🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
*ఆకాశదీపం పరమార్ధం*
*ఆకాశ దీపం ధర్మసింధు గ్రంథంలో ఈ విధంగా పేర్కొన్నారు.
కార్తీక మాసంలో ఆకాశదీప ప్రజ్వలనము, దానము చేయాలి. సూర్యాస్తమయంలో ఇంటికి సమీపంలో యజ్ఞార్హమైన (మేడి) కర్రను చెయ్యెత్తు పొడవుగల దానిని పాతి, దానిపైన అష్టగళాకారంలో దీప యంత్రాన్ని నిర్మించాలి. దాని మధ్యలో ప్రధాన దీపమును, దాని చుట్టూ ఎనిమిది దీపాలను వెలిగించి, భక్తితో ఈ క్రింది మంత్రమును పఠించాలి.
*దామోదరాయ నభసి తులాయాందోళయా సహ*
*ప్రదీపంతే ప్రయచ్ఛామి నమో అనంతాయ వేధసే!*
అనగా అనంతుడు సృష్టికర్త అగు శ్రీవిష్ణువునకు అంతరిక్షంలో ఉయ్యాలలూగే దీపమిచ్చితిని అని అర్థం. ఇట్లు కార్తీక మాసంలో అన్ని రోజులు ఆకాశదీపమిస్తే మహా సంపద కలుగుతుంది.
*ఏకత సర్వదానాని దీపదానం తథైకతః కార్తీకదీప దానస్య కలాం నార్హంతి షోడశీం*
అనగా అన్ని దానములు కలసి దీపదానానికి సమానం కావు. కార్తీకమాసంలో దీప దానానికి దీటైన దానంలేదు. కార్తీకంలో శివాలయంలోనూ, విష్ణ్వాలయంలోనూ ఆకాశ దీపాలనెత్తడం ఆచారం. దీపం పెడితే జ్యోతి స్వరూపుడైన దైవాన్ని కొలచినట్లే. అది పరమార్థం.
కనుక కార్తీక దీపాలను వెలిగించి దేవుని అనుగ్రహానికి పాత్రులౌదాము.
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
No comments:
Post a Comment