Thursday, December 15, 2022

దేవాలయం చుట్టూ భక్తి పూర్వకంగా ప్రదక్షిణలు అంతరార్ధం*దేవాలయం చుట్టూ చేతులు జోడించి ప్రదక్షిణలు చేస్తూ నిశ్శబ్దంగా ప్రార్ధన చేయమని పెద్దలు పిల్లలకు చెబుతుంటారు. (ప్రదక్షిణం గుడి చుట్టూ ఎడమవైపు నుండి కుడి వైపుకు తిరుగుతూ చేస్తారు.)

💐💐💐💐💐💐🌷🌷🌹🌹🪷🪷🌺🌺🚩🚩
దేవాలయం చుట్టూ భక్తి పూర్వకంగా ప్రదక్షిణలు అంతరార్ధం*

దేవాలయం చుట్టూ చేతులు జోడించి ప్రదక్షిణలు చేస్తూ నిశ్శబ్దంగా ప్రార్ధన చేయమని పెద్దలు పిల్లలకు చెబుతుంటారు. (ప్రదక్షిణం గుడి చుట్టూ ఎడమవైపు నుండి కుడి వైపుకు తిరుగుతూ చేస్తారు.)

గత కాలంలో దేవాలయాలు విశాలమైన స్థలంలో నిర్మించే వారు. పాదరక్షలు లేకుండా దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేయడం చక్కని వ్యాయామంగా ఉంటుంది. ఇలా ఉదయం మరియు సాయంత్రం దేవాలయాన్ని సందర్శించినప్పుడల్లా ప్రదక్షిణ చేస్తుండటం వల్ల సూర్యోదయ మరియు అస్తమయ కిరణాలు భక్తునికి విటమిన్లను అందించి ఆరోగ్యాన్ని పెంపొందించడం జరుగుతుంది. 

భక్తి పూర్వకమైన ప్రదక్షిణలు, దేవతా విగ్రహం ముందు సాష్టాంగ నమస్కారాలు, మోకాళ్ళపై మోకరిల్లడం మొదలగునటువంటివి శరీరానికి, కీళ్ళకు మరియు కండరాలకు చక్కని వ్యాయామాన్ని కలిగిస్తుంది.

ఎడమనుండి కుడివైపు ప్రదక్షిణము చేయడం అనేది మెదడుకు అనుకూలంగా పనిచేస్తుంది. ఒకవేళ కుడి నుండి ఎడమకు తిరిగినట్టయితే అందుకు మెదడు ఆ ప్రభావాన్ని తట్టుకోలేదు. అలాంటప్పుడు మనకు అనుకూలంగా అనిపించదు. 

ఈ విషయాన్ని సైన్స్ కూడా నిర్ధారించింది. దైవశాస్త్రం ప్రకారం ప్రదక్షిణం వల్ల భక్తుడి పాపాలు ఈ జన్మవే కాక గత జన్మలవి కూడా తొలగిపోతాయి. అందుకే మరి భక్తితో ప్రదక్షిణలు చేద్దాం!

No comments:

Post a Comment