*అనుకరణ ఒక శాపం*
ఇతరులను అనుకరించకండి. మనం నేర్చుకోవలసిన గొప్ప నీతి పాఠమిది. అనుకరణ నాగరికత కాదు.
మీరు ఒక రాజు వేషం వేసుకోవచ్చు. అంత మాత్రాన మీరు రాజునా? సింహపు చర్మం కప్పు కొన్న గాడిద సింహం కాగలదా? అనుకరణ ఎన్నడూ వృద్ధి అనిపించుకోజాలదు.
అది నరునిలో చూపెట్టే పతన సూచనే! మానవుడు, తననుతాను ద్వేషించుకోవడం ప్రారంభించాడంటే, వానికి చివరి దెబ్బ తగిలినట్లే!
తన పూర్వులను గూర్చి సిగ్గుపడటం ఆరంభిస్తే అంత్య కాలం మూడినట్లే! ఇతరుల నుండి మంచినంతా నేర్చుకోండి! మీకు స్వాభావికమైన మార్గంలో దాన్ని జీర్ణం చేసుకోండి.
అంతేగానీ పరుల వేషం మాత్రం వేయకండి ముసుగు ముసుగే
అప్పటి కైనా ముసుగు తొలిగిపోతుంది నిజం బయటకు వస్తుంది ఇది సత్యం
ఎల్ల కాలం మోసం సాగదు పైన దేవుడు వున్నాడు అన్ని చూస్తున్నాడు జాగ్రత్త 🙏🏻🚩
No comments:
Post a Comment