబోతుల్ని ఎంత మందినో చూశాం ముందుగా నాతో యుద్ధం చేయి. సింహపు పిల్లల్లే నీ నెత్తురు త్రాగుతాను. నీ తండ్రి మా అన్నతో యుద్ధం చేస్తాడు" అన్నాడు. వీరులిద్దరి మధ్య పోరాటం ఘోరంగా జరిగింది. ఇంద్రజిత్తుకు మొదటిలో విజయం చేకూరినట్లు 'కనపడింది. లక్ష్మణునికి అతణ్ణి ఎదిరించే శక్తి లోపించింది. కాలం గడిచిన కొద్దీ లక్ష్మణుని శక్తి పెరిగింది.

మేఘనాథుని శక్తి తగ్గింది. వెంటనే మాయమై మేఘాలలో దాగాడు. లక్ష్మణుడు కోపంతో ఇంద్రాస్త్రాన్ని చేతపట్టుకొని "నా అన్న ధర్మాత్ముడు సత్యసంధుడు సాటిలేని మేటివీరుడైతే ఓ బాణమా! రావణాత్మజుని సంహరించు " అని పలుకుతూ ప్రయోగించాడు. ఆ ఇంద్రాస్త్రం కిరీటకుండలాలతో కూడిన ఆతని శిరస్సును నేల కూల్చింది. రావణుడీ వార్త విని మిక్కిలి దుఃఖించాడు. మేఘనాథుని భార్యయైన సులోచన భర్త శిరస్సును చేతిలో పట్టుకొని అగ్నిలో ఆత్మాహుతి చేసికొంది.

No comments:

Post a Comment

Yes, she has gained weight? Defeated without losing a bout.

అవును, ఆమె కొంచెం బరువు పెరిగే వుంటుంది. ఎందుకంటే…. ఆటల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచే నిండైన ఆత్మాభిమానాన్ని, విశ్వ వేదికపైనే కాదు వ...