Thursday, December 15, 2022

గోదాదేవి అసలు కథ 🚩*🌹🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐💐💐🚩🚩🚩🚩🚩🚩🚩🙏🏻తమిళనాడులోని శ్రీవిల్లి పుత్తూరులో విష్ణుచిత్తుడనే భక్తుడు ఉండేవాడు. ఈ విల్లి పుత్తూరులోనే శ్రీకృష్ణుడు , మర్రి ఆకు మీద తేలియాడు తూ లోకాన్ని రక్షించాడని నమ్మకం. అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్నికృష్ణుడే.

*గోదాదేవి అసలు కథ 🚩*
🌹🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐💐💐🚩🚩🚩🚩🚩🚩🚩🙏🏻

తమిళనాడులోని శ్రీవిల్లి పుత్తూరులో విష్ణుచిత్తుడనే భక్తుడు ఉండేవాడు. ఈ విల్లి పుత్తూరులోనే శ్రీకృష్ణుడు , మర్రి ఆకు మీద తేలియాడు తూ లోకాన్ని రక్షించాడని నమ్మకం. అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్నికృష్ణుడే. విష్ణుచిత్తుడు నిత్యం ఆ కృష్ణునికి పుష్ప మాలలని అర్పిస్తూ ఉండే వాడు. విష్ణుచిత్తుడి అసలు పేరు భట్టనాథుడు. నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి విష్ణు చిత్తడనె ఆయనకు బిరుదు దక్కింది.ఆయనను విష్ణు భక్తు లైన ఆళ్వారులలో ఒకరిగా ఎంచి , ఆయనకు పెరియా ళ్వారు అంటే - పెద్ద ఆళ్వారు అన్న గౌరవాన్ని కూడా అందిం చారు. అలాంటి పెరియాళ్వారు ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది. ఆమెనుసాక్షాత్తూ భగవంతుని ప్రసాదంగా భావిం చి ఆమెను పెంచుకోసాగాడు విష్ణుచిత్తుడు. ఆమెకు *‘కోదై’* అంటే - పూలమాల అన్నపేరు తో గారాబంగా పెంచసాగాడు విష్ణుచిత్తుడు. ఆ పేరే క్రమంగా గోదాగా మారింది.గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుడి లీలలను ఆడుతూపాడుతూ పెరిగిందే. యుక్తవయసు వచ్చే సరికి ఆ భక్తి కాస్తా ప్రేమగా మారిపోయింది. కళ్లుమూసి నా , తెరిచినా ఆ నల్లనివాడే కనిపించసాగాడు. తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్లంతా ఒకప్ప టి గోపికలనీ , తానుండే విల్లి పుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది. అంతేకాదు ! తన తండ్రి విష్ణుచిత్తుడు రోజూ భగవంతుని కోసం రూపొందిం చే మాలలను ముందు తనే ధరించి , తనలో ఆ కృష్ణుని చూసుకుని మురిసిపోయేది. ఈ దృశ్యం ఒకరోజు విష్ణుచిత్తు ని కంట పడనే పడింది. తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్లూ ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని చాలా బాధ పడ్డాడు. కానీ ఆ రోజు కృష్ణుడు అతనికి కలలో కని పించి , గోదాదేవి సాక్షాత్తూ భూదేవి అవతారమేననీ , ఆమె వేసుకున్న మాలలను ధరించిడం వల్ల తనకు అప చారం కాదు కదా , ఎంతో ఆనందం కలుగుతుందనీ తెలియచేశాడు. ఇలాంటి సంఘటనలన్నీ గోదా మన సులో కృష్ణప్రేమని మరింతగా పెంచాయి. తనకు పెళ్లంటూ జరిగితే ఆయనతోనే జరగాలని అనుకుంది. అందుకోసం ఒక ప్పుడు గోపికలు చేసిన కాత్యా యని వ్రతాన్ని మొదలు పెట్టిం ది. ఈ వ్రతం చేయాలంటే ఆహారానికీ , అలంకారానికీ సంబంధించిన చాలా కఠినమైన నియమాలని పాటించాల్సి ఉంటుంది. అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెలికత్తెలని కూడా ప్రోత్సహించింది. తన స్నేహితురాళ్లను మేలుకొలి పేందుకు , వారికి వ్రత విధానా లను తెలియచేసేందుకు , తన లో కృష్ణభక్తిని వెల్లడించేందుకు 30 కీర్తనలు పాశురాలు గా మలిచి శ్రీ కృష్ణుని ఎన్నో విధాలు గా వర్ణిస్తూ పాడింది మన గోదాదేవి. అవే ధనుర్మా సంలో ప్రతి వైష్ణవభక్తుని ఇంట్లో నూ వినిపించే తిరుప్పావై గాధ
ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు , ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు. దాంతో ఆయన విష్ణుచిత్తునికి కనిపించి , గోదా దేవిని శ్రీరంగానికి తీసుకురమ్మ నీ… అక్కడ రంగనాథునిగా వెలసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటాననీ చెప్పాడు. శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయా న్ని తెలియచేశాడు. కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణుచిత్తుని సంతోషానికి అవధులు లేకుం డా పోయాయి. వెంటనే గోదాదే వినీ , విల్లిపుత్తూరులోని ప్రజ లనూ తీసుకుని శ్రీరంగానికి బయల్దేరాడు. అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయం లోకి తీసుకువెళ్లారు. పెళ్లికూ తురిగా గర్భగుడిలోకి ప్రవేశిం చిన గోదాదేవి , అందరూ చూస్తుండగా ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది. ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగిరోజు జరిగింది. అందుకే ప్రతి వైష్ణవాలయంలో భోగి నాడు గోదాదేవికి , విష్ణుమూ ర్తితో కళ్యాణం జరుపుతారు మన శ్రీ వైష్ణవ ఆచార్యులు
🌷🌷🌹🌹💐💐🪷🪷🙏🏻

No comments:

Post a Comment

Jamalapuram Sri Venkateswara Swamy Temple జమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయం Telangana Tirupati, Khammam District

The road access to the temple is very good, and you can easily reach it in your own vehicle. Parking is not a concern as you can park comfor...